Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

856
Total Reviews
63
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 253-264 of 856 reviews

Godari Gattupaina movie Review

6.0
out of 10
‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్లస్ అయింది. స్పెషల్లీ గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం మాత్రం స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాలో సు...

‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్లస్ అయింది. స్పెషల్లీ గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం మాత్రం స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాలో సుదర్శన్ కామెడీ హైలెట్ అవుతుంది. 


ఇక సినిమాలో మైనస్ పాయింట్ మెయిన్ గా చెప్పాలంటే స్టోరీ. చాలా సింపుల్ గా తెలిసిన సీన్లే ఉంటాయి. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే జగపతి బాబు రోల్ బిగ్ ప్లస్. హీరోహీరోయిన్లు కూడా డీసెంట్ గా ఆక్ట్ చేసారు. మ్యూజిక్ డీసెంట్ గా అనిపించింది. ఫన్ కూడా మెజారిటీ వర్కౌట్ అయేలా ఉంది. సో ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే డీసెంట్ వాచబుల్ ఫీల్ వస్తుంది. 

May 12, 2026 Telugu

Godari Gattupaina Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫై చేయాలి. బట్ అది జరగలేదు. సినిమాలో కూడా గోదావరి కాస్ట్ ని చూస్తున్నాం అని కాకుండా, స...

గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫై చేయాలి. బట్ అది జరగలేదు. సినిమాలో కూడా గోదావరి కాస్ట్ ని చూస్తున్నాం అని కాకుండా, సినిమా కాస్ట్ ని చూస్తున్న ఫీలింగే వస్తుంది. అంటే సహజత్వం లేదన్నమాట.


లైలా లాంటి ఆర్టిస్టులకు స్ట్రాంగ్ రోల్స్ కూడా ఇవ్వలేదు. సినిమాలో కామెడికి స్కోప్ ఉన్నా, ఎక్కడా వాడలేదు. పెర్ఫార్మన్స్ వరకు సుమంత్ ప్రభాస్ decent గా చేశాడు. Jagapathi Babu కి importance ఇచ్చారు కానీ… ఆ character నుంచి audience expect చేసే emotional impact మాత్రం రావడం లేదు. Overall గా చెప్పాలంటే… ‘గోదారి గట్టుపైన’ ఒక beautiful looking village love story. కానీ heart touching cinema అవ్వాల్సింది… slow and routine experience గా మారిపోయింది. అందువల్ల డిస్సపాయింట్ చేసింది. 

May 11, 2026 Telugu

Godari Gattupaina movie Review

5.0
out of 10
‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఫీల్ మెల్లగా తగ్గిపోతుంది.సింపుల్ గా చెప్పాలంటే నిబ్బ...

‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఫీల్ మెల్లగా తగ్గిపోతుంది.


సింపుల్ గా చెప్పాలంటే నిబ్బా నిబ్బి కలుసుకుంటారు, కొట్లాడుకుంటారు, తర్వాత లవ్...ఇక ఫ్యామిలీ ట్విస్ట్.. అమ్మో, అయ్యో అడ్డం వస్తారు. ఇంకేముంది కలుస్తారా? లేదా? అంతే కథ. వెయ్యి సినిమాల్లో ఇలాంటి స్టోరీలు చూసాం.. ప్రతి సీన్ కూడా మనం ఈజీగా గెస్ చేస్తాం.. బట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక్క సీన్ ఉండదు. ఇక సాంగ్స్ కూడా ఆగం పట్టించినయి. ఓవరాల్ గా ‘గోదారి గట్టుపైన’ మంచి ప్రయత్నమే… కానీ థియేటర్లో గట్టిగా నిలబడేంత బలం మాత్రం సినిమాలో కనిపించదు. ఇక డెసిషన్ మీ పైనే ఉంది. 

May 11, 2026 Telugu
5.0
out of 10
సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ డేటెడ్ ఇల్లాజికల్. ఈ సినిమా ఒక 40 ఇయర్స్ కిందట రిలీజ్ అయి ఉండాల్సిన సినిమా. అలాంటి ఈ సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కొంచెమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే... ఏం లేదు.. అంతా తెలిసిన సినిమాలే.. కాకపోతే "గోదారి గట్టుపైన" టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో ఉంటుందని ఆడియన్స్ అనుకుంటే అది కూడా ఏం లేదు. ఒక...

సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ డేటెడ్ ఇల్లాజికల్. ఈ సినిమా ఒక 40 ఇయర్స్ కిందట రిలీజ్ అయి ఉండాల్సిన సినిమా. అలాంటి ఈ సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కొంచెమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే... ఏం లేదు.. అంతా తెలిసిన సినిమాలే.. కాకపోతే "గోదారి గట్టుపైన" టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో ఉంటుందని ఆడియన్స్ అనుకుంటే అది కూడా ఏం లేదు. ఒక సరైన లవ్ లేదు, ఫామిలీ డ్రామా లేదు, కనీసం కామెడీ కూడా లేదు. 


ఇక క్రింజు సీన్లకు కొదవలేదు. హీరో హీరోయిన్లు కొట్టుకుంటారు, అపార్ధాలు... జాలి.. దెబ్బకు లవ్ లో పడిపోతారు.. అంతే దీనికి తోడు హీరో హీరోయిన్లు వేరే కాస్ట్. ఈ కాన్సెప్ట్ తో వందల సినిమాలొచ్చాయి. అదే రొట్టని డైరెక్టర్ మళ్ళీ దించాడు. ఎంతో కొంత గోదారి అందాల్ని చూద్దామనుకున్న ఆడియన్స్ ఎంతో కొంత రిలాక్స్ అవుతారు. టెక్నికల్‌గా మూవీ కొంత నీట్ గా ఉంటుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. గోదావరి అందాలు మాత్రం స్క్రీన్ మీద అందంగా కనిపిస్తాయి. కానీ అందమైన విజువల్స్‌తో మాత్రమే సినిమా నిలబడదు కదా బాస్! మొత్తానికి ‘గోదారి గట్టుపైన’ అంటే భారీ ఎమోషనల్ జర్నీ అనుకుంటే… థియేటర్లో మాత్రం స్లో బోట్ రైడ్‌లా అనిపించే ఛాన్స్ ఎక్కువ.

May 11, 2026 Telugu

Godari Gattupaina Movie Review

6.0
out of 10
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా తెరకెక్కిన సినిమా గోదారి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మాణంలో సుభాష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా చెప్పుకొనేలా లేకపోయినా, గోదావరి అందాలు, నేటివిటీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ...

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా తెరకెక్కిన సినిమా గోదారి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మాణంలో సుభాష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా చెప్పుకొనేలా లేకపోయినా, గోదావరి అందాలు, నేటివిటీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. 


మొత్తంగా ‘గోదారి గట్టుపైన’ సినిమా చుట్టుపక్కల జరిగే ఓ ఆటో డ్రైవర్ – కాలేజీ స్టూడెంట్ ప్రేమకథకి తండ్రి ఎమోషన్ జోడించి తెరకెక్కిన సినిమాగా ఒక వర్గం ఆడియన్స్ కి కనెక్ట్ అవచ్చు. అయితే రెగ్యులర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకోవచ్చు గాని, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని నిరాశపరచవచ్చు.


May 11, 2026 Telugu

Godari Gattupaina movie Review

5.0
out of 10
గోదావరి తీరం… పల్లెటూరి ప్రేమ… అందమైన విజువల్స్… ఇలా చూసుకుంటే ‘గోదారి గట్టుపైన’ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ థియేటర్లో సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ ఫీల్ ఎక్కువసేపు నిలబడదు. దర్శకుడు సుభాష్ చంద్ర మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినా… దానికి సరిపోయే బలమైన కథనాన్ని ఇవ్వలేకపోయాడు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. జగపతిబాబు పాత్రకు కథలో మంచి వెయిట్ ఉంది. స...

గోదావరి తీరం… పల్లెటూరి ప్రేమ… అందమైన విజువల్స్… ఇలా చూసుకుంటే ‘గోదారి గట్టుపైన’ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ థియేటర్లో సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ ఫీల్ ఎక్కువసేపు నిలబడదు. దర్శకుడు సుభాష్ చంద్ర మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినా… దానికి సరిపోయే బలమైన కథనాన్ని ఇవ్వలేకపోయాడు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. జగపతిబాబు పాత్రకు కథలో మంచి వెయిట్ ఉంది. 


సినిమాలో గోదావరి విజువల్స్ చాలా బాగున్నయి. అయితే బాగున్నంత మాత్రాన ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. కథలో కొత్తదనం, స్క్రీన్‌ప్లే లో గ్రిప్ లేకపోవడం సినిమాను వెనక్కి లాగాయి.

మొత్తంగా ‘గోదారి గట్టుపైన’ ఓ అందమైన గ్రామీణ ప్రేమకథలా కనిపించినా… థియేటర్లో మాత్రం ఆ మ్యాజిక్ పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమకథలు ఇష్టపడే వారికి కొంతవరకు నచ్చొచ్చు గానీ, మిగతా ఆడియెన్స్‌ కు మాత్రం ఇది ఓ స్లో అండ్ రొటీన్ ఎక్స్‌పీరియెన్స్‌లా అనిపించే ఛాన్స్ ఉంది.

May 11, 2026 Telugu
5.0
out of 10
ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సందడి లేక వెలవెలబోతోంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా గోదావరి నేపథ్యంతో 'గోదారి గట్టుపైన' అనే సినిమాతో వచ్చాడు. సినిమాకి సంబంధించి పెద్దగా కథా కథనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఎంచుకున్న పల్లెటూరి నేపథ్యం స...

ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సందడి లేక వెలవెలబోతోంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా గోదావరి నేపథ్యంతో 'గోదారి గట్టుపైన' అనే సినిమాతో వచ్చాడు. సినిమాకి సంబంధించి పెద్దగా కథా కథనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఎంచుకున్న పల్లెటూరి నేపథ్యం సినిమాకు అతిపెద్ద బలం. 


గోదారి గట్టు, పచ్చని పొలాలు, ఆ యాసలో ఉండే తీయదనం ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్‌ ను అందిస్తాయి. ప్రథమార్ధంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ క్యూట్‌ గా ఉన్నప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం కాస్త అసహనానికి గురిచేస్తుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించి, టీవీ సీరియల్స్‌ను గుర్తుకు తెస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఊహకు అందే పాత కథాంశం, నెమ్మదిగా సాగే ప్రథమార్ధం, అలాగే సాగదీత సీన్లతో ఆడియన్స్ కి బోర్ ఫీల్ వస్తుంది. ఓవరాల్ గా ఈ 'గోదారి గట్టుపైన' చిత్రం పక్కా గ్రామీణ ప్రేమకథగా ఒకసారి ఈ కూల్ ఎమోషనల్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్!


May 11, 2026 Telugu
5.0
out of 10
ప్రేమ కథలకు నేపథ్యం కంటే బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కీలకం. దాంతో పాటు కథనంలో బలం ఉంటే హీరో హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులు ఆ ప్రేమను ఆస్వాదించేలా చేయగలరు. 'గోదారి గట్టుపైన' మూవీలో బ్యాక్‌డ్రాప్ బావుంది, కానీ, కథ కొత్తగా లేదు & బాలేదు. సుభాష్ చంద్ర రచనలో బలం తక్కువైనా... విజువల్స్ పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక పల్లెటూరి ఆటో డ్రైవర్ పాత్రలో సుమంత్ ప్రభాస్ చ...

ప్రేమ కథలకు నేపథ్యం కంటే బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కీలకం. దాంతో పాటు కథనంలో బలం ఉంటే హీరో హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులు ఆ ప్రేమను ఆస్వాదించేలా చేయగలరు. 'గోదారి గట్టుపైన' మూవీలో బ్యాక్‌డ్రాప్ బావుంది, కానీ, కథ కొత్తగా లేదు & బాలేదు. సుభాష్ చంద్ర రచనలో బలం తక్కువైనా... విజువల్స్ పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక పల్లెటూరి ఆటో డ్రైవర్ పాత్రలో సుమంత్ ప్రభాస్ చక్కగా నటించాడు. కొత్తమ్మాయి నిధి ప్రదీప్ నటన పరంగా కాస్త మెరుగు పడాలి.


అలాగే సినిమాలో సరైన కామెడీ సీన్లు కుదరలేదు. దాంతో బోరింగ్ మూమెంట్స్ చాలా వచ్చి వెళ్లాయి. ఇక కెమెరా వర్క్ మరియు 'బంగారు బొమ్మ' సాంగ్ బావున్నాయి. కానీ, కథలో బలం లేదు. సన్నివేశాల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్, కాన్‌ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. ఆర్ఆర్ బాలేదు. అందువల్ల, రెండున్నర గంటల సినిమాను చూడటానికి ఓపిక అవసరం. ఓవరాల్ గా సినిమా ఆశించిన రేంజ్ లో మెప్పించలేదు.

May 11, 2026 Telugu

Sathi Leelavathi movie Review

5.0
out of 10
లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస...

లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త వేగవంతం అయినట్లు అనిపించినా అందులో ఎలాంటి ఉత్కంఠ ఉండదు. 


ఇక ద్వితీయార్థం అయితే మరీ గందరగోళంగా సాగుతుంది. దొంగ ట్రాక్, హీరో తప్పించుకునే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు కేవలం టైమ్ పాస్ కోసం ఇరికించినట్లు ఉంటాయి. క్లైమాక్స్‌ను ఒక గేమ్ లాగా వెరైటీగా ప్లాన్ చేసినా అది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచలేకపోయారు. కథనాన్ని అనవసరంగా సాగదీయడం వల్ల సినిమా కూడా నీరసంగా సాగింది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి. ఓవరాల్‌ గా సతీ లీలావతి.. ఆకట్టుకోని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!



May 11, 2026 Telugu

Sathi Leelavathi Movie Review

4.0
out of 10
సతీ లీలావతి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూడగా, ఇప్పుడు కూడా నిరాశపరిచింది. కథ నేపథ్యం గురించి సింపుల్ గా చెప్పాలంటే... మూవీలో విడాకుల వైపు అడుగులు వేస్తున్న జంటలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. మనస్పర్ధలు కావచ్చు… చిన్న చిన్న గొడవలు కావచ్చు… కారణాలు ఏమైనా కావచ్చు… విడాకుల కోసం వెళ్తున్నారు. భార్యాభర్తల మధ్య కోపతాపాలు పంతాలు పట్టింపులు వంద ఉన్నప్పటిక...

సతీ లీలావతి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూడగా, ఇప్పుడు కూడా నిరాశపరిచింది. కథ నేపథ్యం గురించి సింపుల్ గా చెప్పాలంటే... మూవీలో విడాకుల వైపు అడుగులు వేస్తున్న జంటలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. మనస్పర్ధలు కావచ్చు… చిన్న చిన్న గొడవలు కావచ్చు… కారణాలు ఏమైనా కావచ్చు… విడాకుల కోసం వెళ్తున్నారు. భార్యాభర్తల మధ్య కోపతాపాలు పంతాలు పట్టింపులు వంద ఉన్నప్పటికీ… విడిపోకూడదని సందేశం ఇచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు దర్శకుడు తాతినేని సత్య చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ, చెప్పే క్రమంలో తడబాటు కనిపించింది.


సినిమా మరీ రొటీన్ అని చెప్పాలనే గాని, డీసెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సతీ లీలావతిని తీశారు. ఈ తరం భార్యాభర్తలకు చక్కటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. నటిగా లావణ్య త్రిపాఠి తన పాత్రకు న్యాయం చేశారు. కథలో విషయం ఉంది. తెరపై కమెడియన్లు చాలా మంది ఉన్నారు. అయితే సినిమాలో కామెడీ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ, మంచి సన్నివేశాలు గానీ కుదరలేదు. సో… రెండు గంటల పాటు థియేటర్లలో ప్రేక్షకులు కూర్చోవడం కష్టమే. 

May 11, 2026 Telugu
5.0
out of 10
`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా కథా కథనాలు అంతా రొటీన్ గా ఉండి ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేసింది. ఎప్పుడో పాతికేళ్ల కిందటే ఇలాంటి కథలకు కాలం చెల్లిపోయింది. ఎదో ట్రెండి ఎంటర్ట...

`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా కథా కథనాలు అంతా రొటీన్ గా ఉండి ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేసింది. ఎప్పుడో పాతికేళ్ల కిందటే ఇలాంటి కథలకు కాలం చెల్లిపోయింది. ఎదో ట్రెండి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మేజిక్ చేస్తే తప్ప ఇలాంటి స్టోరీతో సినిమాలు ఇప్పుడు ఆడవు. 


ఓవరాల్ గా రొటీన్‌, ఓల్డ్ ఫార్మాట్‌ తో గోదారిగట్టుపైన మూవీ తెరకెక్కిందని చెప్పొచ్చు. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. లౌడ్‌ ఎక్కువైంది, కామెడీ తక్కువైంది. ఎమోషన్స్ సీన్లు కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. జగపతిబాబు పాత్రకి చాలా ఎలివేషన్లు ఇచ్చారు, కానీ ఎక్కడా ఆయా సీన్లు చూపించలేదు. ఈ జెనరేషన్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమనే చెప్పొచ్చు. సింపుల్ గా ఒక్క డైలాగ్ లో సినిమా గురించి చెప్పాలంటే... కొత్త సీసాలో చాలా పాత సారా అన్నట్టు ఉంటుంది. 



May 11, 2026 Telugu
5.0
out of 10
హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ అందుకుంది. కథా కథనాల్లో నిరాశపరచగా, నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే రోల్స్ చేయలేదు. లావణ్య త్రిపాఠి రోల్ బా...

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ అందుకుంది. కథా కథనాల్లో నిరాశపరచగా, నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే రోల్స్ చేయలేదు. లావణ్య త్రిపాఠి రోల్ బానే ఉన్నా, అంత కొత్త తరహా రోల్ ఏమి కాదు.

 

టెక్నీకల్‌ గా మాత్రం సతీ లీలావతి బాగుంది. స్క్రీన్‌ కలర్‌ఫుల్‌ గా ఉంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కథ ఫర్వాలేదు. దాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఫన్నీ సీన్లు అన్నీ వర్కౌట్‌ కాలేదు. కొంత వరకు మాత్రమే నవ్వించాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అయితే సినిమాలో ఫ్యామిలీకి సంబంధించి అంతర్లీనంగా అందించిన సందేశం బాగుంది. కొంత వరకు అలరించే సతీ లీలావతి, భార్యాభర్తలకు సంబంధించిన ఇచ్చిన సందేశం బాగుంది.


May 11, 2026 Telugu
Why MRO?