Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ధనుష్ నుంచి మరో సినిమా వస్తే ఎక్స్ పెక్టేషన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అదే ‘కర’. ట్రైలర్ చూసినప్పుడే ఇది రొటీన్ మాస్ సినిమా కాదని క్లియర్… కానీ థియేటర్‌లోకి వెళ్లాక ఫీల్ ఏమిటి అంటే… “ఇది స్లో కుక్డ్ మూవీ బాస్!” ముందుగా ధనుష్ గురించి మాట్లాడాలి… కరసామి పాత్రలో మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. ఎక్కడా ఓవర్ చేయకుండా, చాలా రియలిస్టిక్‌గా క్యారీ చేశాడు. హీరోయిన్ Mamitha Baiju కూడా చాలా నేచురల్‌గా నటించింది… ఎక్కడా యాక్టింగ్ చేస్తున్న ఫీల్ రావడం లేదు.
టెక్నికల్‌గా సినిమా బాగానే ఉంది. 90’s వైబ్ ను సెటప్ చేసిన విధానం సూపర్. G. V. Prakash Kumar ఇచ్చిన BGM కొన్ని సీన్స్ లో బాగా ఎలివేట్ చేసింది… కానీ songs మాత్రం “ఓకే ఓకే” అన్నట్టే..
ఇప్పుడు అసలు విషయం… సినిమా పేస్! First half ఓకే అనిపిస్తుంది… కానీ second half లో కొంచెం లాగ్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు లాంటి సీరియస్ పాయింట్ టచ్ చేసినా… narration కొంచెం tight గా ఉంటే ఇంకో లెవెల్ ఉండేది. ఓవరాల్ గా “కర” అనేది మాస్ మసాలా కాదు కాస్త ఓపికతో చూడాల్సిన రియలిస్టిక్ డ్రామా. దాంతో పాటు అంచనాలు తగ్గించుకొని చూస్తే నచ్చొచ్చు.
వాలా 2 సినిమా విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏమీ లేదు. కానీ ఉన్న చిన్న లైఫ్ స్టోరీస్ ని బాగానే కనెక్ట్ అయ్యేలా చూపించారు. హషీర్, అలన్, అజిన్, వినాయక్ – వీళ్లందరూ కొత్త వాళ్లే కానీ, యాక్టింగ్ విషయంలో మాత్రం సర్ప్రైజ్ ఇస్తారు. ఫేక్ ఫీలింగ్ లేదు… నేచురల్ వైబ్స్ ఉంటాయి. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ అంటే ఫుల్ టైం పాస్. ఫ్రెండ్స్, ఫన్, కామెడీ… థియేటర్ లో స్మైల్ తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయి. కానీ… సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా కాస్త స్లో అవుతుంది.
అక్కడక్కడా లాగ్ అనిపించే ఫీల్ ఉంటుంది. అయినా క్లైమాక్స్ మాత్రం గేమ్ ఛేంజర్. ఫ్యామిలీ ఎమోషన్స్, రియలైజేషన్… మిడిల్ క్లాస్ వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. టెక్నికల్‌గా ఓకే… మ్యూజిక్, విజువల్స్ డీసెంట్. కానీ డబ్బింగ్ ఇంకాస్త బెటర్ అయితే ఫీల్ డబుల్ అయ్యేది. ఓవరాల్ గా “వాలా 2” అంటే హై వోల్టేజ్ సినిమా కాదు. కానీ ఫ్రెండ్స్ తో కూర్చుని కూల్ గా చూడొచ్చు. లైట్ ఎక్స్‌పెక్టేషన్స్ తో వెళ్తే… మంచి ఫీల్ గుడ్ మూవీగా వాలా 2 ని థియేటర్లో ఎక్స్పీరెన్స్ చేయొచ్చు.
కొన్ని సినిమాలు చూస్తుంటే… అవి కథలు కాకుండా మన జీవితాలే అన్న భావన కలుగుతుంది. అలాంటి ఫీల్ ఇచ్చే సినిమాల్లో తాజాగా చేరింది ‘వాలా 2’. మూవీలో అందరూ పరిచయం లేని వాళ్లే అయినా వాళ్ళు మాములుగా నటించలేదు… జీవించారు అనిపించేంత నేచురల్‌గా తమ పాత్రలను మోశారు. దర్శకుడు సావిన్ SA కథను ఎక్కడా అతి చేయకుండా, చిన్న చిన్న క్షణాల ద్వారా పెద్ద భావాలను చెప్పాడు.
సినిమా మొత్తం ఒక స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు, ఫ్రెండ్షిప్, యూత్ ఫ్రీడమ్… ఇవన్నీ లైట్‌గా తీసుకెళ్తుంటే, సెకండ్ హాఫ్‌లో అదే జీవితానికి సంబంధించిన బాధ్యతలు, దూరాలు, మానసిక మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్… ఎలాంటి హంగులు లేకుండా, మనసును నెమ్మదిగా తాకేలా మలిచారు. ఓవరాల్ గా పేర్లేదు అనిపించేలా ఉంటుంది. కాకపోతే తెలుగు డబ్బింగ్‌లో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే అనుభూతి మరింత పెరిగేది. ముఖ్యంగా కొన్ని ప్రాస కోసం చెప్పిన డైలాగులు అంతగా సెట్ అవలేదు. ఇదంతా పక్కన బెడితే ఓవరాల్ గా వాలా 2 సినిమాని డీసెంట్ వాచబుల్ మూవీగా ఎంజాయ్ చేయొచ్చు.
మలయాళంలో బ్లాక్‌బస్టర్ కొట్టిన “వాఘా 2” ఇప్పుడు తెలుగులో “వాలా 2”గా వచ్చేసింది. సో… ఈ సినిమా హైప్‌కి తగ్గట్టు ఉందా? లేక జస్ట్ ఓకేనా? చూద్దాం! మొదటగా చెప్పాలంటే… స్టోరీ చాలా సింపుల్. కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొత్త వాళ్లు అయినా హషీర్, అలన్, వినాయక్, అజిన్ ఈ గ్యాంగ్ మొత్తం స్క్రీన్ మీద నేచురల్ గా ఫీల్ ఇచ్చారు. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు. జస్ట్ వాళ్ల లైఫ్ ని చూస్తున్నట్టు ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ మోడ్! కాలేజ్ ఫ్రెండ్స్ తో చేసే టైం పాస్, ఫన్ మోమెంట్స్, చిన్న చిన్న కామెడీ సీన్స్ – ఇవన్నీ బాగా వర్క్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్‌కి వెళ్లేసరికి టోన్ కొంచెం మారుతుంది. ఫన్‌తో పాటు స్ట్రగుల్స్, ఎమోషన్స్ కూడా చూపించారు. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా… క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేస్తుంది. టెక్నికల్ గా చూసినా… మ్యూజిక్ డీసెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. పెద్దగా కంప్లైంట్స్ లేవు. ఫైనల్‌గా చెప్పాలంటే… “వాలా 2” అనేది ఫ్రెండ్స్‌తో కూర్చొని చూసే ఫీల్ గుడ్ మూవీ. మీ కాలేజ్ డేస్ గుర్తొచ్చేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ తో తాపీగా థియేటర్లకు వెళ్లిపోవచ్చు.
Kantara Chapter 1 Movie Review
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార: చాప్టర్-1… మళ్లీ అదే వరల్డ్‌లోకి తీసుకెళ్తూ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ్నుంచే కథ పికప్ అవ్వడం మంచి ప్లస్.
స్టోరీ సింపుల్ అయినా… ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్! 🎯
హీరోగా కంటే డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి చేసిన వర్క్ నిజంగా హైలైట్. ప్రతి సీన్‌లో ఆయన విజన్ క్లియర్‌గా కనిపిస్తుంది.
టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్
అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ & BGM – goosebumps level
సినిమాటోగ్రఫీ, విజువల్స్ – అద్భుతం
ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది
డివోషనల్ టచ్, ఫోక్ ఎలిమెంట్స్ కలిపి సినిమా మంచి ఇమర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే major highlight
రిషబ్‌తో పాటు రుక్మణి వసంత్ కూడా అక్కడ strong impact ఇస్తుంది.
ఎండింగ్ మాత్రం… next part కోసం wait చేయించేలా hook పెడుతుంది!
ThimmarajuPalli TV Movie Review
By Thyview
ఈ వారం మన ముందుకొచ్చిన తిమ్మరాజుపల్లి TV… basically ఒక నాస్టాల్జిక్ విలేజ్ డ్రామా! ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చిన్నదే. కానీ డైరెక్టర్ వి. మునిరాజు దాన్ని 90స్ ఫీల్‌తో బానే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడే కాస్త ఇష్యూ మొదలవుతుంది.
మెయిన్ స్టోరీకి వెళ్లడానికి టైమ్ తీసుకుంటుంది… కొంచెం స్లోగా అనిపిస్తుంది. పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల “ఏమవుతోంది?” అనే ఫీల్ వస్తుంది. కానీ… పల్లెటూరి ఎమోషన్స్ మాత్రం neatగా work అవుతాయి
అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే… Second half!
టీవీ చుట్టూ తిరిగే మిస్టరీ angle, “ఈ తప్పు ఎవరు చేశారు?” అన్న థ్రాక్‌తో కథ కాస్త ఇంట్రెస్టింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే.. వంశీకాంత్ రేఖన BGM – scenes కి soul ఇచ్చింది. ఆర్ట్ వర్క్ (సుధీర్ మాచర్ల) – 90s village vibes on point, తో పాటు అక్షయ్ రామ్ కెమెరా – very natural & pleasant visuals గా అనిపించాయి.మునిరాజు simple storyని emotionalగా చెప్పాడు. పెద్దగా high moments లేకపోయినా, grounded narration తో connect అయ్యేలా ట్రై చేశాడు. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి ఒక soft, nostalgic village drama. ఇక క్లైమాక్స్ లో ఒక మంచి సీన్ రివీల్ తో సీన్ ఎండ్ అవుతుంది. అండ్ కొత్త ఆడియన్స్ తో చేయడం వల్ల ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇక వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టేసారు.
Thimmaraju Palli TV Movie Review
కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ ఇష్టపడే వాళ్లకు తిమ్మరాజు పల్లి టివి బాగానే నచ్చుతుందని అనిపిస్తుంది.
అలాగే డైరెక్టర్ మునిరాజు ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టే ఛాన్స్ బానే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మా రేటింగ్ 3.7 ఫైనల్ గా తిమ్మరాజుపల్లి టివి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... టివి కి సంబంధించి అయితే బానే ఆడింది, కానీ థియేటర్లలో ఎంతవరకు ఆడుతుందో అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే ఎన్నో చెత్త ఏ రేటెడ్ సినిమాల మధ్య ఇలాంటి డీసెంట్ థ్రిల్లర్ మూవీస్ ఉంటె ఆ మాత్రం హిట్ అవ్వాల్సిన అవసరం ఈ సినిమాలకుంది. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ ని అయితే బానే ఆకట్టుకుంటుంది.
అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.
సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్ వస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అక్కడే సినిమా కాస్త దారి తప్పింది బాస్! తిరువీర్ మాత్రం సినిమా మొత్తాన్ని మోసేశాడు. కానీ వేరే వాళ్ళు పెద్దగా హెల్ప్ అవలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే…
పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ కాస్త బోర్… కానీ క్లైమాక్స్ ఎమోషన్ కొంతమందికి connect అవుతుంది. ఓవరాల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చెప్పే పాయింట్, క్లైమాక్స్ బాగుంటాయి. కానీ మూవీ ఓవరాల్ గా అంతగా ఎక్కదు. సో అదండీ పాయింట్.
ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి…
ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… సెకండాఫ్! పేస్ స్లో అవుతుంది… కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కాస్త అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ ఇస్తాయి. ఇంకొంచెం క్రిస్ప్‌గా రాస్తే సినిమా లెవెల్ ఇంకాస్త పెరిగేది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…
తిరువీర్ literally carries the film!
అతని ఎమోషన్స్, కళ్లతో చేసే యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.
పాయల్ రాధాకృష్ణ కూడా బుజ్జమ్మ పాత్రలో క్యూట్‌గా, జెన్యూన్‌గా కనిపిస్తుంది.
టెక్నికల్‌గా కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, సురేష్ బొబ్బిలి BGM సీన్స్ కి good support. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ – గోదావరి visuals super fresh ఫైనల్‌గా… పాపం ప్రతాప్ పెద్ద సినిమా కాదు… కానీ ఒక సింపుల్, హార్ట్‌ఫెల్ట్ విలేజ్ డ్రామా. కొన్ని ఫ్లాజ్ ఉన్నా… క్లైమాక్స్ ఎమోషన్ connect అయితే, ఓవరాల్ గా One-time watch for its feel-good vibes..
లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైరెక్టర్ కే క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్ ని తీసుకుని దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోవడం పెద్ద మైనస్. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు.
హీరో హీరోయిన్స్ Pradeep Ranganathan, Krithi Shetty పెర్ఫార్మన్స్ బానే ఉన్నా, న్యాచురాలిటీ మిస్ అయింది. మ్యూజిక్, విజువల్స్—all decent. కానీ కంటెంట్ వీక్ అయితే ఏం చేయలేము. బట్ స్టోరీ పాయింట్ బాగుంది. ఆ విషయంలో సో ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ సినిమా రెగ్యులర్ మూవీ లవర్స్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు గాని, ఫ్రెష్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్లకి సినిమా నచ్చుతుంది.
LIK (Love Insurance Movie Review)
లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది. కొన్నిచోట్ల ఫన్, కొన్నిచోట్ల కాన్సెప్ట్—all mix అయి ఓకే ఫీల్ ఇస్తుంది.
స్టోరీ ఎటు వెళ్తుందో కూడా క్లారిటీ ఉండదు. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు.
ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… Pradeep Ranganathan తన స్టైల్‌లో బాగానే చేశాడు. Krithi Shetty క్యూట్ గా కనిపించింది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్ గా ఉండాల్సిన చోట కామెడీగా మారిపోవడం కొంచెం మైనస్. టెక్నికల్ గా సినిమా ఓకే—మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో అవి పూర్తిగా హెల్ప్ చేయలేకపోయాయి. “లైక్” సినిమా… ఐడియా పరంగా స్ట్రాంగ్, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వీక్. ఫస్ట్ హాఫ్ ఓకే… సెకండ్ హాఫ్ డ్రాప్… మొత్తానికి యావరేజ్ కంటే కాస్త తక్కువ అనిపించే సినిమా. ఒక ముక్కలో చెప్పాలంటే సొసైటీ లో మొబైల్ పిచ్చోళ్ళు ఉన్నారు, కానీ మొబైల్ ని ఇలా వాడేవాళ్లు లేరు కాబట్టి, LIK సినిమా కి ఇచ్చే రేటింగ్ 2.5.
“లైక్ (LIK)” గురించి స్ట్రైట్ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్ డ్రాప్, హీరో మొబైల్ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. కథ ఎటు వెళ్తుందో క్లారిటీ లేకుండా సాగిపోతుంది. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ కావు.
Pradeep Ranganathan తన స్టైల్‌లో ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. Krithi Shetty క్యూట్‌గా కనిపిస్తుంది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా సినిమా ఓకే. మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌గా లేకపోతే ఇవి పెద్దగా హెల్ప్ అవ్వవు. ఓవరాల్ గా ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీతో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకోవడం తప్ప ఈ మూవీ కి న్యాయం చేయలేము. అలా న్యాయం చేద్దమని చూస్తే ప్రేక్షకుడు అన్యాయం అయిపోతాడేమో.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers