Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ధనుష్ నటించిన కర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటన పరంగా ధనుష్ అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోగా కర మూవీ ఆకట్టుకుంటుంది. అయితే మమితా బైజు పాత్ర పరిధి చాలా తక్కువ. దొంగ అని తెలిసి కర స్వామిని పెళ్లి చేసుకునే మహిళగా నటించారు. ఆమె నటన సహజంగా ఉంది. వైట్ కాలర్ క్రిమినల్ తరహా పాత్రను జయరామ్ పోషించారు. పాత్రకు అవసరమైన కన్నింగ్ నేచర్‌ను కేవలం కళ్ళలో చూపించారు.
ఇక ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు కనెక్ట్ అయ్యే సినిమా 'కర' అని చెప్పాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన లేకుండా లోనులు తీసుకున్న మధ్య తగరతి ప్రజలను కొందరు అధికారులు జలగల్లా పీల్చుకుని తింటున్న సమయంలో ఎదురు తిరిగిన ఓ దొంగ కథ 'కర'. ధనుష్ లేని సినిమాను ఊహించుకోలేం. అంత అద్భుతంగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్. నిదానంగా మొదలై చివరకు ఓ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది.
ధనుష్ నటించిన కర మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల కాగా, ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు విగ్నేష్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు. ఇక ధనుష్ నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ, ఇక హీరోయిన్ మమిత బైజు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించగా, తన పాత్రలో డీసెంట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కాకపోతే నటన పరంగా మరింత రాణించాల్సింది. కందస్వామిగా కెఎస్ రవికుమార్ జీవించాడు. ఇక జయరామ్, సూరజ్ కరుణాస్, పృథ్వీ రాజన్ తదితరులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. తేని ఈశ్వర్ కథకు తగ్గట్టు కెమెరా వర్క్ బాగా చేశారు. కానీ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మార్క్ సినిమాలో కనిపించలేదు సందర్భానుసారం వచ్చే రెండు పాటలు సోసో… తెలుగు డబ్బింగ్ విషయంలో కొంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుష్ గత చిత్రం 'ఇడ్లీ కడై' కూడా ఇదే తరహాలో తండ్రి సెంటిమెంటుతో వచ్చినదే. ఈసారి కూడా అదే జానర్ సినిమా కావటం వల్ల కర ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే దర్శకుడు కథా కథనాల విషయంలో నిరాశపరచగా, ధనుష్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడని చెప్పాలి. కథలో ఆయన పాత్రకు ఉన్న బలం స్క్రీన్ పై అంతగా కనిపించలేదు. అలాగే హీరోయిన్ మమిత బైజు నటన కూడా కొంచెం ఓవర్‌గా, సహజత్వం లేకుండా అనిపించింది.
అయితే సీనియర్ నటులు కె.ఎస్. రవికుమార్, ఎం.ఎస్. భాస్కర్ మాత్రం తమ పాత్రల్లో బాగా నటించి ఆకట్టుకున్నారు. ఇక కర సినిమా మొదటి భాగం సరాసరిగా అనిపించగా, రెండో భాగం మాత్రం చాలా నెమ్మదిగా, బోర్‌గా సాగింది. క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టలేకపోయింది. ఓవరాల్ గా కర సినిమా ధనుష్ అభిమానులను కూడా మెప్పించలేకపోయింది.
తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మామితా బైజు సహజ నటనతో మెప్పించింది.
టెక్నికల్ గా చూస్తే... 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీసుకు రావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు అయితే అంత గుర్తు పెట్టుకునేలా లేవు. విజువల్స్ ఎంతో నేచురల్‌గా, యాక్షన్ సీక్వెన్స్ సింపుల్‌గా ఉంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘కర’ మూవీ.. ఓ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని చోట్ల నిదానంగా, బోరింగ్ గా అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు అంటూ మంచి పాయింట్ ను విఘ్నేశ్ రాజా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నానికి కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.
కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం పరవాలేదు.
కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ధనుష్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి కర సినిమా డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వాఝా2 పేరిట మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తాజాగా తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ కాగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ మెయిన్ లీడ్స్ లో నటించగా, వీరు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దర్శకుడిగా సావిన్ SA తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ డీసెంట్ గా ఉన్నాయి. పైగా సినిమాలో సహజత్వం చాలా ఇంప్రెస్ చేస్తుంది. పైగా మండుతున్న సమ్మర్ లో కూల్ గా ఇలాంటి పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది.
ఇక రకరకాల కారణాలతో కుటుంబాలను వదిలి దూరం వెళ్లిన యువత ఎలా రియలైజ్ అవుతుంది. వారి మార్పు కుటుంబాలకు ఎలా అండగా ఉంటుందనే క్లైమాక్స్ ఎంతో బలంగా నిలిచింది. దర్శకుడు ఆ సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. సినిమా నాచురల్ గా ఉంది. అనువాదం చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ క్లాస్ కుర్రకారుకు, కుటుంబాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మధ్యతరగతి మనుషుల జీవితాల్లో పలు విషయాలను గుర్తు చేస్తుందీ వాలా 2 సినిమా.
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు తెలుగులో ట్రెండీ డైలాగ్స్ రాసి మన వాళ్లు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ‘‘మేము ప్యూర్ ఫామిలీ ఆడియన్స్ సార్, మమ్మల్ని కొడితే అనిల్ రావిపూడి అన్న ఫీల్ అవుతాడు సార్’’ లాంటి డైలాగులతో మన ఆడియన్స్ రిలేట్ అవుతారు.
ఐతే డబ్బింగ్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళు.. ఈ చిత్రానికి ఒక తెలుగు టైటిల్ పెట్టలేక పోవడమే విచిత్రం. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. విపిన్ దాస్ ట్రెండీ కథ రాయగా.. దర్శకుడు సవిన్ దాన్ని బాగా డీల్ చేశాడు. ఇటు కామెడీని.. అటు ఎమోషన్లను బాగా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు. చివరగా: వాలా-2.. యువతకు కిక్కు
మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదలయింది.
ఇక ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.
దర్శకుడు సావిన్ షా ఎంచుకున్న కథ బాగుంది. తెరకెక్కించిన తీరు బాగుంది. అయితే మలయాళ నేపథ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మన తెలుగు వారికి కొంత మైనస్‌గా చెప్పొచ్చు. మతం, కమ్యూనిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనకు మైనస్. దర్శకుడిగా సినిమాని ఎంగేజింగ్‌గా, కామెడీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ఇక అఖిల్ లైలాసురన్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కనువిందు చేస్తాయి. పాటలు సినిమాకి ప్లస్, బీజీఎం అదిరిపోయింది. కన్నన్ మోహన్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. ఫైనల్ గా టీనేజ్ (స్కూల్, కాలేజీ) కుర్రాళ్ల బయోపిక్ ఇది. వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.
మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్ర (Biopic of a Billion Bros). కథ వరకు మొదటి భాగం టెంప్లేట్‌నే తీసుకున్నా, ఈసారి ఎమోషన్స్, హ్యూమర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు రచయిత విపిన్ దాస్. హషీర్, వినాయక్, అలన్, అజిన్.. ఈ నలుగురు స్నేహితుల జీవితం చుట్టూ కథ తిరుగుతుంది.
ఇక ‘వాలా 2’ (Vaazha 2) మొదటి భాగం కంటే చాలా మెరుగ్గా ఉంది. కేవలం కుర్రాళ్లు మాత్రమే కాదు, తమ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా ఇది.మలయాళ సినిమా మళ్ళీ తన మ్యాజిక్‌ని రిపీట్ చేసింది. మన పక్కన ఉండే మనుషుల కథలను మనకు నచ్చేలా చెప్పడంలో మలయాళం తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించింది. సింగిల్ వర్డ్ లో మూవీ గురించి చెప్పాలంటే... ఇది మనందరి కుర్రాళ్ల బయోపిక్.. నవ్వుతూ ఏడిపించేస్తుంది!
సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.
'వాలా 2' స్పెషాలిటీ ఏమిటంటే... నేటివిటీకి, సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. ఎక్కడా గీత దాటలేదు. ఇందులో యువతకు స్కూల్, కాలేజ్ లైఫ్ గుర్తు చేసే నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. ఇండియా నుంచి విదేశాలకు చదువు (అమెరికా) లేదా ఉద్యోగం (దుబాయ్) కోసం వెళ్లిన యువత సినిమాలు చూడటం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విదేశాల్లో వాళ్ళు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించారు దర్శక రచయితలు శివన్ ఎస్ఏ, విపిన్ దాస్. పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.
అయితే 'వాలా' చూడని ప్రేక్షకులకు 'వాలా 2' చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మరోసారి నోస్టాల్జియా మూమెంట్స్ గుర్తు చేస్తుంది. అక్కడక్కడా కాస్త డౌన్ అయినట్టు అనిపించినా... యూత్‌కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఇస్తుంది. యువతకు తమను తాము తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది.
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి.
ఇక ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం తాజాగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది
మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రొటీన్ లవ్ స్టోరీ ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక వినోదాన్ని, భావోద్వేగాలను మేళవిస్తూ సినిమా జైన్స్ నాని సినిమా తీసిన విధానం అందరినీ అలరిస్తుందనే చెప్పవచ్చు. నిజానికి ఇది తనకు మంచి పరిచయ చిత్రం అవుతుంది. లోపాలు, లాజిక్కులు వెతక్కుండా ఓసారి ఈ సినిమా చూసేయవచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers