Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 61-72 of 1647 reviews

Dorothy Movie Review

5.0
out of 10
రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి షాకింగ్ టాక్ అందుకున్న సినిమానే డోరతి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ వారం తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఇప్పటికీ మనం ఉన్న సమాజంలోనే కులం, హోదా లేదా కాలం చెల్లిన సామాజిక విశ్వాసాల రూపంలో సామాజిక వివక్ష ఉంది అనేది తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన వాస్తవం. ఇతరులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నియంత్రించడానికి...

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి షాకింగ్ టాక్ అందుకున్న సినిమానే డోరతి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ వారం తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఇప్పటికీ మనం ఉన్న సమాజంలోనే కులం, హోదా లేదా కాలం చెల్లిన సామాజిక విశ్వాసాల రూపంలో సామాజిక వివక్ష ఉంది అనేది తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన వాస్తవం. ఇతరులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నియంత్రించడానికి ఉపయోగించే పరువు అనే తప్పుడు భావనలపై దృష్టి పెడుతూ, కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ చుట్టూ తన కథను అల్లారు.


అయితే ఈ తరహా సబ్జెక్ట్ లు డెఫినెట్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించే అవకాశం చాలా తక్కువ. ఇందులోని డెప్త్, ఎమోషన్స్ కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే, ‘డోరతీ’ ఓకే అనిపించే ఓ డిఫరెంట్ అండ్ రేర్ అటెంప్ట్ గా నిలుస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సున్నితమైన సబ్జెక్ట్ ని ఎంచుకొని అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే నటీనటులు నుంచి సాలిడ్ పెర్ఫార్మన్స్ లు కూడా తాను రాబట్టారు. కానీ ఈ సబ్జెక్ట్ అన్ని వర్గాల ఆడియెన్స్ కి డెఫినెట్ గా కనెక్ట్ కావడం కష్టం. పైగా సాగదీతగా, రిపీటెడ్ గా అనిపించే సీన్స్ కొన్ని ఇబ్బంది పెడతాయి. కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు, కొత్త నేపథ్యం ఉండే సినిమా చూడాలి అనుకునేవారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.




Oct 05, 2026 Tamil +1

Dorothy movie review

5.0
out of 10
కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ డోరతీ ’. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో విడుదలై అక్కడ కాంట్రవర్సీతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పుడు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ చిత్రాలు దాదాపు సమాజంలోని అసమానతలపైనే ఉంటాయి. అయితే ఈ సారి లింగ వివక్షను ప్రధాన అంశంగా తీసుకున్నాడు. సినిమాలో సుబ్బు పాత్ర మారిన తీరు.. కార్తి సంఘర్షణ.. ఇ...

కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ డోరతీ ’. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో విడుదలై అక్కడ కాంట్రవర్సీతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పుడు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ చిత్రాలు దాదాపు సమాజంలోని అసమానతలపైనే ఉంటాయి. అయితే ఈ సారి లింగ వివక్షను ప్రధాన అంశంగా తీసుకున్నాడు. సినిమాలో సుబ్బు పాత్ర మారిన తీరు.. కార్తి సంఘర్షణ.. ఇలా అన్నీ కూడా ఎమోషనల్‌గా సాగుతాయి. ఓ కమ్యూనిటీ ఈ సమాజం నుంచి ఎదుర్కొనే అవమానాలు, చీత్కారాన్ని మనసుని కదిలించేలా తెరకెక్కించాడు కార్తిక్ సుబ్బరాజ్. 


అయితే కీర్తి సురేష్ పాత్ర కూడా మధ్యలోనే అలా అర్దాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. కానీ టెక్నికల్‌గా మ్యాజిక్ చేసిన ‘డోరతీ’.. ఎమోషనల్‌గా అందరినీ కదిలించలేకపోయిందని చెప్పుకోవచ్చు. చివరగా ‘డోరతీ’ మనం రెగ్యులర్‌గా చూసే మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే కాదు. కొడితే వంద మంది గాల్లోకి ఎగరం, రక్తం ఏరులైపారే సీన్స్ ఇందులో ఉండవు. ఓ ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అందరికీ నచ్చకపోయినా కొందరిని మాత్రం మెప్పించే అవకాశం ఉంది.


Oct 05, 2026 Tamil +1
6.0
out of 10
Don't Trouble the Trouble.. 2 hours 36 minutes runtime తో ఉన్న ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఓకే లేదా న్యూట్రల్ గా ఉంటుంది. స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి బట్ అంత స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ చేయదు ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మూవీ స్పీడ్ అప్ అవుతుంది. మెయిన్ గా రివీల్ తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ గా అనిపిస్తు...

Don't Trouble the Trouble.. 2 hours 36 minutes runtime తో ఉన్న ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఓకే లేదా న్యూట్రల్ గా ఉంటుంది. స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి బట్ అంత స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ చేయదు ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మూవీ స్పీడ్ అప్ అవుతుంది. మెయిన్ గా రివీల్ తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ గా అనిపిస్తుంది. అండ్ పార్త్ ఫజల్ గారు అండ్ లిటిల్ గర్ల్ జర్నీలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరి జర్నీని గుర్తు చేసుకున్నట్టే ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఎమోషనల్ గా కూడా ఉంది. ఓవరాల్ గా రెగ్యులర్ గా హెవీ మూవీస్ చూసేవాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ అని అనిపించకపోవచ్చు బట్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ కి ఎస్పెషల్లీ వాళ్ళకైతే వన్ టైం థియేటర్ వాచ్ అని చేయొచ్చు. 


ఇక మూవీలో సారా పాలేకార్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. కొన్ని సీన్స్ లో ఫహద్ ఫజల్ గారిని కూడా డామినేట్ చేసినట్టు చాలా ప్లెజెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఫహద్ ఫజల్ గారి బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ అండ్ సీన్ టు సీన్ వేరియేషన్ ఎక్సలెంట్ నో డౌట్ ఇందులో. ఇక వెంకటేష్ కాకుమాను గారి ఫ్రెండ్ రోల్ బాగుంది. మ్యూజిక్ అండ్ బిజిఎం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ గుడ్. హైదరాబాద్ లొకేషన్స్ అమీర్పేట్ మెట్రో, మియాపూర్ మెట్రో, చార్మినార్, వెస్టర్న్ మాల్ సరౌండింగ్స్ ఇవి హైదరాబాద్ లోకల్ ఆడియన్స్ కి బాగా గుర్తు తెప్పిస్తాయి. మైనస్ పాయింట్స్ లాజిక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అండి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఇంజ్యుర్డ్ పర్సన్ రోప్ తో కిందకి దిగడం, పోలీస్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వడం లాంటి సీన్స్ కన్విన్సింగ్ గా అనిపించవు. స్టోరీ స్ట్రక్చర్ కొన్ని ప్లేసెస్ లో దేవి పుత్రుడు, సుప్రీం, ఎందుకంటే ప్రేమ ఇలాంటి మూవీస్ గుర్తు చేస్తుంది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే పిల్లలకి, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ మిగతా వాళ్ళకి అంటే రెగ్యులర్ గా లైక్ లాజికల్ ఫిలిమ్స్ చూసేవారికి, మనలా అంత హెవీగా ఫిలిమ్స్ చూసేవారికి అంత ఎంటర్టైనింగ్ ఫిలిం అనిపించకపోవచ్చు బట్ స్టిల్ నా వరకు అయితే వన్ టైం వాచబుల్ అని.

Oct 04, 2026 Tamil +2

Sigma movie review

B

By Baswaraj

2.0
out of 10
If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescu...

If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.


total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescue a completely flat screenplay devoid of emotional depth. Faria Abdullah is reduced to a irrelevant placeholder, while the high-pitched background score and pacing drag only amplify the headaches.


It is baffling how Lyca Productions burned millions on such a hollow script. A big brand name and star lineage are no longer enough to sell lazy storytelling to today's audience. With his good looks, Jason Sanjay should honestly reconsider acting over directing.

Oct 03, 2026 Tamil +1
4.0
out of 10
Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ము...

Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!


1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ముందు ఏదీ వర్కౌట్ అవ్వలేదు.


Lyca వాళ్ళు అసలు ఈ రొటీన్ స్టోరీలో ఏం చూసి అన్ని కోట్లు వాటర్ లా ఖర్చు పెట్టారో నాకైతే అర్థం కాలేదు! బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏది తీసినా చూడటానికి యూత్ ఏమీ పిచ్చివాళ్లు కాదు. జేసన్ సంజయ్ కి మంచి లుక్స్ ఉన్నాయి, కాబట్టి డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ ట్రై చేస్తే బెటర్!

Oct 03, 2026 Tamil +1

Sigma movie review

3.0
out of 10
విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా అని ఎగ్జైట్ అయ్యాను కానీ, ఆ కీ కోసం జరిగే రొటీన్ డ్రామా, క్లూలెస్ స్క్రీన్‌ప్లే చూసి విపరీతంగా బోర్ కొట్టింది. సీన్ సీన్‌కి ల్యాగ్ పెరిగిపోతుంటే ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని కౌంట్‌డ...

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..


1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా అని ఎగ్జైట్ అయ్యాను కానీ, ఆ కీ కోసం జరిగే రొటీన్ డ్రామా, క్లూలెస్ స్క్రీన్‌ప్లే చూసి విపరీతంగా బోర్ కొట్టింది. సీన్ సీన్‌కి ల్యాగ్ పెరిగిపోతుంటే ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశా.


అసలు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ ఎలా ఒకే చేశాడో అర్థం కాలేదు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరీ గోలగా ఉంది. జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా కంప్లీట్ ఫ్లాప్... ఆయన యాక్టింగ్‌లో ట్రై చేయడం బెటర్! మీ మనీ, టైం సేవ్ చేసుకోవాలంటే థియేటర్‌ వైపు వెళ్లకపోవడమే బెటర్.

Oct 03, 2026 Tamil +1
4.0
out of 10
#DontTroubleTheTrouble A Troublesome Watch!A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading up to it needs to keep you invested, and this very slow paced narration rarely does. The director’s...

#DontTroubleTheTrouble A Troublesome Watch!


A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading up to it needs to keep you invested, and this very slow paced narration rarely does. The director’s writing and execution often feel amateurish and oddly childish.


Fahadh Faasil tries, but there’s only so much he can do with the material, while his dubbing feels out of place at times. Not a memorable Telugu lead debut for him. Boring!


Rating: 2/5

Oct 03, 2026 Tamil +2
4.0
out of 10
#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ #IDreamMediaRating 2/5ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదుసింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్నకథ..ఏమిటి..ఎలా అన్నది విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటేసెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.…అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లిప్రీ క్లయిమాక్స్ దగ్గర ఎమోషనల్ టర్న్ తీసుకుంది.మ్యాజిక్ ల వరకు ఒకె కానీ లాజిక్ లు అవసరం అయిన చోట్ల కూడా పూర్తిగా వది...

#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్


#IDreamMediaRating 2/5


ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదు


సింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న


కథ..ఏమిటి..ఎలా అన్నది


విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.


ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటే


సెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.


…


అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లి


ప్రీ క్లయిమాక్స్ దగ్గర ఎమోషనల్ టర్న్ తీసుకుంది.


మ్యాజిక్ ల వరకు ఒకె కానీ లాజిక్ లు


అవసరం అయిన చోట్ల కూడా పూర్తిగా వదిలేసారు


..


ప్లస్ పాయింట్లు


నటీనటుల నటన


మేకింగ్..ఎగ్జిక్యూషన్


…


మైనస్ పాయింట్లు


సెకండాఫ్ స్క్రిప్ట్


…


పంచ్ లైన్


డోంట్ గెట్ ఇన్ ద ట్రబుల్

Oct 03, 2026 Tamil +2

Sigma movie review

3.0
out of 10
వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఈ సిగ్మా. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్‌, విలన్ల గ్యాంగ్‌ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్‌ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కానీ దర్శకుడు జేసన్‌ కథనం విషయంలోనే చాలా కాంప్లికేటెడ్‌గా మార్చాడు. కథ ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా తీస...

వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఈ సిగ్మా. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్‌, విలన్ల గ్యాంగ్‌ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్‌ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కానీ దర్శకుడు జేసన్‌ కథనం విషయంలోనే చాలా కాంప్లికేటెడ్‌గా మార్చాడు. కథ ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా తీసుకెళ్లారు. 


ఆయా సీన్లలో ల్యాగ్‌ ఎక్కువగా ఉంటుంది. గురు పాత్రలో సందీప్‌ కిషన్‌ నటించి మెప్పించాడు. పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్రలోని డ్రామా కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సామ్‌ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు జేసన్‌ సంజయ్‌.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేయడం మైనస్‌గా చెప్పొచ్చు. పైగా ఆకట్టుకునేలా తీయడంలో తడబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఫెయిల్‌ అయ్యాడు. ఫైనల్‌గా సినిమా చూశాక.. జేసన్‌ సంజయ్‌.. దర్శకుడిగా కంటే నటుడిగా ట్రై చేస్తే బెటర్‌ అనిపించింది. ఆడియెన్స్ సహనంతో ఆడుకున్న సిగ్మా. విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా సక్సెస్‌కాలేకపోయారు.

Oct 03, 2026 Tamil +1

Sigma movie review

5.0
out of 10
తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక సామాన్యుడు భారీ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కోవడం అనే పాయింట్ బాగానే ఉంది. హాలీవుడ్ తరహాలో క్యారెక్టర్లను కామిక్ బుక్ స్టైల్‌‌లో ఇంట్రడ్యూస్ చేసిన విధానం దర్శకుడి టేకింగ్‌ను చూపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్, సెకండాఫ్ వేగం పెరిగినప్పటికీ యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో...

తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక సామాన్యుడు భారీ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కోవడం అనే పాయింట్ బాగానే ఉంది. హాలీవుడ్ తరహాలో క్యారెక్టర్లను కామిక్ బుక్ స్టైల్‌‌లో ఇంట్రడ్యూస్ చేసిన విధానం దర్శకుడి టేకింగ్‌ను చూపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్, సెకండాఫ్ వేగం పెరిగినప్పటికీ యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా ఇలాంటి హీస్ట్ థ్రిల్లర్స్‌కు లాజిక్స్ చాలా అవసరం. ఇక్కడ మాత్రం లాజిక్ మిస్సయింది. 


అలాగే ఫైట్లలో తుపాకులు ఉన్నా కూడా కత్తులతో దాడులు చేసుకోవడం లాంటివి నమ్మశక్యంగా అనిపించవు. హాలీవుడ్ స్టైల్లో ఒక ఫిమేల్ క్యారెక్టర్‌ను మోసం, నమ్మకద్రోహం చేసేలా డిజైన్ చేసినా దాన్ని కూడా తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దర్శకుడు ఆలోచనలు బాగున్నా, రాసుకున్న స్క్రీన్ ప్లేలో నిలకడ లోపించడం సినిమాకు ప్రధాన మైనస్. లాజిక్స్ పక్కనపెడితే ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. ఏదో విజయ్ వీరాభిమానులకు సంజయ్ ఎలా డైరెక్ట్ చేసాడో తెలుసుకుందాం అనుకుంటే ఓసారి ట్రయల్ వేయొచ్చు. ఓవరాల్‌గా సిగ్మా.. యాక్షన్ డ్రామా.. కానీ చాలా కండీషన్స్ అప్లై..!

Oct 03, 2026 Tamil +1

Sigma movie review

Gulte

By Gulte

3.0
out of 10
Sigma movie review : Vijay’s son, Jason Sanjay decided to become a film director instead of becoming a hero as expected by most people. When his debut directorial film Sigma was announced, people were surprised by his choice of a Telugu hero, Sundeep Kishan, to play the lead role in the film and a Telugu heroine, Faria Abdullah, to play the lead actress role.Positives:1.⁠ ⁠NothingNegatives:1.⁠ ⁠Cl...

Sigma movie review :

Vijay’s son, Jason Sanjay decided to become a film director instead of becoming a hero as expected by most people. When his debut directorial film Sigma was announced, people were surprised by his choice of a Telugu hero, Sundeep Kishan, to play the lead role in the film and a Telugu heroine, Faria Abdullah, to play the lead actress role.

Positives:

1.⁠ ⁠Nothing

Negatives:

1.⁠ ⁠Clueless Storytelling

2.⁠ ⁠Amateurish Direction

3.⁠ ⁠Outdated Writing

4.⁠ ⁠Loud Background Score

5.⁠ ⁠Excessive Slow Motion Shots

6.⁠ ⁠Unnecessary Item Song


Overall, with a bad first half and an equally bad second half, Sigma, tests your patience throughout its runtime and it definitely doesn’t deserve a watch not just in theatres but on OTT as well. Yes, pursuing passion is commendable but the first thing, Jason Sanjay, has to do is work as an assistant director for a handful of films for a few years, learn the craft, improve his writing skills and then attempt to make his second film as director. It may sound harsh but he’s not yet ready to direct a film and his lack of command in storytelling and direction, was to be seen in each and every sequence of, Sigma.


Oct 03, 2026 Tamil +1

Sigma movie review

3.0
out of 10
లేటెస్ట్ యాక్షన్ డ్రామా సిగ్మా సినిమా చూశాక ఒక విషయం క్లియర్‌ గా అర్థమవుతుంది—స్టైలిష్ టీజర్, హై-వోల్టేజ్ టైటిల్ పెట్టినంత మాత్రాన సినిమాలో స్టఫ్ ఉన్నట్టు కాదు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ కావడం, సందీప్ కిషన్ హీరోగా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ అవన్నీ థియేటర్లో కర్పూరంలా కరిగిపోయాయి.వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌ లో అప్పుల తిప్పలు, యూట్యూబ్ ఛానెల్, డ్రగ్స్ పెన్ డ్రైవ్, విలన్‌ ని బ్ల...

లేటెస్ట్ యాక్షన్ డ్రామా సిగ్మా సినిమా చూశాక ఒక విషయం క్లియర్‌ గా అర్థమవుతుంది—స్టైలిష్ టీజర్, హై-వోల్టేజ్ టైటిల్ పెట్టినంత మాత్రాన సినిమాలో స్టఫ్ ఉన్నట్టు కాదు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ కావడం, సందీప్ కిషన్ హీరోగా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ అవన్నీ థియేటర్లో కర్పూరంలా కరిగిపోయాయి.


వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌ లో అప్పుల తిప్పలు, యూట్యూబ్ ఛానెల్, డ్రగ్స్ పెన్ డ్రైవ్, విలన్‌ ని బ్లాక్‌మెయిల్ చేయడం... ఇలా అరడజను పాత సినిమాల ప్లాట్లను కలిపి రుబ్బిన రొటీన్ కథ ఇది. హీరో సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్ మరియు సిన్సియర్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టడానికి గట్టిగానే కష్టపడ్డాడు, కానీ రొటీన్ కథనాన్ని ఆయన ఒక్కడే కాపాడలేకపోయాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను కేవలం పేరుకే పరిమితం చేశారు, ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు.


ఫస్ట్ హాఫ్ అంతా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా దారుణమైన ల్యాగ్‌తో సాగుతుంది. ఎమోషనల్ సీన్లలో అసలు డెప్త్ లేదు, ఫ్లాట్ క్లైమాక్స్ ఇంకా పెద్ద హెడేక్. ఫైనల్ గా సుదీర్ఘమైన క్లైమాక్స్ చూస్తూ 5 సెకన్లకొకసారి ఎగ్జిట్ డోర్ వైపు చూసే పరిస్థితి దాపురించింది. 

Oct 03, 2026 Tamil +1
Why MRO?