Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

461
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 253-264 of 461 reviews
Clear all filters

Cheekatilo Movie Review

5.0
out of 10
సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్‌. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్‌ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్‌ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్‌ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్‌ చేయలేదు. తెలిసిన కథనే చెబుతున్నట్లు ఉంటుంది. చాలా సీన్స్‌ని ముందే ఊహించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్ మూడ్‌, టెన్షన్‌, అట్మా...

సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్‌. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్‌ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్‌ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్‌ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్‌ చేయలేదు. తెలిసిన కథనే చెబుతున్నట్లు ఉంటుంది. చాలా సీన్స్‌ని ముందే ఊహించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్ మూడ్‌, టెన్షన్‌, అట్మాస్ఫియర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇందులోని పాత్రలు, వరల్డ్‌ నేచురల్‌గా డెవలప్ అయి ఉంటే ఇంకా బాగుండేది. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా సీన్స్‌ని ఎలివేట్‌ చేసింది. రైటింగ్‌ వీక్‌గా ఉన్న ప్రతి సీన్‌లో బలంగా పని చేసింది. అయితే కేవలం మ్యూజిక్‌ మాత్రమే సినిమాని కాపాడలేదు. శోభితా ధూళిపాల యాక్టింగ్‌, సోషల్లీ రిలవెంట్‌ ఐడియా పక్కనపెడితే ‘చీకటిలో’.. ఓ యావరేజ్‌ అనే ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Feb 18, 2026 Telugu

Cheekatilo Movie Review

5.0
out of 10
సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే చాలా సినిమాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు అప్పటికే పలు సినిమాల్లో చూసినట్టు లేదా రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'చీకటిలో' సీరియల్ కిల్లర్ మోటివ్ డిఫరెంట్‌గా ఉంది. ఇన్నాళ్ళూ లైంగిక వేధింపులను ఒక కోణంలో చూపించారు. ఇందులో మరో కోణం తీసుకున్నారు. సినిమాకు అది డిఫరెంట్ ట...

సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే చాలా సినిమాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు అప్పటికే పలు సినిమాల్లో చూసినట్టు లేదా రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'చీకటిలో' సీరియల్ కిల్లర్ మోటివ్ డిఫరెంట్‌గా ఉంది. ఇన్నాళ్ళూ లైంగిక వేధింపులను ఒక కోణంలో చూపించారు. ఇందులో మరో కోణం తీసుకున్నారు. సినిమాకు అది డిఫరెంట్ టచ్. 'చీకటిలో' పాయింట్ కొత్తగా ఉంది. ఎండింగ్ ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా, ప్రతి ఒక్కరి ఊహలకు అతీతంగా వెళ్ళింది. చివరి వరకు హంతకుడు ఎవరు? అనేది ఊహించడం కష్టం. మంచి ఎండింగ్ రాసుకున్న దర్శక రచయితలు రొటీన్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేయడం మైనస్ పాయింట్. శోభితా ధూళిపాళ పాత్రను, వరుస హత్యలను పరిచయం చేసిన తీరు ఎటువంటి ఉత్కంఠకు గురి చేయదు. ఏ విధమైన ఆసక్తి కలిగించదు. సింపుల్ & స్ట్రైయిట్‌గా వెళుతుంది. ఓవరాల్ గా మూవీ ఒక్కసారి చూసే విధంగా ఉంది.

Feb 18, 2026 Telugu

Cheekatilo Movie Review

6.0
out of 10
శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో మూవీ శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఈ ‘చీకటిలో’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లో సెటప్ ఒకింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్య రోల్ లో శోభిత బాగా చేశారు. అంతే కాకుండా ఇందులో అంతర్లీనంగా ఉండే సందేశం కూడా ఆలోచిం...

శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో మూవీ శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఈ ‘చీకటిలో’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లో సెటప్ ఒకింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్య రోల్ లో శోభిత బాగా చేశారు. అంతే కాకుండా ఇందులో అంతర్లీనంగా ఉండే సందేశం కూడా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఈ క్రమంలో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన మూడ్ కొంచెం మిస్ అయ్యింది. ఇంకా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్ట్ గా సాగే సన్నివేశాలు ఇందులో జోడించి ఉండాల్సింది. సో చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది.

Feb 18, 2026 Telugu

Bison Movie Review

A

By AP7AM

6.0
out of 10
నిజజీవిత కథతో, రూటెడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన సీరియస్‌ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్‌ అంశాలు లేకుండా రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్‌ కథకు కథలో సోల్‌ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్‌ వాల్యూస్‌ యాడ్‌ చేసి ఉంటే 'బైసన్‌' అందరిని ఆకట్టుకునే అవకాశం ఉండేది. సినిమాలో కథ కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప...

నిజజీవిత కథతో, రూటెడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన సీరియస్‌ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్‌ అంశాలు లేకుండా రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్‌ కథకు కథలో సోల్‌ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్‌ వాల్యూస్‌ యాడ్‌ చేసి ఉంటే 'బైసన్‌' అందరిని ఆకట్టుకునే అవకాశం ఉండేది. సినిమాలో కథ కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కుటుంబ నేపథ్యంతో సాగిన కథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. పాటలు మధురంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ మంచి స్థాయిలో ఉన్నాయి. కొంతవరకు కథ ముందే ఊహించగలిగినదే అయినా, ప్రదర్శన కారణంగా సినిమా ఆకట్టుకుంటుంది.

Feb 16, 2026 Telugu

Bison Movie Review

F

By FilmyFocus

6.0
out of 10
చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివిట...

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివిటీ, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండడంతో.. ఈ చిత్రం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే.. పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు అనే చెప్పాలి. అయితే.. ధృవ్ విక్రమ్, పశుపతిల మాస్టర్ క్లాస్ యాక్టింగ్ & మారి సెల్వరాజ్ టేకింగ్ ను ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే!

Feb 16, 2026 Telugu

Bison Movie Review

Tupaki

By Tupaki

6.0
out of 10
బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో అద...

బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయింది. సాధారణమైన పాత్రలు.. సన్నివేశాలతో తన మీద ఉన్న అంచనాలను అతను అందుకోలేకపోయాడు. కుల కోణాన్ని అతను ఈసారి సరిగా ఎలివేట్ చేయకపోవడమే సినిమాకు సమస్యగా మారింది

Feb 16, 2026 Telugu

Bison Movie Review

6.0
out of 10
బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్‌. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశంగా...

బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్‌. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆద్యంతం కట్టిపడేసే కథనం, ఆలోచింపజేసే కథ, స్పోర్ట్స్, దేశభక్తిని రగిలించే అంశాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. హై ఎండ్ థియేట్రికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు ఉన్న చక్కటి అనుభూతిని పంచే మూవీ బైసన్. ఈ వారం థియేటర్‌లో చూడటానికి, సినిమాటిక్ అనుభూతిని పొందడానికి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు చక్కటి ఆప్షన్. డోంట్ మిస్ బైసన్ దిస్ వీక్.

Feb 16, 2026 Telugu

Bison Movie Review

6.0
out of 10
మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావాల్సిన కంటెంట్ కన్నా, సమాజంలో జరిగే అసమానతలపై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మూవీ ఆడియన్స్ కి అంతగా రీచ్ కా...

మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావాల్సిన కంటెంట్ కన్నా, సమాజంలో జరిగే అసమానతలపై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మూవీ ఆడియన్స్ కి అంతగా రీచ్ కాదు. ఓవరాల్‌గా చూస్తే, ‘బైసన్’ చిత్రం అనచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. ధృవ్ విక్రమ్ డెడికేషన్, పశుపతి ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, మారి సెల్వరాజ్ గతచిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. సాగదీసే రన్‌టైమ్, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. స్పోర్ట్స్ డ్రామాలతో పాటు సామాజిక అంశాలు ఉన్న చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

Feb 10, 2026 Telugu

K - Ramp Movie Review

F

By FilmyFocus

6.0
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సి...

కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సింగ్ గా లేదు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే.. ఇబ్బందిపట్టే హాస్యం కూడా ఉంది. ఇక యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. టెక్నికల్ గా మూవీ టీం ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోకుండా మూవీ చూస్తే బెటర్. కథలో కొత్తదనం మాత్రం ఉండదు.

Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

6.0
out of 10
కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శ...

కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శకుడు. వన్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. కిరణ్ అబ్బవరం స్టైల్ లు కరెక్ట్ గా సూట్ అయ్యాయి. మూవీ స్టార్ట్ అయిన మొదటి 15నిముషాల తర్వాత కథ కాలేజ్ కు షిఫ్ట్ అవుతుంది. తర్వాత అంతా ప్రెడిక్టబిల్ గానే ఉంటుంది. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడడం. ఆమెను పడేయడం కోసం తిప్పలు పడడం. ఆ తర్వాత హీరోయిన్ కు ఉన్న సమస్య బయటపడడం.. దాని కోసం హీరో పడే పాట్లు , టెన్షన్స్ ఇవన్నీ ఫన్నీ వే లోనే చూపించారు. అలా మొదటి హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఆఫ్ లో కథ కొంచెం సీరియస్ గా సాగి హీరో తన తండ్రి గురించి తెలుసుకోవడం.. లాంటివి జరుగుతాయి. ఓవరాల్ గా నవ్వుకోవడానికి కే - ర్యాంప్ మంచి ఛాయస్.

Feb 10, 2026 Telugu

K - Ramp Movie Review

6.0
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్ర...

కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్రదర్శించాడు. దీపావళీ పండుగ సీజన్‌లో కుటంబ సమేతంగా చూసే చిత్రమే కాకుండా మంచి వినోదాన్ని ఆస్వాదించేలా మూవీని రూపొందించారు. ఈ పండుగ సెలవుల్లో ఈ సినిమాను మీ లిస్టులో ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు. మీరు పెట్టే టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ మూవీ ఈ కె ర్యాంప్. కాకపోతే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీ చుస్తే బెటర్.

Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

6.0
out of 10
కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే...

కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే కో ఇన్సిడెంట్ కథే ‘K ర్యాంప్. కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా, ల్యాగ్ ఫీల్ ఉన్నా, ఎక్స్పెక్ట్ చేసే కథనమే ఉన్నా, ఓవరాల్ గా క్లైమాక్స్ వరకు దాదాపుగా మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ‘కే ర్యాంప్’ అనిపించకపోయినా.. నిరాశపరచలేదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ కే ర్యాంప్‌కి బాగా సెట్ అయ్యింది. కేరళ బ్యూటీని కెమెరాలో బంధించారు. ఓవరాల్ గా నవ్వుకోవడానికి మాత్రమే ఒకసారి ట్రై చేయొచ్చు.

Feb 10, 2026 Telugu
Why MRO?