Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Harsh Roshan recently gained popularity with teenage dramas such as Court. The young actor has now come up with Thella kaathitham in the same space. Thella Kaagitham deals with teenage confusion and the consequences of decisions made under peer influence. The film explores how teenagers, driven by others’ opinions and lacking the maturity to understand the implications of their actions, struggle to deal with the consequences. Nandu has written the story, dialogues and screenplay, while Ramesh Bandreddi has directed the film. The biggest problem, however, is the writing. Nandu fails to create an engaging screenplay or enough genuinely humorous situations to sustain the narrative.
Highlights
The lead pair
The climax
Drawbacks
Old-school writing
Lame jokes
Lack of an engaging screenplay
overall Thella Kaagitham attempts to be a simple, message-oriented teenage drama and has a few entertaining portions, particularly in the first half. However, the outdated writing, forced humour and sluggish second half derail the film. The message is good, but the emotional punch the subject demands is not strong enough.
Harshroshan teamed up with debutant director Ramesh Bandreddy for a teenage romantic drama, Thella Kaagitham. Bogapathi Nakshatra, made her feature film debut role. Let’s figure it out with a detailed analysis.
Positives:
1. Passable Initial Thirty Minutes
2. Lead Actress Screen Presence
Negatives:
1. Second Half
2. Excessive Melodrama
3. Repetitive Sequences
4. Poor Music
5. Overstretched Conflict Point
Overall, in an attempt to deliver a socially relevant message, the director of ‘Thella Kaagitham’, ended up making a two-and-a-half-hour film with excessive melodrama that tests your patience after a point. Apart from a passable initial thirty minutes, there’s nothing to talk about in the film.
హర్ష్ రోహన్ హీరోగా నటించిన సినిమా తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. లీడ్ నటుల మధ్య డిజైన్ చేసిన ఫన్ సీన్స్ ఇందులో బాగున్నాయి. యూత్ ఫుల్ మూమెంట్స్ కొన్ని ఓవర్ గా అనిపించినా కొంచెం బ్యాలన్స్ అయ్యాయి. హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకుని, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో యూత్ కోసం వస్తున్న సినిమాలు ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నాయి. యువత జీవితంలోని నెగిటివ్ కోణాలను, చెడు స్నేహాల వల్ల వారు ఎలా ప్రభావితమవుతారు అనే విషయాలను చూపించి, చివరకు ఒక మెసేజ్ తో ముగించడం. ఇదే కనిపిస్తుంది. ఇక ఈ ఫార్మాట్ లోనే ‘తెల్ల కాగితం’ కూడా అనిపిస్తుంది. దీని స్క్రీన్ ప్లే కూడా అదే ఫార్ములా టెంప్లేట్ ను ఫాలో అవుతుంది.
దీనితో, సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోందో ముందే ఊహించే విధంగా ఉంటుంది. ఇలా కథనం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే, ‘తెల్ల కాగితం’ ఒక రొటీన్ యూత్ ఫుల్ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కథనం ఓకే కానీ సెకాండాఫ్ లో మాత్రం కథనం నెమ్మదించింది. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్ అంతే ఇబ్బంది పెట్టాయి. యువ జంట బాగానే పెర్ఫామ్ చేశారు. సెకండాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. దీనితో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
సమాజంలో అంతరాలను తెరపై చూపించడంలో తమిళ దర్శకులు కొందరు ముందుంటారు. అందులో కార్తిక్ సుబ్బరాజు ఒకరు. ఈ డోరతీ సినిమాలో కుల, లింగ వివక్షత గురించి చర్చించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హిజ్రాగా మారితే ఏం జరిగింది అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. సినిమాలో హిజ్రాల లైఫ్ స్టైల్, వారికి జరిగే ఉత్సవాలు ఇవన్నీ సెకెండాఫ్‌లో కాస్త ఎక్కువే చూపించారు. సుబ్బు హిజ్రాగా మారిన తర్వాత కార్తీతో చేసిన జర్నీ, వినోదాన్ని భావోద్వేగాన్ని పంచుతుంది. ప్రాణ స్నేహితుడైన సుబ్బుని చంపడానికి కార్తి తీసుకున్న ప్లాన్ ఆకట్టుకుంటుంది. అయితే డోరతి ఎలా చనిపోయిందనేది క్లారిటీ ఇవ్వలేదు.
నటీనటులు అందరూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక ఎడిటర్ సెకెండాఫ్‌ను కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే బోర్ ఫీలింగ్ కలిగేది కాదు. నిర్మాణ పరంగా పేరు పెట్టక్కర్లేదు. లింగ వివక్ష, కులం, వర్ణంతో పాటు పితృస్వామ్య భావజాలం వరకు సమాజంలోని అనేక అసమానతలను గురించి దర్శకుడు ప్రశ్నించాడు. అలాగే సమాజం ట్రాన్స్‌జెండర్స్ ఎదుర్కొంటున్న అవమానాలు, వారి లోలోపలి సంఘర్షణలను సున్నితంగా తెరపై చూపించారు. లైన్ మంచిదే అయినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో కాస్త వెనకడుగులో ఉన్నట్లే అనిపిస్తుంది. దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోతగ్గదే! అయితే ఇలాంటి కథాంశాలతో తెరకెక్కే చిత్రాలు అందరికీ నచ్చే ఆస్కారం లేదు.
రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి షాకింగ్ టాక్ అందుకున్న సినిమానే డోరతి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ వారం తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఇప్పటికీ మనం ఉన్న సమాజంలోనే కులం, హోదా లేదా కాలం చెల్లిన సామాజిక విశ్వాసాల రూపంలో సామాజిక వివక్ష ఉంది అనేది తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన వాస్తవం. ఇతరులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నియంత్రించడానికి ఉపయోగించే పరువు అనే తప్పుడు భావనలపై దృష్టి పెడుతూ, కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ చుట్టూ తన కథను అల్లారు.
అయితే ఈ తరహా సబ్జెక్ట్ లు డెఫినెట్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించే అవకాశం చాలా తక్కువ. ఇందులోని డెప్త్, ఎమోషన్స్ కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే, ‘డోరతీ’ ఓకే అనిపించే ఓ డిఫరెంట్ అండ్ రేర్ అటెంప్ట్ గా నిలుస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ ని ఎంచుకొని అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే నటీనటులు నుంచి సాలిడ్ పెర్ఫార్మన్స్ లు కూడా తాను రాబట్టారు. కానీ ఈ సబ్జెక్ట్ అన్ని వర్గాల ఆడియెన్స్ కి డెఫినెట్ గా కనెక్ట్ కావడం కష్టం. పైగా సాగదీతగా, రిపీటెడ్ గా అనిపించే సీన్స్ కొన్ని ఇబ్బంది పెడతాయి. కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు, కొత్త నేపథ్యం ఉండే సినిమా చూడాలి అనుకునేవారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.
కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ డోరతీ ’. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో విడుదలై అక్కడ కాంట్రవర్సీతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పుడు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ చిత్రాలు దాదాపు సమాజంలోని అసమానతలపైనే ఉంటాయి. అయితే ఈ సారి లింగ వివక్షను ప్రధాన అంశంగా తీసుకున్నాడు. సినిమాలో సుబ్బు పాత్ర మారిన తీరు.. కార్తి సంఘర్షణ.. ఇలా అన్నీ కూడా ఎమోషనల్‌గా సాగుతాయి. ఓ కమ్యూనిటీ ఈ సమాజం నుంచి ఎదుర్కొనే అవమానాలు, చీత్కారాన్ని మనసుని కదిలించేలా తెరకెక్కించాడు కార్తిక్ సుబ్బరాజ్.
అయితే కీర్తి సురేష్ పాత్ర కూడా మధ్యలోనే అలా అర్దాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. కానీ టెక్నికల్‌గా మ్యాజిక్ చేసిన ‘డోరతీ’.. ఎమోషనల్‌గా అందరినీ కదిలించలేకపోయిందని చెప్పుకోవచ్చు. చివరగా ‘డోరతీ’ మనం రెగ్యులర్‌గా చూసే మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే కాదు. కొడితే వంద మంది గాల్లోకి ఎగరం, రక్తం ఏరులైపారే సీన్స్ ఇందులో ఉండవు. ఓ ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అందరికీ నచ్చకపోయినా కొందరిని మాత్రం మెప్పించే అవకాశం ఉంది.
వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఈ సిగ్మా. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్, విలన్ల గ్యాంగ్ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కానీ దర్శకుడు జేసన్ కథనం విషయంలోనే చాలా కాంప్లికేటెడ్‌గా మార్చాడు. కథ ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా తీసుకెళ్లారు.
ఆయా సీన్లలో ల్యాగ్ ఎక్కువగా ఉంటుంది. గురు పాత్రలో సందీప్ కిషన్ నటించి మెప్పించాడు. పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్రలోని డ్రామా కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సామ్ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు జేసన్ సంజయ్.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేయడం మైనస్‌గా చెప్పొచ్చు. పైగా ఆకట్టుకునేలా తీయడంలో తడబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఫెయిల్ అయ్యాడు. ఫైనల్‌గా సినిమా చూశాక.. జేసన్ సంజయ్.. దర్శకుడిగా కంటే నటుడిగా ట్రై చేస్తే బెటర్ అనిపించింది. ఆడియెన్స్ సహనంతో ఆడుకున్న సిగ్మా. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా సక్సెస్‌కాలేకపోయారు.
Sigma movie review :
Vijay’s son, Jason Sanjay decided to become a film director instead of becoming a hero as expected by most people. When his debut directorial film Sigma was announced, people were surprised by his choice of a Telugu hero, Sundeep Kishan, to play the lead role in the film and a Telugu heroine, Faria Abdullah, to play the lead actress role.
Positives:
1. Nothing
Negatives:
1. Clueless Storytelling
2. Amateurish Direction
3. Outdated Writing
4. Loud Background Score
5. Excessive Slow Motion Shots
6. Unnecessary Item Song
Overall, with a bad first half and an equally bad second half, Sigma, tests your patience throughout its runtime and it definitely doesn’t deserve a watch not just in theatres but on OTT as well. Yes, pursuing passion is commendable but the first thing, Jason Sanjay, has to do is work as an assistant director for a handful of films for a few years, learn the craft, improve his writing skills and then attempt to make his second film as director. It may sound harsh but he’s not yet ready to direct a film and his lack of command in storytelling and direction, was to be seen in each and every sequence of, Sigma.
లేటెస్ట్ యాక్షన్ డ్రామా సిగ్మా సినిమా చూశాక ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది—స్టైలిష్ టీజర్, హై-వోల్టేజ్ టైటిల్ పెట్టినంత మాత్రాన సినిమాలో స్టఫ్ ఉన్నట్టు కాదు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ కావడం, సందీప్ కిషన్ హీరోగా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ అవన్నీ థియేటర్లో కర్పూరంలా కరిగిపోయాయి.
వైజాగ్ బ్యాక్‌డ్రాప్ లో అప్పుల తిప్పలు, యూట్యూబ్ ఛానెల్, డ్రగ్స్ పెన్ డ్రైవ్, విలన్ ని బ్లాక్‌మెయిల్ చేయడం... ఇలా అరడజను పాత సినిమాల ప్లాట్లను కలిపి రుబ్బిన రొటీన్ కథ ఇది. హీరో సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్ మరియు సిన్సియర్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టడానికి గట్టిగానే కష్టపడ్డాడు, కానీ రొటీన్ కథనాన్ని ఆయన ఒక్కడే కాపాడలేకపోయాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను కేవలం పేరుకే పరిమితం చేశారు, ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు.
ఫస్ట్ హాఫ్ అంతా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా దారుణమైన ల్యాగ్‌తో సాగుతుంది. ఎమోషనల్ సీన్లలో అసలు డెప్త్ లేదు, ఫ్లాట్ క్లైమాక్స్ ఇంకా పెద్ద హెడేక్. ఫైనల్ గా సుదీర్ఘమైన క్లైమాక్స్ చూస్తూ 5 సెకన్లకొకసారి ఎగ్జిట్ డోర్ వైపు చూసే పరిస్థితి దాపురించింది.
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకే ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్‌లో జేసన్ సంజయ్ సినిమా తీశారని అర్థం అవుతోంది. హీరో అండ్ విలన్ మధ్య ఫైట్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్ (పిల్లి ఎలుక మధ్య ఆట)ను తలపించింది. చివరకు క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? అని ఎదురు చూసేలా చేశారు. కథ, కథనాల్లో హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. కానీ, ఆ స్థాయిలో చేయలేదు.
ఓవరాల్ గా విజయ్ తనయుడు జేసన్ సంజయ్, సందీప్ కిషన్ కలిసి కొత్త తరహా సినిమా తీసి ఉంటారని ఆశిస్తే... బాగా డిజప్పాయింట్ చేశారు. ఇంతకు ముందు సందీప్ కిషన్ పరిచయం చేసిన దర్శకులు తమ మార్క్ చూపించారు. కానీ జేసన్ సంజయ్ ఓల్డ్ స్టైల్ సినిమా చేశారు. 'సిగ్మా' టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టు సినిమా చివరిలో ఓ మాట చెప్పారు ఫరియా అబ్దుల్లా. ఆ డైలాగ్ ఎందుకు రాయించారో అర్థం కాదు. అప్పటి వరకు చూసిన సినిమా కూడా అర్థం కాదు. ఫైనల్ గా కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన అవుట్ డేటెడ్ సినిమా ఈ 'సిగ్మా'.
తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎక్కడో ఉన్న డబ్బు కోసం రెండు వర్గాలు గొడవ పడటం, దానికి సంబంధించిన క్లూ కోసం వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లడం... చివరకు హీరో ఆ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం... ఈ కాన్సెప్ట్ ఇప్పటికే దశాబ్దాల కాలంగా నలిగి నలిగి పోయింది. మళ్ళీ అదే కథను తీసుకుని అటూ ఇటూ తిప్పి జనాలకు చూపించాలనే ప్రయత్నం జేసన్ సంజయ్ చేశాడు.
అసలు జేసన్ సంజయ్ చెప్పిన కథలో ఏ కొత్తదనం చూసి లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అర్థం కాదు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. పై పెచ్చు కోట్ల రూపాయలను నీళ్ళ మాదిరి ఖర్చుచేయించాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ అని ఇవాళ్టి తరం చెబితే... జనాలు వినే పరిస్థితి లేదు. నిజానికి ముక్కు ముఖం బాగున్న జేసన్ సంజయ్ దర్శకత్వం కంటే నటన మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో!
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి సిగ్మాతో వస్తున్నాడు. ఆ సినిమాను లైకా ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయాలు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన చూస్తే భారీ నిరాశే ఎదురైందని చెప్పాలి. జేసన్ సంజయ్ ఎంచుకొన్న కథ, ఆ కథను చెప్పడానికి అనుసరించిన కథనం చాలా పేలవంగా, నాసిరకంగా ఉన్నాయి. సినిమా సాగుతున్న కొద్ది ఈ టార్చర్ ఎప్పుడు ముగుస్తుందా? అనే ఫీలింగ్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
నటీనటులు విషయానికి వస్తే.. సందీప్ కిషన్ ఈ సినిమాను ఎలా ఒప్పుకొన్నాడు అనే మిలియన్ డాలర్ ప్రశ్నే. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవనే చెప్పాలి. కొంతలో కొంత సినిమాటోగ్రఫి బాగుంది. చాలా వరకు సన్నివేశాలను బాగా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ గోల గోలగా ఉంటుంది. ఎడిటర్ పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తుంది. సన్నివేశాలను కూర్పు చేయడానికి ఎంత కష్టపడ్డారో సినిమా ఫ్లోను చూస్తే అర్ధమవుతుంది. ఆడియన్స్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండటమే మంచిదనేది సూచన, సలహా. దాంతో డబ్బు మాత్రమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. సిగ్మా సినిమా విషయంలో బీ కేర్ ఫుల్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers