Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1329
Total Reviews
Showing 25–36 of 1329 media reviews
రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సి...

ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల కథను గతంలో తెరపై చూడటమే. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో 'సైరా నరసింహారెడ్డి' రావడం కూడా 'రణబాలి'కి కొంత మైనస్ అని చెప్పాలి. కథ పరంగా 'సైరా', 'రణబాలి' మధ్య వ్యత్యాసం ఉంది. ఈ సినిమాలో కరువుపై ఎక్కువ ఫోకస్ చేశారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. కానీ పోరాటం చేసినది మాత్రం బ్రిటీషర్లపైనే.


'రణబాలి'గా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక పాత్రలను... వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చాలా బాగా రాశారు. క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ అంటే జస్ట్ సీన్లు, డైలాగులు మాత్రమే కాదు... ఎక్స్‌ప్రెషన్స్ నుంచి బిహేవియర్ వరకు ఎలా ఉండాలో డిసైడ్ చేయడంలో రాహుల్ సాంకృత్యాన్ తన ట్యాలెంట్ చూపించారు. అయితే... నిడివి విషయంలో కాస్త తప్పటడుగు వేశారు. ఫస్టాఫ్ డీసెంట్ అనిపించినా... సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం పేలవంగా సాగింది. అజయ్ - అతుల్ సంగీతంలో పాటలు బావున్నాయి. కానీ, ఆర్ఆర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని 'రణబాలి'లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీతో పాటు వాళ్ళిద్దరి సన్నివేశాలూ బావున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కథలో కొత్తదనం లేదు. కానీ, కథనంలో కొన్ని 'హై' మూమెంట్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను మరీ తీసిపారేయలేం. అంచనాలు తక్కువ పెట్టుకుని వెళితే విజయ్ దేవరకొండ నటన నచ్చుతుంది.


5.0
out of 10

Average

రణబాలి (RanaBaali)

RanaBaali Movie Review

1870-80 ప్రాంతంలో మద్రాస్‌, రాయలసీమ, కర్నూల్‌.. వంటి ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఓ వైపు, బ్రిటీష్‌ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని వెళ్లి క్రియేట్‌ చేసిన కృత్రిమ కరువు మరోవైపు. ఇలా కొన్ని లక్షల(సుమారు 80 లక...

1870-80 ప్రాంతంలో మద్రాస్‌, రాయలసీమ, కర్నూల్‌.. వంటి ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఓ వైపు, బ్రిటీష్‌ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని వెళ్లి క్రియేట్‌ చేసిన కృత్రిమ కరువు మరోవైపు. ఇలా కొన్ని లక్షల(సుమారు 80 లక్షల) మంది ప్రజలు తిండిలేకచనిపోతారు. మరోవైపు బ్రిటీష్‌ వారిచేత చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో సింగనమల ప్రాంతంలో బ్రిటీష్‌ వారిపై రణబాలి చేసిన పోరాటమే ఈ చిత్రం అని చెప్పొచ్చు. ఇక రణబాలిగా విజయ్‌ దేవరకొండ చేసే ఫస్ట్ యాక్షన్‌ బాగుంది. విజయ్‌ పాత్ర చేసే యాక్షన్‌ కొత్తగా ఉంటుంది. అది కొంత ఓవర్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. క్యాంప్‌లో బ్రిటీష్‌ వారిపై రణబాలి చేసే పోరాటం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.  


అయితే సెకండాఫ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్, కరువుతో ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి, కరువు రక్షసుడికి ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోవడం వంటి సీన్లు హృదయాన్ని కదిలిస్తాయి. జయమ్మ పాత్రకి సంబంధించిన సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు సినిమా మరో స్థాయికి వెళ్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయింది. అక్కడ పూనకాలు తెప్పిస్తుంది. బీజీఎం అదిరిపోయింది. విజయ్‌ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. ఎండ్‌లో మాత్రం వాహ్‌ ఫీలింగ్‌ తెప్పిస్తాడు. కొంత కమర్షియాలిటీకి దూరంగా ఉన్నా, చివర్లో దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఫైనల్‌గా.. రణబాలి మూవీ థియేటర్‌లో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. నెగటివ్‌ టాక్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంచనాలు లేకుండా చూస్తే నచ్చుతుంది. విజయ్‌ ఆకట్టుకుంటాడు. ఓవరాల్‌గా ఒక పీరియాడికల్‌ ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా `రణబాలి`. అప్పటి కరువు పరిస్థితులు మాత్రం హార్ట్ ని టచ్‌ చేస్తాయని చెప్పొచ్చు.

6.0
out of 10

Above Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

బ్రిటీష్‌ వారికి సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన మూడు దశాబ్దాలకు శింగనమల బెబ్బులి రణబాలి ఆంగ్లేయులపై జరిగే అలుపెరుగని పోరాటం చేశాడు. రాయలసీమలో రణబాలి గురించి కథలు కథలుగా చ...

బ్రిటీష్‌ వారికి సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన మూడు దశాబ్దాలకు శింగనమల బెబ్బులి రణబాలి ఆంగ్లేయులపై జరిగే అలుపెరుగని పోరాటం చేశాడు. రాయలసీమలో రణబాలి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయినవారి కుట్ర కారణంగా అసువులు బాసిన రణబాలి ఆ తర్వాత భద్ర మల్లన్న రూపంలో ప్రజలకు అండగా నిలిచాడని అక్కడి వారు నమ్ముతారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ వీర గాథను లార్టర్ దాన్‌ లైఫ్‌ తరహాలో వెండితెరపై ఆవిష్కరించాడు. బ్రిటిషర్స్... భారతీయులను బానిసలుగా చూసిన నిజాన్ని విస్మరించి, వారు ఈ దేశంలో రైలు మార్గాలు వేశారు, విద్యాబోధనలు చేశారు అని గొప్పలు చెప్పుకొనే వారికి ఈ సినిమా ఓ చెంపపెట్టు. 


1840 నుంచి 1880 మధ్య కాలంలో భారతదేశాన్ని కృత్రిమ కరువు రక్కసి నోట్లోకి నెట్టేసి, కోట్లాది మంది భారతీయుల అకాల మరణానికి కారణం అయిన వారు ఆంగ్లేయులనే కఠోర నిజాన్ని ఆధారాలతో దర్శకుడు రాహుల్‌ ఈ సినిమాలో చూపించాడు. అయితే అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలను మనసు ద్రవించేలా చూపించడంలో రాహుల్ తడబడ్డాడు. దానికి తోడు కథనం చాలా నిదానంగా నడవడం కూడా కాస్తంత ఇబ్బందిని కలిగిస్తుంది. రొటీన్ ఫార్ములా జోలికి పోకుండా... ఈ దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల అకృత్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిన ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అయితే చిరంజీవి నటించిన స్వాతంత్ర సమరయోధుడు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితిలో అదే నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'రణబాలి' పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కానీ జయాపజయాలను బేరీజు వేసుకోకుండా మైత్రీ మూవీ మేకర్స్ చేసిన గొప్ప ప్రయత్నంగా 'రణబాలి'ని చూడాల్సి ఉంటుంది. మేకర్స్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది.

6.0
out of 10

Above Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

1900ల నాటి తీవ్రమైన కరవు, బ్రిటిష్ వారి దోపిడీ నేపథ్యంలో ఆకలి తీర్చే యోధుడి కథగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ‘రణబాలి’ని తెరకెక్కించారు. రణబాలిగా విజయ్ దేవరకొండ పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రాయలసీమ స్లాం...

1900ల నాటి తీవ్రమైన కరవు, బ్రిటిష్ వారి దోపిడీ నేపథ్యంలో ఆకలి తీర్చే యోధుడి కథగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ‘రణబాలి’ని తెరకెక్కించారు. రణబాలిగా విజయ్ దేవరకొండ పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రాయలసీమ స్లాంగ్‌తో ఆకట్టుకోగా, జయమ్మగా రష్మిక మందన్నా తన లుక్, యాక్టింగ్‌తో మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ డిజైన్ ఉన్నతంగా ఉన్నాయి. ఇక సినిమాలో హీరోహీరోయిన్లు సహా ఆర్టిస్టుల నటన, చరిత్ర ఆధారిత బలమైన కథాంశం తో పాటు అద్భుతమైన ఆక్షన్ సీన్స్ ప్లస్ అయ్యాయి. 


అయితే డల్ అండ్ వెరీ స్లో నరేషన్, కనెక్ట్ అవ్వని ఎమోషన్స్, పేలవమైన BGM, వీఎఫెక్స్ లోపాలు, సుదీర్ఘ నిడివి వంటివి మైనస్ అయ్యాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన స్టఫ్ అంతా ఉన్నప్పటికీ, ఆర్ట్ ఫిలిం తరహా నెమ్మది నరేషన్ సినిమా ఇంపాక్ట్‌ను దెబ్బతీసింది. ఓవరాల్‌గా ‘రణబాలి’ విషయం ఉన్న చిత్రమే అయినా, స్లో పేసింగ్ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా అంచనాలను అందుకోలేకపోయింది. కథ పరంగా ఎక్కడా వంకలు పెట్టడానికి లేకపోయినా, కథనంతో నడిపించిన తీరు కాస్త ఇబ్బందికరం అయ్యే పరిస్థితులున్నాయి. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఇక ఫైనల్లీ విజయ్ దేవరకొండ రణబాలి హానెస్ట్ అటెంప్ట్. 

6.0
out of 10

Above Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

Tupaki

By Tupaki

‘రణబాలి’ సినిమాలో ఒక మంచి కథ ఉంది. మరుగున పడిన చరిత్రను శోధించి చెప్పిన సంచలన విషయాలున్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన ముడిసరుకు అంతా ఇందులో ఉంది. కానీ ఈ కథను చెప్పిన శైలిలో లోపం వల్ల.....

‘రణబాలి’ సినిమాలో ఒక మంచి కథ ఉంది. మరుగున పడిన చరిత్రను శోధించి చెప్పిన సంచలన విషయాలున్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన ముడిసరుకు అంతా ఇందులో ఉంది. కానీ ఈ కథను చెప్పిన శైలిలో లోపం వల్ల.. ఏమాత్రం ఇంపాక్ట్ కలిగించని బీజీఎం వల్ల.. అనుభూతి దెబ్బతిని ‘రణబాలి’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా తయారైంది. కథలో కంటెంట్ ఉన్నా.. కొన్ని స్టాండౌట్ ఎపిసోడ్లు పడ్డా.. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మురిపించినా.. స్లో నరేషన్ పెద్ద సమస్యగా మారి.. కీలక సన్నివేశాలు ఇంపాక్ట్ కలిగించక ‘రణబాలి’ ఇవ్వాాల్సిన అనుభూతిని ఇవ్వలేకపోయింది.


చరిత్రను శోధించి ఇలాంటి కథను తయారు చేయడంలో రాహుల్ సంకృత్యన్ అభిరుచిని.. కష్టాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే ఇదే కథను రాజమౌళి లాంటి దర్శకుడి చేతికి అప్పగిస్తే.. ప్రేక్షకులను ఉర్రూతలూగించేసేవాడేమో అనిపిస్తుంది. కానీ బెంగాలీ సినిమాల ప్రభావం బాగా ఉన్న రాహుల్ సంకృత్యన్ దీన్నొక ఆర్ట్ సినిమాలా తీర్చిదిద్దడమే ‘రణబాలి’కి సమస్యగా మారింది. కొన్ని సన్నివేశాలను హృద్యంగా తీసినప్పటికీ.. కొన్నిచోట్ల ఎమోషన్ రాబట్టినప్పటికీ.. డల్ నరేషన్ తో అతను బాాగా పేలాల్సిన ఎపిసోడ్లలో కూడా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయాడు. ఇక రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోవడానికి చాలానే కష్టపడ్డాడు. రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో చాాలా బాగా నటించింది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల వీఎఫెక్స్ మాత్రం సరిగా కుదరలేదు. కొన్ని చోట్ల తన అభిరుచిని చాటినా.. ఆసక్తి పెంచని స్క్రీన్ ప్లే.. డల్ నరేషన్ తో సినిమా ప్రభావాన్ని తగ్గించేశాడు. చివరగా రణబాలి.. ఎఫర్ట్ ఉంది.. ఎఫెక్ట్ తగ్గింది.


5.0
out of 10

Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

రణబాలి సినిమా కథ గ్రామీణ ప్రాంతంలో చెప్పే బుర్రకథతో ఎమోషనల్‌గా మొదలవుతుంది. సినిమాలో భద్రమల్లన్న కాన్సెప్ట్ ఆసక్తిగా అనిపిస్తాయి. ఇక రాహుల్ సంకృత్యాన్ సన్నివేశాలు రాసుకొన్న తీరు, కథను నడిపించిన విధానం...

రణబాలి సినిమా కథ గ్రామీణ ప్రాంతంలో చెప్పే బుర్రకథతో ఎమోషనల్‌గా మొదలవుతుంది. సినిమాలో భద్రమల్లన్న కాన్సెప్ట్ ఆసక్తిగా అనిపిస్తాయి. ఇక రాహుల్ సంకృత్యాన్ సన్నివేశాలు రాసుకొన్న తీరు, కథను నడిపించిన విధానంలో ఎక్కడా లోపాలు కనిపించవు. అయితే దర్శకుడిగా తాను నమ్ముకొన్న కథను అంతే నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఎక్కడా ఎలివేషన్స్, వాస్తవానికి దూరంగా వెళ్లకుండా రియలిస్టిక్‌గా స్టోరీని రన్ చేశాడని చెప్పాలి. అయితే కథలో డిటైలిటీ ఎక్కువ ఉండటం వల్ల నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడి విజన్, విజయ్, రష్మిక పెర్ఫార్మెన్స్ ఈ సినిమా పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాయి.


రణబాలిగా విజయ్ దేవరకొండ నటుడిగా మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. ఇక రష్మిక మందన్న స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ.. తాను కనిపించిన సీన్లలో కేక పెట్టించారు. ఫైనల్‌ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. పిరియాడిక్ నేపథ్యంగా సాగే ఈ సినిమాను దర్శకుడు రాహుల్ నిజాయితీగా కథను చెప్పారు. అలాగే పాత్రలను నమ్మి విజయ్ దేవరకొండ, రష్మిక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫి తదితర అంశాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. పిరియాడిక్, లవ్ స్టోరీ, సోషల్ ఇష్యూస్‌తో వచ్చే ఎమోషనల్ కంటెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఫీలింగ్ అందిస్తుంది. విజయ్, రష్మిక కోసం ఈ సినిమాను చూసేయొచ్చు.


6.0
out of 10

Above Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన సినిమా రణబాలి. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో చరిత్రకు సంబంధించిన భయంకరమైన కరువు నేపథ్యాన్ని చాలా బాగా...

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన సినిమా రణబాలి. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో చరిత్రకు సంబంధించిన భయంకరమైన కరువు నేపథ్యాన్ని చాలా బాగా చూపించారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ స్ అండ్ భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనతో తన పాత్రకు జీవం పోశారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. జయమ్మ పాత్రలో రష్మిక మందన్న తన పరిపక్వతమైన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. 


అయితే ‘రణబాలి’లో బరువైన ఎమోషన్స్ తో, భారీ యాక్షన్ ఉన్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక విజయ్ – రష్మిక పాత్రల మధ్య ఎమోషనల్ ట్రాక్ బాగున్నా.. వారి మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘రణబాలి’.. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ నటన, క్లైమాక్స్ లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం బాగున్నాయి. కానీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, రెగ్యులర్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ ను కూడా కొన్ని చోట్ల అలరిస్తుంది.

6.0
out of 10

Above Average

రణబాలి (RanaBaali)

Ranabaali movie Review

రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసె...

రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా డాక్యుమెంటరీ అన్న ఫీలింగ్ కలిగించలేదు. చాలా వరకు లిబర్టీస్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇందులో కొత్తగా కథ ఏమీ కనిపించదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ కలగదు. ఊహకందేలా కథ సాగుతూ ఉంటుంది. 


ఒక చోట సినిమా అయిపోయిందేమో అని అనుకుంటారు. కానీ ఇంకా అలా సాగుతూనే ఉంటుంది. చివరకు డివైన్ ఫీలింగ్ కలిగించాలని.. కాంతారాలో పెట్టినట్టుగా.. మొన్న ప్యారడైజ్‌లో ధూమావతి కాన్సెప్ట్ పెట్టినట్టుగా.. ఇందులో భద్ర మల్లన్న కాన్సెప్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక చివరకు పూనకంతో విజయ్ చేసే తాండవం ఆయన ఫ్యాన్స్‌కి నచ్చే అవకాశం ఉంది. విజయ్ తన గత సినిమాలతో పోలిస్తే అద్భుతంగా చేసేశాడు. కనిపించడంలోనూ, వినిపించడంలోనూ విజయ్ తనలోని భిన్నత్వాన్ని చూపించాడు.జయమ్మగా రష్మిక తన పాత్రకు న్యాయం చేస్తుంది. అసలు ఈ ఇద్దరినీ తెరపై చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుంది. చివరగా ‘రణబాలి’ టెక్నికల్లీ బ్రిల్లియంట్ మూవీ. కానీ కమర్షియల్‌గా ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం. స్లో నెరేషన్, సెకండాఫ్ ల్యాగ్, నిడివి, ప్రెడిక్టిబుల్ స్టోరీ, మాస్‌కి కావాల్సిన హై మూమెంట్స్ కనిపించవు. కానీ రాహుల్ విజన్, మేకింగ్, విజయ్ చేసిన విధ్వంసం కోసమైనా థియేటర్లో చూడాల్సిన సినిమాగా నిలుస్తుంది.


5.0
out of 10

Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

#RanaBaali #IdreamMediaRating 2.5/5దర్శకుడు రాహుల్ తెర పైకి తీసుకువచ్చిన రాయల సీమ కరువు కథవలస పాలకుల పీడన ను ఎదిరించిన వీరుడి కథ ..కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి కొంచెం సమయం పడుతుంది ఆ తరువాత నుంచి...

#RanaBaali #IdreamMediaRating 2.5/5

దర్శకుడు రాహుల్ తెర పైకి తీసుకువచ్చిన

రాయల సీమ కరువు కథ

వలస పాలకుల పీడన ను

ఎదిరించిన వీరుడి కథ

..

కథలో ప్రేక్షకుడు లీనం

కావడానికి కొంచెం

సమయం పడుతుంది

ఆ తరువాత నుంచి విశ్రాంతి వరకు

ఆకట్టుకుంటుంది

విశ్రాంతి తరువాత

హీరో పోరుబాట లోకి వెళ్ళాక

కొంచెం బోర్ కొడుతుంది

విజయ్ దేవరకొండ రష్మిక

బాగా చేసారు

డై లాగ్ లు బాగున్నాయి

చిత్రీకరణ లో వీలయినంత

సహజత్వం తీసుకువచ్చారు

..

ఓ సీరియస్ బయోపిక్ లాంటి

సినిమా చూడబోతున్నాం

అనే భావన తో వెళ్తే చూడొచ్చు

ఎన్నో సార్లు చూసిన

బ్రిటిష్ పీడన అన్నది కాస్త బోరింగ్

సబ్జెక్ట్ అనుకుంటే వదలొచ్చు

..

పంచ్ లైన్..భయం లేదు ..చూడొచ్చు

5.0
out of 10

Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

రణబాలి సినిమా కథ 1875 కాలం నాటిది అవ్వడంతో నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా స్లోగానే సాగుతుంది. సినిమాలో మంచి ఎలిమెంట్స్ చాలా వరకు ఉన్నా కూడా చెప్పిన నేపధ్యం మాత్రం స్లోగా ఉండటం వలన తెరపై మంచి సీన్స్ అన...

రణబాలి సినిమా కథ 1875 కాలం నాటిది అవ్వడంతో నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా స్లోగానే సాగుతుంది. సినిమాలో మంచి ఎలిమెంట్స్ చాలా వరకు ఉన్నా కూడా చెప్పిన నేపధ్యం మాత్రం స్లోగా ఉండటం వలన తెరపై మంచి సీన్స్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని ఇవ్వలేదు. విజయ్ దేవరకొండ మాత్రం తన రోల్ వరకు ఎంత న్యాయం చేయగలడో అంతా చేయడానికి ట్రై చేశాడు. చాలా వరకు మెప్పించాడు కూడా. రష్మిక పర్వాలేదు అనిపించేలా నటించగా, మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో తమ తమ రోల్స్ వరకు ఆకట్టుకున్నారు. సంగీతం విషయంలో ఒక సాంగ్ బాగుండగా మిగిలిన పాటలు సో సో గానే ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా ఉండాల్సిన చోట పర్వాలేదు అనిపించేలా ఉంది. 



ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ముందు చెప్పినట్లు స్లోగా సాగుతుంది. ఇది ముందే గుర్తు పెట్టుకుని సినిమా చూడటం స్టార్ట్ చేస్తే మంచిది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గానే ఉన్నాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాని పెట్రియాటిక్ నేపధ్యానికి దైవభక్తిని కూడా జోడించి ఉన్నంతలో సీన్స్ వైజ్ బాగానే చెప్పే ప్రయత్నం హానెస్ట్ గా చేసినా కానీ లెంత్ ఎక్కువ అయ్యేలా చూసుకోవడం, రన్ టైం తగ్గించి స్క్రీన్ ప్లే కొంచం ఫాస్ట్ గా చేసుకుని ఉంటే బాగుండేది. అయినా కానీ ఉన్నంతలో కొంచం ఓపిక చేసుకుని చూస్తె బాగానే ఉంది అనిపిస్తుంది రణబాలి సినిమా. 

6.0
out of 10

Above Average

రణబాలి (RanaBaali)

Ranabaali Movie Review

#Ranabaali Honest Intentions, Patience Testing Execution!The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat...

#Ranabaali Honest Intentions, Patience Testing Execution!


The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat narration test your patience. VD-Rashmika’s portions provide some relief and are the film’s main highlight, but the film lacks the emotional connect a subject like this needs and feels lifeless and tiring for long stretches.


Production values and set design stand out. VD’s effort is visible and he gives a sincere performance, though his characterization and histrionics feel odd at times. BGM is a huge letdown, and the film badly needs trimming. Sincere effort, but a strictly boring watch.


Rating: 2/5

4.0
out of 10

Below Average

జైలర్ 2 (Jailer 2)

Jailer 2 Movie Review

'జైలర్' చూసిన రజనీకాంత్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఎవరికి అయినా సరే... దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రైటింగ్ ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది. నెల్సన్ కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ వినోదానికి రజనీకాంత్ స్టైల్,...

'జైలర్' చూసిన రజనీకాంత్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఎవరికి అయినా సరే... దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రైటింగ్ ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది. నెల్సన్ కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ వినోదానికి రజనీకాంత్ స్టైల్, స్వాగ్ యాడ్ కావడంతో బాక్సాఫీస్ బరిలో 'జైలర్' రికార్డులు క్రియేట్ చేసింది. అటువంటి సినిమాకు సీక్వెల్ అనేసరికి... 'జైలర్ 2' మీద అటు రజనీకాంత్ అభిమానులు, ఇటు సామాన్య ప్రేక్షకులలో ఎటువంటి అంచనాలు ఉంటాయో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar)కు తెలుసు. అంచనాలను అందుకోవడానికి, అభిమానులను శాటిస్‌ఫై చేయడానికి ఆయన సేఫ్ గేమ్ ఆడారు.



ఇక జైలర్ లో రజనీకాంత్ అంటే స్వాగ్, సూపర్ స్టార్ అంటే స్టైల్. తెరపై ఆయన స్లో మోషన్‌లో నడిస్తే చాలు అన్నట్టు రజనీ హీరోయిజాన్ని, ఆయన్ను నెల్సన్ దిలీప్ కుమార్ చూపించారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ మరోసారి అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఆ ముగ్గురి కంటే హృతిక్ రోషన్ అతిథి పాత్ర హైలెట్ అని చెప్పాలి. ఇక సినిమా చివరిలో విజయ్ సేతుపతి తళుక్కున మెరిశారు. ఫైనల్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు 'జైలర్' నచ్చిన ప్రేక్షకులను 'జైలర్ 2' మెప్పిస్తుంది. కథ, కథనం, ట్విస్టుల కంటే రజనీ స్టైల్ & స్వాగ్ తెరపై సన్నివేశాలను అలా చూసేలా చేశాయి. యోగిబాబు, నమో నారాయణతో రజనీ చేసిన సెటిల్డ్ కామెడీ నవ్విస్తుంది. అభిమానులతో మరోసారి 'వర్క్ వర్మ... వర్త్' అనిపించే సినిమా.


రేటింగ్: 3/5

6.0
out of 10

Above Average

Why MRO?