Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంతం వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు.
ఇక కేరళ అందాలను ఎప్పటిలానే సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఆశీర్వాద్ సినిమాస్, ఆంటోని పెరంబవూర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ట్విస్టులతో సాగే థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి కూడా ఈ దృశ్యం 3 సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి.
మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడ్డాడు. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మోహన్ లాల్ సహా అందరూ బాగానే నటించారు.
ఇక ఓవరాల్ గా చూస్తే... ‘దృశ్యం 3’ ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన రేంజ్ లో అయితే అనిపించలేదు. అలా అని కాకుండా పార్ట్ 3 బానే ఉంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒకే రేంజ్ లో ఉంది. కానీ ఆడియన్స్ మాత్రం ముందు పార్ట్స్ ఇచ్చిన హై ని ఈ మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందుతారు. ఓవరాల్ గా మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ కోసం, మలయాళం మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమా ట్రై చేయొచ్చు. కానీ మరింత ఎంగేజింగ్ కథనం మిస్ కావడంతో ఇది మిస్ ఫైర్ అయ్యింది.
Godari Gattupaina starts with a very promising village love-story vibe, but the film mostly depends on its beautiful visuals rather than a strong story. The Godavari backdrop and rural atmosphere look absolutely stunning on screen.
The lead pair does a decent job, and the music works in parts. However, the storyline feels too predictable and lacks emotional depth. Still, if you go in with low expectations, the movie ends up being a decent and watchable love drama.
Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments.
The music by Sai Abhyankkar adds good energy to the film.
However, the movie carries strong Tamil nativity, which may not connect with everyone.
Overall, Veerabhadrudu is a decent mass entertainer and a satisfying comeback film for Suriya fans.
సూర్య లీడ్ రోల్ లో నటించిన వీరభద్రుడు మూవీ చూసాక సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అయితే స్టోరీ లో ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ కమర్షియల్ మూవీస్ చాలు ఎంజాయ్ చేయొచ్చు, సూర్య ఫ్యాన్స్ కి ఎలివేషన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మూవీ నాచొచ్చు. అయితే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సీన్లు బానే ఉంటాయి. కానీ స్టోరీ వైస్ గా చూస్తే నచ్చకపోవచ్చు. సినిమా చూస్తే డైరెక్టర్ ఆర్ జె బాలాజీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసాడని తెలుస్తుంటే ఉంటుంది.
సరిగా గమనిస్తే... సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఓ స్టోరీ, సెకండ్ హాఫ్ లో మరో స్టోరీ ఉంటుంది. అది ఒక రకంగా మైనస్ అవచ్చు. ఇక సూర్య పెర్ఫార్మన్స్ పరంగా అదరగొట్టాడు. విలన్ గా నటించిన అర్జె బాలాజి పర్వాలేదన్పించాడు. సాంగ్స్ అంత బాలేవు. తమిళ్ నేటివిటీ మసాలా ఎక్కువయింది. ఓవరాల్ గా వీరభద్రుడు సూర్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. బట్ నార్మల్ ఆడియన్స్ గురించి చెప్పలేం. అయితే క్రేజీ సినిమాలు ఏమి ఈ మధ్య కాలంలో రాలేవు కాబట్టి, సూర్య వీరభద్రుడు సినిమాని ఓసారి టైంపాస్ కి చూసేయొచ్చు.
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు సినిమా రివ్యూ విషయానికి వస్తే... సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సూర్య. సూర్య రోల్ చాల పవర్ ఫుల్ క్యారెక్టర్. కాకపోతే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా స్టోరీ అంత బాగాలేదనిపిస్తుంది. ఇక స్టోరీ స్టార్ట్ అవుతూనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా స్టోరీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు డైరెక్టర్. కథ పరంగా స్టోరీ ఫస్ట్ హాఫ్ కే ఎండ్ అయిపోయిన ఫీల్ వస్తది.
ముఖ్యంగా అర్జె బాలాజీ ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న స్క్రిప్ట్ కి సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రిప్ట్ కి సంబంధమే ఉండదు. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా ఇంపాక్టుబుల్ గా లేవు. మెయిన్ గా విలన్ క్యారెక్టర్ తేలిపోయింది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ లౌడ్ గా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవర్ఫుల్ గా బాగానే ఉంది. కానీ స్టోరీ వైస్ గా చూస్తే, ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా ఉంచే స్క్రిప్ట్ పరంగా ఏమి వర్కౌట్ అవలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ మినహా మిగతా ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టమే.
సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా రొటీన్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ్నుంచో స్టార్ట్ అయి మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక సాయి అభ్యంకార్ మ్యూజిక్ అయితే ఏమాత్రం బాలేవు. బీజీఎమ్ ఒకే. ఇక సూర్య పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ స్క్రీన్ టైం లెంగ్త్ తక్కువ. అలాగే డైరెక్ట్ చేయడమే కాకుండా విలన్ గా నటించిన ఆర్ జె బాలాజీ పెర్ఫార్మన్స్ బాగుంది. బట్ సూర్య ముందు తేలిపోతాడు.
ఇక ఈ సినిమాలో లాజిక్ లు పక్కన పెడితేనే సినిమా చూడగలరు ఆడియన్స్. పైగా సూర్య - అర్జె బాలాజీ మధ్య సీన్స్ ఇల్లాజికల్ గా అనిపించడమే కాకుండా, తల తోక లేని సీన్స్ అన్నట్టు ఉంటుంది. ఇక త్రిష రోల్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్ గా వీరభద్రుడు సినిమా ఫ్యాన్స్ కి నచ్చేట్టు ఉంటుందేమో గాని నార్మల్ ఆడియన్స్ పెద్దగా చూసేట్టు లేదు. ఇక ఫ్రెష్ మూవీస్ కోరుకునే ఆడియన్స్ దీని జోలికెళ్లకపోవడం మంచిది.
సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా జోనర్ లో ఉంటుంది ఈ మహావీరుడు సినిమా. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ లాంటివి అంత ఎక్సయిటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కొన్ని ఓవర్ ది టాప్ అయిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి అయితే ఏ సీన్ ఎటు పోతుందో అర్ధం కానట్టుంటుంది.
అయితే సినిమాలో కొన్ని పాత సినిమాల రిఫరెన్స్ లు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్యాన్స్ కి బానే అనిపించినా, నార్మల్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక సాంగ్స్ అయితే ఏమంత బాగాలేవు. కొన్ని అర్ధం కానీ విధంగా ఉన్నాయి. సాయి అభ్యంకార్ మ్యూజిక్ బానే ఉంది. సో ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ అయితే అబొవ్ యావరేజ్. సోది లేకుండా ఒక్క ముక్కలో మూవీ గురించి చెప్పాలంటే... సూర్య లాస్ట్ మూవీస్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గానే ఉంది. కానీ బాగుందని కాదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓసారి ట్రై చేయొచ్చు. రేటింగ్ చెప్పాలంటే 2.5 ఇవ్వొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers