Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
‘సీక్రెట్ సోల్జర్’ మూవీ ట్రెండింగ్ న్యూస్ రివ్యూ: దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్స్ మరియు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త నటీనటులతో ఇంత పెద్ద రేంజ్ స్టోరీని ఎంచుకోవడం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. కథలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్, స్పై ఏజెన్సీ మిషన్స్‌ని ప్రెజెంట్ చేసిన తీరు మరియు ఫ్రెండ్‌షిప్ జర్నీ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి. కొత్తవారైనా నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
అయితే స్క్రీన్ ప్లేలో లింక్‌లు, లాజిక్‌లు తీవ్రంగా మిస్ కావడం సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది. ముఖ్యంగా ఒక స్పై ఏజెన్సీ అధికారుల మధ్యే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ప్రేక్షకులకు కొంత అసహజంగా అనిపిస్తుంది. ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే డ్రామాగా సాగుతుంది. మొత్తంగా కథను ఇంకాస్త బలంగా రాసుకుని. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకుని ఉంటె ఫలితం వేరేలా ఉండేది.
దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్, అండ్ ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త యాక్టర్స్‌తో ఇంత పెద్ద స్కేల్ ఉన్న స్పై డ్రామాను హెవీ రేంజ్‌లో ప్లాన్ చేయడం గుడ్ ఎఫర్ట్!
ఫస్ట్ హాఫ్ నుండి కథలో వచ్చే ట్విస్ట్‌లు, స్పై ఏజెన్సీ మిషన్స్, అండ్ ఫ్రెండ్‌షిప్ జర్నీని చూపించిన తీరు బాగుంది. నటీనటులు కొత్తవారైనా తమ రోల్స్‌కి న్యాయం చేశారు. కానీ, స్పై థ్రిల్లర్ అని వెళ్లిపోతే మాత్రం కొంత డిసప్పాయింట్ అవ్వక తప్పదు. స్క్రీన్ ప్లే చాలా చోట్ల లాజిక్ మిస్ అయింది. ఏజెన్సీ కమ్యూనికేషన్ లేకపోవడం, కథకి సంబంధం లేకుండా టర్న్‌లు తీసుకోవడం కొంచెం అసహజంగా అనిపిస్తాయి.
ఓవరాల్‌గా ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ఓకే-ఒకే డ్రామా. దేశభక్తి అండ్ స్పై ఎలిమెంట్స్ ఇష్టపడేవారు ఒకసారి క్యాజువల్‌గా ట్రై చేయొచ్చు!
Secret Soldier movie review : దేశభక్తి, సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ లీక్స్ అని అనౌన్స్ చేసినప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లాను. కొత్త యాక్టర్స్ అయినా ఫ్రెండ్‌షిప్ అండ్ స్పై ఎలిమెంట్స్‌ని బాగానే డీల్ చేశారు, కొన్ని ట్విస్ట్‌లు కూడా వర్కవుట్ అయ్యాయి.
కానీ మైన్ ప్రాబ్లం ఏంటంటే... స్క్రీన్ ప్లేలో లాజిక్ తీవ్రంగా మిస్ అయింది! స్పై ఏజెన్సీలోనే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అసహజంగా అనిపిస్తుంది. ఫ్రెండ్‌షిప్ డ్రామా కోసం స్పై థ్రిల్లర్ గ్రాఫ్ తగ్గించేశారు.
పెద్ద రిజల్ట్ ఆశించకుండా, క్యాజువల్‌గా దేశభక్తి మూవీస్ ఇష్టపడేవాళ్లు ఒకసారి చూసేయొచ్చు. నా దృష్టిలో ఇదొక యావరేజ్ వాచ్!
దేశభక్తి, దేశం కోసం సీక్రెట్ గా పోరాడే సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సీక్రెట్ సోల్జర్స్ ని ప్రధానంగా చేసుకొని రూపొందిన మూవీ `సీక్రెట్ సోల్జర్`. దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమిది. నిజానికిది చాలా పెద్ద రేంజ్ స్టోరీ. కానీ కొత్త నటీనటులు, అప్‌కమింగ్ యాక్టర్స్ తో ఈ రేంజ్ సినిమా తీయడం విశేషమని చెప్పాలి. ఇక సినిమాలో డిఫెన్స్ కి సంబంధించిన సీక్రెట్ మిషన్ లీక్‌కి, స్నేహాన్ని ముడిపెడుతూ రూపొందించిన తీరు బాగుంది. సినిమాలోని ట్విస్ట్ లు, టర్న్ లు మరో హైలైట్‌గా నిలిచాయి.
ఇక ఒక్కో ట్విస్ట్, అసలు కథ రివీల్ అవుతున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఓ వైపు దేశానికి సంబంధించిన స్పై ఏజెన్సీ చేసే కార్యక్రమాలు, వారు చేసే మిషన్ లీక్ కావడం వంటి అంశాలను, మరోవైపు స్నేహానికి సంబంధించిన జర్నీని ఆవిష్కరించిన తీరు బాగుంది. స్క్రీన్ ప్లే చాలా నీట్‌గా సాగుతుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చాలా చోట్ల కథనంలో లింక్‌లు మిస్ అయ్యాయి. ఒక వైపు వెళ్లే కథ, మరోవైపు టర్న్ తీసుకున్నట్టుగా ఉంటుంది. చాలా చోట్ల లాజిక్ లు మిస్ అయ్యాయి. స్పై ఏజెన్సీలోనే వారికే కమ్యూనికేషన్ లేకపోవడమనేది కొంత అసహజంగా అనిపిస్తుంది. పాత్రల్లోని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. కాకపోతే చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. కొత్త వారైనా చాలా బాగా చేశారు. ఇదొక స్పై యాక్షన్ ఫిల్మ్ లా కాకుండా, స్నేహం చుట్టూ కథని నడిపించడం విశేషంగా చెప్పొచ్చు. ఓవరాల్ గా దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఒక కొత్త తరహా చిత్రమిది. స్పై మూవీస్, దేశభక్తి మూవీస్‌ని ఇష్టపడే వారికి నచ్చే సినిమా అవుతుంది.
Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time!
DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaledu. Movie motham oka single character chutte tirugutundi annaru kani, aa characterization-e chala irritating ga undhi.
Comedy movie ani promote chesaru kani, 1 hour 51 minutes duration lo okka scene lo kooda gattiga navvu raaledu! Raag Mayur entha try chesina, flat writing and logic-less scenes valla character completely misfire ayindi.
Music and Kashmir visuals okay anipinchina, content leni cinema ki avi em help cheyale. Pure disappointment guys, totally skippable!
ఈరోజే 'అనుమాన పక్షి' (anumana pakshi) సినిమా చూశాను. ఓవరాల్ గా చెప్పాలంటే... మూవీ పర్లేదు, డీసెంట్ గా బాగుంది!
'డీజే టిల్లు' లాగే ఇది పక్కా ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమా. రాగ్ మయూర్ తన క్యారెక్టరైజేషన్ తో, తనకు వచ్చే 'అనుమానం' చుట్టూ తిరిగే ప్లాట్ తో ఫన్ బాగానే జనరేట్ చేశారు.
సినిమా రన్ టైమ్ 2 hours ఉండటం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ల్యాగ్ లేకుండా స్టోరీ త్వరగా అర్థమైపోతుంది. and బ్రహ్మాజీ, అజయ్ గారి క్యారెక్టర్ల నుండి, హీరోయిన్ ట్రాక్ నుండి కూడా డీసెంట్ కామెడీ ల్యాండ్ అయింది. రాగ్ మయూర్ యాక్టింగ్, సాంగ్స్, పర్ఫెక్ట్ గా సెట్ అయిన BGM movieకి హైలైట్!
but ఫన్ ని ఇంకొంచెం గట్టిగా design చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఒక లైట్-హార్టెడ్ కామెడీ మూవీగా ఒకసారి చూడొచ్చు.
అనుమాన పక్షి సినిమా గురించి చెప్పాలంటే మూవీ పర్లేదు బాగుంది. అంటే ఇది అవుట్ రైట్ ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా ఇది. కంప్లీట్ గా క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది, క్యారెక్టర్ చుట్టే ఫోకస్ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్ కి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానం చుట్టే మొత్తం తిరుగుతది. సో మొత్తం అంతా కూడా ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. సో దాంట్లో రాగమయూర్ అయితే బాగా చేశారు. అయితే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి లైక్ అజయ్ గారు, బ్రహ్మాజీ గారు ఇంకా చాలా మంది ఉంటారు. సో ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా కొంతవరకు ఫన్ అనేది జనరేట్ అవుతది. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
రాగ మయూర్ కి ఇలా క్యారెక్టరైజేషన్ వల్ల ఆ అనుమానం క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్ గా వెళ్తున్న కొద్దీ మనకి కొంచెం ఫన్ అనేది బెటర్ అవుతూ ఉంటది అలా అన్నమాట. హీరోయిన్ కి బేసిక్ గా అంత ఎక్కువ స్కోప్ ఏమీ లేదు. రెండు పాటలు అయితే మటుకు చాలా బాగా అనిపిస్తాయి అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఓవరాల్ గా బెటర్ గా ఫన్ అనేది జనరేట్ చేసి ఉండొచ్చు, బట్ అదర్ వైస్ ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. సో దాని చుట్టూ జరిగే కథ, దాని చుట్టూ జరిగే కన్వర్సేషన్స్, దాని చుట్టూ జరిగే కామెడీ. ఆ బేస్ డీజే టిల్లు. డీజే టిల్లు కూడా అంతే కదా సో అది మ్యాటర్ ఇంకా. సో అట్లా. ఓకే సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3\5 అవుట్ ఆఫ్ ఫైవ్.
డీజే టిల్లు’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన విమల్ కృష్ణ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకో సినిమా తీయలేదు. ఎట్టకేలకు అతడి నుంచి ఓ సినిమా వచ్చింది. అదే.. అనుమాన పక్షి. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోకు ప్రతి విషయంలోనూ విపరీతమైన అనుమానం. ఈ అనుమానంతో తన జీవితాన్ని ఎలా నరకప్రాయం చేసుకున్నాడన్నది చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఐతే హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అతడి ఆలోచన బాగుంది కానీ, ఇలా ఒక కాన్సెప్ట్ తీసుకున్నపుడు.. పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయడం కీలకం. క్రేజీ సీన్లు రాసుకుని ఆ పాత్ర పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడేలా చూడాలి. కానీ హీరో తన గురించి తనే నరేట్ చేసుకునే ఆరంభ సన్నివేశాలే తేలిపోయాయి.
ఏమాత్రం నవ్వులు పండని సిచువేషన్లతో సినిమా మొదలైన పావు గంటకే ప్రేక్షకుల్లో అసహనం మొదలవుతుంది. రాగ్ మయూర్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. కానీ అతణ్ని ‘అనుమాన పక్షి’లో ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు విమల్ కృష్ణ
ఆ తర్వాత ఇలాంటి సినిమాను ఎంతమాత్రం ఊహించలేం. రైటింగ్ దగ్గరే ‘అనుమాన పక్షి’ తేలిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆసక్తి రేకెత్తించేలా రాసుకోలేదు. ఇలాంటి స్క్రిప్టుతో సినిమా చేయడానికి ఇంతమంది ఎలా రెడీ అయిపోయారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. విమల్ టేకింగ్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు. చివరగా అనుమాన పక్షి.. అంతులేని అసహనం
అనుమానం పెనుభూతం' అనే పాత నానుడికి ఆధునిక సోషల్ మీడియా ధోరణులను జోడిస్తూ తెరకెక్కింటిన వినూత్న చిత్రమే 'అనుమాన పక్షి'. 'డీజే టిల్లు' ద్వారా గుర్తింపు పొందిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో రాగ్ మయూర్ కథానాయకుడిగా నటించారు. ప్రతి చిన్న విషయానికీ అతిగా అనుమానపడే ఓ యువకుడి మనస్తత్వం, ఆ అలవాటు వల్ల అతడి జీవితంలో తలెత్తే ఊహించని విచిత్రమైన పరిస్థితులను కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఎదురైన చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం.
మొత్తానికి 'అనుమాన పక్షి' అనేది అతి అనుమానం ఎలాంటి విచిత్రమైన సమస్యలకు దారితీస్తుందో చూపించే ఓ కొత్త తరహా కాన్సెప్ట్ డ్రామా. ఫస్టాఫ్‌లో వినోదం, సెకండాఫ్‌లో సస్పెన్స్, థ్రిల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొత్త తరహా కథాంశాలు, రాగ్ మయూర్ కామెడీ టైమింగ్, కశ్మీర్ బ్యాక్ డ్రాప్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్ గా నిలుస్తుంది.
'డీజే టిల్లు'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. వినోదాత్మక చిత్రంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, సినిమాలో కనీస స్థాయిలో కూడా కామెడీ పండకపోవడం గమనార్హం. బలహీనమైన కథ, అస్పష్టమైన కథనం ఈ సినిమాకి ప్రధాన బలహీనతలుగా మారాయి.
నటుడు రాగ్ మయూర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా, దానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. సునీల్ కుమార్ ఛాయాగ్రహణంలో కాశ్మీర్ లొకేషన్లు అత్యంత సుందరంగా, రిచ్‌గా కనిపిస్తాయి. నాసిరకం కంటెంట్‌ని సైతం తన ఎడిటింగ్ నైపుణ్యంతో గాడిలో పెట్టేందుకు చోటా కే ప్రసాద్ గట్టిగానే ప్రయత్నించారు. నిర్మాణ విలువలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, సరైన కథనాన్ని ఎంచుకోవడంలో నిర్మాతలు విఫలమయ్యారు. మొత్తానికి, 'అనుమాన పక్షి' ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
After being postponed multiple times, Anumana Pakshi has finally hit the screens. Let’s look at its merits and demerits.
Rag Mayur, who has appeared in several films as a comedian and supporting actor, gets a full-length lead role here. Unfortunately, the film suggests that he is not yet ready to carry an entire movie on his shoulders.Despite running for less than two hours, the film feels much longer because of its sluggish narration and weak editing.
Highlights
None
Drawbacks
Boring narration
Laughless jokes
Cringe-worthy scenes
Weak writing and direction
Overall, Anumana Pakshi is painfully boring from beginning to end. It is meant to be a comedy, but it delivers far more irritation than laughter.
కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న రాగ్ మయూర్ ఇప్పుడు హీరోగా నిలబడుతున్నాడు. `కీడా కోలా`, `పరదా` చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన హీరోగా `అనుమాన పక్షి` మూవీ రూపొందింది. `డీజే టిల్లు` చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించిన చిత్రమిది. అనుమానంతో ఎలాంటి చిక్కులు వచ్చాయనేది, హీరో ఎలాంటి గందరగోళం క్రియేట్ చేశాడు, దీని వల్ల ఫన్ క్రియేట్ చేయడమనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. సింపుల్‌గా కథ ఇదే. ప్రారంభమే ఫన్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో పాత్రని, ఆయన అనుమానాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆవిష్కరించారు.
కానీ కాసేపటికే ఇందులో కామెడీ లేదని అర్థమవుతుంది. రాగ్ మయూర్ చేసిన రచ్చనే ఉంటుంది తప్ప, ఒక్క సీన్‌లోనూ కామెడీ వర్కౌట్ కాలేదు. నటుడిగా రాగ్ మయూర్ బాగానే కష్టపడ్డా, ఆయన చేసే చేష్టల్లో కామెడీ జనరేట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు కామెడీని రాబట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ గా ఏమాత్రం నవ్వించలేకపోయిన అనుమాన పక్షి. సినిమాలో చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ అనుమాన పక్షికి దూరంగా ఉండాలని. అది కరెక్ట్ గా ఈ సినిమాకి వర్తిస్తుంది. ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers