Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

679
Total Reviews
103
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 37-48 of 679 reviews
Clear all filters

Sigma Movie Review

Tupaki

By Tupaki

4.0
out of 10
విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మా’ అంటూ జెన్ జీ వాడే పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడే కానీ.. కథాకథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపో...

విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మా’ అంటూ జెన్ జీ వాడే పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడే కానీ.. కథాకథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు సంజయ్.


హీరో-విలన్ల మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మినిమం ఇంట్రెస్ట్ కలిగించదు. చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు ఉంటుంది తప్ప.. కథ ముందుకే కదలదు. హీరో హీరోయిన్ల ట్రాక్ అయితే అసలెందుకు పెట్టారో అర్థం కాదు. సందీప్ కిషన్ గురు పాత్రలో బాగానే నటించాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ఇక థమన్ మ్యూజిక్ బాగానే ఉన్నా, కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల బీజీఎం చాలా చోట్ల అతిగా అనిపిస్తుంది. ఓవరాల్ గా జేసన్ సంజయ్ కి కావాల్సిన వనరులన్నీ బాగానే సమకూరినా.. బలహీనమైన స్క్రిప్ట్.. సాధారణమైన టేకింగ్ తో అన్నింటినీ వేస్ట్ చేశాడు. తన అనుభవలేమి అడుగడుగునా కనిపించింది. కొన్ని సీన్లు చూస్తే.. జేసన్ ను ఎవరూ సరిగా గైడ్ చేయలేదనిపిస్తుంది. చివరగా ‘సిగ్మా’.. ఆసక్తి లేని క్యాట్ అండ్ మౌస్ గేమ్!


Oct 03, 2026 Tamil +1

Sigma Movie Review

5.0
out of 10
యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. సినిమా ఆరంభం లోనే ఇది ఎలాంటి కొత్తదనం లేని చాలా పాత, రొటీన్ కథతో మొదలయింది అని అర్ధం అవుతుంది. ఒక సాధారణ పాయింట్ ను...

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. 


సినిమా ఆరంభం లోనే ఇది ఎలాంటి కొత్తదనం లేని చాలా పాత, రొటీన్ కథతో మొదలయింది అని అర్ధం అవుతుంది. ఒక సాధారణ పాయింట్ ను తీసుకోవడం పర్వాలేదు కానీ, సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం బిగ్ మైనస్ అయ్యింది. సినిమా ఆరంభమే డల్ గా ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ ట్రాక్ లు కూడా ఎలాంటి సోల్ లేకుండా కనిపిస్తాయి.


ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘సిగ్మా’ ఒక బోరింగ్ యాక్షన్ ట్రీట్ గా మిగిలిపోయింది. హీరో సందీప్ కిషన్ తన వల్ల అయ్యినది అంతా ఈ సినిమా కోసం పెట్టేసాడు. తన హార్డ్ వర్క్, సిన్సియార్టీ ఇందులో కనిపిస్తుంది. కానీ జాసన్ కథా, కథనాల్లోనే చాలా బలహీనత ఉంది. సో హీరో ఆకట్టుకున్నా దర్శకుడు పనితనం ఇందులో డిజప్పాయింట్ చేస్తుంది. సో ఈ సినిమా ఆకట్టుకోదు.


Oct 03, 2026 Tamil +1

Sigma movie review

5.0
out of 10
‘సిగ్మా’ అనే టైటిల్ చూసి కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. అసలే డెబ్యూ డైరెక్టర్.. పైగా దళపతి విజయ్ కొడుకు.. కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుని ఉంటారు. కానీ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే మాత్రం ‘సిగ్మా’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందని అర్థం అవుతుంది. ‘సిగ్మా’ మేకింగ్‌ లో ఎలాంటి పొరబాట్లు కనిపించవు. కానీ రైటింగ్‌లో మాత్రం చాలా వరకు వీక్ అనిపిస్తుంది. జాసన్ సంజయ్.. కథని సరిగ్గా...

‘సిగ్మా’ అనే టైటిల్ చూసి కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. అసలే డెబ్యూ డైరెక్టర్.. పైగా దళపతి విజయ్ కొడుకు.. కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుని ఉంటారు. కానీ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే మాత్రం ‘సిగ్మా’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందని అర్థం అవుతుంది. ‘సిగ్మా’ మేకింగ్‌ లో ఎలాంటి పొరబాట్లు కనిపించవు. కానీ రైటింగ్‌లో మాత్రం చాలా వరకు వీక్ అనిపిస్తుంది. జాసన్ సంజయ్.. కథని సరిగ్గా రాసుకోలేకపోయాడని అర్థం అవుతోంది. ఎమోషన్స్, లాజిక్స్ ఇలా అన్నింటినీ గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది.


ఫస్ట్ హాఫ్ లో ఒక్కటంటే ఒక్క కొత్త సీన్ కూడా కనిపించదు. ఇక సెకండాఫ్ ఆరంభమే.. ముగింపు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ప్రీ క్లైమాక్స్‌కే థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఎండింగ్‌ ఏంటో తెలిసిపోతుంది. అలా ఎక్కడా కూడా వావ్ అనిపించే మూమెంట్స్ కనిపించకపోవడంతే.. నీరసంగా, నిదానంగా అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. టెక్నికల్‌ గా సిగ్మా కొంత వరకు మెప్పిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. తమన్ పాటల కంటే ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగానే అనిపిస్తుంది. మిగిలిని అన్ని డిపార్ట్మెంట్స్ పర్లేదనిపిస్తాయి. చివరగా ‘సిగ్మా’ మీద భారీ అంచనాలు పెట్టుకోకుండా.. టైం పాస్ కోసం వస్తే.. పాటలు, ఫైట్స్, కొన్ని కామెడీ సీన్స్ అంటూ ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేసే అవకాశం ఉంది. ఇక సందీప్ కిషన్ తన వంతుగా ప్రయత్నించినా.. జాసన్ సంజయ్ రైటింగ్ మాత్రం తేలిపోయిందని చెప్పుకోవచ్చు.


Oct 03, 2026 Tamil +1
5.0
out of 10
ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు ప్రధాన బలం ఫహద్ ఫాజిల్ నటన. పూర్తిస్థాయి ఫాంటసీ కామెడీ పాత్రలో ఆయన తన టైమింగ్, ముఖ కవళికలు, స్వయంగా చెప్పుకున్న తెలుగు డైలాగ్ డెలివరీతో సీన్లను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ తన తొలి తెలుగు చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరిచింది. వారితో పాటు ఉండే బీగల్ కుక్క పిల్ల సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే కథ, కథనంలో సరైన భావోద్వేగాలు లే...

ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు ప్రధాన బలం ఫహద్ ఫాజిల్ నటన. పూర్తిస్థాయి ఫాంటసీ కామెడీ పాత్రలో ఆయన తన టైమింగ్, ముఖ కవళికలు, స్వయంగా చెప్పుకున్న తెలుగు డైలాగ్ డెలివరీతో సీన్లను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ తన తొలి తెలుగు చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరిచింది. వారితో పాటు ఉండే బీగల్ కుక్క పిల్ల సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే కథ, కథనంలో సరైన భావోద్వేగాలు లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన బలహీనత. ట్రైలర్లోనే కథాంశం చాలా వరకు బయటపడటంతో స్క్రీన్‌పై కొత్తదనం లోపించింది.


ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు వర్కవుట్ అయినప్పటికీ.. సెకండాఫ్‌లో వచ్చే విచారణ ట్రాక్ కథనాన్ని బాగా నెమ్మదింపజేస్తుంది. కథలో బలమైన ఘర్షణ లేకపోవడం వల్ల క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా పండకపోవడం మైనస్ పాయింట్ గా నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా అక్కడక్కడా మాత్రమే నవ్వించే ఓ సగం పండిన ఫాంటసీ డ్రామా. ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన, చిన్నారి సారా పాలేకర్ క్యూట్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.


Oct 02, 2026 Tamil +2
`డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌` మూవీ టైటిల్‌తోనే ఆసక్తిని పెంచింది. ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించడం, ట్రైలర్‌లో మ్యాజికల్‌ అంశాలు ఆకట్టుకోవడం, బిగ్‌ స్టార్స్ సినిమా బాగుందని ట్వీట్లు చేయడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం వెనకబడిందని చెప్పొచ్చు. మెయిన్‌గా టైటిల్‌ కి, కథకి ఏమాత్రం సంబంధం కనిపించలేదు. ఈ మూవీ చిన్నారి పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప ఎవరికీ కనిపించదు,...

`డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌` మూవీ టైటిల్‌తోనే ఆసక్తిని పెంచింది. ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించడం, ట్రైలర్‌లో మ్యాజికల్‌ అంశాలు ఆకట్టుకోవడం, బిగ్‌ స్టార్స్ సినిమా బాగుందని ట్వీట్లు చేయడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం వెనకబడిందని చెప్పొచ్చు. మెయిన్‌గా టైటిల్‌ కి, కథకి ఏమాత్రం సంబంధం కనిపించలేదు. ఈ మూవీ చిన్నారి పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప ఎవరికీ కనిపించదు, మరి ఆత్మనా? దేవతా? అనే సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. 


అయితే సినిమా ద్వారా ఫన్‌ చూపించాలనుకున్నారా? ఎమోషనల్‌ గా చూపించాలనుకున్నారా? మ్యాజిక్‌ చుట్టూ తిప్పాలనుకున్నారా అనేది క్లారిటీ మిస్‌ అయ్యింది. సినిమా ప్రారంభంలో హీరో పాత్ర తాలూకు క్యారెక్టరైజేషన్‌ని ఎస్టాబ్లిష్‌ చేశారు. అది సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ తర్వాత రొటీన్‌గా మారుతుంది. ఇక బేబీ దివ్య పాత్ర ఎంట్రీ తర్వాత మరికొంత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కానీ ఆ తర్వాత అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. లాజిక్‌ లెస్‌గానూ అనిపిస్తుంది. ఇక ఆ పాపకి సంబంధించిన ట్విస్ట్ ఆడియెన్స్ కి ముందే అర్థమవుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. అమ్మాయి పాత్ర తాలుకూ ట్విస్ట్, సస్పెన్స్ రివీల్‌ కావడం ఎమోషనల్‌గా ఉంటుంది. ఎండింగ్‌ కూడా ఎమోషనల్‌గా ముగించారు. ఫైనల్‌ గా క్లైమాక్స్ కాసేపు తప్ప మిగిలినదంతా ట్రబులే. మ్యాజిక్‌ చేయలేకపోయిన `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌`.


Oct 02, 2026 Tamil +2
5.0
out of 10
Don’t Trouble The Trouble is a comedy-fantasy film that attempts to blend a whimsical Disney-Pixar-like feel with fantasy, adventure and emotion. It marks Fahadh Faasil’s first Telugu film in a leading role and carries its own curiosity with the names attached to it. Positives:Suri (Fahadh) and Divya’s (Ssara) bondEmotional portions towards the climaxNegatives:Uneven ScreenplayWeak Antagonist...

Don’t Trouble The Trouble is a comedy-fantasy film that attempts to blend a whimsical Disney-Pixar-like feel with fantasy, adventure and emotion. It marks Fahadh Faasil’s first Telugu film in a leading role and carries its own curiosity with the names attached to it. 


Positives:

Suri (Fahadh) and Divya’s (Ssara) bond

Emotional portions towards the climax


Negatives:

Uneven Screenplay

Weak Antagonist Characterisation

Lack Of Emotional Connect


Don’t Trouble The Trouble clearly intends to be a whimsical fantasy adventure with a Disney-Pixar-like emotional touch. The deliberate attempt to give the two central characters, a touch of Disney animation character-like nuances, was clearly to be seen. The makers of the film used the two central characters and packaged it with fantasy, comedy and emotion. And, the result is a fairly engaging film which has its own bit of flaws.


An interesting premise, a very lovable performance by Ssara Palekar, a heart-touching performance by Fahadh Faasil during the pre-climax and a few funny moments around the fantasy element, made Don’t Trouble The Trouble, a fairly engaging film. A bit more care in writing, would have made the film much better.


Bottom Line: Some Trouble – But Not Troublesome


Rating – 2.5/5

Oct 02, 2026 Tamil +2
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా చూశాక కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథనంలో స్పీడ్ లేకపోవడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద మైన్స్ పాయింట్. హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడే ఒక్క సీన్‌లో మాత్రమే థియేటర్‌లో కాస్త నవ్వులు పూస్తాయి. ఆ ఒక్క చోట ఊహించని మంచి వైబ్ క్రియేట్ అయినా, దానికి ముందు గానీ, తర్వాత గానీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు శశాంక్ పూర...

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా చూశాక కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథనంలో స్పీడ్ లేకపోవడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద మైన్స్ పాయింట్. హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడే ఒక్క సీన్‌లో మాత్రమే థియేటర్‌లో కాస్త నవ్వులు పూస్తాయి.


ఆ ఒక్క చోట ఊహించని మంచి వైబ్ క్రియేట్ అయినా, దానికి ముందు గానీ, తర్వాత గానీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు శశాంక్ పూర్తిగా విఫలమయ్యాడు. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి ఇది కంప్లీట్ హెడేక్ లా అనిపిస్తుంది.


ఫైనల్ గా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే టైటిల్ కి కథకి లింకు సంగతి పక్కన పెడితే, ఆడియన్స్ ని మాత్రం ద్వితీయార్థం కొంత, ప్రీ క్లైమాక్స్ కొంత ట్రబుల్ కి గురి చేస్తుంది. 


Oct 02, 2026 Tamil +2
ఓపెనింగ్స్ కోసమని సినిమాలకు ఓవర్ హైప్ క్రియేట్‌ చేస్తే అవి అసలుకే ఎసరు పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకుడికి, భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్ళే వారికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సినిమా ఏ మాత్రం అటూ ఇటూ ఉన్నా.. అంచనాలతో వెళ్ళే వారు పెదవి విరవడం ఖాయం. డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్‌ మూవీ విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్‌ స్టార్స్ పాజిటివ్‌ రివ్యూ...

ఓపెనింగ్స్ కోసమని సినిమాలకు ఓవర్ హైప్ క్రియేట్‌ చేస్తే అవి అసలుకే ఎసరు పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకుడికి, భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్ళే వారికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సినిమా ఏ మాత్రం అటూ ఇటూ ఉన్నా.. అంచనాలతో వెళ్ళే వారు పెదవి విరవడం ఖాయం. డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్‌ మూవీ విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్‌ స్టార్స్ పాజిటివ్‌ రివ్యూస్ ఇవ్వడంతో అంచనాలు అంబరాన్ని తాకాయి. కానీ కథాంశంలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన లోటు.


హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడినప్పుడు థియేటర్ లో నవ్వుల జల్లలు కరుస్తాయి. ఓ ఊహించని వైబ్ క్రియేట్‌ అయ్యింది. కానీ దానికి ముందు లేదా తర్వాత అలాంటి స్పందన కనిపించలేదు. ముఖ్యంగా ఎమోషన్స్ ను పండించడంలో దర్శకుడు శశాంక్‌ విఫలమయ్యాడు. సినిమాలో అసలు కథ, కథనాలలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది. ఓవరాల్ గా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాబట్టి పేరెంట్స్ కిడ్స్ తో కలిసి థియేటర్స్ కు వెళితే, కొంతలో కొంత ఫలితం దక్కొచ్చు!


Oct 02, 2026 Tamil +2
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు దర్శకుడు శశాంక్ యేలేటి చెప్పాలనుకొన్న బేసిక్ పాయింట్ చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఆయన రాసుకొన్న బ కథలో క్లారిటీ లేకపోవడం, చెప్పాలనుకొన్న స్టోరిని ఎమోషనల్‌గా చెప్పలేకోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పాలి. ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్‌ను ప్రారంభంలో బాగా రాసుకొన్నాడు. కానీ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా గ్యాప్ తీసుకోవడంతో కథ అక్కడక్కడే తిరుగుతూ సహనాన...

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు దర్శకుడు శశాంక్ యేలేటి చెప్పాలనుకొన్న బేసిక్ పాయింట్ చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఆయన రాసుకొన్న బ కథలో క్లారిటీ లేకపోవడం, చెప్పాలనుకొన్న స్టోరిని ఎమోషనల్‌గా చెప్పలేకోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పాలి. ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్‌ను ప్రారంభంలో బాగా రాసుకొన్నాడు. కానీ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా గ్యాప్ తీసుకోవడంతో కథ అక్కడక్కడే తిరుగుతూ సహనానికి పరీక్ష పెడుతుంది. 


అయితే సెకండాఫ్‌లోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాడా? అని ఎదురు చూసిన వాళ్లకు నిరాశ మిగిలింది. అవసరం లేకున్నా సాగదీసినట్టు ఉండే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మూవీ డెస్టినీ ఏమిటో డిసైడ్ అయినట్టు అర్ధమవుతుంది. ఇక దివ్యకు సంబంధించిన స్టోరిని చివర్లో ఓపెన్ చేసినప్పటికీ.. చాలా పేలవంగా ఉండటంతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయింది. ఇక క్లైమాక్స్ ఇంకా నాసిరకంగా ఉండటం, పాత చింతకాయ పచ్చడి తరహా ముగింపుతో ఈ సినిమా అతి సాధారణం అనే విషయానికి క్లారిటీ వచ్చింది. ఓవరాల్ ఓవరాల్ గా కథ, కథనాలపై దర్శకుడు ఇంకా బెటర్‌గా వర్కవుట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాం.



Oct 02, 2026 Tamil +2
5.0
out of 10
ఫాంటసీ కథల్ని సరిగా డీల్ చేస్తే.. భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. లాజిక్ తో సంబంధం లేకుండా ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవాలి. ఎమోషన్ కూడా పండేలా చూసుకోవాలి. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’లో కొంతమేర ఆ ప్రయత్నం జరిగింది. కొన్ని క్రేజీ సీన్లతో వినోదాన్ని పంచగలిగారు. లీడ్ క్యారెక్టర్లు బాగున్నాయి.. వాటిని పోషించిన ఆర్టిస్టులూ ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఎమోషన్ కూడా కొంత వర్కవ...

ఫాంటసీ కథల్ని సరిగా డీల్ చేస్తే.. భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. లాజిక్ తో సంబంధం లేకుండా ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవాలి. ఎమోషన్ కూడా పండేలా చూసుకోవాలి. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’లో కొంతమేర ఆ ప్రయత్నం జరిగింది. కొన్ని క్రేజీ సీన్లతో వినోదాన్ని పంచగలిగారు. లీడ్ క్యారెక్టర్లు బాగున్నాయి.. వాటిని పోషించిన ఆర్టిస్టులూ ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఎమోషన్ కూడా కొంత వర్కవుట్ అయింది. కానీ మరీ ప్రెడిక్టబుల్ గా ఉండే కథ.. కొన్ని ఇల్లాజికల్ సీన్లు.. సరిగ్గా కుదరని పేఆఫ్ వల్ల మ్యాజిక్ పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు.



ద్వితీయార్ధంలో మాత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ నిరాశపరుస్తుంది. ప్రథమార్ధం ఉన్న ఫన్ అంతా ఉన్నట్లుండి మాయమైపోతుంది. కథలో పెద్దగా సర్ప్రైజులు లేకుండా.. చాలా సాధారణమైన సన్నివేశాలతో నడించే ద్వితీయార్ధం ఎంగేజింగ్ గా అనిపించదు. సుదీర్ఘంగా సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ బోర్ కొట్టిస్తుంది. ఆ సీన్ పర్పస్ ఏంటో అర్థం కాదు. హీరో-పాప మధ్య బలమైన బాండింగ్ ను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఎమోషన్ పండించడానికి అవకాశముండేది. పాప తల్లిదండ్రులకు సంబంధించి ఇందులో పెట్టిన ఒక ఎపిసోడ్ ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ కొంతమేర వినోదాన్ని పంచినా.. అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. చివరగా: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. కొంచెం ఫన్- ఎక్కువ ట్రబుల్.

Oct 02, 2026 Tamil +2
6.0
out of 10
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో ఏం తెలియని ఓ పాప ఆత్మ చుట్టూ డ్రామా సాగుతుంది. దీనికి తోడు, ఈ సినిమాలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు...

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో ఏం తెలియని ఓ పాప ఆత్మ చుట్టూ డ్రామా సాగుతుంది. దీనికి తోడు, ఈ సినిమాలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే.. సినిమా మొదట్లో కాన్ ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది.


‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ వచ్చిన ఈ హారర అండ్ ఎమోషనల్ డ్రామాలో.. హారర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఫాహద్ ఫాజిల్ నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. ఐతే, కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం కొన్ని చోట్లే ఆకట్టుకుంది.


Oct 02, 2026 Tamil +2
ఫాహద్ ఫాజిల్ ఓ తెలుగు కథకి ఓకే చెప్పి.. హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానికి తగ్గట్టుగా రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారంతా కూడా ప్రమోషన్స్‌లో తమ వంతు సాయం చేశారు. దీంతో సినిమా మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. అయితే సినిమా చూసాక కథ గురించి చెప్పుకుంటే... ఓ గమ్యం అంటూ లేకుండా డబ్బు కోసం ఏ పని అయినా చేసే ఓ వ్యక్తి.. అతడికి మాత్రమే కనిపించే ఓ ఆత్మ.. ఆ ఆత్మకి ఓ...

ఫాహద్ ఫాజిల్ ఓ తెలుగు కథకి ఓకే చెప్పి.. హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానికి తగ్గట్టుగా రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారంతా కూడా ప్రమోషన్స్‌లో తమ వంతు సాయం చేశారు. దీంతో సినిమా మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. అయితే సినిమా చూసాక కథ గురించి చెప్పుకుంటే... ఓ గమ్యం అంటూ లేకుండా డబ్బు కోసం ఏ పని అయినా చేసే ఓ వ్యక్తి.. అతడికి మాత్రమే కనిపించే ఓ ఆత్మ.. ఆ ఆత్మకి ఓ ఫ్లాష్ బ్యాక్.. ఆ ఆత్మ ఈ వ్యక్తికి సాయం చేయడం.. మళ్లీ ఈ వ్యక్తి ఆ ఆత్మకి సాయం చేయడం అనే పాయింట్‌తో ఈ సినిమాని శశాంక్ రాసుకున్నాడు. అయితే ఇలాంటి కథల్ని మనం ఇది వరకే చూశామే.. అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా ఒక్క చోట కూడా కొత్త సీన్ కనిపించదు.


లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి చూద్దామన్నా కూడా ఎమోషన్ కూడా క్యారీ కాదు. ఎక్కడా కూడా అరెరె పాపం.. అయ్యో.. అన్న ఫీలింగ్ కూడా కలగదు. అయితే చిన్న పిల్లలకు అంతో ఇంతో ఈ మ్యాజిక్ నచ్చడం, దివ్య పాత్ర కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫహాద్, సారా కాంబో సీన్స్ కొన్ని చోట్ల ఆడియెన్స్‌కి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కథ, కథనంలోనే చాలా వరకు సోల్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. లాజిక్స్ మిస్ అవ్వడం, ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. చివరగా.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనేది ఆడియెన్స్‌ కి చాలా వరకు ట్రబుల్ ఇచ్చేలానే ఉంటుంది. అయితే పిల్లలు మాత్రం కాస్త రిలీఫ్‌గా ఫీలై ఎంజాయ్ చేసేలా ఉంటుంది.




Oct 02, 2026 Tamil +2
Why MRO?