Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
హనుమాన్ అంశ్ చిత్రం విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా రూపొందింది. సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విరామం వరకు సినిమా చాలా పర్ఫెక్ట్ గా, ఒక దైవిక భావన కలిగించేలా ముందుకు వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు అసలు విషయాన్ని పక్కనపెట్టి బాబా మహిమలను హైలైట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమాకు వెళ్తే కచ్చితంగా ఏదో గుళ్లో కూర్చున్నట్లు నాలుగు వైపులా రామ్ రామ్ అని వినిపిస్తూ ఉంటుంది.
దేవుడి భక్తి కంటే ఒక వ్యక్తిని ఎక్కువగా కీర్తించడం లాంటివి సామాన్య ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక గురువులను, వాళ్ల మహిమలను బలంగా నమ్మే వాళ్లకు ఈ ద్వితీయార్థం బాగా నచ్చుతుంది. కానీ లాజిక్స్ వెతికే వాళ్లకు మాత్రం ఈ మహిమలన్నీ కాస్త అతిగా అనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో బాబాకు ఉన్న విపరీతమైన భక్తుల వల్లే ఈ సినిమా అక్కడ అంత పెద్ద విజయం సాధించింది. ఇక తెలుగు హక్కులను హోంబలే ఫిల్మ్స్ లాంటి పెద్ద సంస్థ తీసుకుని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఓవరాల్ గా చూసుకుంటే భక్తి, ఆధ్యాత్మికతను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఓవరాల్ గా హనుమాన్ అంశ్.. మంచి సినిమా..!
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగులో విడుదలైంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో శోభినవ్ సత్య బాబా పాత్రలో హుందాగా నటించి మెప్పించారు. ఎలాంటి అనవసర కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే, సెకండాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగడం కొద్దిగా ఓపికకు పరీక్ష పెడుతుంది.
ఓవరాల్ గా ఆధ్యాత్మిక భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం, ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి డివైన్ రికమండేషన్! అయితే చాలా సహజంగా ఉండే ఈ సినిమాలో ఎడిటింగ్ పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బోర్ ఫీల్ తగ్గేది. ఇక తెలుగు డబ్బింగ్ సంభాషణలు మూల భావాన్ని పాడు చేయకుండా నీట్ గా కుదిరాయి. ఫైనల్ గా హనుమాన్ అంశ్ హడావిడి లేకుండా హృదయానికి హత్తుకునే ఒక నిండైన ఆధ్యాత్మిక మూవీ.
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ వైబ్స్‌తో సాగుతుంది. శోభినవ్ సత్య బాబా పాత్రలో జీవించగా, అద్భుతమైన బిజీఎమ్ ఆడియన్స్‌ని ఒక దివ్యమైన అనుభూతికి గురిచేస్తుంది.
అయితే, సెకండాఫ్‌లో డ్రామా కాస్త నెమ్మదించి కథనం సాగదీతగా అనిపించడం, ఆడియన్స్ ఓపికకు చిన్న పరీక్షే! అయినప్పటికీ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ లోపాన్ని కవర్ చేస్తాయి.
ఫైనల్ వర్డిక్ట్: బాక్సాఫీస్‌ను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన ‘హనుమాన్ అంశ్’ సాధారణ ప్రేక్షకులకే కాక, ఆధ్యాత్మిక ప్రియులకు ఈ వికెండ్‌లో ఫ్యామిలీతో చూడదగ్గ ఒక పవర్‌ఫుల్ మస్ట్-వాచ్ డివైన్ రికమండేషన్!
పోలీసులు, నక్సలిజం, ప్రభుత్వ వ్యవస్థల చుట్టూ తిరిగే చాలా బరువైన పాయింట్‌ను తీసుకుని, దానికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ముడిపెట్టి డైరెక్టర్ కామ్రేడ్ కళ్యాణ్ చిత్రాన్ని నడిపించాడు. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ ను కామెడీ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం సాహసమే. అయితే లాజిక్స్ పక్కనపెట్టి కేవలం వినోదం కోణంలో చూస్తే మాత్రం చాలా చోట్ల బాగా నవ్వులు పూస్తాయి. ఇక సినిమాలో కామెడీ సన్నివేశాలు బాగా పేలడంతో మొదటి భాగం ఎక్కడా బోర్ కొట్టదు. కానీ ద్వితీయార్థం మొదలయ్యాక అడవి నేపథ్యంలో సీన్స్ ఉండటంతో నవ్వించే స్కోప్ బాగా తగ్గిపోయింది.
చుట్టూ తుపాకులు పట్టుకున్న వాళ్ల మధ్య ఫన్ క్రియేట్ చేయడం కష్టంగా మారడంతో ఇక్కడి నుంచి సినిమా కాస్త నెమ్మదిస్తుంది. మధ్యలో రాజకీయ నాయకుడి కిడ్నాప్ ఎపిసోడ్ ద్వారా మళ్లీ కొంత వినోదాన్ని రాబట్టే ప్రయత్నం చేసినా అది అప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా హీరో మార్క్ కామెడీని పక్కనపెట్టి, పతాక సన్నివేశాల్లో భారీగా సందేశాలు ఇవ్వడం కొంత ఇబ్బందిగా మారుతుంది. సినిమాను మెసేజ్‌లతో కాకుండా సరదాగా ఎండ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక శ్రీవిష్ణు వన్ మ్యాన్ షోగా సినిమాలో అలరించాడు. అయితే మాటల రచయితలు రాసిన ట్రెండీ డైలాగ్స్ చాలా చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. పోటీగా వేరే సినిమాలు లేకపోవడం, వరుస సెలవులు రావడం ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసిరానుంది. ఓవరాల్ గా కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ కళ్యాణ్..!
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నప్పటికీ, పూర్తిస్థాయి వినోదాత్మకంగా మలచడం విశేషం. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, కపటం లేని నటనతో కమెడియన్ సత్య థియేటర్లలో నవ్వులు పూయించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.
అయితే, కంటెంట్ పరంగా పెద్దగా లోపాలు లేకపోయినా, సెకండాఫ్‌లో కామెడీని దాటి యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణల మోతాదు పెరగడంతో సినిమా వేగం తగ్గింది. దీంతో పక్కా కామెడీ చిత్రంగా ఆశించిన స్థాయి అనుభూతి లభించదు. క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఇక ఓవరాల్ గా ఈ "కామ్రేడ్ కళ్యాణ్" చూసి "లాల్ సలాం" అని పై శృతిలో అరవలేం కానీ, అనకుండా ఉండలేం! శ్రీవిష్ణు అభిమానులకు, కామెడీ కోరుకునేవారికి ఇది ఒక మంచి చాయిస్.
శ్రీ విష్ణు టైటిల్ రోల్ లో మహిమా నంబియార్ కథానాయికగా, జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్ ను ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అడవిలో కామ్రేడ్ ట్రాక్, ఎంటర్‌టైనింగ్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఎపిసోడ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి.
అయితే కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ప్రారంభంలో కథనం కాస్త స్లోగా సాగడం చిన్న మైనస్. కొన్ని డబ్బింగ్ సమస్యలు మరియు క్లైమాక్స్ ఇంకాస్త ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉన్నాయి. ఓవరాల్ గా కథనంలో కొత్తదనం పెద్దగా లేకపోయినా... శ్రీవిష్ణు-సత్య కాంబో అందించే నాన్‌స్టాప్ ఫన్ అండ్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ కోసం ‘కామ్రేడ్ కళ్యాణ్’ నిష్ఫలంగా ఒకసారి నవ్వుకోవడానికి హ్యాపీగా చూడదగ్గ డీసెంట్ మూవీ. ఫైనల్లీ కామ్రేడ్ కళ్యాణ్ కామెడీ కళ్యాణే కానీ..!
విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్య వశిష్ట కథానాయికగా దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ క్రైమ్ లవ్ డ్రామా ‘అనకాపల్లి’ ఈ వారం థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఊర్లో గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ ప్రపంచంలోకి దిగిన సూర్య, తన లైఫ్‌లోకి అమృత అనే అమ్మాయి వచ్చాక ఎలాంటి ఎమోషనల్ అండ్ డ్రమటిక్ టర్న్స్ తీసుకున్నాడనే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది.
విక్రమ్ సహిదేవ్ మాస్ మేకోవర్, సంధ్య క్యూట్ పర్ఫార్మెన్స్, అండ్ తారక్ పొన్నప్ప డిఫరెంట్ విలనిజం సినిమాకి మేజర్ హైలైట్స్! ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్ డ్రామా, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. కానీ, దశాబ్దాలుగా నలిగిపోయిన "రౌడీ కుర్రాడు - పద్ధతిగల పిల్ల" అనే పాతకాన్సెప్ట్ కావడం, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే వల్ల సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ కావడం సినిమా పేస్‌ని తగ్గించేసింది. అయితే కొన్ని రొటీన్ అంశాలు ఉన్నప్పటికీ రా అండ్ రస్టిక్ తరహా క్రైమ్ డ్రామాలను, తీవ్ర భావోద్వేగాలతో కూడిన ముగింపులను ఇష్టపడే ప్రేక్షకులకు అనకాపల్లి వన్ టైం వాచబుల్.
విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ట జంటగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ మాస్ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. స్థానిక గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ బాట పట్టిన ఒక యువకుడి జీవితం, అతని ప్రేమకథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విక్రమ్ సహిదేవ్ తన వయసుకు తగ్గ మాస్ క్యారెక్టర్‌లో సీరియస్‌గా జీవించగా, సంధ్య వసిష్ట లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. తారక్ పొన్నప్ప డిఫరెంట్ విలనిజం, క్లైమాక్స్ ఎపిసోడ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు ప్రధాన అసెట్స్‌గా నిలిచాయి.
అయితే, టాలీవుడ్‌లో ఇప్పటికే వందల సార్లు చూసిన "రౌడీ హీరో - క్లాస్ హీరోయిన్" అనే రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ కాన్సెప్ట్ కావడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్! ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ బ్లాక్స్ బాగున్నప్పటికీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే మరియు హీరో-హీరోయిన్ల మధ్య బలమైన కెమిస్ట్రీ లేకపోవడంతో డెప్త్ మిస్ అయింది. కథకుడిగా ఖగేష్ తమ్మినేని కొత్తదనం చూపించలేకపోవడంతో ల్యాగ్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఫైనల్ గా సాంకేతికంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా, రొటీన్ కథనం వల్ల ‘అనకాపల్లి’ కేవలం యాక్షన్ అండ్ క్రైమ్ లవర్స్‌కి మాత్రమే ఓకే అనిపించే యావరేజ్ అటెంప్ట్!
‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేశ్ బండ్రెడ్డి తీసిన పల్లెటూరి టీనేజ్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ ప్రేమ, టీనేజ్‌లో చేసిన ఒక తప్పు, దానివల్ల సొసైటీలో వచ్చే సమస్యలు అనే పాయింట్‌తో వచ్చారు. హర్ష్ రోషన్, నక్షత్ర నాచురల్ యాక్టింగ్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సినిమాకు డీసెంట్ అసెట్స్. కానీ, మనం దశాబ్దాలుగా చూసి చూసి రొట్టైపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ ప్లాట్ ఇది!
రియలిస్టిక్ పేరుతో పెట్టిన అడల్ట్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరంచేస్తే, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ సీన్స్‌తో దారుణమైన ల్యాగ్‌ని ఇస్తుంది. అయితే థియేటర్ లో కంటెంట్ చూస్తే మాత్రం బొమ్మలో ఏం లేదనాలి. ఖాళీ కాగితంపై ఎంత కలర్ఫుల్ పెయింటింగ్ వేసినా గ్రిప్పింగ్ స్టోరీ లేకపోతే దండగే బాస్! దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం. ఓవరాల్ గా ఇదో డీసెంట్ మూవీగా లవ్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు.
టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి ఆ తర్వాత ఆ తప్పును ఎలా కప్పిపుచ్చాలో తెలియక ఇబ్బందులు పడే కథలు అప్పుడెప్పుడో చిత్రం సినిమా నుంచి వస్తున్నాయి.. తాజాగా తెల్ల కాగితం సినిమా కూడా అలాంటి కథే. స్కూల్‌లో మొదలైన ప్రేమ.. ఆ తర్వాత ముందుకెలా వెళ్లింది.. అనుకోకుండా వేసిన ఒక్క తప్పటడుగు కారణంగా అప్పటి వరకు ఉన్న జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయనే మంచి పాయింట్‌తోనే ఈ సినిమాను తీసారు.
అయితే సినిమా మొదట్లో బాగానే ఉన్నా.. రాను రాను ఎందుకో మరీ తేలిపోయే సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. కండోమ్ సీన్, అలాగే ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ అప్పటి టీనేజ్ పిల్లలు ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారనే విషయం చూపించాడు. ఇంటర్వెల్‌లో వచ్చే ప్రగ్నెన్సీ టెస్ట్ నుంచే కథ ఊపందుకుంటుంది.. అక్కడ్నుంచి సెకండాఫ్ మళ్లీ కాస్త స్లో అవుతుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను నిలబెట్టింది. చివర్లో హార్డ్ హిట్టింగ్ ఫినిషింగ్ ఇవ్వాలని ఫిక్సైపోయిన తర్వాతే అలా రాసుకున్నారని అర్థమవుతుంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం. ఓవరాల్ గా తెల్ల కాగితం.. ఒకట్రెండు మచ్చలు కనిపించినా.. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథే..!
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా, కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పల్లెటూరి లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకున్న ఇద్దరు టీనేజర్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ల కుటుంబాల్లో, సొసైటీలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే విలేజ్ నేటివిటీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లీడ్ పెయిర్ హర్ష్ రోషన్, నక్షత్ర తమ వయసుకు తగ్గ పాత్రల్లో నాచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, కేవీ గుహన్ రిచ్ కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
అయితే, టాలీవుడ్‌లో ఇప్పటికే దశాబ్దాలుగా నలిగిపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ లవ్ స్టోరీ కావడం, ప్రెజెంటేషన్ పరంగా కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్! ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్లతో పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ సీన్స్ మరియు ఓవర్ ల్యాగ్‌తో విపరీతంగా బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు రియలిస్టిక్ టచ్ కోసం వాడిన అడల్ట్ డైలాగ్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఓవరాల్ గా దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ దాన్ని వెండితెరపై ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా తడబడ్డారు. ఫైనల్లీ ఈ తెల్ల కాగితం ఆకట్టుకొని మెసేజ్ ఓరియెంటెడ్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ.
కొంత మంది తమిళ దర్శకుల సినిమాలు అంటే కులం, వివక్షలు, సమాజంలో అంగీకరించని కొన్ని సంఘటనలపై సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. హిజ్రాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు హిజ్రాగా మారడం అనేది కొత్త పాయింట్ గా రాసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే రా & రస్టిక్ గా, పూర్తి తమిళనాడు నేటివిటీలో ఉంటాయి. తమిళ్ లో డోరతి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా LGBTQ వివాదంలో నిలవడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. దీంతో తమిళ్ లో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తమ ప్రయోగం తెలుగులో సక్సెస్ అవుతుందేమో అని భావించి ఇక్కడ రిలీజ్ చేసారు.
అయితే ఇక్కడ కూడా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ రా & రస్టిక్ గా బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో మంచి విజువల్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఒక డేరింగ్ కథని సింపుల్ స్క్రీన్ ప్లే తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ‘డోరతి’ సినిమా చిన్నప్పట్నుంచి అబ్బాయిగా పెరిగి సడెన్ గా హిజ్రాగా మారితే అతని కుటుంబం, అతని బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers