Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
కమర్షియల్ సినిమాలు చూసే ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు నచ్చవచ్చో, నచ్చకపోవచ్చో... తెలీదు కానీ, కాస్త దైవచింతన ఉన్న వాళ్లెవ్వరైనా సరే.. ‘హనుమాన్ అంశ్’ చూస్తూ అందులో లీనం అయిపోవాల్సిందే. ఇక రాముడిని కొలిచేవాళ్లు.. హనుమంతుడి భక్తులైతే పరవశంలో మునిగిపోతారు. దేవుడి సినిమా అనగానే మాయలు మహిమలు చూపిస్తూ.. విజువల్ మాయాజాలంతో ముంచెత్తాల్సిన అవసరమే లేదని.. జీవన సారాన్ని బోధిస్తూ ఆలోచన రేకెత్తించేలా కథను చెప్పినా ప్రేక్షకులు తన్మయత్వానికి గురవుతారని ‘హనుమాన్ అంశ్’ రుజువు చేస్తుంది. మనిషిలోనే పరమాత్ముడున్నాడని చెబుతూ.. మానవసేవే మాధవ సేవ అని చాటుతూ.. సక్రమమైన మార్గంలో జీవించమని బోధిస్తుంది ‘హనుమాన్ అంశ్’.
దాదాపు షిరిడీ సాయిబాబా జీవితాన్ని పోలినట్లే ఉంటుంది కరోలి బాబా కథ కూడా. కానీ ప్రతి సన్నివేశం హడావుడి లేకుండా.. హాయిగొలిపేలా చాలా ప్రశాంతంగా సాగుతాయి. పన్నెండేళ్ళ వయసులో ఆధ్యాత్మిక మార్గం పట్టి ఇల్లు విడిచి వచ్చేసిన లక్ష్మీ నారాయణ.. బాబాగా పరిణామం చెందే సన్నివేశాలు అద్బుతంగా అనిపిస్తాయి. ఎవరితోనూ అనుబంధం ఏర్పరుచుకోకుండా నదీ ప్రవాహంలా సాగిపోతూ ఉండాలనే ఆలోచన రేకెత్తే సన్నివేశం హృదయాన్ని హత్తుకుంటుంది. ఓవరాల్ గా ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా జెన్యూన్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. దీన్నొక సగటు సినిమాలా చూస్తే నచ్చకపోవచ్చు. దైవచింతన.. ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లను ఇది అమితంగా ఆకట్టుకుంటుంది. చివరగా హనుమాన్ అంశ్.. కదిలించే కరోలి బాబా కథ.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి మూలం ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, ఆ పైన ఆధ్యాత్మిక బాట పట్టి, నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధుడైన ఓ సాధువు కథ ఇది. పదకొండేళ్ళ వయసులో ఇల్లు వదిలి దేశాటన జరిపి, పలువురు బాబాలు, సాధుసంతులను దర్శించుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణను పొందిన నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవిత గమనాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో ఆయన సాంగత్యంలోకి వచ్చిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన మహిమలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య చక్కగా ఒదిగిపోయారు. ఇతర నటీనటుల సహజ నటనతో పాటు సాధు సుశీల్ తివారి తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. దర్శకుడు విశాల్ చతుర్వేది తన స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. అయినా కొన్నిచోట్ల మాత్రం కథ నత్తనడకలో సాగడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మేకర్స్ ఈ మూవీని మూడు భాగాలుగా నిర్మించాలని భావించటమే అందుకు కారణం కావచ్చు. మిగిలిన రెండు భాగాల కోసం ఇక్కడ కామా పెట్టారని అనుకోవాలి. ఉత్తర భారతీయులను అంతగా ఆకట్టుకున్న అంశాలు ఇందులో ఏమున్నాయనే భావనతో ‘హనుమాన్ అంశ్’ చిత్రం చూడటానికి వెళ్ళినవారు చాలా వరకూ నిరాశకు గురి కావచ్చేమో కానీ.. సాధుసంతుల జీవితాలలోని అద్భుతాల ఆవిష్కరణను చూడాలనుకుని థియేటర్లకు వెళ్ళేవారికి మాత్రం ‘హనుమాన్ అంశ్’ నచ్చుతుంది.
హనుమాన్ అంశ్ సినిమా గురించి చెప్పుకుంటే.. ఆధ్యాత్మికత, దయ, ప్రేమ, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రధానంగా రూపొందించారు. మనిషిలో మార్పు రావడానికి ఎదురయ్యే అనుభవాలు ఎలా కారణమవుతాయో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అంశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథనం ఎపిసోడ్ల తరహాలో సాగడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా ఉండటం వల్ల సినిమా వేగం తగ్గుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఉండే భారీ మలుపులు, ఉత్కంఠ ఇందులో కనిపించదు.
ఇక దేవుడికి సంబంధించిన మూవీ అన్నప్పుడు మాయలు, వారి లీలలకు ప్రయారిటీ ఉంటుంది. వాటినే ఆడియెన్స్ ఆశిస్తారు. అవి లేకపోతే చప్పగా సాగుతుంది. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. నీమ్ కరోలి బాబా జర్నీని చూపించారు. డ్రామా కూడా పెద్దగా లేదు. ఉన్నచోట కూడా పండలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని ఉన్నా, అవి కనెక్ట్ కాలేదు. దీనికితోడు నాటకీయత కూడా పెద్దగా లేదు. దేవుడి పవర్‌కి సంబంధించిన సీన్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా సింపుల్‌గా ఉన్నాయి. దీంతో అవి కిక్ ఇవ్వలేకపోయాయి. క్లైమాక్స్ కూడా అసంతృప్తిగానే ఉంటుంది. అయితే మూఢ విశ్వాసం కాకుండా మనం పని మన చేయాలి, నిజాయితీగా ఉండాలి, దేవుడిని ఆరాధించాలి అని చెప్పిన తీరు బాగుంది. మొత్తంగా హనుమాన్ అంశ్ భక్తి, మానవత్వం, నిస్వార్థ సేవ వంటి అంశాలతో ఆలోచింపజేసే ఆధ్యాత్మిక చిత్రం. నీమ్ కరోలి బాబా జీవితంపై ఆసక్తి ఉన్నవారికి, ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. సాధారణ ఆడియెన్స్ కి మాత్రం ఇది ఏమాత్రం ఎక్కడు. పైగా తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం అంత ఈజీ కాదు. కనెక్ట్ అయితే మాత్రం ఏదో మ్యాజిక్ జరుగుతుందని చెప్పొచ్చు.
తెలుగు తెరపై అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు ప్రేక్షకులను అటు అధ్యాత్మికంగా, కమర్షియల్‌గా కూడా రంజింప చేశాయి. అలాంటి కోవలోనే శ్రీరామ భక్తుడు హనుమాన్ భక్తుడిగా మారిన నీల్ కరోలి బాబా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్శకుడు విశాల్ చతుర్వేది మాత్రం కమర్షియల్ హంగులకు దూరంగా డాక్యుమెంటరీ తరహాలో డ్రామాకు చోటు లేకుండా ఈ సినిమాను ముఖ్యంగా అధ్యాత్మిక కోణంలో ఆయన మహనీయతను చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కథలో వచ్చే రెండు, మూడు సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకుడిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాయి.
శ్రీరాముడు, హనుమాన్ అంశాల చుట్టు సాగిన నీమ్ కరోలీ బాబా జీవితాన్ని పూర్తిగా భక్తి, అధ్యాత్మికత తెర మీద చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఇప్పటికే ఉత్తరాది భారతీయలను భక్తి తన్మయత్మంలో ముంచేయడమే కాకుండా 400 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఆలస్యమైనప్పటికీ బతుకమ్మ, దసరా పండుగ సెలవులను టార్గెట్ చేసుకొని రిలీజ్ చేశారు. భక్తి పరమైన సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వారికి స్పూర్తిని కలిగించిన నీమ్ కరోలీ బాబా జీవితాన్ని తెలుసుకొనే అవకాశం దక్కుతుంది. ఎక్కువగా ఆశించకుండా వెళితే.. మంచి అనుభూతితో మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిందీలో అద్భుత ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవగా, థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక భక్తి, బయోపిక్ సినిమాలకు బలమైన భావోద్వేగాలే ప్రాణం. ఆ విషయంలో ‘హనుమాన్ అంశ్’ ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమా ఆద్యంతం ఒక దైవికతతో కొనసాగుతూ చూసే ప్రేక్షకునిని బాబాతో ప్రయాణం చేస్తున్నట్టుగా లీనం అయ్యేలా చేస్తుంది.
ఎలాంటి రాజకీయ అజెండాలు, అనవసర ప్రచారాలు జోడించకుండా కేవలం బాబా వ్యక్తిత్వం, ఆయన నిస్వార్థ కరుణపైనే దృష్టి సారిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. బాబాగా నటుడు శోభినవ్ సత్య నటన హుందాగా, సహజంగా సాగింది. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో ఓపిక ఒకింత తక్కువే ఉంటుంది. అయితే ఆ ఓపికకి పరీక్ష పెట్టేలా కొన్ని మూమెంట్స్ ఈ సినిమాలో చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. వీటితో కొంచెం చూసే ఆడియెన్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకాస్త స్లోగా సాగదీతగా వెళుతుంది. ఇక మొత్తంగా చూస్తే, ‘హనుమాన్ అంశ్’ బలమైన భావోద్వేగాలతో కూడిన నిజాయితీగల ఆధ్యాత్మిక చిత్రం. అద్భుతమైన నేపథ్య సంగీతం, బాబా విషయంలో కొన్ని అబ్దుతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ నెమ్మదిగా సాగే కథనం కొంత సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ, నీమ్ కరోలీ బాబా భక్తులకే కాకుండా ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడే సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఒక దైవికతను నింపి ఆడియెన్స్ ని బయటకి పంపిస్తుంది.
మావోయిస్టు / నక్సల్స్ కాన్సెప్ట్ తెలుగు తెరపై వర్కవుట్ అవ్వదని 'ఆచార్య'తో ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ తరుణంలో 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ శ్రీవిష్ణు సినిమా అనౌన్స్ చేశారు. శ్రీవిష్ణు అంటే కామెడీ సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రతి కథకు ఓ కోర్ పాయింట్ ఉంటుంది. అది పాతదైనా ప్రేక్షకులకు తెలిసిన పాయింట్ అయితే దాని చుట్టూ ఎంత వినోదమైనా పండించవచ్చు. కామ్రేడ్ / మావోయిస్టు / నక్సల్ కాన్సెప్ట్ ఈతరం ప్రేక్షకులలో చాలా తక్కువ మందికి, మరీ ముఖ్యంగా థియేటర్లకు వస్తున్న యువతకు ఓల్డ్ కాన్సెప్టే. అయితే దర్శకుడు జానకిరామ్ పాత సినిమాల తరహాలో తీయడానికి ప్రయత్నించారు. 1990 వాతావరణాన్ని తెరపై చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్ అయ్యారు.
ఇక శ్రీవిష్ణుకు సవాల్ విసిరే క్యారెక్టర్ ఏమీ కాదు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, నటనతో ఈజీగా చేసేశారు. మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. సత్య మరోసారి తన ట్యాలెంట్ చూపించారు. ఫైనల్ గా 'కామ్రేడ్ కళ్యాణ్'లో కామెడీ ఉంది. పలు సన్నివేశాల్లో నవ్వించింది. అయితే... శ్రీవిష్ణు సినిమా అనేసరికి సహజంగా కొన్ని అంచనాలు ఏర్పడతాయి. వినోదం ఫుల్లుగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఆ స్థాయిలో సినిమా లేదు. కామ్రేడ్ కాన్సెప్ట్ కొంత కామెడీకి హెల్ప్ అయ్యింది కానీ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంలో హెల్ప్ చేయలేదు. శ్రీవిష్ణుతో పాటు సత్య నవ్వించారు. వాళ్ళ వినోదం కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.
నక్సల్ బ్యాక్ డ్రాప్ కి ఫన్, ఎంటర్టైన్మెంట్ని జోడించి, అందులోని హ్యూమర్ ప్రధానంగా చేసుకొని రూపొందిన చిత్రమే కామ్రేడ్ కళ్యాణ్. అదే సమయంలో చిన్నపాటి సందేశాన్ని కూడా ఇందులో మేళవించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శ్రీవిష్ణు వన్ సైడ్ కామెడీతో నడిపిస్తాడు. మధ్యలో సత్య హెల్ప్ అవుతాడు. ఇక సెకండాఫ్‌లో.. తాను నక్సల్ కాదని నిరూపించుకునే ప్రయత్నం చుట్టూ సాగుతుంది. అటు నక్సల్స్ కి, ఇటు పోలీసులకు మధ్య శ్రీవిష్ణు, సత్య నలిగిపోతూ వారిని మ్యానేజ్ చేసే ప్రయత్నం కొంత ఉత్కంఠభరితంగా, మరికొంత ఫన్నీగా ఉంటుంది. అయితే మూవీలో చాలా వరకు బలవంతపు కామెడీ కనిపించింది.
అదే సమయంలో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దాన్ని కామెడీగా చూపించడం కనెక్టింగ్ గా లేదు. ఈ అంశాలు పక్కన పెడితే మాత్రం ఇదొక మంచి సందేశాత్మక, అదే సమయంలో నక్సల్స్ పేరుతో జరిగే మోసాలకు సంబంధించి అవగాహన కలిగించే మూవీ. అయితే ఫన్ జనరేట్ చేయడంలో ఇంకా ఫోకస్ చేయాల్సింది. కానీ చాలా వరకు మెప్పించాడు. కామెడీని ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటే సినిమా అదిరిపోయేది. ఫైనల్ గా సరదాగా నవ్వులు పూయించే కామ్రేడ్ కళ్యాణ్. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు.
ముందుగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఒక ఫక్తు లైట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కామెడీ ఎంటర్ టైనర్. అలాంటి ఈ కథలో ఎదో కొత్తదనం డిఫెరెంట్ స్క్రీన్ ప్లే లాంటివి ఎక్స్ పెర్ట్ చేస్తే, సీన్స్ వైజ్ మాత్రమే సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఈ మధ్య రావడం లేదు, కాబట్టి అలాంటి మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం సినిమా బాగానే నచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో లూప్ హోల్స్ ఉన్నాయి. అక్కడక్కడా కథ డ్రాగ్ అవుతుంది. ఎటు నుండి ఏటో వెళుతుంది అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ గా కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం, బోర్ అనిపించే రేంజ్ లో సీన్స్ పెద్దగా లేకుండా
సినిమా ఒక ఫ్లోలో సీన్ బై సీన్ వెళుతూ ఉంటుంది.
ఇక మరోసారి శ్రీ విష్ణు తన కామెడీతో మెప్పించాడు. డైలాగ్స్ మరోసారి యూత్ ను బాగానే టార్గెట్ చేయగా, సత్య కూడా మరోసారి తన కామెడీ టైమింగ్ తో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపించగా సంగీతం ఓకే అనిపించేలా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు బాగానే అనిపించగా, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినట్లు అనిపించింది. మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైంకి డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు. ఫైనల్ గా అద్బుతం కాకున్నా కానీ ఉన్నంతలో డీసెంట్ ఎంటర్ టైన్ మెంట్ తో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ బాగానే ఆకట్టుకుంటుంది. మరీ ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకుని వెళితే యావరేజ్ గా అనిపించవచ్చు.
మాములుగా శ్రీవిష్ణు సినిమాలో కాస్త కామెడీ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా సినిమా పాసైపోతుంది. ఇక కామ్రేడ్ కల్యాణ్ నక్సల్స్ నేపథ్యమున్న సినిమా అని ట్రైలర్ లో చెప్పినా, శ్రీవిష్ణు మార్కు కామెడీ ఉంటుందని నమ్మకం పెంచుకున్నారు ఆడియన్స్. సాధారణంగా అన్నల సినిమాలంటే సీరియస్‌గా సాగుతుంటాయి. అయితే ఇది అందుకు భిన్నం. పూర్తిగా వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. ఇక సినిమా ఫస్టాఫ్ అంతా హీరో హీరోయిన్ల ప్రేమ, సత్య కామెడీలతో సరదాగా సాగితే, సెకెండాఫ్‌లో అదే కొరవడింది. కథ అన్నల నేపథ్యంలోకి వెళ్లడంతో పెద్దగా కామెడీ పండించడానికి ఆస్కారం లేకుండా పోయింది.
అయితే మంత్రి కిడ్నాప్ తో మళ్లీ కథ కామెడీ ట్రాక్ లో పడుతుంది. అడవి సన్నివేశాలు సినిమా స్పీడ్‌ను కాస్త తగ్గించిన భావన కలిగింది. అందులోనూ సత్య కనిపించిన ప్రతిసారీ కామెడీ బాంబు వేసే వెళ్తాడు. క్లైమాక్స్ మాత్రం తేలిపోయినట్టుంది. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్ అయినా కామెడీ జానర్ సినిమా కాబట్టి పట్టించుకోవాలనే ఆలోచన రాకుండా రైటర్స్ జాగ్రత్త పడ్డారు. ఆచార్య దళం, ప్యారడైజ్ కాకి వంటి డైలాగ్ లు నవ్వులు పూయించాయి. గతంలో వచ్చిన నక్సల్ సినిమాల రిఫరెన్స్ లు ఆకట్టుకుంటాయి. అయితే కామెడీకి కేరాఫ్ అయిన శ్రీవిష్ణు సినిమా కాబట్టి సినిమా క్లైమాక్స్ మరోలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కామెడీ సినిమాకు లాజిక్కులతో పని ఉండదు కాబట్టి.. నవ్వులు కావాలనుకునేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈవారం పెద్ద చిత్రాలేమీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.
కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ తీరు.. ఇలా ఏ యాంగిల్లోంచి చూస్తే ఆ యాంగిలోలో తప్పులు, ఒప్పులు కనిపిస్తాయి. ఇదొక సీరియస్ సబ్జెక్ట్. కృష్ణ వంశీ లాంటి దర్శకుడే సింధూరం అనే చిత్రంతో ఓ ప్రయోగం చేశాడు. ఎవరి సైడ్ తీసుకోకుండా.. నిర్ణయం ఏంటి? అన్నది ప్రేక్షకులకే వదిలేశాడు. ఇక చాలా సినిమాల్లో అన్నలనే హీరోలుగా చూపించారు. కొన్ని చిత్రాల్లో పోలీసులనే హీరోలుగా చూపించారు. ఇలా ఎవరి కోణం వారికి ఉంటుంది. అలాంటి సీరియస్ సబ్జెక్ట్‌లను తీసుకుని భాను, నందు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాసుకున్నారు. ప్రతీ చోటా సిల్లీ, లాజిక్ లెస్ సీన్లు, జబర్దస్త్ టైపులో కామెడీ పంచుల్ని రాసుకుని నడిపించారు. వినోదం పరంగా చూసుకుంటే కామ్రేడ్ కళ్యాణ్ నవ్విస్తుంది. కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం కామ్రేడ్ కళ్యాణ్ సిల్లీ అనిపిస్తుంది.
సుదర్శన్ శ్రీవిష్ణు.. సత్య, శ్రీ విష్ణు కాంబోలో వచ్చే సీన్స్ నవ్విస్తాయి. రాధిక శరత్ కుమార్ పాత్ర కూడా కాస్త ఎంటర్టైనింగ్గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నారు మేకర్స్. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా రాసుకున్నారు చివరకు వచ్చేసింది.. ఏదో ముగించేయాలి కాబట్టి.. అర్జెంట్‌గా అందరూ మారిపోవాలి అన్నట్టుగా సీన్స్ సాగుతాయి. ఓవరాల్ గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైం పాస్ వీకెండ్ సినిమాగా నిలుస్తుంది. కాసేపు నవ్వుకోవాలి.. శ్రీ విష్ణు, సత్య కామెడీని ఎంజాయ్ చేయాలి అని అనుకునేవారు ఈ సినిమాని ఓ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
సీరియస్ సినిమాలతో మొదలుపెట్టి.. కామెడీ వైపు టర్న్ అయి.. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకువచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం అన్నది చాలా సీరియస్.. సెన్సెటివ్ సబ్జెక్ట్. హీరో ఆ అవతారం ఎత్తాడంటే ఆ కథ నడిచే టోనే వేరుగా ఉంటుంది. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు థియేటర్లో కూర్చుంటే.. మొత్తం కామెడీనే ఉంది. పైగా ఈ కథ కొంచెం మింగుడుపడనట్లే సాగుతుంది. నక్సలైట్లు ఇంత సిల్లీగా వ్యవహారాలు నడుపుతారా.. పోలీసులు ఇంత డమ్మీగా ఉంటారా.. ఒక మామూలు కుర్రాడు ఇద్దరితో ఇలా ఆడేసుకుంటాడా అనిపించేలా ఇందులో కథ నడుస్తుంది.
కానీ కథ-పాత్రల గురించి ఎక్కువ ఆలోచించకుండా.. లాజిక్కులేమీ పట్టించుకోకుండా.. కేవలం కామెడీ మీదే ఫోకస్ చేసి నవ్వుకుంటాం అంటే మాత్రం శ్రీవిష్ణు అండ్ గ్యాంగ్ టైంపాస్ వినోదాన్ని అందిస్తుంది. కానీ స్క్రిప్టులో బిగి మాత్రం లేదు. నక్సలిజం మీద కథను మరీ ఇంత నాన్ సీరియస్ గా నడిపించడం మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ కామెడీని బాగానే డీల్ చేయగలడనడానికి అనేక సన్నివేశాలు రుజువుగా నిలుస్తాయి. తన కామెడీ ఫ్లో బాగుంది. కానీ సీరియస్ గా కథ చెప్పాల్సిన చోట మాత్రం మరీ తేలిగ్గా నడిపించేశాడు. చివరగా కామ్రేడ్ కళ్యాణ్..శ్రీవిష్ణు-సత్యల కామెడీ కోసం ఓసారి చూసేయొచ్చు.
దర్శకులు జానకిరామ్ మారెళ్ల, రచయితలు భాను భోగవరం, నందు సావిరిగన టీమ్ రాసుకొన్న ఈ కామ్రేడ్ కళ్యాణ్ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేలవించి వండిన ఫన్ ఒక కిచిడి. ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా కాకుండా సరదాగా రెండున్నర గంటలపాటు ఎంటర్టైన్మెంట్ పంచడానికి చాలా కన్వినియెంట్ స్క్రీన్ ప్లే తో తమకు అనుకూలంగా కథను, సన్నివేశాలను పేర్చుకొన్న చిత్రంగా చెప్పవచ్చు. శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కామెడీ, కమెడియన్ సత్య, సుదర్శన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.
రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓవరాల్ గా చిన్న లవ్ స్టోరి, ఇంటర్వెల్ టిస్ట్, నక్సలైట్ల ఎపిసోడ్, ఎమోషనల్ క్లైమాక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. చివర్లో చిన్న సందేశంతో ఈ సినిమా సీరియస్ సినిమా కాదు.. వినోదాత్మక చిత్రమని చెప్పే ప్రయత్నం చేశారు.ఇక టెక్నికల్ గా సాయి శ్రీరాం అడవి అందాలను బాగా కెమెరాలో బంధించాడు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పరంగా ఒకే. ఓవరాల్ గా సినిమా నుంచి ఎక్కువగా ఆశించకుండా సరదాగా ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న సినిమాగా చెప్పొచ్చు. భారీ అంచనాలతో వెళితే నిరాశపడే ప్రమాదం ఉంది. కాబట్టి కామెడీ, ఫన్ అంశాలను దృష్టిలో పెట్టుకొని వెళితే టైంపాస్ మూవీ అనే ఫీలింగ్ తో బయటకు రావొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers