Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
88
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 169-180 of 233 reviews
Clear all filters

Dacoit movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
“డెకాయిట్” పేరుతో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినా, కొంతవరకు ఆకట్టుకునే అంశాలతో నిలిచింది. Dacoit సినిమాకు “ఓ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో లవ్, యాక్షన్ కలిసిన స్ట్రాంగ్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ తెరపై మాత్రం ఆ అంచనాలకు విరుద్ధంగా కథ సాగడం గమనించదగ్గ విషయం.హీరోగా Adivi Sesh, హీరోయిన్‌గా Mrunal Thakur తమ నటనతో సినిమాను కొంతవరకు నిలబెట్...

“డెకాయిట్” పేరుతో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినా, కొంతవరకు ఆకట్టుకునే అంశాలతో నిలిచింది. Dacoit సినిమాకు “ఓ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో లవ్, యాక్షన్ కలిసిన స్ట్రాంగ్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ తెరపై మాత్రం ఆ అంచనాలకు విరుద్ధంగా కథ సాగడం గమనించదగ్గ విషయం.

హీరోగా Adivi Sesh, హీరోయిన్‌గా Mrunal Thakur తమ నటనతో సినిమాను కొంతవరకు నిలబెట్టారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్‌లో వారి పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

అయితే ఫస్ట్ హాఫ్‌లో కొంత ఎంగేజ్‌మెంట్ ఉన్నా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించడం, కొన్ని లాజిక్ లేకుండా కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.


దర్శకుడు టేకింగ్ విషయంలో తన ముద్ర వేయగలిగాడు. మేకింగ్, నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. అయితే కంటెంట్ పరంగా బలహీనతలు ఉండటం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ చూపించలేకపోయింది.

మొత్తంగా “డెకాయిట్” ఓ సరాసరి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కొత్తదనం, బలమైన కథ కోరుకునే ప్రేక్షకులకు ఇది కాస్త నిరాశ కలిగించే అవకాశం ఉంది. కానీ ఎమోషనల్ టచ్, యాక్షన్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి చూసేలా మాత్రం ఉంటుంది.




Apr 10, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 News Channel
6.0
out of 10
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రాకాస మూవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా హారర్, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాజిక్స్ వెతక్కుండా హ్యాపీగా సినిమా చూస్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక కథ పరంగా పాత చింతకాయ పచ్చడే అయినా, సంగీత్ శోభన్ సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. సెకండ్ హాఫ్ మొ...

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రాకాస మూవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా హారర్, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాజిక్స్ వెతక్కుండా హ్యాపీగా సినిమా చూస్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక కథ పరంగా పాత చింతకాయ పచ్చడే అయినా, సంగీత్ శోభన్ సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను హిలేరియస్ గా నవ్విస్తారు. నయన్ సారిక తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. రాధ్య గెస్ట్ పాత్రలో అలరించింది. రాజు పాత్రలో అనూప్ సింగ్ బాగానే నటించాడు. జబర్దస్త్ రోహిణి కూడా తన నటనతో నవ్విస్తుంది. తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి, వాసు ఇంటూరి, రోహన్ రాయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.


సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ సీన్స్, వర్కౌట్ అవ్వని కామెడీ కట్ చేస్తే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కోట సెటింగ్ కోసం బాగా కష్టపడ్డారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కథ సింపుల్ అయినా స్క్రీన్ ప్లే, సస్పెన్స్ కామెడీతో బాగా రాసుకొని తెరకెక్కించింది దర్శకురాలు మానస శర్మ. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. ఓవరాల్ గా ‘రాకాస’ ఆసక్తికరంగా సాగిన సస్పెన్స్ కామెడీ సినిమా.

Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 News Channel
6.0
out of 10
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ రాకాస ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పుకుంటే కథ పరంగా చాలా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దర్శకురాలు మానస శర్మకి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా హ్యాండిల్ చేసింది. ఇక ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సంగీత్ శోభన్. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలి...

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ రాకాస ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పుకుంటే కథ పరంగా చాలా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దర్శకురాలు మానస శర్మకి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా హ్యాండిల్ చేసింది. ఇక ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సంగీత్ శోభన్. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై నడిపించాడు. ఇక తన పరిధి మేరకు చక్కగా నటించింది నయన్ సారిక. వెన్నెల కిషోర్ & గెటప్ శ్రీను వీళ్ళ కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోసింది. 


అలాగే అనుదీప్ దేవ్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. ఎడిటింగ్ బాగుంది. రన్ టైమ్ చాలా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్. విట్టలాచార్య తరహా చందమామ కథల కాన్సెప్ట్‌ను ఇప్పటి జనరేషన్‌ కి తగ్గట్లు క్లీన్ కామెడీతో బాగా డీల్ చేశారు. సెకండాఫ్‌లో చిన్నపాటి తడబాటు ఉన్నా, ఓవరాల్‌గా డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశారు. ఇటు నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా చాలా రిచ్ గా తెరకెక్కించారు. ఓవరాల్‌ గా రాకాస.. ఫన్ ఫాంటసీ సమ్మర్ ఎంటర్టైనర్.. నో లాజిక్ ఓన్లీ కామెడీ..!

Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 News Channel
6.0
out of 10
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు.పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో సహజంగా నటించగా, గెటప్ శీను,...

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో సహజంగా నటించగా, గెటప్ శీను, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్‌తో నవ్వులు పంచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తే… వీఎఫ్ఎక్స్ అద్భుత స్థాయిలో లేకపోయినా, నాసిరకం అనిపించకుండా క్లీన్‌గా రూపొందించారు. అనుదీప్ దేవ్ సంగీతం డీసెంట్‌గా ఉండగా, అన్వర్ అలీ ఎడిటింగ్ సినిమాకు బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా ఉన్నాయి.

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ‘రాకాస’ సినిమా ఫ్యామిలీస్ ని, ముఖ్యంగా అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలను మిస్ అవుతున్న పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. 


Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 News Channel
Sakshi

By Sakshi

6.0
out of 10
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాకాస’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ మేళవింపుతో ఓ డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించగా, గెటప్ శీను...


మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాకాస’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్ మేళవింపుతో ఓ డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.

నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే… సంగీత్ శోభన్, నయన్ సారిక తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించగా, గెటప్ శీను, వెన్నెల కిషోర్ కామెడీతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా అనిపించకపోయినా… నాసిరకం అనే భావన రాకుండా క్లీన్‌గా ప్రెజెంట్ చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం డీసెంట్‌గా ఉండగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ సినిమాకు బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా కనిపించాయి.

సమ్మర్ సీజన్ నేపథ్యంలో ‘రాకాస’ సినిమా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ హారర్-కామెడీ అంశాలు నచ్చేలా ఉన్నాయి.

మొత్తంగా ‘రాకాస’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒకసారి చూసే విధంగా ఉండే డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. 

Apr 03, 2026 Telugu

Biker Movie Review

బైకర్ (Biker) 2026 News Channel
7.0
out of 10
తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. అయితే బైకర్ రెగ్యులర్‌ గా చూసే కమర్షియల్ సినిమా కాదు. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ లో స్పీడ్ పెంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దానికి తోడు జిబ్రాన్ అందించిన బీజీఎమ్ బిగ్గెస్...

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. అయితే బైకర్ రెగ్యులర్‌ గా చూసే కమర్షియల్ సినిమా కాదు. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ లో స్పీడ్ పెంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దానికి తోడు జిబ్రాన్ అందించిన బీజీఎమ్ బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఈ సినిమాలో పాత్ర కోసం శర్వానంద్ తన ప్రాణం పెట్టేసాడు. పర్ఫెక్ట్ రేసర్‌ లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే డా. రాజశేఖర్ పాత్ర చాలా బాగుంది. పైగా అయన కెరీర్ కి సాలిడ్ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.


టెక్నికల్ గా సంగీతంతో పాటు, నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త ఫోకస్ చేయాల్సింది. ఓవరాల్‌ గా బైకర్.. ఎంగేజింగ్ రేసింగ్ సినిమాగా ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

Apr 03, 2026 Telugu

Biker movie Review

బైకర్ (Biker) 2026 News Channel
6.0
out of 10
శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.'బైకర్' సినిమాలో నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక బలమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. హీరో పాత్ర కాకపోయినా… కథ మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరిగేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో ప్రేక్షకులను కదిలించేలా నటించా...

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

'బైకర్' సినిమాలో నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక బలమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. హీరో పాత్ర కాకపోయినా… కథ మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరిగేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో ప్రేక్షకులను కదిలించేలా నటించారు. మాళవిక నాయర్ ఫస్టాఫ్‌ లో గ్లామర్‌తో ఆకట్టుకోగా… సెకండాఫ్‌లో నటనతో మెప్పించింది. కథలో ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండటం విశేషం. విలన్‌గా అతుల్ కులకర్ణి సెటిల్డ్‌గా నటించి మెప్పించగా… అన్వర్ పాత్రలో కనిపించిన నటుడు కూడా తన పాత్రను బాగా నెరవేర్చాడు. బ్రహ్మాజీ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతికంగా చూస్తే… జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. డైలాగులు తక్కువగానే ఉన్నప్పటికీ… ఉన్నవన్నీ కథను బలంగా ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి. మొత్తంగా ‘బైకర్’ సినిమా ఎమోషన్స్, రేసింగ్ ఎలిమెంట్స్ కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాజశేఖర్ నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తున్నాయి

Apr 03, 2026 Telugu

Biker movie Review

బైకర్ (Biker) 2026 News Channel
Sakshi

By Sakshi

6.0
out of 10
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.దర్శకుడు అభిలాష్ రెడ్డి తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను స్పోర్ట్స్ డ్రామాతో కలిపి చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ...

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

దర్శకుడు అభిలాష్ రెడ్డి తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను స్పోర్ట్స్ డ్రామాతో కలిపి చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోతూ మంచి నటన కనబరిచారు. అలాగే డా. రాజశేఖర్ రీ ఎంట్రీ తర్వాత మరోసారి స్ట్రాంగ్ రోల్‌లో కనిపిస్తూ తన అనుభవాన్ని చూపించారు. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు సినిమాకు బలం చేకూర్చాయి.


సినిమాలోని రేసింగ్ సన్నివేశాలు థ్రిల్ కలిగించేలా తెరకెక్కించబడినాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం, కథలో కొంత రొటీన్ అంశాలు ఉండటం వల్ల అక్కడక్కడా యావరేజ్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయినప్పటికీ, సెకండాఫ్‌లో వచ్చే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే నేరేషన్ ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టేలా చేస్తుంది.

మొత్తంగా ‘బైకర్’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ఓవర్ ఆల్‌గా ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటోంది

Apr 03, 2026 Telugu

Happy Raj Movie Review

5.0
out of 10
జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించాడు. ఇక థియేటర్లలో మంచి ఫామిలీ డ్రామాగా టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ కి వస్తే... ఈ సినిమా లో జివి ప్రకాశ్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరి యువకుడి పాత్రలో జివి ప్రకాశ్ ఒదిగిపోయాడు. అలాగే సినిమాకి జార్జ్ మేరియన్ నటన కూడా మంచి ప్లస్ అయింది. తండ్రి...

జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించాడు. ఇక థియేటర్లలో మంచి ఫామిలీ డ్రామాగా టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ కి వస్తే... ఈ సినిమా లో జివి ప్రకాశ్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరి యువకుడి పాత్రలో జివి ప్రకాశ్ ఒదిగిపోయాడు. అలాగే సినిమాకి జార్జ్ మేరియన్ నటన కూడా మంచి ప్లస్ అయింది. తండ్రి పాత్రలో ఆయన జీవించారు. ‘ప్రేమ దేశం’ ఫేమ్ అబ్బాస్ దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా డీసెంట్ అండ్ స్టైలిష్‌గా మెప్పించారు. శ్రీ గౌరీ ప్రియ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించి, జివి ప్రకాశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. 


ఇక టెక్నికల్ గా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కాస్త లౌడ్‌గా అనిపించింది.. పాటలు పర్లేదు. మదన్ క్రిస్టోఫర్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.. సెకండాఫ్‌లో పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా ఓకే. ఇక నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడిగా మరియా రాజా మంచి కథ తీసుకున్నాడు.. దాన్ని పూర్తిస్థాయిలో చెప్పడంలో కాస్త కన్ఫ్యూజ్ అయినా ఓవరాల్‌గా ఎమోషనల్ డ్రామా చూపించారు. ఓవరాల్‌గా హ్యాపీ రాజ్.. ఓ నాన్న కథ.

Mar 31, 2026 Telugu

Youth Movie Review

యూత్ (Youth) 2026 News Channel
6.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ చిత్రం సరదాగా సాగుతుంది. కెన్ కరుణాస్ తన పాత్రలో సహజంగా నటించి ఆకట్టుకున్నారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ తమ పాత్రలకు తగ్గట్టు కనిపించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ నటుల అనుభవం వారి నటనలో ప్రత...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ చిత్రం సరదాగా సాగుతుంది. కెన్ కరుణాస్ తన పాత్రలో సహజంగా నటించి ఆకట్టుకున్నారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ తమ పాత్రలకు తగ్గట్టు కనిపించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ నటుల అనుభవం వారి నటనలో ప్రతిబింబించింది.


సినిమా ప్రధానంగా స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్‌ ను టార్గెట్ చేస్తుంది. ఫ్రెండ్స్‌ తో కలిసి వెళ్లి సరదాగా చూసేలా కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. సంగీతం పరంగా జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం చేకూర్చింది. అయితే కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు కనిపించడం మైనస్‌ గా మారింది. మొత్తంగా చూస్తే… యూత్ సినిమా పెద్దగా కొత్తదనం లేకపోయినా, లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఓకే అనిపించే చిత్రంగా నిలిచింది. 

Mar 30, 2026 Telugu

Youth Movie Review

యూత్ (Youth) 2026 News Channel
6.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా నటించిన యూత్ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ల సహా ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.అలాగే టెక్నికల్ గా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. పాటలతో పాటు యూత్‌ఫుల్ లవ్ ట్రాక్స్‌కి తగ్గట్లే అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విక్కీ కెమెరా వర్క్ సినిమా మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గ...

కెన్ కరుణాస్ హీరోగా నటించిన యూత్ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ల సహా ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.

అలాగే టెక్నికల్ గా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. పాటలతో పాటు యూత్‌ఫుల్ లవ్ ట్రాక్స్‌కి తగ్గట్లే అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విక్కీ కెమెరా వర్క్ సినిమా మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. 


అయితే ఎడిటర్ నాష్ వర్క్ విషయంలో కాస్త అసంతృప్తి మిగులుతుంది. కథను ఇంకాస్త క్రిస్ప్‌గా చెప్పే అవకాశం ఉన్నా, కొన్ని సీన్లను ఎడిట్ చేయకుండా అలాగే వదిలేశాడు. దీనివల్ల రన్‌టైమ్ కాస్త పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. నటుడిగా కాకుండా, దర్శకుడిగా కెన్ పర్లేదనిపించాడు. ఓవరాల్‌ గా యూత్.. పర్లేదు అనేలా ఉంది. అంటే థియేటర్లో హ్యాపీగా ఓసారి చూడొచ్చు..!

Mar 30, 2026 Telugu

Youth Movie Review

యూత్ (Youth) 2026 News Channel
7.0
out of 10
తండ్రి తమిళ సీనియర్ నటుడు కరుణాస్ ప్రేరణ తో నటుడు అయిన కెన్ ఇప్పటికే నటుడిగా పలు సినిమాలతో మెప్పించగా ఇప్పుడు హీరోగా యూత్ సినిమాతో చాలా యాక్టివ్ గా నటించి అదరగొట్టాడు. గంగవల్లిగా అనీషా, ప్రేషిక పాత్రలో మీనాక్షి, సోనాల్ కారెక్టర్‌లో ప్రియాన్షీ క్యూట్ గా కనిపిస్తూ బాగానే నటించారు. కెన్ అండ్ గ్యాంగ్ కూడా ప్రతీ సీన్‌ లోనూ నవ్వించారు. కెన్ ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు అక్కడక్కడా నవ్విస్తూ ఆకట్టుకు...

తండ్రి తమిళ సీనియర్ నటుడు కరుణాస్ ప్రేరణ తో నటుడు అయిన కెన్ ఇప్పటికే నటుడిగా పలు సినిమాలతో మెప్పించగా ఇప్పుడు హీరోగా యూత్ సినిమాతో చాలా యాక్టివ్ గా నటించి అదరగొట్టాడు. గంగవల్లిగా అనీషా, ప్రేషిక పాత్రలో మీనాక్షి, సోనాల్ కారెక్టర్‌లో ప్రియాన్షీ క్యూట్ గా కనిపిస్తూ బాగానే నటించారు. కెన్ అండ్ గ్యాంగ్ కూడా ప్రతీ సీన్‌ లోనూ నవ్వించారు. కెన్ ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు అక్కడక్కడా నవ్విస్తూ ఆకట్టుకుంటారు. మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా సూరజ్, దేవదర్శిని చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వలేదనిపించారు.


టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. జీవీ ప్రకాష్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. రెగ్యులర్ లవ్ స్టోరీ అయినా యూత్‌కి నచ్చే అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. ఓవరాల్ గా ‘యూత్’ లో ఓ అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు చివరకు ఎలా మారాడు? ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనేది చక్కగా చూపించారు. 

Mar 30, 2026 Telugu
Why MRO?