Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

851
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 361-372 of 851 reviews

Papam Prathap Movie Review

5.0
out of 10
ఈ వారం రిలీజ్ అయిన ‘పాపం ప్రతాప్’ థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తిరువీర్ హీరోగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా బీలో యావరేజ్ టాక్‌ను ఎదుర్కొంటోంది.సినిమాలో నటీనటులు తమ పరిధిలో బాగానే నటించినా… అసలు సమస్య కథ, కథనం దగ్గరే కనిపిస్తుంది. “పిండే బాగోలేకపోతే వంట ఎలా బాగుంటుంది?” అన్నట్టుగా, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల టెక్నికల్...

ఈ వారం రిలీజ్ అయిన ‘పాపం ప్రతాప్’ థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తిరువీర్ హీరోగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా బీలో యావరేజ్ టాక్‌ను ఎదుర్కొంటోంది.


సినిమాలో నటీనటులు తమ పరిధిలో బాగానే నటించినా… అసలు సమస్య కథ, కథనం దగ్గరే కనిపిస్తుంది. “పిండే బాగోలేకపోతే వంట ఎలా బాగుంటుంది?” అన్నట్టుగా, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల టెక్నికల్ టీమ్ కూడా పూర్తి న్యాయం చేయలేకపోయింది.


అయితే 90స్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను డిజైన్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ కొంతవరకు ప్లస్‌గా నిలిచాయి. కానీ రొటీన్ కథనం, ఆసక్తి కలిగించని సీన్స్ కారణంగా సినిమా ఎక్కడా ఎంగేజ్ చేయలేకపోయింది. మొత్తంగా ‘పాపం ప్రతాప్’ కొన్ని టెక్నికల్ ప్లస్‌లతో ఉన్నా… ఓవరాల్ గా కొన్ని మంచి కామెడీ సీన్లతో పాపం ప్రతాప్ కొంతవరకు నవ్విస్తాడు. 

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

3.0
out of 10
‘పాపం ప్రతాప్’ అంటూ ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. తిరువీర్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటులు వారి పరిధిలో బాగానే నటించినా, మిగతా విభాగాల్లో మూవీ ఏమాత్రం ఆశించిన విధంగా లేదు. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ వాతావరణాన్ని బాగా డిజైన్ చేసారు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అసలు పిండే బాగా లేకపోతే వంటకాలు ఎలా బాగుంటాయి అంటా...

‘పాపం ప్రతాప్’ అంటూ ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. తిరువీర్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటులు వారి పరిధిలో బాగానే నటించినా, మిగతా విభాగాల్లో మూవీ ఏమాత్రం ఆశించిన విధంగా లేదు. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ వాతావరణాన్ని బాగా డిజైన్ చేసారు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అసలు పిండే బాగా లేకపోతే వంటకాలు ఎలా బాగుంటాయి అంటారు. పసలేని కథ, కథనాల కారణంగా టెక్నిషియన్స్ కూడా న్యాయం చేయలేకపోయారు. అంతలో కొంత కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫి బెటర్‌గా అనిపిస్తుంది. 


అన్వర్ అలీ ఎడిటింగ్ కంగాళీగానే ఉంది. ఈటీవీ విన్, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ఈ సినిమాలో కంటెంట్ పరంగా ఎలాంటి నాణ్యత కనిపించదు. రెండున్నర గంటలపాటు ఈ సినిమా ప్రేక్షకుడికి మానసిక సమస్యగానే మారుతుంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా తెచ్చుకొన్న బజ్‌కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఇన్నీ విషయాలు చర్చించుకొన్న తర్వాత.. పాపం ప్రతాప్ సినిమా చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి నిర్ణయానికే వదిలి వేస్తున్నాం.

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

Gulte

By Gulte

4.0
out of 10
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. రొటీన్ టాక్ అన్న రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీలో తిరువీర్ నటన బాగుంది. అలాగే సినిమా మొదటి ఇరవై నిమిషాల్లో అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ బాగా నవ్వించింది. కథలోని అసలు విషయాన్నీ వెల్లడించే ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. అయితే ఈ రెండు విషయాలు తప్ప, సినిమా గురించి చెప్పు...

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. రొటీన్ టాక్ అన్న రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీలో తిరువీర్ నటన బాగుంది. అలాగే సినిమా మొదటి ఇరవై నిమిషాల్లో అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ బాగా నవ్వించింది. కథలోని అసలు విషయాన్నీ వెల్లడించే ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. అయితే ఈ రెండు విషయాలు తప్ప, సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.


చూస్తుంటే, తిరువీర్ తన గత చిత్రానికి ప్రమోషన్లు సరిగ్గా లేవన్న ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని, తన శక్తినంతా ఈ సినిమా ప్రమోషన్ల కోసం తీవ్రంగా వెచ్చించినట్లు అనిపించింది. కానీ స్క్రిప్ట్‌ను ఖరారు చేయడంలో మాత్రం తగినంత శ్రద్ధ పెట్టలేదు. మార్చిలో వచ్చిన ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపుసాని’, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ - ఈ రెండు ఈటీవీ విన్ చిత్రాలకు మంచి కాన్సెప్ట్‌లు ఉన్నప్పటికీ, ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే, కథనం కారణంగా చప్పగా ముగిశాయి. ఓవరాల్ గా మూవీ పెద్దగా ఆకట్టుకోదు.

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

Sakshi

By Sakshi

5.0
out of 10
తిరువీర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం పాపం ప్రతాప్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నటీనటుల విషయానికి వస్తే తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. కొన్నిచోట్ల కామెడీ సీన్స్ మంచి నవ్వులు పంచుతాయి. టెక్నికల్‌గా సినిమాకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ...


తిరువీర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం పాపం ప్రతాప్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటీనటుల విషయానికి వస్తే తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. కొన్నిచోట్ల కామెడీ సీన్స్ మంచి నవ్వులు పంచుతాయి. టెక్నికల్‌గా సినిమాకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించగా, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది.

అయితే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ, కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో బలం లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినా, మొత్తం కథనం రొటీన్‌గా అనిపిస్తుంది.

మొత్తానికి… పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామాగా, కొన్ని కామెడీ ఎలిమెంట్స్‌తో మాత్రమే పరిమితమైంది. అంచనాలు తగ్గించుకుని చూస్తే ఓకే అనిపించే సినిమా.

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

5.0
out of 10
తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచినా, కథాకథనాలు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బేసాయి. ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా...


తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచినా, కథాకథనాలు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బేసాయి. ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా నీట్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ ని బాగా చూపించారు. 


అలాగే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి లైన్ ని తీసుకున్నా, కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తాయి కానీ, ఇదే స్టోరీ లైన్ కి తగ్గ డెప్త్, లాజిక్ ని మాత్రం తాను మిస్ అయ్యారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పాపం ప్రతాప్’ లో యువ నటుడు తిరువీర్, అజయ్ ఘోష్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్, కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కగా మంచి నవ్వు తెప్పిస్తాయి. కానీ కథనంలో డెప్త్, కొంచెం సీరియస్ నెస్ తక్కువ అయ్యింది. వీటితో ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించే సింపుల్ విలేజ్ డ్రామాలా మిగిలింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమా ట్రై చెయ్యండి.

Apr 18, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

6.0
out of 10
లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్‌ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైరెక్టర్‌ కే క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్‌ ని తీసుకుని దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోవడం...

లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్‌ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైరెక్టర్‌ కే క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్‌ ని తీసుకుని దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోవడం పెద్ద మైనస్. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. 


హీరో హీరోయిన్స్ Pradeep Ranganathan, Krithi Shetty పెర్ఫార్మన్స్ బానే ఉన్నా, న్యాచురాలిటీ మిస్ అయింది. మ్యూజిక్, విజువల్స్—all decent. కానీ కంటెంట్ వీక్ అయితే ఏం చేయలేము. బట్ స్టోరీ పాయింట్ బాగుంది. ఆ విషయంలో సో ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ సినిమా రెగ్యులర్ మూవీ లవర్స్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు గాని, ఫ్రెష్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్లకి సినిమా నచ్చుతుంది. 

Apr 14, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

4.0
out of 10
లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది. కొన్నిచోట్ల ఫన్, కొన్నిచోట్ల కాన్సెప్ట్—all mix అయి ఓకే ఫీల్ ఇస్తుంది.స్టోరీ ఎటు వెళ్తుందో కూడా క్...

లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది. కొన్నిచోట్ల ఫన్, కొన్నిచోట్ల కాన్సెప్ట్—all mix అయి ఓకే ఫీల్ ఇస్తుంది.

స్టోరీ ఎటు వెళ్తుందో కూడా క్లారిటీ ఉండదు. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు.


ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… Pradeep Ranganathan తన స్టైల్‌లో బాగానే చేశాడు. Krithi Shetty క్యూట్‌ గా కనిపించింది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌ గా ఉండాల్సిన చోట కామెడీగా మారిపోవడం కొంచెం మైనస్. టెక్నికల్‌ గా సినిమా ఓకే—మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌ గా లేకపోవడంతో అవి పూర్తిగా హెల్ప్ చేయలేకపోయాయి. “లైక్” సినిమా… ఐడియా పరంగా స్ట్రాంగ్, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వీక్. ఫస్ట్ హాఫ్ ఓకే… సెకండ్ హాఫ్ డ్రాప్… మొత్తానికి యావరేజ్ కంటే కాస్త తక్కువ అనిపించే సినిమా. ఒక ముక్కలో చెప్పాలంటే సొసైటీ లో మొబైల్ పిచ్చోళ్ళు ఉన్నారు, కానీ మొబైల్ ని ఇలా వాడేవాళ్లు లేరు కాబట్టి, LIK సినిమా కి ఇచ్చే రేటింగ్ 2.5.

Apr 14, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

Thyview

By Thyview

4.0
out of 10
“లైక్ (LIK)” గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్‌ డ్రాప్, హీరో మొబైల్‌ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్‌ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. కథ ఎటు వెళ్తుందో క్లారిటీ లేకుండా సాగిపోతుంది. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడ...

“లైక్ (LIK)” గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్‌ డ్రాప్, హీరో మొబైల్‌ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్‌ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. కథ ఎటు వెళ్తుందో క్లారిటీ లేకుండా సాగిపోతుంది. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ కావు.


Pradeep Ranganathan తన స్టైల్‌లో ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. Krithi Shetty క్యూట్‌గా కనిపిస్తుంది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా సినిమా ఓకే. మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌గా లేకపోతే ఇవి పెద్దగా హెల్ప్ అవ్వవు. ఓవరాల్ గా ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీతో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకోవడం తప్ప ఈ మూవీ కి న్యాయం చేయలేము. అలా న్యాయం చేద్దమని చూస్తే ప్రేక్షకుడు అన్యాయం అయిపోతాడేమో. 

Apr 14, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

4.0
out of 10
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, ఒక మంచి ఐడియాను తీసుకుని, దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయిన సినిమాగా నిలుస్తుంది. Love Insurance Kompany లో 2040 బ్యాక్‌డ్రాప్‌ లో, టెక్నాలజీకి దూరంగా ఉండే హీరో… యాప్స్‌పై పూర్తిగా ఆధారపడే హీరోయిన్‌ను ప్రేమించడం అనే లైన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇది రెలేషన్‌షిప్స్, నమ్మకం, మానవ భావోద్వేగాలపై ఒక డీప్ కామెంటరీగా మారే అవకాశం ఉంది. కానీ సినిమా ఆ లోత...

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, ఒక మంచి ఐడియాను తీసుకుని, దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయిన సినిమాగా నిలుస్తుంది. Love Insurance Kompany లో 2040 బ్యాక్‌డ్రాప్‌ లో, టెక్నాలజీకి దూరంగా ఉండే హీరో… యాప్స్‌పై పూర్తిగా ఆధారపడే హీరోయిన్‌ను ప్రేమించడం అనే లైన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇది రెలేషన్‌షిప్స్, నమ్మకం, మానవ భావోద్వేగాలపై ఒక డీప్ కామెంటరీగా మారే అవకాశం ఉంది. కానీ సినిమా ఆ లోతులోకి వెళ్లదు. 

Pradeep Ranganathan తన పాత్రలో కంఫర్ట్‌ గా కనిపిస్తాడు. అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు కొంత స్టెబిలిటీ ఇస్తుంది. Krithi Shetty రోల్ ఎందుకుందో కూడా తెలీదు. S. J. Suryah పాత్రలో కూడా కొంత మిస్‌యూజ్ అనిపిస్తుంది. 


మొత్తానికి… “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” ఒక మంచి ఐడియాతో ప్రారంభమై, మధ్యలోనే దారి తప్పిన ప్రయాణంలా అనిపిస్తుంది. LIK అని సినిమా టైటిల్ పెట్టాడు గాని, సినిమా చుస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెని లా కాదు, కొంప ముంచే కంపెనీ సినిమాలా ఉంది. 

Apr 14, 2026 Telugu
4.0
out of 10
LIK సినిమా గురించి మనం మాట్లాడుకుంటే... స్టోరీ పరంగా 2040లో సెట్ చేస్తాం. హీరో మొబైల్‌ కు దూరంగా ఉంటాడు… హీరోయిన్ మాత్రం యాప్స్‌ నే నమ్ముతుంది. హీరో ఆమెను ప్రేమిస్తాడు… ఆమె యాప్‌ ని నమ్మి ‘నో’ చెబుతుంది… తర్వాత హీరో ఆమెకు ప్రేమ విలువ చెప్పడానికి ట్రై చేస్తాడు సార్!” వినడానికి చాలా కొత్తగా ఉన్నా, Love Insurance Kompany చాలా ల్యాగ్ ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఏదైనా గుడ్ ఎండింగ్ ఇ...

LIK సినిమా గురించి మనం మాట్లాడుకుంటే... స్టోరీ పరంగా 2040లో సెట్ చేస్తాం. హీరో మొబైల్‌ కు దూరంగా ఉంటాడు… హీరోయిన్ మాత్రం యాప్స్‌ నే నమ్ముతుంది. హీరో ఆమెను ప్రేమిస్తాడు… ఆమె యాప్‌ ని నమ్మి ‘నో’ చెబుతుంది… తర్వాత హీరో ఆమెకు ప్రేమ విలువ చెప్పడానికి ట్రై చేస్తాడు సార్!” వినడానికి చాలా కొత్తగా ఉన్నా, Love Insurance Kompany చాలా ల్యాగ్ ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఏదైనా గుడ్ ఎండింగ్ ఇస్తారనుకుంటే... మొత్తం ఆడియన్స్ ఊహించినట్టుగానే ఉంటుంది. ఇంచు మించు ఎక్కడో స్టార్ట్ అయి, ఇంకెక్కడో ఎండ్ అయినట్టు అయిపోతుంది. 


కథ పూర్తిగా ట్రాక్ తప్పి, మంచి పాయింట్ ఉన్నా దాన్ని సరిగ్గా డెవలప్ చేయకుండా వదిలేశారు. మూవీ లో హీరో, హీరోయిన్ రోల్స్ బాగానే ఉన్నా, పెర్ఫార్మన్స్ పరంగా రొటీన్ గా చేసారు. కొత్తదనం లేదు,

సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది… కానీ సెకండ్ హాఫ్? “ఫ్లాట్‌గా పడిపోవడం చాలా ఈజీ. ఫైనల్‌ గా మంచి కాన్సెప్ట్‌ తో స్టార్ట్ అయ్యి… సెకండ్ హాఫ్‌ లో పూర్తిగా డ్రాప్ అయింది. పైగా సినిమా మొత్తం ఫోన్ ఫోన్ ఫోన్ అదే చూపించారు గాని, నటీనటుల సైడ్ నుండి సినిమా చూసినట్టు లేదు.  

Apr 14, 2026 Telugu
5.0
out of 10
ముందుగా (LIK) కథ పాయింట్ విషయానికి వస్తే 2040 టైంలో మొబైల్ ఫోన్స్ కి దూరంగా బ్రతికే హీరో మొబైల్ అండ్ యాప్స్ నే నమ్మే హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు, కానీ హీరోయిన్ హీరోని నమ్మకుండా యాప్ ని నమ్మి హీరోకి నో చెబుతుంది. దాంతో హీరోయిన్ కి తన ప్రేమ విలువ తెలియడానికి హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. సినిమా ఫస్టాఫ్ వరకు బానే ఉన్నా, సెకెండ్ ఆఫ్ దెబ్బేసింది. సినిమా ఎటు నుండి ఎటో వెళుతూ డైరెక్టర్ మంచి పాయింట్ న...

ముందుగా (LIK) కథ పాయింట్ విషయానికి వస్తే 2040 టైంలో మొబైల్ ఫోన్స్ కి దూరంగా బ్రతికే హీరో మొబైల్ అండ్ యాప్స్ నే నమ్మే హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు, కానీ హీరోయిన్ హీరోని నమ్మకుండా యాప్ ని నమ్మి హీరోకి నో చెబుతుంది. దాంతో హీరోయిన్ కి తన ప్రేమ విలువ తెలియడానికి హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. సినిమా ఫస్టాఫ్ వరకు బానే ఉన్నా, సెకెండ్ ఆఫ్ దెబ్బేసింది. సినిమా ఎటు నుండి ఎటో వెళుతూ డైరెక్టర్ మంచి పాయింట్ ను ఏమాత్రం ఆకట్టుకునేలా తీర్చిదిద్డలేక పోయాడు.


ఓవరాల్ గా సినిమాలో ప్రదీప్ మరోసారి తన నటనతో మెప్పించాడు. ఇక కృతి శెట్టి కూడా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా ఎస్ జే సూర్య రోల్ మరీ కామెడీగా మారిపోయింది. సాంగ్స్ పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగానే ఆకట్టుకోగా, సెకెండ్ మాత్రం కంప్లీట్ గా ఫ్లాట్ గా మారిపోయి ఏమాత్రం మెప్పించలేక పోయిందని చెప్పాలి. దాంతో ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ వరకు బాగానే ఆకట్టుకున్నా, సెకెండ్ ఆఫ్ ను డైరెక్టర్ సరిగ్గా డీల్ చేయకపోవడంతో సినిమా ఎండ్ అయ్యే టైంకి పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది.



Apr 14, 2026 Telugu
4.0
out of 10
LIK మూవీ రివ్యూ విషయానికి వస్తే... మరో పదిహేనేళ్ళ తర్వాత యూత్‌ టెక్నాలజీకి ఎంతగా బానిసలు అవుతారో చూపించిన సినిమా ఇది. స్వతహాగా పుట్టాల్సిన ప్రేమ, ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే భావోద్వేగాలను యాప్‌ కంట్రోల్ చేయడం, అదే మార్కులు వేయడం అనేది ఊహకు అందేదే. జరగబోయే పరిణామాలను గ్రహించే దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ఈ కథను రాసుకున్నాడు. అయితే కథగా రాసుకున్నది బాగానే ఉన్నా... దానిని తెర మీద ప్రజెంట్‌ చేసే విషయంలో తడబ...

LIK మూవీ రివ్యూ విషయానికి వస్తే... మరో పదిహేనేళ్ళ తర్వాత యూత్‌ టెక్నాలజీకి ఎంతగా బానిసలు అవుతారో చూపించిన సినిమా ఇది. స్వతహాగా పుట్టాల్సిన ప్రేమ, ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే భావోద్వేగాలను యాప్‌ కంట్రోల్ చేయడం, అదే మార్కులు వేయడం అనేది ఊహకు అందేదే. జరగబోయే పరిణామాలను గ్రహించే దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ఈ కథను రాసుకున్నాడు. అయితే కథగా రాసుకున్నది బాగానే ఉన్నా... దానిని తెర మీద ప్రజెంట్‌ చేసే విషయంలో తడబడ్డాడు. పైగా ప్రదీప్‌ రంగనాథన్‌ అంటేనే నేచురల్ యాక్టర్ అని పేరు. కానీ ఇందులో అది మిస్ అయింది.


అలాగే మూవీలో కృతి నటన సైతం తేలిపోయింది. నటిగా ఆమె తన సత్తాను చాటుకునే సన్నివేశాలే ఇందులో లేవు. బలహీనమైన కథ, కథనం కారణంగా 'లవ్‌ ఇన్యూరెన్స్ కంపెనీ' తేలిపోయింది. అనిరుధ్‌ సమకూర్చిన బాణీలు కూడా ఓ మోస్తరుగానే ఉన్నాయి. ఓవరాల్ గా కొన్ని నెలలుగా ప్రదీప్‌ రంగనాథన్‌ అభిమానులను ఊరిస్తూ వచ్చిన 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' వారి ఆశలపై నీళ్ళు చల్లింది. విఘ్నేష్‌ శివన్ మ్యాజిక్‌ వర్కౌట్‌ కాలేదు. వరుసగా వంద కోట్ల సినిమాలు మూడు చేసిన ప్రదీప్‌కు 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' సక్సెస్ విషయంలో ఎలాంటి అస్యూరెన్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించడంలేదు.

Apr 14, 2026 Telugu
Why MRO?