Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

461
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 217-228 of 461 reviews
Clear all filters
7.0
out of 10
‘ధురంధర్’ సక్సెస్‌ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను పూర్తిగా మించకపోయినా, మొదటి పార్ట్ స్థాయిని మాత్రం మెయింటైన్ చేసింది.మొదటి అరగంట రేసీగా సాగుతూ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. హీరో బ్యాక్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఏజెంట్‌గా మారే ట్రాక్ బాగా వర్క్ అవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, నోట్ల రద్దు ట్విస్ట్ హైలైట్స్.పాకిస్తాన్ బ్యాక్‌ డ్రాప్‌ లో హీరో ఎదుగుదల,...

‘ధురంధర్’ సక్సెస్‌ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను పూర్తిగా మించకపోయినా, మొదటి పార్ట్ స్థాయిని మాత్రం మెయింటైన్ చేసింది.

మొదటి అరగంట రేసీగా సాగుతూ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. హీరో బ్యాక్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఏజెంట్‌గా మారే ట్రాక్ బాగా వర్క్ అవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, నోట్ల రద్దు ట్విస్ట్ హైలైట్స్.


పాకిస్తాన్ బ్యాక్‌ డ్రాప్‌ లో హీరో ఎదుగుదల, టెర్రరిస్ట్ ట్రాక్ బాగున్నా… ఈ మధ్యలో సినిమా కాస్త స్లో అవుతుంది. సెకండాఫ్‌ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, హై మూమెంట్స్ ఉన్నా… నేరేషన్ మళ్లీ డ్రాప్ అవుతుంది.

క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ దేశభక్తి ఫీల్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో హైలైట్ కాగా, సంజయ్ దత్, మాధవన్ పాత్రలు కూడా బాగా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మొత్తానికి 

హై మూమెంట్స్, యాక్షన్ కోసం మాత్రమే కాదు.. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాగా ధురంధర్ అలరిస్తుంది. 

Mar 24, 2026 Telugu
7.0
out of 10
రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొ...

రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్థాన్లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 


ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంత కొనియాడినా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి.. దాని చుట్టూ కథాకథనాలు అల్లిన తీరు.. తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో.. ‘దురంధర్’తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడనడంలో.. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.


Mar 23, 2026 Telugu
8.0
out of 10
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్‌ లో ఎంత క్రూరంగా కనిపించాడో, ఎమోషనల్ సీన్స్‌లో అంతగా కంటతడి పెట్టించాడు.మాధవన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూల్ పెర్ఫార్మెన్స...


ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్‌ లో ఎంత క్రూరంగా కనిపించాడో, ఎమోషనల్ సీన్స్‌లో అంతగా కంటతడి పెట్టించాడు.


మాధవన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. రెండో పార్ట్ లెంగ్త్ కాస్త ఎక్కువ ఉన్నా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు ఆ రేంజ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు. ఇక టెక్నికల్ గా ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని బాగా కుదిరాయి. ఓవరాల్ గా ధురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.  

Mar 23, 2026 Telugu
7.0
out of 10
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే నిలిచింది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్...

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే నిలిచింది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్ పాత్ర చిన్నదే అయినా ఓకే.


టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. లాంగ్ రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా బోర్ అనిపించకుండా మేనేజ్ చేశారు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ కొద్దిగా వీక్‌గా ఉన్నా ఓవరాల్ ఫీల్‌పై పెద్దగా ప్రభావం లేదు. దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా నడిపిస్తూ, ట్విస్ట్స్‌తో ఎంగేజ్ చేశాడు. మాస్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో బాగా వర్క్ అవుతాయి. మొత్తానికి ‘ధురంధర్: ది రివెంజ్’ ఒక పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. రణ్‌వీర్ సింగ్ కోసం అయినా థియేటర్‌లో చూసేయాల్సిన సినిమా. 

Mar 23, 2026 Telugu
8.0
out of 10
ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా మెప్పించారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, కనిపించినంతసేపు ఓకే...


ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.


సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా మెప్పించారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, కనిపించినంతసేపు ఓకే అనిపిస్తుంది.


టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా ల్యాగ్ అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది, వీఎఫ్ఎక్స్ కొంచెం వీక్ అయినా ప్రభావం తగ్గించవు.


దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్స్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాడు. బలమైన డైలాగ్స్, మాస్ సీన్స్ థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లో చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.

Mar 23, 2026 Telugu
8.0
out of 10
‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేయబడగా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకు...

‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేయబడగా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, తరువాత కథ పికప్ అవుతుంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. మొత్తానికి ‘ధురంధర్: ది రివేంజ్’ మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.

Mar 23, 2026 Telugu
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత్తం కథనం కొంచెం నెమ్మదిగా, ఫ్లాట్‌ గా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతగా స్ట్రాంగ్‌గా ఏం లేదు. హరీష్ శంకర్ తన మార్క్ లో బాగానే సినిమాని ప్రెజెంట్ చేసినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. మొత్తానికి ఇది పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినా, కొత్తదనంలేని కథా కథనాలతో ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా ఉంటుంది.

Mar 21, 2026 Telugu
5.0
out of 10
ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించారు. దర్శకుడిగా టేకింగ్ తో హరీష్ మెప్పించినా, కథకుడిగా ఫెయిల్ అయ్యాడ...
ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించారు. దర్శకుడిగా టేకింగ్ తో హరీష్ మెప్పించినా, కథకుడిగా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. థమన్ బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. దేవిశ్రీ సాంగ్స్ కూడా అంతగా ఏం లేవు. కానీ హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ఆయన పంచ్ డైలాగ్స్, యాక్షన్, డాన్స్ అభిమానులకు నచ్చుతాయి. అయితే… ఆసక్తిగా మొదలైన సినిమా మధ్యలో ఎక్కడో తిరిగి చివరకు ఆపరేషన్ సింధూర్ డైలాగులతో ఎండ్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కు నచ్చే ఈ సినిమాను మిగిలిన వాళ్లు కూడా ఓసారి ట్రై చెయ్యొచ్చు. అంటే ఎక్కువగా కొత్తదనం ఆశిస్తే తీవ్ర నిరాశ తప్పదు.
Mar 21, 2026 Telugu
6.0
out of 10
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అ...

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అయ్యాడు. రాంకీ డీజీపీగా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గొప్పగా లేదు. థమన్‌ బీజీఎం కూడా రొటీన్‌ గానే ఉంది. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలను జనం పెద్దగా చూడటం లేదు. అయినా ఇలాంటి సినిమా చేయడం హరీష్‌ చేసిన సాహసమనే చెప్పాలి. కాకపోతే అభిమానులకు కావాల్సిన విధంగా మూవీని రూపొందించారు. అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నా, అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. రొటీన్‌ ఫీలింగ్‌నే తెస్తాయి. ఓవరాల్ గా సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు.

Mar 21, 2026 Telugu
6.0
out of 10
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడు హరీష్ తన టేకింగ్ తో మెప్పించినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. ముందే నార్మల్...

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడు హరీష్ తన టేకింగ్ తో మెప్పించినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. ముందే నార్మల్ స్టోరీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి, లో అంచనాలు పెట్టుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తే బాగుంటుంది. పైగా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా థియేటర్లలో సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. అలాగే రెగ్యులర్ మూవీ లవర్స్ కి కూడా ఓ మోస్తరు నచ్చోచ్చు. కానీ కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.

Mar 21, 2026 Telugu
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేసాడు. ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. శ్రీ లీల, రాశి ఖన్నా పాత్రలు ఇంకా బాగా రాసుకోవలసింది. ఓవరాల్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ అభిమ...
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేసాడు. ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. శ్రీ లీల, రాశి ఖన్నా పాత్రలు ఇంకా బాగా రాసుకోవలసింది. ఓవరాల్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు ఖచ్చితంగా నచ్చే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కానీ, ఫ్యాన్స్ 'గబ్బర్ సింగ్'తో పోలిస్తే ఏమాత్రం సరిపోదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ విషయంలో మాత్రం ఆయన అభిమానులు పెద్దగా కంప్లైంట్ చేయకుండా ఈ సినిమా చూడటానికి సరిపడా అంశాలు ఉన్నాయి. కథానాయకుల స్టార్‌డమ్‌పై ఎక్కువగా ఆధారపడే మూస ధోరణి వాణిజ్య వినోద చిత్రాలను చూడటానికి సౌకర్యంగా భావించే ఇతర వర్గాల ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి ప్రయత్నించవచ్చు.
Mar 21, 2026 Telugu
6.0
out of 10
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హరీష్ శంకర్‌లో కొత్తగా ఏమి ట్రై చేయలేదు కానీ.. తన మార్కును బ్రహ్మండంగా ప్రజెంట్ చేశాడు. అలాగే సినిమాటో...
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హరీష్ శంకర్‌లో కొత్తగా ఏమి ట్రై చేయలేదు కానీ.. తన మార్కును బ్రహ్మండంగా ప్రజెంట్ చేశాడు. అలాగే సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మైత్రీ మూవీ మేకర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. అతిగా ఆశపడితే నిరాశ తప్పదు.. అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటలపాటు వినోదాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
Mar 21, 2026 Telugu
Why MRO?