Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

461
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 181-192 of 461 reviews
Clear all filters

Biker Movie Review

7.0
out of 10
బైకర్ గురించి చెప్పాలంటే... టాలీవుడ్ లో మునుపెన్నడూ రాని రేంజ్ లో అల్టిమేట్ రేసింగ్ సీన్స్ అండ్ ఎక్స్ లెంట్ విజువల్స్ తో తెరకెక్కడమే కాకుండా, ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక శర్వానంద్ మరోసారి తనదైన స్టైల్ లో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అలాగే చాలా టైం తర్వాత తెరపై రాజశేఖర్ ని చూడటం ఆకట్టుకోగా అదే టైంలో తన ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్ తో కుమ్మేశాడు. మొత్తం మీద సినిమాలో...

బైకర్ గురించి చెప్పాలంటే... టాలీవుడ్ లో మునుపెన్నడూ రాని రేంజ్ లో అల్టిమేట్ రేసింగ్ సీన్స్ అండ్ ఎక్స్ లెంట్ విజువల్స్ తో తెరకెక్కడమే కాకుండా, ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక శర్వానంద్ మరోసారి తనదైన స్టైల్ లో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అలాగే చాలా టైం తర్వాత తెరపై రాజశేఖర్ ని చూడటం ఆకట్టుకోగా అదే టైంలో తన ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్ తో కుమ్మేశాడు. మొత్తం మీద సినిమాలో లెంగ్త్ కొంచం ఎక్కువ అవ్వడం కొంచం డ్రా బ్యాక్ అయితే కొన్ని చోట్ల డ్రాగ్ అవ్వడం లాంటివి కొంచం ఇంపాక్ట్ ను చూపించినా కూడా, ఓవరాల్ గా శర్వానంద్ అండ్ రాజశేఖర్ ల ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ సీన్స్, అలాగే

సినిమాలో తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ బాగా మెప్పించాయి. 


ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్ లో ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీని చాలా వరకు ఆడియన్స్ ను మెప్పించేలా తీర్చిదిద్ది డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. శర్వానంద్ మరోసారి ఫుల్ ఫ్లోలో తన ఫామ్ ను చూపించాడు. కొంచెం లెంగ్త్ ని తగ్గించి స్క్రీన్ ప్లే ని కొంచెం టైట్ చేసి ఉంటే మరింత బాగా ఆకట్టుకుని ఉండేది. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి వస్తారు. కాకపోతే అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 

Apr 03, 2026 Telugu

Biker Movie Review

Tupaki

By Tupaki

7.0
out of 10
థియేటర్లలో తాజాగా విడుదలైన ‘బైకర్’ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా కథా, కథనాల్లో ఉన్న లోపాలను కవర్ చేసే స్థాయిలో సాంకేతిక అంశాలు గొప్పగా అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ బైక్ రేసింగ్ సన్నివేశాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. మిగతా విజువల్స్ కూడా కంటికి ఇంపుగా అనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది. కానీ తన ప...

థియేటర్లలో తాజాగా విడుదలైన ‘బైకర్’ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా కథా, కథనాల్లో ఉన్న లోపాలను కవర్ చేసే స్థాయిలో సాంకేతిక అంశాలు గొప్పగా అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ బైక్ రేసింగ్ సన్నివేశాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. మిగతా విజువల్స్ కూడా కంటికి ఇంపుగా అనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది. కానీ తన పాటలు మాత్రం ఆశించినంత ప్రభావవంతంగా లేవు.



ఇక శర్వానంద్, రాజశేఖర్ సహా మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఇక దర్శకుడు అభిలాష్ రెడ్డి రాసుకున్న కథ సాధారణంగా అనిపించినా.. తన కథనంతో.. ముఖ్యంగా బైక్ రేసింగ్ నేపథ్యంతో మార్కులు కొట్టేశాడు. సాంకేతిక అంశాలను బాగా వాడుకున్న అతను.. ప్రధాన పాత్రధారుల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. ఎమోషన్లను బాగా పండించాడు. కథ పరంగా ఇంకొంచెం వైవిధ్యం చూపించగలిగి ఉంటే.. షాకులు ఇచ్చి ఉంటే.. ‘బైకర్’ను వేరే స్థాయిలో నిలబెట్టగలిగి ఉండేవాడు. చివరగా బైకర్ గురించి చెప్పాలంటే... ఫ్యామిలీ కథ లో స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్ థియేటర్లలో ఒకసారి చూసేయొచ్చు. 

Apr 03, 2026 Telugu

Biker Movie Review

6.0
out of 10
శర్వానంద్ నటించిన ‘బైకర్’లో అసలు హైలెట్ ఎవరంటే సందేహం లేకుండా రాజశేఖర్ అని చెప్పాలి. సునీల్ నారాయణ పాత్రలో ఆయన కనిపించిన ప్రతి సీన్ సినిమాకి వెయిట్ తీసుకొచ్చింది. హీరో కాకపోయినా… ఆ తర్వాత సెకండ్ మెయిన్ లీడ్ గా.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ హగ్ సీన్‌లో రాజశేఖర్ నిజంగానే కంటతడి పెట్టిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక గాని కథకి సరైన రేసింగ్ ఉండదు.&...

శర్వానంద్ నటించిన ‘బైకర్’లో అసలు హైలెట్ ఎవరంటే సందేహం లేకుండా రాజశేఖర్ అని చెప్పాలి. సునీల్ నారాయణ పాత్రలో ఆయన కనిపించిన ప్రతి సీన్ సినిమాకి వెయిట్ తీసుకొచ్చింది. హీరో కాకపోయినా… ఆ తర్వాత సెకండ్ మెయిన్ లీడ్ గా.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ హగ్ సీన్‌లో రాజశేఖర్ నిజంగానే కంటతడి పెట్టిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక గాని కథకి సరైన రేసింగ్ ఉండదు. 


ఇక టెక్నికల్‌గా జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ ప్లస్. రేసింగ్ సీన్స్‌లో థ్రిల్ పెంచడమే కాదు… ఎమోషనల్ సీన్స్‌లో కూడా బలంగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైలాగులు ఎక్కువగా లేకపోయినా… ఉన్నవన్నీ స్ట్రైట్‌గా హిట్ అవుతాయి. మొత్తానికి ‘బైకర్’లో రేసింగ్ కంటే ఎమోషన్స్ బలంగా పనిచేశాయి. ఓవరాల్‌ గా బైకర్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి వర్కౌట్ అయ్యే సినిమా. అయితే సాధారణ ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పిస్తుందో డిసైడ్ చేయలేము. 

Apr 03, 2026 Telugu

Biker Movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన బైకర్ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హీరోగా శర్వానంద్ రేసర్ గా నటించడానికి శారీరకంగా, మానసికంగా పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరు పెట్టలేం. చాలా నాచురల్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లోనూ మెప్పించాడు. శర్వాకు భార్యగా అనన్య పాత్రలో మాళవిక నాయర్ కూడా చక్కగా నటించింది. ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.&nb...

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన బైకర్ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హీరోగా శర్వానంద్ రేసర్ గా నటించడానికి శారీరకంగా, మానసికంగా పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరు పెట్టలేం. చాలా నాచురల్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లోనూ మెప్పించాడు. శర్వాకు భార్యగా అనన్య పాత్రలో మాళవిక నాయర్ కూడా చక్కగా నటించింది. ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. 


ఇక రేసింగ్ కోచ్ గా సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ జీవించారు. సినిమాకు ఆయన పాత్ర కీలకం. ఇక తులసి, అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, నవీన్ నేని, తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతిక పరంగా చూస్తే జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. జిబ్రాన్ పాటల్లో మెరుపులు లేవుగానీ, నేపథ్య సంగీతం బాగుంది. ప్రత్యేకించి రేసింగ్ సీన్స్ లో చాలా బావుంది. యు.వి సంస్థ రేసింగ్ కథకు తగ్గట్లు బాగా ఖర్చు పెట్టారు. అది తెరపై కనిపించింది కూడా. అంచనాలు లేకుండా వెళ్లి థియేటర్లో కూర్చుంటే ఈ రేసింగ్ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం అయితే కష్టమే.

Apr 03, 2026 Telugu

Biker Movie Review

7.0
out of 10
'బైకర్' సినిమా గురించి చెప్పుకుంటే... సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్... శర్వానంద్ నటన, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. శర్వాతో పాటు రాజశేఖర్ సైతం సినిమాకు ప్లస్ అయ్యారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి డైలాగులు లేవు... తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వా, రాజశేఖర్ నటన కంటతడి పెట్టిస్తుంది. అలాగే టెక్నికల్ గానూ 'బైకర్' బావుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సాంగ్స్ &...

'బైకర్' సినిమా గురించి చెప్పుకుంటే... సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్... శర్వానంద్ నటన, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. శర్వాతో పాటు రాజశేఖర్ సైతం సినిమాకు ప్లస్ అయ్యారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి డైలాగులు లేవు... తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వా, రాజశేఖర్ నటన కంటతడి పెట్టిస్తుంది. అలాగే టెక్నికల్ గానూ 'బైకర్' బావుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సాంగ్స్ & ఆర్ఆర్ వంటివి అప్రిషియేట్ చేసేలా ఉన్నాయి. 


అయితే... కథలో పూర్ విలన్ ట్రాక్, స్ట్రాంగ్ కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోవడం వల్ల తండ్రీ కొడుకుల ఎమోషన్ డైల్యూట్ అయ్యింది. ఎంగేజ్ చేస్తూ రేసీగా వెళ్లాల్సిన సినిమా నిదానంగా ముందుకు కదిలింది. శర్వానంద్, రాజశేఖర్ మాత్రం తమ నటనతో మెప్పించారు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాస్త శాటిస్‌ ఫై అవ్వొచ్చు. శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం సూపర్బ్. ఈ వారం మరీ అంచనాలు పెట్టుకోకుండా ఒక నార్మల్ స్పోర్ట్స్ డ్రామాగా బైకర్ ని చూసెయ్యచ్చు. 

Apr 03, 2026 Telugu

Biker Movie Review

5.0
out of 10
శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా చూసాక రివ్యూ గురించి చెప్పాలంటే... సినిమాలో శర్వానంద్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడని రేసింగ్ సీన్లు చూస్తేనే తెలుస్తుంది. అలాగే రేసింగ్‌ ఎపిసోడ్స్ ఉత్కంఠకి గురి చేస్తాయి. దాంతో పాటు క్లైమాక్స్ ఎమోషనల్‌ గా ఉండి ఆకట్టుకుంది. అలాగే జిబ్రాన్ బిజిఎం కూడా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. న...

శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా చూసాక రివ్యూ గురించి చెప్పాలంటే... సినిమాలో శర్వానంద్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడని రేసింగ్ సీన్లు చూస్తేనే తెలుస్తుంది. అలాగే రేసింగ్‌ ఎపిసోడ్స్ ఉత్కంఠకి గురి చేస్తాయి. దాంతో పాటు క్లైమాక్స్ ఎమోషనల్‌ గా ఉండి ఆకట్టుకుంది. అలాగే జిబ్రాన్ బిజిఎం కూడా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నటీనటులు బాగా చేశారు. మెయిన్‌ కాస్టింగ్‌ సినిమాకి ప్లస్‌ అయ్యారని చెప్పొచ్చు.


అయితే మైనస్‌ లు చెప్పుకుంటే సినిమా చాలా వరకు డ్రైగా సాగింది. ఏమాత్రం హై మూమెంట్స్ లేవు. డ్రామా అంతగా పండలేదు. ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. తండ్రీకొడుకుల బాండింగ్‌కి సంబంధించిన ఎమోషన్స్ ఎలివేట్‌ కాలేదు. క్లైమాక్స్ లో తప్ప మరెక్కడా అది కనిపించలేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన డ్రామా ఇందులో అంతగా లేదు. దీంతో ఓల్డ్ సినిమాలను తలపించింది. ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇవ్వలేకపోయింది. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తప్ప మరేదీ కొత్తగా లేదనే ఫీలింగ్‌ తెప్పించింది. సినిమా స్లోగా సాగడం మరో మైనస్‌గా చెప్పొచ్చు.ఓవరాల్ గా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..

రేస్‌ తక్కువ, సాగదీత ఎక్కువ.. ఎమోషనల్‌ గానూ, డ్రామా పరంగానూ మెప్పించలేకపోయిన 'బైకర్‌'.

Apr 03, 2026 Telugu

Biker Movie Review

6.0
out of 10
శర్వానంద్ నటించిన బైకర్ సినిమా గురించి ఓవరాల్‌ గా చెప్పుకోవాలంటే.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, జెర్సీ తరహా సినిమాగా బైకర్ ని చూడొచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకొంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు కొన్ని మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్‌ లో బాగా సాగదీత, అనసవరమైన సీన్లు సినిమాను ల్యాగ్‌ గా మార్చాయి. టెక్నికల్ గా సంగీతంతో పాటు, నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువల పర...

శర్వానంద్ నటించిన బైకర్ సినిమా గురించి ఓవరాల్‌ గా చెప్పుకోవాలంటే.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, జెర్సీ తరహా సినిమాగా బైకర్ ని చూడొచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకొంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు కొన్ని మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్‌ లో బాగా సాగదీత, అనసవరమైన సీన్లు సినిమాను ల్యాగ్‌ గా మార్చాయి. టెక్నికల్ గా సంగీతంతో పాటు, నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. 


నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా బి,సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే క్రిటిక్స్ మెచ్చిన సినిమాగా మిగిలిపోతుంది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి బైకర్ సినిమా నచ్చే అవకాశం ఉంది.

Apr 03, 2026 Telugu

Biker Movie Review

7.0
out of 10
శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోయాడు. బైకర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. రాజశేఖర్ నారాయణ పాత్రలో చాన్నాళ్ల తర్వాత చాలా స్ట్రాంగ్‌గా మెప్పించారు. హీరో కాకపోయినా ఈ కథలో ఆయనే కీలక పాత్రగా నిలిచారు. తన అనుభవంతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లగా, ముఖ్యంగా క్లైమాక్స్‌లో...

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోయాడు. బైకర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. రాజశేఖర్ నారాయణ పాత్రలో చాన్నాళ్ల తర్వాత చాలా స్ట్రాంగ్‌గా మెప్పించారు. హీరో కాకపోయినా ఈ కథలో ఆయనే కీలక పాత్రగా నిలిచారు. తన అనుభవంతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లగా, ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌ను హగ్ చేసే సీన్‌లో ఎమోషన్ పీక్స్‌కు చేరి ఆడియన్స్‌ను కదిలిస్తుంది.


మాళవిక నాయర్ ఫస్టాఫ్‌లో గ్లామర్‌తో ఆకట్టుకుని, సెకండాఫ్‌లో నటనతో ఇంప్రెస్ చేసింది. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. విలన్‌గా అతుల్ కులకర్ణి చాలా సెటిల్డ్‌గా నటించగా, అన్వర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్రహ్మాజీ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.


టెక్నికల్‌గా చూస్తే జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. రేసింగ్ సీన్స్, ఎమోషనల్ మోమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా విజువల్‌గా ఆకట్టుకుంటుంది. డైలాగులు తక్కువగా ఉన్నా, ఉన్నవన్నీ ఇంపాక్ట్ ఫుల్‌గా ఉన్నాయి. మొత్తంగా, ఎమోషన్స్‌తో పాటు రేసింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ శర్వానంద్ ఈసారి మంచి హిట్ కంటెంట్ అందించాడని చెప్పొచ్చు.

Apr 03, 2026 Telugu

Biker movie Review

7.0
out of 10
శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. బైక్ రేసింగ్ ని మెయిన్ పాయింట్ గా ఎంచుకుని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఇక తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ ని ఎంచుకోవడం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే శర్వానంద్, డా. రాజశే...

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. బైక్ రేసింగ్ ని మెయిన్ పాయింట్ గా ఎంచుకుని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఇక తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ ని ఎంచుకోవడం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే శర్వానంద్, డా. రాజశేఖర్‌ల అద్భుతమైన నటన సినిమాకు హైలైట్‌ కాగా, ముఖ్యంగా రాజశేఖర్ కి రీ ఎంట్రీ తర్వాత దక్కిన స్ట్రాంగ్ రోల్ గా చెప్పొచ్చు.


అలాగే పలు రేసింగ్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. కాకపోతే, కాస్త నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, రొటీన్ కథ కావడం వల్ల కాస్త యావరేజ్ ఫీల్ వచ్చినా, క్లైమాక్స్ వరకు థియేటర్లో కూర్చో బెట్టేసే స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే బైకర్ కి రాసుకున్నాడు దర్శకుడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి బైకర్ సినిమా ఒక మంచి ఛాయస్ గా చెప్పొచ్చు. 

Apr 03, 2026 Telugu

Happy Raj Movie Review

Gulte

By Gulte

4.0
out of 10
హ్యాపీ రాజ్ సినిమా ఫస్టాఫ్ చూస్తుంటే… ఇది పూర్తిగా సెకండాఫ్ కోసం బిల్డప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లౌడ్ మ్యూజిక్, అర్ధంపర్థం లేని కామెడీ, మాస్ ఎలిమెంట్స్, యూత్‌ను టార్గెట్ చేసే సీన్స్—ఇవన్నీ కలిపి రొటీన్ ఫీలింగ్ ఇస్తాయి. జీవీ ప్రకాశ్ వంటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి టెంప్లేట్ మూవీ చేశాడా? అనే సందేహం కూడా కలుగుతుంది. మొత్తానికి ఫస్టాఫ్‌లో పెద్దగా కొత్తదనం లేకుండా సాదాసీదాగా సాగుతుంది.అయితే సెకండాఫ్‌...

హ్యాపీ రాజ్ సినిమా ఫస్టాఫ్ చూస్తుంటే… ఇది పూర్తిగా సెకండాఫ్ కోసం బిల్డప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లౌడ్ మ్యూజిక్, అర్ధంపర్థం లేని కామెడీ, మాస్ ఎలిమెంట్స్, యూత్‌ను టార్గెట్ చేసే సీన్స్—ఇవన్నీ కలిపి రొటీన్ ఫీలింగ్ ఇస్తాయి. జీవీ ప్రకాశ్ వంటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి టెంప్లేట్ మూవీ చేశాడా? అనే సందేహం కూడా కలుగుతుంది. మొత్తానికి ఫస్టాఫ్‌లో పెద్దగా కొత్తదనం లేకుండా సాదాసీదాగా సాగుతుంది.


అయితే సెకండాఫ్‌లో తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను బలంగా ప్రెజెంట్ చేస్తూ ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథ పరంగా, కథనం పరంగా కూడా ఆడియన్స్ కి రెండు గంటలు బోర్ కొడుతోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జార్జ్ మార్యన్ వన్ మ్యాన్ షో చూపించాడు. జీవీ ప్రకాశ్ కూడా ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఒదిగిపోయాడు. అబ్బాస్ రీ ఎంట్రీ డీసెంట్‌గా ఉంది. 

టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ నేపథ్యంలో విజువల్స్‌ని బాగా చూపించింది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ఫస్టాఫ్‌ లో కొంచెం లౌడ్‌గా అనిపించినా, సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయడంలో సహాయపడింది. మొత్తంగా చూస్తే, రొటీన్‌ స్టఫ్ తో క్లైమాక్స్ పై మాత్రమే డైరెక్టర్ ఫోకస్ చేసాడని అనిపిస్తుంది. 

Mar 31, 2026 Telugu
5.0
out of 10
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన హ్యాపీ రాజ్ ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హ్యాపీ రాజ్‌ మూవీ టెక్నీకల్‌ గా చూస్తే.. జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద మైనస్‌. సౌండింగ్‌ విషయంలో చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంది. మధన్‌ క్రిస్టోఫర్‌ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సెల్వ ఆర్కే ఎడిటింగ్‌ ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలే...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన హ్యాపీ రాజ్ ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హ్యాపీ రాజ్‌ మూవీ టెక్నీకల్‌ గా చూస్తే.. జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద మైనస్‌. సౌండింగ్‌ విషయంలో చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంది. మధన్‌ క్రిస్టోఫర్‌ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సెల్వ ఆర్కే ఎడిటింగ్‌ ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు మరియా రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. సినిమా మొత్తం బాగా లేకపోవడంతో క్లైమాక్స్ హైలైట్ అయ్యింది. ఆకట్టుకుంది.


ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌, జార్జ్ మరియన్‌, అబ్బాస్‌, శ్రీ గౌరీ ప్రియా పెర్ఫార్మన్స్ పరంగా మంచి ప్లస్ అయ్యారు. అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌ సీన్లు మంచి ప్లస్ అయ్యాయి. కానీ సరైన కథనం, పాటలు, బీజీఎం, కామెడీ, సాగదీత, ఫస్టాఫ్‌, సెకండాఫ్‌ కూడా కొంచెం మైనస్ అయ్యాయి. తండ్రి గొప్పతనాన్ని, పల్లెటూరి వాళ్లల్లో ఉండే బ్యూటీని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ బాండింగ్‌ని ఆవిష్కరించే మూవీ ఇది. క్లైమాక్స్ మినహా మిగతా సీన్లు చాలా యావరేజ్ గా ఉన్నాయి.


Mar 31, 2026 Telugu

Happy Raj Movie Review

6.0
out of 10
జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హ్యాపీ రాజ్ మూవీ గురించి షార్ట్‌గా చెప్పాలంటే… “ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఎమోషన్” అనే ఫీలింగ్ ఇస్తుంది. ఫస్టాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసేవాళ్లకి ఒక్క డౌట్ వస్తుంది. “ఇది సెకండాఫ్ కోసం టైంపాస్ చేస్తున్నారా?” ల...

జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హ్యాపీ రాజ్ మూవీ గురించి షార్ట్‌గా చెప్పాలంటే… “ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఎమోషన్” అనే ఫీలింగ్ ఇస్తుంది. 

ఫస్టాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసేవాళ్లకి ఒక్క డౌట్ వస్తుంది. “ఇది సెకండాఫ్ కోసం టైంపాస్ చేస్తున్నారా?” లౌడ్ మ్యూజిక్, కొంచెం ఓవర్ కామెడీ, మాస్ & యూత్ టార్గెట్ కంటెంట్… ఇవన్నీ కలిపి చూసినప్పుడు జీవీ ప్రకాశ్ ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు? అనిపిస్తుంది. అంత రొటీన్ అనిపిస్తుంది. కానీ కానీ అసలు మ్యాజిక్ సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. 


డైరెక్టర్ మారియా రాజా ఇక్కడే గేమ్ మార్చేస్తాడు. ఫాదర్-సన్ ఎమోషన్స్‌ ని గుండెల్లో దిగేలా చూపించాడు. ముఖ్యంగా జార్జ్ మార్యన్ అయితే పూర్తిగా వన్ మ్యాన్ షో చివరి 30 నిమిషాలు అయితే… literally కంటతడి పెట్టించేలా ఉంటాయి. మూవీ అయిపోయే సరికి హార్ట్ హేవీగా బయటికి రావాల్సిందే. స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ గ్రిప్ ఇవే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్. జార్జ్ మార్యన్ — నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ తో పాటు జీవీ ప్రకాశ్ - మాస్ + ఎమోషన్ రెండింటిలోనూ సెటిల్ అయ్యాడు. అలాగే అబ్బాస్ — రీ ఎంట్రీ కూడా సాలిడ్ కిక్కిస్తుంది. ఇటు శ్రీ గౌరి ప్రియ - గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్‌లో కూడా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. 


Mar 31, 2026 Telugu
Why MRO?