Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

461
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 121-132 of 461 reviews
Clear all filters

Kara Movie Review

కర (Kara) 2026 Website
5.0
out of 10
తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మామితా బైజు సహజ నటనతో మెప్పించింది. టెక్నికల్‌ గా చూస్తే... 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీ...

తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మామితా బైజు సహజ నటనతో మెప్పించింది. 


టెక్నికల్‌ గా చూస్తే... 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీసుకు రావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు అయితే అంత గుర్తు పెట్టుకునేలా లేవు. విజువల్స్ ఎంతో నేచురల్‌గా, యాక్షన్ సీక్వెన్స్ సింపుల్‌గా ఉంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘కర’ మూవీ.. ఓ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని చోట్ల నిదానంగా, బోరింగ్‌ గా అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు అంటూ మంచి పాయింట్‌ ను విఘ్నేశ్ రాజా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నానికి కమర్షియల్‌ గా ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.

May 01, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 Website
6.0
out of 10
కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా...

కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం పరవాలేదు.


కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ధనుష్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి కర సినిమా డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

May 01, 2026 Telugu

Vaazha 2 Movie Review

7.0
out of 10
వాఝా2 పేరిట మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తాజాగా తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ కాగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ మెయిన్ లీడ్స్ లో నటించగా, వీరు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దర్శకుడిగా సావిన్ SA తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ డీసెంట్ గా ఉన్నాయి. పైగా సినిమాలో సహజత్వం చాలా ఇంప్రెస్...

వాఝా2 పేరిట మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తాజాగా తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ కాగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ మెయిన్ లీడ్స్ లో నటించగా, వీరు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దర్శకుడిగా సావిన్ SA తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ డీసెంట్ గా ఉన్నాయి. పైగా సినిమాలో సహజత్వం చాలా ఇంప్రెస్ చేస్తుంది. పైగా మండుతున్న సమ్మర్ లో కూల్ గా ఇలాంటి పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది.


ఇక రకరకాల కారణాలతో కుటుంబాలను వదిలి దూరం వెళ్లిన యువత ఎలా రియలైజ్ అవుతుంది. వారి మార్పు కుటుంబాలకు ఎలా అండగా ఉంటుందనే క్లైమాక్స్ ఎంతో బలంగా నిలిచింది. దర్శకుడు ఆ సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. సినిమా నాచురల్ గా ఉంది. అనువాదం చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ క్లాస్ కుర్రకారుకు, కుటుంబాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మధ్యతరగతి మనుషుల జీవితాల్లో పలు విషయాలను గుర్తు చేస్తుందీ వాలా 2 సినిమా.

Apr 28, 2026 Telugu

Vaazha 2 Movie Review

Tupaki

By Tupaki

6.0
out of 10
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. అఖిల్ లైలాసురన...

గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు తెలుగులో ట్రెండీ డైలాగ్స్ రాసి మన వాళ్లు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ‘‘మేము ప్యూర్ ఫామిలీ ఆడియన్స్ సార్, మమ్మల్ని కొడితే అనిల్ రావిపూడి అన్న ఫీల్ అవుతాడు సార్’’ లాంటి డైలాగులతో మన ఆడియన్స్ రిలేట్ అవుతారు. 


ఐతే డబ్బింగ్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళు.. ఈ చిత్రానికి ఒక తెలుగు టైటిల్ పెట్టలేక పోవడమే విచిత్రం. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. విపిన్ దాస్ ట్రెండీ కథ రాయగా.. దర్శకుడు సవిన్ దాన్ని బాగా డీల్ చేశాడు. ఇటు కామెడీని.. అటు ఎమోషన్లను బాగా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు. చివరగా: వాలా-2.. యువతకు కిక్కు

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

6.0
out of 10
మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదలయింది.ఇక ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చ...

మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదలయింది.


ఇక ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. 


దర్శకుడు సావిన్‌ షా ఎంచుకున్న కథ బాగుంది. తెరకెక్కించిన తీరు బాగుంది. అయితే మలయాళ నేపథ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మన తెలుగు వారికి కొంత మైనస్‌గా చెప్పొచ్చు. మతం, కమ్యూనిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనకు మైనస్‌. దర్శకుడిగా సినిమాని ఎంగేజింగ్‌గా, కామెడీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇక అఖిల్‌ లైలాసురన్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కనువిందు చేస్తాయి. పాటలు సినిమాకి ప్లస్‌, బీజీఎం అదిరిపోయింది. కన్నన్‌ మోహన్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. ఫైనల్ గా టీనేజ్‌ (స్కూల్‌, కాలేజీ) కుర్రాళ్ల బయోపిక్‌ ఇది. వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

7.0
out of 10
మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్ర (Biopic of a Billion Bros). కథ వరకు మొదటి భాగం టెంప్లేట్‌నే తీసుకున్నా, ఈసారి ఎమోషన్స్, హ్యూమర్‌ను...

మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్ర (Biopic of a Billion Bros). కథ వరకు మొదటి భాగం టెంప్లేట్‌నే తీసుకున్నా, ఈసారి ఎమోషన్స్, హ్యూమర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు రచయిత విపిన్ దాస్. హషీర్, వినాయక్, అలన్, అజిన్.. ఈ నలుగురు స్నేహితుల జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. 


ఇక ‘వాలా 2’ (Vaazha 2) మొదటి భాగం కంటే చాలా మెరుగ్గా ఉంది. కేవలం కుర్రాళ్లు మాత్రమే కాదు, తమ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా ఇది.మలయాళ సినిమా మళ్ళీ తన మ్యాజిక్‌ని రిపీట్ చేసింది. మన పక్కన ఉండే మనుషుల కథలను మనకు నచ్చేలా చెప్పడంలో మలయాళం తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించింది. సింగిల్ వర్డ్ లో మూవీ గురించి చెప్పాలంటే... ఇది మనందరి కుర్రాళ్ల బయోపిక్.. నవ్వుతూ ఏడిపించేస్తుంది!

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

6.0
out of 10
సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.'వాలా 2' స్పెషాలిటీ ఏమిటం...

సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.


'వాలా 2' స్పెషాలిటీ ఏమిటంటే... నేటివిటీకి, సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. ఎక్కడా గీత దాటలేదు. ఇందులో యువతకు స్కూల్, కాలేజ్ లైఫ్ గుర్తు చేసే నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. ఇండియా నుంచి విదేశాలకు చదువు (అమెరికా) లేదా ఉద్యోగం (దుబాయ్) కోసం వెళ్లిన యువత సినిమాలు చూడటం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విదేశాల్లో వాళ్ళు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించారు దర్శక రచయితలు శివన్ ఎస్ఏ, విపిన్ దాస్. పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.




అయితే 'వాలా' చూడని ప్రేక్షకులకు 'వాలా 2' చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మరోసారి నోస్టాల్జియా మూమెంట్స్ గుర్తు చేస్తుంది. అక్కడక్కడా కాస్త డౌన్ అయినట్టు అనిపించినా... యూత్‌కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఇస్తుంది. యువతకు తమను తాము తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది.

Apr 24, 2026 Telugu

Vaazha 2 Movie Review

7.0
out of 10
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి. ఇక ​ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజు...

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి. 


ఇక ​ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.

Apr 24, 2026 Telugu

K - Ramp Movie Review

6.0
out of 10
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం...

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం తాజాగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది


మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రొటీన్ లవ్ స్టోరీ ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక వినోదాన్ని, భావోద్వేగాలను మేళవిస్తూ సినిమా జైన్స్ నాని సినిమా తీసిన విధానం అందరినీ అలరిస్తుందనే చెప్పవచ్చు. నిజానికి ఇది తనకు మంచి పరిచయ చిత్రం అవుతుంది. లోపాలు, లాజిక్కులు వెతక్కుండా ఓసారి ఈ సినిమా చూసేయవచ్చు.

Apr 20, 2026 Telugu
7.0
out of 10
హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టివి. అంతా కొత్తనటులతో తెరకెక్కించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో ఓ టివి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథ చిన్నగా ఉన్నా, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయితేజ, వేద జలంధర్ సహా, కీ రోల్స్ లో నటించిన వారందరూ చక్కగా నటించారు. అలాగే దర్శకుడు మునిరాజు సినిమాని చక్కగా హ్యాండిల్ చ...

హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టివి. అంతా కొత్తనటులతో తెరకెక్కించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో ఓ టివి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథ చిన్నగా ఉన్నా, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయితేజ, వేద జలంధర్ సహా, కీ రోల్స్ లో నటించిన వారందరూ చక్కగా నటించారు. అలాగే దర్శకుడు మునిరాజు సినిమాని చక్కగా హ్యాండిల్ చేసాడు. ఎడిటింగ్ కూడా తానే కావడం విశేషం. 


అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ గురించి చెప్పుకుంటే... సినిమాలో చాలా సాధారణంగా అనిపించే సన్నివేశాల్లో కూడా ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించి జనాలు ఉత్కంఠగా తెర వైపు చూసేలా చేశాడతను. వంశీకాంత్ బీజీఎం అంత ఎఫెక్టివ్ గా సాగింది. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. అక్షయ్ రామ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా ఓకే. ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం ద్వారా కిరణ్ అబ్బవరం తన అభిరుచిని చాటుకున్నాడు. మునిరాజు రచయితగా-దర్శకుడిగా కొంతమేర ఆకట్టుకున్నాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్లో కొంత తడబడ్డాడు. పాత్రల చిత్రణ ఇంకా బాగా ఉండుంటే.. కథనాన్ని మరింత బిగితో రాసుకుని ఉంటే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఇంపాక్ట్ వేరుగా ఉండేది.

Apr 19, 2026 Telugu
7.0
out of 10
తిమ్మరాజుపల్లి టివి అంటూ ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో హీరోహీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కొత్తవారే. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగిల్ స్క్రీన్స్ లో మంచి రెస్పాన్స్ స్లో గా అందుకుంటుంది. ఇక మెయిన్ లీడ్ లో సాయితేజ్, వేదా జలంధర్ చక్కగా నటించగా, ప్రదీప్ కొట్టెది కూడా కీ రోల్ లో అదరగొట్టాడు. ఇక తిమ్మరాజుపల్లి అందాలను అద్భుతంగా చూపించారు డిఓపీ అక్షయ్ రామ్ పొదిర...

తిమ్మరాజుపల్లి టివి అంటూ ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో హీరోహీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కొత్తవారే. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగిల్ స్క్రీన్స్ లో మంచి రెస్పాన్స్ స్లో గా అందుకుంటుంది. ఇక మెయిన్ లీడ్ లో సాయితేజ్, వేదా జలంధర్ చక్కగా నటించగా, ప్రదీప్ కొట్టెది కూడా కీ రోల్ లో అదరగొట్టాడు. ఇక తిమ్మరాజుపల్లి అందాలను అద్భుతంగా చూపించారు డిఓపీ అక్షయ్ రామ్ పొదిరెడ్డి. 1990ల నేపథ్యంలో పల్లె అందాల్ని చక్కగా చూపించారు. ఎక్కువ శాతం ఒరిజినల్ లొకేషన్లలో చిత్రీకరించడం కథకు కలిసొచ్చిందనే చెప్పాలి. 


అలాగే వంశీకాంత్ రేఖన బాణీలు ఆకట్టుకునేల ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడే ఎడిటర్ కావడం ప్లస్ అయినా.. సెకండాఫ్ లో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించింది. నిర్మాత కిరణ్ అబ్బవరం కథకు తగ్గ బడ్జెట్ లో గ్రాండ్ గా తీశారు. లాజిక్కులు, భారీ అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు రావచ్చు. అయితే ఈ తరహా సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వచ్చినపుడే జనాల్లోకి ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది. లేదంటే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి శ్రమ పడక తప్పదు.

Apr 19, 2026 Telugu
అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన తిమ్మరాజుపల్లి టివి తాజాగా థియేటర్లలో విడుదలై అలరిస్తుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో అందరూ కొత్తవాళ్ళైనా బానే నటించగా, కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించిన ఈ మూవీకి వి.మునిరాజు డైరెక్ట్ చేసాడు. ఇక కథ పరంగా చిన్న కథే అయినా, దాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించాడు దర్శకుడు. మ్యూజిక్ పరంగానూ మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలా సీన్లని ఆర్‌ఆర్‌ మరో స్థాయికి...

అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన తిమ్మరాజుపల్లి టివి తాజాగా థియేటర్లలో విడుదలై అలరిస్తుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో అందరూ కొత్తవాళ్ళైనా బానే నటించగా, కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించిన ఈ మూవీకి వి.మునిరాజు డైరెక్ట్ చేసాడు. ఇక కథ పరంగా చిన్న కథే అయినా, దాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించాడు దర్శకుడు. మ్యూజిక్ పరంగానూ మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలా సీన్లని ఆర్‌ఆర్‌ మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.


అక్షయ్‌ రామ్‌ పొదిశెట్టి కెమెరా వర్క్ సైతం బాగుంది. విజువల్‌గా కనువిందు చేస్తుంది. ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త ట్రిమ్‌ చేయోచ్చు. ఇక దర్శకుడు మునిరాజు మంచి కథని ఎంచుకోవడంతోపాటు, దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయ్యాడు. చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. సహజత్వం పరంగా ఎక్కడా తగ్గలేదు. అదే ఈమూవీ సక్సెస్‌గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. కిరణ్‌ అబ్బవరం రాజీపడకుండా నిర్మించారు. టీమ్‌కి అండగా నిలిచాడని ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుస్తోంది. తిమ్మరాజుపల్లి టీవీ ఒక ఫ్రెష్‌ అటెంప్ట్. మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి, నవ్వించి, అలరించే మూవీ. మంచి అనుభూతిని పంచుతుంది. 90కిడ్స్ కి బాగా నచ్చుతుంది.


Apr 19, 2026 Telugu
Why MRO?