Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ నాగబంధం సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం చుట్టూ నడుస్తుంది. పుస్తకం దొరకడం ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మ కమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడడం, ఈ క్రమంలో వచ్చే అడ్వెంచర్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్టులతో బాగానే ఎంగేజ్ చేస్తుంది.
అయితే ప్రీ ఇంటర్వెల్ వరకు స్పీడుగా నడిచిన సినిమాకు ఆ టైమ్‌లో వచ్చే రొమాంటిక్ పాట, ఒకటి రెండు సీన్స్ స్పీడు బ్రేకులు వేస్తాయి.
ఇక సెకండాఫ్ లో హీరో వాస్తవాలు తెలుసుకోవడం మొదలు పెట్టాక మరో కథ చూస్తున్నామా అనే ఫీల్ వస్తుంది. ఫస్టాప్ ఒకలా నడిచి సడన్‌గా హిందూ మతం, సనాతన ధర్మం.. నరకడాలు, చంపడాలతో కొత్త టర్న్ తీసుకోవడంలో ఆడియెన్స్ కు కనెక్ట్ కాదు. పైగా సినిమా ముగింపులో తొలి షాట్ నుంచి ఆఖరి వరకు నాగబంధం తెరవాలంటూ స్టోరీ నడిపి, చివరికి దాని వెనక కథ తెలుసుకోవాలంటే మరో పార్ట్ తీసే వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది. చివరిగా మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను రెండున్నర గంటలకు కుదించి రిపీటెడ్ సీన్స్ లేకుండా చేసి ఉంటే అందరినీ ఆకట్టుకునేది. పట్టుతప్పిన ‘నాగబంధం’.
నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే...
ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ఒక దశ తర్వాత విజువల్స్.. భారీతనం కూడా ఎంగేజ్ చెయ్యలేని విధంగా సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. డైలాగులు సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టిస్తాయి. హిందూ దేవుళ్ళు.. సనాతన ధర్మం.. హిందుత్వం మీద డైలాగులు పనిగట్టుకుని పెట్టినట్లు అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా.. ఆ కథను ఎలివేట్ చేసేలా లేవు. ఒక అద్భుతమైన ఈవెంట్ ఫిలిం కావడానికి తగ్గ కథ.. సాంకేతిక హంగులు.. భారీతనం 'నాగబంధం'కు కుదిరినా.. కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన అనుభూతి ఇవ్వలేక పోయింది. రచయిత.. దర్శకుడు అభిషేక్ నామా తన విజువలైజేషన్ తో వావ్ అనిపించాడు. కానీ సన్నివేశాలను క్రిస్ప్ గా ప్రెసెంట్ చెయ్యడంలో.. రక్తి కట్టించడంలో అతను తడబడ్డాడు. కథ కూడా ఓకే కానీ.. కథనం మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కేవలం విజువల్స్.. ఎఫెక్ట్స్.. భారీతనం కోసం అయితే నాగబంధం మీద ఒక లుక్కేయొచ్చు.
చివరగా: నాగబంధం.. విజువల్స్ అద్భుతం.. విషయం పరిమితం.
తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి.
అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి ఉంటే ఈ సినిమా టెక్నికల్ గా విజువల్ గ్రాండియర్ పరంగా బెంచ్ మార్క్ అయి ఉండేది. కథలో వేగానికి అడ్డుపడేలా పాటలు ఉండటం ఆడియెన్స్ క్యూరియాసిటీపై ప్రభావం పడేలా చేస్తుంది. టెక్నికల్ అంశాలు, సనాతన ధర్మం అంశాలతో వచ్చే మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలను చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాల్లో నిస్సందేహంగా ఈ సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని చేర్చుకోవచ్చు.
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి.
సత్యదేవ్ సహా ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ వెంకటేష్ మహా దర్శకుడని, సత్య దేవ్ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుందని నమ్మి, ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.
ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడిచే డ్రామా అక్కడక్కడా కొంతమేర ఓకే అనిపిస్తుంది.
విరాట్ కర్ణ ఈ సినిమా కోసం గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. అలానే సినిమాలో గ్రాండ్ స్కేల్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సహాయ నటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాలో సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని డివోషనల్ అడ్వెంచర్ సినిమాల ఫీల్ నే ఇది కూడా మిగులుస్తుంది. సో ఇవి కొంచెం రొటీన్ గా ఉన్నాయి. వీటిని పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.
భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా.. వాళ్ల వైపు నుంచి నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ.. చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్ తో సన్నివేశాలను నడిపిస్తూ.. అక్కడక్కడా కొంచెం ఎమోషన్ కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్.. సేవ్ ద టైగర్స్. ఈ తరహా కథలకు రెండో సీజన్ తీయడానికి ఏమంటుంది అనిపిస్తుంది కానీ.. ఈ టీం మాత్రం సీజన్-2ను సైతం బోర్ కొట్టించకుండానే నడిపించింది. కానీ దీనికి మూడో సీజన్ అంటే.. వర్కవుట్ చేయడం కష్టమే అని.. ఓవర్ డోస్ అయిపోతుందనే సందేహాలే కలిగాయి. కానీ ఈ సారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ జోడించి.. మరోసారి ఎంగేజ్ చేసింది టీం.
కథ పరంగా వైవిధ్యం తోడవడం.. స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్ చేయడం.. జోకులు ఎప్పట్లాగే పేలడంతో మరోసారి ‘సేవ్ ద టైగర్స్’తో జర్నీ మంచి కాలక్షేపాన్నిస్తుంది. ఇక రైటర్లతో పాటు దర్శకుడి పనితనానికి ప్రశంసలు దక్కుతాయి. వెంకటస్వామి మ్యూజిక్.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. గత రెండు సీజన్లలాగే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ కూడా చక్కటి కాలక్షేపమే. చివరగా ఈ టైగర్స్ మళ్లీ గర్జించారు
Save The Tigers Season 3 Review
By One India
సేవ్ ది టైగర్స్ 3వ సీజన్‌లో నటీనటులందరికీ రెండు విభిన్నమైన షేడ్స్ చూపించే అవకాశం దక్కడంతో అందరూ అద్భుతంగా నటించారు. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ తమ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సిరీస్‌ను వన్-మ్యాన్ షోలా నడిపించారు. క్రియేటర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం అందించిన ఈ కాన్సెప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం ఎక్కడా పట్టు తప్పకుండా తెరకెక్కించారు. మొదటి మూడు ఎపిసోడ్‌లు పాత్రల పరిచయం, లోకాల మార్పిడితో సరదాగా సాగిపోతాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. మహిళా సాధికారత, భార్య అంటే భర్తకు బానిస కాదు అనే పాయింట్స్‌ను, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అండర్ స్టాండింగ్‌ను చాలా హుందాగా చూపించారు.
సరికొత్త 'వరల్డ్ స్వాపింగ్' కాన్సెప్ట్ ను తీసుకుని అభిమానులను అలరించారు. ప్రియదర్శి, అభినవ్, చైతన్యల నటన అద్భుతంగా ఉంది. నవ్విస్తూనే భార్యాభర్తల బంధంపై ఇచ్చిన సందేశం చాలా బాగుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్ కు మేజర్ ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్ చూస్తే.. అక్కడక్కడా కాస్త హద్దులు దాటిన కొన్ని డైలాగ్స్ రియాలిటీ కంటే ఫిక్షన్ ఎక్కువగా ఉండటం.. ఫైనల్ గా మొదటి రెండు సీజన్ల క్రేజ్‌ను నిలబెడుతూ 'సేవ్ ది టైగర్స్ 3' హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ లో కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడదగ్గ పర్‌ఫెక్ట్ సిరీస్ ఇది.
Save The Tigers Season 3 Review
మూడో సీజన్ సిరీస్.. ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ ముగ్గురిని కిడ్నాప్ చేయడంతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఫన్ మొదటి సీన్ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే అంతలోనే తమని పోలిన మరో ముగ్గురు కనిపించే ట్విస్ట్ అదిరిపోయింది. అది ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌లో అస్సలు ఊహించరు. అదే పెద్ద ట్విస్ట్ గా చెప్పొచ్చు. మూడు ఎపిసోడ్ల వరకు కొంత ఫన్, కొంత కన్‌ఫ్యూజన్ అనేలా వెళ్తుంది. ఇక నాల్గో సీజన్ నుంచి కథ మారిపోతుంది.
ఈ సీజన్లో ఫన్ డోస్ పెరిగింది. ట్విస్ట్ లు రివీల్ అవ్వడం, పాత్రల్లో రియలైజేషన్ రావడం, ఒక ప్రపంచంలో ఈ ముగ్గురు చేసిన తప్పులను కొత్తగా వచ్చిన వారు సరిచేసే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రైటింగ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. డైలాగ్ నవ్వించడంతోపాటు ఆలోచింప చేస్తాయి. దర్శకత్వం సినిమాకి మరో ప్లస్ అని చెప్పొచ్చు. ట్విస్ట్ లతో, కామెడీతో, ఎమోషన్స్ తో ఇలా అన్ని మిక్స్ చేసి దీన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారని చెప్పొచ్చు. ఫైనల్‌గా భార్యాభర్తలు చూడాల్సిన సిరీస్. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇదొక మంచి టైమ్ పాస్ ఎంటర్‌టైనింగ్ సిరీస్ అవుతుంది.
Save The Tigers Season 3 review
By ABP Desam
'సేవ్ ద టైగర్స్' మొదటి రెండు సీజన్లలో భార్యాభర్తల మధ్య కథ నడిపిన క్రియేటర్లు మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం... ఈసారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. తరహాలో హీరోలను ఓ లోకం నుంచి మరో లోకానికి పంపారు. ఒకరి స్థానంలో అచ్చంగా అటువంటి మనిషి మరొకరిని దింపారు. దాంతో కథకు ఫ్రెష్‌నెస్ యాడ్ అయ్యింది.
'సేవ్ ద టైగర్స్ 2' స్పెషాలిటీ ఏమిటంటే... మెయిన్ లీడ్స్ ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం - పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ - దేవియాని శర్మకు డ్యూయల్ రోల్ చేసే అవకాశం లభించింది. ఓ లోకంలో పాత్రలు మరొక లోకంలోకి వెళ్లిన తర్వాత... సిరీస్ చూసే వీక్షకులకు ఎవరేమిటి? అనే క్లారిటీ ఉంటుంది. కానీ, తెరపై పాత్రలకు మాత్రం తెలియదు. అందువల్ల ఏం జరుగుతుందో అనే కుతూహలం ఉంటుంది. దాన్ని క్రియేటర్లు మహి వి రాఘవ్ & ప్రదీప్ అద్వైతం, దర్శకుడు శ్రీరామ్ ఎరగం బాగా వాడుకున్నారు.
భార్యలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ఆశించే భర్తల ఈగోను శాటిస్‌ఫై చేసే సిరీస్ 'సేవ్ ద టైగర్స్ 3'. ఈసారి మెయిన్ కాన్సెప్ట్ అదొక్కటే కాదు... ఫాంటసీ అంశాలతో కథను కొత్త మలుపు తిప్పారు క్రియేటర్స్. అందువల్ల, మొదట కామెడీ కాస్త బ్యాక్ సీటు తీసుకుందని అనిపించినా... ఎండింగ్ వచ్చేసరికి బాగా నవ్వించారు. ఆరు ఎపిసోడ్స్ రన్ టైమ్ చూస్తే... మూడు గంటల సినిమా చూసినంత. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంజాయ్ చేయవచ్చు. మొదటి రెండు సీజన్లు నచ్చిన వీక్షకులకు మూడో సీజన్ కూడా తప్పకుండా నచ్చుతుంది.
Save The Tigers Season 3 Review
By Filmi Beat
గతంలో రెండు సీజన్లు ఆడియెన్స్ ఆదరణతో మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈ సిరీస్ మూడో సీజన్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు శ్రీరామ్ తన కంటెంట్‌ను బాగా డిజైన్ చేసుకొన్నారనేది ఆయన సృష్టించిన డ్రామాతో స్పష్టమైంది. చాలా సీన్లు ఫ్రెష్‌గా, ఫన్‌తో సాగాయి. ఎక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి దర్శకుడు టాలెంట్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంత స్లోగా నడుస్తాయనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి ఎపిసోడ్స్‌ను హిలేరియస్‌గా అందించారు.
ఇక డిఫరెంట్ షేడ్స్ ఉన్న హైదరాబాదీగా ప్రియదర్శి తన పాత్రలో ఎప్పటిలానే ఒదిగిపోయాడు. అమాయక భర్త, లవర్ బాయ్‌గా చైతన్య కృష్ణ మరోసారి మంచి నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్గుగా హావభావాలు, ఎమోషన్స్ చక్కగా పండించాడు. ఇక అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ వల్ల షో ఫన్ రైడ్‌గా మారింది. తన సహజ శైలికి తగినట్టుగా ఆయన వేసిన పంచులు నవ్వులు పువ్వులు పూయించాయి. ఓటీటీలోనే కాబట్టి.. తగినంత సమయాన్ని కేటాయించుకొని చూడండి.. మంచి అనుభూతి కలుగుతుంది.
Save The Tigers Season 3 Web Series Review
By 123telugu
ప్రముఖ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సరికొత్త సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సిరీస్ సీజన్ 3 ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి మరియు కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జోడీలు మరోసారి తమదైన గందరగోళం, ఎమోషన్స్ మరియు హిలేరియస్ కామెడీతో అలరించడానికి సిద్ధమయ్యారు.
కొత్త దర్శకుడు శ్రీరామ్ ఎరగం వచ్చినప్పటికీ ‘సేవ్ ది టైగర్స్ 3’లో ఆ మార్పు ఎక్కడా కనిపించదు. మొదటి రెండు సీజన్లను పాపులర్ చేసిన అదే వినోదాన్ని ఈ సీజన్ కూడా కొనసాగించింది. ఓవరాల్‌గా చూస్తే.. ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ ఈ సిరీస్ యొక్క విన్నింగ్ ఫార్ములాను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించింది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య మరోసారి తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. అయితే, కొన్ని పోర్షన్స్ మాత్రం సాగదీతగా ఉండటం, బూతులు ఎక్కువగా వాడటం కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టాయి. కృష్ణ చైతన్యకు సంబంధించి కొన్ని కామెడీ సీన్స్ కూడా అందరినీ మెప్పించవు. గత రెండు సీజన్‌లను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ వీకెండ్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ని ట్రై చేయవచ్చు.
ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇటువంటి ప్రేమకథ రాలేదని 'దీవానా' విడుదలకు ముందు నుంచి చిత్ర బృందం చెబుతా వచ్చింది. నిజంగా రాలేదా? అంటే... 'లేదు' అని చెప్పాలి. ఎందుకు? అనేది చెప్పాలంటే... ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక చెప్పలేం. కానీ, ఒక్కటి మాత్రం నిజం... సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తుంది.
ఇంటర్వెల్ వరకు 'దీవానా' ఓ సాధారణ ప్రేమ కథే. అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడిన ఓ ఆవారా కథే. అయితే... ఇంటర్వెల్ బ్లాక్ మిగతా ప్రేమ కథల నుంచి 'దీవానా'ను వేరు చేసింది. ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ ట్విస్ట్ ఇంకొకరికి తెలిస్తే? అని ఆసక్తి మొదలు అవుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి నడిపిన కథలో కొత్తదనం కంటే క్యారెక్టర్స్ ప్రవర్తించే తీరు కొత్తగా ఉంటుంది. స్నేహితుల మధ్య సరదాలు, చిన్న గొడవలు వంటి వాటిని బాగా చూపించారు.
ఓవరాల్ గా దీవానా... అందమైన, హృదయానికి హత్తుకునే క్యూట్ అండ్ లిటిల్ లవ్ స్టోరీ. ఈ తరహా ట్విస్ట్ ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో రాలేదు. ట్విస్ట్ పక్కన పెడితే... ప్రతి సన్నివేశం, ఈ కథ మన కాలనీలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు ఏదో ఒక సందర్భంలో కనెక్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers