Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
The Girl Friend Movie Review
రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. సినిమా కంటెంట్ ఓవరాల్ గా బాగున్నా, స్క్రీన్ ప్లే విషయంలో బాగా శ్రద్ధ వహించాల్సి ఉండాల్సింది. రష్మిక నటనలో మౌనం ఎక్కువ భావోద్వేగాలు పలికించింది. అలాగే రష్మికతో సమానమైన నటన దీక్షిత్ శెట్టి కనబరిచారు. ఇద్దరి అద్వితీయమైన నటన సన్నివేశాలను అద్భుతంగా మార్చాయి. రావు రమేష్, రోహిణి కనిపించిన సన్నివేశాలు తక్కువ. నటనతో చూపించిన ప్రభావం ఎక్కువ. ఓవరాల్ గా కాన్సెప్ట్ సింపుల్ గా చెప్పాలంటే... మగాడికీ పరువు ఉంటుంది. కాని మహిళ పరువు తీసే విధంగా సమాజం ప్రవర్తిస్తుందని చెప్పే సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ కథ, క్లైమాక్స్ తో మగాళ్లు ఏకీభవించడం కష్టం. మహిళలు హారతులు పట్టడం, జేజేలు పలకడం పుష్కలం. మహిళల కోసం మగాడు తీసిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. మహిళలు మెచ్చే సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, డిఫరెంట్ లవ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టెక్నికల్ గా సినిమా గురించి చెప్పాలంటే రాహుల్ రవీంద్రన్ మంచి టెక్నిషియన్స్ ని పట్టుకున్నాడు. అలాగే స్టోరీ లైన్ కూడా బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కాస్త ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. ఇక హేషమ్ అబ్దుల్ సినిమాకు బలం చేకూర్చే పాటలు ఇచ్చాడు గాని, అవి మరీ వినసొంపుగా లేవు. కృష్ణన్ వసంత్ విజువల్స్ బాగున్నాయి. ఇక రచయిత-దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు-2 తర్వాత మళ్లీ తన మార్కు చూపించాడు. రిలేషన్ షిప్ విషయంలో అతను ఒక సైడ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ.. చెప్పాలనుకున్న కథను మాత్రం బలంగానే చెప్పాడు. కథ కొత్తది కాకపోయినా, కొంచెం కొత్తగా దాన్ని నరేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా ఒక వర్గం ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి మెయిన్ హీరో, హీరోయిన్ అన్నీ రష్మిక మంధానానే. సినిమా, సినిమాకి తన నటనతో విమర్శకులను కూడా అభిమానులుగా మార్చుకుంటున్న రష్మక, ఈ మూవీలో నట విశ్వరూపం చూపించేసింది. ముఖ్యంగా మిర్రర్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, క్లైమాక్స్.. ఇలా చాలా సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.. క్లైమాక్స్‌లో ఆమె నటనకి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పులేదని అనిపిస్తుంది. అను ఇమ్మాన్యూయెల్ అందంతో ఆకట్టుకుంది. హీరో దీక్షిత్ కూడా మంచి నటన చూపించాడు. కానీ ఇది బ్రేకప్ చెప్పడానికి ఓ అమ్మాయి పడే కష్టాన్ని చూపించే సినిమా. నిమిషంలో పరిచయం, గంటలో డేటింగ్ అంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్‌కి అలవాటుపడిన నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది.. ఇక ‘మన్మథుడు 2’ మూవీతో తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన రాహుల్ రవీంద్రన్, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు.. ఫస్టాఫ్ స్లోగా స్టార్ట్ అయినా, సెకండాఫ్ బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా రష్మిక మంధాన నట విశ్వరూపాన్ని చూపించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ, నేటి యూత్‌కి ముఖ్యంగా అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఆడది అంటే మగవాడికి సేవలు మాత్రమే చేసేది కాదు, తనకంటూ ఓ లైఫ్ ఉంటుందని, దాన్ని గౌరవించాలని చెప్పే సినిమాగా ది గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ తెరకెక్కిందని చెప్పొచ్చు. ఇక ఈ సందేశాన్ని అందించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యారు. దాన్ని అంతే బాగా తన పాత్ర ద్వారా ఆవిష్కరించడంలో రష్మిక సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. మహిళ స్వేచ్ఛని ఆవిష్కరించే ఈ మూవీ లేడీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమా చాలా చోట్ల పడుతూ, లేస్తూ వచ్చింది. ఆయా చోట్ల ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. మహిళల స్వేచ్ఛకి సంబంధించి చెప్పిన పాయింట్ బాగుంది. దాన్ని చూపించిన తీరు బాగుంది. సినిమాని కూడా ఇంటెన్సిటీతో నడొపించిన తీరు బాగుంది. అయితే ఈ చిత్రం ఏ సెంటర్లకి పరిమితమయ్యే మూవీలా ఉంటుంది. కానీ ఫైనల్‌గా.. మహిళలు చూడాల్సిన మూవీ. మగాళ్లు తెలుసుకోవాల్సిన పాయింట్. పైనల్‌గా హృదయాన్ని హత్తుకునే చిత్రం.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రమిది. విడుదల ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఓవరాల్ గా సినిమాలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి బాగా చేసారు. ఫ్యాకల్టీగా రాహుల్ రవీంద్రన్ కూడా బాగా చేశారు. ఇక 'ది గర్ల్ ఫ్రెండ్'కు వెళ్లిన ప్రేక్షకులకు ఈ కథ, అందులో క్యారెక్టర్లతో లవ్ - హేట్ రిలేషన్ తప్పకుండా ఏర్పడుతుంది. రాహుల్ రవీంద్రన్ ఫెమినిస్ట్ అని, హీరోయిన్ కోణంలో సినిమా తీసి హీరోని విలన్ చేశారని ఆయనపై కోపం రావచ్చు. దీక్షిత్ శెట్టి పాత్రపై ప్రేమ కలగవచ్చు. రాహుల్ రవీంద్రన్ కథతో ఏకీభవిస్తే రష్మిక పాత్ర నచ్చుతుంది. ఒక్కటి మాత్రం నిజం... ప్రేమలో స్పష్టత ఉండటం ముఖ్యమని చెబుతుందీ సినిమా. రష్మిక, దీక్షిత్ శెట్టి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్ళ కోసం సినిమాకు హ్యాపీగా వెళ్ళవచ్చు. అన్నట్టు... సినిమాపై డిబేట్ తప్పకుండా జరుగుతుంది.
ప్రేమలో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కానీ అందులోని గాఢత అర్థం కాదు. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా కూడా.. మాటల్లో వివరించలేక మనోవేదన అనుభవించే ప్రేమకథలెన్నో. ప్రాణంగా ప్రేమించిన ప్రతి ప్రేమికురాలు నిలదీసి అడగలేని ప్రశ్నలు కొన్ని మిగిలిపోతుంటాయి. అలా అడగలేని ప్రశ్నలు, చెప్పలేని ఫీలింగ్స్‌కి సమాధానం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. సినిమా పరంగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నచ్చేస్తుందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే పరంగా కాస్త ల్యాగ్ అనిపించినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అమ్మాయిలు భూమాదేవి పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఈ ప్రేమలేంటో పడుకోవడాలేంటో.. విడిపోవడాలేంటో అని అనుకునే వాళ్లకి మాత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ బోరింగే. బట్.. ప్రేమ కథ ఏదైనా అది నచ్చాలంటే ముందు దాన్ని ఫీల్ అవ్వాలి. అలా అయ్యేవాళ్లకి మాత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నచ్చేస్తుంది.
రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా ఒక మంచి పెర్ఫామెన్స్ ని అందించింది. తనతో పాటు దీక్షిత్ శెట్టి కూడా పోటాపోటీగా పెర్ఫామ్ చేసాడు. అలాగే అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి లాంటి నటుల పాత్రలు వారిపై సన్నివేశాలు మంచి ప్రభావవంతంగా కూడా ఉన్నాయి, కానీ సినిమాలో కోర్ పాయింట్ కొత్తగా ఏమీ అనిపించదు. పైగా దానికి అల్లుకున్న పలు సన్నివేశాలు అందరికీ ఒకేలా కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. వీటితో పాటుగా అక్కడక్కడా స్లో అండ్ రిపీటెడ్ మూమెంట్స్ సినిమాలో రుచించవు. సో వీటితో గర్ల్ ఫ్రెండ్ చిత్రం అక్కడక్కడా ఆకట్టుకుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ ని ఇష్టపడే వాళ్ళు, రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమాని ట్రై చేయొచ్చు. నార్మల్ ఆడియన్స్ కి కొంత కష్టం.
Mana Shankara Varaprasad Garu Movie Review
By 123telugu
చిరంజీవి హీరోగా వచ్చిన ఈ తాజా చిత్రం కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా తీసుకున్న సంపూర్ణ వినోదాత్మక చిత్రం. అనిల్ రావిపూడి తనకు బాగా పట్టిన హాస్య శైలిని చిరంజీవి ఇమేజ్‌కు చక్కగా కలిపారు. తొలి భాగం అంతా సరదా సన్నివేశాలు, పంచ్ డైలాగులతో వేగంగా సాగుతుంది. రెండో భాగంలో భావోద్వేగాలు కథకు బలాన్ని ఇస్తాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా ఎనర్జీని నిలబెడతాయి. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ప్రభావం చూపిస్తుంది. వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్ర ప్రేక్షకులకు సర్ప్రైజ్‌లా నిలుస్తుంది. ఆయన–చిరంజీవి కలయికకు థియేటర్లలో మంచి స్పందన కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా కుటుంబంతో కలిసి నవ్వుతూ చూడదగిన మంచి ఎంటర్‌టైనర్.
Enugu Thondam Ghatikachalam movie Review
ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ ఏర్పరచుకున్న రవిబాబు డైరెక్టర్ గా కొన్నాళ్లుగా ఫామ్ లో లేకపోగా, తాజాగా ఏనుగు తొండం ఘటికాచలంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి రావాల్సిన సినిమా అసలు కాదిది. ఓవరాల్ గా నరేష్ ఎప్పటిలానే సహజనటనతో మెప్పించాడు. పైగా తన వయసుకి తగ్గ పాత్రది. వర్షిణి పాత్రలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా, ఆ పాత్ర ఈ డ్రామాలో చలాకీగా ఉంటుంది. మిగతా పాత్రలన్నీ తేలిపోయాయి. దాదాపు సింగిల్ లొకేషన్ కథ ఇది. ప్రొడక్షన్ డిజైన్‌లో రవిబాబుదీ ప్రత్యేకమైన స్టైల్. ఇందులోనూ ఒక యూనిఫామ్ టోన్ కనిపిస్తుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ ఓటీటీ సినిమాకి తగ్గట్టుగానే ఉంటాయి. పెద్దగా నవ్వురాని, ఎమోషన్‌గా కనెక్ట్ కాని సినిమా ఇది. రవిబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనే అంచనాతో చూస్తే మరింత నిరుత్సాహపడాల్సి వస్తుంది.
Enugu Thondam Ghatikachalam Movie Review
By 123telugu
దర్శకుడు రవిబాబు తన మార్క్ కామెడీ ఇంకా థ్రిల్లర్ చిత్రాలతో మంచి బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. ఇప్పుడొస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ ని ఇరవైఏళ్ళ కిందటే రవిబాబు ఎప్పుడో తాను టచ్ చేశారు. కానీ కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన రవిబాబు మరోసారి తన సత్తా చాటాలని ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో ఓటిటి ద్వారా ఆడియన్స్ ని పలకరించాడు. కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది. పూర్తి స్థాయిలో ఆకట్టుకోని కామెడీ డ్రామాగా ఈ సినిమా నిలిచింది. దర్శకుడు రవిబాబు తాలూకా గత సినిమాలు తన క్రియేటివిటీ కోసం మినిమమ్ ఐడియా ఉన్నవారికి కూడా ఈ సినిమా నిరుత్సాహాన్నే మిగులుస్తుంది. ఇక ఏ అంచనాలు లేని ఆడియెన్స్ అయితే కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. సో ఈ చిత్రం కేవలం రవిబాబు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు కొత్త సినిమా చూడాలి అనుకునే వారినే చాలా తక్కువ స్థాయిలో ఆకట్టుకుంటుంది.
Santhana Prapthirasthu movie Review
By Great Andhra
సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్రాంత్, చాందిని చౌదరి ఈ మూవీతో మంచి సక్సెస్ కొట్టాలని ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి రేర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దానికి ముందు అతడ్ని అభినందించాలి. సినిమాలో కూడా పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఓవర్ గా లేకుండా చెప్పాల్సిందాన్ని నీట్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. బట్ అందులోనే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ ని అందించడం లో తడబడ్డాడు. క్లైమాక్స్ ఇంకా ఆసక్తిగా ఉంటె కనెక్ట్ అయ్యేవారు. కానీ సెకండ్ హాఫ్ లో బాగా ల్యాగ్ ఫీల్ వచ్చింది. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ కోసం, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చూసే ఒక వర్గం ఆడియన్స్ కి సంతాన ప్రాప్తిరస్తు సినిమా నచ్చే అవకాశం ఉంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ అంతగా ఇంప్రెస్ అవకపోవచ్చు.
Santhana Prapthirasthu Movie Review
ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారం, పని ఒత్తిడి లాంటి సమస్యలే సంతాన లేమికి కారణం అవుతున్నాయి. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఇది కాస్త సీరియస్ సబ్జెక్టే అయినా ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయకుండా, ఎవరినీ నొప్పించకుండా లైటర్ వేలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే లవ్‌స్టోరీ పరంగా రొటీన్‌గానే అనిపిస్తుంది. పిల్లల్ని కోరుకోవడం, ఆ తరుణంలో సాగే భావోద్వేగ సన్నివేశాలు, పతాక సన్నివేశం కదిలించేలా ఉన్నాయి. కథ పరంగా మంచిదే అయినా కాస్త ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లతో తీసుంటే ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లేది. సినిమాలో నటీనటులు బాగానే పెర్ఫార్మ్ చేసినా, బలమైన పెద్ద ఆర్టిస్టులతో సినిమాని తీసుంటే, అప్పుడు ప్రమోషన్ బలంగా చేస్తే జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఒకసారి చూసేలా అయితే ఉంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications