Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
88
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 109-120 of 233 reviews
Clear all filters

Deewana Movie Review

7.0
out of 10
పలు వెబ్ సిరీస్ లు, శుభం, కల్కి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు హర్షిత్ రెడ్డి. మొదటిసారి సినిమా హీరోగా సోలో మెయిన్ లీడ్ చేసాడు. దీవానా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డి, బేబీ.. లాంటి ప్రేమ కథ అని అంతా అనుకున్నారు కానీ కాదు అని సినిమా చూసాక అర్ధమవుతుంది. ప్రమోషన్స్ మాత్రం బాగానే చేసారు. డైరెక్టర్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో హైప్ ఇచ్చాడు.ఫస్ట్ హాఫ్ హీరో, ఫ్రెండ్స్ తో తిరగడాలు.. రొటీ...

పలు వెబ్ సిరీస్ లు, శుభం, కల్కి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు హర్షిత్ రెడ్డి. మొదటిసారి సినిమా హీరోగా సోలో మెయిన్ లీడ్ చేసాడు. దీవానా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డి, బేబీ.. లాంటి ప్రేమ కథ అని అంతా అనుకున్నారు కానీ కాదు అని సినిమా చూసాక అర్ధమవుతుంది. ప్రమోషన్స్ మాత్రం బాగానే చేసారు. డైరెక్టర్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో హైప్ ఇచ్చాడు.


ఫస్ట్ హాఫ్ హీరో, ఫ్రెండ్స్ తో తిరగడాలు.. రొటీన్ అన్ని సినిమాల్లాగే ఉంటుంది. హీరోయిన్ ని చూడటం, ఆమె వెంట పడటం కొంచెం క్యూట్ గా, కామెడీగా చూపించారు. అక్కడక్కడా పేరెంట్స్ తో హీరో ఎలా ఉంటాడు, హీరో గొడవలతో సాగదీశారు. ఇంటర్వెల్ ముందు హీరోని పోలీసులు తీసుకెళ్లే సీన్, ఆ తర్వాత జరిగే సీన్ రొటీన్ సీన్స్ అయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా సాగుతాయి. ఇంటర్వెల్ కి ఆడియన్స్ కి హీరోయిన్ నుంచి అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. 


ఇలాంటి కథలు చాలా వచ్చినా ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఎంగేజింగ్ గా మంచి లవ్ స్టోరీని రాసుకొని ఎమోషనల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై క్వాలిటీ అవుట్ పుట్ కనిపిస్తుంది. మొత్తంగా ‘దీవానా’ సినిమా ఆసక్తికర ఇంటర్వెల్ బ్యాంగ్ తో తెరకెక్కిన ఓ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

Jun 26, 2026 Telugu

Deewana Movie Review

7.0
out of 10
ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తిని కలిగించదు. సాధారణ యూత్ సినిమాల్లాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్‌గా సాగుతుంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ ఫైట్ అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే అనుకోని మలుపు ప్రేక్షకులను ఆశ...

ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తిని కలిగించదు. సాధారణ యూత్ సినిమాల్లాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్‌గా సాగుతుంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ ఫైట్ అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే అనుకోని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడి నుంచి సినిమాపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. 


సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను స్నేహితురాలితో పంచుకునే సీన్ గుండెను హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ మలుపు, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అయితే హీరో పోలీస్ ట్రైనింగ్, ఒకే అటెంప్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లాంటివి సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టుకోవాలి. వాటిలో లాజిక్స్ వెతకకూడదు. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే ఉంది. ఓవరాల్‌గా దీవానా.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్.. గట్టిగా ఎక్కేస్తుంది..!


Jun 26, 2026 Telugu

Deewana Movie Review

7.0
out of 10
హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్‌ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమకథ నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ ట్విస్ట్‌ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్‌ లో ఫ్రెండ్‌ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటాయి. నరేష్–మున్నా మధ్య సన్నివేశాలు,...

హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్‌ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమకథ నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ ట్విస్ట్‌ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్‌ లో ఫ్రెండ్‌ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటాయి. 


నరేష్–మున్నా మధ్య సన్నివేశాలు, క్లైమాక్స్ భావోద్వేగంగా మెప్పిస్తాయి. మొత్తంగా, నిజాయితీగా చెప్పిన హృద్యమైన ప్రేమకథగా ఈ దీవానా మూవీ నిలుస్తుంది. కాకపోతే కొత్తదనం ఉండదు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ దీవానా గాడు నవ్విస్తూనే ఆలోచింపచేసి, కన్నీరు పెట్టించి పంపిస్తాడు. 

Jun 26, 2026 Telugu

Deewana Movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథ నెమ్మదిగా హృదయానికి దగ్గరవుతుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్స్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను బయటపెట్టే సన్నివేశం, పోలీస్ స్టేషన్‌లో నరేష్ నటన, తండ్రి ప్రేమ గురించి వచ్...

ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.


ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథ నెమ్మదిగా హృదయానికి దగ్గరవుతుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్స్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను బయటపెట్టే సన్నివేశం, పోలీస్ స్టేషన్‌లో నరేష్ నటన, తండ్రి ప్రేమ గురించి వచ్చే డైలాగ్స్... ఒక్కో సీన్ నేరుగా హృదయాన్ని తాకుతుంది. కొన్ని చోట్ల కళ్లలో నీళ్లు తిరగడం గ్యారంటీ.


ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ అయితే థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మనసులోనే తిరుగుతుంటుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ డ్రామా లేకుండా, సహజమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి కథను నడిపించిన తీరు ప్రశంసనీయం.


మాస్ ఎలిమెంట్స్, ఓవర్ యాక్షన్ కోసం వెతికేవారికి కాకుండా, మనసుతో సినిమా చూసేవారికి ‘దీవాన’ మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రేమ కథల్లో కొత్తదనం, ఎమోషనల్ డెప్త్ కోరుకునే యూత్‌కు ఇది కనెక్ట్ అయ్యే సినిమా.


Jun 25, 2026 Telugu
90స్‌ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగా...

90స్‌ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది.


ఇప్పుడు దర్శకుడు కమల్ తేజ కూడా కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రకు వడ్డే నవీన్ బాగానే సెట్ అయ్యారు. అయితే మెజారిటీ సీన్స్ స్లో నెరేషన్ వల్ల అంతగా ఎక్కలేదు. దర్శకుడు కమల్ తేజ నార్ల రొటీన్ కథను ఎంచుకున్నాడు. వడ్డే నవీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌ గా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. నిజాయితీ గల కానిస్టేబుల్ కథ..!

Jun 23, 2026 Telugu
4.0
out of 10
వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి త...

వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.


అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి తగ్గట్టు రోల్స్ కి కూడా కనెక్ట్ అయ్యేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత లేదు. మ్యూజిక్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేస్తే ఇంకాస్త క్రిస్పీగా ఉండేది. ఓవరాల్ గా సినిమా అంత ఇంప్రెస్ చేయదు.


Jun 23, 2026 Telugu

Maa Inti Bangaram movie Review

5.0
out of 10
వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే. అయితే ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ...

వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే. 


అయితే ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ రాసాడు రాజ్. తన స్టార్ పవర్ తో చాలావరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత. దర్శకురాలు నందిని రెడ్డి స్క్రీన్ ప్లే పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. కానీ తన వరకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసారు. ఓవరాల్ గా మా ఇంటి బంగారం.. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. సమంత కోసం..!

Jun 22, 2026 Telugu
6.0
out of 10
కథ ప రంగా చూస్తే ఇది కొత్త టెంప్లేట్ కాదు. గతం నుంచి తప్పించుకుని కొత్త జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షోలా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ సినిమాకు ప్రధాన బలం.కథలో పెద్దగా సర్‌ప్రైజ్‌లు లేకపోయినా, సమంత ఎంటర్‌టైన్ చేస్తుంది. దర్శకుడు కథ కంటే సమంతను ఎలివేట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. మాస్...

కథ ప రంగా చూస్తే ఇది కొత్త టెంప్లేట్ కాదు. గతం నుంచి తప్పించుకుని కొత్త జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షోలా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ సినిమాకు ప్రధాన బలం.


కథలో పెద్దగా సర్‌ప్రైజ్‌లు లేకపోయినా, సమంత ఎంటర్‌టైన్ చేస్తుంది. దర్శకుడు కథ కంటే సమంతను ఎలివేట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. మాస్ యాక్షన్, షీరోయిజం ఇష్టపడే వారికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ వెర్డిక్ట్: కథ రొటీన్... కానీ సమంత మార్క్ యాక్షన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్. 

Jun 22, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
తెలుగు ప్రేక్షకులకు హీరో లేదా హీరోయిన్ గతం చుట్టూ తిరిగే కథలు కొత్త కాదు. గతాన్ని వెనక్కి నెట్టి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రధాన పాత్రను పాత జీవితంలోని వ్యక్తులు, సంఘటనలు మళ్లీ వెంబడించడం అనేది చాలా సినిమాల్లో కనిపించే అంశం. ఆ గతం కారణంగా కొత్త జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నారు? తమకు ప్రియమైన వారిని ఎలా కాపాడుకున్నారు? అనే కథాంశంతో మా ఇంటి బంగారం మూవీ తెరకెక్కింది.అయితే సిని...

తెలుగు ప్రేక్షకులకు హీరో లేదా హీరోయిన్ గతం చుట్టూ తిరిగే కథలు కొత్త కాదు. గతాన్ని వెనక్కి నెట్టి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రధాన పాత్రను పాత జీవితంలోని వ్యక్తులు, సంఘటనలు మళ్లీ వెంబడించడం అనేది చాలా సినిమాల్లో కనిపించే అంశం. ఆ గతం కారణంగా కొత్త జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నారు? తమకు ప్రియమైన వారిని ఎలా కాపాడుకున్నారు? అనే కథాంశంతో మా ఇంటి బంగారం మూవీ తెరకెక్కింది.


అయితే సినిమాలో కథ కంటే ఎక్కువగా ఆకట్టుకునేది సమంత నటన మరియు ఆమె యాక్షన్ ప్రెజెన్స్. తెరపై ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథ పరంగా చూస్తే పెద్దగా కొత్తదనం లేకపోయినా, సమంత స్క్రీన్ ప్రెజెన్స్ దానికి బలంగా నిలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కథను మరింత బలంగా రాసుకుని ఉంటె, సినిమా రేంజ్ మరోలా ఉండేది. 

Jun 22, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

6.0
out of 10
సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్పి ఉంటే ఇంటర్వె...

సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్పి ఉంటే ఇంటర్వెల్ కి హీరోయిన్ గతం ఏంటి అనే ఉత్కంఠ నెలకొనేది.


అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సాంప్రదాయ కుటుంబాలు అందులో కోడళ్ళు ఎలా ఉంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది అని సీన్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మోడ్ లోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తాయి. అయితే ఈ సినిమా, క్లైమాక్స్ కూడా అతడు సినిమా గుర్తు చేస్తుంది. ఓవరాల్ గా సమంతను హీరోయిన్ గా పెట్టి ఇలా ఫ్యామిలీ యాక్షన్ సినిమాని బాగానే తెరకెక్కించారు. సమంత ఫ్యాన్స్ కి అయితే పండగ. సినిమాకి సమంత యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా ఫ్యామిలీతో కలిసి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూడొచ్చు.


Jun 20, 2026 Telugu

Sing geetham movie review

7.0
out of 10
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టో...

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టోరీ టెల్లింగ్‌లో సింగీతం గారు మాస్టర్. అయినా మూడున్నర దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు.. పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా..! ఓ అందమైన చందమామ కథలా సింగ్ గీతాన్ని తెరకెక్కించారు సింగీతం.



సినిమాలో ఓవరాల్ గా చెట్టు నాటాలి.. మంచి పెరగాలి.. మనిషిని మనిషిలా చూడాలి.. అంటూ ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం గారు. కానీ ఆయన చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చేలా ఉంది. ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తోనే బయటికి వస్తాం. ఓవరాల్‌గా సింగ్ గీతం.. సింగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ..!


Jun 13, 2026 Telugu

Sing Geetham movie review

7.0
out of 10
భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. లోభం, అధికారం, ప్రకృతి, ప్రేమ, సత్యం వంటి అంశాలను మ్యూజికల్ నేరేషన్ ద్వారా చెప్పడం...

భారతీయ సినీ చరిత్రలో ప్రయోగాలకు మరో పేరు Singeetam Srinivasa Rao. సింగ్ గీతం కూడా ఆయన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా మలచడం గొప్ప విషయం. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దాని మూలం పూర్తిగా మానవ భావోద్వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. లోభం, అధికారం, ప్రకృతి, ప్రేమ, సత్యం వంటి అంశాలను మ్యూజికల్ నేరేషన్ ద్వారా చెప్పడం చాలా అరుదుగా కనిపించే ప్రయత్నం. 


ఇక సినిమాకు DSP సంగీతం కథలో భాగమైపోతుంది. కొన్ని స్క్రీన్‌ప్లే లోపాలు, లాజిక్ గ్యాప్స్ ఉన్నా, దర్శకుడి విజన్ వాటిని అధిగమిస్తుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ కొత్త కథనాలను, సృజనాత్మక ఆలోచనలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా చూడదగ్గ చిత్రం. ఓవరాల్ గా ఈ సింగ్ గీతం మూవీ ఓ సాహసం, ఓ ప్రయోగం ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరెన్స్ చేయాల్సిన సినిమాటిక్ జర్నీ. అయితే కొన్ని సినిమాలను రేటింగ్ లతో కొలవలేం. ఇది కూడా అంతే. కానీ దాదాపు క్లాసిక్ గానే ఈ సినిమాని భావించొచ్చు. 

Jun 13, 2026 Telugu
Why MRO?