Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 73-84 of 1647 reviews

Sigma movie Review

3.0
out of 10
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకే ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్‌లో జేసన్ సంజయ్ సినిమా తీశారని అర్థం అవుతోంది. హీరో అండ్ విలన్ మధ్య ఫైట్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్...

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకే ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్‌లో జేసన్ సంజయ్ సినిమా తీశారని అర్థం అవుతోంది. హీరో అండ్ విలన్ మధ్య ఫైట్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్ (పిల్లి ఎలుక మధ్య ఆట)ను తలపించింది. చివరకు క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? అని ఎదురు చూసేలా చేశారు. కథ, కథనాల్లో హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. కానీ, ఆ స్థాయిలో చేయలేదు.


ఓవరాల్ గా విజయ్ తనయుడు జేసన్ సంజయ్, సందీప్ కిషన్ కలిసి కొత్త తరహా సినిమా తీసి ఉంటారని ఆశిస్తే... బాగా డిజప్పాయింట్ చేశారు. ఇంతకు ముందు సందీప్ కిషన్ పరిచయం చేసిన దర్శకులు తమ మార్క్ చూపించారు. కానీ జేసన్ సంజయ్ ఓల్డ్ స్టైల్ సినిమా చేశారు. 'సిగ్మా' టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టు సినిమా చివరిలో ఓ మాట చెప్పారు ఫరియా అబ్దుల్లా. ఆ డైలాగ్ ఎందుకు రాయించారో అర్థం కాదు. అప్పటి వరకు చూసిన సినిమా కూడా అర్థం కాదు. ఫైనల్ గా కమర్షియల్ ఫార్మాట్‌ లో తీసిన అవుట్ డేటెడ్ సినిమా ఈ 'సిగ్మా'.

Oct 03, 2026 Tamil +1

Sigma movie review

5.0
out of 10
సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ థియేటర్లలో విడుదలయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది! వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌‌లో అప్పుల బాధల్లో ఉన్న హీరో గురు, అనుకోకుండా డ్రగ్స్ నెట్‌వర్క్ పెన్ డ్రైవ్ సాధించి ఇంటర్నేషనల్ స్మగ్లర్ వెంకట రెడ్డి (సంపత్ రాజ్)ని బ్లాక్‌మెయిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సందీప్...

సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ థియేటర్లలో విడుదలయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది! వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌‌లో అప్పుల బాధల్లో ఉన్న హీరో గురు, అనుకోకుండా డ్రగ్స్ నెట్‌వర్క్ పెన్ డ్రైవ్ సాధించి ఇంటర్నేషనల్ స్మగ్లర్ వెంకట రెడ్డి (సంపత్ రాజ్)ని బ్లాక్‌మెయిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సందీప్ కిషన్ తన సిన్సియర్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ... కొత్తదనం లేని కథ, ఆకట్టుకోని కథనం వల్ల దర్శకుడిగా జాసన్ సంజయ్ పూర్తిగా విఫలమయ్యాడు.


ఫస్ట్ హాఫ్ డల్ గా సాగడం, ఫరియా అబ్దుల్లా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేకపోవడం, ఎమోషన్స్‌‌లో డెప్త్ మిస్ అవ్వడం మరియు పూర్ డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. క్లైమాక్స్ కూడా ఫ్లాట్‌గా ముగియడంతో సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఓవరాల్‌గా సందీప్ కిషన్ ఎఫర్ట్స్ కోసం మాత్రమే రెగ్యులర్ మూవీ గోయర్స్ ఒకసారి టైమ్‌పాస్ కి ట్రై చేయవచ్చు! చివరగా సిగ్మా ఒక రొటీన్ అండ్ బోరింగ్ హీస్ట్ డ్రామా!


Oct 03, 2026 Tamil +1

Sigma movie review

4.0
out of 10
తమిళ స్టార్ హీరో విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎక్కడో ఉన్న డబ్బు కోసం రెండు వర్గాలు గొడవ పడటం, దానికి సంబంధించిన క్లూ కోసం వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లడం... చివరకు హీ...

తమిళ స్టార్ హీరో విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎక్కడో ఉన్న డబ్బు కోసం రెండు వర్గాలు గొడవ పడటం, దానికి సంబంధించిన క్లూ కోసం వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లడం... చివరకు హీరో ఆ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం... ఈ కాన్సెప్ట్ ఇప్పటికే దశాబ్దాల కాలంగా నలిగి నలిగి పోయింది. మళ్ళీ అదే కథను తీసుకుని అటూ ఇటూ తిప్పి జనాలకు చూపించాలనే ప్రయత్నం జేసన్ సంజయ్‌ చేశాడు.


అసలు జేసన్ సంజయ్‌ చెప్పిన కథలో ఏ కొత్తదనం చూసి లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అర్థం కాదు. సందీప్ కిషన్‌, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. పై పెచ్చు కోట్ల రూపాయలను నీళ్ళ మాదిరి ఖర్చుచేయించాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ అని ఇవాళ్టి తరం చెబితే... జనాలు వినే పరిస్థితి లేదు. నిజానికి ముక్కు ముఖం బాగున్న జేసన్ సంజయ్‌ దర్శకత్వం కంటే నటన మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో!


Oct 03, 2026 Tamil +1

Sigma Movie Review

3.0
out of 10
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి సిగ్మాతో వస్తున్నాడు. ఆ సినిమాను లైకా ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయాలు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన చూస్తే భారీ నిరాశే ఎదురైందని చెప్పాలి. జేసన్ సంజయ్ ఎంచుకొన్న కథ, ఆ కథను చెప్పడానికి అనుసరించిన కథనం చాలా పేలవంగా, నాసిరకంగా ఉన్నాయి. సినిమా సాగుతున్న కొద్ది ఈ టార్చర్ ఎప్పుడు ముగుస్తుందా...

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి సిగ్మాతో వస్తున్నాడు. ఆ సినిమాను లైకా ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయాలు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన చూస్తే భారీ నిరాశే ఎదురైందని చెప్పాలి. జేసన్ సంజయ్ ఎంచుకొన్న కథ, ఆ కథను చెప్పడానికి అనుసరించిన కథనం చాలా పేలవంగా, నాసిరకంగా ఉన్నాయి. సినిమా సాగుతున్న కొద్ది ఈ టార్చర్ ఎప్పుడు ముగుస్తుందా? అనే ఫీలింగ్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 


నటీనటులు విషయానికి వస్తే.. సందీప్ కిషన్ ఈ సినిమాను ఎలా ఒప్పుకొన్నాడు అనే మిలియన్ డాలర్ ప్రశ్నే. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవనే చెప్పాలి. కొంతలో కొంత సినిమాటోగ్రఫి బాగుంది. చాలా వరకు సన్నివేశాలను బాగా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ గోల గోలగా ఉంటుంది. ఎడిటర్ పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తుంది. సన్నివేశాలను కూర్పు చేయడానికి ఎంత కష్టపడ్డారో సినిమా ఫ్లోను చూస్తే అర్ధమవుతుంది. ఆడియన్స్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండటమే మంచిదనేది సూచన, సలహా. దాంతో డబ్బు మాత్రమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. సిగ్మా సినిమా విషయంలో బీ కేర్ ఫుల్.


Oct 03, 2026 Tamil +1

Sigma Movie Review

Tupaki

By Tupaki

4.0
out of 10
విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మా’ అంటూ జెన్ జీ వాడే పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడే కానీ.. కథాకథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపో...

విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మా’ అంటూ జెన్ జీ వాడే పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడే కానీ.. కథాకథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు సంజయ్.


హీరో-విలన్ల మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మినిమం ఇంట్రెస్ట్ కలిగించదు. చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు ఉంటుంది తప్ప.. కథ ముందుకే కదలదు. హీరో హీరోయిన్ల ట్రాక్ అయితే అసలెందుకు పెట్టారో అర్థం కాదు. సందీప్ కిషన్ గురు పాత్రలో బాగానే నటించాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ఇక థమన్ మ్యూజిక్ బాగానే ఉన్నా, కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల బీజీఎం చాలా చోట్ల అతిగా అనిపిస్తుంది. ఓవరాల్ గా జేసన్ సంజయ్ కి కావాల్సిన వనరులన్నీ బాగానే సమకూరినా.. బలహీనమైన స్క్రిప్ట్.. సాధారణమైన టేకింగ్ తో అన్నింటినీ వేస్ట్ చేశాడు. తన అనుభవలేమి అడుగడుగునా కనిపించింది. కొన్ని సీన్లు చూస్తే.. జేసన్ ను ఎవరూ సరిగా గైడ్ చేయలేదనిపిస్తుంది. చివరగా ‘సిగ్మా’.. ఆసక్తి లేని క్యాట్ అండ్ మౌస్ గేమ్!


Oct 03, 2026 Tamil +1

Sigma Movie Review

5.0
out of 10
యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. సినిమా ఆరంభం లోనే ఇది ఎలాంటి కొత్తదనం లేని చాలా పాత, రొటీన్ కథతో మొదలయింది అని అర్ధం అవుతుంది. ఒక సాధారణ పాయింట్ ను...

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది. దళపతి విజయ్ కొడుకు ఎలా డైరెక్ట్ చేసాడు అనే ఆసక్తి అందరిలో ఉండగా ఈ సినిమా తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. 


సినిమా ఆరంభం లోనే ఇది ఎలాంటి కొత్తదనం లేని చాలా పాత, రొటీన్ కథతో మొదలయింది అని అర్ధం అవుతుంది. ఒక సాధారణ పాయింట్ ను తీసుకోవడం పర్వాలేదు కానీ, సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం బిగ్ మైనస్ అయ్యింది. సినిమా ఆరంభమే డల్ గా ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ ట్రాక్ లు కూడా ఎలాంటి సోల్ లేకుండా కనిపిస్తాయి.


ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘సిగ్మా’ ఒక బోరింగ్ యాక్షన్ ట్రీట్ గా మిగిలిపోయింది. హీరో సందీప్ కిషన్ తన వల్ల అయ్యినది అంతా ఈ సినిమా కోసం పెట్టేసాడు. తన హార్డ్ వర్క్, సిన్సియార్టీ ఇందులో కనిపిస్తుంది. కానీ జాసన్ కథా, కథనాల్లోనే చాలా బలహీనత ఉంది. సో హీరో ఆకట్టుకున్నా దర్శకుడు పనితనం ఇందులో డిజప్పాయింట్ చేస్తుంది. సో ఈ సినిమా ఆకట్టుకోదు.


Oct 03, 2026 Tamil +1

Sigma movie review

5.0
out of 10
‘సిగ్మా’ అనే టైటిల్ చూసి కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. అసలే డెబ్యూ డైరెక్టర్.. పైగా దళపతి విజయ్ కొడుకు.. కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుని ఉంటారు. కానీ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే మాత్రం ‘సిగ్మా’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందని అర్థం అవుతుంది. ‘సిగ్మా’ మేకింగ్‌ లో ఎలాంటి పొరబాట్లు కనిపించవు. కానీ రైటింగ్‌లో మాత్రం చాలా వరకు వీక్ అనిపిస్తుంది. జాసన్ సంజయ్.. కథని సరిగ్గా...

‘సిగ్మా’ అనే టైటిల్ చూసి కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. అసలే డెబ్యూ డైరెక్టర్.. పైగా దళపతి విజయ్ కొడుకు.. కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేసి ఉంటాడని అంతా అనుకుని ఉంటారు. కానీ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్లి కూర్చుంటే మాత్రం ‘సిగ్మా’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందని అర్థం అవుతుంది. ‘సిగ్మా’ మేకింగ్‌ లో ఎలాంటి పొరబాట్లు కనిపించవు. కానీ రైటింగ్‌లో మాత్రం చాలా వరకు వీక్ అనిపిస్తుంది. జాసన్ సంజయ్.. కథని సరిగ్గా రాసుకోలేకపోయాడని అర్థం అవుతోంది. ఎమోషన్స్, లాజిక్స్ ఇలా అన్నింటినీ గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది.


ఫస్ట్ హాఫ్ లో ఒక్కటంటే ఒక్క కొత్త సీన్ కూడా కనిపించదు. ఇక సెకండాఫ్ ఆరంభమే.. ముగింపు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ప్రీ క్లైమాక్స్‌కే థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఎండింగ్‌ ఏంటో తెలిసిపోతుంది. అలా ఎక్కడా కూడా వావ్ అనిపించే మూమెంట్స్ కనిపించకపోవడంతే.. నీరసంగా, నిదానంగా అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. టెక్నికల్‌ గా సిగ్మా కొంత వరకు మెప్పిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. తమన్ పాటల కంటే ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగానే అనిపిస్తుంది. మిగిలిని అన్ని డిపార్ట్మెంట్స్ పర్లేదనిపిస్తాయి. చివరగా ‘సిగ్మా’ మీద భారీ అంచనాలు పెట్టుకోకుండా.. టైం పాస్ కోసం వస్తే.. పాటలు, ఫైట్స్, కొన్ని కామెడీ సీన్స్ అంటూ ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేసే అవకాశం ఉంది. ఇక సందీప్ కిషన్ తన వంతుగా ప్రయత్నించినా.. జాసన్ సంజయ్ రైటింగ్ మాత్రం తేలిపోయిందని చెప్పుకోవచ్చు.


Oct 03, 2026 Tamil +1
6.0
out of 10
ఇక డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా గురించి మాట్లాడుకుంటే.. అసలు ఇలాంటి సినిమా ఒకటి తీయాలని థాట్ గుడ్ అండి. Because let me tell you why. థియేటర్ లో ఒక 30 మంది ఉంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కామెడీస్ అండి. This film is made for kids. అంటే సినిమాలో మనకి డిస్టర్బింగ్ ఇమేజరీ గానీ, వైలెన్స్ గానీ, స్లీజీనెస్ గానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా క్లీన్ గా ప్రెసెంట్ చేశారు. సో ఇది కూడా పాజిటివ్ గానే చెప్తావా అం...

ఇక డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా గురించి మాట్లాడుకుంటే.. అసలు ఇలాంటి సినిమా ఒకటి తీయాలని థాట్ గుడ్ అండి. Because let me tell you why. థియేటర్ లో ఒక 30 మంది ఉంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కామెడీస్ అండి. This film is made for kids. అంటే సినిమాలో మనకి డిస్టర్బింగ్ ఇమేజరీ గానీ, వైలెన్స్ గానీ, స్లీజీనెస్ గానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా క్లీన్ గా ప్రెసెంట్ చేశారు. సో ఇది కూడా పాజిటివ్ గానే చెప్తావా అంటే చెప్పాలి బికాజ్ ఇలాంటి సినిమాలు రావట్లేదు కాబట్టి. 


And then my second one, సినిమా ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ ఎంగేజింగ్ అండి. అంటే పాప లాంటి ఒక కరిస్మాటిక్ యాక్టర్, ఓ చిన్న పాప who is cute and who performs really well, అండ్ దెన్ ఇంకొక కుక్కపిల్ల. సో ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు కొన్ని మూమెంట్స్ కచ్చితంగా వర్క్ అవ్వాల్సిందే అండ్ ఫస్ట్ హాఫ్ లో అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. And now the biggest positive is the leads, ఫాఫా అండ్ బేబీ సారా. ఫహద్ గురించి నేను చెప్పేది ఏముంది, he is a proven actor. ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ ఎంగేజింగ్, లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అండ్ కాలభైరవస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. 


బట్ మూవీ లెంత్ గా ఎక్కువగా అనిపిస్తది. నాకు ఎప్పుడూ మూవీ లెంత్ తో ప్రాబ్లం ఉండదు until and unless it is not engaging. ప్రీ క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంటదండి. ఆ సీక్వెన్స్ ఆ సీన్ లో ఉన్న పొటెన్షియల్ కి మనకి గుండె పిండేసే సీక్వెన్స్ అన్నమాట. కానీ ఆ సీక్వెన్స్ మనకి ఈ సినిమాలో అంతగా వర్క్ కాలేదు. ఎందుకంటే ఆ సీక్వెన్స్ లో ఫహద్ క్యారెక్టర్ చేంజ్ అవుతది అన్నమాట. సో ఇలాంటివి అన్నమాట. ఆ క్యారెక్టర్స్ గనక కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే కొన్ని సీన్స్ బ్రిలియంట్ గా వర్క్ అయ్యేవి. To be honest చెప్పాలంటే ఓవరాల్ గా ఒక రెగ్యులర్ ఎండింగ్ కి వెళ్ళిపోవచ్చు అండి.  

Oct 02, 2026 Tamil +2
6.0
out of 10
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ గురించి చెప్పాలంటే ఓకే ఓకే పర్లేదు అన్నట్టు ఉందన్నమాట సినిమా. దానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ 20 నిమిషాలు లిటరల్లీ చెప్తున్నా చాలా బాగా అనిపిస్తది. చాలా సేపు ఏడ్చా. దానికి రీజన్ మే బి దానికి ముందు ఏదైతే సెటప్ అంతా పెట్టుకుంటూ వచ్చారో దానికి పే ఆఫ్ లాగా అయి ఉండొచ్చు కానీ దానికి ముందు అంతా ఏదైతే సెటప్ పెట్టారో అది చాలా ఫ్లాట్ ఉంటది అబ్బా. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా...

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ గురించి చెప్పాలంటే ఓకే ఓకే పర్లేదు అన్నట్టు ఉందన్నమాట సినిమా. దానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ 20 నిమిషాలు లిటరల్లీ చెప్తున్నా చాలా బాగా అనిపిస్తది. చాలా సేపు ఏడ్చా. దానికి రీజన్ మే బి దానికి ముందు ఏదైతే సెటప్ అంతా పెట్టుకుంటూ వచ్చారో దానికి పే ఆఫ్ లాగా అయి ఉండొచ్చు కానీ దానికి ముందు అంతా ఏదైతే సెటప్ పెట్టారో అది చాలా ఫ్లాట్ ఉంటది అబ్బా. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా డల్లుగా వెళ్తుంటది సినిమా. ఏదో అక్కడక్కడ ఒక నాలుగు ఐదు డైలాగ్ ఓరియెంటెడ్ జోక్స్ అంటే మనలాంటివి ఉంటాయి కదా లైక్ ఫైవ్ సిక్స్ ప్లేసెస్ లో ఫైవ్ సిక్స్ డైలాగ్ వర్క్ అవుట్ అవుతాయి అంతే. ఇంకేమి కూడా అంత వర్క్ అవుట్ కాదు. లిటరల్లీ చాలా బ్యాడ్ అనిపిస్తది మనకి. 


అంటే పిల్లలకు బాగుంటది ఓకే పిల్లలకు అది బాగా అనిపిస్తది బికాజ్ ఆ యానిమేషన్ కొంచెం లైక్ ఆ పాప అది కొంచెం సోపాస్ లాగా ఇవన్నీ కూడా మనకి ఏదో చూపించారు ఆ గోస్ట్లీ వైబ్స్ ఇదంతా కూడా. సో ఐ మే బి పిల్లలకు బాగా నచ్చుతాయి ఎందుకంటే నేను వెళ్లి ఆడిటోరియం వచ్చి ట్రిపుల్ ఏ స్క్రీన్ లో చూశాను. సో యాక్చువల్ గా మొన్నే కదా ఓపెన్ అయింది. సో దాంట్లోకే వెళ్ళాను అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే తెలుస్తోంది. లైక్ లైక్ అంటే ఇంకా చాలా బెటర్ గా ఉండొచ్చు అన్న ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతూ ఉంటది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మిస్ అయిన ఫీలింగ్ అన్నది. 


సో అది ప్రాబ్లం. అంటే ఎప్పుడైనా సరే జనరల్ గా చెప్తాను చూడండి ఒక స్టోరీలో మే బి ఒక రెండు క్యారెక్టర్స్ చుట్టూ లేదా నాలుగు క్యారెక్టర్స్ చుట్టూ కథను తిప్పేటప్పుడు జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో ఉండే ప్రాబ్లం ఇదే అనిపిస్తుంటది. అంటే ఆ వెళ్ళే విధానం అనేది కొత్త కొత్త ఎలిమెంట్స్ ఏమీ సినిమాలో యాడ్ అవ్వట్లేదు. వాడి చుట్టూ అక్కడికి పోతుంది సినిమా. అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ అంతా నీరసమే అసలు ఆబ్వియస్లీ. సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ లైట్ గా సో బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ ఆడియన్స్ కి ట్రబుల్ లాగే మిగిలింది. అది మేటర్ అన్నమాట. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ 2.95 అవుట్ ఆఫ్ ఫైవ్. 

Oct 02, 2026 Tamil +2
just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi. but industry big stars promote chestunte nenedo pedda storye undemo anukunte.. edo chandamama kathalaga.. chinna pillala cinema icchadu. pone i...

just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi.


but industry big stars promote chestunte nenedo pedda storye undemo anukunte.. edo chandamama kathalaga.. chinna pillala cinema icchadu. pone idaina entertaining ga unda ante adi kooda ledu. but fahad and aa child artist baga perfarm chesaru.


and ee cinema evaraina chudalanukunte already other movies kooda release ayyi. vere movies kooda dissapoint chesela unte.. ee cinema one of the option ga tiskunte better. and takkuva expectations pettukuni chustene konchem ayina connect ayye chance undi.

Oct 02, 2026 Tamil +2
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విషయానికి వస్తే.. ఇలాంటి కథలు గతంలో బోలెడు సినిమాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఓ పాపకి కష్టం రావడం, ఒక్కతే ఉండి హీరో దగ్గరకు చేరడం, హీరో పాప కష్టాన్ని సాల్వ్ చేయడం.. అప్పుడెప్పుడో పసివాడి ప్రాణం నుంచి భజరంగి భాయ్ జాన్ వరకు బోలెడన్ని సినిమాలు వచ్చాయి ఈ...

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విషయానికి వస్తే.. ఇలాంటి కథలు గతంలో బోలెడు సినిమాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఓ పాపకి కష్టం రావడం, ఒక్కతే ఉండి హీరో దగ్గరకు చేరడం, హీరో పాప కష్టాన్ని సాల్వ్ చేయడం.. అప్పుడెప్పుడో పసివాడి ప్రాణం నుంచి భజరంగి భాయ్ జాన్ వరకు బోలెడన్ని సినిమాలు వచ్చాయి ఈ కథతో.


ఇక సినిమాలో అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. ఎమోషన్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో రాసుకున్న పలు డైలాగ్స్ తో క్లైమాక్స్ ఇంకా కొనసాగింపు ఇచ్చి ఇంకో ముగింపు ఇచ్చుకునే అవకాశం ఉంది కానీ ఇలాంటి ముగింపు ఇచ్చాడేంటి అని ఆలోచించాల్సిందే. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. చిన్న పిల్లలకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరదాగా ఓ సారి అయితే చూడొచ్చు. మొత్తంగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ డబ్బు కోసం ఏ పనైనా చేసే హీరో దయ్యం అని తెలియాక ఓ పాప ఆత్మని కిడ్నాప్ చేస్తే ఏం జరిగింది అని కామెడీ ఎమోషన్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.


Oct 02, 2026 Tamil +2
5.0
out of 10
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వినడానికి ఒక చందమామ కథలా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మల మారి ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుక్కోవడమే ఈ సినిమా కథ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన విషయం తనకు తెలియదు. ఒక చిన్న లింకు పెట్టి ఆ అమ్మాయి కేవలం హీరోకి మాత్రమే కనిపించేలా దర్శకుడు ఒక లాజిక్ రాసుకున్నాడు. అదేంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.. అయితే సినిమాలో రాసుకునే సన్నివేశాలు ఇంకాస్త...

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వినడానికి ఒక చందమామ కథలా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మల మారి ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుక్కోవడమే ఈ సినిమా కథ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన విషయం తనకు తెలియదు. ఒక చిన్న లింకు పెట్టి ఆ అమ్మాయి కేవలం హీరోకి మాత్రమే కనిపించేలా దర్శకుడు ఒక లాజిక్ రాసుకున్నాడు. అదేంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.. అయితే సినిమాలో రాసుకునే సన్నివేశాలు ఇంకాస్త వేగంగా ఉండుంటే బాగుండేది.


సెకండాఫ్ లో కూడా కథ కాస్త నెమ్మదిగానే వెళ్ళింది. అయితే చెప్పే ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్ గా చెప్పాలని ముందుగానే ఫిక్స్ అయిపోయిన దర్శకుడు టైం బాగానే తీసుకున్నాడు. కథలో మెయిన్ ప్లాట్ రివిల్ అయిన తర్వాత.. హీరోకు, ఆ పాపకు మధ్య ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా రాసుకోవడంలో తడబడినట్టు అనిపించింది. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండానే అప్పటివరకు ఆ పాప మీద ఎలాంటి ఫీలింగ్ లేని హీరో సడన్గా తనకోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత బలంగా నిలబడతాడు. ఇలాంటి సన్నివేశాలు రాసుకునేటప్పుడు దానికి ముందు మరికొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలు రాసుకుంటే సినిమా మరింత పకడ్బందీగా వచ్చేది. ఓవరాల్ గా వీకెండ్ సరదాగా చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీతో ఒక సినిమా చూడాలి అనుకుంటే ఇది మంచి ఆప్షనే.


Oct 02, 2026 Tamil +2
Why MRO?