Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
just ippude 'Comrade Kalyan' movie chusanu, naakaithe idi chala simple and outdated plot la anipinchindi. but Sri Vishnu and Satya valla comedy timing valla movie chala varaku work ayyi, oka time-pass feel ichindi. Veellu kakunda vere evaru unna ee cinema ye matram kooda adedi kademo.
First half silly jokes tho, second half lo main plot loki vellaka comedy scope taggipoyindi. Sudden ga sentiment, message evvadaniki try chesinappudu writing weak ga undi.
Overall ga, trailer lo jokes nachite, kevalam Sri Vishnu-Satya comedy kosam oka sari try cheyachu.
'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ నాన్-స్పాయిలర్ రివ్యూ.. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ప్లాట్ కొంచెం అవుట్‌డేటెడ్ ఉంది కానీ, కామెడీ బాగుండడంతో ఒకేఇష్ ఫీల్స్ ఇచ్చింది. అంత సింపుల్ ప్లాట్ లైన్ ని కూడా ఫర్ ద మోస్ట్ పార్ట్ వర్క్ అయ్యేలా చేసింది శ్రీవిష్ణు అండ్ సత్యనే! ఆ ప్లేస్‌లో వీళ్ళు కాకుండా ఎవరున్నా ఈ మూవీ ఇప్పుడు ఇచ్చిన ఫీల్ ఇచ్చేది కాదు. కాకపోతే సెకండాఫ్‌కి వచ్చేసరికి మరీ అవుట్‌డేటెడ్ ఫీల్స్. ఈ మూవీలో చాలా మూవీస్ మీద పేరడీస్ లేదా ఫన్స్ ఉంటాయి, అవి వర్క్ అవ్వలేదు. కొన్ని కామెడీ సెట్ పీసెస్ 'జల్సా'లో పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్ మధ్య ఉండే సెట్ పీసెస్‌లా ఉంటాయి. కాకపోతే ఆ సీరియస్‌నెస్‌ని తీసేసి ఫన్ యాంగిల్ తీసుకొస్తారు.
ఏదో ఒక టైమ్ పాస్‌కి మూవీ చూడాలి, నాలుగు జోక్స్ ఉంటే రెండైనా వర్క్ అవుతాయి అనే ఫీలింగ్‌తో వెళ్తే ఈ మూవీ ఎండింగ్ వరకు కూర్చోగలరు. సెకండాఫ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే అర్థమైపోద్ది ప్లాట్ ఎంత సీరియస్ ఉన్నా మెయిన్ ఎయిమ్ కామెడీ అని. కానీ ఫర్ ద మోస్ట్ పార్ట్ షీ డస్ నథింగ్. ఆ ప్లేస్‌లో ఎవరున్నా వర్క్ అయిపోద్ది, రాధిక గారు వర్క్ అవ్వలేదు. షైన్ టామ్ చాకోకి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు, ఆ ప్లాట్ పాయింట్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఎండింగ్‌లో రియల్ ఇన్సిడెంట్స్ వి పేపర్ కటింగ్స్ వేస్తారు, ఐడియా వరకు మంచి ఐడియానే కానీ దాన్ని మెలోడ్రామాటిక్‌గా ప్రెజెంట్ చేసినప్పుడే ఇష్యూస్ వచ్చాయి. శ్రీవిష్ణు గారి నుంచి ఇంతకన్నా బెటర్ కామెడీ ఫిలిం ఆశిస్తాం!
Comrade Kalyan movie Review
కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పాలంటే అద్దిరిపోయింది సినిమా. సూపర్ ఫెంటాస్టిక్ సినిమా అసలు. అంటే సినిమా త్రో అవుట్ ది మూవీ ఫన్ ఉంటుంది, అండ్ ఆ కామ్రేడ్ కాన్సెప్ట్ లో కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫన్ క్రియేట్ చేశారు. శ్రీవిష్ణు అన్న ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫన్ ఉంటది, సత్యన్న నుంచి పీక్స్ ఫన్ ఉంటుంది. తర్వాత ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఈ అన్నల కాన్సెప్ట్, ఆ కామ్రేడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లోని ఒక డిఫరెంట్ లెవెల్ సబ్జెక్ట్ తీసుకున్న ఫీలింగ్ కలిగింది, ఒక ట్విస్ట్ తో కూడుకున్న సబ్జెక్ట్ ఉంటది. అన్ని చాలా బాగా అనిపించాయి.
ఫన్ తో బాగానే పోతుంది అండ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. సో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అటు లవ్ ట్రాక్ కావచ్చు, ఇటు కామెడీ కావచ్చు, ఇటు అంటే ఆ ట్విస్ట్ కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా ప్రాపర్ గా వర్కౌట్ అయ్యాయి మూవీలో అయితే మటుకు. ఆయన ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతది. ఓవరాల్ గా మూవీ అయితే మటుకు అద్దిరిపోయింది అని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ కూడా కొంచెం బ్యూటిఫుల్ గా బాగానే ఉన్నారు.
అండ్ డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్టర్ కూడా ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ అది చాలా కొత్త కాన్సెప్ట్ అని కూడా అనిపించింది యాక్చువల్ గా. ప్రతి ఒక్కరికి కూడా ఒక కోర్ ఎమోషన్ ఉంటది అండ్ దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఏది ఎక్కడ రివీల్ చేయలో అక్కడే రివీల్ అయ్యాయి. ఫైనల్ గా బాగుంది.
just ippude Comrade kalyan first show chusostunna... just one word lo cheppalante nacchesindi..
asalu cinemaki velladaniki mundu social medialo movie flop.. naxalites ni comedians chesesaru.. content lo seriousness ledu em ledu annaru kaani... trailer chusaaka nenu idi pakka comedy movie ani fix atyipoye theater ki vellanu..
because trailer chuste evarikaina idi serious action drama kadu.. naxal back drop just edo tiskundamani tiskunnaru.. story kosam anipistundi.. anduke nenu peddaga expectations pettukokunda movieki enjoy cheddamani vellanu.. and i m satisfied..
comedy ki elanti doka ledu.. sri vishnu and satya, sudarshan full navvistaru... evaraina chudalanukunte logics pakkana betti, normal comedy movie ga try cheste pakka nacchuddi.
#ComradeKalyan #IDreamRating 2.5/5
కలపడం కష్టమైన రెండు అంశాలు కలిపి తీసిన సినిమా
తొలిసగం మొత్తం కళ్యాణ్ కనిపిస్తాడు
కామన్ ఆడియన్ కు నచ్చే
నవ్వులు పండిస్తాడు.
మలిసగంలో కామ్రేడ్ గా మారాక నవ్వులు తగ్గాయి
బండిని శ్రీవిష్ణు లాక్కు వచ్చే ప్రయత్నం బలంగా చేసారు
తొలిసగం నవ్వుల కోసం చూడొచ్చు.
మలిసగం అక్కడ అక్కడ నవ్వుల కోసమే చూడాలి.
బెటర్ స్క్రిప్ట్ కు చాన్స్ వుంది..వాడుకోలేదు
పంచ్ లైన్
కామెడీ కళ్యాణ్
మావోయిస్టు / నక్సల్స్ కాన్సెప్ట్ తెలుగు తెరపై వర్కవుట్ అవ్వదని 'ఆచార్య'తో ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ తరుణంలో 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ శ్రీవిష్ణు సినిమా అనౌన్స్ చేశారు. శ్రీవిష్ణు అంటే కామెడీ సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రతి కథకు ఓ కోర్ పాయింట్ ఉంటుంది. అది పాతదైనా ప్రేక్షకులకు తెలిసిన పాయింట్ అయితే దాని చుట్టూ ఎంత వినోదమైనా పండించవచ్చు. కామ్రేడ్ / మావోయిస్టు / నక్సల్ కాన్సెప్ట్ ఈతరం ప్రేక్షకులలో చాలా తక్కువ మందికి, మరీ ముఖ్యంగా థియేటర్లకు వస్తున్న యువతకు ఓల్డ్ కాన్సెప్టే. అయితే దర్శకుడు జానకిరామ్ పాత సినిమాల తరహాలో తీయడానికి ప్రయత్నించారు. 1990 వాతావరణాన్ని తెరపై చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్ అయ్యారు.
ఇక శ్రీవిష్ణుకు సవాల్ విసిరే క్యారెక్టర్ ఏమీ కాదు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, నటనతో ఈజీగా చేసేశారు. మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. సత్య మరోసారి తన ట్యాలెంట్ చూపించారు. ఫైనల్ గా 'కామ్రేడ్ కళ్యాణ్'లో కామెడీ ఉంది. పలు సన్నివేశాల్లో నవ్వించింది. అయితే... శ్రీవిష్ణు సినిమా అనేసరికి సహజంగా కొన్ని అంచనాలు ఏర్పడతాయి. వినోదం ఫుల్లుగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఆ స్థాయిలో సినిమా లేదు. కామ్రేడ్ కాన్సెప్ట్ కొంత కామెడీకి హెల్ప్ అయ్యింది కానీ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంలో హెల్ప్ చేయలేదు. శ్రీవిష్ణుతో పాటు సత్య నవ్వించారు. వాళ్ళ వినోదం కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.
పోలీసులు, నక్సలిజం, ప్రభుత్వ వ్యవస్థల చుట్టూ తిరిగే చాలా బరువైన పాయింట్‌ను తీసుకుని, దానికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ముడిపెట్టి డైరెక్టర్ కామ్రేడ్ కళ్యాణ్ చిత్రాన్ని నడిపించాడు. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ ను కామెడీ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం సాహసమే. అయితే లాజిక్స్ పక్కనపెట్టి కేవలం వినోదం కోణంలో చూస్తే మాత్రం చాలా చోట్ల బాగా నవ్వులు పూస్తాయి. ఇక సినిమాలో కామెడీ సన్నివేశాలు బాగా పేలడంతో మొదటి భాగం ఎక్కడా బోర్ కొట్టదు. కానీ ద్వితీయార్థం మొదలయ్యాక అడవి నేపథ్యంలో సీన్స్ ఉండటంతో నవ్వించే స్కోప్ బాగా తగ్గిపోయింది.
చుట్టూ తుపాకులు పట్టుకున్న వాళ్ల మధ్య ఫన్ క్రియేట్ చేయడం కష్టంగా మారడంతో ఇక్కడి నుంచి సినిమా కాస్త నెమ్మదిస్తుంది. మధ్యలో రాజకీయ నాయకుడి కిడ్నాప్ ఎపిసోడ్ ద్వారా మళ్లీ కొంత వినోదాన్ని రాబట్టే ప్రయత్నం చేసినా అది అప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా హీరో మార్క్ కామెడీని పక్కనపెట్టి, పతాక సన్నివేశాల్లో భారీగా సందేశాలు ఇవ్వడం కొంత ఇబ్బందిగా మారుతుంది. సినిమాను మెసేజ్‌లతో కాకుండా సరదాగా ఎండ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక శ్రీవిష్ణు వన్ మ్యాన్ షోగా సినిమాలో అలరించాడు. అయితే మాటల రచయితలు రాసిన ట్రెండీ డైలాగ్స్ చాలా చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. పోటీగా వేరే సినిమాలు లేకపోవడం, వరుస సెలవులు రావడం ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసిరానుంది. ఓవరాల్ గా కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ కళ్యాణ్..!
నక్సల్ బ్యాక్ డ్రాప్ కి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి, అందులోని హ్యూమర్ ప్రధానంగా చేసుకొని రూపొందిన చిత్రమే కామ్రేడ్ కళ్యాణ్. అదే సమయంలో చిన్నపాటి సందేశాన్ని కూడా ఇందులో మేళవించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శ్రీవిష్ణు వన్ సైడ్ కామెడీతో నడిపిస్తాడు. మధ్యలో సత్య హెల్ప్ అవుతాడు. ఇక సెకండాఫ్‌లో.. తాను నక్సల్ కాదని నిరూపించుకునే ప్రయత్నం చుట్టూ సాగుతుంది. అటు నక్సల్స్ కి, ఇటు పోలీసులకు మధ్య శ్రీవిష్ణు, సత్య నలిగిపోతూ వారిని మ్యానేజ్ చేసే ప్రయత్నం కొంత ఉత్కంఠభరితంగా, మరికొంత ఫన్నీగా ఉంటుంది. అయితే మూవీలో చాలా వరకు బలవంతపు కామెడీ కనిపించింది.
అదే సమయంలో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దాన్ని కామెడీగా చూపించడం కనెక్టింగ్ గా లేదు. ఈ అంశాలు పక్కన పెడితే మాత్రం ఇదొక మంచి సందేశాత్మక, అదే సమయంలో నక్సల్స్ పేరుతో జరిగే మోసాలకు సంబంధించి అవగాహన కలిగించే మూవీ. అయితే ఫన్ జనరేట్ చేయడంలో ఇంకా ఫోకస్ చేయాల్సింది. కానీ చాలా వరకు మెప్పించాడు. కామెడీని ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటే సినిమా అదిరిపోయేది. ఫైనల్ గా సరదాగా నవ్వులు పూయించే కామ్రేడ్ కళ్యాణ్. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు.
ముందుగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఒక ఫక్తు లైట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కామెడీ ఎంటర్ టైనర్. అలాంటి ఈ కథలో ఎదో కొత్తదనం డిఫెరెంట్ స్క్రీన్ ప్లే లాంటివి ఎక్స్ పెర్ట్ చేస్తే, సీన్స్ వైజ్ మాత్రమే సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఈ మధ్య రావడం లేదు, కాబట్టి అలాంటి మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం సినిమా బాగానే నచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో లూప్ హోల్స్ ఉన్నాయి. అక్కడక్కడా కథ డ్రాగ్ అవుతుంది. ఎటు నుండి ఏటో వెళుతుంది అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ గా కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం, బోర్ అనిపించే రేంజ్ లో సీన్స్ పెద్దగా లేకుండా
సినిమా ఒక ఫ్లోలో సీన్ బై సీన్ వెళుతూ ఉంటుంది.
ఇక మరోసారి శ్రీ విష్ణు తన కామెడీతో మెప్పించాడు. డైలాగ్స్ మరోసారి యూత్ ను బాగానే టార్గెట్ చేయగా, సత్య కూడా మరోసారి తన కామెడీ టైమింగ్ తో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపించగా సంగీతం ఓకే అనిపించేలా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు బాగానే అనిపించగా, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినట్లు అనిపించింది. మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైంకి డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు. ఫైనల్ గా అద్బుతం కాకున్నా కానీ ఉన్నంతలో డీసెంట్ ఎంటర్ టైన్ మెంట్ తో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ బాగానే ఆకట్టుకుంటుంది. మరీ ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకుని వెళితే యావరేజ్ గా అనిపించవచ్చు.
మాములుగా శ్రీవిష్ణు సినిమాలో కాస్త కామెడీ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా సినిమా పాసైపోతుంది. ఇక కామ్రేడ్ కల్యాణ్ నక్సల్స్ నేపథ్యమున్న సినిమా అని ట్రైలర్ లో చెప్పినా, శ్రీవిష్ణు మార్కు కామెడీ ఉంటుందని నమ్మకం పెంచుకున్నారు ఆడియన్స్. సాధారణంగా అన్నల సినిమాలంటే సీరియస్‌గా సాగుతుంటాయి. అయితే ఇది అందుకు భిన్నం. పూర్తిగా వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. ఇక సినిమా ఫస్టాఫ్ అంతా హీరో హీరోయిన్ల ప్రేమ, సత్య కామెడీలతో సరదాగా సాగితే, సెకెండాఫ్‌లో అదే కొరవడింది. కథ అన్నల నేపథ్యంలోకి వెళ్లడంతో పెద్దగా కామెడీ పండించడానికి ఆస్కారం లేకుండా పోయింది.
అయితే మంత్రి కిడ్నాప్ తో మళ్లీ కథ కామెడీ ట్రాక్ లో పడుతుంది. అడవి సన్నివేశాలు సినిమా స్పీడ్‌ను కాస్త తగ్గించిన భావన కలిగింది. అందులోనూ సత్య కనిపించిన ప్రతిసారీ కామెడీ బాంబు వేసే వెళ్తాడు. క్లైమాక్స్ మాత్రం తేలిపోయినట్టుంది. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్ అయినా కామెడీ జానర్ సినిమా కాబట్టి పట్టించుకోవాలనే ఆలోచన రాకుండా రైటర్స్ జాగ్రత్త పడ్డారు. ఆచార్య దళం, ప్యారడైజ్ కాకి వంటి డైలాగ్ లు నవ్వులు పూయించాయి. గతంలో వచ్చిన నక్సల్ సినిమాల రిఫరెన్స్ లు ఆకట్టుకుంటాయి. అయితే కామెడీకి కేరాఫ్ అయిన శ్రీవిష్ణు సినిమా కాబట్టి సినిమా క్లైమాక్స్ మరోలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కామెడీ సినిమాకు లాజిక్కులతో పని ఉండదు కాబట్టి.. నవ్వులు కావాలనుకునేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈవారం పెద్ద చిత్రాలేమీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నప్పటికీ, పూర్తిస్థాయి వినోదాత్మకంగా మలచడం విశేషం. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, కపటం లేని నటనతో కమెడియన్ సత్య థియేటర్లలో నవ్వులు పూయించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.
అయితే, కంటెంట్ పరంగా పెద్దగా లోపాలు లేకపోయినా, సెకండాఫ్‌లో కామెడీని దాటి యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణల మోతాదు పెరగడంతో సినిమా వేగం తగ్గింది. దీంతో పక్కా కామెడీ చిత్రంగా ఆశించిన స్థాయి అనుభూతి లభించదు. క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఇక ఓవరాల్ గా ఈ "కామ్రేడ్ కళ్యాణ్" చూసి "లాల్ సలాం" అని పై శృతిలో అరవలేం కానీ, అనకుండా ఉండలేం! శ్రీవిష్ణు అభిమానులకు, కామెడీ కోరుకునేవారికి ఇది ఒక మంచి చాయిస్.
కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ తీరు.. ఇలా ఏ యాంగిల్‌లోంచి చూస్తే ఆ యాంగిలోలో తప్పులు, ఒప్పులు కనిపిస్తాయి. ఇదొక సీరియస్ సబ్జెక్ట్. కృష్ణ వంశీ లాంటి దర్శకుడే సింధూరం అనే చిత్రంతో ఓ ప్రయోగం చేశాడు. ఎవరి సైడ్ తీసుకోకుండా.. నిర్ణయం ఏంటి? అన్నది ప్రేక్షకులకే వదిలేశాడు. ఇక చాలా సినిమాల్లో అన్నలనే హీరోలుగా చూపించారు. కొన్ని చిత్రాల్లో పోలీసులనే హీరోలుగా చూపించారు. ఇలా ఎవరి కోణం వారికి ఉంటుంది. అలాంటి సీరియస్ సబ్జెక్ట్‌లను తీసుకుని భాను, నందు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాసుకున్నారు. ప్రతీ చోటా సిల్లీ, లాజిక్ లెస్ సీన్లు, జబర్దస్త్ టైపులో కామెడీ పంచుల్ని రాసుకుని నడిపించారు. వినోదం పరంగా చూసుకుంటే కామ్రేడ్ కళ్యాణ్ నవ్విస్తుంది. కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం కామ్రేడ్ కళ్యాణ్ సిల్లీ అనిపిస్తుంది.
సుదర్శన్ శ్రీవిష్ణు.. సత్య, శ్రీ విష్ణు కాంబోలో వచ్చే సీన్స్ నవ్విస్తాయి. రాధిక శరత్ కుమార్ పాత్ర కూడా కాస్త ఎంటర్టైనింగ్‌గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నారు మేకర్స్. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా రాసుకున్నారు చివరకు వచ్చేసింది.. ఏదో ముగించేయాలి కాబట్టి.. అర్జెంట్‌గా అందరూ మారిపోవాలి అన్నట్టుగా సీన్స్ సాగుతాయి. ఓవరాల్ గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైం పాస్ వీకెండ్ సినిమాగా నిలుస్తుంది. కాసేపు నవ్వుకోవాలి.. శ్రీ విష్ణు, సత్య కామెడీని ఎంజాయ్ చేయాలి అని అనుకునేవారు ఈ సినిమాని ఓ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers