Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 25-36 of 1647 reviews
6.0
out of 10
శ్రీ విష్ణు టైటిల్ రోల్‌ లో మహిమా నంబియార్ కథానాయికగా, జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ ను ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, కమ...

శ్రీ విష్ణు టైటిల్ రోల్‌ లో మహిమా నంబియార్ కథానాయికగా, జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ ను ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అడవిలో కామ్రేడ్ ట్రాక్, ఎంటర్‌టైనింగ్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఎపిసోడ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి.


అయితే కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ప్రారంభంలో కథనం కాస్త స్లోగా సాగడం చిన్న మైనస్. కొన్ని డబ్బింగ్ సమస్యలు మరియు క్లైమాక్స్ ఇంకాస్త ఇంపాక్ట్‌ ఫుల్‌గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉన్నాయి. ఓవరాల్ గా కథనంలో కొత్తదనం పెద్దగా లేకపోయినా... శ్రీవిష్ణు-సత్య కాంబో అందించే నాన్‌స్టాప్ ఫన్ అండ్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ కోసం ‘కామ్రేడ్ కళ్యాణ్’ నిష్ఫలంగా ఒకసారి నవ్వుకోవడానికి హ్యాపీగా చూడదగ్గ డీసెంట్ మూవీ. ఫైనల్లీ కామ్రేడ్ కళ్యాణ్ కామెడీ కళ్యాణే కానీ..!


Oct 09, 2026 Telugu
6.0
out of 10
సీరియస్ సినిమాలతో మొదలుపెట్టి.. కామెడీ వైపు టర్న్ అయి.. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకువచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం అన్నది చాలా సీరియస్.. సెన్సెటివ్ సబ్జెక్ట్. హీరో ఆ అవతారం ఎత్తాడంటే ఆ కథ నడిచే టోనే వేరుగా ఉంటుంది. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు థియేటర్లో కూర్చుంటే.. మొత్తం కామెడీనే ఉంది....

సీరియస్ సినిమాలతో మొదలుపెట్టి.. కామెడీ వైపు టర్న్ అయి.. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకువచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం అన్నది చాలా సీరియస్.. సెన్సెటివ్ సబ్జెక్ట్. హీరో ఆ అవతారం ఎత్తాడంటే ఆ కథ నడిచే టోనే వేరుగా ఉంటుంది. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు థియేటర్లో కూర్చుంటే.. మొత్తం కామెడీనే ఉంది. పైగా ఈ కథ కొంచెం మింగుడుపడనట్లే సాగుతుంది. నక్సలైట్లు ఇంత సిల్లీగా వ్యవహారాలు నడుపుతారా.. పోలీసులు ఇంత డమ్మీగా ఉంటారా.. ఒక మామూలు కుర్రాడు ఇద్దరితో ఇలా ఆడేసుకుంటాడా అనిపించేలా ఇందులో కథ నడుస్తుంది. 


కానీ కథ-పాత్రల గురించి ఎక్కువ ఆలోచించకుండా.. లాజిక్కులేమీ పట్టించుకోకుండా.. కేవలం కామెడీ మీదే ఫోకస్ చేసి నవ్వుకుంటాం అంటే మాత్రం శ్రీవిష్ణు అండ్ గ్యాంగ్ టైంపాస్ వినోదాన్ని అందిస్తుంది. కానీ స్క్రిప్టులో బిగి మాత్రం లేదు. నక్సలిజం మీద కథను మరీ ఇంత నాన్ సీరియస్ గా నడిపించడం మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ కామెడీని బాగానే డీల్ చేయగలడనడానికి అనేక సన్నివేశాలు రుజువుగా నిలుస్తాయి. తన కామెడీ ఫ్లో బాగుంది. కానీ సీరియస్ గా కథ చెప్పాల్సిన చోట మాత్రం మరీ తేలిగ్గా నడిపించేశాడు. చివరగా కామ్రేడ్ కళ్యాణ్..శ్రీవిష్ణు-సత్యల కామెడీ కోసం ఓసారి చూసేయొచ్చు. 


Oct 09, 2026 Telugu
5.0
out of 10
దర్శకులు జానకిరామ్ మారెళ్ల, రచయితలు భాను భోగవరం, నందు సావిరిగన టీమ్ రాసుకొన్న ఈ కామ్రేడ్ కళ్యాణ్ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేలవించి వండిన ఫన్ ఒక కిచిడి. ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా కాకుండా సరదాగా రెండున్నర గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి చాలా కన్వినియెంట్ స్క్రీన్ ప్లే‌ తో తమకు అనుకూలంగా కథను, సన్నివేశాలను పేర్చుకొన్న చిత్రంగా చెప్పవచ్చు. శ్రీవిష్ణు...

దర్శకులు జానకిరామ్ మారెళ్ల, రచయితలు భాను భోగవరం, నందు సావిరిగన టీమ్ రాసుకొన్న ఈ కామ్రేడ్ కళ్యాణ్ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేలవించి వండిన ఫన్ ఒక కిచిడి. ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా కాకుండా సరదాగా రెండున్నర గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి చాలా కన్వినియెంట్ స్క్రీన్ ప్లే‌ తో తమకు అనుకూలంగా కథను, సన్నివేశాలను పేర్చుకొన్న చిత్రంగా చెప్పవచ్చు. శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కామెడీ, కమెడియన్ సత్య, సుదర్శన్ ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.


రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓవరాల్‌ గా చిన్న లవ్ స్టోరి, ఇంటర్వెల్ టిస్ట్, నక్సలైట్ల ఎపిసోడ్, ఎమోషనల్ క్లైమాక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. చివర్లో చిన్న సందేశంతో ఈ సినిమా సీరియస్ సినిమా కాదు.. వినోదాత్మక చిత్రమని చెప్పే ప్రయత్నం చేశారు.ఇక టెక్నికల్ గా సాయి శ్రీరాం అడవి అందాలను బాగా కెమెరాలో బంధించాడు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పరంగా ఒకే. ఓవరాల్ గా సినిమా నుంచి ఎక్కువగా ఆశించకుండా సరదాగా ఈ వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న సినిమాగా చెప్పొచ్చు. భారీ అంచనాలతో వెళితే నిరాశపడే ప్రమాదం ఉంది. కాబట్టి కామెడీ, ఫన్ అంశాలను దృష్టిలో పెట్టుకొని వెళితే టైంపాస్ మూవీ అనే ఫీలింగ్‌ తో బయటకు రావొచ్చు.


Oct 09, 2026 Telugu
5.0
out of 10
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుంది. కానీ దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చే...

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుంది. కానీ దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇవ్వలేదు. మిగతా ఆర్టిస్టులు బాగా చేసారు.


కంటెంట్ పరంగా ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిన అంశాలు పెద్దగా లేకపోయినా, సెకండాఫ్‌లో కామెడీని యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణ... డామినేట్ చేయడం వల్ల సినిమా వేగం దెబ్బతింది. దీంతో ప్రేక్షకులకు కామెడీ సినిమా చూస్తున్నామన్న అనుభూతి ఆశించిన స్థాయిలో ఉండదు. మొత్తమ్మీద ఈ "కామ్రేడ్ కళ్యాణ్" చూసి "లాల్ సలాం" అని గట్టిగా పై శృతిలో అరవలేం కానీ, అనకుండా మాత్రం ఉండలేం. అందుకే మధ్య స్థాయిలో "లాల్ సలాం".  

Oct 09, 2026 Telugu
5.0
out of 10
Sree Vishnu who has become a bankable hero when it comes to entertainment tried yet another comedy entertainer, Comrade Kalyan. Kona Venkat presents the film which is directed by a newcomer, Janakiram and produced by another newcomer, Krishna. The film has an interesting Naxal backdrop.Positives:1.⁠ ⁠Around an hour of entertainment in the first half2.⁠ ⁠Pre-interval twist3.⁠ ⁠Sree Vishnu’s Perform...

Sree Vishnu who has become a bankable hero when it comes to entertainment tried yet another comedy entertainer, Comrade Kalyan. Kona Venkat presents the film which is directed by a newcomer, Janakiram and produced by another newcomer, Krishna. The film has an interesting Naxal backdrop.


Positives:

1.⁠ ⁠Around an hour of entertainment in the first half

2.⁠ ⁠Pre-interval twist

3.⁠ ⁠Sree Vishnu’s Performance

4.⁠ ⁠Couple of Satya’s Comedy episodes


Negatives:

1.⁠ ⁠Not-so-engaging romantic track

2.⁠ ⁠Over cooked second half with too many elements

3.⁠ ⁠Cliche climax

4.⁠ ⁠Take off of the film


Finally, Comrade Kalyan has an entertaining one-hour in the first half and this portions are sure to work well with the audience. However, the second half gives a feeling of ‘all over the place’. You may give it a try for entertainment it offers at times. A bit more care in the writing and a bit of fine tuning in the second half, would have made the film a good watch


Bottomline: Passable with Few Laughs

Oct 09, 2026 Telugu
6.0
out of 10
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినూత్న సబ్జెక్టు లతో అలరించే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంది. ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదేదో సీరియస్ కంటెంట్ లా ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇందులో అందుకు భిన్నంగా ఫన్ ట్రీట్ దొరుకుతుంది. దర్శకుడు దీనిని ఆద్యంతం వినోదభరితంగా మంచి...

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినూత్న సబ్జెక్టు లతో అలరించే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంది. ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదేదో సీరియస్ కంటెంట్ లా ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇందులో అందుకు భిన్నంగా ఫన్ ట్రీట్ దొరుకుతుంది. దర్శకుడు దీనిని ఆద్యంతం వినోదభరితంగా మంచి ఫన్ మూమెంట్స్ తో డిజైన్ చేశారు. తెలుగు తెరపై నక్సలిజం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా, ఈ చిత్రంలో ఆ అంశాన్ని పూర్తిస్థాయి కామెడీ కోణంలో నడిపించిన తీరు ఇంప్రెస్ చేస్తుంది.


అయితే సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చేవరకు కథనంలో మూమెంట్స్ స్లోగా కొంచెం డల్ అనిపిస్తాయి. వీటితో పాటు పాత్రల పరిచయం కూడా అంత బలంగా కుదరలేదు అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ నుండి మంచి కామెడీ సీన్స్ తో నవ్విస్తుంది. ఇక మొత్తంగా చూస్తే, ‘కామ్రేడ్ కళ్యాణ్’ మంచి ఫన్ మూమెంట్స్ తో సాగే టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. శ్రీవిష్ణు, సత్యల కామెడీ ట్రాక్ థియేటర్ లో మంచి ఫన్ ని జెనరేట్ చేస్తుంది. ఆరంభ సన్నివేశాలు, క్లైమాక్స్ కాస్త తడబడినా.. ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఇందులో కొదవ లేదు. సో ఈ వారాంతానికి ఓ డీసెంట్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకుంటే ఇదొక ఛాయిస్ గా నిలుస్తుంది.




Oct 09, 2026 Telugu

Anakapalli movie review

5.0
out of 10
అనకాపల్లి మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతది. అంటే రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అంటే అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్ గా మిక్స్ అయ్యి ఉంటాయి ఈ మూవీలో. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈవెన్ పాటలు కూడా చాలా బాగుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. సో ఓవర...

అనకాపల్లి మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతది. అంటే రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అంటే అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్ గా మిక్స్ అయ్యి ఉంటాయి ఈ మూవీలో. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈవెన్ పాటలు కూడా చాలా బాగుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. సో ఓవరాల్ గా ఒక మంచి కమర్షియల్ సినిమా. రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. 


అలానే సినిమాలో బేసిక్ గా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా ప్రాపర్ గా హ్యాండిల్ చేసేసారు సో అక్కడ మెయిన్. అండ్ సాంగ్స్ అవి కూడా బాగున్నాయి. సో ఓవరాల్ గా ఒక ప్రాపర్ అన్ని ఎలిమెంట్స్ ని కలిపిన ఒక ప్యాకేజ్ మూవీ లాగా, ఒక ఫ్యామిలీ డ్రామా లాగా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా లాగా అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతది. సో ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ మూవీ, ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ప్రాపర్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో చాలా మూవీస్ లో మిస్ అయ్యే కొన్ని ఆస్పెక్ట్స్ కావాలనుకున్న కొన్ని ఆస్పెక్ట్స్ ఈ మూవీలో రకరకాలుగా కూడా ప్రాపర్ గా సెట్ అయిన ఫీలింగ్ అయితే వస్తది మనకి. ఓవరాల్ గుడ్ మూవీ. 

Oct 07, 2026 Telugu

Anakapalli Movie Review

5.0
out of 10
హీరో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విలన్‌ ని ప్రేమించడం.. అసలు ఆ అమ్మాయి అలా (ట్విస్ట్‌) ఎందుకు చేసింది అన్న ఇతివృత్తంతో సాగే విలేజ్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ ఇది. ఈ తరహా కథ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే దీనికి కుటుంబ భావోద్వేగాలు, డ్రగ్స్‌ మాఫియాను జోడించి దర్శకుడు కాస్త ఆసక్తికరంగా రూపొందించారు. అయితే అమ్మాయిని ఆకట్టుకోవడానికి, ప్రేమలో దించడానికి హీరో చేసిన ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోవు. రెగ్యులర్‌గా...

హీరో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విలన్‌ ని ప్రేమించడం.. అసలు ఆ అమ్మాయి అలా (ట్విస్ట్‌) ఎందుకు చేసింది అన్న ఇతివృత్తంతో సాగే విలేజ్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ ఇది. ఈ తరహా కథ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే దీనికి కుటుంబ భావోద్వేగాలు, డ్రగ్స్‌ మాఫియాను జోడించి దర్శకుడు కాస్త ఆసక్తికరంగా రూపొందించారు. అయితే అమ్మాయిని ఆకట్టుకోవడానికి, ప్రేమలో దించడానికి హీరో చేసిన ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోవు. రెగ్యులర్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌ అంతా ఎమోషన్‌, రివెంజ్‌ చుట్టూ తిరుగుతుంది. 


ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ బావుంది కదా.. కథ ముందుకు వెళ్లే కొద్ది కొత్తదనం ఆశించవచ్చేమో అనుకుంటే అదీ లేదు. రొటీన్‌ గానే ఉంది. పైగా ఇదే క్లైమాక్స్‌.. ఇక ఎండ్‌ అయిపోయిందనుకున్న ప్రతిసారీ కొత్త బ్లాక్‌తో మళ్లీ నిడివిని పెంచేశారు. ఫైనల్‌గా డివోషనల్‌ ఎలిమెంట్‌ ఇచ్చి కథను ముగించారు. అయితే ఈ కథ ద్వారా దర్శకుడు చాలా విషయాలను టచ్‌ చేశాడు. మిడిల్‌క్లాస్‌ కుర్రాడు దారి తప్పితే అతని జీవితం ఎలా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారు? ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా ఏంటి? అన్నది ఈ కథ ద్వారా చెప్పాడు. ఫైనల్ గా కొన్ని ప్రేమకథలు పెళ్లితో పూర్తవుతాయి.. కొన్ని ప్రేమకథలు త్యాగంతో పవిత్రమవుతాయి అని ఎండ్ కార్డు వేశారు. యాక్షన్‌ సినిమాలు నచ్చేవారికి ఇది నచ్చే అవకాశం ఉంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త అనకాపల్లి బెటర్ అని చెప్పొచు. 

Oct 07, 2026 Telugu

Anakapalli movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
హీరో రౌడీయిజానికి ఆక‌ర్షితుడై తానూ అలా ఎద‌గాల‌నుకోవ‌డం.. ఈ లైన్ చూడ‌గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆటోమేటిగ్గా సుకుమార్ సినిమా జ‌గ‌డం గుర్తుకొస్తుంది. అన‌కాప‌ల్లి కూడా ఆ లైన్ మీద న‌డిచే సినిమానే కానీ.. రౌడీయిజానికి ఒక ల‌వ్ స్టోరీని జోడించి రెంటినీ బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు అన‌కాప‌ల్లి మేక‌ర్స్. ఎంట‌ర్టైన‌ర్ల‌కు పేరుప‌డ్డ త్రినాథ‌రావు న‌క్కిన అందించిన క‌థ‌తో కొత్త ద‌ర్శ‌కుడు ఖ‌గేష్ ఈ సినిమాను ర...

హీరో రౌడీయిజానికి ఆక‌ర్షితుడై తానూ అలా ఎద‌గాల‌నుకోవ‌డం.. ఈ లైన్ చూడ‌గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆటోమేటిగ్గా సుకుమార్ సినిమా జ‌గ‌డం గుర్తుకొస్తుంది. అన‌కాప‌ల్లి కూడా ఆ లైన్ మీద న‌డిచే సినిమానే కానీ.. రౌడీయిజానికి ఒక ల‌వ్ స్టోరీని జోడించి రెంటినీ బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు అన‌కాప‌ల్లి మేక‌ర్స్. ఎంట‌ర్టైన‌ర్ల‌కు పేరుప‌డ్డ త్రినాథ‌రావు న‌క్కిన అందించిన క‌థ‌తో కొత్త ద‌ర్శ‌కుడు ఖ‌గేష్ ఈ సినిమాను రా అండ్ ర‌స్టిగ్గా తీర్చిదిద్దాడు. క‌థ అంత కొత్త‌గా అనిపించ‌దు కానీ.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లకు తోడు బ‌ల‌మైన‌ ఎమోష‌న్లు.. కొంత‌మేర‌ క‌మ‌ర్షియ‌ల్ హంగులతో ప‌ర్వాలేద‌నిపిస్తుంది. 


అయితే హీరో హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ కాన్ఫ్లిక్ట్ బ‌లంగా ఉన్న అనకాప‌ల్లిలో క‌థ మాత్రం రొటీన్ అనిపిస్తుంది. రౌడీయిజం చుట్టూ న‌డిచే వ్య‌వ‌హార‌మంతా చాలా సినిమాల్లో చూసిందే. హీరో రౌడీయిజం మీద మోజుప‌డ‌డం చూడ‌గానే ఈ క‌థ‌కు ఎలాంటి ముగింపు ఉంటుందో ఒక అంచ‌నా వ‌చ్చేస్తుంది. సినిమాలో కొన్ని పాత్ర‌లు మొక్కుబ‌డిగా అనిపిస్తాయి. అన‌వ‌స‌ర స‌న్నివేశాలు, ఐటెం సాంగ్ లాంటివి క‌ట్ చేసి.. ఈ క‌థ‌ను ఇంకొంచెం క్రిస్ప్ గా చెబితే బాగుండేది. తార‌క్ పొన్నప్పను ఇంకా బాగా వాడుకోవాల్సింది. ఐతే కొన్ని ఎపిసోడ్లు బాగుండ‌డం.. పెర్ఫామెన్సులు ఆక‌ట్టుకోవ‌డం.. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలు ఉండ‌డం వ‌ల్ల అన‌కాప‌ల్లికి పాస్ మార్కులు ప‌డ‌తాయి. చివరగా రా అండ్ రస్టిక్‌గా సాగిన అనకాపల్లి ప్రయాణం.


Oct 07, 2026 Telugu
5.0
out of 10
విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే అనకాపల్లి యాక్షన్‌, లవ్‌ స్టోరీ గా తెరకెక్కింది. అందులో చీకటి సామ్రాజ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆ ఊబిలోకి హీరో వెళ్లడం, ఈ క్రమంలో పేరెంట్స్ మధ్య, ప్రియురాలి మధ్య, తనకు లైఫ్‌ ఇచ్చిన విలన్‌ మధ్య ఎలా నలిగిపోయాడు? దాన్నుంచి బయటపడ్డాడా లేదా అనే దానిపై కథ నడుస్తుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగినా, ఇందులో ప్రేమ కథకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అయితే విలన్‌ ని హీరోయిన్‌ ప్రేమ...

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే అనకాపల్లి యాక్షన్‌, లవ్‌ స్టోరీ గా తెరకెక్కింది. అందులో చీకటి సామ్రాజ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆ ఊబిలోకి హీరో వెళ్లడం, ఈ క్రమంలో పేరెంట్స్ మధ్య, ప్రియురాలి మధ్య, తనకు లైఫ్‌ ఇచ్చిన విలన్‌ మధ్య ఎలా నలిగిపోయాడు? దాన్నుంచి బయటపడ్డాడా లేదా అనే దానిపై కథ నడుస్తుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగినా, ఇందులో ప్రేమ కథకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అయితే విలన్‌ ని హీరోయిన్‌ ప్రేమించే కథలు చాలానే వచ్చినా, ఇటీవల కాలంలో మాత్రం ఇది కొత్తది అని చెప్పొచ్చు. 


హీరోకి సినిమాల పిచ్చి.. విలన్‌కి దగ్గరగా చేయడం, తాను కూడా విలన్‌ లా మారిపోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేసే సమయంలో ఆమె విలన్‌ కి దగ్గరయ్యే ట్విస్ట్ షాకిస్తుంది. ఆ తర్వాతనే కథనం ట్రాక్‌ తప్పినట్టుగా ఉంది. లాజిక్‌ లెస్‌ గా ఉంటుంది. హీరో బ్రేకప్‌లా ఫీలవడం కొంత రొటీన్‌ గానే ఉంటుంది. క్లైమాక్స్ లో సినిమా పుంజుకుంది. కానీ కన్‌క్లూజన్‌ మాత్రం మళ్లీ ట్రాక్‌ తప్పినట్టుగా ఉంటుంది. హీరో కోసం మారిన హీరోయిన్‌ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఏమాత్రం కన్విన్సింగ్‌ గా లేదు. సినిమాపై అప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ ని దెబ్బతీసేలా ఉంది. ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. పేరెంట్స్ కి సంబంధించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. అదే స్థాయిలో ఎండింగ్‌ ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్ గా కొంత రొటీన్‌ ఉన్నా, సరికొత్త యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ వారం వచ్చిన వాటిలో బెటర్‌గా నిలుస్తుంది.



Oct 07, 2026 Telugu

Anakapalli Movie Review

5.0
out of 10
అనకాపల్లి సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. కానీ బుల్లెట్టు పాత్ర చుట్టు డిజైన్ చేసిన ఎన్విరాన్‌మెంట్, క్యారెక్టర్స్ కొత్తగా అనిపిస్తాయి. అలాగే సూరి రోల్‌ను మలిచిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. సెకండాఫ్‌లో రొటీన్ రివేంజ్ డ్రామా కొనసాగినప్పటికీ.. చివర్లో డివోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాను ము...

అనకాపల్లి సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. కానీ బుల్లెట్టు పాత్ర చుట్టు డిజైన్ చేసిన ఎన్విరాన్‌మెంట్, క్యారెక్టర్స్ కొత్తగా అనిపిస్తాయి. అలాగే సూరి రోల్‌ను మలిచిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. సెకండాఫ్‌లో రొటీన్ రివేంజ్ డ్రామా కొనసాగినప్పటికీ.. చివర్లో డివోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాను ముగించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది.


విక్రమ్ సహిదేవ్ సూరి పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా ప్రతీ సన్నివేశంలో టాలెంట్‌ను ప్రదర్శించారు. బుల్లెట్టు పాత్రలో తారక్ పొన్నప్ప మరోసారి చెలరేగిపోయాడు. హీరో క్యారెక్టర్‌ను మించి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. హీరోయిన్‌గా సంధ్య విశిష్ట గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోవడమే కాకుండా కీలక సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. యాక్షన్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. యాక్టర్ల ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకొనే వారు అనకాపల్లి సినిమాను ఈ వారం ఎంచుకోవచ్చు. అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమా నిరాశపరచదు.



Oct 07, 2026 Telugu

Anakapalli Movie Review

5.0
out of 10
విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్య వశిష్ట కథానాయికగా దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ క్రైమ్ లవ్ డ్రామా ‘అనకాపల్లి’ ఈ వారం థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఊర్లో గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ ప్రపంచంలోకి దిగిన సూర్య, తన లైఫ్‌లోకి అమృత అనే అమ్మాయి వచ్చాక ఎలాంటి ఎమోషనల్ అండ్ డ్రమటిక్ టర్న్స్ తీసుకున్నాడనే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తు...

విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్య వశిష్ట కథానాయికగా దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ క్రైమ్ లవ్ డ్రామా ‘అనకాపల్లి’ ఈ వారం థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఊర్లో గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ ప్రపంచంలోకి దిగిన సూర్య, తన లైఫ్‌లోకి అమృత అనే అమ్మాయి వచ్చాక ఎలాంటి ఎమోషనల్ అండ్ డ్రమటిక్ టర్న్స్ తీసుకున్నాడనే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది.


విక్రమ్ సహిదేవ్ మాస్ మేకోవర్, సంధ్య క్యూట్ పర్ఫార్మెన్స్, అండ్ తారక్ పొన్నప్ప డిఫరెంట్ విలనిజం సినిమాకి మేజర్ హైలైట్స్! ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్ డ్రామా, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. కానీ, దశాబ్దాలుగా నలిగిపోయిన "రౌడీ కుర్రాడు - పద్ధతిగల పిల్ల" అనే పాతకాన్సెప్ట్ కావడం, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే వల్ల సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ కావడం సినిమా పేస్‌ని తగ్గించేసింది. అయితే కొన్ని రొటీన్ అంశాలు ఉన్నప్పటికీ రా అండ్ రస్టిక్ తరహా క్రైమ్ డ్రామాలను, తీవ్ర భావోద్వేగాలతో కూడిన ముగింపులను ఇష్టపడే ప్రేక్షకులకు అనకాపల్లి వన్ టైం వాచబుల్. 

Oct 07, 2026 Telugu
Why MRO?