Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
కిరణ్ అబ్బవరం నిర్మించిన కొత్త సినిమా తిమ్మరాజుపల్లి TV తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమాకి ఆఫ్ లైన్ లో మంచి స్పందన వస్తుంది. కొత్త నటీనటులతో ఈ మూవీ తెరకెక్కగా నటీనటులు అందరూ చక్కగా చేశారు. ప్రదీప్ కొట్టెకి మంచి రోల్ దక్కింది. పాత్ర తాలూకూ మార్పులను బాగా చూపించారు. తెరపై సాయి తేజ్ మన పల్లెల్లో కనిపించే అబ్బాయిలా ఉన్నారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.
ఇక ట్రెండీ కథలు, ప్రేమలు మధ్య ప్రేక్షకులను 90వ దశకంలోకి తీసుకు వెళ్లడంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' సక్సెస్ అయ్యింది. కథ కాస్త కిందకు మీదకు పడుతూ లేస్తూ వెళ్లినట్టు అనిపించినా... మంచి నోస్టాల్జియా మూమెంట్స్ అందిస్తుందీ సినిమా. సహజత్వానికి దగ్గరగా తీశారు. కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. సరదాగా రెండు గంటలు పల్లెలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లలో చివరి వరకు ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది.
హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV. ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ రొటీన్ గానే ఉన్నా, డీసెంట్ స్క్రీన్ ప్లే తో అలరించింది. హీరోగా సాయి తేజ్ కొత్తవాడైనా తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉంది. హీరోయిన్ వేద పాత్ర చిన్నదే అయినా, కథకు అవసరమైన భావోద్వేగాన్ని అందించింది. రాజప్ప పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సినిమాకు ప్రధాన బలం. మొత్తానికి, కొత్తవారైనా తమ పరిధిలో మంచి ప్రయత్నం చేశారు.
ఇక టెక్నికల్ గా దర్శకుడు మునిరాజు ఈ సినిమాతో సహజమైన గ్రామీణ వాతావరణాన్ని చూపించాలని ప్రయత్నించాడు. 90ల కాలాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించాడు. కానీ కథనం విషయంలో అదే రియలిజం కొన్నిసార్లు నెమ్మదితనంగా మారింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ 90ల సెటప్‌ను బాగా రీక్రియేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. కానీ పాటలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండేలా లేవు. చిత్తూరు యాసలో డైలాగ్స్ ఉండటం ఈ సినిమాకు రియలిస్టిక్ టచ్ ఇచ్చింది. ప్లస్ పాయింట్స్.. 90ల నాటి గ్రామీణ వాతావరణం సింపుల్ కాన్సెప్ట్‌లో మిస్టరీ ఎలిమెంట్ సహజమైన నటన కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ స్లో నరేషన్ చిన్న కథను ఎక్కువగా లాగడం యాస వల్ల కనెక్ట్ సమస్య గుర్తుండని సంగీతం ఫైనల్ వర్డిక్ట్... గ్రామీణ కథలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా.
కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా, బీలో యావరేజ్ టాక్ అందుకుంది. సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే కథ ప్రకారం ద్వితీయార్థం తప్పిపోయిన టీవీ చుట్టూ అల్లుకున్న 'హూడన్నిట్' (హత్య ఎవరు చేశారు?) డ్రామాగా మారుతుంది. ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు. హీరో, హీరోయిన్ల వేదనను లోతుగా అన్వేషించలేదు. కథనం ఒక మూస పద్ధతిని అనుసరిస్తుంది – చాలా మందిపై అనుమానాలు రేకెత్తించి, చివరికి ఊహించని వ్యక్తిపై దృష్టి పెడుతుంది. సాధారణంగా, 'హూడన్నిట్' కథలు ఇలాగే పనిచేస్తాయి, అదే ఫార్ములా. కానీ అది ప్రేక్షకులకు అంత సుస్పష్టంగా తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత చిత్రనిర్మాతలదే.
అయినప్పటికీ, ఇది మనం తేలికగా తీసిపారేయగలిగే సినిమా కాదు. దీని ప్రతి అణువులోనూ ఒక ఉద్దేశం, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉన్నాయని మనం గ్రహించగలం. టీవీ సన్నివేశాలు మరియు గ్రామ నేపథ్యం కచ్చితంగా ఒక సరికొత్త అనుభూతినిస్తాయి. ఈ లోపాలు ఉన్నప్పటికీ, ఈ కథాంశాన్ని అనుభవించి, ప్రయత్నించడానికి మీరు దీన్ని ఒక్కసారి చూడవచ్చు.
తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశాతం తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో తమ వంతు సహకారాన్ని అందించారు.
ఇక ఈ మూవీకి అత్యంత బలంగా మారిన సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి చెప్పుకోవాలి. వంశీకాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. సరైన కంటెంట్ ఉంటే.. భారీ బడ్జెట్‌తో కాకుండా తక్కువ వ్యయంతో ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించారు. ఈకలు పీకి..లోపాలు వెతకాలనే టార్గెట్‌తో కాకుండా.. ఓ నిజాయితీతో కూడిన అంటెంప్ట్‌ను చూడాలంటే.. తిమ్మరాజుపల్లి టీవీని ఈ వారం మీ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.
ThimmarajuPalliTV Movie Review
By Great Andhra
తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద్భుత నటనను కనబరిచాడు. మిగిలిన నటీనటులంతా వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇంతకి చెప్పుకోవాల్సిన విషయం మరొకటుంటే సంగీతోం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ గా నిలిచింది. పాటలు ఒకటి బాగుంది. కెమెరా వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా, న్యూ మ్యూజిక్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. రెండు గంటల సినిమా అయినా మూడు గంటల భావాన్ని అనిపించింది. దానికి కారణం కొన్ని ఎడిటింగ్ అంశం చెప్పాల్సిందే. సీన్స్ పేస్ లో బాగా ఉంది. సినిమా మొత్తానికి కూడా వర్క్ ఫ్రెండ్ మెంట్ గా ఉంది. ఇంటర్వెల్ కి అప్పుడు కధ మొదలవ్వడం ఫీలింగ్ రావు. అంతే డ్రామాటిక్ గా జంక్ అయ్యింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. ఫోకస్ టీమ్ చెప్పిన అంశాలను అంతగా సక్సెస్ కి నెత్తురం పడ్డ సన్నివేశాలు లో ఏమి చెప్పాలో తెలియని సన్నివేశాలుగా అనిపించింది. ఓవరాల్ గా మూవీ టీవీల్లో చూసేలా ఉంది గాని, థియేటర్ కి హాల్లో చూడాల్సిన మూవీలా లేదు.
‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.
అంతా కొత్త వాళ్ళతో చేసినప్పటికీ దాదాపుగా నటీనటులందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే వారి పాత్రల్లో సహజంగా బాగా నటించారు. ఇక దర్శకుడిగా వి. మునిరాజు మంచి పనితనం కనబరిచాడు. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.
పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో హీరో సమస్య దానికంటే చాలా పెద్దది.
టెక్నికల్ గా కె. ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) నేపథ్య సంగీతం అందించారు. ఆర్. ఆర్. బాగుంది. ఈటీవీ విన్ లాంటి సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం, తిరువీర్ హీరోగా నటించడం వంటి అంశాల వల్ల 'పాపం ప్రతాప్'ను చూద్దాం అనుకుంటే తప్పు చేసినట్టే. ఎలానూ రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి... అప్పటి వరకూ వేచి ఉండటం బెటర్. లేకపోతే... ఆడియెన్స్‌ను 'పాపం' అనుకోవాల్సి వస్తుంది!
ఈటివి వాళ్ళు నిర్మించిన కొత్త సినిమా పాపం ప్రతాప్(Papam prathap Movie)తో యంగ్ హీరో తిరువీర్(ThiruVeer) మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…హీరో తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు… కానీ పెళ్లి అయిన మూడో రోజే పెళ్ళికూతురు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది…దాంతో హీరో తనని తిరిగి బ్రతిమలాడి తిరిగి రప్పించుకుంటాడు..కానీ మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది. అసలు వీళ్ళకి ప్రాబ్లెం ఏంటి అసలు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ఇక హీరోగా తిరువీర్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ ఓకే అనిపించగా అజయ్ ఘోష్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…ఇక సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో నరేషన్ తో సాగింది. సినిమా ఎందుకో ఎక్కువ లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఎండ్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కథ చాలా స్లో నరేషన్ తో సాగుతూ రిపీటివ్ సీన్స్ తో సాగింది…ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ ఊపు అందుకుని క్లైమాక్స్ లో పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఒకసారి చూసేయొచ్చు అనిపించేలా ఉంది పాపం ప్రతాప్.
ఈ వారం విడుదలైన క్రేజీ మూవీస్ లో పాపం ప్రతాప్ ఒకటి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే... దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్లను జోడించి హృద్యంగా మలిచారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటలు, అమాయకత్వం చాలా సరదాగా సాగిపోతాయి. హీరోకు ఉన్న వింత సమస్యను రివీల్ చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తాయి.
అయితే సెకండాఫ్ ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. కొన్ని డబుల్ మీనింగ్ జోకులు లేకపోయినా సినిమా బాగుండేది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే... ఈ సినిమాకు ప్రధాన బలం తిరువీర్ నటన. భార్య దూరమైన బాధను, లోపల ఉన్న ఆవేదనను తన కళ్లతోనే పలికించాడు. ఒక సగటు మధ్యతరగతి భర్త పడే కష్టాలను అద్భుతంగా పండించాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా ఉంది. కేఎం రాధాకృష్ణన్ అందించిన పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. విశ్వేశ్వర్ ఎస్.వి సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను ఫ్రెష్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా 'పాపం ప్రతాప్'.. మనసును హత్తుకునే స్వచ్ఛమైన గ్రామీణ వినోదం.
తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతాప్ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. నటుడిగా కొన్ని చిన్న ఎక్స్‌ప్రెషన్స్ భలే పలికించారు. పాయల్ రాధాకృష్ణకు మంచి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆమె కూడా చక్కగా నటించారు. అమ్మ పాత్రలో రాశి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, గోపరాజు రమణ తమ పాత్రల్లో చక్కగా నటించారు. మిగతా వారు పర్లేదనిపించారు.
ఇక సినిమా విషయానికి వస్తే... కథలో అసలు పాయింట్ పక్కనపెట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వీక్‌నెస్ క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు చేసిన పబ్లిసిటీ 'పాపం ప్రతాప్'కు మెయిన్ మైనస్ పాయింట్. ప్రేమ కథకు డిజార్డర్ యాడ్ చేసిన సినిమా తీయాలనే ఆలోచన బావుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ కూడా బావుంది. కానీ, ఎగ్జిక్యూట్ చేసిన తీరు బాలేదు. కామెడీలో డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైంది. అది కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. కానీ, సినిమాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేయలేదు. ప్రతాప్ సమస్యను దర్శకుడు సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాను ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకోవడం కష్టమే. థియేటర్లకు వెళ్లిన వాళ్ళను చూసి పాపం ఆడియన్స్ అనుకోవాలి!
తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. రాత్రిళ్లు ఒక వ్యక్తి చేసే విచిత్రమైన ప్రవర్తన ఆధారంగా తెరకెక్కింది. దాని వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు? తన భార్య ఎలాంటి ఎంతటి నరకం అనుభవించింది, ఆ సమస్య ఆయన ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టిందనేది కామెడీ కోణంలో రూపొందించారు. అయితే కామెడీ పండలేదు కదా, చిరాకు తెప్పించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు గోల గోలగా, అరుపులు, కేకలు అన్నట్టుగానే సాగుతుంది.
సినిమాలో కొన్ని కామెడీ సీన్లు బానే ఉన్నా, అవి తప్ప ఇందులో నవ్వుకోవడానికి ఏం లేదు సరికదా, పెద్ద టార్చర్‌గా సాగుతుంది. ఒక్క సీన్‌కి మించి మరో సీన్ చిరాకు తెప్పిస్తాయి. ఆర్టిస్ట్ ల ఓవర్ పర్ఫెర్మెన్స్, లౌడ్‌గా రియాక్ట్ అయిన తీరు కామెడీని పండించడంలో విఫలమయ్యాయి. ప్రతి సీన్ ఓవర్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ దారుణం అంటే, దాన్ని మించి సెకండాఫ్ ఉంది. సీన్లు, ఆర్టిస్ట్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతిదీ సినిమాకి మైనస్‌గానే మారాయి. ఏదైనా ఇందులో ఆకట్టుకునే అంశం ఉందంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ అని లాస్ట్ లో చెప్పడం, క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఎమోషనల్ సీన్, అది తప్పితే మూవీ మొత్తం ఔట్ ఆఫ్ ది కంట్రోల్‌లో సాగిందని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పాపం ఆడియెన్స్. రెండున్నర గంటలు చుక్కలు.
తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, కథాకథనాల పరంగానూ రొటీన్ స్టఫ్ అన్న టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా, కంటెంట్ బలహీనంగా ఉన్నప్పుడు అంతా బలహీనంగానే ఉంటుంది. ఇక టెక్నికల్ గా పాటలు ఏమంత వినసొంపుగా, గుర్తు పెట్టుకునేలా ఉండవు. క్యాస్టూమ్స్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ ఇవేవీ కూడా సినిమాకి అదనపు హంగుల్లా కనిపించవు. నిర్మాణ విలువలు కూడా అంతగా కనిపించవు.
నటీనటుల విషయానికి వస్తే తిరువీర్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. పాయల్ రాధాకృష్ణ తన పాత్ర వరకు ఓకే అనిపిస్తుంది. రాశీ, అజయ్ ఘోష్ పెయిర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. గోపరాజు రమణ కారెక్టర్, అతను చేసే కామెడీ కొన్ని సార్లు ఓవర్ అనిపించొచ్చు, నచ్చకపోవచ్చు. రవి ఆంటోని, ప్రసాద్ బెహరా అక్కడక్కడ నవ్విస్తారు. మిగిలిన పాత్రలన్నీ కూడా వారి పరిధి మేరకు నటించారు. ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. చివరకు పాపం తిరువీర్ అనేట్టుగానే ఉంటుంది. మంచి పాయింట్‌లను పట్టుకుని తిరువీర్ కథల్ని ఓకే చేస్తాడు. కానీ ఎగ్జిక్యూషన్‌లో తేడా కొట్టేస్తుంటుంది. ఈ పాపం ప్రతాప్ కూడా అంతే.. పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ పూర్తి స్థాయి సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోతుంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers