Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి డైరెక్టర్ వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆడియన్స్ చూడొచ్చా అంటే... టీజర్, ట్రైలర్ చూసాక మూవీ గురించి డిసైడ్ అవ్వండి. కొత్తదనం కోసం చూడొచ్చు కానీ, ఎంటర్టైన్ అవ్వాలంటే మాత్రం కష్టమే.
అండ్ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ సప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాలో సత్యదేవ్ వన్ మ్యాన్ షో తో ఇంప్రెస్ చేసారు. ఇక సినిమాలో సింపుల్ గా పాయింట్ మొత్తం చెప్పాలంటే హ్యుమానిటీ గురించి డిఫరెంట్ గా చెప్పినట్టుంది. అండ్ హీరో సహా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ ప్రొడక్షన్ డిసైనింగ్ కూడా బాగున్నాయి. అండ్ ఎండింగ్ మాత్రం కొత్తగా ఉన్నా అంతగా ఎక్కలేదని చెప్తాను. ఫ్రెష్ స్టోరీ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ కోసం ఈ మూవీ ఆడియన్స్ ట్రై చేయొచ్చు.
నాగ బంధం మూవీ రివ్యూ... ఎం చెప్తామండి why నాగబంధం అన్నట్టుంది. ఇలాంటి సినిమాలతో చాలా కష్టం. అదే దోస ఎన్ని సార్లు. ఇక ఈ సినిమాలో హీరో కర్ణ యాక్టింగ్ జీరో అని చెప్పాలి. అనాలని కాదు గాని కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుండేదని అనిపించింది. నభా నటేష్ కూడా అంతే.
అండ్ సినిమాకి డబ్బులు బానే ఖర్చు పెట్టినట్టు తెలిసిపోతుంది. అదొక్కటే... ఈ సినిమాకి ప్లస్ అయింది. అంటే రిచ్ విజువల్స్ తప్ప ఎం లేదు.
ఇక అసలు నాగబంధం ఏంటి అంటే సినిమా మొత్తం చూసినా అసలు చెప్పరు. ఫైనల్ గా సెకండ్ పార్ట్ అని ట్విస్ట్ ఇచ్చారు. అండ్ 3 గంటల సినిమాలో కథ ఎక్కడా పొంతన లేకుండా ఉంటుంది. కొన్ని సీన్లయితే మూడు నాలుగు సార్లు రిపీట్ చేస్తారు.. అండ్ ఇందులో కొన్ని CGలు, VFX లు ఉంటాయి.. వరెస్ట్ అనిపిస్తది. మరీ ఓవర్ గా ఉంటాయి. అండ్ యాక్షన్ సీన్స్ అయితే బోయపాటి సినిమాల కంటే అన్యాయంగా ఉంటాయి ఈ సినిమాలో. ఓవరాల్ గా విజువల్స్ కోసం ఓసారి ట్రై చేస్తే చేయండి.. లేదు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బుర్ర పాడే.
నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా రిఫరెన్స్ సీన్స్ చాలా ఉంటాయి.
వరెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఒక పెద్ద ఆక్షన్ సీక్వెన్ జరుగుతుంటే సడన్ గా పెద్ద ఫ్లాష్ బ్యాక్ సీన్ నడుస్తూ ఉంటది. అది అస్సలు కనెక్ట్ కాలేదు. మే బీ కనెక్ట్ అయ్యుంటే సినిమా నచ్చి ఉండేదేమో. క్యాస్టింగ్ కూడా బాలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టు ఉండదు. ఆక్షన్ సీన్స్ బాగున్నా, సందర్భం లేకుండా ఉన్నాయనిపిస్తోంది. అండ్ లెంగ్త్ కూడా చాల ఎక్కువైపోయింది. సగం నుండే థియేటర్ లోంచి లేచిపోదాం అనుకున్నా... కానీ ఎదో ఓపిక పట్టి ఉన్నందుకు... పార్ట్ 2 అని చెప్పి కొంప ముంచాడు. ఓవరాల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుందనిపించినా ఫైనల్ గా ఎం లేదనిపిస్తుంది. నిద్రొచ్చేస్తుంది. కానీ ఓవర్ లౌడ్ మ్యూజిక్ వల్ల థియేటర్లో నిద్ర కూడా పోలేం.
సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే.
ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది. సెకండ్ హాఫ్ మాత్రం వరెస్ట్ ఉంటది. సనాతన ధర్మ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ గా సినిమా బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. రన్ టైం కూడా 3 గంటలు ఉండడం వల్ల చాలా ల్యాగ్ అనిపించింది. హీరోగా విరాట్ కర్ణ ఏం ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ లైన్, అండ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం వల్ల ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా యూస్ ఉండదు.
ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు.
ముందు సినిమాలో ఒక నటుడు హీరో ఎప్పుడవుతాడంటే... అన్యాయం జరిగేటప్పుడు కాపాడడానికి వచ్చినపుడే హీరో అవుతాడు. కానీ ఈ సినిమాలో మొత్తం కూడా అన్యాయం జరిగిపోయాక ఫైట్ చేస్తాడు.. అప్పుడేమాత్రం ఫీల్ కూడా రాదు. అండ్ సినిమాలో డైలాగులు కూడా వరెస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అవి సందర్భం లేకుండా వస్తాయి. ట్విస్టులు ఎదో ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే.. అసలేమాత్రం ఎక్కవు. ఓపెన్ గా చెప్పాలంటే మూడు గంటల పదహరు నిమిషాల ఈ సినిమాలో నేను చూసింది రెండున్నర గంటలే... ఏదైనా బెటర్ ఉంది అంటే... అది గ్రాఫిక్స్ మాత్రమే. ట్రెజర్ హంట్ సినిమా అని చెప్పి... నరకడం చంపడం తప్ప ఎం లేదు.
ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గాని, టెంపుల్ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చించి లేపేస్తారేమో అని అనుకున్నా.
కానీ ఆ లెంగ్తి ఇంటర్వెల్ బ్లాక్ ఏమి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ లో జరిగే ఫ్లాష్ బ్యాక్ సూపర్ గా ఉంటది అనుకుంటే.. చాలా ల్యాగ్ చేసి చాలా బోర్ కొట్టించారు. ఇంకా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా లెంగ్తి సీన్స్ తో బోర్ కొట్టించడం వల్ల కొన్ని మంచి సీన్స్ ఉన్నా కూడా అవి మార్చిపోతాం. అండ్ నాగసాధు ఎపిసోడ్స్ బాగానే ఉన్నా, హై గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా, ఆ లెంగ్త్ వల్ల మనం రిసీవ్ చేసుకోలేము. ఇక సినిమా గురించి చెప్పుకోవడానికి అంత ఎం లేదు ఎందుకంటే... సినిమా ఆడియన్స్ ని ఎంత ఫ్రస్టేట్ చేస్తదో దానికోసం మరో వీడియో చేయొచ్చు అలా ఉంది.
నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్, బీజీఎమ్ రాంప్ ఆడించారు.
ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైట్ మధ్యలో సినిమా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారో అప్పుడే సినిమా దొబ్బింది. ఇక హీరోహీరోయిన్ల ట్రాక్ కూడా బాలేదు. అలాగే హీరో యాక్టింగ్ లో చాలా ఇంప్రెప్ అవ్వాలి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా డిస్సపాయింట్ చేసారు. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనడం ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఓసారి చూడొచ్చు ఆ విజువల్స్ కోసం.
Save The Tigers 3 review
సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు.
ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే.
సో ఓవరాల్ గా లీడ్ యాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయొచ్చు.
మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం దీవానా... బావుందండి మూవీ.. మంచిగా అనిపించింది నాకైతే.. ఈ సినిమా ట్రైలర్ చూసి ఎదో కొడుతోంది అనుకున్నా, కానీ అదేం లేదు సినిమాలో మెటీరియల్ ఉంది. మెయిన్ గా ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని హైలెట్ చేసారు గాని, ఫ్రెండ్షిప్ కూడా బాగా చూపించారు. ఒక హై ఉంటది సినిమాలో. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఇదేదో నిబ్బా నిబ్బి సినిమాలా అనిపించింది గాని, ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలెట్ ఉంటది.
అండ్ సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ బాగుంటది. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. స్టోరీ, రైటింగ్, పెర్ఫార్మన్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పేదేంటంటే బాగుంది దీవానా సినిమా.
దీవానా... సినిమా చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కి ఓటిటి రిలీజ్ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ఫీల్ ఇచ్చింది. బట్ ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ మీద ఎక్కువ డీల్ చేసారు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇక అడల్ట్ కంటెంట్ ఎం లేదు కాబట్టి ఫ్యామిలీ కూడా చూడొచ్చు.
ప్లస్ పాయింట్ చూస్తే... హీరోహీరోయిన్స్ పెర్ఫార్మన్స్ బాగుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా బానే చేసారు. మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉంటుంది. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా నచ్చవు. అండ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు మూవీ. its a one time watchable.. thats it.. my rating 2.75/5
దీవానా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఒకే ఒకే. సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ గా అన్ని సినిమాల్లానే ఉండే లవ్ స్టోరీ. బట్ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి స్టోరీ మొత్తం మారిపోతుంది. అక్కడ్నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వే లో వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ మీద ఓపినియన్ మారిపోతుంది. కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే పేలిపోయింది.
ఇక సినిమాలో హీరోహీరోయిన్స్ తో సహా, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. స్పెషల్లీ సినిమాలో హీరో ఫ్రెండ్స్ రోల్ చేసిన వాళ్ళు కూడా అదరగొట్టారు. అండ్ సినిమాని చాలా ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేసారు డైరెక్టర్. ఫైనల్ గా దీవానా సినిమా పర్లేదు అనిపించింది. బాగానే ఉంది గాని క్లాసిక్ ఫీల్ రాలేదు.
Transfer Trimurthulu movie Review
By Cinema Picha
first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది.
నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్ బోరింగ్ గా ఉంటది. అండ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. పొలిటికల్ సీన్స్ కూడా అంత లేవు. అండ్ హీరోకి ఫైట్స్ అస్సలు వర్కౌట్ అవలేదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సింపుల్ గా డీసెంట్ మూవి తక్కువ అంచనాలతో చూస్తే మూవీ నచ్చవచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers