Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Dhurandhar The Revenge Movie Review
ధురంధర్ ది రివెంజ్... దిస్ ఈజ్ ఇండియన్ సినిమా... ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది పూర్తిగా ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అని చెప్పాలి. రణ్‌వీర్ సింగ్ వన్ మ్యాన్ షో కథ ఉంది, కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం హమ్జా అలీనే. హమ్జా పాత్రలో ఆయన పూర్తిగా మునిగిపోయి యాక్షన్ సన్నివేశాల్లో బీస్ట్ లా రగిలిపోతూ, భావోద్వేగ సీన్స్ లో కంటతడి పెట్టించేలా నటించాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆయన ప్రెజెన్స్ నే ప్రధానంగా ఫీల్ అవుతాం. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసినా… స్పాట్‌లైట్ మాత్రం హీరోపైనే ఉంటుంది.
యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండటం సినిమాకు మాస్ ఫీల్ ఇస్తుంది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ను మరింత ఎలివేట్ చేస్తాయి. అయితే క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ అనిపించే అవకాశం ఉంది. మొత్తానికి ఇది కథ కంటే హీరో ప్రెజెన్స్ పై నడిచే సినిమా. రణ్‌వీర్ నటన కోసం తప్పకుండా చూడదగ్గ యాక్షన్ ఎంటర్టైనర్. అలా అని హీరో పాత్రపై మొత్తం సినిమా ఉండదు. దేశం కోసం ఈ మధ్య ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అందరి కథలు ఇందులో ఉంటాయి.
Dhurandhar The Revenge Movie Review
By Cinema Picha
మొత్తానికి ధురంధర్ 2 సినిమా నిజంగా మన ఇండియన్ పర్ఫెక్ట్ స్పై సినిమా లాగే చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం.. అంటే రణ్‌వీర్ సింగ్ ఒక్కడే. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్‌గా డామినేట్ చేశాడు. హమ్జా క్యారెక్టర్‌లో ఎంటర్ అయ్యాక… “ఇంకెవరూ అవసరం లేదే!” అనిపించేలా వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్‌లో పిచ్చిగా రగిలిపోయాడు… ఎమోషనల్ సీన్స్‌లో కూడా కంటతడి పెట్టిస్తాడు. ఈ క్యారెక్టర్ రణ్‌వీర్ సింగ్ కెరీర్ లో టాప్ లో ఉండేలా ఉంది.
మాధవన్ తన క్యారెక్టర్ లో కూల్ గా సెట్ అయ్యాడు… సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఓకే. అయితే ఒక్క హీరోయిన్ కు మాత్రం ఈ సినిమాలో స్కోప్ తక్కువే. ఇక సినిమా మొత్తం వయలెన్స్ హై లెవెల్‌లో ఉంటుంది. అది కూడా ఓ రేంజ్‌లోనే చూపించారు. మ్యూజిక్, BGM యాక్షన్ సీన్స్‌ను మరింత హైప్ చేస్తాయి. కానీ క్లైమాక్స్ దగ్గర కాస్త ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం హై వోల్టేజ్ ఆక్షన్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇండియన్ స్పై ఏజెంట్ నేపథ్యాన్ని, దేశభక్తితో కలిపి సరిహద్దుల బైట కూడా తెలీని యుద్ధాలు చాలా ఉన్నాయని ఆడియన్స్ కి చెప్పే ప్రయత్నం చేసారు.
Dhurandhar The Revenge Movie Review
‘ధురంధర్ 2’లో రణ్‌వీర్ సింగ్ తన నట విశ్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. హమ్జా పాత్రలో ఆరంభం నుంచి ముగింపు వరకు ఆకట్టుకుంటూ వన్ మ్యాన్ షోగా నిలిచారు. యాక్షన్ సన్నివేశాల్లో క్రూరత్వాన్ని, భావోద్వేగ దృశ్యాల్లో నిగూఢతను సమానంగా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.
ఇతర పాత్రల్లో ఆర్. మాధవన్ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో మెప్పించగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్ పాత్రకు ప్రాధాన్యం తక్కువగా ఉన్నప్పటికీ, కనిపించిన మేరకు ఆకట్టుకుంది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక అంశాలు అధికంగా ఉన్నాయి. అయితే కథకు అనుగుణంగా దర్శకుడు వాటిని సమర్థవంతంగా వినియోగించారు. సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. క్లైమాక్స్‌లో స్వల్పంగా ల్యాగ్ అనిపించినా, మొత్తం కథనం ఆసక్తికరంగా సాగుతుంది.
మొత్తానికి, ‘ధురంధర్ 2’ యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా ప్రేక్షకులను అలరించే చిత్రం. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ కి తక్కువే. సినిమా చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కథ చెప్పాలనుకున్న సినిమా కాదు, హీరోని సెలబ్రేట్ చేయాలనుకున్న సినిమా. సార్టింగ్ లో మాస్ ఎలివేషన్స్ బాగానే హైప్ క్రియేట్ చేస్తాయి… కానీ ఆ తర్వాత సినిమా స్టెడీగా పడిపోతూ ఉంటుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా కదలదు… సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి కానీ మనకు కనెక్ట్ అయ్యే ఎమోషన్ కనిపించదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నంత వరకూ ఓ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ రైటింగ్ లేదు. ఒక్కోసారి మంచి మూమెంట్ వస్తుంది. వెంటనే ఫ్లో బ్రేక్ అయిపోతుంది. మంచి కథ లేదు, ఒక బలమైన విలన్ లేడు. ఒక సరైన కామెడీ కూడా లేదు, మ్యూజిక్ పరంగా పెద్దగా గుర్తుండిపోయేలా ఏమీ లేదు. డిఎస్పీ, థమన్ ఇద్దరూ డిస్సపాయింట్ చేసారు. సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్, వింటేజ్ వైబ్స్ వర్క్ అవుతాయి… కానీ అప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అభిమానులకు కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. మిగతావాళ్లకి మాత్రం ఇది జస్ట్ ఓ రొటీన్, హాఫ్-బేక్డ్ కమర్షియల్ సినిమా.
Ustaad Bhagat Singh Movie Review
By Cinema Picha
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి రీమేక్ కాదు... తేరి రీమేక్ కాదు.. దాని నుండి ఒకటి రెండు సీన్స్ మాత్రమే తీసుకుని దానికి పవన్ కళ్యాణ్ స్వాగ్ ని కలిపి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేద్దామని హరీష్ శంకర్ ట్రై చేసారు. నిజం చెప్పాలంటే… ఈ సినిమా స్టార్ట్ అయ్యాక కొంచెం టైమ్ వరకే హైప్ ఉంటుంది. ఆ తర్వాత “ఇంకా ఎంత ఉంది?” అనిపించే టైమ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కొన్ని మాస్ షాట్స్ బాగానే ఉంటాయి. కానీ అవే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంటే బోర్ కొడుతుంది. కథ సంగతి అడగకండి… ఎక్కడో చూసిన స్టోరీని మళ్లీ కొత్తగా చూపించడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. అలాగే హీరోయిన్లు ఇద్దరూ ఎందుకున్నారో కూడా తెలీదు. ఫస్టాఫ్ చాలా స్లో… సెకండాఫ్‌లో కాస్త పికప్ ఉన్నా, మొత్తం సినిమాను లిఫ్ట్ చేయడానికి సరిపోదు. విలన్ ట్రాక్ అస్సలు పని చేయదు… డైలాగులు బాగున్నా, కథకి అవసరం లేనట్టు ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుత పాలిటిక్స్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో ఫినిషింగ్ బాగున్నా ఏమాత్రం కిక్కివ్వదు.. ఓవరాల్ గా ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా గాని, కామన్ ఆడియన్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువ.
Ustaad Bhagat Singh movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. ఇది కథ కోసం తీసిన సినిమా కాదు… పవన్ కళ్యాణ్ భజన కోసం తీసిన సినిమా అనిపిస్తుంది. ప్రతి సీన్ లో హీరో ఎలివేషన్, డైలాగ్, స్లోమోషన్… ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ ఎలివేషన్స్‌కు సరిపోయే కథ, ఎమోషన్ మాత్రం కనిపించవు. ఎక్కడైనా కథ ముందుకు వెళ్లాలంటే మళ్లీ భజన మోడ్ ఆన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీని స్ట్రాంగ్ సీన్స్‌లో వాడాల్సింది పోయి… ఎక్కడ పడితే అక్కడ ఎలివేషన్ షాట్స్‌తో వేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుండి ఈ మధ్య డాన్స్ మిస్ అవుతున్నారని చెప్పి ఇందులో మంచి డాన్స్ మూవ్స్ పెట్టించారు... ఆ ఫోకస్ ఎదో హరీష్ శంకర్ కంటెంట్ మీద కూడా పెట్టి ఉంటే బాగుంటుంది. విలన్ ట్రాక్ వీక్ గా ఉంది. కామెడీ అస్సలు వర్క్ కాలేదు, మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు. ఓవరాల్ గా సినిమాలో అసలు స్టోరీయే లేదన్నట్టు అనిపిస్తుంది.. ఫాన్స్ విషయానికి వస్తే... స్క్రీన్‌ప్లే పక్కన పెట్టి… హీరో భజన చూడాలనుకుంటే ఓకే.. ఇక నార్మల్ ఆడియన్స్ సంగతి సరే సరి.
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్కడుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సినిమా చూసిన తర్వాత కూడా అదే డౌట్ క్లియర్ అవదు. స్టోరీ అనేది కొత్తదేమీ కాదు… పాత టెంప్లేట్‌ని మళ్లీ రీపీట్ చేసినట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం టాప్. కానీ డైరెక్టర్ ఆ ఎనర్జీని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయాడు. ఒక్కోసారి మంచి సీన్ వస్తుంది… వెంటనే రెండు వీక్ సీన్స్ వచ్చి ఫ్లోని బ్రేక్ చేస్తాయి. విలన్ ట్రాక్ అసలు థ్రెట్ ఫీల్ ఇవ్వదు. కామెడీ కూడా పెద్దగా వర్క్ కాలేదు. మ్యూజిక్, BGM—లౌడ్‌గా ఉంటుంది కానీ ఇంపాక్ట్ మాత్రం జీరో. ఫస్టాఫ్ డ్రాగ్, సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్ ఉన్నా… మొత్తం సినిమాను సేవ్ చేయడానికి సరిపోవు. ఓవరాల్ గా ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సేఫ్ గేమ్… కానీ ఆడియెన్స్‌కు కొత్తగా ఏమీ ఇవ్వలేదు. ఫ్యాన్స్ వరకు ఒకసారి థియేటర్ కి వెళ్లొచ్చు... నార్మల్ ఆడియన్స్ చూడడం కష్టమే.
Ustaad Bhagat Singh Movie Review
By Thyview
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్టఫ్ లేదనే ఫీలింగ్ వస్తుంది. కథ చాలా రొటీన్, ఏదో పాత సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఎమోషన్ కనెక్ట్ కావడం లేదు, సీన్స్ మధ్యలో డ్రాగ్ ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎనర్జీ మాత్రం టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ మాత్రం లేవు. కొన్ని డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ బాగున్నా… మొత్తం సినిమాను సేవ్ చేయలేవు. విలన్ ట్రాక్ పూర్తిగా వీక్. మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు… బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ లేదు. కామెడీ కూడా చాలా చోట్ల ఫ్లాట్. మొత్తానికి ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా తప్ప… జనరల్ ఆడియెన్స్‌కి మాత్రం బోర్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవ్వడం ఖాయం. టైమ్ పాస్ కోసం అయితే ఓకే… కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాత్రం థింక్ చేయాలి!
Vishnu Vinyasam movie review
“విష్ణు విన్యాసం”… ఒక ఐడియాగా చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జాతకాలు, వాస్తు వంటి నమ్మకాల మీద ఒక లైట్ కామెడీ డ్రామా చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను స్క్రీన్‌పై కన్విన్సింగ్‌గా మలచడంలో సినిమా తడబడింది. శ్రీ విష్ణు తనకు బాగా తెలిసిన జోనర్‌లోనే ఉన్నాడు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల పని చేస్తాయి. కానీ అదే ప్యాటర్న్ రిపీట్ అవ్వడం వల్ల కొత్తదనం అనిపించదు. క్యారెక్టర్‌లో డెప్త్ కంటే మేనరిజమ్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో మీమ్ కల్చర్‌ను ఎక్కువగా వాడటం పెద్ద మైనస్. అది కథలో భాగంగా కాకుండా, ఆడియన్స్‌ను ఫోర్స్ చేసి నవ్వించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఫలితంగా కామెడీ నేచురల్‌గా రాదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా టోన్‌కు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయాయి. నేరేషన్ విషయంలో ఫస్టాఫ్ కొంతవరకు హోల్డ్ చేసినా, సెకండాఫ్‌లో రైటింగ్ వీక్ అవ్వడంతో సినిమా గ్రాఫ్ పడిపోతుంది. ముఖ్యంగా మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌కు సరైన ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేకపోయారు.
Vishnu Vinyasam movie Review
By Poolachokka
అయ్యో బాబోయ్… ఈ విష్ణు విన్యాసం చూడటం కూడా ఓ విన్యాసమే అయ్యింది స్టోరీ అంటే చాలా సింపుల్… జాతకాలు, వాస్తు, హీరో పిచ్చి… ఇవన్నీ కలిపి కామెడీ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి “ఇదంతా ఎక్కడో చూసినట్టుంది కదా?” అనిపిస్తుంది. శ్రీ విష్ణు మాత్రం తన స్టైల్‌లో వన్ లైనర్స్ కొడుతూ సినిమాను లాగడానికి ట్రై చేశాడు. కొన్ని చోట్ల నవ్వు వస్తుంది… కానీ చాలా చోట్ల అదే కామెడీ రిపీట్ అవుతూ బోర్ కొడుతుంది. ముఖ్యంగా ఈ మీమ్ మ్యూజిక్… మీమ్ రిఫరెన్స్‌లు… అబ్బా! సినిమా చూస్తున్నామా లేక రీల్స్ చూస్తున్నామా అన్న కన్ఫ్యూజన్. పాటలు వస్తే “సరే… అయిపోండి ప్లీజ్” అనిపించే రేంజ్ సెకండాఫ్ కి వెళ్లేసరికి సినిమా పూర్తిగా స్లో అయి… డ్రాగ్ ఫీల్ వస్తుంది. మొత్తానికి చెప్పాలంటే… పూల చొక్కా వేసుకుని వెళ్తే కూడా ఫ్రెష్ ఫీలింగ్ రాదు
Vishnu Vinyasam movie review
విష్ణు విన్యాసం”… టైటిల్ వినగానే ఏదో ఫ్రెష్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం పాత ఫార్ములానే. జాతకాలు, వాస్తు, సిల్లీ కాన్‌ఫ్లిక్ట్… ఇవన్నీ కలిపి ఒక లైట్ ఎంటర్‌టైనర్ చేయాలని ట్రై చేశారు. శ్రీ విష్ణు తన స్ట్రెంగ్త్ అయిన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. కొన్ని వన్ లైనర్స్, కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. కానీ అదే స్టైల్ రిపీట్ అవుతుండటం వల్ల ఒక దశ తర్వాత బోర్ ఫీలింగ్ వస్తుంది. సినిమాలో మీమ్ రిఫరెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోవడం మైనస్. కామెడీని నేచురల్‌గా కాకుండా ఫోర్స్డ్‌గా తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. పాటలు పెద్దగా గుర్తుండవు… ఫ్లో కూడా బ్రేక్ అవుతుంది. కథ చాలా సింపుల్ అయినా, దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఫస్టాఫ్ ఓకే అనిపించినా… సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా డ్రాగ్ అవుతుంది. మొత్తానికి… శ్రీ విష్ణు ఫ్యాన్స్‌కు కొంతవరకు ఓకే అనిపించొచ్చు. కానీ ఓవరాల్‌గా చూస్తే ఇది అవుట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. Verdict: ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే… లేదంటే స్కిప్ చేయొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers