Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

512
Total Reviews
72
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 1-12 of 512 reviews
Clear all filters

Palla Burusu movie review

Tupaki

By Tupaki

5.0
out of 10
పళ్ళ బురుజు సినిమాకి కథ పరంగా మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకుని విప‌రీతంగా సాగ‌దీసి.. సిల్లీ సీన్ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సినిమా ఇది.ప‌ళ్ళ‌బురుసు క‌థ న‌డిచేది ద‌శాబ్దాల కింద‌టి కాలంలో కాదు.. వ‌ర్త‌మానంలోనే. మ‌రి ఈ రోజుల్లో ప‌ల్లెటూళ్ల‌లో టూత్...

పళ్ళ బురుజు సినిమాకి కథ పరంగా మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకుని విప‌రీతంగా సాగ‌దీసి.. సిల్లీ సీన్ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సినిమా ఇది.

ప‌ళ్ళ‌బురుసు క‌థ న‌డిచేది ద‌శాబ్దాల కింద‌టి కాలంలో కాదు.. వ‌ర్త‌మానంలోనే. మ‌రి ఈ రోజుల్లో ప‌ల్లెటూళ్ల‌లో టూత్ బ్ర‌ష్ దొర‌క‌ని ప‌రిస్థితులు ఎక్క‌డైనా ఉన్నాయా? కానీ ఈ సినిమాలో త‌న కొడుకు బ్ర‌ష్ కొనివ్వ‌లేదని తండ్రి కోర్టుకెక్క‌తాడు మరి.


కానీ నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా మెయిన్ లీడ్ లో నటించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ల నటన సహజంగా ఉంది. ఇక రచయిత - దర్శకుడు ఉదయ్ చౌహాన్ చెప్పాలనుకున్న పాయింట్.. ఇవ్వాలనుకున్న సందేశం బాగున్నా.. స్క్రిప్టు సరిగా రాసుకోకపోవడంతో.. ఊరికే సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడంతో పళ్ళబురుసు ఒక మామూలు ప్రయత్నంగా మిగిలిపోయింది. చివరగా: పళ్ళబురుసు.. అన్ని సినిమాలు బలగం అవ్వవు


Aug 19, 2026 Telugu

Palla Burusu movie review

5.0
out of 10
Palla Burusu," starring *Balagam* fame Sudhakar Reddy and Muralidhar Goud in lead roles, Directed by Uday Chauhan and jointly produced by Annapurna Studios and Epic Studios. coming to the review its a decent below avarage movie. Climax portionsA couple of songsSudhakar Reddy’s natural performanceDrawbacksAmateurish directionWeak screenplayLack of cinematic momentsUnconvincing characterisation...

Palla Burusu," starring *Balagam* fame Sudhakar Reddy and Muralidhar Goud in lead roles, Directed by Uday Chauhan and jointly produced by Annapurna Studios and Epic Studios. coming to the review its a decent below avarage movie. 


Climax portions

A couple of songs

Sudhakar Reddy’s natural performance


Drawbacks

Amateurish direction

Weak screenplay

Lack of cinematic moments

Unconvincing characterisation


Pallaburusu works to some extent during the climax and through its songs. But the weak screenplay and amateurish direction overshadow its sincere intentions. Despite a promising premise, the film tests the audience’s patience with weak writing, unconvincing characterisation and uneven execution.


Bottom Line: Good Intentions, Unconvincing Execution.

Aug 19, 2026 Telugu

Palla Burusu Movie review

4.0
out of 10
వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో, కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఆశించే కాస్తంత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ పళ్ళ బురుసు కథ తయారు చేసుకున్నారు. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు బలమైన భావోద్వేగాలను తగ్గ కథనం అల్లుకోవాలి. కానీ ఇందులో ఈ రెండూ లేవు. తండ్రీ కొడుకుల మధ్య దూరంతో పాటు… తండ్రి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాన్ని బలంగా చెప్పలేకపోయారు. కొన్ని సీన్స్ అయి...

వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో, కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఆశించే కాస్తంత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ పళ్ళ బురుసు కథ తయారు చేసుకున్నారు. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు బలమైన భావోద్వేగాలను తగ్గ కథనం అల్లుకోవాలి. కానీ ఇందులో ఈ రెండూ లేవు. తండ్రీ కొడుకుల మధ్య దూరంతో పాటు… తండ్రి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాన్ని బలంగా చెప్పలేకపోయారు. 


కొన్ని సీన్స్ అయితే టీవీ సీరియల్ కంటే అన్యాయంగా చిత్రీకరణ ఉంది. శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. మాములుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇలాంటి చుట్టేసిన సినిమాను ప్రేక్షకులు ఆశించరు. ఆరంభం నుంచి చివరి వరకూ నీరసంగా సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఏమాత్రం లేదనే చెప్పాలి. ఒక్క వర్డ్ లో సినిమా గురించి చెప్పాలంటే.. "ఆసక్తి కలిగించని "పళ్ళబురుసు".

Aug 19, 2026 Telugu

Palla Burusu Movie Review

5.0
out of 10
 బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "పళ్ళ బురుసు" తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అయితే సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంద...

 బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "పళ్ళ బురుసు" తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఉదయ్ చౌహన్ దర్శకుడిగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అయితే సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంది. 


పెర్ఫార్మన్స్ పరంగా అందరు నటులు సహజంగా అద్భుతంగా నటించారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘పళ్ళ బురుసు’ కేవలం కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే మెప్పిస్తుంది. కోర్ లైన్, ఇతర కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గానే ఉన్నాయి. పైగా ఫస్టాఫ్ కథనం వీక్ గా సాగింది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో కథనం ఇలా ఉంటే బాగుండేది. సో వీటితో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

Aug 19, 2026 Telugu

Makutam movie review

5.0
out of 10
మకుటం సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల ఫార్మూలా కథ. పోర్టు మాఫియా నేపథ్యంగా అల్లుకొన్న కథను హీరో విశాల్ దర్శకుడిగా మారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే భాషా తరహా ట్విస్ట్ ఉన్న కథ అయినప్పటికీ.. స్టోరీలో బలమైన పాయింట్ లేకపోవడం, సెకండాఫ్ కోసమే ఫస్టాఫ్‌ ను మరీ సాగదీశారా? అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే పెర్ఫార్మన్స్ పరంగా, విశాల్ మూడు, నాలుగు గెటప్స్‌ లో తన క్యారెక...

మకుటం సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల ఫార్మూలా కథ. పోర్టు మాఫియా నేపథ్యంగా అల్లుకొన్న కథను హీరో విశాల్ దర్శకుడిగా మారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే భాషా తరహా ట్విస్ట్ ఉన్న కథ అయినప్పటికీ.. స్టోరీలో బలమైన పాయింట్ లేకపోవడం, సెకండాఫ్ కోసమే ఫస్టాఫ్‌ ను మరీ సాగదీశారా? అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే పెర్ఫార్మన్స్ పరంగా, విశాల్ మూడు, నాలుగు గెటప్స్‌ లో తన క్యారెక్టర్‌ ను కొత్తగా ట్రై చేశాడు. వయసు మళ్లిన క్యారెక్టర్, యంగ్ క్యారెక్టర్‌ లో ఒదిగిపోయాడు.


సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ ఫర్వాలేదనిపిస్తాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ స్టాండర్డ్స్‌ కు ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మాణ విలువలను పాటించారు. భాషా తరహా ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


Aug 18, 2026 Tamil +1

Makutam Movie review

5.0
out of 10
హీరోగా విశాల్ కెరీర్ మొదలై 20 ఏళ్ళు దాటింది. హీరోగా తొలి అడుగులు వేసే సమయంలో కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త కథలు - సినిమాలు చేశారు. ఆయనకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత విశాల్ ఎంపిక చేసుకునే కథలు, సినిమాల్లో మూస ధోరణి ఎక్కువైంది. మార్క్ ఆంటోనీ, మద గజ రాజా హిట్స్ అయినా రొటీన్ కమర్షియల్ కథలతో తీసిన సినిమాలే అవి. ఈ తరుణంలో విశాల్ మెగాఫోన్ పట్టి దర్శకుడుగా మారడంతో ఎటువంటి సినిమా తీస్తారోనని పరిశ్రమ ప...

హీరోగా విశాల్ కెరీర్ మొదలై 20 ఏళ్ళు దాటింది. హీరోగా తొలి అడుగులు వేసే సమయంలో కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త కథలు - సినిమాలు చేశారు. ఆయనకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత విశాల్ ఎంపిక చేసుకునే కథలు, సినిమాల్లో మూస ధోరణి ఎక్కువైంది. మార్క్ ఆంటోనీ, మద గజ రాజా హిట్స్ అయినా రొటీన్ కమర్షియల్ కథలతో తీసిన సినిమాలే అవి. ఈ తరుణంలో విశాల్ మెగాఫోన్ పట్టి దర్శకుడుగా మారడంతో ఎటువంటి సినిమా తీస్తారోనని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం చూశారు.


మకుటం చూస్తే… హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ విశాల్ 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళారని అనిపించింది. అసలు ఎటువంటి కొత్తదనం లేకుండా వచ్చిన సినిమా 'మకుటం'. హీరోగా, దర్శకుడిగా విశాల్ కెరీర్‌కు ఈ సినిమా ఏ విధంగానూ హెల్ప్ అవ్వదు. స్కిప్ చేయడం బెటర్. ఇటువంటి కథలు, సన్నివేశాలతో కూడిన సినిమాలను ప్రేక్షకులు పదుల సంఖ్యలో చూశారు. దర్శకుడిగా విశాల్ నుంచి ఇంత రొటీన్ ఫిల్మ్ వస్తుందనుకోలేదు. బాగా డిజప్పాయింట్ చేశారు.

Aug 18, 2026 Tamil +1

Makutam movie Review

5.0
out of 10
యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. అయితే సినిమా విషయానికి వస్తే డివైడ్ టాక్ తెచ్చుకుంది. బలహీనమైన కథ, రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. సినిమాలో విశాల్ యాక్టింగ్ మినహా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మహా అయితే క్లైమాక్...

యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. అయితే సినిమా విషయానికి వస్తే డివైడ్ టాక్ తెచ్చుకుంది. బలహీనమైన కథ, రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. సినిమాలో విశాల్ యాక్టింగ్ మినహా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. 


మహా అయితే క్లైమాక్స్ లో ఆడవాళ్లతో తీసిన ఫైట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అంతకుమించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పేవలమైన కథతో విశాల్ దర్శకుడిగా పరిచయం కావటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. రొటీన్ ఫార్ములాతో వెళుతున్నపుడు ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. పాత్రల్లో వైవిధ్యం చూపించాలి. ఆ జాగ్రత్తలేవీ తీసుకోలేదు. అదే సినిమాకు పెద్ద మైనస్ అయింది. సో… దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇక సింపుల్ గా ఒక్క వర్డ్ లో సినిమా గురించి చెప్పాలంటే... కొత్తదనం లేని మకుటం. 

Aug 18, 2026 Tamil +1

Makutam movie review

4.0
out of 10
విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఫైనల్ గా విశాల్ దర్శకత్వం వహించిన మకుటం సినిమా మాస్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఆడియన్స్ ని మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల అవి సరిగా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా బోరి...

విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. 


ఫైనల్ గా విశాల్ దర్శకత్వం వహించిన మకుటం సినిమా మాస్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఆడియన్స్ ని మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల అవి సరిగా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఇంట్రెస్టింగ్ నేరేషన్ లేకపోవడం వల్ల సినిమా అంతగా ఆకట్టుకోలేదు. విశాల్ పెర్ఫార్మన్స్ కోసమైతే ఒకసారి ట్రై చేయొచ్చు.  


Aug 18, 2026 Tamil +1
7.0
out of 10
వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) సినిమాతో వచ్చేశాడు. సినిమా విషయానికి వస్తే... చాలా సింపుల్ పాయింట్ తోనే సినిమా తెరకెక్కగా డైరెక్టర్ సింపుల్ కథని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న మూవీగా తీర్చిదిద్దాడు...

వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) సినిమాతో వచ్చేశాడు. సినిమా విషయానికి వస్తే... చాలా సింపుల్ పాయింట్ తోనే సినిమా తెరకెక్కగా డైరెక్టర్ సింపుల్ కథని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న మూవీగా తీర్చిదిద్దాడు అని చెప్పాలి. 


సూర్య మరోసారి తనదైన నటనతో మెప్పించగా, ఉన్న తక్కువ యాక్షన్ సీన్స్ లో కూడా కుమ్మేశాడు. ఇక హీరోయిన్ మమితా బైజు మాత్రం తన క్యూట్ యాక్టింగ్ తో ఫుల్ మార్కులు కొట్టేసి అందరి కన్నా బెటర్ గా జోరు చూపించింది. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు. ఇక జివి ప్రకాష్ సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ లెవల్ లో మెప్పించింది. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి మరీ లక్కీ భాస్కర్ రేంజ్ లో కాకపోయినా కూడా ఓ మంచి ఫ్యామిలీ మూవీతో సూర్యని బాగా ప్రజెంట్ చేయడమే కాకుండా సినిమా పరంగా కూడా మరోసారి సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. సినిమా చూసిన ఆడియన్స్ థియేటర్స్ నుండి వచ్చేటప్పుడు కచ్చితంగా ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వస్తారు. 


Aug 17, 2026 Tamil +1
6.0
out of 10
Venky Atluri has delivered two successful films with non-Telugu stars, His third film also with a non-Telugu star, Vishwanath and Sons, features Suriya in the lead. coming to the vishwanath and sons movie reviews in single words... HighlightsSuriya’s charismaEntertaining first halfMamitha Baiju’s comic scenesDrawbacksOld-school melodrama in the second halfLack of good songsOoty portionsLength...

Venky Atluri has delivered two successful films with non-Telugu stars, His third film also with a non-Telugu star, Vishwanath and Sons, features Suriya in the lead. coming to the vishwanath and sons movie reviews in single words... 


Highlights

Suriya’s charisma

Entertaining first half

Mamitha Baiju’s comic scenes


Drawbacks

Old-school melodrama in the second half

Lack of good songs

Ooty portions

Lengthy runtime


Overall, Vishwanath and Sons has its moments, particularly in the first half. The driver episode, the fun moments involving Suriya’s family and Mamitha Baiju, and the performances of the lead actors work well. However, the lengthy runtime, formulaic scenes and uneven second half prevent it from becoming a completely engaging family drama. Nevertheless, Vishwanath and Sons makes for a decent watch.


Aug 17, 2026 Tamil +1
6.0
out of 10
డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో విశ్వనాధ్ అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవాన్ని తెస్తాయి. ఇక సెకండాఫ్ లో కథ కాస్త వేగం తగ్గి తీవ్రమైన భావోద్వేగాల వైపు సాగుతుంది. ఫస్టాఫ్ లో ఉన...

డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో విశ్వనాధ్ అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవాన్ని తెస్తాయి. ఇక సెకండాఫ్ లో కథ కాస్త వేగం తగ్గి తీవ్రమైన భావోద్వేగాల వైపు సాగుతుంది. ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ లోపించడంతో పాటు స్టోరీ కొంతవరకు అంచనా వేసేలా మారుతుంది. 


అలాగే సినిమాలో వయస్సు వ్యత్యాసం, సరోగసీ వంటి అంశాలను సంక్లిష్టం చేయకుండా చూపించడంలో డైరెక్టర్ విజయం సాధించారు. రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి సామాజిక సందేశాలను చక్కగా జోడించారు. సూర్య, మామితా బైజు అల్టిమేట్ పెర్ఫార్మన్స్ కి తోడు వెంకీ అట్లూరి డైరెక్షన్, జివి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. బంధాలు, అనుబంధాల ప్రాధాన్యతను చాటిచెప్పే మంచి ప్రయత్నం.


Aug 17, 2026 Tamil +1
సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్‌ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్‌ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` కూడా అలాంటిదే. సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేం అనేంత బాగా నటించి మ...

సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్‌ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్‌ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` కూడా అలాంటిదే. సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేం అనేంత బాగా నటించి మెప్పించాడు. ఇక మ్యాడీ పాత్రలో మమితా బైజు ఇరగదీసింది. ఆద్యంతం నవ్విస్తూనే గుండెని బరువెక్కించింది. 


దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న కథ బాగుంది. స్క్రీన్‌ ప్లే సినిమాకి ప్రాణమని చెప్పొచ్చు. డైలాగ్‌లు కూడా అంతే బాగున్నాయి. టైట్‌గా రాసుకున్నారు. కొంత స్లో, రొటీన్‌ సీన్లు, ఊహించే సన్నివేశాలు మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు జోడించాడు. కుటుంబ విలువలు, ఇంట్లో ఉండే ఈగోలు, ఫన్‌, యాక్షన్‌ మేళవింపుగా రూపొందించారు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. ఫైనల్‌ గా ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ లా సాగే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విశ్వనాథ్‌ అండ్‌ సన్స్.


Aug 17, 2026 Tamil +1
Why MRO?