Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ఇది ఒక అవుట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. స్టోరీ చాలా సింపుల్… శ్రీ విష్ణు మార్క్ వన్ లైనర్స్ మీదే సినిమా నడుస్తుంది. కానీ ఈసారి ఆ కామెడీ క్లిక్ కాలేదు. అదే డబ్బింగ్ స్టైల్, అదే టైమింగ్ రిపీట్ అవుతూ బోర్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా మీమ్ రిఫరెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మీమ్ మ్యూజిక్ చాలా చోట్ల ఇరిటేట్ చేస్తాయి. నవ్వించే ప్రయత్నం ఎక్కువగా ఫోర్స్డ్‌గా అనిపిస్తుంది. పాటలు కూడా అసలు వర్కవుట్ కాలేదు… సినిమాకి ఫ్లోనే బ్రేక్ చేస్తాయి. ఇలాంటి సినిమాలకు పెద్ద స్టోరీ అవసరం లేదు… కానీ ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, కన్సిస్టెంట్ కామెడీ మాత్రం అవసరం. ఇక్కడ అవే మిస్సయ్యాయి. కొన్ని సీన్స్ మాత్రమే నవ్విస్తాయి, మిగతా టైమ్ డ్రాగ్ ఫీలింగ్ వస్తుంది. శ్రీ విష్ణు తన వంతు ట్రై చేసినా… సినిమా మొత్తాన్ని సేవ్ చేయలేకపోయాడు. Overall: లైట్‌గా వెళ్తే కూడా అంతగా వర్కవుట్ కాదు.
Vishnu Vinyasam movie Review
#VishnuVinyasam – పనిచేయని పాత స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్! ఈ సినిమా చాలా బేసిక్ స్టోరీతో, టిపికల్ శ్రీ విష్ణు వన్‌లైనర్స్‌తో సాగుతుంది. కానీ ఈసారి ఆయనకు సెట్ అయిన డబ్బింగ్ స్టైల్ కామెడీ రిపిటేటివ్‌గా అనిపిస్తూ పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా చోట్ల హాస్యం ఫోర్స్డ్‌గా, ఓవర్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా వాడిన మీమ్ రిఫరెన్స్‌లు, మీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాటలు కూడా బలహీనంగా ఉండి, సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. ఇలాంటి సినిమాలకు స్ట్రాంగ్ స్టోరీ అవసరం లేకపోయినా, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడం, కామెడీ చాలా చోట్ల మాత్రమే వర్కవుట్ కావడం వల్ల సినిమా పూర్తిగా ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. శ్రీ విష్ణు తన వంతు ప్రయత్నం చేసినా, మొత్తంగా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ⭐ రేటింగ్: 2/5 🎬
విష్ణు విన్యాసం స్టోరీ లైన్ సింపుల్ — జాతకాలపై నమ్మకం ఉన్న లెక్చరర్ హీరో, హీరోయిన్‌ను ప్రేమిస్తాడు.. కానీ ఆమె జాతకం వల్లే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, స్క్రీన్‌పై ఎగ్జిక్యూషన్ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయదు. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అవుతూ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా స్లో అయి, డ్రాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా, దానికి సరైన ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేకపోవడంతో గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది. శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల తన వన్ లైనర్స్‌తో నవ్విస్తాడు. హీరోయిన్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ కథ చుట్టూ తిరిగే ప్రధాన అంశాన్ని బలంగా ప్రెజెంట్ చేయలేకపోవడం మైనస్. టెక్నికల్‌గా చూస్తే సాంగ్స్ ఓకే, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లాజిక్‌లు మిస్సవడం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే.. అప్ & డౌన్స్ ఉన్న ఈ సినిమా, లాజిక్స్ పక్కన పెట్టి టైంపాస్ కోసం ఒకసారి చూసేయొచ్చు.
విష్ణు విన్యాసంలో కామెడీకి మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు యదునాథ్ మారుతీ రావు, దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నవ్వులు పండుతాయి. రధన్ మ్యూజిక్ పెద్దగా గుర్తుండదు, సినిమాకు మైనస్‌గా మారింది. అయితే సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ను, ముఖ్యంగా యాక్సిడెంట్ ఎపిసోడ్‌ను ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్ ఓకే, నిర్మాణ విలువలు పర్వాలేదు. పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది పూర్తిగా శ్రీ విష్ణు షో. తన స్టైల్ మ్యానరిజమ్స్, వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ ట్యాగ్‌కు తగ్గట్టుగా నవ్వులు పంచాడు. నయన్ సారిక అందంగా కనిపిస్తూ, ఎమోషనల్ సీన్స్‌లో బాగానే చేసింది. కానీ సత్య పాత్ర మాత్రం ఆశించినంతగా వర్కవుట్ కాలేదు. మిగతా నటీనటులు తమ పాత్రలకు సరిపడా చేశారు కానీ వారికి పెద్దగా స్కోప్ దక్కలేదు. మొత్తంగా చూస్తే.. స్ట్రాంగ్ స్టోరీ, ఫుల్ లెంగ్త్ కామెడీ మిస్ అయిన ఈ సినిమా, శ్రీ విష్ణు కామెడీ కోసం అంచనాలు లేకుండా వెళితే ఒకసారి చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది
వాస్తు, జాతకాల నేపథ్యంలో వచ్చిన విష్ణు విన్యాసంలో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, బలమైన కథ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. హీరో బలహీనతను ఉపయోగించుకునే పాత్రలు, హీరోయిన్ జాతకం చుట్టూ నడిచే డ్రామా ఉన్నప్పటికీ సన్నివేశాల్లో బలం కనిపించదు. ఇది పూర్తిగా శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. నయన్ సారిక ఓకే అనిపించగా, సత్య తదితరులు ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ రధన్ మ్యూజిక్ గుర్తుండదు. రెండో భాగం రిపీట్ ఫీల్‌తో నెమ్మదిగా అనిపిస్తుంది. మొత్తంగా కథ కంటే కామెడీ కోసం చూసే వారికి, శ్రీ విష్ణు అభిమానులకు ఈ సినిమా ఓకే అనిపించవచ్చు
శ్రీ విష్ణు అంటే మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్న మాట మళ్లీ విష్ణు విన్యాసంతో ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడు. వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో, ఫిబ్రవరి 27న వచ్చిన ఈ సినిమాతో మరోసారి కామెడీతో థియేటర్లలో నవ్వులు పంచాడు. కథ విషయానికి వస్తే.. జూనియర్ లెక్చరర్ విష్ణు (శ్రీ విష్ణు)కి చదువు కంటే జాతకాలు, వాస్తు, న్యూమరాలజీ అంటేనే ఎక్కువ నమ్మకం. అదే కాలేజీలో పనిచేసే మనీషా (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆమె జాతకంలో ఉన్న దోషం బయటపడుతుంది. ఆ దోషం వల్ల వచ్చే సమస్యలు, విష్ణు తీసుకున్న నిర్ణయాలే సినిమా మెయిన్ ప్లాట్. పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే.. సినిమా మొత్తం శ్రీ విష్ణు వన్ మ్యాన్ షోగానే అనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్, అమాయకమైన బాడీ లాంగ్వేజ్‌తో చాలా సీన్స్‌ను లిఫ్ట్ చేశాడు. నయన్ సారిక కూడా కథలో కీలక పాత్రగా బాగానే మెప్పించింది. సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్‌లో వచ్చే కామెడీ ట్రాక్స్ సినిమాకు ప్లస్. ముఖ్యంగా సత్య - శ్రీ విష్ణు సీన్స్ నవ్విస్తాయి. టెక్నికల్‌గా దర్శకుడు యదునాథ్ మారుతీరావు లాజిక్కుల కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. సినిమా రన్‌టైమ్ 2 గంటల లోపే ఉండటం పెద్ద ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను కలర్‌ఫుల్‌గా చూపించింది. రధన్ మ్యూజిక్ ఓకే అనిపించినా, పాటలు మాత్రం అంతగా గుర్తుండవు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉండటంతో సినిమా ఫాస్ట్‌గా సాగుతుంది.
శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీ ఎలా ఉన్నా, తన కామెడీ టైమింగ్‌తో మూవీని లాగేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా రన్నింగ్ కామెంట్రీ స్టైల్‌లో కొన్ని చోట్ల నవ్వులు తెప్పించాడు. కానీ సినిమా మొత్తం భారం ఒక్క హీరో మీద పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ నయన్ సారిక స్క్రీన్‌పై బాగానే కనిపించినా, ఆమె పాత్రకు సరైన డెప్త్ ఇవ్వలేదు. పాత్రలో ఉన్న కాన్సెప్ట్‌ని కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సత్య తన స్థాయికి తగ్గట్టు ఫుల్‌గా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. బ్రహ్మాజీ, ప్రవీణ్, గోపరాజు రమణ, మురళీ శర్మ లాంటి నటులు ఉన్నా, వారిని సరిగ్గా వాడుకోలేదు. శ్రీనివాసరెడ్డి కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాడు. టెక్నికల్‌గా రధన్ మ్యూజిక్ నిరాశపరుస్తుంది. ఒక్క పాట కూడా గుర్తుండేలా లేదు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఓకే. ప్రొడక్షన్ విల్యూస్ కూడా సరిపడా ఉన్నాయి. దర్శకుడు మంచి కామెడీ కాన్సెప్ట్ ఎంచుకున్నా, దాన్ని కథగా మలచడంలో తడబడ్డాడు. కొన్ని వన్ లైనర్స్ పనిచేసినా, మొత్తం సినిమా లాజిక్ లేకుండా లైట్‌గా వెళ్లిపోతుంది. సన్నివేశాలు, పాత్రలు కన్విన్స్ చేసేలా లేకపోవడం వల్ల సినిమా ప్రభావం తగ్గింది. చివరికి చెప్పాలంటే.. హీరో ఒక్కరే లాగిన సినిమా ఇది. కంటెంట్ బలహీనంగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయింది.
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో శ్రీ విష్ణు పూర్తిగా వన్ మ్యాన్ షో ఇచ్చాడు. ప్రతి సీన్‌లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూ, ముఖ్యంగా తన రన్నింగ్ కామెంట్రీతో మంచి నవ్వులు పంచాడు. న్యూ జనరేషన్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ తన స్టైల్ హ్యూమర్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నయన్ సారిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా, ఆమె పాత్రను డైరెక్టర్ సరిగా డిజైన్ చేయలేదు. కాన్సెప్ట్ ఉన్నా, దాన్ని కన్విన్సింగ్‌గా చూపించలేకపోవడం మైనస్. సత్య కొన్ని చోట్ల నవ్వించినా, అతనివద్ద నుంచి ఇంకాస్త ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బ్రహ్మాజీ, ప్రవీణ్ ప్రభావం చూపలేకపోయారు. శ్రీనివాస రెడ్డి ఓకే, గోపరాజు రమణ, మురళీ శర్మల్ని సరిగా ఉపయోగించలేదు. శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు అనిపిస్తాడు. టెక్నికల్‌గా చూస్తే రధన్ మ్యూజిక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. పాటలు గుర్తుండిపోయేలా లేవు, బీజీఎం కూడా కొన్ని చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ విల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి. డైరెక్టర్ యధునాథ్ మారుతీరావు మంచి కామెడీ కాన్సెప్ట్ ఎంచుకున్నా, దాన్ని స్క్రీన్‌పై పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కొన్ని వన్ లైనర్స్, కామెడీ సీన్స్ పనిచేసినా, లాజిక్ లేని సన్నివేశాలు సినిమాను వీక్ చేశాయి. మొత్తంగా చూస్తే, శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ హైలైట్ అయినా, కంటెంట్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
విష్ణు విన్యాసం మొదటి భాగం మాత్రం ఎలాంటి పెద్ద లోపాలు లేకుండా సాఫీగా సాగుతుంది. కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యి, ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆసక్తిని పెంచుతుంది. కానీ రెండో భాగం మొదలైన కొద్దిసేపటికే సినిమా రిపీట్ మోడ్‌లోకి వెళ్లిన ఫీలింగ్ ఇస్తుంది. డ్రామా ఉన్నప్పటికీ, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం మైనస్. చివరి 30 నిమిషాలు ఉత్కంఠగా తీసే ప్రయత్నం చేసినా, అది పూర్తిగా కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ముందే ఊహించదగినదిగా, త్వరగా ముగిసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని పాత్రలు, సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం కూడా కనిపిస్తుంది. పాటలు అయితే సినిమాకు పెద్ద మైనస్. రధన్ మ్యూజిక్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు. అయితే శ్రీ విష్ణు, సత్యల కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల నవ్విస్తుంది. మొత్తం మీద మంచి కాన్సెప్ట్ ఉన్నా, సెకండాఫ్, మ్యూజిక్ బలహీనంగా ఉండటంతో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒకసారి చూడదగ్గ యావరేజ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
Movie is good. It is Supspense thriller.
జాతకాలపై విపరీతమైన నమ్మకం ఉన్న కాలేజ్ లెక్చరర్ విష్ణు (శ్రీ విష్ణు) జీవితంలోకి అదే కాలేజ్‌లో పనిచేయడానికి వచ్చే మనీషా (నయన్ సారిక) ప్రవేశిస్తుంది. ఆమె వచ్చాక విష్ణు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మనీషా జాతకంలో ఉన్న గండం బయటపడుతుంది. ఆ గండం ఏమిటి? దాని వల్ల వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని విష్ణు ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే విష్ణు విన్యాసం సినిమా కథ. టెక్నికల్‌గా చూస్తే సినిమా విజువల్‌గా బాగానే కనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సన్నివేశాలను కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించింది. రధన్ అందించిన పాటలు కథకు సరిపోయేలా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు మంచి ఫీల్ తీసుకొచ్చింది. సినిమా నిడివి రెండు గంటలే కావడంతో పెద్దగా బోర్ అనిపించదు. నిర్మాత సుమంత్ నాయుడు ఈ సినిమాతో మంచి ఫలితం ఆశించినా, బాక్సాఫీస్ కంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశముందని చెప్పాలి.
జాతకాలు, మూఢనమ్మకాల నేపథ్యంతో వచ్చిన విష్ణు విన్యాసం కథలో వినోదానికి మంచి స్కోప్ ఉన్నా, బలమైన కామెడీ సీన్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ సరిగా పండకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హీరో శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దర్శకుడు మారుతీరావు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా, కథనంలో బలహీనతలు కనిపిస్తాయి. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, రధన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. మొత్తం మీద విష్ణు విన్యాసం ఓ సాధారణ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers