Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 37-48 of 1647 reviews

Anakapalli Movie Review

Sakshi

By Sakshi

5.0
out of 10
విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ట జంటగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ మాస్ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. స్థానిక గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ బాట పట్టిన ఒక యువకుడి జీవితం, అతని ప్రేమకథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విక్రమ్ సహిదేవ్ తన వయసుకు తగ్గ మాస్ క్యారెక్టర్‌లో సీరియస్‌గా జీవించగా, సంధ్య వసిష్ట లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి పర్...

విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ట జంటగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ మాస్ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. స్థానిక గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ బాట పట్టిన ఒక యువకుడి జీవితం, అతని ప్రేమకథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విక్రమ్ సహిదేవ్ తన వయసుకు తగ్గ మాస్ క్యారెక్టర్‌లో సీరియస్‌గా జీవించగా, సంధ్య వసిష్ట లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. తారక్ పొన్నప్ప డిఫరెంట్ విలనిజం, క్లైమాక్స్ ఎపిసోడ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు ప్రధాన అసెట్స్‌గా నిలిచాయి.


అయితే, టాలీవుడ్‌లో ఇప్పటికే వందల సార్లు చూసిన "రౌడీ హీరో - క్లాస్ హీరోయిన్" అనే రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ కాన్సెప్ట్ కావడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్! ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ బ్లాక్స్ బాగున్నప్పటికీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే మరియు హీరో-హీరోయిన్ల మధ్య బలమైన కెమిస్ట్రీ లేకపోవడంతో డెప్త్ మిస్ అయింది. కథకుడిగా ఖగేష్ తమ్మినేని కొత్తదనం చూపించలేకపోవడంతో ల్యాగ్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఫైనల్ గా సాంకేతికంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా, రొటీన్ కథనం వల్ల ‘అనకాపల్లి’ కేవలం యాక్షన్ అండ్ క్రైమ్ లవర్స్‌కి మాత్రమే ఓకే అనిపించే యావరేజ్ అటెంప్ట్!

Oct 07, 2026 Telugu

Anakapalli Movie Review

6.0
out of 10
విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అనకాపల్లి’. తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓ కుర్రాడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ, క్రైమ్ చుట్టూ సాగిన ఈ అనకాపల్లి సినిమా.. కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకుంది. హీరోగా నటించిన విక్రమ్ సహిదేవ్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. హీరోయిన్ గా నటించిన సంధ్య వసిష్ఠ నటన సినిమాకి ప్లస్ అయింది. ఈ అనకాపల్లి క...

విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అనకాపల్లి’. తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓ కుర్రాడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ, క్రైమ్ చుట్టూ సాగిన ఈ అనకాపల్లి సినిమా.. కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకుంది. హీరోగా నటించిన విక్రమ్ సహిదేవ్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. హీరోయిన్ గా నటించిన సంధ్య వసిష్ఠ నటన సినిమాకి ప్లస్ అయింది. ఈ అనకాపల్లి కథలో ఇంటర్వెల్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి.


డైరెక్టర్ పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా.. అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ‘అనకాపల్లి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ క్రైమ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.



Oct 07, 2026 Telugu

Thella kaagitham movie review

5.0
out of 10
తెల్ల కాగితం గురించి చెప్పాలంటే పర్లేదు నాట్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ఏం కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో లైక్ ఒక టిపికల్ లైక్ ఇట్లాంటి ఒక టిపికల్ ఒక స్టోరీ లైన్ ఉంటది చూశారా ఇది కథ ఇలా ఇలా వెళ్ళాలి లాస్ట్ కి ఒక కైండ్ ఆఫ్ ఎండింగ్ లో ఉండాలి అన్నట్టు ఉంటది చూశారా కొంచెం ఆ జోన్ లోనే ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అండ్ ఆ ట్రాక్ ఏదైతే ఉంటదో కొంచెం రొటీన్ గా అనిపించినా కూడా స్టోరీ అనేది అండ్ చాలా వ...

తెల్ల కాగితం గురించి చెప్పాలంటే పర్లేదు నాట్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ఏం కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో లైక్ ఒక టిపికల్ లైక్ ఇట్లాంటి ఒక టిపికల్ ఒక స్టోరీ లైన్ ఉంటది చూశారా ఇది కథ ఇలా ఇలా వెళ్ళాలి లాస్ట్ కి ఒక కైండ్ ఆఫ్ ఎండింగ్ లో ఉండాలి అన్నట్టు ఉంటది చూశారా కొంచెం ఆ జోన్ లోనే ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అండ్ ఆ ట్రాక్ ఏదైతే ఉంటదో కొంచెం రొటీన్ గా అనిపించినా కూడా స్టోరీ అనేది అండ్ చాలా వరకు పాయింట్స్ ప్రిడిక్టబుల్ గా కూడా మార్చేస్తారు ముందే కొన్ని కొన్ని హింట్లు లాగా ఇచ్చి మనకి. అండ్ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది ఓవరాల్ గా సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఆ కథ బేసిక్ గా అక్కడక్కడే తిరుగుతా ఉంటది. 


ఒకటే పాయింట్ స్పెసిఫై చేశారు ఓవరాల్ గా యు నో నాకు ఏంటంటే బేబీ సినిమా లాగా ఒక పాయింట్ అనిపిస్తది. అంటే ఈ జనరేషన్ ఉన్న అమ్మాయిలు మెయిన్ ఎక్కువగా తెలుసుకోవాల్సిన మెసేజ్ అది. బట్ అదర్ దన్ దట్ ఎక్కడో ఎగ్జిక్యూషన్ మిస్ అయిపోయింది. ఏందిరా బాబు సింగిల్ పాయింట్ మీద తిరుగుతా ఉంది సినిమా అన్న ఫీలింగ్ వస్తది. పర్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తది. సో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అందరూ బాగా చేశారు. సో ఆ తర్వాత మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగానే చేశారు. బట్ ఎక్కడో ఓకే బాగానే ఉన్నాయి కానీ మరి ఎక్కువైపోయిన ఫీలింగ్ ఉంటది. సో అది గాయ్స్ సిట్యుయేషన్. ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.25\5.

Oct 06, 2026 Telugu
4.0
out of 10
విలేజ్ నేటివిటీ లవ్ స్టోరీ అని ఎక్స్‌పెక్ట్ చేసి తెల్ల కాగితం సినిమా కోసం థియేటర్ బెంచ్ ఎెక్కితే... రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ డ్రామాతో నా ఓపికకు గట్టి పరీక్షే పెట్టింది ఈ సినిమా. హర్ష్ రోషన్, నక్షత్ర నేచురల్ యాక్టింగ్‌ తో సీన్స్‌ ని లాక్కొచ్చే ట్రై చేసినా, డైరెక్టర్ రమేశ్ బండ్రెడ్డి స్క్రీన్‌ ప్లే మ్యాచ్ చేయలేకపోయాడు. సీన్ సీన్‌ కి ముందే గెస్ చేసేయొచ్చు. 20 నిమిషాలు ఎడిటింగ్‌లో ఎగరేస్తే తప్ప సినిమ...

విలేజ్ నేటివిటీ లవ్ స్టోరీ అని ఎక్స్‌పెక్ట్ చేసి తెల్ల కాగితం సినిమా కోసం థియేటర్ బెంచ్ ఎెక్కితే... రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ డ్రామాతో నా ఓపికకు గట్టి పరీక్షే పెట్టింది ఈ సినిమా. హర్ష్ రోషన్, నక్షత్ర నేచురల్ యాక్టింగ్‌ తో సీన్స్‌ ని లాక్కొచ్చే ట్రై చేసినా, డైరెక్టర్ రమేశ్ బండ్రెడ్డి స్క్రీన్‌ ప్లే మ్యాచ్ చేయలేకపోయాడు. సీన్ సీన్‌ కి ముందే గెస్ చేసేయొచ్చు. 20 నిమిషాలు ఎడిటింగ్‌లో ఎగరేస్తే తప్ప సినిమా ఫ్లో కనిపించదు.


బట్ టెక్నికల్లి కొంచెం అప్డేటెడ్ గానే ఉంది. “విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సూపర్. బట్ ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. కానీ మ్యాటర్ లేని ‘తెల్ల కాగితం’ మీద ఎంత రిచ్ పెయింటింగ్ వేస్తే ఏం లాభం? టైమ్ అండ్ మనీ సేవ్ చేసుకోవాలంటే ఈ సినిమాకు కొంచెం డిస్టెన్స్ మెయింటెన్ చేయడం బెటర్! 

Oct 06, 2026 Telugu
3.0
out of 10
Stepping into the theater expecting a fresh, high-stakes village romance? Thella Kaagitham delivers a slick technical package, but stumbles hard on core narrative execution.Harsh Roshan and Nakshathra bring raw, natural chemistry to their teenage roles, while K.V. Guhan’s vibrant camera work and Vijay Bulganin’s haunting score give the film a premium visual gloss. But underneath the aesthetics lie...

Stepping into the theater expecting a fresh, high-stakes village romance? Thella Kaagitham delivers a slick technical package, but stumbles hard on core narrative execution.


Harsh Roshan and Nakshathra bring raw, natural chemistry to their teenage roles, while K.V. Guhan’s vibrant camera work and Vijay Bulganin’s haunting score give the film a premium visual gloss. But underneath the aesthetics lies a completely rehashed, highly predictable "Nibba-Nibbi" trope.


The second half drags with forced drama and jarring adult dialogue that instantly disconnects family audiences.

finally.. Great wrapping, but empty inside. Skip the theater run unless you're just killing time!

Oct 06, 2026 Telugu
4.0
out of 10
జస్ట్ ఇప్పుడే ‘తెల్ల కాగితం’ ఫస్ట్ షో చూసొస్తున్నా.. అసలు 'కోర్ట్' సినిమా చూసి హర్ష్ రోషన్ ప్రామిసింగ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటాడన్న నమ్మకంతో థియేటర్‌కి వెళ్తే... ‘తెల్ల కాగితం’తో దారుణమైన షాక్ ఇచ్చాడు. పైగా రిలీజ్ కి ముందే సినిమాని లీక్ చేసారుగా.. దాన్నే పబ్లిసిటీగా వాడుకుని రిలీజ్ చేసారు. ముందే మ్యాటర్ వీక్ అని లీక్ అయినందుకేమో, థియేటర్‌ లో సీట్లు కూడా ఖాళీగా కనిపించాయి. అండ్ సినిమా అయితే స్కూల్ లవ...

జస్ట్ ఇప్పుడే ‘తెల్ల కాగితం’ ఫస్ట్ షో చూసొస్తున్నా.. అసలు 'కోర్ట్' సినిమా చూసి హర్ష్ రోషన్ ప్రామిసింగ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటాడన్న నమ్మకంతో థియేటర్‌కి వెళ్తే... ‘తెల్ల కాగితం’తో దారుణమైన షాక్ ఇచ్చాడు. పైగా రిలీజ్ కి ముందే సినిమాని లీక్ చేసారుగా.. దాన్నే పబ్లిసిటీగా వాడుకుని రిలీజ్ చేసారు. ముందే మ్యాటర్ వీక్ అని లీక్ అయినందుకేమో, థియేటర్‌ లో సీట్లు కూడా ఖాళీగా కనిపించాయి. అండ్ సినిమా అయితే స్కూల్ లవ్, టీనేజ్ మిస్టేక్స్ అని రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ కథనే మళ్లీ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌ లో చూపించారు. 


కథలో అసలు సరుకే లేదు! రియలిస్టిక్ పేరుతో అడల్ట్ డైలాగ్స్ ఇరికించి ఫ్యామిలీ ఆడియన్స్‌ ని కూడా సైడ్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే “పేరులోనేమో ‘తెల్ల కాగితం’ అని ఉంది... కానీ తీరా థియేటర్‌ కెళ్తే ఆడియన్స్ మైండ్‌ ని బ్లాంక్ పేపర్‌ లా మార్చేసింది! నాకైతే ఒకసారి కూడా చూసేలా లేదు. మరి నిబ్బా నిబ్బి యూత్ కి ఏమైనా నచ్చుతుందేమో. 

Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie Review

5.0
out of 10
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిన్న ప్రేమకథ ఇది. యుక్త వయసులో ఉన్న ఓ జంట చేయకూడని తప్పు చేసి ఎలాంటి ఇబ్బందులకు గురయింది. ఫైనల్ గా ఏం తెలుసుకుందన్నదే ఈ సినిమా లైన్. అయితే సినిమా కథ, కథనాలు రెండూ ఊహించేలానే ఉండడం మైనస్ అయ...

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిన్న ప్రేమకథ ఇది. యుక్త వయసులో ఉన్న ఓ జంట చేయకూడని తప్పు చేసి ఎలాంటి ఇబ్బందులకు గురయింది. ఫైనల్ గా ఏం తెలుసుకుందన్నదే ఈ సినిమా లైన్. అయితే సినిమా కథ, కథనాలు రెండూ ఊహించేలానే ఉండడం మైనస్ అయింది. ముఖ్యంగా సెకండాఫ్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ సీన్ టు సీన్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉండటం మైనస్ అయింది. 


చిన్న బడ్జెట్ చిత్రాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే విజయ్ బుల్గానిన్ తన ట్యూన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు కెమెరా పనితనం ఎంతో ముఖ్యం. కె.వి. గుహన్ ఈ విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడనే చెప్పాలి.. ఈ మధ్య యువత టార్గెట్ గా వస్తున్న చాలా చిత్రాలు దాదాపు ఈ తరహా కథాంశంతోనే తెరకెక్కాయి. చెడు స్నేహాల వల్ల యువత ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. జీవితంలోని ఏం కోల్పోతున్నారు అన్న అంశాలను చూపిస్తూనే చివర్లో ఓ సందేశంతో ముగిస్తున్నారు. ‘తెల్ల కాగితం’ మూవీది ఇదే ఫార్మెట్. అందుకే ఈ తెల్లకాగితం తన స్వచ్ఛతను చాటుకోలేక పోయింది.

Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie Review

Tupaki

By Tupaki

4.0
out of 10
ఒక టీనేజీ లవ్ స్టోరీని ఎలా డీల్ చేయాలి అనడానికి.. గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమా ఉదాహరణగా నిలిచింది. యువతకు మాత్రమే కాక.. పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయిన కథ అది. కానీ అందులో లీడ్ రోల్ చేసిన హర్ష్ రోషన్ ను పెట్టి.. వేరే ఫిలిం మేకర్స్ మళ్లీ మళ్లీ టీనేజీ లవ్ స్టోరీలు తీస్తున్నారే కానీ.. అవి ‘కోర్ట్’ దరిదాపుల్లోకి కూడా వెళ్లట్లేదు. ఇప్పుడు ‘తెల్లకాగితం’తో కూడా దాదాపు అలాంటి అనుభూతినే కలిగించాాడు హర్ష...

ఒక టీనేజీ లవ్ స్టోరీని ఎలా డీల్ చేయాలి అనడానికి.. గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమా ఉదాహరణగా నిలిచింది. యువతకు మాత్రమే కాక.. పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయిన కథ అది. కానీ అందులో లీడ్ రోల్ చేసిన హర్ష్ రోషన్ ను పెట్టి.. వేరే ఫిలిం మేకర్స్ మళ్లీ మళ్లీ టీనేజీ లవ్ స్టోరీలు తీస్తున్నారే కానీ.. అవి ‘కోర్ట్’ దరిదాపుల్లోకి కూడా వెళ్లట్లేదు. ఇప్పుడు ‘తెల్లకాగితం’తో కూడా దాదాపు అలాంటి అనుభూతినే కలిగించాాడు హర్ష్. ఎప్పుడో ‘చిత్రం’ సినిమాలో చూసిన పాయింటు పట్టుకుని.. ఇప్పుడు సొసైటీకి ఏదో సందేశం ఇచ్చేద్దామని చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆరంభం బాగున్నా.. అసలు కథలోకి అడుగుపెట్టాక విపరీతమైన సాగతీతతో.. సిల్లీ సీన్లతో విసిగించే ‘తెల్లకాగితం’ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 


ఫైనల్ గా ఇంకోసారి హర్ష్ రోషన్ టీనేజీ లవ్ స్టోరీ చేశాడంటే భయపడిపోయే స్థాయిలో ఈ సినిమా అసహనాన్ని కలిగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. తెల్లకాగితం ఒక సగటు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. మొదట్లో ఆశలు రేకెత్తించినా.. మెసేజ్ బాగున్నా.. ఈ కథను చెప్పిన పద్ధతి అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ఇంపాక్ట్ మిస్ అయింది. అసలు సినిమా స్క్రిప్టులో ఏమంత విశేషం లేదు. ఇందులో ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగుంది. కానీ దాన్ని చెప్పిన పద్ధతి అంత బాగాలేదు. వీక్ స్క్రిప్టును దర్శకుడు రమేష్ బండ్రెడ్డి తన టేకింగ్ తోనూ మెరుగుపరచలేకపోయాడు. చివరగా తెల్ల కాగితం.. తేలిపోయింది.

Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie Review

Sakshi

By Sakshi

5.0
out of 10
‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేశ్‌ బండ్రెడ్డి తీసిన పల్లెటూరి టీనేజ్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ ప్రేమ, టీనేజ్‌లో చేసిన ఒక తప్పు, దానివల్ల సొసైటీలో వచ్చే సమస్యలు అనే పాయింట్‌తో వచ్చారు. హర్ష్ రోషన్, నక్షత్ర నాచురల్ యాక్టింగ్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సినిమాకు డీసెంట్ అసెట్స్. కానీ, మనం దశాబ్దాలుగా చూసి చూసి రొట్టైపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ ప్లాట్ ఇది!...

‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేశ్‌ బండ్రెడ్డి తీసిన పల్లెటూరి టీనేజ్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ ప్రేమ, టీనేజ్‌లో చేసిన ఒక తప్పు, దానివల్ల సొసైటీలో వచ్చే సమస్యలు అనే పాయింట్‌తో వచ్చారు. హర్ష్ రోషన్, నక్షత్ర నాచురల్ యాక్టింగ్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సినిమాకు డీసెంట్ అసెట్స్. కానీ, మనం దశాబ్దాలుగా చూసి చూసి రొట్టైపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ ప్లాట్ ఇది! 


రియలిస్టిక్ పేరుతో పెట్టిన అడల్ట్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరంచేస్తే, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ సీన్స్‌తో దారుణమైన ల్యాగ్‌ని ఇస్తుంది. అయితే థియేటర్‌ లో కంటెంట్ చూస్తే మాత్రం బొమ్మలో ఏం లేదనాలి. ఖాళీ కాగితంపై ఎంత కలర్ఫుల్ పెయింటింగ్ వేసినా గ్రిప్పింగ్ స్టోరీ లేకపోతే దండగే బాస్! దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం. ఓవరాల్ గా ఇదో డీసెంట్ మూవీగా లవ్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు. 

Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie review

5.0
out of 10
టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి ఆ తర్వాత ఆ తప్పును ఎలా కప్పిపుచ్చాలో తెలియక ఇబ్బందులు పడే కథలు అప్పుడెప్పుడో చిత్రం సినిమా నుంచి వస్తున్నాయి.. తాజాగా తెల్ల కాగితం సినిమా కూడా అలాంటి కథే. స్కూల్‌లో మొదలైన ప్రేమ.. ఆ తర్వాత ముందుకెలా వెళ్లింది.. అనుకోకుండా వేసిన ఒక్క తప్పటడుగు కారణంగా అప్పటి వరకు ఉన్న జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయనే మంచి పాయి...

టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి ఆ తర్వాత ఆ తప్పును ఎలా కప్పిపుచ్చాలో తెలియక ఇబ్బందులు పడే కథలు అప్పుడెప్పుడో చిత్రం సినిమా నుంచి వస్తున్నాయి.. తాజాగా తెల్ల కాగితం సినిమా కూడా అలాంటి కథే. స్కూల్‌లో మొదలైన ప్రేమ.. ఆ తర్వాత ముందుకెలా వెళ్లింది.. అనుకోకుండా వేసిన ఒక్క తప్పటడుగు కారణంగా అప్పటి వరకు ఉన్న జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయనే మంచి పాయింట్‌తోనే ఈ సినిమాను తీసారు. 


అయితే సినిమా మొదట్లో బాగానే ఉన్నా.. రాను రాను ఎందుకో మరీ తేలిపోయే సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. కండోమ్ సీన్, అలాగే ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ అప్పటి టీనేజ్ పిల్లలు ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారనే విషయం చూపించాడు. ఇంటర్వెల్‌లో వచ్చే ప్రగ్నెన్సీ టెస్ట్ నుంచే కథ ఊపందుకుంటుంది.. అక్కడ్నుంచి సెకండాఫ్ మళ్లీ కాస్త స్లో అవుతుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను నిలబెట్టింది. చివర్లో హార్డ్ హిట్టింగ్ ఫినిషింగ్ ఇవ్వాలని ఫిక్సైపోయిన తర్వాతే అలా రాసుకున్నారని అర్థమవుతుంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం. ఓవరాల్‌ గా తెల్ల కాగితం.. ఒకట్రెండు మచ్చలు కనిపించినా.. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథే..!


Oct 06, 2026 Telugu

Thella Kaagitham movie review

4.0
out of 10
హర్ష రోషన్, నక్షత్ర నటించిన తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే... ఈ సినిమా ఫస్టాఫ్ మంచి వినోదంతో సాగుతుంది. యూత్‌ఫుల్ అంశాలు కొన్ని చోట్ల కాస్త డోస్ ఎక్కువైనా, ఎంటర్‌టైన్‌మెంట్ దానిని బ్యాలెన్స్ చేస్తుంది. హర్ష్ రోషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. దీపక్ మాలితో అతని కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. డెబ్యూ హీరోయిన్ నక్షత్ర మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. దర్శకుడ...

హర్ష రోషన్, నక్షత్ర నటించిన తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే... ఈ సినిమా ఫస్టాఫ్ మంచి వినోదంతో సాగుతుంది. యూత్‌ఫుల్ అంశాలు కొన్ని చోట్ల కాస్త డోస్ ఎక్కువైనా, ఎంటర్‌టైన్‌మెంట్ దానిని బ్యాలెన్స్ చేస్తుంది. హర్ష్ రోషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. దీపక్ మాలితో అతని కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. డెబ్యూ హీరోయిన్ నక్షత్ర మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు.


అయితే ప్రస్తుతం వస్తున్న యూత్ ఫుల్ సినిమాల తరహాలోనే ఇది కూడా పాత ఫార్ములాకే పరిమితమైంది. చెడు సావాసాలు, యువత చేసే పొరపాట్ల చుట్టూ సాగే కథనం సెకండాఫ్‌లో చాలా ప్రిడిక్టబుల్‌గా మారుతుంది. స్టోరీలో వేగం తగ్గడం, సాగదీసినట్లు ఉండే సన్నివేశాలు ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. కొన్ని అనవసర సీన్లను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని సీన్లు ఫ్యామిలీ అభిమానులకు మింగుడుపడవు. సెకండాఫ్ ను ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్‌గా.. మొత్తంగా చెప్పాలంటే.. 'తెల్లకాగితం' అక్కడక్కడా మెప్పించే ఓ యావరేజ్ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారు ఎటువంటి భారీ అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు. 

Oct 06, 2026 Telugu
4.0
out of 10
టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ, అపరిపక్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అనే పాయింట్‌తో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకు చాలా విషయాలపై స్పష్టత ఉండదు. ఏది సరైన నిర్ణయం, ఏది తప్పు అనే విషయంలో తడబడుతుంటారు. ఈ అంశాన్ని రాము, ఆశ పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం బాగుంది. హీరో ఫ్రెండ్స్ చేసే పనులు, డైలాగ్‌లు నవ్విస్తాయి. మధ్య మధ్యలో టీనేజ్‌ లవ్‌కి సంబంధి...

టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ, అపరిపక్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అనే పాయింట్‌తో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకు చాలా విషయాలపై స్పష్టత ఉండదు. ఏది సరైన నిర్ణయం, ఏది తప్పు అనే విషయంలో తడబడుతుంటారు. ఈ అంశాన్ని రాము, ఆశ పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం బాగుంది. హీరో ఫ్రెండ్స్ చేసే పనులు, డైలాగ్‌లు నవ్విస్తాయి. మధ్య మధ్యలో టీనేజ్‌ లవ్‌కి సంబంధించిన సన్నివేశాలు అలరిస్తాయి. అయితే సినిమాలో హీరోయిన్ ప్రెగ్నెన్సీ తర్వాత సీన్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండకుండా సాగదీతతో తీశారు. 



సినిమాలో డ్రామా పండలేదు. లవ్ సీన్లలోనూ డెప్త్ లేదు. చివరి 20 నిమిషాల్లో మాత్రం సినిమా బలంగా నిలబడుతుంది. చిన్న తప్పు జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో చూపించిన తీరు ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఇచ్చిన భావోద్వేగ ముగింపు సినిమాకు ప్రధాన బలం. ముగింపు బాధ కలిగించినా ఆడియెన్స్ కి కిక్‌ ఇవ్వలేకపోయింది. రొటీన్‌ ఫీలింగ్‌ ని తెప్పిస్తుంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, టేకింగ్‌లో ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించి ఉంటే సినిమా బాగుండేది. మొత్తంగా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో తడబడిందని చెప్పొచ్చు. టీనేజ్ ప్రేమలో చేసే తప్పులకు సంబంధించిన సందేశం బాగున్నా, దాన్ని అంతే బాగా తెరకెక్కించడంలో దర్శకుడు, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో మూవీ తడబడింది.


Oct 06, 2026 Telugu
Why MRO?