Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1033
Total Reviews
Showing 37–48 of 1033 media reviews
టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సిన...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సినిమాయే కాదు. ఇదేంటంటే ధైర్యానికి, వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే.. అంతకు మించి ఇంకేమి లేదు సినిమా. ఎంతసేపు నరుక్కోవడం, కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా సినిమాలు దీనికి సిమిలర్ గా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా అనిమల్, 1 నేనొక్కడినే సినిమా గుర్తొస్తాయి. అది ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది. 


నాకు తెలిసి యష్ కూడా సినిమా మొత్తం చూసి ఉండడు. లేకపోతే వేరేలా ఉండేది. యాష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చేసాడు. కానీ సీరియస్లి ఆ కష్టం వేస్ట్ అయింది. అండ్ రవిబాసుర్ అయితే పెద్ద దెబ్బేసాడు, బీజీఎమ్ కి కూడా. యాక్షన్ సినిమాలు ఇలా తీయకూడదు అనడానికి టాక్సిక్ బెంచ్ మార్క్ అని చెప్పాలి సింపుల్ గా. అండ్ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవలేదు. ఇంక నాకైతే ఈ సినిమా గురించి చెప్పే ఓపిక కూడా లేదు. నా రేటింగ్ గనక సినిమాకి ఇవ్వాలంటే.. యష్ పెర్ఫార్మన్స్ కోసం, పెట్టిన ఖర్చుకి గాను 1\5 ఇస్తాను.. ఇంతకంటే ఇవ్వలేను. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చే...

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అద్వాని రోల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. 


చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండొచ్చు…లెంత్ చాలా తగ్గించవచ్చు కూడా కానీ మేకర్స్ అలా చేయలేదు. దాంతో అనవసరంగా సీన్స్ అన్నీ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. అయితే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగానే ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా ఓకే అనిపించింది. మొత్తం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఎక్కువ ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద యష్ కోసం స్టైలిష్ టేకింగ్ కోసం ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ కొంచం అంచనాలను పెట్టుకుని వెళ్ళినా చాలా చాలా చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. 


4.0
out of 10

Below Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, బాధ ఉండ...

టాక్సిక్ సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, బాధ ఉండేలా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఒక దారిలో వెళ్తుందని ఊహించిన కథకు, పూర్తి భిన్నంగా మరో ముగింపు ఇస్తూ దర్శకురాలు మాయ చేశారు. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా సినిమా గురించే ఆలోచించేలా కథను నడిపించారు. ప్రతి విషయాన్ని తెరపై నేరుగా చెప్పకుండా, ప్రేక్షకులే అర్థం చేసుకునేలా చాలా అద్భుతంగా చిత్రాన్ని మలిచారు.


దర్శకురాలి ఆలోచనా విధానం చాలా ఉన్నతంగా ఉంది. ఒక పెద్ద ఎక్స్పరిమెంట్ చేస్తూనే.. అభిమానులు కోరుకునే మాస్ అంశాలను ఎక్కడా తగ్గించలేదు. నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను చాలా భారీగా నిర్మించారు. భారీ సెట్టింగులు, యాక్షన్ సీక్వెన్స్, కెమెరా పనితనం తెరమీద బాగా కనిపిస్తాయి. ఓవరాల్ గా టాక్సిక్.. స్లో పేస్డ్ యాక్షన్ డ్రామాగా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా యష్ ఫ్యాన్స్ ని అయితే మెప్పించేలానే ఉంది. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో అసలు డ్రగ...

కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో అసలు డ్రగ్స్ మాఫియా డాన్ సెల్వడర్ తో చేతులు మొదలు పెట్టి బిజినెస్ చేస్తున్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారినా రొటీన్ డ్రగ్స్ బిజినెస్, గ్యాంగ్ స్టర్ గొడవలు, సెల్వడర్ కూతురుతో రొమాన్స్, తాగడం, ఫైట్స్ తోనే సరిపోతుంది. కియారా ఎంట్రీ నుంచి కథ ఆసక్తిగా మారడం అక్కడో చిన్న ట్విస్ట్. ఇక సెకండ్ హాఫ్ ఊహించిన సీన్ తోనే మొదలయి మళ్ళీ రాయ ఇంకా ఎదిగినట్టు రొటీన్ తాగుడు, అమ్మాయిలు, కాసినో, యాక్షన్ సీక్వెన్స్ లతో బాగా సాగదీశారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్. అసలు ఆ ట్విస్ట్ మాత్రం ఊహించము.


హాలీవుడ్ స్టైల్ లో ఎమోషన్స్ పండిద్దాం, కొత్తగా విజువల్స్ చూపిద్దాం అనుకున్నా ఆ ఎమోషనల్ సీన్స్ ఏవి కూడా పండలేదు. రొటీన్ స్టోరీ, కెజిఎఫ్ తర్వాత చాలా సినిమాల్లో వచ్చిన రొటీన్ యాక్షన్ సీక్వెన్స్, నరుక్కోవడం,కాల్చడం, పేల్చడం.. ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. ఇక తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ గూగుల్ ట్రాన్స్ లేషన్ చేసినట్టు అచ్చ తెలుగు పాత పదాలతో ఉన్నాయి. ఫైనల్ గా యశ్ ఎంత కష్టపడ్డా సరైన కథ, స్క్రీన్ ప్లే లేకపోతే అది వృధానే అవుతుంది. ఓవరాల్ గా యాక్షన్ అడల్ట్ సినిమా కాస్త ఒక్కసారిగా సైకాలజీ సినిమాగా మారిపోతుంది. పిల్లలతో, పేరెంట్స్ తో అయితే వెళ్లడం కష్టమే. ఎలాగో A సర్టిఫికెట్ సినిమా కాబట్టి పిల్లని రానివ్వరు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించడం అనే కాన్సెప్ట్ తో ఈ కథ రాసుకున్నట్టు సినిమా అంతా అయ్యాక అర్ధమవుతుంది.

7.0
out of 10

Hit

టాక్సిక్ (Toxic)

Toxic movie review

స్టార్ హీరో యష్ కథానాయకుడిగా 'టాక్సిక్' మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీ...

స్టార్ హీరో యష్ కథానాయకుడిగా 'టాక్సిక్' మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో మొదటి సీన్ నుంచే అసలు ఏం జరుగుతుందే విషయం మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడా కూడా ఈ చిత్రం హై మూమెంట్స్ లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం.


చివరలో వచ్చే సైకలాజికల్ ట్విస్ట్ ఉన్నప్పటికీ.. అప్పటికే కన్ఫ్యూజింగ్ గేమ్ లా మారిన కథనానికి ఆ ట్విస్ట్ ఏ మాత్రం సహాయపడదు. దాదాపు 3 గంటల నిడివి విషయం కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. యష్ మాత్రం తన వరకు సినిమాని బాగా నెట్టుకొచ్చాడు. నయనతార, కియారా అద్వానీ రోల్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా... నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ కొంతవరకు మెరుగ్గా ఉండేది.ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉంటే బాగుండేది. నిడివి ఎక్కువగా ఉండటం చిత్రానికి మైనస్ గా మారింది. ఫైనల్‌గా.. ఈ సినిమా.. మితిమీరిన వయోలెన్స్ ఇష్టపడే వారికి మాత్రమే!


5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic movie Review

ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత గ్రాండియర్‌గా తీశారనేది ఆడియెన్స్ కి అవసరం లేదు. ఎంత కనెక్టింగ్‌గా తీశారు. ఎంతగా ఆకట్టుకుంది? ఆడియెన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉందా? లేదా అనేదే ముఖ్యం. అలా లేకపోతే ఎన్ని వం...

ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత గ్రాండియర్‌గా తీశారనేది ఆడియెన్స్ కి అవసరం లేదు. ఎంత కనెక్టింగ్‌గా తీశారు. ఎంతగా ఆకట్టుకుంది? ఆడియెన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉందా? లేదా అనేదే ముఖ్యం. అలా లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతుంది. `టాక్సిక్‌` సినిమా చూశాక అలాంటి ఫీలింగ్‌ కలగక మానదు. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కాకపోతే అది మనకు అర్థమయ్యేలా చెప్పడంలోనే తడబాటు కనిపిస్తుంది.


హీరో లైఫ్‌ లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి ఉత్కంఠభరితంగా ఉంటాయి. అదే సమయంలో విసిగించేలా ఉంటాయి. కథ ఎటువెళ్తుందో అర్థం కాదు. క్లైమాక్స్ లెన్తీగా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్ గ్రాండియర్‌ గా యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు, రొమాన్స్, స్టయిలీష్‌ మూవీని తీయడంపై పెట్టిన ఫోకస్‌.. కథ, కథనంపై పెడితే బాగుండేది. సినిమాగా నిరాశ తప్పదు. నటుడిగా యష్‌ ఆకట్టుకుంటాడు. విజువల్స్ కనువిందు చేస్తాయి.


5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic movie Review

Gulte

By Gulte

Yash is back to testing his luck at the Pan-India Box Office after KGF 2 with Toxic. His choice of going with Geethu Mohandas raised many eyebrows and the movie has become a talking point with bold sc...

Yash is back to testing his luck at the Pan-India Box Office after KGF 2 with Toxic. His choice of going with Geethu Mohandas raised many eyebrows and the movie has become a talking point with bold scenes in the Promotional material and postponements. 

 

Positives:


1.⁠ ⁠Granduer

2.⁠ ⁠Yash’s Screen Presence

3.⁠ ⁠Cinematography


Negatives:


1.⁠ ⁠Aimless Writing

2.⁠ ⁠Painfully Bad Second Half

3.⁠ ⁠Patience-Testing Narration

4.⁠ ⁠Excessive Runtime

5.⁠ ⁠Lack of Emotional Connect


Overall, everything that could go wrong had gone wrong for the Toxic. Except for lavish filmmaking with some technically brilliant portions here and there, there is nothing for the audience to get engaged with. It tests your patience and makes you restless with its confused screenplay.


4.0
out of 10

Below Average

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో టాక్సిక్ మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో రొమాంటిక్ సీన్స్ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ విజయానికి కారణం అందులో యాక్షన్ స...

కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో టాక్సిక్ మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో రొమాంటిక్ సీన్స్ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ విజయానికి కారణం అందులో యాక్షన్ సీన్స్ కాదు... యాక్షన్ ఉన్నా మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్ ప్రారంభం నుంచి చివరి వరకు కంటిన్యూ అవుతుంది, టాక్సిక్ ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ఎమోషన్ వర్కవుట్ కాలేదు. అయితే యాక్షన్ లేదంటే రొమాన్స్... బ్యాక్ టు బ్యాక్ రెండిటిలో ఏదో ఒకటి తెరపై వస్తున్నా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. 


బట్ యష్ మాత్రం తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా అయితే... కథ మనల్ని మెప్పించేలా ఉండాలి కదా! సినిమాలో రొమాన్స్ ఉంది. యాక్షన్ ఉంది. స్టార్ కాస్ట్ ఉంది. కానీ... ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ, ఆకట్టుకునే సన్నివేశాలు గానీ లేవు. సాగదీశారు సార్... మూడు గంటలు పాటు ఆ వయలెన్స్ భరించడం, థియేటర్లలో చివరి వరకు ఆడియన్స్ ఉండటం కష్టమే. టెక్నికల్ అవుట్ పుట్ కోసం లేదంటే యష్ కోసం అయితే వెళ్ళండి.

4.0
out of 10

Below Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

Sakshi

By Sakshi

భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యష్ తెరపై కనిపించిన ప్రతిసారీ మాస్ ఫీల్ కనిపిస్తుంది. ఫస...

భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యష్ తెరపై కనిపించిన ప్రతిసారీ మాస్ ఫీల్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించి, కొన్ని సన్నివేశాలు అసలు ఎందుకు పెట్టారో అనిపిస్తాయి. యష్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలమైన కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే లోపం స్పష్టంగా కనిపిస్తుంది.


అయితే అసలు యష్ లాంటి స్టార్‌కు మరింత పటిష్టమైన కథ ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తంగా, టాక్సిక్ చెత్త సినిమా కాదు.. కానీ వచ్చిన హైప్, యష్‌పై ఉన్న అంచనాలకు మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్థం పర్థం లేని వృథా ప్రయాసతో కూడిన వ్యర్థ చిత్రం. సినిమా చూసాక చాలామంది అసలు సినిమాలో ఏముంది, అసలు ఎం చెప్పారు, ఎం అర్ధమైంది అని తేలిక ఆలోచిస్తూ బైటికొస్తారు. ఒక్క సీన్ గురించి కూడా మాట్లాడుకునేట్టు అనిపించదు. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి నిజం చెప్పాలంటే సినిమా మీద ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అస్సలు సంతృప్తి కలగలేదు. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం అదిరి...

టాక్సిక్ సినిమా గురించి నిజం చెప్పాలంటే సినిమా మీద ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అస్సలు సంతృప్తి కలగలేదు. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం అదిరిపోయాయి. యష్‌ని తెరపై చూసిన ప్రతిసారీ ఒక మాస్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా కొంచెం స్లో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్ మాత్రం ఎందుకు పెట్టారో అర్థం కానట్టుగా అనిపించాయి. యష్ మాత్రం తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ యష్ లాంటి హీరోకి ఇలాంటి కథ కాకుండా ఇంకాస్త స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది.


మొత్తంగా చెప్పాలంటే టాక్సిక్ చెత్త సినిమా కాదు… కానీ వచ్చిన హైప్‌కి, యష్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మాత్రం జస్టిస్ చేయలేకపోయింది. చివర్లో తెరమీద... నిర్మించింది వెంకట్ కె నారాయణ.. కానీ కూల్చింది గీతూ మోహన్ దాస్ అని వేయాల్సింది అనిపించింది. అంతలా చెత్తలా ఉంది సినిమా. సినిమా గురించి ఇందులోనే డబ్బింగ్ స్టాండర్డ్స్ లో లాగా ఒక్క ముక్కలో చెప్పాలంటే... అర్ధం పర్ధం లేని వృధా ప్రయాస తో కూడిన వ్యర్ధ చిత్రం ఈ టాక్సిక్. 


4.0
out of 10

Below Average

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

యష్‌ నుంచి ఇలాంటి సినిమాను ఎక్స్‌పెక్ట్ చేసిన ఆడియన్స్‌కి టాక్సిక్ కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. సినిమా మొదటి నుంచి భారీగా బిల్డ్‌అప్, స్టైల్, యష్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌తో నడిపించే ప్రయత్నం చేసింది....

యష్‌ నుంచి ఇలాంటి సినిమాను ఎక్స్‌పెక్ట్ చేసిన ఆడియన్స్‌కి టాక్సిక్ కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. సినిమా మొదటి నుంచి భారీగా బిల్డ్‌అప్, స్టైల్, యష్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌తో నడిపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ స్థాయిలో కథ, స్క్రీన్‌ప్లే మాత్రం బలంగా అనిపించవు. కథలో కొత్తదనం పెద్దగా కనిపించదు. కొన్ని సీన్స్ ఆసక్తికరంగా అనిపించినా, మొత్తం కథనం మాత్రం చాలా చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే మరింత వీక్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్, విజువల్స్ భారీగా ఉండాలని ప్రయత్నించినా, అవి ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.


VFX కూడా కొన్ని చోట్ల అండర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాకు కావాల్సిన విజువల్ గ్రాండియర్ పూర్తిగా కనిపించదు. మ్యూజిక్, యాక్షన్, మేకింగ్ అన్నీ ఉన్నప్పటికీ కథతో కనెక్ట్ అయ్యే ఎమోషన్ మాత్రం మిస్ అయింది. యష్‌ విషయానికి వస్తే, తన స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, పెర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకు పెద్ద ప్లస్. కానీ హీరో ఎలివేషన్స్‌తో మాత్రమే సినిమాను ఎక్కువసేపు క్యారీ చేయడం కష్టం. కథ బలంగా ఉంటే యష్‌ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువగా ఎలివేట్ అయ్యేది. మొత్తంగా టాక్సిక్‌ లో స్టైల్ ఉంది, భారీ సెటప్ ఉంది, యష్‌ ఫైర్ ఉంది… కానీ దానికి సరిపోయే స్ట్రాంగ్ కంటెంట్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే కనిపించలేదు. భారీ హైప్‌కు తగ్గ రిజల్ట్ మాత్రం రాలేదు.


ఓవరాల్ గా ఈ టాక్సిక్... మితిమీరిన వైలెన్స్ ఇష్టపడే వారికీ మాత్రమే..

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Irumudi Movie Review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిక్ గా ఇది ఓ అక్క, తమ్ముడు అనుబంధాన్ని తెలిపే కథ. అలానే ఓ తండ్రీ కూతురు బంధాన్ని చెప్పే స్టోరీ. అంతేకాదు కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకున్న ఓ త...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిక్ గా ఇది ఓ అక్క, తమ్ముడు అనుబంధాన్ని తెలిపే కథ. అలానే ఓ తండ్రీ కూతురు బంధాన్ని చెప్పే స్టోరీ. అంతేకాదు కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకున్న ఓ తండ్రి మనో వ్యథ. అయితే ఈ ఎమోషన్స్ ను మనసు లోతుల్లోకి తీసుకెళ్లేలా చేయడంలో గీతూ మోహన్ దాస్ పూర్తిగా విఫలం అయ్యారు. తెరమీద విజువల్స్ ఎంత కలర్ ఫుల్ గా ఉన్నా, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నా... అవేవీ మనసును ప్రభావితం చేయవు. దాంతో టాక్సిక్‌ ఓ టార్చర్ గా మారిపోయింది.


సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు నిదానంగా కరిగిపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు అసహనంగా అరుపులు అరిచే పరిస్థితి వస్తుంది. అండ్ యశ్‌ ఎప్పటిలానే తన పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. రాయ పాత్రలో ఎంతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో, కొడుకు టిక్కెట్ పాత్రలో అంత తెంపరి తనాన్ని ప్రదర్శించాడు. సినిమాలో అసలు మరబొమ్మల్లా తెర మీద జరిగే సన్నివేశాలను ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి కథను చెప్పిన గీతూ మోహన్ దాస్ ను నమ్మి, ఈ ప్రాజెక్ట్ ఆమె చేతిల్లో పెట్టిన యశ్, వెంకట్ నారాయణను అభినందించాలి. ఈ సినిమాలో హీరో ఒక మాట పదే పదే చెబుతుంటాడు. 'మనం తీసుకున్న నిర్ణయానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించకతప్పదు' అని. ఈ సినిమా చూడాలనుకునే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహిస్తే మంచిది.

5.0
out of 10

Average

Why MRO?