Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

461
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 193-204 of 461 reviews
Clear all filters

Happy Raj Mpvie Review

5.0
out of 10
జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హ్యాపీ రాజ్. మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కువగా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. కానీ దర్శకుడు ఆడియన్స్ కి కథ గురించి సరిగా చెప్పడంలో తడబడ్డాడు. కొన్ని సీన్స్ చక్కగా అనిపించినా,...

జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హ్యాపీ రాజ్. మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కువగా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. కానీ దర్శకుడు ఆడియన్స్ కి కథ గురించి సరిగా చెప్పడంలో తడబడ్డాడు. కొన్ని సీన్స్ చక్కగా అనిపించినా, మరికొన్ని సీన్స్ ఇంకా బెటర్‌ గా తీసి ఉండాల్సింది. 


జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కొంతవరకు ఫర్వాలేదనిపిస్తుంది. మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ బాగుంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌ గా చూస్తే.. ‘హ్యాపీ రాజ్’ కొంతవరకు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. జి.వి. ప్రకాష్, శ్రీ గౌరి ప్రియ మరియు జార్జ్ మరియన్ తమ పర్ఫార్మెన్స్‌ లతో మెప్పిస్తారు. అలాగే అబ్బాస్ రోల్ కూడా బాగుంది. కానీ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ కాస్త విసిగించినా, సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఫామిలీ లవ్ డ్రామాలను ఇష్టపడేవారు హ్యాపీ రాజ్ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.


Mar 31, 2026 Telugu

Youth Movie Review

7.0
out of 10
యూత్ సినిమా గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఇది ఒక పక్కా యూత్ ని మెప్పించే అంశాలతో తెరకెక్కించే మూవీ. బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన కెన్ కరుణాస్ ప్రవీణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. అమాయకపు ప్రేమికుడిగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. నిడివి ఎక్కువ ఉన్న కథానాయికగా గంగవల్లి పాత్రలో అనీషా అనిల్ నటన నేచురల్ గా ఉంది. మిగతా హీరోయిన్లు మీనాక్షి దినేష్, ప్రియాన్సీ యాదవ్ కూ...

యూత్ సినిమా గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఇది ఒక పక్కా యూత్ ని మెప్పించే అంశాలతో తెరకెక్కించే మూవీ. బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన కెన్ కరుణాస్ ప్రవీణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. అమాయకపు ప్రేమికుడిగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. నిడివి ఎక్కువ ఉన్న కథానాయికగా గంగవల్లి పాత్రలో అనీషా అనిల్ నటన నేచురల్ గా ఉంది. మిగతా హీరోయిన్లు మీనాక్షి దినేష్, ప్రియాన్సీ యాదవ్ కూడా కనిపించిన కాసేపు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోకి తల్లిగా దేవదర్శిని తో పాటు తండ్రిగా నటించిన సూరజ్ పాత్రలు సినిమాకు హైలైట్. 


వికీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. స్కూల్ వాతావరణాన్ని, టీనేజ్ రంగుల ప్రపంచాన్ని చక్కగా చూపించారు. జీవీ ప్రకాశ్ సంగీతం కథకు తగ్గట్టు ఉంది. అయితే యూత్ నోట్లో నానే పాటలను అందించటంలో తను ఫెయిల్ అయ్యాడు. తెలుగు అనువాదం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. యూత్ నే కాదు పేరెంట్స్ ను సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి చివరి 20 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు.

Mar 30, 2026 Telugu

Youth Movie Review

Gulte

By Gulte

6.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా, డైరెక్టర్‌ గా తీసిన యూత్ సినిమా మిక్స్డ్ టాక్‌ తోనే నడుస్తోంది. సినిమా మొత్తంగా చూస్తే టార్గెట్ క్లియర్‌ గా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు ఉంది.కెన్ కరుణాస్ తన రోల్‌కు తగ్గట్టు నటించాడు. ఓవరాల్‌గా సినిమాను క్యారీ చేయడానికి బాగా ట్రై చేశాడు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు కూడా స్క్రీన్‌ పై క్యూట్‌ గా కనిపిస్తూ తమ పార్ట్ చేసేశారు. దేవదర్శ...

కెన్ కరుణాస్ హీరోగా, డైరెక్టర్‌ గా తీసిన యూత్ సినిమా మిక్స్డ్ టాక్‌ తోనే నడుస్తోంది. సినిమా మొత్తంగా చూస్తే టార్గెట్ క్లియర్‌ గా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు ఉంది.

కెన్ కరుణాస్ తన రోల్‌కు తగ్గట్టు నటించాడు. ఓవరాల్‌గా సినిమాను క్యారీ చేయడానికి బాగా ట్రై చేశాడు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు కూడా స్క్రీన్‌ పై క్యూట్‌ గా కనిపిస్తూ తమ పార్ట్ చేసేశారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు ఎక్స్‌పీరియన్స్ మాత్రం కొన్ని సీన్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.


కామెడీ ఈ సినిమా కి మెయిన్ బలం. చాలా చోట్ల వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్‌ తో వెళ్లి లైట్‌ గా నవ్వుకోవడానికి సరిపోతుంది. మ్యూజిక్ కూడా జీవీ ప్రకాష్ స్టైల్‌లో ఓకే అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే… కథలో కొత్తదనం లేదు. చాలా సీన్స్ ముందే ఊహించగలిగేలా ఉంటాయి. రొటీన్ ఫ్లో నుంచి బయటకు రావడం లేదు. ఓవరాల్‌ గా

ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకుని వెళ్తే… యూత్ ఓకే టైమ్ పాస్ అనుకుని చూడొచ్చు, కానీ కొత్తదనం కోసం వెతికితే… నిరాశ తప్పదు.

Mar 30, 2026 Telugu

Youth Movie Review

6.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా నటించిన యూత్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఇచ్చిన సంగీతం బాగుంది. తెలుగు రీమిక్స్ పాటలు ఉర్రూతలూగించాయి. వీకీ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకునేలా ఉంది. తెలుగు సినిమా చూసినట్టుగానే యూత్ ఉండడంతో అది సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌ దర్శకత్వం పరంగా చాలా బాగా కష్టపడ్డారు. తెలుగులో ఇలాంటి సినిమాలు రెగ్యూలర్‌గ...

కెన్ కరుణాస్ హీరోగా నటించిన యూత్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఇచ్చిన సంగీతం బాగుంది. తెలుగు రీమిక్స్ పాటలు ఉర్రూతలూగించాయి. వీకీ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకునేలా ఉంది. తెలుగు సినిమా చూసినట్టుగానే యూత్ ఉండడంతో అది సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌ దర్శకత్వం పరంగా చాలా బాగా కష్టపడ్డారు. 


తెలుగులో ఇలాంటి సినిమాలు రెగ్యూలర్‌గా వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కుర్రాళ్లకి మాత్రం టైమ్‌ పాస్‌ మూవీ అవుతుంది.  ఇప్పటికే నటుడిగా పలు సినిమాలతో మెప్పించగా ఇప్పుడు హీరోగా యూత్ సినిమాతో చాలా యాక్టివ్ గా నటించి అదరగొట్టాడు. ఓవరాల్ గా యూత్ సినిమా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. 

Mar 30, 2026 Telugu

Youth Movie Review

Tupaki

By Tupaki

6.0
out of 10
కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో నటించిన యూత్ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కొత్తవాడైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా బాగా ఇంప్రెస్ చేసాడు. అలాగే ముగ్గురు హీరోయిన్లలో అనీష్మా అనిల్ కుమార్ బాగా పెర్ఫామ్ చేసింది. క్యూట్ గా అనిపిస్తూనే చక్కగా హావభావాలు పలికించింది. మీనాక్షి.. ప్రియాంశి ఓకే అనిపిస్తారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో సూరజ్.. దేవదర్శిని చాలా బాగా నటించారు. వారి పాత్ర...

కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో నటించిన యూత్ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కొత్తవాడైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా బాగా ఇంప్రెస్ చేసాడు. అలాగే ముగ్గురు హీరోయిన్లలో అనీష్మా అనిల్ కుమార్ బాగా పెర్ఫామ్ చేసింది. క్యూట్ గా అనిపిస్తూనే చక్కగా హావభావాలు పలికించింది. మీనాక్షి.. ప్రియాంశి ఓకే అనిపిస్తారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో సూరజ్.. దేవదర్శిని చాలా బాగా నటించారు. వారి పాత్రలు.. నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. 


అలాగే సాంకేతికంగా జి.వి.ప్రకాష్ కుమార్ ‘ముత్త కలక్కి’ వైరల్ పాటతో ముందే ఈ సినిమాకు చాలా ప్రయోజనం చేకూర్చి పెట్టాడు. తెలుగులో ఆ పాట లిరిక్స్ అంత ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ.. బీట్ వల్ల తెరపై ఈ పాట బాగానే క్లిక్ అయింది. నిర్మాణ విలువలు సినిమాలకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. కెన్ తన టీంతో కలిసి యూత్ ను మెప్పించేలా ఒక సింపుల్ కథను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తెర మీద బాగా ప్రెజెంట్ చేశాడు. తన టేకింగ్ బాగుంది. వినోదంతో పాటు ఎమోషన్లనూ అతను బాగా హ్యాండిల్ చేశాడు.

Mar 30, 2026 Telugu

Youth Movie Review

6.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'యూత్'. కథ, కథనాలను కూడా తానే రాసుకుని డైరెక్ట్ చేయగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక హీరోతో పాటు హీరోయిన్లు మీనాక్షి, ప్రియాంషి, అనిష్మ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ ముగ్గురు గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా మెప్పించారు. కెన్ తండ్రిగా సూరజ్, తల్లిగా దేవదర్శిని ఎమోషనల్ కంటెంట్‌ను పండించారు. ఇక యూత్ సినిమ...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'యూత్'. కథ, కథనాలను కూడా తానే రాసుకుని డైరెక్ట్ చేయగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక హీరోతో పాటు హీరోయిన్లు మీనాక్షి, ప్రియాంషి, అనిష్మ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ ముగ్గురు గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా మెప్పించారు. కెన్ తండ్రిగా సూరజ్, తల్లిగా దేవదర్శిని ఎమోషనల్ కంటెంట్‌ను పండించారు. 


ఇక యూత్ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయేలా నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ హైలెట్. తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలుసుకొని ఆర్పీ పట్నాయక్, ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల పాటలను ఈ కథలో జొప్పించిన విధానం ఈ సినిమాను మరింత క్రేజీగా మార్చేసింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగం పనితీరు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఈ సినిమా పక్కాగా మాస్ ఎలిమెంట్స్‌తో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే కాకుండా టీనేజ్ లవ్ స్టోరి. సన్నివేశాలు నవ్వించడమే కాకుండా హృదయాన్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. అంచనా లేకుండా వెళ్లిన సంతృప్తిని అందిస్తుంది.

Mar 30, 2026 Telugu

Youth Movie Review

5.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా… యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కెన్ కరుణాస్ తన పాత్రకు తగ్గట్టు నేచురల్‌గా నటించాడు. కథను తన భుజాల మీద మోసే ప్రయత్నం చేశాడు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు హీరోయిన్లు క్యూట్‌గా కనిపిస్తూ పాత్రలకు...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా… యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కెన్ కరుణాస్ తన పాత్రకు తగ్గట్టు నేచురల్‌గా నటించాడు. కథను తన భుజాల మీద మోసే ప్రయత్నం చేశాడు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు హీరోయిన్లు క్యూట్‌గా కనిపిస్తూ పాత్రలకు న్యాయం చేశారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ నటుల అనుభవం వారి ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తుంది.


సినిమా టార్గెట్ ఆడియన్స్ యూత్. స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్‌ను ఎక్కువగా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సరదాగా నవ్వుకునేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. మ్యూజిక్ విషయంలో జీవీ ప్రకాష్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. కామెడీ ట్రాక్ కూడా చాలా వరకు వర్క్ అవుతుంది. అయితే కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు కనిపిస్తాయి. అవే మైనస్ పాయింట్. మొత్తంగా

కొత్తదనం ఆశించకుండా… లైట్‌గా ఎంజాయ్ చేయాలనుకునే వారికి యూత్ ఓకే అనిపించే సినిమా. ఫుల్ నవ్వుల కోసం కాదు… కానీ టైమ్ పాస్ కోసం వెళ్లొచ్చు.

Mar 30, 2026 Telugu

Youth Movie Review

6.0
out of 10
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ గా 'యూత్' కథకు తగ్గట్టు కెన్ కరుణాస్ నటించారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్... ముగ్గురు అమ్మాయిలు క్యూట్ గా ఉన్నారు. పాత్రలకు తగ్గట్టు నటించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు అనుభవం వాళ్ళ నటనలో కనిపించింది.&...

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ గా 'యూత్' కథకు తగ్గట్టు కెన్ కరుణాస్ నటించారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్... ముగ్గురు అమ్మాయిలు క్యూట్ గా ఉన్నారు. పాత్రలకు తగ్గట్టు నటించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు అనుభవం వాళ్ళ నటనలో కనిపించింది. 


ఇక ఈ సినిమా స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు... 'యూత్' అందరూ తమ స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా 'యూత్ 2026'. కెన్ కరునాస్ నటన, జీవీ ప్రకాష్ సంగీతం, కామెడీ బావున్నాయి. కథలో కాస్త రొటీన్ సీన్స్ ఉన్నాయంతే! అదొక్కటీ పక్కన పెడితే... కామెడీని ఎంజాయ్ చేయవచ్చు.

Mar 30, 2026 Telugu

Youth Movie Review

7.0
out of 10
తమిళంలో తెరకెక్కిన "యూత్" (Youth) సినిమా రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ వారం తెలుగులో విడుదలైంది. కెన్ కరుణాస్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా చూస్తే, ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. కెన్ కరుణాస్ నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. లవ్ స్టోరీ, కామెడీ, సంగీతం మరియు ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు కలిసొచ్చాయి. జివి ప్రకాష్ కుమార్ బ్యాక...

తమిళంలో తెరకెక్కిన "యూత్" (Youth) సినిమా రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ వారం తెలుగులో విడుదలైంది. కెన్ కరుణాస్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా చూస్తే, ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. కెన్ కరుణాస్ నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. 


లవ్ స్టోరీ, కామెడీ, సంగీతం మరియు ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు కలిసొచ్చాయి. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. కాకపోతే కథలో కొత్తదనం లేకపోవడం, స్లోగా సాగే సెకండాఫ్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా యూత్‌ఫుల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ ‘యూత్’ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది.

Mar 30, 2026 Telugu

Band Melam Movie Review

5.0
out of 10
బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే బావా మరదళ్ళు అయిన హీరో హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ బాగా చదివిన హీరోయిన్ పై తరగతులకు వెళుతుంది, హీరో మాత్రం ఫెయిల్ అయ్యి బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాడు…హీరోయిన్ కి హీరో చదువుకోకపోవడంతో… కోపం వచ్చి దూరం పెడుతుంది…మరి హీరో ఎలా తన మరది మనసును గెలుచుకునే ప్రయత్నం చేశాడు…ఇద్దరు కలిశారా లేదా అనేది ఓవరాల్ గా సినిమా కథ పాయి...

బ్యాండ్‌ మేళం సినిమాకు సంబంధించి… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే బావా మరదళ్ళు అయిన హీరో హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ బాగా చదివిన హీరోయిన్ పై తరగతులకు వెళుతుంది, హీరో మాత్రం ఫెయిల్ అయ్యి బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాడు…హీరోయిన్ కి హీరో చదువుకోకపోవడంతో… కోపం వచ్చి దూరం పెడుతుంది…మరి హీరో ఎలా తన మరది మనసును గెలుచుకునే ప్రయత్నం చేశాడు…ఇద్దరు కలిశారా లేదా అనేది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్…కథ పాయింట్ వింటుంటే అప్పట్లో వచ్చిన ఉయ్యాలా జంపాల లాంటి సినిమా గుర్తుకు రావడం ఖాయం.



కానీ అక్కడ ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే ఇక్కడ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేక పోయింది. ఎటు నుండి ఎటో పోతూ సాగే కథ డ్రాగ్ అవుతూ సీన్స్ రిపీట్ అవుతూ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే సీన్స్ ఓకే అనిపించినా కూడా.. ఓవరాల్ గా చాలా చాలా ఓపిక చేసుకుని చూస్తె తప్పితే యావరేజ్ లెవల్ లో అనిపించదు సినిమా…లీడ్ పెయిర్ బాగానే ఆకట్టుకున్నా కథలో అంత దమ్ము లేకపోవడంతో ఓవరాల్ గా పెద్దగా సినిమా ఇంప్రెస్ చేయలేదు. సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి.. ఓవరాల్ గా ముందే చెప్పినట్లు చాలా లో ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్లి చాలా ఓపికగా చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు


Mar 30, 2026 Telugu

Band Melam Movie Review

Gulte

By Gulte

4.0
out of 10
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.హర్ష రోషన్, శ్రీదేవి జంట ఓకే. కెమిస్ట్రీ వర్క్ అయినా… హీరో-హీరోయిన్ వైబ్ మాత్రం అంతగా రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్స్ కొంచెం పని చేస్తాయి. కామెడీ ట్రాక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కావాల్సింది. కానీ అదే పెద్ద మ...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.


హర్ష రోషన్, శ్రీదేవి జంట ఓకే. కెమిస్ట్రీ వర్క్ అయినా… హీరో-హీరోయిన్ వైబ్ మాత్రం అంతగా రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్స్ కొంచెం పని చేస్తాయి. కామెడీ ట్రాక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కావాల్సింది. కానీ అదే పెద్ద మైనస్ అయింది. చాలా సీన్లు ఫోర్స్ చేసినట్టుగా, అసహజంగా అనిపిస్తాయి. నవ్వులు రావాల్సిన చోట… చిరాకు వచ్చే పరిస్థితి.


సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే ఊహించేసుకునేలా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే హై మోమెంట్స్ ఉన్నా… అవి మూవీని సేవ్ చేయలేవు. టెక్నికల్‌గా చూసుకుంటే సౌండ్ డిజైన్ కొంచెం లౌడ్. చివర్లో పెట్టిన ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది.

Mar 30, 2026 Telugu
4.0
out of 10
హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో పెద్దగా మెప్పించలేదు. పాత్ర స్వభావం అలా రొటీన్ గా ఉండడం వల్లో ఏమో గాని, కొన్నిసార్లు అతని నటన హద్దులు దాటింది. రాజీ పాత్రలో శ్రీదేవి సహజంగా, పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ సినిమా ద్వితీయార్థంలో ఆమెకు...

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో పెద్దగా మెప్పించలేదు. పాత్ర స్వభావం అలా రొటీన్ గా ఉండడం వల్లో ఏమో గాని, కొన్నిసార్లు అతని నటన హద్దులు దాటింది. రాజీ పాత్రలో శ్రీదేవి సహజంగా, పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ సినిమా ద్వితీయార్థంలో ఆమెకు నటించే అవకాశం లభించలేదు. హీరో గ్యాంగ్‌లోని స్నేహితులందరూ కొత్త ముఖాలే మరియు వారి సన్నివేశాలు సరిగ్గా రాయబడలేదు. 


విజయ్ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదనిపించినా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. నేపథ్య సంగీతం సగటు కంటే తక్కువగా ఉంది మరియు ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ చిత్రంలో తెలంగాణ జానపద గీతాలలోని కొన్ని ప్రముఖ బాణీలను ఉపయోగించారు. 'బ్యాండ్ మేళం' నిర్మాణ విలువలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. 'బ్యాండ్ మేళం' అన్ని విభాగాల్లోనూ విఫలమైన చిత్రం, ఈ సినిమాను చూడకుండా వదిలేయవచ్చు.

Mar 30, 2026 Telugu
Why MRO?