Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ది ప్యారడైజ్ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తాయి. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల్ సక్సెస్ అయ్యాడు. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాతకాలపు రొటీన్ స్టోరీనే ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా స్టోరీలో ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం ఈ చిత్రానికి మైనస్ గా నిలించింది.
నాని క్యారెక్టర్ తప్ప మిగతా ఏ పాత్ర కూడా హలంగా నమోదు కాకపోవడం నిరాశపరుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు, రాఘవ్ జుయల్ లాంటి నటులను సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లేలో బలం లేకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఓవరాల్ గా 'ది ప్యారడైజ్' సినిమా మాస్ ఆడియన్స్‌కు, నాని అభిమానులకు ఓ ట్రీట్. మాస్ అభిమానులు మెచ్చే సినిమా.
విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా. పాన్ ఇండియా హిట్స్ సాధించిన యాక్షన్ ఫిలిమ్స్ చూస్తే... పవర్ ఫుల్ విలన్స్, తెరపై ఇప్పటి వరకు మనం చూడని కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. 'ది ప్యారడైజ్'లోనూ ఆ తరహా సెటప్ చక్కగా కుదిరింది. కానీ, అవుట్ పుట్ మాత్రం ఆశించినట్టు రాలేదు. నాని ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరినీ కాస్త డిజప్పాయింట్ చేసేలా ఉంది.
శ్రీకాంత్ ఓదెల కథలో కొత్తదనం లేదు. కానీ, కొత్త ప్రపంచం ఉంది. కామన్ కథలను కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. 'ది ప్యారడైజ్'లో కథను పక్కన పెడితే... శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా లేదు. తల్లిని హీరో ఎందుకు అసహించుకుంటున్నాడు? అనేదానికి ఓ రీజన్ ఉంది. కానీ, ఆ ఎమోషన్ ఆడియన్ ఫీలయ్యేలా తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత నాని - మోహన్ బాబు సీన్ చూశాక... నెక్స్ట్ లెవల్‌కు వెళుతుందని అనుకుంటే, హీరో వర్సెస్ విలన్ ఎపిసోడ్ కంప్లీట్ సైడ్ ట్రాక్ చేసేశారు.
ఓవరాల్ గా మాంచి మాస్ మసాలా బిర్యానీకి కావాల్సిన సరుకు 'ది ప్యారడైజ్' లో ఉంది. కానీ టేస్ట్ ఆశించినట్టు లేదు. కొత్త ప్రపంచం, పవర్ ఫుల్ విలన్, జాతి గుర్తింపు కోసం పోరాడే నాయకుడు, మదర్ సెంటిమెంట్, ఛార్ట్ బస్టర్ సాంగ్స్... అన్నీ ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రీతిలో కథనం సాగలేదు. పార్టులుగా యాక్షన్ బ్లాక్స్ ఓకే. నాని కూడా! అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే రక్తం ఏరులై పారే, తలలు తెగిపడే యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ 'ది ప్యారడైజ్' ను కాస్త ఓపిక చేసుకుని చూడవచ్చు. లేదంటే చాలా కష్టం. ఆ వయలెన్స్ ను ఫ్యామిలీతో చూడలేం.
Dasara (2023), the first film pairing Nani and Srikanth Odela, was a huge box-office success and also received critical acclaim. After its phenomenal success, both the hero and the director teamed up once again for, The Paradise. After finishing a quick round of promotions in various cities, the makers released the film in theatres today. Nani in the role of Jadal aka Sarakka did a good job and he gave his best to appear tough during the action episodes.
Positives :
1. Pre-Interval Sequence
2. Two Songs
Negatives :
1. Lack of Emotional Connection
2. Never-Ending Action Episodes
3. Poor Screenplay
4. Loud Background Score
5. Lengthy Runtime
6. Every Scene Feels Like a ‘Climax’
Overall, The Paradise is most likely to end up as a ‘missed opportunity’. And yes, yet another director in Tollywood failed to break the ‘failure of the second film’ syndrome.
Bottom Line – ‘Pretentious’ Paradise
తమ గుర్తింపు కోసం ప్యారడైజ్‌లోని సవారీలు చేసిన తిరుగుబాటు, సవారీల నాయకుడు జడల్ చేసిన పోరాటం ప్రధానంగా సాగే మూవీ. ఇదొక ఫిక్షన్ స్టోరీ. కానీ కొన్ని రియల్ ఎలిమెంట్లని మేళవించడం విశేషం. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కానీ దాన్ని అంతే అర్థవంతంగా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. అయితే కథ అక్కడితోనే మేజర్ గా పూర్తయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో మాలిక్‌తో జడల్ పోరాటం చూపించారు. అది యాక్షన్ కే పరిమితం చేశారు. ఆ తర్వాత కథ మరోలా టర్న్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ముగింపు కూడా చప్పగా ఉంది.
జడల్ పాత్రలో నాని ఇరగదీశాడు. ఆయన మూవీకోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమాలో నాని పాత్ర హైలైట్, అదే సమయంలో అదే మైనస్ కూడా. ఎందుకంటే కథ చాలా బలమైన యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. దానికి నాని సరిపోలేకపోతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. తన స్థాయికి మించిన కథగా అనిపిస్తుంది. కథ పరంగా దర్శకుడు ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఇంకా బాగా తీయాల్సింది. క్లారిటీగా తీయాల్సింది. డైవర్షన్ లేకుండా చేయాల్సింది. కానీ రాజకీయాలను ఇన్‌వాల్వ్ చేసి కథ లక్ష్యమే మారిపోయింది. యాక్షన్ మీద పెట్టిన దృష్టి ఎమోషన్స్ మీద పెడితే సినిమా బాగుండేది. నానినికాదు, కేసీఆర్‌ని హీరోని చేసిన చిత్రమిది.
అతిగా చేసిన పనులు బెడిసికొట్టడమే కాదు... వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ ను కూడా కలగ చేశాయి. తాజాగా విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా జనం ముందుకొచ్చిన ప్యారడైజ్ బిలో యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా గుర్తింపు నోచుకోలేని వాళ్ళ కథలు ఈ మధ్య కాలంలో మనం చాలానే చూశాం. నిజానికి 'పెద్ది' సినిమా బేసిక్ పాయింట్ కూడా అదే. అయితే అదే అంశాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో కోణంలో చెప్పాడు.
అస్తిత్వ పోరాట గాథలలో ఎమోషన్ ప్రధానం. అది ఏ మాత్రం అటూ ఇటూ అయినా... హాస్యాస్పదంగా మారిపోతుంది. ఈ కథ చెప్పడానికి ఇంత దారుణ మారణకాండ అవసరమా? అనిపిస్తుంది. సినిమా రంగంలో మరో మెట్టు పైకి వెళ్ళాలనే ఎవరైనా అనుకుంటారు. కానీ మాస్ హీరో ఇమేజ్ కోసం పడే తాపత్రయంలో నాని ఎంచుకునే కథలే అందరినీ ఒప్పించలేకపోతున్నాయి. ఈ సినిమాలో జడల్ పాత్రకు అతను సంపూర్ణ న్యాయం చేశాడు. కానీ ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నిజానికి ఈ సినిమాకు 'ది ప్యారడైజ్' అని కాకుండా 'సమ్మక్క' అని పెట్టి ఉంటే సబబుగా ఉండేది. ఇంత హైప్ క్రియేట్ కాకపోను! ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జనాలు... ఏదో భిన్నమైన సినిమా చూశాం అని కొంతలో కొంత తృప్తి పడి ఉండేవారేమో! ఒకటి మాత్రం నిజం... ఈ సినిమాలోని పొలిటికల్ అంశాల కారణం, సెన్సార్ నిర్లిప్తత కారణంగా రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్‌గా చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ తాను చెప్పాలనుకొన్న కథను పర్‌ఫెక్ట్ ఫ్లోలో చెప్పలేకపోయాడనే విషయం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. అలా కథ నడిచిన కొద్ది ట్రాక్ మిస్ అవుతున్నాడనే విషయంపై ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. సుబ్బలక్ష్మీగా కాయదు లోహర్ ఎంట్రీతో సినిమా చిన్న కుదుకులోనవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్న మంచి ఎమోషన్స్ డైల్యూట్ చేసేలా చేస్తుంది.
ఇక ప్యారడైజ్ సినిమా ఫస్టాఫ్‌లోనే కథ ముగిసినంత పని చేశాడనే ఫీలింగ్ శ్రీకాంత్ ఓదెల కల్పించాడు. కానీ సెకండ్ హాఫ్ లో కథలో బలంగా చెప్పడానికి కంటెంట్ లేకపోవడంతో కాసేపు టైంపాస్ చేశాడా? అనే విధంగా కొన్ని సీన్లను సాదాసీదాగా నడిపించాడు. ఓవరాల్ గా మళ్లీ అదే నరుకుడు, హింస, రక్తపాతాన్ని కొనసాగించి.. కథను ఎమోషన్స్ తో చెప్పే ఛాన్స్ ను మిస్ చేసుకొన్నాడు. ఓవరాల్ గా నాని పెర్ఫార్మెన్స్, కాయదు గ్లామర్, మోహన్ బాబు యాక్టింగ్ సంతృప్తిని కలిగిస్తాయి. ఎక్కువ అంచనాలతో కాకుండా వెళితే.. ఫీల్‌గుడ్ మూవీని చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
దసరా సినిమాతో సంచలనం రేపిన నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన 'ది ప్యారడైజ్' ఆరంభం నుంచే మాంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తమకంటూ ఏ గుర్తింపు లేని ఒక జాతి.. ఆ గుర్తింపు కోసం చేసే పోరాటం.. ఆ క్రమంలో ఎదిగే ఒక నాయకుడు.. ఇలా ఫెమిలియర్ లైన్లోనే నడిచే ‘ది ప్యారడైజ్’ కథను డిఫరెంట్ స్టైల్లో చెప్పాలని చూశాడు శ్రీకాంత్. ఇందుకోసం అతను ఎంచుకున్న స్టైల్.. వయొలెన్స్. కానీ ఆ వయొలెన్స్ మరీ శ్రుతిమించిపోవడం.. కథలోని ఎమోషన్ అనుకున్నంతగా పండకపోవడం.. హీరో-విలన్ రెండు పాత్రలూ అనుకున్నంతగా క్లిక్ కాకపోవడంతో ‘ది ప్యారడైజ్’ అంచనాలను అందుకోలేకపోయింది. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ఈ సినిమా నిరాశపరుస్తుంది.
సన్నివేశాల టేకింగ్ అదిరిపోయినప్పటికీ వయొలెన్స్ వెనుక ఎమోషన్ మిస్ అవ్వడంతో సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. తన కథను కొంచెం పచ్చిగా చూపించాలనే దర్శకుడి ప్రయత్నాన్ని తప్పుబట్టలేం కానీ.. ఆ క్రమంలో మరీ హద్దులు దాటిపోవడంతో కొన్ని సన్నివేశాలను తట్టుకోవడం కష్టమవుతుంది. ఓవరాల్ గా ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత.. ఎంతైనా కష్టపడే హీరో.. ఇంకా కోరుకున్న అన్ని వనరులు సమకూరినా.. రైటర్ - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఉపయోగించుకోలేక పోయాడు. ఎన్నోసార్లు చూసిన కథకే మేకప్ వెయ్యాలని.. టేకింగ్ తో మ్యాజిక్ చెయ్యాలని చూశాడు కానీ ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా ఓవరాల్ గా శ్రీకాంత్ తనపై నెలకొన్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. చివరగా ప్యారడైజ్.. మాస్ ఓవర్ డోస్
నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా గురించి చెప్పుకుంటే... కథ కొత్తదేమీ కాదు. ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు.. వాడి కింద నలిగే ఓ సమూహం.. అందులోంచి పుట్టుకొచ్చే నాయకుడు.. చివరకు ఆ నాయకుడు ఆ సమూహానికి స్వాతంత్ర్యం ఇప్పించడం.. ఓవరాల్‌గా చెప్పుకుంటే ప్యారడైజ్ కథ ఇదే. సినిమాలో మెయిన్ గా విలనిజం, హీరోయిజంకి సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని, తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అదే ఈ సినిమాకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం. ఇక ఇందులో శ్రీకాంత్ తన మెగా అభిమానాన్ని చాలా సీన్లలో చూపించాడు.
అయితే తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే అయినా.. హీరో మాట్లాడే తీరు మాత్రం తెలంగాణ యాసలా అనిపించదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది. ఇక శేఖరన్న పాత్రలో ప్రియదర్శి పాత్ర ఎంట్రీ, సవారీలను టెర్రరిస్టులుగా ముద్ర వేయడం ఇవన్నీ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వవు. అయితే ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, అనిరుధ్ ఇచ్చే బీజీఎం హైలెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సెకండాఫ్ ఇవ్వలేకపోయినా.. ఓవరాల్ గా ప్యారడైజ్ సినిమా ఆడియెన్స్‌కి ఓ హై ఇస్తుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కి, నాని ఫ్యాన్స్‌కి అయితే ఓ ట్రీట్‌లా ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్లలో పాటలకు, ఫైట్లకు ఆడియెన్స్‌కి ఊగిపోతారు. మరి కమర్షియల్‌గా ‘ప్యారడైజ్’ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఎప్పటిలాగే, నాని అద్భుతంగా నటించాడు. మోహన్ బాబు మాలిక్ పాత్రలో జీవించాడు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ది ప్యారడైజ్’ రొటీన్ గా సాగుతూ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
హీరో – విలన్ ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. పలు సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో శ్రీకాంత్ కొన్ని చోట్ల విఫలం అయ్యారు. ఓవరాల్ గా ‘ది ప్యారడైజ్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో.. నాని నటన, వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ హెవీ ఎమోషన్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ను మరియు నాని అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లలో బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ హారర్ కథలో వేయి ఏళ్ల నటి వింత మృగం, ఆ మృగానికి సంబంధించిన ఫాంటసీ ఎలిమెంట్స్.. వీటి మధ్యలో ఓ సగటు కుర్రాడైన మహి పాత్ర, అతని ఆశ, అమాయకత్వం.. నిజం తెలిశాక ప్రాణాలు కాపాడుకోవడానికి అతను ప్రయత్నించే దారులు.. మొత్తానికి ఈ ఇమ్మోర్టల్ చిత్రంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది.
అయితే కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు. కానీ, కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, దర్శకుడు మారియప్పన్ తీసిన ఈ ‘ఇమ్మోర్టల్’ సినిమాలో అది మిస్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర క్రియేట్ చేసిన మాయ ప్రపంచం.. పూర్తిగా ఇల్లాజికల్ గా సాగుతుంది. ఓవరాల్ గా ‘ఇమ్మోర్టల్’ అంటూ వచ్చిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే, విజువల్స్ మరియు నటీనటుల నటన కూడా బాగుంది. ఐతే, కథనం స్లోగా రెగ్యులర్ గా సాగడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో వచ్చిన ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన వర్ధన్ గుర్రాల ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. హీరోయిన్ గా నటించిన కృష్ణ ప్రియా నటన సినిమాకి ప్లస్ అయింది.
అయితే ఈ ‘కాగితం పడవలు’ కథలో హీరో హీరోయిన్ల చైల్డ్ ట్రాక్ మైనస్ అయింది. స్టార్టింగ్ సీక్వెన్స్ ల్లో నటించిన నటీనటుల నటన కూడా సిల్లీగా అనిపిస్తోంది.అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు. మొత్తంగా ‘కాగితం పడవలు’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ ఓకే అనిపించినా.. కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ అండ్ సిల్లీ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, ఏ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.
ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భుతంగా మలిచారాలని చెప్పొచ్చు. పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఇక మొత్తానికి, మీర్జాపూర్: ది మూవీ అనేది ఓ ఇంటెన్స్ బోల్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే మీర్జాపూర్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పైకి మేకర్స్ సాలిడ్ గా వర్కవుట్ చేశారు. ప్రధాన నటీనటుల బలమైన నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్, హ్యూమర్, ఇంటెన్స్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ లు అలాగే థియేట్రికల్ మూమెంట్స్‌తో నిండిన మాస్ సెకండ్ హాఫ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ లో కొంచెం స్లో కథనం, కొన్ని పాత్రలని వీక్ గా వదిలేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే మీర్జాపూర్ సినిమా సాలిడ్ ట్రీట్ అందిస్తుంది, వాచ్ ఇట్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers