Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 49-60 of 1647 reviews

Thella Kaagitham movie review

4.0
out of 10
Harsh Roshan recently gained popularity with teenage dramas such as Court. The young actor has now come up with Thella kaathitham in the same space. Thella Kaagitham deals with teenage confusion and the consequences of decisions made under peer influence. The film explores how teenagers, driven by others’ opinions and lacking the maturity to understand the implications of their actions, struggle t...

Harsh Roshan recently gained popularity with teenage dramas such as Court. The young actor has now come up with Thella kaathitham in the same space. Thella Kaagitham deals with teenage confusion and the consequences of decisions made under peer influence. The film explores how teenagers, driven by others’ opinions and lacking the maturity to understand the implications of their actions, struggle to deal with the consequences. Nandu has written the story, dialogues and screenplay, while Ramesh Bandreddi has directed the film. The biggest problem, however, is the writing. Nandu fails to create an engaging screenplay or enough genuinely humorous situations to sustain the narrative.


Highlights

The lead pair

The climax


Drawbacks

Old-school writing

Lame jokes

Lack of an engaging screenplay


overall Thella Kaagitham attempts to be a simple, message-oriented teenage drama and has a few entertaining portions, particularly in the first half. However, the outdated writing, forced humour and sluggish second half derail the film. The message is good, but the emotional punch the subject demands is not strong enough.

Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie review

5.0
out of 10
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా, కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో రమేశ్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పల్లెటూరి లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకున్న ఇద్దరు టీనేజర్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ల కుటుంబాల్లో, సొసైటీలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే విలేజ్ నేటివిటీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లీడ్ పెయిర్ హర్ష్ రోషన్, నక్షత్ర తమ వయసుకు తగ్గ పాత్...

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా, కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో రమేశ్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పల్లెటూరి లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకున్న ఇద్దరు టీనేజర్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ల కుటుంబాల్లో, సొసైటీలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే విలేజ్ నేటివిటీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లీడ్ పెయిర్ హర్ష్ రోషన్, నక్షత్ర తమ వయసుకు తగ్గ పాత్రల్లో నాచురల్ పర్ఫార్మెన్స్‌‌తో ఆకట్టుకోగా, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, కేవీ గుహన్ రిచ్ కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 


అయితే, టాలీవుడ్‌లో ఇప్పటికే దశాబ్దాలుగా నలిగిపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ లవ్ స్టోరీ కావడం, ప్రెజెంటేషన్ పరంగా కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్! ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్లతో పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ సీన్స్ మరియు ఓవర్ ల్యాగ్‌తో విపరీతంగా బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు రియలిస్టిక్ టచ్ కోసం వాడిన అడల్ట్ డైలాగ్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఓవరాల్ గా దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ దాన్ని వెండితెరపై ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా తడబడ్డారు. ఫైనల్లీ ఈ తెల్ల కాగితం ఆకట్టుకొని మెసేజ్ ఓరియెంటెడ్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. 

Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie review

Gulte

By Gulte

4.0
out of 10
Harshroshan teamed up with debutant director Ramesh Bandreddy for a teenage romantic drama, Thella Kaagitham. Bogapathi Nakshatra, made her feature film debut role. Let’s figure it out with a detailed analysis. Positives:1.⁠ ⁠Passable Initial Thirty Minutes2.⁠ ⁠Lead Actress Screen PresenceNegatives:1.⁠ ⁠Second Half2.⁠ ⁠Excessive Melodrama3.⁠ ⁠Repetitive Sequences4.⁠ ⁠Poor Music5.⁠ ⁠Overstretc...

Harshroshan teamed up with debutant director Ramesh Bandreddy for a teenage romantic drama, Thella Kaagitham. Bogapathi Nakshatra, made her feature film debut role. Let’s figure it out with a detailed analysis. 


Positives:

1.⁠ ⁠Passable Initial Thirty Minutes

2.⁠ ⁠Lead Actress Screen Presence


Negatives:

1.⁠ ⁠Second Half

2.⁠ ⁠Excessive Melodrama

3.⁠ ⁠Repetitive Sequences

4.⁠ ⁠Poor Music

5.⁠ ⁠Overstretched Conflict Point


Overall, in an attempt to deliver a socially relevant message, the director of ‘Thella Kaagitham’, ended up making a two-and-a-half-hour film with excessive melodrama that tests your patience after a point. Apart from a passable initial thirty minutes, there’s nothing to talk about in the film.

Oct 06, 2026 Telugu

Thella kaagitham movie review

6.0
out of 10
హర్ష్ రోహన్ హీరోగా నటించిన సినిమా తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. లీడ్ నటుల మధ్య డిజైన్ చేసిన ఫన్ సీన్స్ ఇందులో బాగున్నాయి. యూత్ ఫుల్ మూమెంట్స్ కొన్ని ఓవర్ గా అనిపించినా కొంచెం బ్యాలన్స్ అయ్యాయి. హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకుని, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో యూత్ కోసం వస్తున్న సినిమాలు ఒకే రకమైన ఫార్ములాను ఫాల...

హర్ష్ రోహన్ హీరోగా నటించిన సినిమా తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. లీడ్ నటుల మధ్య డిజైన్ చేసిన ఫన్ సీన్స్ ఇందులో బాగున్నాయి. యూత్ ఫుల్ మూమెంట్స్ కొన్ని ఓవర్ గా అనిపించినా కొంచెం బ్యాలన్స్ అయ్యాయి. హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకుని, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో యూత్ కోసం వస్తున్న సినిమాలు ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నాయి. యువత జీవితంలోని నెగిటివ్ కోణాలను, చెడు స్నేహాల వల్ల వారు ఎలా ప్రభావితమవుతారు అనే విషయాలను చూపించి, చివరకు ఒక మెసేజ్ తో ముగించడం. ఇదే కనిపిస్తుంది. ఇక ఈ ఫార్మాట్ లోనే ‘తెల్ల కాగితం’ కూడా అనిపిస్తుంది. దీని స్క్రీన్ ప్లే కూడా అదే ఫార్ములా టెంప్లేట్ ను ఫాలో అవుతుంది.


దీనితో, సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోందో ముందే ఊహించే విధంగా ఉంటుంది. ఇలా కథనం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే, ‘తెల్ల కాగితం’ ఒక రొటీన్ యూత్ ఫుల్ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కథనం ఓకే కానీ సెకాండాఫ్ లో మాత్రం కథనం నెమ్మదించింది. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్ అంతే ఇబ్బంది పెట్టాయి. యువ జంట బాగానే పెర్ఫామ్ చేశారు. సెకండాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. దీనితో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.






Oct 06, 2026 Telugu

Dorothy movie review

డోరతి (Dorothy) 2026 Youtube Channel
Thyview

By Thyview

7.0
out of 10
డొరతి సినిమా చూసాక మూవీ గురించి చెప్పాలంటే... నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ లో ఇదొకటి. అప్పట్లో లారెన్స్ కాంచనా మూవీలో చూశా ట్రాన్స్ పీపుల్ స్టోరీని మంచిగా చూపెట్టడం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మూవీలో కార్తీక్ సుబ్బరాజు దానికన్నా బెటర్ గా చూపెట్టారు. అండ్ ట్రాన్స్ పీపుల్ స్టోరీ అంటే చాలా సీరియస్ ఉంటదేమో మూవీ అని అనుకున్నా, కానీ సర్ప్రైజ్ ఏందీ దానికి కంప్లీ...

డొరతి సినిమా చూసాక మూవీ గురించి చెప్పాలంటే... నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ లో ఇదొకటి. అప్పట్లో లారెన్స్ కాంచనా మూవీలో చూశా ట్రాన్స్ పీపుల్ స్టోరీని మంచిగా చూపెట్టడం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మూవీలో కార్తీక్ సుబ్బరాజు దానికన్నా బెటర్ గా చూపెట్టారు. అండ్ ట్రాన్స్ పీపుల్ స్టోరీ అంటే చాలా సీరియస్ ఉంటదేమో మూవీ అని అనుకున్నా, కానీ సర్ప్రైజ్ ఏందీ దానికి కంప్లీట్ ఆపోజిట్. దిస్ ఇస్ ఏ వెరీ ఫన్నీ మూవీ. చాలా అంటే చాలా కామెడీ ఉంటది. ఇన్ఫాక్ట్ అంత కామెడీ ఉండడమే ప్లస్ అయింది ఈ సినిమాకి. ఇక సినిమాలో వాళ్ళ సిచువేషన్ లో మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ వచ్చేలా చేయడం కష్టం. కానీ అది కార్తీక్ సుబ్బరాజు సక్సెస్ఫుల్ గా చేస్తారు ఈ మూవీలో. 


ఈ మూవీలో క్యారెక్టర్స్ అందరూ ఒక హైలీ మాస్కులర్ అండ్ పేట్రియార్కల్ సొసైటీలో ఉంటారు. అందుకే చాలా రూరల్ ఏరియాలో ఉంటది సెటప్ అంతా. ఇక్కడ ప్రేమకన్నా పరువే ముఖ్యం అంటారు. అది ప్లస్ అయింది అనిపించింది. మొత్తం ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యేది అంతా మనం ఫీల్ అవుతాం. కెమెరా మొత్తం సెకండ్ హాఫ్ లో కూడా ఇలాంటి కొన్ని సర్ప్రైజింగ్ డిసిషన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ సర్ప్రైజింగ్ అంటే అది క్లైమాక్సే. మూవీకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. కొన్ని కొన్ని థీమ్స్ అయితే థియేటర్ బయటికి వచ్చాక కూడా మనల్ని హాంట్ చేస్తాయి. అండ్ ఇళయరాజా ఈ ఏజ్ లో కూడా ఇంత క్యాజువల్ గా మాస్టర్ పీస్ ఆల్బం డెలివరీ చేసేసారు. ఓవరాల్ గా మస్ట్ వాచబుల్.

Oct 05, 2026 Tamil +1

Dorothy movie review

డోరతి (Dorothy) 2026 Youtube Channel
3.0
out of 10
డోరోతీ సినిమా గురించి చెప్పాలంటే రకరకాలుగా ఉందబ్బా. ఇప్పుడు ఈ సినిమాని చూసే విధానాన్ని బట్టి సినిమా తాలూకా అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోతుంది. ఒక బోల్డ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా నో ఈ మూవీస్ తో మోస్ట్లీ ఇటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పను అప్పుడు కూడా. మే బి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు ఈ సినిమాని. అదర్ వ...

డోరోతీ సినిమా గురించి చెప్పాలంటే రకరకాలుగా ఉందబ్బా. ఇప్పుడు ఈ సినిమాని చూసే విధానాన్ని బట్టి సినిమా తాలూకా అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోతుంది. ఒక బోల్డ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా నో ఈ మూవీస్ తో మోస్ట్లీ ఇటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పను అప్పుడు కూడా. మే బి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు ఈ సినిమాని. అదర్ వైస్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. అండ్ నేనేమంటున్నాను అంటే నా దృష్టిలో ఆ దృష్టిలో ఇలాంటి సినిమాలు సొసైటీకి హానికరమైన నమ్ముతాను నేను. మన ఇండియన్ సొసైటీకి ఎస్పెషల్లీ. 


ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లోనే చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ట్రంప్ కూడా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాడు. కొన్ని కొన్ని విషయాల్లో. అది ఏ రకంగా అయినా సరే. ఏ రకంగా అయినా సరే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో యాక్సెప్ట్నెస్ అనేది ఉంటుంది. అయితే యాక్సెప్ట్నెస్ ఉంటుంది కానీ దాన్ని బయటికి వచ్చి దండోరా వేసుకొని చెప్పే పరిస్థితి అయితే లేదు కొన్ని కొన్ని విషయాల్లో. నాకు బేసిక్ గా చిరాకు అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు కూడా. నాకైతే చిరాగ్గానే ఉంది సినిమా అంతా. చాలా దరిద్రంగా అనిపించింది. కొన్ని వర్గాల జనాలకి నచ్చుద్దేమో అంతే. ఇలాంటి సినిమాలకు రేటింగ్ కూడా ఇవ్వను నేనైతే. 

Oct 05, 2026 Tamil +1

Dorothy movie review

5.0
out of 10
Directed by Karthik Subbaraj and starring Keerthy Suresh alongside Ilaiyaraaja's music, Dorothy tackles complex social themes like caste discrimination and false notions of honor. Keerthy delivers a powerhouse performance in this meaningful narrative.However, the film’s slow pacing, repetitive scenes, and heavy emotional tone may fail to connect with mainstream commercial audiences.Verdict: overal...

Directed by Karthik Subbaraj and starring Keerthy Suresh alongside Ilaiyaraaja's music, Dorothy tackles complex social themes like caste discrimination and false notions of honor. Keerthy delivers a powerhouse performance in this meaningful narrative.


However, the film’s slow pacing, repetitive scenes, and heavy emotional tone may fail to connect with mainstream commercial audiences.


Verdict: overall Dorothy isn't a mindless entertainer, but for viewers seeking serious, impactful storytelling with strong artistic depth, it stands as a unique, worthwhile attempt. but familys not acceptable.

Oct 05, 2026 Tamil +1

Dorothy movie Review

4.0
out of 10
Just ippude Dorothy movie first show chusoccha... alaready dont trouble the trouble movie dissapointment tho dull ayina nenu.. edo fresh concept annarani ee movie ki vellanu.. concept ayithe baane undi gani.. aa konni sences ki headdek occhindi. asalu directer karthik subbaraj ki ilanti story ela rayalani anipinchindemo mari.. at the same time ilanti concepts teeyadaniki kooda guts undali. but ela...

Just ippude Dorothy movie first show chusoccha... alaready dont trouble the trouble movie dissapointment tho dull ayina nenu.. edo fresh concept annarani ee movie ki vellanu.. concept ayithe baane undi gani.. aa konni sences ki headdek occhindi.


asalu directer karthik subbaraj ki ilanti story ela rayalani anipinchindemo mari.. at the same time ilanti concepts teeyadaniki kooda guts undali.

but ela unna... ela teesinaa audiance ki nacchali kada.. mari nakaithe nacchaledu. but lead actors perfarmance bagundi. keerthy gurinche vellanu cinemaku.. kaani tanu takkuva sepe untundi.


familys ayithe may be chudakapovacchu. but oka different concept.. ilantivi hollywood lo, bollywood lo aadatayemo gani.. mana daggara kastame.

Oct 05, 2026 Tamil +1

Dorothy movie Review

డోరతి (Dorothy) 2026 News Channel
5.0
out of 10
కొంత మంది తమిళ దర్శకుల సినిమాలు అంటే కులం, వివక్షలు, సమాజంలో అంగీకరించని కొన్ని సంఘటనలపై సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. హిజ్రాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు హిజ్రాగా మారడం అనేది కొత్త పాయింట్ గా రాసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే రా & రస్టిక్ గా, పూర్తి తమిళనాడు నేటివిటీలో ఉంటాయి. తమిళ్ లో డోరతి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులో పెద్దగా...

కొంత మంది తమిళ దర్శకుల సినిమాలు అంటే కులం, వివక్షలు, సమాజంలో అంగీకరించని కొన్ని సంఘటనలపై సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. హిజ్రాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు హిజ్రాగా మారడం అనేది కొత్త పాయింట్ గా రాసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే రా & రస్టిక్ గా, పూర్తి తమిళనాడు నేటివిటీలో ఉంటాయి. తమిళ్ లో డోరతి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా LGBTQ వివాదంలో నిలవడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. దీంతో తమిళ్ లో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తమ ప్రయోగం తెలుగులో సక్సెస్ అవుతుందేమో అని భావించి ఇక్కడ రిలీజ్ చేసారు.


అయితే ఇక్కడ కూడా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ రా & రస్టిక్ గా బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో మంచి విజువల్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఒక డేరింగ్ కథని సింపుల్ స్క్రీన్ ప్లే తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ‘డోరతి’ సినిమా చిన్నప్పట్నుంచి అబ్బాయిగా పెరిగి సడెన్ గా హిజ్రాగా మారితే అతని కుటుంబం, అతని బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.


Oct 05, 2026 Tamil +1

Dorothy movie Review

డోరతి (Dorothy) 2026 News Channel
Sakshi

By Sakshi

5.0
out of 10
తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మరియు మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డోరతీ’ చిత్రం ఈ వారం తెలుగు ప్రేక్షకు ముందుకు వచ్చి ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. సమాజంలో నేటికీ వేరూనుకున్న కులం, హోదా మరియు పరువు పేరిట జరిగే సామాజిక వివక్షపై కార్తీక్ సుబ్బరాజ్ ఒక సున్నితమైన సబ్జెక్ట్‌ను ఎంచుకుని అత్యంత అర్థవంతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.క...

తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మరియు మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డోరతీ’ చిత్రం ఈ వారం తెలుగు ప్రేక్షకు ముందుకు వచ్చి ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. సమాజంలో నేటికీ వేరూనుకున్న కులం, హోదా మరియు పరువు పేరిట జరిగే సామాజిక వివక్షపై కార్తీక్ సుబ్బరాజ్ ఒక సున్నితమైన సబ్జెక్ట్‌ను ఎంచుకుని అత్యంత అర్థవంతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.


కీర్తి సురేష్ తన సాలిడ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలవగా, సాంకేతిక విభాగం అందించిన డెప్త్ సినిమా స్థాయిని పెంచింది. అయితే, ఈ తరహా ఎమోషనల్ అండ్ సీరియస్ కంటెంట్ కమర్షియల్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడం కాస్త కష్టమే. కథనంలో కనిపించే సాగదీత, కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు ల్యాగ్‌గా అనిపించినప్పటికీ... కొత్త నేపథ్యంతో కూడిన సీరియస్ డ్రామాలను ఆదరించే ప్రేక్షకులకు ‘డోరతీ’ ఒక డిఫరెంట్ అండ్ ఓకే అనిపించే రేర్ అటెంప్ట్!

Oct 05, 2026 Tamil +1

Dorothy movie review

5.0
out of 10
సమాజంలో అంతరాలను తెరపై చూపించడంలో తమిళ దర్శకులు కొందరు ముందుంటారు. అందులో కార్తిక్‌ సుబ్బరాజు ఒకరు. ఈ డోరతీ సినిమాలో కుల, లింగ వివక్షత గురించి చర్చించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హిజ్రాగా మారితే ఏం జరిగింది అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. సినిమాలో హిజ్రాల లైఫ్‌ స్టైల్‌, వారికి జరిగే ఉత్సవాలు ఇవన్నీ సెకెండాఫ్‌లో కాస్త ఎక్కువే చూపించారు. సుబ్బు హిజ్రాగా మారిన తర్వాత కార్తీతో చేసిన జర్నీ, వినోదాన్ని...

సమాజంలో అంతరాలను తెరపై చూపించడంలో తమిళ దర్శకులు కొందరు ముందుంటారు. అందులో కార్తిక్‌ సుబ్బరాజు ఒకరు. ఈ డోరతీ సినిమాలో కుల, లింగ వివక్షత గురించి చర్చించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హిజ్రాగా మారితే ఏం జరిగింది అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. సినిమాలో హిజ్రాల లైఫ్‌ స్టైల్‌, వారికి జరిగే ఉత్సవాలు ఇవన్నీ సెకెండాఫ్‌లో కాస్త ఎక్కువే చూపించారు. సుబ్బు హిజ్రాగా మారిన తర్వాత కార్తీతో చేసిన జర్నీ, వినోదాన్ని భావోద్వేగాన్ని పంచుతుంది. ప్రాణ స్నేహితుడైన సుబ్బుని చంపడానికి కార్తి తీసుకున్న ప్లాన్‌ ఆకట్టుకుంటుంది. అయితే డోరతి ఎలా చనిపోయిందనేది క్లారిటీ ఇవ్వలేదు.  


నటీనటులు అందరూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక ఎడిటర్‌ సెకెండాఫ్‌ను కాస్తంత ట్రిమ్‌ చేసి ఉంటే బోర్‌ ఫీలింగ్‌ కలిగేది కాదు. నిర్మాణ పరంగా పేరు పెట్టక్కర్లేదు. లింగ వివక్ష, కులం, వర్ణంతో పాటు పితృస్వామ్య భావజాలం వరకు సమాజంలోని అనేక అసమానతలను గురించి దర్శకుడు ప్రశ్నించాడు. అలాగే సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ ఎదుర్కొంటున్న అవమానాలు, వారి లోలోపలి సంఘర్షణలను సున్నితంగా తెరపై చూపించారు. లైన్‌ మంచిదే అయినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో కాస్త వెనకడుగులో ఉన్నట్లే అనిపిస్తుంది. దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోతగ్గదే! అయితే ఇలాంటి కథాంశాలతో తెరకెక్కే చిత్రాలు అందరికీ నచ్చే ఆస్కారం లేదు.


Oct 05, 2026 Tamil +1

Dorothy movie review

డోరతి (Dorothy) 2026 News Channel
5.0
out of 10
కోలీవుడ్ బోల్డ్ డైరెక్ట్ సెన్సేషన్ కార్తీక్ సుబ్బరాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ అండ్ మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబోలో వచ్చిన రేర్ అటెంప్ట్ ‘డోరతీ’. ఈ వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెండీ డిస్కషన్‌‌గా మారింది!సమాజంలో ఇంకా పేరుకుని ఉన్న కులం, హోదా అండ్ 'పరువు' అనే తప్పుడు భావనలతో ఇతరులను కంట్రోల్ చేసే వివక్షపై కార్తీక్ సుబ్బరాజ్ తన మార్క్ ఎమోషనల్ అండ్ మీనింగ్‌ఫుల్ స్...

కోలీవుడ్ బోల్డ్ డైరెక్ట్ సెన్సేషన్ కార్తీక్ సుబ్బరాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ అండ్ మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా కాంబోలో వచ్చిన రేర్ అటెంప్ట్ ‘డోరతీ’. ఈ వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెండీ డిస్కషన్‌‌గా మారింది!


సమాజంలో ఇంకా పేరుకుని ఉన్న కులం, హోదా అండ్ 'పరువు' అనే తప్పుడు భావనలతో ఇతరులను కంట్రోల్ చేసే వివక్షపై కార్తీక్ సుబ్బరాజ్ తన మార్క్ ఎమోషనల్ అండ్ మీనింగ్‌ఫుల్ స్టోరీలైన్‌ను రాసుకున్నారు. కీర్తి సురేష్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. పవర్ ఫుల్ ఎమోషన్స్, రో డ్రామా అండ్ ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ సినిమా డెప్త్‌ను పెంచాయి.


అయితే కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ల కోరుకునే మాస్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్‌కి ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వడం కాస్త కష్టమే. కథనంలో స్లో పేసింగ్, కొన్ని చోట్ల రిపీటెడ్ అనిపించే సీన్స్ కాస్త ల్యాగ్‌గా అనిపిస్తాయి. ఫైనల్ గా కార్తీక్ సుబ్బరాజ్ తీసుకున్న పాయింట్ సాహసోపేతమైంది అయినా, స్క్రీన్ ప్లే మరింత పగడ్బందీగా ప్లాన్ చేసి ఉంటె అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరేది.



Oct 05, 2026 Tamil +1
Why MRO?