Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

679
Total Reviews
103
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 457-468 of 679 reviews
Clear all filters
5.0
out of 10
జాతకాలపై విపరీతమైన నమ్మకం ఉన్న కాలేజ్ లెక్చరర్ విష్ణు (శ్రీ విష్ణు) జీవితంలోకి అదే కాలేజ్‌లో పనిచేయడానికి వచ్చే మనీషా (నయన్ సారిక) ప్రవేశిస్తుంది. ఆమె వచ్చాక విష్ణు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మనీషా జాతకంలో ఉన్న గండం బయటపడుతుంది. ఆ గండం ఏమిటి? దాని వల్ల వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని విష్ణు ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే విష్ణు విన్యాసం సినిమా కథ. టెక్నికల్‌గా చూస్త...

జాతకాలపై విపరీతమైన నమ్మకం ఉన్న కాలేజ్ లెక్చరర్ విష్ణు (శ్రీ విష్ణు) జీవితంలోకి అదే కాలేజ్‌లో పనిచేయడానికి వచ్చే మనీషా (నయన్ సారిక) ప్రవేశిస్తుంది. ఆమె వచ్చాక విష్ణు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మనీషా జాతకంలో ఉన్న గండం బయటపడుతుంది. ఆ గండం ఏమిటి? దాని వల్ల వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని విష్ణు ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే విష్ణు విన్యాసం సినిమా కథ. టెక్నికల్‌గా చూస్తే సినిమా విజువల్‌గా బాగానే కనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సన్నివేశాలను కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించింది. రధన్ అందించిన పాటలు కథకు సరిపోయేలా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు మంచి ఫీల్ తీసుకొచ్చింది. సినిమా నిడివి రెండు గంటలే కావడంతో పెద్దగా బోర్ అనిపించదు. నిర్మాత సుమంత్ నాయుడు ఈ సినిమాతో మంచి ఫలితం ఆశించినా, బాక్సాఫీస్ కంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశముందని చెప్పాలి.

Mar 14, 2026 Telugu
5.0
out of 10
జాతకాలు, మూఢనమ్మకాల నేపథ్యంతో వచ్చిన విష్ణు విన్యాసం కథలో వినోదానికి మంచి స్కోప్ ఉన్నా, బలమైన కామెడీ సీన్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ సరిగా పండకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హీరో శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దర్శకుడు మారుతీరావు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా, కథనంలో బలహీనతలు కనిపిస్తాయి. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, రధన్ మ్యూజిక్ సినిమా...

జాతకాలు, మూఢనమ్మకాల నేపథ్యంతో వచ్చిన విష్ణు విన్యాసం కథలో వినోదానికి మంచి స్కోప్ ఉన్నా, బలమైన కామెడీ సీన్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ సరిగా పండకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హీరో శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దర్శకుడు మారుతీరావు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా, కథనంలో బలహీనతలు కనిపిస్తాయి. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, రధన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. మొత్తం మీద విష్ణు విన్యాసం ఓ సాధారణ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది.

Mar 14, 2026 Telugu
6.0
out of 10
శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం' మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ శ్రీవిష్ణు తన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ కి తగ్గట్టే సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్ చేస్తాడు. మూవీ మొత్తం వన్ మ్యాన్ షోతో అలరించాడు. అలాగే హీరోయిన్ నయన్ సారికకు కూడా మంచి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ దొరికింది. కాకపోతే కొత్తదనం లేదు. డైరెక్టర్ మారుతీ రావు కథా కథనాల విషయంలో మరింత దృష్టి పెట్...

శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం' మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ శ్రీవిష్ణు తన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ కి తగ్గట్టే సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్ చేస్తాడు. మూవీ మొత్తం వన్ మ్యాన్ షోతో అలరించాడు. అలాగే హీరోయిన్ నయన్ సారికకు కూడా మంచి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ దొరికింది. కాకపోతే కొత్తదనం లేదు. డైరెక్టర్ మారుతీ రావు కథా కథనాల విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ అయింది. ప్రీ క్లైమాక్స్ దాకా ఊపు రాదు. ఓవరాల్ గా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోవడం కష్టం, కానీ రెగ్యులర్ మూవీ లవర్స్ కి, కామెడీ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి విష్ణు విన్యాసం బాగా నచ్చుతుంది.

Mar 14, 2026 Telugu

Hey Balwanth movie Review

A

By AP7AM

5.0
out of 10
ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన "హే బలవంత్" ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో కాస్త తడబడిందని చెప్పాలి. కానీ దర్శకుడు తను రాసుకున్న ఇలాంటి కథను ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దాంతో పాటు నటీనటులు సుహాస్, శివాని నాగారం, సహా నరేష్ పెర్ఫార్మ...

ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన "హే బలవంత్" ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో కాస్త తడబడిందని చెప్పాలి. కానీ దర్శకుడు తను రాసుకున్న ఇలాంటి కథను ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దాంతో పాటు నటీనటులు సుహాస్, శివాని నాగారం, సహా నరేష్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటుంది. అక్కడక్కడా రచనా పరంగా లోపాలున్నా, ఎటువంటి లాజిక్‌లు ఆలోచించకపోతే వినోదాన్ని కోరుకునే వాళ్లకు 'హే బల్‌వంత్‌' పూర్తిస్థాయి సంతృప్తినిస్తుంది. ఈ వీకెండ్‌ 'హే బల్‌వంత్‌' మంచి టైమ్‌ పాస్‌ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

Feb 27, 2026 Telugu

Hey Balwanth Movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
పూర్తిగా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన "హే బలవంత్" సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఇక టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ గోపి ఆచార...

పూర్తిగా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన "హే బలవంత్" సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఇక టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ గోపి ఆచార కామెడీ మీద మంచి పట్టున్న సంగతి అర్థమవుతుంది. తన డెబ్యూ మూవీ కోసం అతను చాలా రిస్కీ సబ్జెక్టును ఎంచుకున్నాడు. ఆ పాయింట్ మీద సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు.. రెండు ముఖ్యమైన ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన తీరు బాగుంది. కానీ దీని మీద ఎమోషన్లను వర్కవుట్ చేయాలనుకోవడం.. సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలనుకోవడం మాత్రం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అక్కడే దర్శకుడు తడబడ్డాడు అనిపిస్తుంది. దర్శకుడు ఈ పాయింట్ తీసుకోవడం తప్పని అనలేం కానీ.. దాని మీద కామెడీని.. ఎమోషన్ ను కలపాలన్న ప్రయత్నమే పెద్దగా ఫలించలేదు.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

6.0
out of 10
" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి...

" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి పనికొచ్చే సినిమా ఈ హే బల్వంత్. ఇక ఫస్టాఫ్ వినోదానికి కొదవలేదు. సెకండాఫ్ లోనే కొంత భాగం కామెడీని మర్చిపోయి కుంటుపడింది. ఆ తర్వాత వేగం పుంజుకోవడం, ముగింపూ సినిమాని రక్షించాయి. దర్శకుడు గోపీ అచ్చర చేసిన ప్రయత్నం సుహాస్ కి ఎదురు చూస్తున్న విజయాన్ని అందించేలా వుంది. ప్రేక్షకులు ఓటీటీ కోసం వేచి ఉండకుండా థియేటర్ కెళ్ళి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. అయితే ఫైనల్ రిసల్ట్ ఆడియన్స్ చేతుల్లోనే ఉంది.

Feb 27, 2026 Telugu

Hey Balwanth Movie Review

6.0
out of 10
కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్‌ సాగర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్‌ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు బా...

కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్‌ సాగర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్‌ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ప్రొస్ట్రిట్యూషన్‌ అనే అంశాన్ని చాలా నీట్‌ గా, ఫన్నీగా, ఎమోషనల్‌గా డీల్‌ చేసిన తీరు మాత్రం సూపర్బ్. తండ్రికి సంబంధించిన ఎమోషన్స్, సెంటిమెంట్‌ ని కూడా చాలా బాగా చూపించాడు. డైలాగ్‌లు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. బాగా రాసుకున్నారు, పర్‌ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే కొంత డ్రామా ఎక్కువ అయ్యిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని చోట్ల కామెడీ అంతగా పండలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్‌ చేశాడు. ఓవరాల్ గా 'హే బలవంత్' ఒక వర్గం ఆడియన్స్ ని అయితే మెప్పిస్తుందని చెప్పాలి.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

5.0
out of 10
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్...

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్శకుడి తడబాటు కనిపించింది. కానీ చెప్పాలనుకున్న విషయం బావుంది. లాజిక్కులు పట్టుకుంటూ వెళితే చాలా కనిపిస్తాయి. కానీ కంటెంట్ పరంగా సినిమాలో లాజిక్స్ ఆలోచిస్తే చూడలేం. పైగా 'హే బల్‌వంత్' లో నవ్వులకు లోటు ఉండదు. కానీ, స్క్రీన్ మీద చూస్తే కిక్. సుదర్శన్ కామెడీ, ఆ బిజినెస్ చుట్టూ రాసుకున్న సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నరేష్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సుహాస్, శివానీ చక్కగా నటించారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకునే సినిమా.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

5.0
out of 10
సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్ద...

సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బీజీఎమ్ విషయంలో మాత్రం న్యాయం చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. కానీ హీరో తండ్రి ఇలాంటి కాలంలో కూడా సమాజం ఒప్పుకోలేని ఒక వ్యాపారాన్ని ఎందుకు కొనసాగించాడనే ప్రశ్న మాత్రం ఆడియన్స్‌లో మిగిలిపోతుంది. దీనికి డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు కానీ ఆడియన్స్ దానికి పూర్తిగా కనిన్స్ కాలేకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో నరేష్, అన్నపూర్ణ పాత్రలకి సంబంధించి ఇచ్చిన చిన్న ట్విస్ట్ మాత్రం బావుంది.

Feb 27, 2026 Telugu

Hey Balwanth movie Review

6.0
out of 10
'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడ...

'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడా మరోసారి మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ అందించారు. రైటింగ్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా హైలీ అప్రిషియేబుల్. కన్విన్సింగ్, కమిటెడ్‌గా కథను తెరపైకి తెచ్చారు. డైరెక్టర్ గోపి, రైటర్స్ మిథున్, షణ్ముఖ కొత్తవారైనా ప్రతీ సీన్‌లో అరిపించేశారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వులతో సాగే కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఓ ఎమోషనల్ జర్నీ. 100 శాతం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా తప్పకుండా.. సినిమా హాల్‌లోనే చూడండి.

Feb 27, 2026 Telugu
5.0
out of 10
టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓ...

టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.

Feb 27, 2026 Telugu

Cheekatilo movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించ...

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించిన విశ్వదేవ్ రాచకొండ జస్ట్ ఓకే అనిపించాడు. కృష్ణచైతన్య పోలీస్ పాత్రకు న్యాయం చేశాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన సీనయిర్ నటుడు సురేష్.. ఈషా చావ్లాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వాళ్ల పాత్రలు అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. రవీంద్ర విజయ్ క్యారెక్టర్ కూడా అంతే. వడ్లమాని శ్రీనివాస్ బాగా చేశాడు. అయితే ఓవరాల్ గా యావరేజ్ కంటెంట్ గా చీకటిలో ఒకసారి ట్రై చేయొచ్చు.

Feb 18, 2026 Telugu
Why MRO?