Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
శర్వానంద్ నటించిన థియేటర్లో రిలీజ్ అయి రన్ అవుతుంది. టాక్ విషయానికి వస్తే... ‘బైకర్’ సినిమా యావరేజ్ డీసెంట్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సింపుల్ గా కథ గురించి చెప్పాలంటే రేసింగ్ అనే ఉపరితలానికి లోపల, తండ్రి-కొడుకుల బంధాన్ని అన్వేషించే ఒక ఎమోషనల్ జర్నీ. రోల్స్ పరంగా శర్వానంద్, రాజశేఖర్ రోల్స్ బాగున్నా, ఎమోషన్స్ అంతగా పండలేదు. శర్వానంద్ తన పాత్రను అండర్‌ప్లేడ్‌గా, సహజంగా పోషించాడు. అలాగే రాజశేఖర్ రోల్ కూడాడీసెంట్ గా ఉంది. అతని పాత్రకు స్కోప్ ఎక్కువ ఉన్నా, డైరెక్టర్ సరైన ఎమోషనల్ సీన్లు రాసుకోలేదని అనిపిస్తుంది.
టెక్నికల్ గా చూసుకుంటే... జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మంచి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. కాకపోతే స్టోరీ పరంగా చాలా రొటీన్ గా ఉంది. దాంతో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. క్లైమాక్స్ పై డైరెక్టర్ మరింత ఫోకస్ పెట్టి ఉంటె బాగుండేది. ఓవరాల్ గా సినిమా బీలో యావరేజ్ గా అనిపించింది. అంతగా నచ్చలేదు.
‘బైకర్’ అంటే ఫుల్ రేసింగ్ మూవీ అనుకుంటే కాస్త మోసపోతారు.
ఇది అసలు రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఎమోషనల్ డ్రామా! చాలా డీసెంట్ గా నీట్ గా తీశారు. ముందు హీరో గురించి మాట్లాడితే…
శర్వానంద్ ఓకే… తన పని పర్ఫెక్ట్ గా చేసేశాడు. కానీ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ హీరోతో ఈక్వెల్ గా రాజశేఖర్ కి ఉంటుంది. కానీ పెర్ఫార్మన్స్ కి స్కోప్ కాస్త తక్కువైంది. సునీల్ నారాయణ’గా అయన రోల్ సినిమాలో చాలా మంచి వెయిట్ ఉంది.
అలాగే శర్వానంద్ తన వికాస్ రోల్ కోసం బాగా కష్టపడ్డాడని తెలుస్తూనే ఉంది. ఇటు మాళవిక నాయర్ కూడా కేవలం గ్లామర్ కాదు… యాక్టింగ్ కూడా చూపించింది. అతుల్ కులకర్ణి విలన్ గా సైలెంట్‌గా వచ్చి పని అయిపోయినట్టు వెళ్లిపోతాడు. ఇటు టెక్నికల్ గా జిబ్రాన్ బీజీఎమ్ అదిరిపోయింది. రేసింగ్ సీన్స్ లో హైప్, ఎమోషన్స్ లో ఫీల్ ని బాగా క్యారీ చేశాడు. ఇటు విజువల్ గా కూడా బైకర్ అదిరిపోయింది. కాకపోతే స్టోరీ రొటీన్ గా ఒకే ఫార్మాట్ లో ఉండి జెర్సీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఓవరాల్ గా టేకింగ్ వైస్ అల్టిమేట్ గా బైకర్ ఉంటుంది.
ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ‘బైకర్’. ముందుగా స్ట్రైట్ పాయింట్‌కి వస్తే… ఈ సినిమా రేసింగ్ గురించే అనిపించినా, లోపల మాత్రం ప్యూర్ ఎమోషనల్ డ్రామా. తండ్రి-కొడుకుల బాండింగ్ ను దర్శకుడు చాలా సింపుల్‌గా, కానీ ఎఫెక్టివ్‌గా చూపించాడు.
ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… రాజశేఖర్ గారు ‘సునీల్ నారాయణ’ పాత్రలో చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపించారు. నిజానికి ఈ కథ లో ఆయన కూడా హీరోనే అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీన్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.
శర్వానంద్ కూడా తన పాత్రలో సెటిల్ గా నటించాడు. పైగా శర్వానంద్ లుక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రేసర్ గా బాగా సెట్టయ్యాడు.
టెక్నికల్‌గా జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద ప్లస్. రేసింగ్ సీన్స్‌లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం, స్టోరీ కొత్తగా లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. కానీ సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ వల్ల సినిమా మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిమ్.
అంటే ఫస్ట్ క్లియర్ గా సినిమా గురించి చెప్పాలంటే… ‘బైకర్’ అనేది ప్యూర్ రేసింగ్ సినిమా కాదు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్ లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక్కడ అసలు హీరో ఎవరు అంటే… శర్వానంద్ కాదు, రాజశేఖర్. సునీల్ నారాయణ గా ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమాకి వేరే వెయిట్ వచ్చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ సినిమాకి బిగ్గెస్ట్ బూస్టప్ నిస్తాయి. ఇక శర్వానంద్ తన రోల్ వరకు చాలా బాగా చేసాడు, కానీ వెయిట్ అంత ఎక్కువగా కనిపించలేదు. పైగా తన రోల్ కోసం ఫిజికల్ గా చాలా కష్టపడ్డట్టు ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది.
ఇటు మాళవిక నాయర్ కూడా జస్ట్ గ్లామర్ కోసం కాదు… సెకండాఫ్ లో మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. విలన్‌గా అతుల్ కులకర్ణి సైలెంట్ గా తన పని చేసేశాడు. ఇక జిబ్రాన్ అదిరిపోయే బీజీఎమ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఇటు విజువల్స్ కూడా నీట్ గా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అయింది. స్టోరీ కూడా కొత్తది కాదు, అయినా…
సెకండాఫ్ + క్లైమాక్స్ వల్ల సినిమా నిలబడింది. ఓవరాల్ గా బైకర్ ఒక డీసెంట్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం అని చెప్పొచ్చు. మరీ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో లేదో తెలీదు గాని, డిస్సపాయింట్ అయితే చేయలేదు.
యూత్ సినిమా గురించి స్ట్రైట్ గా చెప్పాలంటే… ఇది ఒక పక్కా యూత్ టార్గెట్ మూవీ. స్కూల్, కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్స్, లవ్, కామెడీ… ఇవన్నీ మిక్స్ చేసి ఒక లైట్ ఎంటర్‌టైనర్‌గా తీసుకొచ్చారు. కెన్ కరుణాస్ ఇక్కడ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా పని చేశాడు. తన పాత్రలో నేచురల్ గా కనిపించాడు. కానీ స్టోరీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేంత స్ట్రాంగ్ నేరేషన్ మాత్రం కనిపించదు. హీరోయిన్స్ మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్… ఉన్నంతలో బాగానే చేశారు.
దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ యాక్టర్స్ వచ్చేసరికి సినిమా కొంచెం స్టేబుల్ అవుతుంది. వాళ్ల అనుభవం సీన్స్‌లో కనిపిస్తుంది. ఇక కొన్ని చోట్ల కామెడీ కూడా బాగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే మరింత ఎంజాయ్ చేసే టైప్. కానీ అన్ని చోట్ల కాదు… కొన్నిసార్లు రిపీట్ ఫీల్ కూడా వస్తుంది. మ్యూజిక్ విషయంలో జీవీ ప్రకాష్ ఓకే జాబ్ చేశాడు. సాంగ్స్, బీజీఎం సినిమా మూడ్‌కి సరిపోతాయి. కానీ మైనస్ ఏంటంటే, కథ చాలా రొటీన్ అయిపొయింది. ముందే ఊహించగలిగే సన్నివేశాలు ఎక్కువ. కొత్తగా అనిపించే ఎలిమెంట్ లేదు. ఇది ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ కాదు… కానీ లైట్‌గా టైమ్ పాస్ చేయడానికి ఓకే.
ఈ సినిమా పేరు యూత్… కాబట్టి ముందే అర్థం చేసుకోవాలి – ఇది పూర్తిగా యూత్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా. ఎక్కువగా లైట్ మూడ్‌లో, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి డిజైన్ చేసినట్టుంది. కెన్ కరుణాస్ హీరోగా కూడా, డైరెక్టర్‌గా కూడా ఓకే జాబ్ చేశాడు. తన పాత్రలో నేచురల్ గా కనిపిస్తాడు. సినిమా మొత్తాన్ని క్యారీ చేయడానికి ప్రయత్నం చేశాడు. హీరోయిన్స్ విషయానికి వస్తే… మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు స్క్రీన్ పై క్యూట్ గా కనిపిస్తారు.
అలాగే దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ యాక్టర్స్ వచ్చేసరికి… స్క్రీన్ పై కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. వాళ్ల ఎక్స్‌పీరియన్స్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక సినిమా మొత్తం కామెడీ మీదే ఆధారపడి ఉంది… చాలా చోట్ల వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఇంకాస్త ఎంజాయ్ చేసే టైప్. మ్యూజిక్ విషయంలో జీవీ ప్రకాష్ ఓకే సపోర్ట్ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ కు సూట్ అవుతుంది. కథలో కొత్తదనం లేదు. చాలా సీన్స్ ముందే ఊహించగలిగేలా ఉంటాయి. రొటీన్ ఫీలింగ్ నుంచి బయటకు రావడం లేదు.
అసలు బ్యాండ్‌మేళం అంటే థియేటర్‌లో ఫుల్ నవ్వులు, ఎంజాయ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం… కానీ ఇక్కడ జరిగిందేంటి అంటే… నవ్వుల కంటే గోలే ఎక్కువగా వినిపిస్తుంది! హర్ష రోషన్, శ్రీదేవి జంట చూసేందుకు ఓకే… కానీ పూర్తి స్థాయిలో లవ్ ట్రాక్ కనెక్ట్ అవుతుందా అంటే… అంతగా కాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్ కొంచెం పని చేస్తుంది. పైగా లవ్ అంతగా లేదు కాబట్టి, సినిమా మొత్తం కామెడీ మీదే నడవాలి… కానీ అదే మిస్ అయింది. చాలా సీన్స్ forced గా అనిపిస్తాయి. నవ్వాలి అనుకుంటే… cringe ఫీల్ వస్తుంది.
సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే అర్థమయ్యేలా సాగుతుంది. మధ్యలో కొన్ని హై మోమెంట్స్ ఉన్నా… అవి నిలబెట్టేంత బలంగా లేవు. టెక్నికల్‌గా చూసుకుంటే… సౌండ్ కొంచెం లౌడ్‌గా ఉంటుంది. చివర్లో వచ్చే ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా హైప్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్ చేయాలనుకున్న సినిమా… పూర్తిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.
కొన్ని సీన్స్ ఓకే… కానీ మొత్తం మీద యావరేజ్ ఫీలింగ్ వస్తుంది.
బ్యాండ్ మేళం సినిమాకు సంబంధించి… బ్యాండ్‌మేళం అనే టైటిల్ చూస్తే ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే ఆ అంచనాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే ఫీలింగ్ వస్తుంది. రొటీన్ లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా లైన్ తీసుకుని, దాన్ని కొత్తగా చెప్పాలనుకున్న ప్రయత్నం ఉన్నా… దర్శకుడు మంచి సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేకపోయాడు. సినిమా ప్రధానంగా కామెడీ మీదే ఆధారపడి ఉంది. కానీ అదే విభాగం పూర్తిగా కనెక్ట్ కాలేదు. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తాయి. నవ్వులు పండాల్సిన చోట, ఫోర్స్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది.
సెకండాఫ్‌లో డ్రామా డోస్ పెరగడంతో సినిమా వేగం తగ్గుతుంది. కథ కూడా ముందే ఊహించదగ్గ విధంగా సాగడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని హై సన్నివేశాలు ఉన్నా… అవి నిలబెట్టేంతగా ప్రభావం చూపవు. టెక్నికల్‌గా సౌండ్ డిజైన్ కొంత లౌడ్‌గా అనిపిస్తుంది. చివర్లో ట్రెండింగ్ పాటను వాడిన తీరు కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. ఓవరాల్ గా మూవీ ఆడియన్స్ కి యావరేజ్ గా కూడా అనిపించకపోవచ్చు.
బ్యాండ్ మేళం సినిమాకు సంబంధించి… ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు “ఫుల్ ఫన్ ఉండబోతుంది” అనిపిస్తుంది… కానీ సినిమా చూస్తే ఆ ఫన్ అంతగా deliver కాలేదు. బేసిగ్గా ఇది ఒక typical లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా… but execution దగ్గరే ఇష్యూ వచ్చింది.
హర్ష రోషన్, శ్రీదేవి pairing ఒకే… chemistry works in parts. కానీ complete హీరో-హీరోయిన్ vibe మాత్రం రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం కొంచెం ఎమోషన్ ఉంటుంది… అది plus.
ఇప్పుడు main point – కామెడీ... సినిమా మొత్తం కామెడీ మీదే depend అయ్యింది… but అదే weakest part అయింది. చాలా scenes forced గా ఉంటాయి. natural flow లేదు. నవ్వాల్సిన చోట cringe feel వచ్చే moments ఎక్కువ. సెకండ్ హాఫ్ లో drama over అయిపోతుంది. Story ముందే guess చేసేలా ఉంటుంది. మధ్య మధ్యలో highs ఉన్నా… అవి consistent గా రావు. Technical side కి వస్తే… sound కొంచెం loudగా ఉంటుంది. Last lo trending song use చేసిన విధానం కూడా impact ఇవ్వదు. Acting కూడా కొన్ని చోట్ల overగా అనిపిస్తుంది. ఫైనల్ గా
కొన్ని moments okay అనిపించినా… overall ga cinema average zone లోనే పడుతుంది. Fun expect చేసి వెళ్తే… కొంచెం disappoint అయ్యే chance ఉంది.
Dhurandhar The Revenge Movie Review
‘ధురంధర్: ది రివెంజ్’ ఒక హై వోల్టేజ్ ఇండియన్ స్పై యాక్షన్ డ్రామా. సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా—అన్ని అయి కమర్షియల్ ట్రీట్ ఇవ్వాలని ట్రై చేశారు. రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో ఎనర్జిటిక్‌గా కనిపించినా, సినిమా మొత్తం ఒక్క వ్యక్తిపైనే ఆధారపడకుండా ఇతర పాత్రలు కూడా తమ స్థాయిలో సపోర్ట్ చేస్తాయి.
సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ క్యారెక్టర్లు కూడా ఓ రేంజ్ లో ఉండి ఆకట్టుకుంటాయి. ఇక రణవీర్ సింగ్ తర్వాత ఆడియన్స్ ని ఆ రేంజ్ ఇంప్రెస్స్ చేసే రోల్ మాధవన్ దే. అజయ్ సైన్యల్ గా తన కూల్ మరియు కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో బాగానే నిలిచాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు కథలో ప్రెజెన్స్ ఇవ్వగలిగాయి. అయితే ఈ పాత్రలను ఇంకా బలంగా డెవలప్ చేసి ఉంటే ఇంపాక్ట్ పెరిగేది.
స్టోరీ పరంగా చూస్తే రివెంజ్ లైన్ కొత్తగా అనిపించదు. కొన్ని సీన్స్ బాగున్నా, మొత్తం కథనం ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వదు. యాక్షన్ సీన్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు. వయలెన్స్ ఎక్కువగా ఉండటం కొంతమందికి మైనస్ అనిపించొచ్చు. టెక్నికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌ను ఎలివేట్ చేస్తుంది. విజువల్స్ బాగున్నాయి. కానీ క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ ఫీలింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఇండియన్ అసలైన రా ఏజెంట్ సినిమాగా ఈ సినిమాని ప్రతి ఆడియన్ ఎక్స్పీరెన్స్ చేయాలి.
Dhurandhar The Revenge Movie Review
"ధురంధర్: ది రివెంజ్" సినిమా గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే, ఇది వ్యక్తిగత ప్రతీకారం, దేశభక్తి, శక్తి మధ్య నడిచే ఒక తీవ్ర భావోద్వేగ ప్రయాణం. కానీ ఈ ప్రయాణంలో కథ కంటే పాత్ర ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో పూర్తిగా లీనమైపోయి, ఒక ఆవేశం, అంతర్గత పోరాటం, బాధ ఇలా అన్నింటిని ని తన నటనలో చూపించాడు. ఓవరాల్ గా రణవీర్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకు మెయిన్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. అయితే ఈ తీవ్రతకు సరిపడే స్థాయిలో కథనం నిర్మాణం బలంగా అనిపించదు.
ఇక ఇటు మాధవన్ పాత్ర వ్యూహాత్మకత, కూల్ గా కనిపిస్తుంటే కనిపించని భావోద్వేగంతో కూడిన వైల్డ్ పవర్ ని చూపిస్తాడు. అలాగే సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు కథలో కీలకంగా ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో వైలెన్సు ని పెంచలేవు. సారా అర్జున్ పాత్ర పరిమితంగా ఉండటం వల్ల పెద్దగా ఇంపార్టెన్స్ రెండో పార్ట్ లో ఉండదు. ఇక సినిమా లో ఎక్కువ వైలెన్స్ సీన్లు ఉండడం వల్ల కొంతమంది ఫ్యామిలీస్ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమాగా చెప్పుకోవచ్చు. మొత్తానికి, ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ఒక శక్తివంతమైన స్పై రివెంజ్ డ్రామాగా అంతకు మించిన రియల్ ఇండియన్ స్పై మూవీగా చెప్పుకోవచ్చు.
Dhurandhar The Revenge Movie Review
By Thyview
ధురంధర్ ది రివెంజ్.. ఇది ప్రతి ఇండియన్ సైనికుడికి సంబంధించిన కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ స్పై మూవీస్ లో ఇది కొత్త రకం సినిమా. చాలా రియలిస్టిక్ గా చాలా వరకు రియల్ ఇన్సిడెంట్స్ ని సినిమాలో చూపించి బలమైన ఎమోషన్ ని ప్రేక్షకులకు కట్టిపడేలా చూపించాడు దర్శకుడు. రణ్‌వీర్ సింగ్ మొదలుకుని మాధవన్ సహా ఎవరి రేంజ్ లో వారు సినిమాకి ప్రాణం పెట్టేసారు. మిగతా క్యాస్ట్ కూడా తమ తమ స్థాయిలో బాగా సపోర్ట్ చేసింది. హమ్జా క్యారెక్టర్‌లో రణ్‌వీర్ పూర్తి ఎనర్జీతో స్క్రీన్‌ను మోస్తాడు.
ఇక మాధవన్ గురించి చెప్పాలంటే… చాలా కూల్, కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా చాలా నేచురల్ గా కనిపిస్తాడు. సంజయ్ దత్ తన ఎక్స్‌పీరియన్స్ తో స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. అర్జున్ రాంపాల్ కూడా తన పాత్రలో స్టైలిష్‌గా కనిపిస్తూ బాగానే మెప్పించాడు. సారా అర్జున్ పాత్రకి స్కోప్ తక్కువే అయినా, కనిపించినంతసేపు ఓకే అనిపిస్తుంది. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకు తగ్గట్టే సెటిల్ అయ్యారు. యాక్షన్ పరంగా సినిమా చాలా హై లెవెల్‌లో ఉంటుంది. కొన్ని చోట్ల వయలెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. మ్యూజిక్ యాక్షన్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేస్తుంది. క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ ఫీల్ ఉన్నా… మొత్తం ఎనర్జీతో నడుస్తుంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers