Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ప్రధానంగా సాగిన (మిస్సింగ్ మేఘన) చిత్రమిది. ఇందులో లవ్ ట్రాక్ కూడా ఉంది. అయితే అదొక డిఫరెంట్ లవ్ స్టోరీ కావడం విశేషం. పెళ్లి సెట్ అయిన అమ్మాయి ఆ తర్వాత వేరే వ్యక్తితో ప్రేమలో పడటమనే కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అందులోనూ ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇక మేఘన మిస్సింగ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అయితే సినిమా అర్థం కావడానికి టైమ్ పడుతుంది. ఫస్టాఫ్ చాలా వేగంగా పూర్తవుతుంది. కానీ సెకండాఫ్ లెంన్తీగా అనిపిస్తుంది. కార్తీక్ లవ్ ట్రాక్, మేఘనతో ఆయన పరిచయం రివీల్ కావడానికి టైమ్ తీసుకున్నారు. ఆ లవ్ ట్రాక్ కొత్తగా ప్రారంభమైనా, ఆ తర్వాత కొంత రొటీన్‌గా, మరికొంత బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఇక సినిమాలో మెయిన్ ఎమోషన్ మిస్ అయ్యింది. చాలా సీన్లు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ట్విస్ట్ లు కూడా గొప్పగా వర్కౌట్ కాలేదు. కాకపోతే ఇంకా బాగా చేయాల్సింది. వాహ్ ఫ్యాక్టర్ విషయంలో, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఫైనల్ గా కొంత వరకు ఎంగేజ్ చేసి, ట్విస్ట్, టర్న్ లతో ఆకట్టుకునే మూవీ `మిస్సింగ్ మేఘన`. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల విజయం అంతా స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్‌ను సాగదీయడం అతిపెద్ద మైనస్. రెండో భాగంలో వచ్చే కొన్ని సీన్లు, డైలాగ్స్ 2010 కాలం నాటి రొమాంటిక్ షార్ట్ ఫిలింలను గుర్తు చేస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే.. ‘మిస్సింగ్ మేఘన’ కొత్తదనం లేని ఒక రొటీన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు, అమ్ము అభిరామి నటన మినహా ఆకట్టుకుంటయి. సాగదీసిన సెకండ్ హాఫ్, ఊహకందే క్లైమాక్స్, లాజిక్ లేని సీన్లు ఈ సినిమా గ్రాఫ్ ను తగ్గించేశాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌కి వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే స్నేహం, దేశభక్తి మరియు గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ప్రధానంగా చర్చించిన స్నేహానికి సంబధించిన అంశం..అలాగే ‘దేశం కోసం కొంతమంది ఎలాంటి త్యాగం చేస్తారు ?, ప్రాణం ఇచ్చి అయినా సరే దేశాన్ని ఎలా కాపాడతారనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించడం కూడా బాగుంది.
ఈ ‘సీక్రెట్ సోల్జర్’ సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఓవరాల్ గా ‘సీక్రెట్ సోల్జర్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ డ్రామాలో.. స్నేహం, దేశభక్తి వంటి అంశాలను బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా దర్శకుడు బాగానే ప్లాన్ చేశాడు. కానీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.
దేశభక్తి, దేశం కోసం సీక్రెట్ గా పోరాడే సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సీక్రెట్ సోల్జర్స్ ని ప్రధానంగా చేసుకొని రూపొందిన మూవీ `సీక్రెట్ సోల్జర్`. దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమిది. నిజానికిది చాలా పెద్ద రేంజ్ స్టోరీ. కానీ కొత్త నటీనటులు, అప్‌కమింగ్ యాక్టర్స్ తో ఈ రేంజ్ సినిమా తీయడం విశేషమని చెప్పాలి. ఇక సినిమాలో డిఫెన్స్ కి సంబంధించిన సీక్రెట్ మిషన్ లీక్‌కి, స్నేహాన్ని ముడిపెడుతూ రూపొందించిన తీరు బాగుంది. సినిమాలోని ట్విస్ట్ లు, టర్న్ లు మరో హైలైట్‌గా నిలిచాయి.
ఇక ఒక్కో ట్విస్ట్, అసలు కథ రివీల్ అవుతున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఓ వైపు దేశానికి సంబంధించిన స్పై ఏజెన్సీ చేసే కార్యక్రమాలు, వారు చేసే మిషన్ లీక్ కావడం వంటి అంశాలను, మరోవైపు స్నేహానికి సంబంధించిన జర్నీని ఆవిష్కరించిన తీరు బాగుంది. స్క్రీన్ ప్లే చాలా నీట్‌గా సాగుతుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చాలా చోట్ల కథనంలో లింక్‌లు మిస్ అయ్యాయి. ఒక వైపు వెళ్లే కథ, మరోవైపు టర్న్ తీసుకున్నట్టుగా ఉంటుంది. చాలా చోట్ల లాజిక్ లు మిస్ అయ్యాయి. స్పై ఏజెన్సీలోనే వారికే కమ్యూనికేషన్ లేకపోవడమనేది కొంత అసహజంగా అనిపిస్తుంది. పాత్రల్లోని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. కాకపోతే చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. కొత్త వారైనా చాలా బాగా చేశారు. ఇదొక స్పై యాక్షన్ ఫిల్మ్ లా కాకుండా, స్నేహం చుట్టూ కథని నడిపించడం విశేషంగా చెప్పొచ్చు. ఓవరాల్ గా దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఒక కొత్త తరహా చిత్రమిది. స్పై మూవీస్, దేశభక్తి మూవీస్‌ని ఇష్టపడే వారికి నచ్చే సినిమా అవుతుంది.
డీజే టిల్లు’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన విమల్ కృష్ణ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకో సినిమా తీయలేదు. ఎట్టకేలకు అతడి నుంచి ఓ సినిమా వచ్చింది. అదే.. అనుమాన పక్షి. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోకు ప్రతి విషయంలోనూ విపరీతమైన అనుమానం. ఈ అనుమానంతో తన జీవితాన్ని ఎలా నరకప్రాయం చేసుకున్నాడన్నది చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఐతే హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అతడి ఆలోచన బాగుంది కానీ, ఇలా ఒక కాన్సెప్ట్ తీసుకున్నపుడు.. పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయడం కీలకం. క్రేజీ సీన్లు రాసుకుని ఆ పాత్ర పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడేలా చూడాలి. కానీ హీరో తన గురించి తనే నరేట్ చేసుకునే ఆరంభ సన్నివేశాలే తేలిపోయాయి.
ఏమాత్రం నవ్వులు పండని సిచువేషన్లతో సినిమా మొదలైన పావు గంటకే ప్రేక్షకుల్లో అసహనం మొదలవుతుంది. రాగ్ మయూర్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. కానీ అతణ్ని ‘అనుమాన పక్షి’లో ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు విమల్ కృష్ణ
ఆ తర్వాత ఇలాంటి సినిమాను ఎంతమాత్రం ఊహించలేం. రైటింగ్ దగ్గరే ‘అనుమాన పక్షి’ తేలిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆసక్తి రేకెత్తించేలా రాసుకోలేదు. ఇలాంటి స్క్రిప్టుతో సినిమా చేయడానికి ఇంతమంది ఎలా రెడీ అయిపోయారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. విమల్ టేకింగ్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు. చివరగా అనుమాన పక్షి.. అంతులేని అసహనం
అనుమానం పెనుభూతం' అనే పాత నానుడికి ఆధునిక సోషల్ మీడియా ధోరణులను జోడిస్తూ తెరకెక్కింటిన వినూత్న చిత్రమే 'అనుమాన పక్షి'. 'డీజే టిల్లు' ద్వారా గుర్తింపు పొందిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో రాగ్ మయూర్ కథానాయకుడిగా నటించారు. ప్రతి చిన్న విషయానికీ అతిగా అనుమానపడే ఓ యువకుడి మనస్తత్వం, ఆ అలవాటు వల్ల అతడి జీవితంలో తలెత్తే ఊహించని విచిత్రమైన పరిస్థితులను కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఎదురైన చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం.
మొత్తానికి 'అనుమాన పక్షి' అనేది అతి అనుమానం ఎలాంటి విచిత్రమైన సమస్యలకు దారితీస్తుందో చూపించే ఓ కొత్త తరహా కాన్సెప్ట్ డ్రామా. ఫస్టాఫ్‌లో వినోదం, సెకండాఫ్‌లో సస్పెన్స్, థ్రిల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొత్త తరహా కథాంశాలు, రాగ్ మయూర్ కామెడీ టైమింగ్, కశ్మీర్ బ్యాక్ డ్రాప్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్ గా నిలుస్తుంది.
After being postponed multiple times, Anumana Pakshi has finally hit the screens. Let’s look at its merits and demerits.
Rag Mayur, who has appeared in several films as a comedian and supporting actor, gets a full-length lead role here. Unfortunately, the film suggests that he is not yet ready to carry an entire movie on his shoulders.Despite running for less than two hours, the film feels much longer because of its sluggish narration and weak editing.
Highlights
None
Drawbacks
Boring narration
Laughless jokes
Cringe-worthy scenes
Weak writing and direction
Overall, Anumana Pakshi is painfully boring from beginning to end. It is meant to be a comedy, but it delivers far more irritation than laughter.
కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న రాగ్ మయూర్ ఇప్పుడు హీరోగా నిలబడుతున్నాడు. `కీడా కోలా`, `పరదా` చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన హీరోగా `అనుమాన పక్షి` మూవీ రూపొందింది. `డీజే టిల్లు` చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించిన చిత్రమిది. అనుమానంతో ఎలాంటి చిక్కులు వచ్చాయనేది, హీరో ఎలాంటి గందరగోళం క్రియేట్ చేశాడు, దీని వల్ల ఫన్ క్రియేట్ చేయడమనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. సింపుల్‌గా కథ ఇదే. ప్రారంభమే ఫన్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో పాత్రని, ఆయన అనుమానాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆవిష్కరించారు.
కానీ కాసేపటికే ఇందులో కామెడీ లేదని అర్థమవుతుంది. రాగ్ మయూర్ చేసిన రచ్చనే ఉంటుంది తప్ప, ఒక్క సీన్‌లోనూ కామెడీ వర్కౌట్ కాలేదు. నటుడిగా రాగ్ మయూర్ బాగానే కష్టపడ్డా, ఆయన చేసే చేష్టల్లో కామెడీ జనరేట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు కామెడీని రాబట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ గా ఏమాత్రం నవ్వించలేకపోయిన అనుమాన పక్షి. సినిమాలో చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ అనుమాన పక్షికి దూరంగా ఉండాలని. అది కరెక్ట్ గా ఈ సినిమాకి వర్తిస్తుంది. ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.
డీజే టిల్లు లాంటి సినిమాను అందించిన విమల్ కృష్ణ నుంచి అనుమాన పక్షి లాంటి నాసిరకం సినిమా వస్తుందని అనుకోలేదు. డైరెక్టర్ ఎంచుకొన్న కథ, కథనాలు, సన్నివేశాలు రాసుకొన్న విధానం అత్యంత దారుణంగా ఉండటం జీర్ణించుకోలేని విషయం. సినిమా మొత్తంలో కూడా ఓ నిమిషం కూడా తన మార్కు సీన్ కూడా కనిపించకపోవడంతో అసలు విమల్ కృష్ణ ఈ సినిమా దర్శకుడేనా? అతనే తీశాడా? అనే అనుమానం పట్టి పీడిస్తూనే ఉంటుంది. కామెడీ సినిమాగా రూపొందిన ఈ సినిమా ఓ క్షణం కూడా నవ్వు రాకుండా సన్నివేశాలను రాసుకోన్నారనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. రాగ్ మయూర్ తన వంతుగా కష్టపడినా అందుకు తగినట్టుగా ఫలితం దక్కలేదు. కశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సన్నివేశాలను సునీల్ కుమార్ చక్కగా చిత్రీకరించాడు. సినిమా అంతా రిచ్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఇక చోటా కే ప్రసాద్‌కు ఈ సినిమా కత్తీ మీద సామే. కంటెంట్ లేకపోతే.. సినిమాను ఎడిటింగ్ చేయడం ఎంత కష్టమో ఈ సినిమా చూస్తుంటే అర్ధమవుతుంది. కానీ శాయశక్తులా ఈ సినిమాను గాడిన పెట్టే ప్రయత్నాన్ని చోటా చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ ఎలాంటి కథను ఎంచుకోవాలి? కథను ఎలా చెప్పాలనే విషయంలో పూర్తిగా నిర్మాతలు మిస్ అయ్యారని ఈ సినిమా చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమా విషయంలో విమల్ కృష్ణ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు. ఫైనల్ గా ఇలాంటి సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి నిర్ణయానికే వదిలివేయాలి.
డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, యంగ్ హీరో రాగ్ మయూర్ కలయికలో వచ్చిన ఫన్నీ చిత్రం ‘అనుమాన పక్షి’. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదలైన కొంత సేపటికే చూసే ఆడియెన్ కి విసుగు మొదలవుతుంది. అసలు యువ హీరో రాగ్ మయూర్ ఈ కథను ఎందుకు ఒప్పుకున్నాడా అనే సందేహం రాకమానదు. తన రోల్ పై మరింత ఫన్ ని జెనరేట్ చేసే పాజిబులిటీ ఉంది కానీ ఈ సినిమాలో అది బాగా మిస్ అయ్యింది. అలానే ఇతర పాత్రలతో కూడా అంతగా కనెక్ట్ అవ్వలేం.
రైటింగ్, సీన్స్, నాచురల్ కామెడీ ఇవన్నీ బాగా లోపించాయి. వీటితో తన వర్క్ డల్ గా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే, మొత్తంగా చూసుకుంటే ‘అనుమాన పక్షి’ థియేటర్స్ లో ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టే పేలవమైన చిత్రంగా మిగిలిపోయింది. రెండు గంటల లోపు రన్‌టైమ్, రాగ్ మయూర్ పంచిన లిమిటెడ్ ఫన్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. పస లేని కథనం, కృత్రిమంగా అనిపించే ఫన్ సీన్స్, సంబంధం లేని పాత్రలతో సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. ముఖ్యంగా డీజే టిల్లు లాంటి మేజిక్ ఆశించి వెళ్తే ఆడియెన్స్ కి దర్శకుడు మాత్రం డిజప్పాయింట్ చేసే పంపుతాడు. సో ఈ సినిమా మెప్పించదు.
‘ది ప్యారడైజ్’.. ప్రొడ్యూసర్లు solid pan india సినిమా తీశామని అనుకుంటున్నారు కానీ, నిజానికి ప్రేక్షకుల ఓర్పుకి నోబెల్ బహుమతి ఇచ్చే పరీక్ష పెట్టారు! సినిమాలోని లాజిక్కులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే! ఒకవైపు హీరో విలన్లను నరికి పడేస్తుంటే, బందీగా ఉన్న అతనమ్మ హాయిగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తోంది—పాపం, ఎమోషన్ పండించబోయి థియేటర్లలో నవ్వులు పూయించారు! ఇక కలెక్టర్ గారైతే గుర్తింపు కార్డు సంతకాల కోసం పిక్కల్లోతు నీళ్లలో కూర్చుని సత్యగ్రహం చేస్తారు. అంతటితో ఆగారా? మన హీరో ఏకంగా సొంత 'దేశాన్ని' ప్రకటించేసి, టీచర్లు, డాక్టర్లను కిడ్నాప్ చేసి మరీ ఆ దేశంలో జాబ్‌లో పెట్టేస్తాడు. ఇదెక్కడి సిల్లీ కాన్సెప్ట్ రా బాబూ!
ఇక మోహన్ బాబు గారు 'భారతీయుడు' కమల్ హాసన్ లా వర్మకళ ప్రయోగించి మహాబలశాలి నానిని గాల్లోకి లేపి తంతే, ప్రేక్షకులు భరించలేక దీర్ఘంగా నిట్టూర్చాల్సి వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే, ఇది 'ప్యారడైజ్' కాదు, పక్కా రక్తసిక్తమైన 'హెల్-బిర్యానీ'! తెరపై ముక్కలు నరుకుతుంటే మన మీద పడతాయేమో అని భయపడేంత నరమేధం. సత్యరాజ్ గారు సినిమాలో అన్నట్లు "ప్యారడైజ్ ఈజ్ గోయింగ్ టు బి హెల్" అనేది ఆడియన్స్ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. బిల్డప్ ఎక్కువ... విషయం తక్కువ!
రీసెంట్ టైంలో హీరో కానీ తన ఊరు కానీ జాతి కాని ఒక గుర్తింపు కోసం చేసే పోరాటం నేపధ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి…అవే కోవలోకి వచ్చే సినిమానే ప్యారడైజ్ కూడా. కానీ ఇక్కడ కొన్ని స్పెషాలిటీలు కూడా ఉన్నప్పటికీ కూడా టేకింగ్ పరంగా డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను సీన్స్ వైజ్ బాగానే ప్రజెంట్ చేశాడు కానీ ఎందుకో అది పూర్తిగా అంచనాలను అందుకునే రేంజ్ లో తీయలేకపోయాడు.
నాని మాస్ అవతార్ లో కుమ్మేస్తున్నా కూడా ఎందుకో ఆ రోల్ లో నాని సెట్ అవ్వలేదు అనిపించింది. అందరూ బాగానే చేసినా ఏవి కూడా పెద్దగా రిజిస్టర్ అయ్యే రేంజ్ పాత్రలు కావు…అనిరుద్ మరోసారి తన మార్క్ ను చూపించి వీక్ సీన్స్ ను కూడా లేపే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా మరీ హైప్ తో కానీ దసరాని మించే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఓవర్ గా అంచనాలతో వెళితే మాత్రం ఆ అంచనాలను సినిమా అందుకోలేదు. హైప్ ను చాలా తగ్గించుకుని వెళితే మాత్రం సినిమా లెంత్ అండ్ సీన్స్ డ్రాగ్ అయినా ఓవరాల్ గా ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers