Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 373–384 of 1045 reviews

Peddi Movie Review

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఇది కమర్షియల్ సినిమా అనేకన్నా ఒక ఎమోషనల్ స్ఫూర్తి...

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఇది కమర్షియల్ సినిమా అనేకన్నా ఒక ఎమోషనల్ స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా సినిమా అని చెప్పొచ్చు. కథ పరంగా అంతగా లేకపోయినా, బుచ్చిబాబు స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్ మరోసారి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఓ సీన్, ఆ తర్వాత క్లైమాక్స్ వరకు అలాంటి సీన్స్ స్టార్ హీరో చేయడానికి ధైర్యం కావాలి. చరణ్ ఆ సీన్స్ చేయడమే కాదు చేసి ఏడిపించాడు కూడా.


అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా తమ నటనలో సీనియారిటీ చూపించారు. ఎఆర్ రహ్మాన్ ఊరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రైలర్ ద్వారా వచ్చిన ట్రోల్స్ కి సినిమా ద్వారా సమాధానం చెప్పాడు. ఇక టెక్నికల్ గానూ సినిమా ఔట్స్టాండింగ్ గా ఉంది. మొత్తంగా ‘పెద్ది’ ఊరు, తన మనుషులకు గుర్తింపు కోసం ఒక ఆటగాడిగా ఏం చేసాడు? అందరిలో ఎలా స్ఫూర్తి నింపాడు అని కమర్షియల్ గా ఎమోషనల్ గా తెరకెక్కించారు. కొత్తదనం కోరుకోకుండా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ అందరికి ఈ సినిమా నచ్చుతుంది. 


8.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే బలమైన కథా కథనాలు రాసుకోవడంలో దర్శకుడు బుచ్చిబా...

రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే బలమైన కథా కథనాలు రాసుకోవడంలో దర్శకుడు బుచ్చిబాబు విఫలమయ్యాడు. కాని తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు బుచ్చి. తనలోని నటుడిని బయటికు తీసుకువచ్చే క్యారెక్టర్ చేయడానికి ఎప్పుడూ రెడీ ఉండే రామ్ చరణ్ మరోసారి తన యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటో చూపించారు. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్ తమ పెర్ఫార్మన్స్ తో మరో హైలెట్ గా నిలిచారు.


అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా కథ కన్నా, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే అది బాగానే ఉంది కానీ, బలమైన కొత్త తరహా కథ తీసుకోలేకపోయారు బుచ్చిబాబు. దివ్యేందు శర్మ, రవి కిషన్, బోమన్ ఇరానీ వంటి ఆర్టిస్టులకు సరైన రోల్స్ పడలేదు. ఓవరాల్ గా కమర్షియల్ అంశాలతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమా పెద్ది. అయితే... కమర్షియాలిటీ కంటే కంటెంట్ హైలైట్ అవుతుంది. కథలో ఎమోషనల్ సీన్స్ హై ఇస్తాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు, అలాగే లాస్ట్ 30 మినిట్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. బుచ్చిబాబు రచనలో నిజాయతీని అభినందించాలి. రామ్ చరణ్ తన నటనతో సినిమాను నిలబెట్టారు. పెద్ది... నటుడిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఆయన కోసం సినిమా చూడాలంతే 

7.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా నటించిన 'పెద్ది’ సినిమా ఫైనల్ గా థియేటర్లలో విడుదలకాగా, సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. మరీ యానానిమస్ రేంజ్ లో కాకపోయినా, రీసెంట్ బిగ్గిస్ లో వన్...

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా నటించిన 'పెద్ది’ సినిమా ఫైనల్ గా థియేటర్లలో విడుదలకాగా, సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. మరీ యానానిమస్ రేంజ్ లో కాకపోయినా, రీసెంట్ బిగ్గిస్ లో వన్ అఫ్ ది బెస్ట్ గా టాక్ తెచ్చుకుంది. సినిమాలో రామ్ చరణ్ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, బుచ్చిబాబు టేకింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. ఇక ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే రొటీన్, రెగ్యులర్‌ గా, కమర్షియల్ అంశాలు లెక్కలేసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అయితే అప్పలసూరికి సంబంధించి ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుడిని భావోద్వేగాల ఊగిసలాటకు గురి చేస్తుంది. 


ఇంటర్వెల్ బ్యాంగ్‌ తో కథను మలుపు తిప్పిన దర్శకుడు బుచ్చిబాబు, పెద్ది పాత్రను చెక్కిన విధానం, ఆ పాత్రలో రాంచరణ్ చూపించిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తాయి. సెకండాఫ్‌లో పెద్ది, గౌర్నాయుడు పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే సినిమాలో కనెక్టవిటీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తాయి. ఇక ఎడిటింగ్, సాదా సీదా VFX ఇలాంటి స్వల్ప లోపాలు పక్కన పెట్టేయొచ్చు. ఓవరాల్ గా రాంచరణ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనే విధంగా పెద్దిగా నటించాడు. కలెక్షన్లు మాత్రమే కాకుండా అవార్డులు కూడా తెచ్చిపెట్టే సినిమా పెద్ది. థియేటర్‌లోనే చూడండి.. డోంట్ మిస్.. మస్ట్ వాచ్ మూవీ.


8.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా నటించిన చిత్రం 'పెద్ది’. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా థియేటర్లలో విడుదల...

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా నటించిన చిత్రం 'పెద్ది’. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విజయనగరంలో ఏ గుర్తింపు లేని, అంటే కనీసం ఆ ప్రాంతంలో 1800 మంది ఉన్నారన్న విషయం తెలియని ప్రభుత్వానికి ఆ ఊరి యువకుడు ఎలా గుర్తింపు తెచ్చాడు? అదొక ఊరని దేశానికి ఎలా తెలియజేశాడు? ఈ జర్నీలో ఎదురైన సవాళ్లేంటి అన్నది ఇతివృత్తంగా తీసిన సినిమా ఇది. 


ఇక సినిమా మొత్తం బ్యాక్ బోన్ గా ఉండి నడిపించిన రామ్ చరణ్ ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటాడు. బలమైన భావోద్వేగాలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడు. అయితే బలమైన కథ, కథనం లేకపోవడంతో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కొంత డిస్సపాయింట్ అవుతారు. కానీ బుచ్చిబాబు తన టేకింగ్ తో కొంతవరకు మెప్పించాడు. దర్శకుడిగా రామ్ చరణ్ లోని నటుడ్ని మరోసారి ఆవిష్కరించి గురువుకి తగ్గ శిష్యుడనిపించుకున్నాడు. కానీ తెరపై పేరున్న ఆర్టిస్ట్‌లు ఎంతో మందిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల లాజిక్స్‌ను వదిలేస్తే, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా ఉంటాయి. కానీ బుచ్చి రచనలో నిజాయతీ ఉంది. కొన్ని సీన్స్‌ను, డైలాగ్‌లను బాగా రాసుకున్నాడు. ఓవరాల్ గా కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. అయితే అభిమానులకు అయితే పెద్ది విందు భోజనం లాంటి సినిమా. ప్రస్తుతం ఏ సినిమా పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్‌ అవుతుంది. మొత్తం మీద పెద్ది రామ్‌చరణ్‌ వన్‌మెన్‌ షోగా చెప్పుకోవచ్చు


6.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా రాబట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, జాన...

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా రాబట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు, బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. 


అయితే కథ పరంగా చాలా చిన్నగా ఉంటుంది. మాములు కొండప్రాంతానికి చెందిన పెద్ది అనే యువకుడు ఊరి కోసం చేసిన పోరాటమే ఈ కథ నేపథ్యం. ఇక స్క్రీన్ ప్లే కూడా కాస్త డల్ గా ఉన్నప్పటికి, ఆడియన్స్ ని ఎమోషనల్ గా టచ్ చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటన ఢిల్లీ ఎపిసోడ్స్, కుస్తీ సీన్స్ హైలెట్ అయ్యాయి. అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా మూవీకి ప్లస్ అయ్యారు. ఎఆర్ రహ్మాన్ సినిమాకి అద్భుతమైన సాంగ్స్ తో పాటు సాలిడ్ బీజీఎమ్ ఇచ్చారు. ఓవరాల్ గా సినిమాకి పెద్ది కథ ఇంకా బలంగా రాసుకుని ఉంటె ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉండేది. కాని ఫైనల్ గా ఈ పెద్ది అందరికి గుర్తుండిపోతాడు. 

7.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

Tupaki

By Tupaki

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు ద...

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. 


కథ పరంగా రొటీన్ స్టోరీయే అయినా, తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో బుచ్చిబాబు మ్యానేజ్ చేసాడు. ఇక ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు ఏరి కోరి ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నందుకు ఆయన మంచి ఔట్ పుటే ఇచ్చాడు. స్పెషల్లీ బీజీఎం అదిరిపోయింది. రత్నవేలు విజువల్స్ సాంకేతికంగా సినిమాలో మరో హైలైట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చరణ్ తో పాటు జగపతిబాబు, శివరాజ్ కుమార్ రోల్స్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఒక చిన్న సినిమా అనుభవంతో ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేసిన విధానానికి.. రామ్ చరణ్ నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకున్న తీరుకు బుచ్చిబాబు అభినందనీయుడే.


7.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర...

సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన పెద్ది సినిమా ఆడియన్స్ నుండి యానానిమస్ గా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు. అయితే ఎప్పుడో అరిగిపోయిన టెంప్లెట్, ఫార్మాట్‌ ను వాడారు బుచ్చిబాబు. అదొక్కటి సినిమాకి మైనస్ గా నిలిచింది. 


ఇక స్పెషల్ సాంగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఆపై హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్స్ కోసమే ఉన్నట్టు అయిపొయింది. ఫస్ట్ హాఫ్ లో చాలావరకు మరీ ప్రెడిక్టబుల్‌ గా సాగుతుంది. ఇంటర్వెల్‌ కి కాస్త కథ బరువు ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్‌ లో కుస్తీ సీన్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ఇక ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఓవరాల్ గా సినిమా రామ్ చరణ్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. 

7.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి...

టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంది. ఊరి గుర్తింపు కోసం ఆటగాడైన పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా కథ. 


ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘పెద్ది’... ఆడియన్స్ మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, మూడు వేరియేషన్స్ లలో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ మరో హైలైట్ గా నిలిచారు. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది. అన్నిటికి మించి రొటీన్ కథే అయినా బుచ్చిబాబు తన టేకింగ్ తో మెప్పించాడు. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మంచి ఎమోషనల్ బ్లాక్ లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి థియేటర్ లో ట్రీట్ ఇస్తాయి. 


7.0
out of 9
1 month ago
Jun 04, 2026 Hindi

Review For Mareechika

వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls‌ తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend‌ లో రిలాక్స్ అవుదామని friends‌ తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాన...
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls‌ తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend‌ లో రిలాక్స్ అవుదామని friends‌ తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమా మాత్రం చాలా slow execution‌ తో సాగింది. సినిమాలో కొన్ని twists బాగున్నా, క్లైమాక్స్ కొచ్చేసరికి చాలా బోర్ ఫీలోచ్చింది. actors కూడా బాగా perform చేశారు. బట్ స్టోరీయే సరిగా లేనప్పుడు ఏం చేస్తాం. narration చాలా lag అయ్యింది. ఏదో Work stress తగ్గించుకోవడానికి movie కి వెళ్తే, ఇంకో stress add అయింది మాకు. దాని బదులు హోటల్ కెళ్ళి బిర్యానీ తిన్నా బాగుండేదనిపించింది. Overall‌ మరీచికని ఇప్పుడు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లయితే OTT కి వచ్చిన తర్వాత చూస్తే బెటర్.
5.0
out of 9
1 month ago
Jun 03, 2026 Telugu

Mareechika Movie Review

Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense element...

Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense elements work well in key moments. 


ilayaraja music is also good, But expected more. overall Mareechika is a decent watchable.

6.0
out of 9
1 month ago
Jun 02, 2026 Telugu

Mareechika Movie Review

మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట...

మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. 


క్లైమాక్స్ కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంది.. కానీ ఆడియన్స్ ఊహకు అందకుండా నాన్-లీనియర్ పద్ధతిలో కథను నడిపించడంలో స్క్రీన్ ప్లే రైటర్స్ చూపించిన నేర్పు మెచ్చుకోవాలి. అయితే లాజిక్స్ వెతికే వాళ్లకు కొన్ని ప్రశ్నలు మిగిలినా.. ఓవరాల్‌గా ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్నిచోట్ల మాత్రం లాజిక్ ఉండదు.. మరికొన్నిచోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్లకు మరీచిక మంచి ఛాయిసే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మరీచిక.. డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!




5.0
out of 9
1 month ago
Jun 01, 2026 Telugu

Mareechika movie Review

మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చె...

మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ 'మరీచిక'లో థ్రిల్లర్ ఒక సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. కాని ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది.


ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ని చాలా నిరాశపరిచింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మరీచిక... పేరుకు తగ్గట్లుందీ ఈ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు స్కిప్ చేయడం బెటర్. లేదంటే ఓటిటిలో చూసేయొచ్చు. 

3.0
out of 9
1 month ago
Jun 01, 2026 Telugu
Why MRO?