లెనిన్ (LENIN)
టాలీవుడ్ యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "లెనిన్". మురళి కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక పలుమార్లు వాయిదా పడ్డాక ఎట్టకేలకు సినిమా థియేటర్లలో విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about లెనిన్ (LENIN)
Media Reviews
20 Avg: 6.4/10Hit
Lenin movie Review
అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూ...
అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూరు యాసలో కూడా మాట్లాడుతూ సూపర్ అనిపించాడు. పైగా మనోడి యాక్టింగ్ చూసి షాక్ అయ్యా.. ఇంత బాగా చేస్తాడనుకోలేదు.
అండ్ కలెక్షన్స్ ఎలా వస్తాయో తెలీదు గాని సినిమా అయితే బాగుంది. ఎక్కడా వల్గారిటీ కూడా లేదు, కాబట్టి ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు. సాంగ్స్ అంత బాగా లేవు కానీ, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఓ సాంగ్ బాగుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు, క్లైమాక్స్ ట్విస్ట్ లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బీజీఎమ్ కూడా చాలా బాగుంది. చివరగా అయ్యగారి యాక్టింగ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలా... సినిమా థియేటర్లో బానే ఎంజాయ్ చేయొచ్చు.
Above Average
Lenin movie Review
కెరీర్ ని ఎప్పుడో 2015 టైంలో మొదలు పెట్టినా కూడా ఆశించిన మేర కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైనా కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయాడు…కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా లెనిన్(Lenin Movie)తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక సినిమా గురించి...
కెరీర్ ని ఎప్పుడో 2015 టైంలో మొదలు పెట్టినా కూడా ఆశించిన మేర కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైనా కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయాడు…కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా లెనిన్(Lenin Movie)తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ముందుగా ఇది ఎదో రెగ్యులర్ గా సాగే కమర్షియల్ డ్రామా మూవీ కాదు. ఒక సీరియస్ రూలర్ మాస్ డ్రామా గా తెరకెక్కిన సినిమా. ఇందులో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ మెయిన్ గా చెప్పినా ఊరిలో అనేక పాత్రలు, ఆ పాత్రలకు ఊహించని కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి.
వాటిని డైరెక్టర్ చాలా వరకు బాలెన్స్ చేస్తూ ఒక డీసెంట్ ఔట్ పుట్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ పరంగా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ లో కుమ్మేశాడు. హీరోయిన్ భాగ్య శ్రీ బాగానే నటించి మెప్పించింది. మిగిలిన రోల్స్ అందరూ బాగానే నటించారు. అయితే క్లైమాక్స్ ముగింపు విషాదాంతంగా ఉండడం వల్ల ఈ క్లైమాక్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా అఖిల్ నుండి ఇది వరకు వచ్చిన మూవీస్ తో పోల్చితే మాత్రం, కచ్చితంగా లెనిన్ పెర్ఫార్మెన్స్ పరంగా టాప్ లో ఉంటుంది అని చెప్పాలి. అదే టైంలో ఆడియన్స్ మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకుండా థియేటర్ కి వెళితే అఖిల్ పెద్దగా నిరాశ పరచకుండా ఆకట్టుకునే ఔట్ పుట్ తో మెప్పించే అవకాశం ఉంటుంది.
Above Average
Lenin Movie Review
అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా...
అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చేస్తే ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక సినిమాని మహాభారతం రిఫరెన్స్ లో అందులోని పాత్రలతో లింక్ చేస్తూ తెరకెక్కించిన విధానం బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, పీరియాడిక్ కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కష్టపడ్డారు. కొన్ని డైలాగ్స్ పవర్ ఫుల్ గా చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. బస్ ఛేజింగ్, ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. మొత్తంగా ‘లెనిన్’ సినిమా ఓ ప్రేమకథ చుట్టూ ట్విస్టులతో సాగే సినిమా.
Hit
Lenin movie Review
లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మ...
లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు.
అయితే కథ పరంగా రొటీన్ గా ఉండి చాలా సీన్స్ ఊహాజనితంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్ కు ఉంది. అయితే ఓవరాల్ గా సినిమాలో అఖిల్ పెర్ఫార్మన్స్ హైలెట్ గా నిలిచింది. కొత్తదనం కోసం ఆశించకుండా, తక్కువ అంచనాలతో చూస్తే... లెనిన్ ఊహించినదానికంటే ఎక్కువ బాగుంటుంది.
Above Average
Lenin Movie Review
నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని `లెనిన్` మూవీ చేశాడు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇందులో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ...
నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని `లెనిన్` మూవీ చేశాడు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇందులో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 10) విడుదలైంది.
ఇక సినిమా విషయానికి వస్తే... లెనిన్ ఒక ఫక్తూ కమర్షియల్ మూవీ. మంచి డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీ, ఊరి జాతర అనే సెంటిమెంట్, స్నేహం ఇలా అన్ని అంశాలను మేళవించి రూపొందించారు. అఖిల్ అక్కినేనికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని లక్ష్యంతో నాగార్జున చేసిన ప్రయత్నం `లెనిన్` మూవీ అని చెప్పొచ్చు.
సినిమాలో డ్రామా బాగా వర్కౌట్ అయ్యింది. ట్విస్ట్ లు బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. మరోవైపు హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు కొంత వరకు ఆకట్టుకుంటాయి. కానీ చాలా వరకు స్టోరీ రొటీన్ గా ఉంటుంది. కథనం రెగ్యూలర్‌గానే ఉంటుంది. చాలా లాజిక్ లు మిస్ అయ్యారు. ట్విస్ట్ లు చాలా పెట్టినా అవి చాలా వరకు తేలిపోయాయి. అంతగా కిక్ ఇవ్వలేదు. దీనికితోడు ఆ ట్విస్ట్ లకు సంబంధించి ముందే హింట్ ఇవ్వడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కమర్షియల్ యాంగిల్‌లో సినిమాని నడిపించిన తీరు మాత్రం మాస్ లవర్స్ కి బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.
అఖిల్‌ని కమర్షియల్ గా నిలబెట్టే మూవీ అవుతుంది. నటుడిగానూ తనని కొత్తగా ఆవిష్కరించే చిత్రమవుతుంది. మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. కమర్షియల్ గా ఎలా మెప్పిస్తుందనేది ప్రశ్న.
Above Average
Lenin Movie Review
అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ...
అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.
అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ ఆకట్టుకోగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. కథలో కొత్తదనం తక్కువైనా, స్క్రీన్‌ప్లే ఎంగేజ్‌మెంట్‌తో పాటు అఖిల్ పెర్ఫార్మెన్స్ కోసం 'లెనిన్' ను ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
Above Average
Lenin movie review
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' రూరల్ యాక్షన్-రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ పరంగా కొత్తదనం తక్కువగా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లేలో వచ్చే మలుపులు సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ భాగాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.నటుడిగా అఖిల్ అక్కినేని...
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' రూరల్ యాక్షన్-రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ పరంగా కొత్తదనం తక్కువగా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లేలో వచ్చే మలుపులు సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ భాగాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
నటుడిగా అఖిల్ అక్కినేని తనలోని కొత్త కోణాన్ని చూపించగా, క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకు న్యాయం చేయగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు అదనపు బలం ఇచ్చింది. మొత్తం మీద, కథ రెగ్యులర్‌గా అనిపించినా అఖిల్ నటన, స్క్రీన్‌ప్లే ట్విస్టుల కోసం లెనిన్ ఒకసారి చూడదగ్గ చిత్రంగా నిలుస్తోంది. అయితే సినిమా లెంగ్త్ పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి నిడివి తగ్గించి ఉంటె మరింత ఎంగేజింగ్ గా ఉండేది.
అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఎం జరుగుతోందా? అనే అంచనాలు పెంచుతూ వెళ్లి, సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. కానీ ఎంగేజ్ చేసే ట్విస్ట్ లు కొంతవరకు సేవ్ అయ్యేలా చేసాయి. ఫైనల్ గా... లెనిన్ మాస్ ఎంటర్టైన్మెనర్ విత్ ఎంగేజింగ్ ట్విస్ట్స్.
Above Average
Lenin Movie Review
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన సినిమా 'లెనిన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ రోజు (జూలై 10న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగు తెరపై రూరల్ డ్రామాలు చూసిన...
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన సినిమా 'లెనిన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ రోజు (జూలై 10న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగు తెరపై రూరల్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు 'లెనిన్' కథ కొత్తగా ఏమీ అనిపించదు. కానీ, స్క్రీన్ ప్లే మాత్రం సర్‌ప్రైజ్ చేస్తుంది.
కంటెంట్ రెగ్యులర్ రూరల్ డ్రామా, రివేంజ్ యాక్షన్ కథగా 'లెనిన్' కనిపిస్తుంది. ఊరు, ఆ ఊరిలో మనుషులు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ, స్నేహితుల అనుబంధం... సినిమా ప్రారంభం సాదాసీదాగా ఉంటుంది. అయితే... కథ ముందుకు వెళుతున్న కొలదీ వచ్చే ఒక్కో మలుపు ఆసక్తి పెంచుతాయి. రెగ్యులర్ రూరల్ రివేంజ్ డ్రామాల నుంచి 'లెనిన్'ను వేరు చేసింది స్క్రీన్ ప్లే. ఒక్కో పాత్రలో గ్రే / నెగిటివ్ షేడ్ బయట పడుతున్న కొలదీ ఆసక్తి పెరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు... అరగంట సేపు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా ఎంగేజ్ చేశారు.
ఇక సినిమాలో అఖిల్ అక్కినేనిని కొత్తగా చూపించడంలో 'లెనిన్' హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది. నటుడిగా ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. అఖిల్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. కమర్షియల్ కథను తీసుకుని స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేశారు మురళీకిషోర్ అబ్బూరు. పాటల్లో, సన్నివేశాల్లో అఖిల్ - భాగ్యశ్రీ బోర్సే జంట ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా! అయితే... సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ అక్కినేని మాత్రమే గుర్తుంటారు. క్లైమాక్స్‌లో, ఆ క్యారెక్టర్‌లో అంతలా నటించారు. ఆయన కోసం సినిమాకు వెళ్ళొచ్చు.
Above Average
Lenin Movie Review
Akhil Akkineni is back once again with Lenin, directed by Murali Kishor Abburu of Vinaro Bhagyamu Vishnu Katha fame. The film carries significant expectations, especially as it marks the coming together of Nagarjuna’s Manam Entertainment LLP and Sithara Entertainments. Nagarjuna himself had stated t...
Akhil Akkineni is back once again with Lenin, directed by Murali Kishor Abburu of Vinaro Bhagyamu Vishnu Katha fame. The film carries significant expectations, especially as it marks the coming together of Nagarjuna’s Manam Entertainment LLP and Sithara Entertainments. Nagarjuna himself had stated that he was creatively involved with the project more than any of his films since Manam, adding further anticipation around the release.
Positives:
Akhil’s Performance in Crucial Blocks
Thaman’s BGM
Some Portions of the Second Half
Negatives:
Boring First Half
Poorly written Characters
Lack of Proper Drama & Emotions
Placement of Songs
Ultimately, Lenin works more as a testament to Akhil Akkineni’s growth as a performer than as a consistently engaging film. While the second half offers enough moments to improve the overall experience, inconsistent writing and underdeveloped drama prevent it from realizing the full potential of its premise.
Bottomline: Akhil Passes, Director Fails!
Rating: 2.5/5
Hit
Lenin Movie Review
పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ 'లెనిన్' అవతారం ఎత్తాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార...
పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ 'లెనిన్' అవతారం ఎత్తాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిగ్గా వస్తుంది. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వల్ల ఒక హీరోకు హైప్ వచ్చినా.. దాన్ని నిలబెట్టే సినిమా పడితేనే కెరీర్లో పైకి ఎదిగే అవకాశముంటుంది. ఇప్పుడు వచ్చిన లెనిన్ అఖిల్ కి అలాంటి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది.
సినిమా రొటీన్ స్టోరీ అయినా, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. ఇక అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగా, భాగ్యశ్రీ రోల్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. కాకపోతే ఆ ట్విస్ట్ లు ముందు గెస్ చేయగలిగితే అంత కిక్కుండదు. ఫైనల్ గా అఖిల్ కెరీర్ ను గొప్ప మలుపు తిప్పే సినిమా కాదు కానీ.. అతడి గత చిత్రాలతో పోలిస్తే ‘లెనిన్’ ఎంతో బెటర్. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే వాచబుల్ అనిపించే ఫిలిం ఇది. బహుశా హీరో హీరోయిన్ల మధ్య బలమైన బాండింగ్ ను చూపించి ఉంటే ‘లెనిన్’ మంచి అనుభూతిని కలిగించేది. రైటింగ్-టేకింగ్ లో తన ఎఫర్ట్ కనిపించినా.. ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది అనిపిస్తుంది. చివరగా: లెనిన్.. పర్వాలేదనిపించే పల్లెటూరి భారతం
Above Average
Lenin Movie Review
ఏజంట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో కాస్తంత గ్యాప్ తీసుకుని అఖిల్ 'లెనిన్' మూవీ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మహా భారతంలో అధికారం కోసం అన్నదమ్ములు సాగించిన కురుక్షేత్ర యుద్థాన్ని తలపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్న...
ఏజంట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో కాస్తంత గ్యాప్ తీసుకుని అఖిల్ 'లెనిన్' మూవీ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మహా భారతంలో అధికారం కోసం అన్నదమ్ములు సాగించిన కురుక్షేత్ర యుద్థాన్ని తలపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి పాత్ర వెనుక డార్క్ షేడ్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇందులో పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే నెగెటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ. ప్రతి పాత్రకు ఓ బలమైన నేపథ్యాన్ని రాసుకోవడంలో దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు సక్సెస్ అయ్యాడు.
అయితే హీరో శత్రువులంతా ఒకచోటకు చేరిన తర్వాత అతను వారిపై పగ తీర్చుకోవడమే ఇక మిగిలింది అనుకుంటూ ఉండగా, మళ్ళీ కథలోని పాత్రలు, వాటి నిజస్వరూపాలను తెలియచేస్తూ ద్వితీయార్థాన్ని ప్రారంభించాడు. అలా ఊహించని మలుపులతో కథను క్లయిమాక్స్ వరకూ తీసుకెళ్ళిన దర్శకుడు హీరోకి ఉన్న ఓ బలహీనతను రివీల్ చేసి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తాడు. అయితే... రెగ్యులర్ తెలుగు సినిమాల్లోని హ్యాపీ ఎండింగ్ ఇందులో పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు భారంగానే థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇక అఖిల్ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే భాగ్యశ్రీ కూడా.
టెక్నికల్ గా తమన్ సాంగ్స్ అంతగా లేవు. బీజీఎమ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. ఈ సినిమాకు 'లెనిన్' అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు. మొత్తంగా చూసుకుంటే... ఇది అఖిల్ వన్ మ్యాన్ షో! అతను పడిన కష్టమంతా తెర మీద కనిపిస్తోంది. కాకపోతే ఈ విషాదాంతాన్ని ప్రేక్షకులు ఏ మేరకు జీర్ణించుకుంటారో చూడాలి.
ట్యాగ్ లైన్: అఖిల్ వన్ మ్యాన్ షో!
Above Average
Lenin Movie Review
అఖిల్ నటించిన లెనిన్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. ఇక మూవీలో చిత్తూరు జిల్లాలో జరిగే జాతర ఎపిసోడ్‌తో కథ ఎమోషనల్ గా మొదలుపెట్టడం ద్వారా సినిమాపై క్యూరియాసిటిని పెంచడంలో దర్శకుడు మురళీ కిషోర్ సరైన ట్రాక్‌లో ఉ...
అఖిల్ నటించిన లెనిన్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. ఇక మూవీలో చిత్తూరు జిల్లాలో జరిగే జాతర ఎపిసోడ్‌తో కథ ఎమోషనల్ గా మొదలుపెట్టడం ద్వారా సినిమాపై క్యూరియాసిటిని పెంచడంలో దర్శకుడు మురళీ కిషోర్ సరైన ట్రాక్‌లో ఉన్నాడనిపించింది. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అలా స్లోగా సాగుతుంది. లెనిన్ తో ఓ ట్విస్ట్ రివీల్ చేసిన పాయింట్ సినిమా రేంజ్ ను పెంచేలా చేసింది.
అయితే సెకండ్ హాఫ్ లో చివరి 20 నిమిషాలు లెనిన్ క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం.. ఆ పాత్ర కోసం అఖిల్ చేసిన పెర్ఫార్మెన్స్ హైలెట్ గా మారిందనే చెప్పాలి. రెగ్యులర్ సినిమా కథల ముగింపులా కాకుండా డిఫరెంట్ గా సినిమాను ముగించడం కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా అనిపిస్తుంది. ఇక కథ, కథనాల డిమాండ్ మేరకు సితారా, అన్నపూర్ణ బ్యానర్లు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలను పక్కన పెడితే.. అఖిల్ పెర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ భోర్సే గ్లామర్ కోసం ఈ సినిమాను థియేటర్ లో చూడాలనిపించేంతలా ఉంది. ఈ వారం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాను చూడాలనుకొంటే లెనిన్ చక్కటి ఆప్షన్.
Hit
Lenin movie Review
అఖిల్ అక్కినేని తన కెరీర్ ఆరంభం నుంచీ ఓ సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నాగార్జున సైతం తన కొడుకు హిట్టు కోసం చాలానే కష్టపడుతూ వచ్చాడు. ఇక చివరగా ఏజెంట్ అంటూ డిజాస్టర్‌ను ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని, ఆచితూచి అడుగులు వేసి ‘లెనిన్’ అంటూ ఈ రోజు (జూలై 10న) ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.&nbs...
అఖిల్ అక్కినేని తన కెరీర్ ఆరంభం నుంచీ ఓ సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నాగార్జున సైతం తన కొడుకు హిట్టు కోసం చాలానే కష్టపడుతూ వచ్చాడు. ఇక చివరగా ఏజెంట్ అంటూ డిజాస్టర్‌ను ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని, ఆచితూచి అడుగులు వేసి ‘లెనిన్’ అంటూ ఈ రోజు (జూలై 10న) ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ చాలా వరకు కనిపించొచ్చు. చాలా చోట్ల దసరా, రాజా ది గ్రేట్, రంగస్థలం ఛాయలు కూడా కనిపించొచ్చు. కొన్ని ట్విస్టుల్ని ముందే గెస్ చేస్తాం. కొన్ని ట్విస్టుల్ని మాత్రం అస్సలు గెస్ చేయలేం. అక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మూవీ చాలా వరకు మనకు తెలిసినట్టుగా, ఊహించినట్టుగా సాగుతూనే ఉంటుంది. అయినా కూడా డైరెక్టర్ మురళీ మాత్రం చివరకు తన మేకింగ్, టేకింగ్, కథతో, అందులో పెట్టుకున్న ట్విస్టులతో అందరినీ ఆకట్టుకుంటాడు.
అఖిల్ చాలా వరకు అదరగొట్టేశాడు. ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో పరిణితిని కనబర్చాడు. భాగ్యశ్రీ మాత్రం ఈ సినిమాకి నిజంగానే సోల్. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రమోద్ పంజు పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా చాలా చోట్ల అనిపిస్తుంది. ఓవరాల్‌గా లెనిన్ రెగ్యులర్, రొటీన్, మాస్ కమర్షియల్ టెంప్లెట్ మూవీగా అనిపించొచ్చు. కానీ అఖిల్ కెరీర్‌లో మాత్రం లెనిన్ చెప్పుకోవదగ్గ, నిలిచిపోయే చిత్రంగా మారే అవకాశం ఉంది. మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ‘లెనిన్’ బాగానే ఎక్కేసేలా ఉంది. కావాల్సిన పాటలు, ఫైట్స్, ఎమోషన్స్, ట్విస్టులు ఇలా అన్ని ఉండటంతో ఈ వీకెండ్ కి మంచి ఆప్షన్ గా ‘లెనిన్’ను పెట్టుకోవచ్చు.
Above Average
Lenin movie Review
#Lenin Template Commercial Film with a Few Interesting Twists!Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and while a few second half...
#Lenin Template Commercial Film with a Few Interesting Twists!
Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and while a few second half blocks and twists work well, its biggest issue is that it feels too reminiscent of rural dramas we’ve seen before, giving it an outdated feel at times.
Thaman’s music is a hit and miss, and the song placement is bad. Akhil shows improvement over his previous outings and delivers a watchable film, but this one doesn’t have enough to be a completely satisfying watch. Average!
Rating: 2.5/5
Hit
Lenin Movie Review
first of all ఒక విజ్ఞప్తి ఏంటంటే... లెనిన్ సినిమాలో ట్విస్ట్ లు గాని, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లు లీక్ అయినవీడీయోల్లోనూ, లేదా ఇంస్టాగ్రామ్ లో గాని చూస్తే మీరు సినిమా చూస్తే అంత కనెక్ట్ అవలేరేమో. ఇప్పుడు లెనిన్ (Lenin) సినిమా గురించి చెప్పుకుంటే... ఒక నేటివ్ విలేజ్ లో జరిగే ఫెస్టివల్ వెనకాల, మహ...
first of all ఒక విజ్ఞప్తి ఏంటంటే... లెనిన్ సినిమాలో ట్విస్ట్ లు గాని, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లు లీక్ అయినవీడీయోల్లోనూ, లేదా ఇంస్టాగ్రామ్ లో గాని చూస్తే మీరు సినిమా చూస్తే అంత కనెక్ట్ అవలేరేమో.
ఇప్పుడు లెనిన్ (Lenin) సినిమా గురించి చెప్పుకుంటే... ఒక నేటివ్ విలేజ్ లో జరిగే ఫెస్టివల్ వెనకాల, మహాభారతం అనే బ్యాక్ డ్రాప్ ని పెట్టుకుని ఈ సినిమాని బాగానే ప్రెజెంట్ చేసారు డైరెక్టర్ అని చెప్పాలి. అండ్ అఖిల్ (Akhil) తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడని చెప్పాలి. అండ్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు అయితే పేలాయి అని చెప్పాలి. మరి కొన్ని ట్విస్ట్ లు గెస్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా స్లో గానే ఉంటాయి. బట్ ఇంటర్వెల్ సీన్, అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కి మాత్రం బాగా కనెక్ట్ అవుతారు.
అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. కాకపోతే ఆ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ కాకపోతే సినిమా ఏమాత్రం ఎక్కదు. అండ్ నాకైతే ఈ సినిమా చూస్తుంటే రంగస్థలం సినిమా ఇన్స్పిరేషన్ గుర్తొస్తుంది. ఎందుకు అనంటే సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్ గా.. లెనిన్ ఓసారి థియేటర్లో చూడ్డానికి బానే ఉంది.
Hit
Lenin Movie Review
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అవైటెడ్ గా ఆడియెన్స్ ఎక్కువ ఎదురు చూసిన సినిమా మాత్రం అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా లెనిన్ అనే చెప్పొచ్చు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ సినిమా స్టోరీ యావరేజ్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే...
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అవైటెడ్ గా ఆడియెన్స్ ఎక్కువ ఎదురు చూసిన సినిమా మాత్రం అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా లెనిన్ అనే చెప్పొచ్చు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ సినిమా స్టోరీ యావరేజ్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ సహా మిగతా అందరూ వాళ్ళ రోల్స్ లో బాగానే నటించారు.
ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. థమన్ మ్యూజిక్ అదరగొట్టాడు. కాకపోతే సాంగ్స్ సరైన ప్లేస్ లో పెట్టలేదు. ఎడిటింగ్ వర్క్ పర్లేదు. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ‘లెనిన్’ తో మనోడు వచ్చి కొట్టేసాడు అని చెప్పడంలో డౌట్ లేదు. అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్, దర్శకుడు విజన్ తెరకెక్కించిన తీరు, ఎమోషన్స్ ఇందులో హైలైట్ గా నిలిచాయి. ఇతర నటీనటులు సహకారం కూడా లెనిన్ లో బాగుంది. కాకపోతే కొన్ని సింపుల్ గా అనిపించే ఎలిమెంట్స్ పక్కన పెడితే ఈ లెనిన్ థియేటర్స్ లో మెప్పిస్తాడు.
Above Average
Lenin Movie Review
సో అయ్యగారు అఖిల్ సినిమా లెనిన్ ఇప్పుడే చూసొస్తున్న.. ఒకే భయ్యా... యావరేజ్ అనిపించింది నాకు. నాకైతే చాలా చాలా బొక్కలు కనిపించాయి. కానీ కొన్ని సీన్స్ చాలా బాగా ఉండడం వల్ల సినిమా యావరేజ్ ఒకే... ఒకసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. ఫస్ట్ అఫ్ అల్ దేని గురించి మాట్లాడుకోవాలంటే... ఎదో తమిళ్ డబ్బడ్ ఫిలిం చూస్...
సో అయ్యగారు అఖిల్ సినిమా లెనిన్ ఇప్పుడే చూసొస్తున్న.. ఒకే భయ్యా... యావరేజ్ అనిపించింది నాకు. నాకైతే చాలా చాలా బొక్కలు కనిపించాయి. కానీ కొన్ని సీన్స్ చాలా బాగా ఉండడం వల్ల సినిమా యావరేజ్ ఒకే... ఒకసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. ఫస్ట్ అఫ్ అల్ దేని గురించి మాట్లాడుకోవాలంటే... ఎదో తమిళ్ డబ్బడ్ ఫిలిం చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క యాక్టర్ కి కూడా లిప్ సింక్ మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. 80 పెర్సెంట్ అఫ్ సినిమా ఒక్కరి లిప్ సింక్ వర్కౌట్ కాలేదు.
ఇక ఫస్ట్ హాఫ్ అయితే చాల రొటీన్ గా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ అండ్ ట్విస్ట్ బాగుంది. శివాజీ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఎక్కడో చూసినట్టుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా రొటీన్ గా అలా వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ ట్విస్ట్ కూడా ఒకే ఒకే అన్నట్టుంది. అండ్ సినిమాలో మేజర్ కాన్ఫ్లిక్ట్ సీన్స్ బాగా ప్లస్ అయ్యాయి. అండ్ అనవసరంగా కొన్ని సీన్స్ కమర్షియల్ చేద్దామని రుద్దినట్టు అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ అఖిల్ పెర్ఫార్మన్స్ బాగుంది. భాగ్యశ్రీ రోల్ కూడా బాగుంది. అండ్ మహాభారతం వంటి పదాలు వాడడం ఒకే ఒకే అన్నట్టుంది.. ఎందుకంటే మేకర్స్ చెప్పినదానికంటే మ్యాటర్ తక్కువుంది. సినిమాటోగ్రఫి అయితే బాగుంది. ఓవరాల్ గా లెనిన్ ఒకసారి చూసేయొచ్చు.
Hit
Lenin Movie Review
లెనిన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. అదిరింది సినిమా. చాలా చాలా బాగుంది. అండ్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కం బ్యాక్ ఫర్ అక్కినేని అఖిల్ గారు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ ప్యాకెడ్ ఫిలిం. సినిమా అంతాఒక ఫ్లో లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడ...
లెనిన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. అదిరింది సినిమా. చాలా చాలా బాగుంది. అండ్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కం బ్యాక్ ఫర్ అక్కినేని అఖిల్ గారు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ ప్యాకెడ్ ఫిలిం. సినిమా అంతాఒక ఫ్లో లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బేసిగ్గా ఆ ప్లాట్ అయితే కొత్త ప్లాట్ లాగా అనిపించదు. బేసిగ్గా ధర్మం తప్పిన దసరా అని అనిపిస్తుంది. అంటే దసరా సినిమా లాగే... కొంచెం డిఫరెంట్ గా.. అది ఎందుకన్నానో సినిమా చూస్తే తెలుస్తుంది.
అండ్ సినిమా కొన్ని వేరే సినిమాలతో మ్యాచ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. మెయిన్ గా నాకైతే ఊరు పేరు భైరవకోన గుర్తొచ్చింది. కథ వరకు చాలా రొటీన్ గానే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు డైరెక్టర్ మురళికిషోర్. అండ్ పాటలు మాత్రం ఒక్కటి తప్ప వేరే ఏం అంత బాగా లేవు. అండ్ సాంగ్స్ ప్లేస్ మెంట్స్ కూడా బాగాలేదు.
లెనిన్ లో ట్విస్ట్ లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా బాగా హ్యాండిల్ చేసారు. అండ్ సినిమాలో డివోషనల్ టచ్ లైట్ గా బాగుంది. అండ్ అఖిల్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా అదరగొట్టాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. అండ్ భాగ్యశ్రీ బోర్సే కూడా బాగానే చేసింది. అండ్ శ్రీ లీలని తీసేసి భాగ్యశ్రీ ని పెట్టడం మంచి పని చేశారనిపిస్తుంది. ఎవరీవన్ డిడ్ బెస్ట్ జాబ్. ఫైనల్ గా సోది లేకుండా ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పాలంటే... పేరుతో పెద్దగా సంబంధం లేదు కానీ, అఖిల్ కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోయే సినిమా లెనిన్ అని చెప్పాలి.
Above Average
Lenin Movie Review
లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం...
లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. అండ్ ఒక సాంగ్ లో చిన్న రొమాన్స్ సీన్ తప్పా మిగతా అంతా ఒకే. కాబట్టి ఫామిలీ తో చూడొచ్చు.
ఇక హీరో అఖిల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. భాగ్యశ్రీ కూడా మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. అండ్ మెయిన్ లీడ్ లో చేసిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో డిఫరెంట్ షేడ్స్ తో అదరగొట్టారు. అండ్ విలన్ రోల్ ఫ్రెష్ గా ఉంది. ఎవరన్నది రివీల్ చెయ్యకూడదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది.
మైనస్ గురించి చెప్పుకుంటే... హీరో కంటే విలన్ రోల్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కురుక్షేత్రం అంటూ రిఫరెన్స్ తీసుకున్నారు కానీ, పెద్దగా స్ట్రాంగ్ స్టోరీ ఎం లేదు. స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు సెకండ్ హాఫ్ లో... అండ్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ముందే తెలిస్తే.. అంత ఇంప్రెస్ కాకపోవచ్చు. ఓవరాల్ గా లెనిన్ కూడా అఖిల్ పూర్తి స్థాయి బ్రేక్ ఇచ్చే మూవీ కాదు. బట్ లెనిన్ తో అఖిల్ మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది.
Hit
Lenin Movie Review
Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అ...
Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అవడానికి support చేసేలా ఉంటాయి. చాలా parts లో Genuine గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకునే main thread ఈ సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ.
బట్ అది lorgly ineffective గా ఉంది. so overall impact అనుకున్నదానికన్నా తగ్గిపోయింది. అండ్ మేకర్స్ చెప్పినట్టే మహాభారతం షేడ్స్ లోనే క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా సీన్స్ కూడా ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఉంటాయి. ఇక లెనిన్ గా అఖిల్ అక్కినేని (Akhil akkineni) సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ థమన్ also did hit duty.
అయితే సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నా, ప్లేస్ మెంట్ బాగాలేవు. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree borse) పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. బట్ ఇద్దరి మధ్యలో అనుకున్నంత connectivity కనిపించలేదు. అండ్ సినిమాలో సపోర్ట్ రోల్స్ లో చేసిన వాళ్ళందరూ బానే చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ మురళి కిషోర్ (murali kishore) డీసెంట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా లెనిన్ వర్త్ మూవీ. ఫ్రెష్ నెస్ కోరుకున్నా ఓసారి థియేటర్లో ట్రై చేయొచ్చు.
Public Reviews
7 Avg: 7.0/10Super Hit
Lenin Review
Lenin cinemsa gurinchi cheppali ante story peddaga em ledhu bayya kani hero akhil acting tho iragadhisadu ani cheppali ayyagariki chalarojula tharvatha manchi comeback ani chepochu.Aa songs inka bgm kuda chala bagunnayi ante songs kuda village backdrop ki set ayyela untayi . Bhagyasri acting inka gl...
Lenin cinemsa gurinchi cheppali ante story peddaga em ledhu bayya kani hero akhil acting tho iragadhisadu ani cheppali ayyagariki chalarojula tharvatha manchi comeback ani chepochu.Aa songs inka bgm kuda chala bagunnayi ante songs kuda village backdrop ki set ayyela untayi . Bhagyasri acting inka glamour tho super anipisthundhi. Inka simple ga cheppali ante nammina prana snehithude mosam chesthe paristhithi enti anedhi story screenplay rayadamlo director knchm atu itu ayina kani ayyagari lakkoni vacharu.
Above Average
Lenin movie Review
Lenin Review: Paper meeda strong rural revenge drama la kanipinchina, execution matram anni chotla work avvaledu. Screenplay lo konni twists engage chestayi, especially second half lo, kani first half slow narration valla movie konchem lag anipistundi.Akhil performance matram fantastic. Climax lo ta...
Lenin Review: Paper meeda strong rural revenge drama la kanipinchina, execution matram anni chotla work avvaledu. Screenplay lo konni twists engage chestayi, especially second half lo, kani first half slow narration valla movie konchem lag anipistundi.
Akhil performance matram fantastic. Climax lo tana efforts clear ga kanipistayi. Thaman BGM action scenes ni elevate chesindi. Kani love track anthaga connect avvakapovadam, emotions expected range lo workout kakapovadam minus ayyayi. overall ga okasari try cheyocchu.
Hit
Lenin movie Review
Lenin starts off like a familiar rural action drama, but the screenplay picks up as the story progresses with engaging twists and solid mass moments. While the plot isn't entirely fresh, the Mahabharata-inspired character arcs add an interesting layer.Akhil delivers one of his best performances. Tha...
Lenin starts off like a familiar rural action drama, but the screenplay picks up as the story progresses with engaging twists and solid mass moments.
While the plot isn't entirely fresh, the Mahabharata-inspired character arcs add an interesting layer.
Akhil delivers one of his best performances.
Thaman's background score elevates the action sequences, though the love story doesn't create the emotional impact it aims for.
Overall, Lenin is a decent commercial entertainer with enough twists and mass appeal to make it a worthwhile one-time watch in theatres.
Hit
Lenin movie Review
lenin chusocchaka... cinema gurinchi cheppalante decent.. First half slow ga start aina, interval nunchi screenplay pickup avutundi. Mahabharatam shades, rural setup, action blocks bagunnayi. movieki manchi elevation istayi. Story regular ga anipinchina, twists engaging ga untayi.Akhil career-best...
lenin chusocchaka... cinema gurinchi cheppalante decent.. First half slow ga start aina, interval nunchi screenplay pickup avutundi.
Mahabharatam shades, rural setup, action blocks bagunnayi.
movieki manchi elevation istayi. Story regular ga anipinchina, twists engaging ga untayi.
Akhil career-best efforts cinemalo kanipistayi. Climax lo performance highlight.
Thaman BGM action scenes ni next level ki teesukellindi.
Love track matram expected impact create cheyyaledu.
Overall ga mass audience ki connect ayye commercial entertainer.
Hit
Lenin movie Review
eeroju pedaga work em ledu kabatti, first day first show lenin ki vellipoya.. cinema chusaka ayithe Overall ga just ok... parledhu anipinchindi. Plot points, rural backdrop, Mahabharatam references baaga work ayyayi. Kani hero-heroine love story antha impact ivvaledu.Akhil as Lenin ga super impress...
eeroju pedaga work em ledu kabatti, first day first show lenin ki vellipoya.. cinema chusaka ayithe Overall ga just ok... parledhu anipinchindi. Plot points, rural backdrop, Mahabharatam references baaga work ayyayi. Kani hero-heroine love story antha impact ivvaledu.
Akhil as Lenin ga super impress chesadu. Thaman BGM solid ga undi. Bhagyashree Borse performance bagundi, but chemistry anthaga workout avvaledu. Production values rich ga unnayi, Murali Kishore decent work icharu. evaraina Fresh mass rural drama try cheyyalanukunte 'Lenin' ni once theatre lo chudandi.
Hit
Lenin movie Review
జనరల్ గా నేను సినిమాలు చూసేదే చాలా తక్కువ. ఇక work అయిపోయిన తర్వాత colleagues forse చేస్తే... ఏదో alaa మాట్నీ కి వెళ్ళాం.. నేనేం సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు... ఎదో టైంపాస్ చేద్దామనుకున్నా. కానీ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అఖిల్ ఫస్ట్ టైం బెస్ట్ performance ఇచ్చాడు. అండ్ భాగ్యశ...
జనరల్ గా నేను సినిమాలు చూసేదే చాలా తక్కువ. ఇక work అయిపోయిన తర్వాత colleagues forse చేస్తే... ఏదో alaa మాట్నీ కి వెళ్ళాం..
నేనేం సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు... ఎదో టైంపాస్ చేద్దామనుకున్నా. కానీ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అఖిల్ ఫస్ట్ టైం బెస్ట్ performance ఇచ్చాడు. అండ్ భాగ్యశ్రీ కూడా బానే చేసింది.
బట్ కొంచెం dissapointment ఏంటేంటే స్టోరీ రొటీన్ గానే ఉంటది. అండ్ సినిమాలో విలన్ గా చేసిన అతను బాగా చేసాడు. మ్యూజిక్ కూడా అంత బాగా ఏం లేదు. కానీ సినిమా టైంపాస్ కి అలా అలా ఎల్లిపోతుంది. పెట్టిన పైసలకైతే వర్థ్ సినిమా. రెండో సారి చూస్తానేమో తెలీదు గాని, అందరూ చూడొచ్చు.
Hit
Lenin movie Review
ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టిం...
ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టింగ్ చేసాడనిపించింది. అండ్ సినిమా నాకైతే పైసా వసూల్ అనిపించింది. అందరి గురించి నాకనవసరం.. ఎవరైనా స్టోరీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం... అంత అనిపించకపోవచ్చు. చూసేవాళ్లు నా రివ్యూ చూస్తే.. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళండి... శాటిస్ఫై అవుతారు.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... 20స్ స్టార్టింగ్ లో జైలు నుండి విడుదలైన ఖైదీ లెనిన్ (అఖిల్ అక్కినేని) తన ఊరు శ్రీ రామపురం వెళ్లడంతో కథ ఫ్లాష్ బ్యాక్ కి 90స్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ లెనిన్ కి తానూ ప్రాణంగా ప్రేమించిన భారతి (భాగ్యశ్రీ బోర్సే)కి జరిగిన విషాదం ఏంటి? అసలు ఎవరి వల్ల వాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతారు. మధ్యలో తన క్లోజ్ ఫ్రెండ్ వసంత్ (ప్రమోద్ పంజు) కథేంటి? అసలు లెనిన్ జైలుకి వెళ్తాడు? ఊళ్ళో జాతర బాగా జరిపించాడా? జైలు నుండి బైటికి వచ్చి తన పగ తీర్చుకున్నాడా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Pluspoints :
ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే... ఈ సినిమా నెరేషనే అని చెప్పాలి. చాలా సింపుల్ కథని ఆడియన్స్ కి నచ్చేట్టు మంచి మాస్ మసాలా సీన్లతో ఎంగేజింగ్ గా చూపించడానికి ట్రై చేసారు డైరెక్టర్. అసలు నిజం చెప్పాలంటే సినిమాకు చాలా వరకు హైప్ లేదు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ కట్ చూసిన తర్వాతే పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ సినిమా పలు వాయిదాల తర్వాత రిలీజ్ అయినా కూడా, రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. సినిమాలో మహా భారతం రిఫరెన్స్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేసారు. కథకి కనెక్ట్ అయితే కొన్ని సీన్స్ కి గూస్బంప్స్ రావడం గ్యారెంటీ. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు ట్విస్ట్ లు క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నారు.
ఇక లెనిన్ గా అఖిల్ తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో చాలా ఇంప్రెసివ్ గా నటించాడని చెప్పాలి. అలాగే భాగ్యశ్రీ బొర్సే కి కూడా ఫస్ట్ టైం మంచి స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అఖిల్ ఎమోషనల్ సీన్స్ లో బాగా పండించేసాడు. ఇక ప్రమోద్ పంజు తన రోల్ లో డిఫరెంట్ షేడ్స్ తో సర్ప్రైజ్ చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ లో అదరగొట్టారు.
Minus Points :
అయితే ఈ లెనిన్ మూవీకి మైనస్ పాయింట్ కథే అని చెప్పాలి. మహాభారతం రిఫరెన్స్ లతోనే తీసుకున్నప్పటికీ కథ పరంగా చాలా సింపుల్ గా, అంతా ఊహించినట్టు ఉంటుంది. పైగా కథలో అంత ఫ్రెష్ నెస్ కనిపించదు. అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం, దసరా లాంటి మూవీస్ ఈ సినిమా చూసేటప్పుడు పక్కా గుర్తుకొస్తాయి. పైగా సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే, థియేటర్లో ఆడియన్స్ ఇంకా బాగా సప్రైజ్ అవడానికి షాక్ అవడానికి ఆస్కారం ఉండేది. ఇక సినిమాలో సాంగ్స్ బాగానే ఉన్నా, ప్లేస్ మెంట్ సరిగా లేదు, అలాగే కథలో కొన్ని అవసరం లేదనిపిస్తుంది.
Technical values :
టెక్నికల్ గా చూసుకుంటే... సినిమాటోగ్రఫీ బాగుంది. భారీ సెట్టింగ్స్ ని చాలా నేచురల్ గా డిజైన్ చేసి, ఒక సాలిడ్ రూరల్ అండ్ రా రాండ్ రస్టిక్ డ్రామాగా, మాస్ మసాలా మూవీగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బీజీఎమ్ స్కోర్ ఇంతకు ముందు విన్నట్టు అనిపిస్తుంది. కానీ మ్యాచ్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. కొన్ని లెంగ్తీ షాట్స్ ని ట్రిమ్ చేయాల్సింది. డైరెక్టర్ మురళి కోశోర్ అబ్బూరి చాలా చిన్న కథనే తీసుకున్నా, తన వరకు అనుకున్న కథని ఆడియన్స్ కి నచ్చే విధంగా చూపించే ప్రయత్నం చేసారు.
Final Review :
ఫైనల్ గా లెనిన్ మూవీ గురించి చెప్పుకోవాలంటే... చిన్న కథతో వచ్చినా... ఈ లెనిన్ మహాభారత యుద్ధంలో గెలిచేలాగానే ఉన్నాడు. అఖిల్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అలాగే భాగ్యశ్రీ బోర్సే రోల్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా అఖిల్ పెర్ఫార్మన్స్ కోసం, డీసెంట్ రూరల్ మాస్ డ్రామా కోసం, లెనిన్ ని ఓసారి థియేటర్లో ట్రై చేయొచ్చు.