దృశ్యం 3 (Drishyam 3)
ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అయిన దృశ్యం సిరీస్ లో భాగంగా తాజాగా "దృశ్యం 3" మూవీ థియేటర్లలో విడుదలైంది. మళయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ మూవీలో మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశారు.
Available in:
Reviews
What critics and the public are saying about దృశ్యం 3 (Drishyam 3)
Media Reviews
15 Avg: 5.5/10Average
Drishyam 3 movie Review
దృశ్యం 3 మూవీ చూసాక సింపుల్ గా చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. ఇక్కడితో దృశ్యం ప్రాంచైజ్ ని ఆపేస్తే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. సినిమాలో పెద్దగా కథా, కథనాలు ఈ మూడో పార్ట్ లో అంతగా ఆకట్టుకోలేదు, పైగా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. పైగా తెలుగు వెర్షన్ కి కనెక్ట్ అయిన ఆడియన్స్ ఒరిజినల్ కి కనెక్ట్ కాలేరు అంత...
దృశ్యం 3 మూవీ చూసాక సింపుల్ గా చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. ఇక్కడితో దృశ్యం ప్రాంచైజ్ ని ఆపేస్తే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. సినిమాలో పెద్దగా కథా, కథనాలు ఈ మూడో పార్ట్ లో అంతగా ఆకట్టుకోలేదు, పైగా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. పైగా తెలుగు వెర్షన్ కి కనెక్ట్ అయిన ఆడియన్స్ ఒరిజినల్ కి కనెక్ట్ కాలేరు అంత ఈజీగా.
ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. డీసెంట్ గా వెళ్తున్న సినిమాను క్లైమాక్స్ వరకు లాక్కొని వెళ్ళాడు డైరెక్టర్. కానీ మూడో పార్ట్ లో హీరో జార్జ్ చేసే పనులకు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవరు. ఎందుకంటే సప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లను కూడా ఆడియన్స్ కొన్ని ముందే ఇమాజిన్ చేసుకుంటారు. పైగా ఆ ట్విస్ట్ లకు విసిగిపోయారు. క్లయిమాక్స్ బాగున్నా, సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక ఆలోచిస్తే పెద్దగా ఏం లేదనిపిస్తుంది. ఓవరాల్ గా మోహన్ లాల్ వన్ మ్యాన్ షోతో మూవీకి బ్యాక్ బోన్ అయ్యారు. టెక్నికల్లి మూవీ ఓకే. బట్ కొత్తగా చెప్పడానికి మూవీ మూడో పార్ట్ లో ఎం లేదు. ఒకసారి చూసేలా ఉంది గాని, మరో పార్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేసేలా లేదు.
Hit
Drishyam movie Review 3
దృశ్యం 3 మూవీ గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్ నుండి పీక్స్ ఉంటది సినిమాలో. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్ధం కావు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మలయాళం వెర్షన్ కాబట్టి, తెలుగు వెర్షన్ వెంకటేష్ దృశ్యం చూసిన ఆడియన్స్ తొందరగా అర్...
దృశ్యం 3 మూవీ గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్ నుండి పీక్స్ ఉంటది సినిమాలో. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్ధం కావు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మలయాళం వెర్షన్ కాబట్టి, తెలుగు వెర్షన్ వెంకటేష్ దృశ్యం చూసిన ఆడియన్స్ తొందరగా అర్ధం కాక, కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చాలా మైనస్ అయింది. ఇంటర్వెల్ తప్పిస్తే మొత్తం డొల్ల. పైగా డబ్బింగ్ వరెస్ట్ గా ఉంది.
ఇక కథలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకోవడం మైనస్. సెకండ్ హాఫ్ కూడా బుర్రపాడు. కానీ ఒరిజినల్ ని ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ రాడ్ అయినా, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వా.. అన్న ఫీలింగ్ వస్తుంది. పైగా పార్ట్ 4 కి కూడా లీడ్ ఇచ్చారు. బట్ మెజారిటీ ఆడియన్స్ దృశ్యం ఇక్కడితో ఆపేస్తే బెటర్ అన్న కామెంట్స్ వస్తున్నాయి. యాక్టింగ్ వరకు అందరూ బాగా చేసారు. సో మోస్ట్ లీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాది. ఓవరాల్ గా ఈ మూవీకి 3.5 వరకు రేటింగు ఇవ్వొచ్చు.
Average
Drishyam 3 Movie Review
#Drishyam3 A below par third installment from the franchise with a flat narration and very basic writing!The director succeeds in building the mood of the film and creating tension in places, but this time the overall writing is unimpressive. Climax sequence is a bit better but the rest feels too ba...
#Drishyam3 A below par third installment from the franchise with a flat narration and very basic writing!
The director succeeds in building the mood of the film and creating tension in places, but this time the overall writing is unimpressive. Climax sequence is a bit better but the rest feels too basic and way too redundant.
The slow narration is expected, but when the twists themselves don’t land impactfully, it becomes hard to make this one work. Ends up disappointing and nowhere near the range of the first two parts!
Rating: 2.25/5
Above Average
Drishyam 3 Movie Review
మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం రెండు పార్టులకు మరో సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా దృశ్యం 3. తాజాగా థియేటర్స్ లో రిలీజయింది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మళయాలంలో హిట్ అవ్వడంతో వేరే భాషల్లోకి రీమేక్ అవగా, తెలుగులో వెంకటేష్ చేసారు. కానీ ఇప్పుడు పార్ట్ 3 మాత్రం మలయాళం సినిమానే తెలుగులో డబ్బింగ్ చేసారు. ఇక స...
మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం రెండు పార్టులకు మరో సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా దృశ్యం 3. తాజాగా థియేటర్స్ లో రిలీజయింది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మళయాలంలో హిట్ అవ్వడంతో వేరే భాషల్లోకి రీమేక్ అవగా, తెలుగులో వెంకటేష్ చేసారు. కానీ ఇప్పుడు పార్ట్ 3 మాత్రం మలయాళం సినిమానే తెలుగులో డబ్బింగ్ చేసారు. ఇక సినిమా విషయానికి వస్తే... మూవీ మొత్తం చాలా ఆర్డినరిగా సాగుతూ, పెద్దగా ఇంట్రెస్టింగ్ సీన్లు లేకుండా అలా సాగిపోయింది.
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు మాత్రం ఈ సారి సింపుల్ గానే ఉన్నాయి. అయితే మొదటి రెండు సినిమాల్లో ఉన్నంత బలంగా ఈ పార్ట్ 3లో ట్విస్ట్ లు లేకపోవడం గమనార్హం. గత రెండు సినిమాలు వరుణ్ మర్డర్ కేసు చుట్టూ తిరిగాయి, అతని అవశేషాలు కనపడకుండా జార్జ్ ఏం చేసాడు అని నడిపించారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ట్విస్ట్ లు. అయితే దృశ్యం 3 మాత్రం పాత కేసుకి లింక్ ఉన్నా ఒక రివెంజ్ డ్రామా, కూతుర్ని కాపాడుకోవడానికి తండ్రి ఏం చేసాడు అని రొటీన్ గా సాగుతుంది. పైగా చివర్లో అంజు విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లారిటీ ఇవ్వకుండా, సినిమాకు సరైన ముగింపు ఇవ్వకుండా కన్ఫ్యూజన్ ఇవ్వడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది.
ఓవరాల్ గా డైరెక్టర్ జీతూ జోసెఫ్ తన మార్క్ సాగదీసిన కథాంశం, వల్ల దృశ్యం 3 సినిమా మొదటి రెండు పార్టులని మించి ఆశించకుండా వెళ్లి చూస్తే ఓకే అనిపించొచ్చు. వాటికి మించి ఎక్కువ ఊహించి వెళ్తే కష్టం. దృశ్యం ఫ్యాన్స్ ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
Above Average
Drishyam 3 movie Review
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చివరి భాగం థియేటర్లలో వచ్చేసింది. అయితే టాప్ ఫ్రాంచైజీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కొత్తదనం లోపిస్తే...
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చివరి భాగం థియేటర్లలో వచ్చేసింది. అయితే టాప్ ఫ్రాంచైజీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కొత్తదనం లోపిస్తే ప్రేక్షకులకు కొంత విసుగు రావడం సహజం. దృశ్యం 3 విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కొత్త కోణంలో కథను చెబితే బాగుండేది కానీ.. మళ్లీ పాత సమస్యనే తిప్పి తిప్పి చూపించడం వల్ల కథనం కాస్త రొటీన్ గా అనిపిస్తుంది.
ఇక సినిమాలో జార్జ్ కుట్టి తన తెలివితేటలతో ఎలాగోలా బయటపడతాడు అనే విషయం ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడం వల్ల గత సినిమాల్లో లాగా థ్రిల్ ఫీల్ అవ్వలేము. భావోద్వేగాలు కూడా మునుపటి స్థాయిలో పండలేదు. ఇందులో ట్విస్టులు ఉండవని ముందుగానే దర్శకుడు చెప్పినా కూడా, ఇంత ఫ్లాట్ నెరేషన్ జీతూ జోసెఫ్ నుంచి ఊహించలేదు. జీతు జోసెఫ్ గత రెండు సినిమాలతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడం వల్ల మూడో భాగం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. క్లైమాక్స్ కూడా మునుపటి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. మొత్తానికి ఒక బలమైన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. దృశ్యం ఫ్రాంచైజీకి వీరాభిమానులు అయితే ఓకే కానీ నార్మల్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎక్కడం కష్టమే.
Average
Drishyam Movie Telugu
దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్, మీనానటించగా, ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్ వచ్చింది. అయితే గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో ప...
దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్, మీనానటించగా, ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్ వచ్చింది. అయితే గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయా? అంటే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి.
సినిమా ప్రారంభం నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథ ముందే తెలియడంతో ఇందులో కథనం ఊహించినట్టుగానే ఉంటుంది. దీనికితోడు కథలో ఇంటెన్సిటీ మూడ్ ని క్రియేట్ చేయడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నారు. దీంతో బోరింగ్ గా ఉంటుంది. మధ్య మధ్యలో థ్రిల్ ఎలిమెంట్లు ఒకటి రెండు యాడ్ చేశారు. కానీ అవి పెద్దగా కిక్ ఇవ్వవు. నటీనటుల పెర్ఫార్మన్స్ వరకు మోహన్ లాల్ సహా అందరూ బానే చేసారు. కానీ ఆ పాత్రలకు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఓవరాల్ గా స్లోగా, బోరింగ్ గా సాగే ఈ దృశ్యం 3 మూవీ, మధ్య మధ్యలో చిన్న మెరుపులు, క్లైమాక్స్ తో కాస్త ఆకట్టుకుంటుంది. అయితే గత రెండు సినిమాలతో పోల్చితే డిజప్పాయింట్ చేస్తుంది.
Average
Drishyam 3 movie Review
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన జీతు జోసెఫ్ ఈసారి ‘దృశ్యం-3’తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. తెలుగులో వెంకటేష్ మొదటి రెండు పార్ట్స్ ని రీమేక్ చేయగా, మూడో పార్ట్ రీమేక్ చేయలేదు. మలయాళ వెర్షన్ నే తెలుగులో నేరుగా రిలీజ్ చేసారు. ఒరిజినల్ వెర్షన్ దృశ్యం 3 లో జార్జ్ కుట్టి పాత్...
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన జీతు జోసెఫ్ ఈసారి ‘దృశ్యం-3’తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. తెలుగులో వెంకటేష్ మొదటి రెండు పార్ట్స్ ని రీమేక్ చేయగా, మూడో పార్ట్ రీమేక్ చేయలేదు. మలయాళ వెర్షన్ నే తెలుగులో నేరుగా రిలీజ్ చేసారు. ఒరిజినల్ వెర్షన్ దృశ్యం 3 లో జార్జ్ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ తన అనుభవంతో ఆకట్టుకున్నా… కథలో కొత్తదనం మాత్రం పెద్దగా కనిపించదు. గత భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో థ్రిల్, టెన్షన్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే ట్విస్టులు కూడా అంతగా పని చేయలేదు.
ఇక తెలుగు డబ్బింగ్ పర్లేదు గాని, కొన్ని చోట్ల డబ్బింగ్ నేచురల్ గా అనిపించదు. పైగా తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ బాగా కనెక్ట్ కావడంతో మోహన్‌లాల్ వెర్షన్ అందరికీ అంతగా దగ్గర కావడం కష్టమే. దర్శకుడిగా, రచయితగా జీతు జోసెఫ్ ఈసారి తన స్థాయి స్క్రీన్‌ప్లే చూపించలేకపోయాడు. బీజీఎమ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఓవరాల్‌గా మొదటి రెండు భాగాలతో కంపేర్ చేస్తే... ‘దృశ్యం-3’ ఒక యావరేజ్ థ్రిల్లర్‌గా మాత్రమే మిగిలిపోయింది.
Above Average
Drishyam 3 Movie Review
మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్ర...
మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్రం అంతగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు దృశ్యం అంటేనే అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు గుర్తుకొస్తాయి. కానీ దృశ్యం 3 మాత్రం ఆ స్థాయి మాయాజాలాన్ని పూర్తిగా అందుకోలేకపోయింది.
జీతు జోసెఫ్ పేరు వినగానే ప్రేక్షకులు పెద్ద ట్విస్టులు, తెలివైన కథనాన్ని ఆశిస్తారు. కానీ ఈసారి ఆయన కథను చాలా సాధారణంగా చెప్పిన భావన కలుగుతుంది. గత రెండు భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తదనం తక్కువగా కనిపిస్తుంది. ఇక గ్రామీణ వాతావరణాన్నయితే సహజంగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాల్సింది. మొదటి భాగంలో అనవసరంగా సాగదీసిన సన్నివేశాలు తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. ఓవరాల్ గా దృశ్యం 3 మూవీని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.
Average
Drishyam 3 Movie Review
దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో crime thrillerని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా తాజాగా ‘దృశ్యం-3’ విడుదల కాగా, మలయాళ డబ్ నే తెలుగులోనూ రిలీజ్ చేసారు. కథా, కథనాల గురించి మాట్లాడితే...
దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో crime thrillerని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా తాజాగా ‘దృశ్యం-3’ విడుదల కాగా, మలయాళ డబ్ నే తెలుగులోనూ రిలీజ్ చేసారు. కథా, కథనాల గురించి మాట్లాడితే ముందు భాగాల్లో ఉన్న ఆత్రుత, ఇంట్రెస్ట్ ఈ మూడో భాగంలో ఉండదు. మోహన్ లాల్ సహా మిగతా నటీనటులందరూ బాగానే చేసినా, కథలో మాత్రం ఒక wow factor కనిపించదు.
ఫస్టాఫ్ అంతా స్లో గా సాగదీసినట్టు ఉండడమే కాకుండా, ట్విస్టులు కూడా పెద్దగా షాక్ ఇవ్వవు. పైగా తెలుగు డబ్బింగ్ మేజర్ మైనస్ అయింది. డబ్బింగ్ సినిమాటిక్ గా, సహజంగా ఉండదు. ఓవరాల్ గా సినిమాలో క్లైమాక్స్ 20 నిముషాలు మినహా మొత్తం సినిమా డల్ గా ఉంటుంది. బీజీఎమ్ కూడా పెద్దగా హెల్ప్ అవలేదు. ఓవరాల్ గా దృశ్యం 3 గురించి సింపుల్ గా చెప్పాలంటే... లౌ ఎక్స్పెక్టేషన్స్ తో ఒకసారి చూసేయొచ్చు. కానీ ఇప్పటికైనా దృశ్యం సిరీస్ గౌరవాన్ని కాపాడుతూ.. ఈ సిరీస్ ఇక్కడితో ఆపేస్తే బెటర్. మొదటి రెండు భాగాలతో పోలిస్తే దృశ్యం 3 మసకబారింది.
Average
Drishyam Movie Review
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని వి...
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని విడుదల చేశారు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకులకు ఎదురయ్యే మొదటి సమస్య ఒరిజినల్ వెర్షన్ లో , ప్రధాన పాత్రధారులను తొందరగా పోల్చుకోకపోవడం.
అందువల్ల కొంతమంది తెలుగు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. ఇక 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాల్లో కథతో పాటు కథనం కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. ట్విస్టులు సర్‌ప్రైజ్ చేయడంతో పాటు షాక్ ఇస్తాయి. పోలీస్ స్టేషన్ కింద దొరికిన అస్థిపంజరం వరుణ్ ది కాదని కోర్టులో తెలిసే సీన్, లాయర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. కానీ 'దృశ్యం 3'లో అటువంటి సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఆ సంగతి పక్కన పెడితే... 'దృశ్యం' ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాల్లో సగం ఉత్కంఠ కూడా మూడో భాగం ఇవ్వలేదు. అందుకే ముందు భాగాల్లాగా దృశ్యం 3కి థియేటర్లలో థ్రిల్ అవ్వడం చాలా కష్టం. మోహన్ లాల్ వీరాభిమానులను సైతం దృశ్యం 3 మెప్పించడం కష్టమే అనిపిస్తుంది.
Average
Drishyam movie Review
దృశ్యం’ఫ్రాంచైజ్‌లలో భాగంగా తాజాగా దృశ్యం 3 మూవీ మలయాళం, తెలుగులో విడుదల కాగా మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ మూవీ ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. మొదటి రెండు పార్ట్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు జీతు జోసెఫ్ మ్యాజిక్ ఈసారి పూర్తిగా వర్కౌట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. జార్జ్ కుట్టి పాత్రలో మో...
దృశ్యం’ఫ్రాంచైజ్‌లలో భాగంగా తాజాగా దృశ్యం 3 మూవీ మలయాళం, తెలుగులో విడుదల కాగా మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ మూవీ ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. మొదటి రెండు పార్ట్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు జీతు జోసెఫ్ మ్యాజిక్ ఈసారి పూర్తిగా వర్కౌట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ మరోసారి తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా… కథలో మాత్రం ఆ పాత థ్రిల్, టెన్షన్ పెద్దగా కనిపించదు. ముఖ్యంగా ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చూసిన ప్రేక్షకులకు ఈసారి కొత్తదనం మిస్సైన ఫీలింగ్ బలంగా వస్తుంది.
ఇక తెలుగు డబ్బింగ్ కూడా సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. చాలా చోట్ల డబ్బింగ్ artificialగా అనిపిస్తుంది. రచయితగా, దర్శకుడిగా జీతు జోసెఫ్ ఈసారి తన mark screenplay magic చూపించలేకపోయాడు. గత భాగాల్లో ఉన్న mind-blowing twists, edge-of-the-seat narration ఈ పార్ట్‌లో మిస్ అయ్యాయి. కొన్ని ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఓవరాల్ గా దృశ్యం 3 కొంతవరకు ఎంగేజింగ్ థ్రిల్లరే. కానీ మొదటి రెండు భాగాలను దృష్టిలో పెట్టుకుని భారీ అంచనాలతో థియేటర్లకు వెళితే నిరాశ తప్పదు.
Average
Drishyam Movie Review
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెలుగు మలయాళ భాషలలో విడుదలైంది. మలయాళం వెర్షన్ నే తెలుగులోనూ రిలీజ్ చేయగా, మోహన్ లాల్, మీనా మెయి...
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెలుగు మలయాళ భాషలలో విడుదలైంది. మలయాళం వెర్షన్ నే తెలుగులోనూ రిలీజ్ చేయగా, మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించారు. అయితే తెరపై జీతు-మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకంతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
జార్జి కుట్టి క్యారెక్టర్.. ‘దృశ్యం’ ఫార్మాట్ బాగా అలవాటైపోయి ఉండడం వల్ల కొత్తదనం ఫీలవ్వలేని పరిస్థితి రావడం ‘దృశ్యం-3’కి అతి పెద్ద ప్రతికూలతగా మారింది. మోహన్ లాల్ మినహా వేరే క్యారెక్టర్లు పెద్దగా ఆకట్టుకోవు. పైగా తెలుగు డబ్బింగ్ బాగా చేయలేదు. డబ్బింగ్ వాసనలు గుప్పుమంటాయి. అన్నిటికి మించి తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్ లో వేరే నటుడ్ని ఈజీగా కనెక్ట్ అవలేరు. జీతు జోసెఫ్ ఈసారి రచయితగా.. దర్శకుడిగా తన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. దృశ్యం.. దృశ్యం-2 చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ రైటింగ్ తో కట్టిపడేసిన జీతు.. ఈసారి నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుల బుర్రలకు పని పెట్టేలా సాగే తన మార్కు స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. దర్శకుడిగానూ జీతు పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి.
Average
Drishyam 3 Movie Review
మోహన్ లాల్, మీనా (Meena) జంటగా నటించిన మలయాళ చిత్రం దృశ్యం రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. మోహన్ లాల్, మీనా...
మోహన్ లాల్, మీనా (Meena) జంటగా నటించిన మలయాళ చిత్రం దృశ్యం రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
అయితే మొదటి రెండు భాగాలతో పోల్చితే... 'దృశ్యం 3' పేలవంగా సాగింది. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ తనదైన శైలిలో జార్జి కుట్టి పాత్రకు మరోసారి ప్రాణం పోశాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. దృశ్యం' సీరిస్‌కు దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. మొదటి రెండు భాగాల్లో అది వర్కౌట్ అయి, ఆ సినిమాల విజయానికి కారణమైంది. మూడో భాగం దగ్గరకు వచ్చే సరికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా... స్క్రీన్ ప్లే ఉత్కంఠను కలిగించలేదు కదా, కథనం నత్తనడకలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు కానీ మిగిలిన వారిని 'దృశ్యం 3' ఆకట్టుకోవడం కష్టమే.
Above Average
Drishyam 3 Movie Review
దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి ప...
దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంతం వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు.
ఇక కేరళ అందాలను ఎప్పటిలానే సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఆశీర్వాద్ సినిమాస్, ఆంటోని పెరంబవూర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ట్విస్టులతో సాగే థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి కూడా ఈ దృశ్యం 3 సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి.
Above Average
Drishyam 3 Movie Review in Telugu
మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడ...
మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడ్డాడు. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మోహన్ లాల్ సహా అందరూ బాగానే నటించారు.
ఇక ఓవరాల్ గా చూస్తే... ‘దృశ్యం 3’ ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన రేంజ్ లో అయితే అనిపించలేదు. అలా అని కాకుండా పార్ట్ 3 బానే ఉంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒకే రేంజ్ లో ఉంది. కానీ ఆడియన్స్ మాత్రం ముందు పార్ట్స్ ఇచ్చిన హై ని ఈ మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందుతారు. ఓవరాల్ గా మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ కోసం, మలయాళం మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమా ట్రై చేయొచ్చు. కానీ మరింత ఎంగేజింగ్ కథనం మిస్ కావడంతో ఇది మిస్ ఫైర్ అయ్యింది.
Public Reviews
6 Avg: 5.3/10Average
Drishyam 3 movie Review
pongal tarvatha malli theater lo movie chudale.. chalaa rojula tarvatha Drishyam 3 ki family tho vella... but vellaka Honestly cheppalante “Drishyam 3” ki chala dissapoint ayya. first 2 parts nacchi, trailer kooda chudaunda.. critics review vinakunda vellam... ade maa mistake. cinemalo konni engagin...
pongal tarvatha malli theater lo movie chudale.. chalaa rojula tarvatha Drishyam 3 ki family tho vella... but vellaka Honestly cheppalante “Drishyam 3” ki chala dissapoint ayya. first 2 parts nacchi, trailer kooda chudaunda.. critics review vinakunda vellam... ade maa mistake. cinemalo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu.
actor ga venkatesh role lo Mohanlal ni imagine cheskolekapoya. but mohanlal as Georgekutty still superb. as a telugu audiane ga connect avalenu. jeethu joseph screenplay previous parts range lo sharp ga anipinchaledu. Overall ga decent thriller watch anthe.
Average
Drishyam 3 Movie Review
Naa favorate suspense thrillers movies lo drishyam franchise movies okati. latest gaa "Drishyam 3" kuda release ayindani telisi, 1st day ne evening show ki vella. honestly movie chusaka below avarage anipinchindi. first two parts ichina thrill matram ee sari takkuva ayindi. screenplay ee sari anthag...
Naa favorate suspense thrillers movies lo drishyam franchise movies okati. latest gaa "Drishyam 3" kuda release ayindani telisi, 1st day ne evening show ki vella. honestly movie chusaka below avarage anipinchindi. first two parts ichina thrill matram ee sari takkuva ayindi. screenplay ee sari anthaga work avaledu.
movie lo Twists konchem chala predictable ga anipistayi and investigation scenes few places lo slow feel istayi. Still, thriller genre fans ki one-time watch experience istundi. But franchise standards tho compare chesthe, ee 3rd part ki nenu chala dissapoint ayyanu. anduke 4th part tiyyakunda ikkaditho drishyam franchise ki end iste better anipistundi.
Above Average
Drishyam 3
“Drishyam 3” ki full hype tho vellaa, because the first two parts literally mind block chesayi. But honestly ee sari aa thrilling feel konchem taggindi. Twists chala varaku easy ga guess cheyochu. Investigation scenes kuda first two parts range lo intense ga anipinchaledu. and emotional connect kuda...
“Drishyam 3” ki full hype tho vellaa, because the first two parts literally mind block chesayi. But honestly ee sari aa thrilling feel konchem taggindi. Twists chala varaku easy ga guess cheyochu. Investigation scenes kuda first two parts range lo intense ga anipinchaledu. and emotional connect kuda miss ayyindi.
Overall ga movie okay… suspense thriller lovers ki one time watchable. But “Drishyam” franchise standards tho compare chesthe konchem below avarage anipistadi. evaraina chuste first 2 parts malli chuskoni doubts clear cheskondi.
rating 5.5
Average
Drishyam 3 Movie Review
Recent gaa Weekend lo “Drishyam 3” chusaa... Drishyam Franchise 2 parts kuda naku chala favorates. anduke day 1 ke Drishyam 3 first show ki vellipoya. but high expectations tho vellinandukemo antha movie avarage ga anipinchindi. first two parts lo unna intensity, thrill moments em kanipinchaledu.&nb...
Recent gaa Weekend lo “Drishyam 3” chusaa... Drishyam Franchise 2 parts kuda naku chala favorates. anduke day 1 ke Drishyam 3 first show ki vellipoya. but high expectations tho vellinandukemo antha movie avarage ga anipinchindi. first two parts lo unna intensity, thrill moments em kanipinchaledu.
directer Jeethu joseph screenplay eesaari debbesindi. but Mohanlal as Georgekutty still screen meeda own chesadu… classy performance tho movie ni carry chesadu. But movielo first two parts tho compare chesthe ee sari screenplay antha gripping ga em ledu. okka climax tappa ekkada kooda satisfy avvaledu nenu. overall ga drishyam 3 franchise ni ikkadithe makers aapeste better.
Above Average
Drishyam 3 latest movie telugu review
Ninna friends tho kalisi “Drishyam 3” movie chusaa… honestly cheppalante first rendu parts ichina high ee movie reach avvaledu anipinchindi. Mohanlal acting usual ga super untundi… Georgekutty character ni malli settled ga carry chesadu. But ee sari screenplay lo aa mind game magic konchem miss ayyi...
Ninna friends tho kalisi “Drishyam 3” movie chusaa… honestly cheppalante first rendu parts ichina high ee movie reach avvaledu anipinchindi. Mohanlal acting usual ga super untundi… Georgekutty character ni malli settled ga carry chesadu. But ee sari screenplay lo aa mind game magic konchem miss ayyindi.
Movie start ayyaka next em jaruguthundo easy ga guess cheyagalige scenes ekkuva unnayi. Twists kuda anthaga shock ivvaledu. Telugu dubbing kuda konchem artificial ga anipinchindi. Mana Telugu audience ki Venkatesh version baga connect ayipoyindo emo… Mohanlal version emotional ga antha attach avvalekapoyanu.
Overall ga movie ok… thriller lovers okasari chudhochhu. But “Drishyam” range expectations pettukunte disappoint Avtham.
Average
Drishyam Movie Review
Court dramas, investigation thrillers అంటే నాకు personally చాలా ఇష్టం. అదే interest తో “Drishyam 3” చూడడానికి వెళ్లాను. i expected more then prevoius parts... edo just ok annattundi ee movie. Movie starting నుంచి George kutty character malli ఏదో strong legal mind game చూపిస్తాడని expect చేశా. But s...
Court dramas, investigation thrillers అంటే నాకు personally చాలా ఇష్టం. అదే interest తో “Drishyam 3” చూడడానికి వెళ్లాను. i expected more then prevoius parts... edo just ok annattundi ee movie. Movie starting నుంచి George kutty character malli ఏదో strong legal mind game చూపిస్తాడని expect చేశా. But screenplay ఈసారి అంత convincingగా అనిపించలేదు. గత రెండు parts లాగా ఆడియన్స్ ని case analysis mode లోకి తీసుకెళ్లే scenes చాలా తక్కువ. Investigation angle కూడా చాలా predictableగా అనిపిస్తుంది.
అన్నిటికి మించి ఈసారి కూడా జార్జ్ కుట్టి పోలీసులకు దొరక్కుండా ఉండడం audience కి రొటీన్ ఫీల్ ఇస్తుంది. because తెలీక చేసినా ఏదో ఒక రోజు punishment అనుభవించాల్సిందే. కానీ మూవీని lag చేస్తూ part 4 కి కూడా lead ఇవ్వడం అంత engaging గా లేదు. కానీ మోహన్ లాల్ మాత్రం ఎప్పట్లాగే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో impress చేసాడు. Overall గా “Drishyam 3” completely disappointing కాదు… కానీ వన్ టైం వాచబుల్ గా ఉంది. may be part 3 తీయకపోవడమే better. Rating 5
About This Movie
Story : కథ విషయానికి వస్తే... సినిమా థియేటర్ ఓనర్ అయిన జార్జ్ కుట్టి (మోహన్ లాల్) కొన్నేళ్ల తర్వాత ఏకంగా సినిమా నిర్మాతగా మారి, సూపర్ స్టార్ అరుణ్ కుమార్ (బిజూ మీనన్) తో ఓ సక్సెస్ ఫుల్ సినిమా తీస్తాడు. ఈ మధ్యలో తన కూతురు అంజు జార్జ్ (అన్సిబా హాసన్) పెళ్లి కూడా ప్లాన్ చేసుకుంటాడు. అయితే సినిమా ప్రొడ్యూసర్ కావడంతో మరోసారి మీడియా ఫోకస్ జార్జ్ ఫ్యామిలీ పై పడుతుంది. ఇక అంజు కేసు కారణంగా సస్పెండ్ అయిన సహదేవన్ అనే పోలీస్ ఆఫీసర్ ప్రతీకారం తీర్చుకుందామని, చనిపోయిన వరుణ్ (రోషన్ బషీర్) తండ్రి అయిన ప్రభాకరన్ (సిద్దిఖీ)తో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో వాళ్ళ ప్లాన్ తెలుసుకొన్న జార్జ్ ఎలాంటి పై ఎత్తులు వేశాడు? తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి జార్జ్ ఎలాంటి సాహసం చేశాడు? ఫైనల్ గా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగిలిన స్టోరీ.
దృశ్యం సినిమా ఫ్రాంచైజీపై ఇండియా వైడ్ గా మంచి అంచనాలుండేవి. ఎందుకంటే దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సిరీస్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు అదే రేంజ్ హైప్ తో దృశ్యం 3 మళయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఇక మోహన్ లాల్ గురించి ఆడియన్స్ కి తెలిసిందే. ఎలాంటి రోల్ లో అయినా తన మార్క్ పెర్ఫార్మన్స్ ని అందిస్తాడు. ఇక మూడో పార్ట్ లో కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ తో మోహన్ లాల్ ఇంప్రెస్ చేసాడు. అలాగే మీనా, అంజు జార్జ్, సిద్ధిఖీ తదితరులు ఎవరి రోల్స్ లో వారు మెప్పించారు. సినిమాలో పలు ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ని ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు డైరెక్టర్. ముఖ్యంగా క్లైమాక్స్ లో నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు.
అయితే మొదటి రెండు పార్ట్స్ కి తగ్గ రేంజ్ లో మాత్రం పార్ట్ 3 స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. అయితే సెకండాఫ్ లో మంచి ట్విస్ట్ లు టర్నింగ్ పాయింట్స్ తో ఇంట్రెస్ట్ ని రెట్టింపు చేసినా, ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ కి దృశ్యం 3 స్క్రీన్ ప్లే రీచ్ కాలేదు. అన్నిటికి మించి తెలుగు వెర్షన్ కి సంబంధించి వెంకటేష్ ని కాకుండా తెలుగు ఆడియన్స్ మరో హీరోని ఉన్న పళంగా ఉహించుకోలేరు. కాబట్టి మెజారిటీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేరు.
Technical Values : టెక్నికల్ గా చూస్తే... ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. మలయాళం మూవీస్ రేంజ్ లోనే ఈ మూవీని న్యాచురల్ గా తెరకెక్కించారు. సతీష్ కురుప్ కెమెరా వర్క్ న్యాచురల్ గా ఉండి మూవీకి ప్లస్ అయింది. అలాగే అనీల్ జాన్సన్ బీజీఎమ్ కూడా బాగుంది. అయితే ఎడిటింగ్ పై మరింత ఫోకస్ చేయాల్సింది.
Final Review : దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన "దృశ్యం 3" ఫస్ట్ 2 పార్ట్స్ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేదు. పార్ట్ 3 బానే ఉంది గాని, ఆడియన్స్ లో ఏదో ఇంటెన్సిటీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. మోహన్ లాల్ సహా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో కాస్త మిస్ ఫైర్ అయింది ఈ మూడో పార్ట్. కానీ దృశ్యం ఫ్రాంచైజీస్ మూవీ లవర్స్ ని, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ ని ఈ మూవీ మెప్పిస్తుంది.