Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 601-612 of 1218 reviews

Veerabhadrudu movie review

6.0
out of 10
వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ వీరభద్రుడు మూవీ. ఇక సూర్య సీన్స్ చాలా బాగున్నాయి. పాత సినిమాల రిఫరెన్స్...

వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ వీరభద్రుడు మూవీ. ఇక సూర్య సీన్స్ చాలా బాగున్నాయి. పాత సినిమాల రిఫరెన్స్ లు కూడా బాగున్నాయి. 

ఇక “సమాజాన్ని దేవుడు కూడా మార్చలేడు” అనే పాయింట్ కొత్తది కాదు. కానీ కోర్ట్ డ్రామాగా చెప్పాలని ట్రై చేశారు. 


ట్రైలర్ చూస్తే ఏదో గట్టిగా ఉంటుందనిపిస్తుంది. సూర్య స్క్రీన్ స్పేస్ తగ్గింది. డైరెక్టర్ ఆర్జె బాలాజీ తన స్క్రీన్ టైం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది. అయినా కానీ సూర్య ఫ్యాన్స్ కి ఉన్నంత సేపు మంచి కిక్ ఇస్తాడు. క్లైమాక్స్ ఫ్యాన్స్ కి గూస్బంప్స్ ఫీల్ వస్తుంది. త్రిష పాత్ర కూడా జస్ట్ అలా వచ్చి వెళ్లిపోతుంది. కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉంటే మూవీ నిలబడేది. మొత్తానికి ‘వీరభద్రుడు’లో రెగ్యులర్ మూవీ లవర్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గాని, ఫ్రెష్ నెస్ కోరుకుంటే మాత్రం డిస్సపాయింట్ అవుతారు.  

May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

6.0
out of 10
రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడు మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓవరాల్ గా చాలా బేసిక్ పాయింట్ తో రూపొందిన వీరభద్రుడు సినిమా డైరెక్టర్ ఇది వరకే ప్రమోషన్స్ లో చెప్పినట్లు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టప...

రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడు మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓవరాల్ గా చాలా బేసిక్ పాయింట్ తో రూపొందిన వీరభద్రుడు సినిమా డైరెక్టర్ ఇది వరకే ప్రమోషన్స్ లో చెప్పినట్లు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. 


ఫ్రెష్ స్టోరీలు ఎక్స్ పెర్ట్ చేసే ఆడియన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కథ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవచ్చు. కానీ కమర్షియల్ మూవీస్, మాస్ మూమెంట్స్, హీరో ఎలివేషన్ సీన్స్ లాంటివి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో ఈజీగా రీసెంట్ టైంలో వచ్చిన సూర్య మూవీస్ లో బెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. సూర్య తనదైన స్టైల్ లో యాక్టింగ్ అండ్ డైలాగ్స్ హీరో ఎలివేషన్స్ తో పాటు, తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో కుమ్మేశాడు. ఇక ఆర్ జే బాలాజీ విలన్ గా జస్ట్ ఓకే అనిపించగా, డైరెక్టర్ గా ఫ్యాన్స్ కోసం ఎక్స్ లెంట్ ఎలివేషన్స్ ను పెట్టినా, కథ పరంగా వీక్ పాయింట్ నే ఎంచుకున్నాడు. ఓవరాల్ గా వీరభద్రుడు బాగానే ఆకట్టుకోవచ్చు. అయితే కొంచం తమిళ్ ఫ్లేవర్ తగ్గించి కథ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే పెర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అయ్యేది. అయినా సినిమా ఒకసారి చూడొచ్చు.

May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

5.0
out of 10
#Karuppu A fantasy commercial film with a unique premise and a few standout mass moments, but the execution gets messy especially in the second half! The first half is passable despite a slow start, with the emotional and mass scenes working in parts. However, the second half falters. The writing starts off grounded but turns illogical and messy.This feels like a fan-made film for Suriya. His scre...

#Karuppu A fantasy commercial film with a unique premise and a few standout mass moments, but the execution gets messy especially in the second half!


The first half is passable despite a slow start, with the emotional and mass scenes working in parts. However, the second half falters. The writing starts off grounded but turns illogical and messy.


This feels like a fan-made film for Suriya. His screen presence is superb, though the role offers limited acting scope. RJ Balaji does better as an actor than director. He gets some commercial moments right but his overall execution lacks clarity and conviction. Sai Abhyankar’s music is hit or miss.


Slightly better than Suriya’s recent films and may connect a bit more with the Tamil audience, but still doesn’t meet the expectations. Below Average to Average Watch! #VeeraBhadrudu


Rating: 2.25-2.5/5

May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
సూర్య హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఫైనల్‌గా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. “ఈ సమాజాన్ని దేవుడు వచ్చినా మార్చలేడు” అనే లైన్‌తో దర్శకుడు RJ Balaji కథను నడిపించినా… స్క్రీన్‌పైన ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో చెప్పిన ఈ కథ రొటీన్ ట్రాక్‌లో పడిపోయింది. సూర్య ఫ్యాన్స్‌కు మాత్రం కొన్ని సీన్స్‌లో గూస్‌బంప్స్ వస్తాయి. కానీ అదే సమయంల...

సూర్య హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఫైనల్‌గా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. “ఈ సమాజాన్ని దేవుడు వచ్చినా మార్చలేడు” అనే లైన్‌తో దర్శకుడు RJ Balaji కథను నడిపించినా… స్క్రీన్‌పైన ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో చెప్పిన ఈ కథ రొటీన్ ట్రాక్‌లో పడిపోయింది. సూర్య ఫ్యాన్స్‌కు మాత్రం కొన్ని సీన్స్‌లో గూస్‌బంప్స్ వస్తాయి. కానీ అదే సమయంలో సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా, కొన్ని సీన్లు చికాకు తెప్పిస్తాయి. సూర్య పాత్ర కంటే ఆర్జే బాలాజీ పాత్రే ఎక్కువగా కనిపించడం మరో మైనస్. 


దర్శకుడిగా ఓకే అనిపించిన బాలాజీ… నటుడిగా మాత్రం సూర్య ముందు నిలబడలేకపోయాడు. త్రిష పాత్ర కూడా పేరుకే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచినా… సెకండాఫ్ పూర్తిగా నీరసంగా మారింది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ఇంకాస్త ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా రాసి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. మొత్తంగా ‘వీరభద్రుడు’లో మెసేజ్ ఉంది… సూర్య పెర్ఫార్మెన్స్ ఉంది… కానీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. స్ట్రాంగ్ స్క్రీన్‌ ప్లే కూడా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  

May 16, 2026 Telugu

Veerabhadrudu Movie Review

5.0
out of 10
గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టుకోలేకపోతుంది. కథ పరంగ...

గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టుకోలేకపోతుంది. 


కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎన్నో వందల చిత్రాల్లో ఈ కాన్సెప్ట్ చూసే ఉంటారు ఆడియన్స్. రీసెంట్ గా గోపాల గోపాల, బ్రో వంటి చిత్రాల్లో కూడా ఈ నేపథ్యాన్ని వాడారు. దర్శకుడు బాలాజీ ఫ్యాన్స్ ని మెప్పించేలా సినిమా తెరకెక్కించాడు గాని, నార్మల్ ఆడియన్స్ కి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు ‘కాంతారా’ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కి ఆడియన్స్ లోను కాకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోదు. తొలి అర్ధభాగం చూసి పర్వాలేదని ఫీలయిన వారికి ద్వితీయార్ధంతో పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. సూర్య ఇలాంటి స్క్రిప్ట్ కు ఎందుకు ఓకె చెప్పాడా అనే సందేహం కలగక మానదు. ఏది ఏమైనా సూర్య అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు.

May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

6.0
out of 10
సూర్య గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో డిస్సపాయింట్ లో ఉన్నారో తెలిసిందే. ఈ క్రమంలో భారీ అంచనాలతో వీరభద్రుడు తాజాగా విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం.అయితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం తల తోక లేకుండా కేసుల గురించి కాకుండా లాయర్లు, కోర్టు చుట్టూ, దేవుడు వీరభద్రుడు మీదే బేబీ కృష్ణ రివెంజ్ అన్నట్టు రొటీన్ డ్ర...

సూర్య గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో డిస్సపాయింట్ లో ఉన్నారో తెలిసిందే. ఈ క్రమంలో భారీ అంచనాలతో వీరభద్రుడు తాజాగా విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం.

అయితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం తల తోక లేకుండా కేసుల గురించి కాకుండా లాయర్లు, కోర్టు చుట్టూ, దేవుడు వీరభద్రుడు మీదే బేబీ కృష్ణ రివెంజ్ అన్నట్టు రొటీన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు. 


పైగా సినిమాలో హీరో సూర్య అయినా కథ మొత్తం నడిచేది ఆర్జే బాలాజీ చుట్టూనే. అసలు హీరో సూర్యనా, ఆర్జే బాలాజీనా అనే సందేహం రాక మానదు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతారు. ఎమోషన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్టులో కేసు తేలక బాధ పడే పేదవాళ్ళు, తండ్రి ఎమోషన్, దేవుడి ఎమోషన్.. ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా దేవుడే దిగివచ్చినా ఇక్కడ సమాజంలో, కోర్టు, లాయర్లలో ఉన్న అవినీతిని, చెడుని తీసేయడం కష్టం, ఒక కోర్టు మారిస్తే సరిపోదు దేశంలో చాలా కోర్టుల్లో ఇదే పరిస్థితి అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాతో చేసారు. మొత్తంగా ‘వీరభద్రుడు’ సినిమా కోర్టుల్లో జరిగే అవినీతిని అంతం చేయడానికి దేవుడే దిగి వస్తే ఏం జరిగింది, అని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. 


May 15, 2026 Telugu

Veerabhadrudu movie Review

7.0
out of 10
కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలయింది. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు పాయింట్ తో... అలాగే న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, సామాన్యులను వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది.. అనే పాయింట్ తో ఈ సిని...

కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలయింది. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు పాయింట్ తో... అలాగే న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, సామాన్యులను వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది.. అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. 


ఇక సూర్య వీరభద్రుడి పాత్రను కేవలం ఒక కమర్షియల్ మాస్ హీరోలా కాకుండా, వ్యవస్థ చేతిలో మోసపోయిన సామాన్యుడి కోపానికి ప్రతీకగా మలచడం బాగుంది. సూర్య తన రెండు షేడ్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా నటించాడు. కానీ తన రోల్ ముందు అటుడిగా ఆర్జే బాలాజీ తేలిపోతాడు. అందువల్ల బలమైన ప్రతినాయకుడు ఉండడు. ఇక మ్యూజిక్ కూడా డిస్సపాయింట్ చేసింది. బీజీఎమ్ బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ బాలేదు. ఎడిటింగ్ ఓకే, అయితే ఇప్పటి ఆడియన్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది తెలుసుకుంటూనే, కథలోని ఎమోషనల్ డెప్త్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు... ఓవరాల్ గా తక్కువ అంచనాలతో రెగ్యులర్ మూవీ లవర్స్ ని బాగానే అలరిస్తుంది సినిమా. సూర్య ఫాన్స్ కి మాత్రం ఐ ఫీస్ట్.

May 15, 2026 Telugu

Veerabhadrudu movie Review

5.0
out of 10
కోలీవుడ్ స్టార్ సూర్య 'కరుప్పు' ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మే 14న విడుదల కాకపోగా, ఒక్క రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు విలన్‌ గా నటించగా, తెలుగులో 'వీరభద్రుడు' పేరిట విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, కమర్షియాలిటీతో పాటు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే నార్మల్ కథ రాసుకున్నారు ఆర్జే బాలాజీ &a...

కోలీవుడ్ స్టార్ సూర్య 'కరుప్పు' ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మే 14న విడుదల కాకపోగా, ఒక్క రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు విలన్‌ గా నటించగా, తెలుగులో 'వీరభద్రుడు' పేరిట విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, కమర్షియాలిటీతో పాటు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే నార్మల్ కథ రాసుకున్నారు ఆర్జే బాలాజీ & టీమ్. అందులో సక్సెస్ అయ్యారు. అయితే... దర్శకుడిగా మాత్రం కథకు సరైన క్యాస్టింగ్ ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆర్జే బాలాజీ.


వీరభద్రుడు' కథకు వస్తే... దేవుడు వచ్చినా న్యాయవ్యవస్థను మార్చలేడని ఆర్జే బాలాజీ చెప్పాలనుకున్నారు. సినిమాలో సూర్య వీరభద్రుడిగా రుద్ర తాండవం చేశారు. అయితే... సూర్యను చూడాలని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఆర్జే బాలాజీ ఎలివేషన్స్ & ఆయన స్క్రీన్ టైమ్ ఇబ్బంది పెడుతుంది. టెక్నికల్ గా మ్యూజిక్ ఫెయిల్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... ప్రేక్షకులకు 'వీరభద్రుడు' నచ్చుతాడు. 


 

May 15, 2026 Telugu

Veerabhadrudu Movie Review

5.0
out of 10
న్యాయ వ్యవస్థలో లోపాలు, కోర్టు విచారణలో జాప్యాలు, లాయర్లు, జడ్జీల అవినీతి భాగోతాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ వీరభద్రుడు సినిమా కూడా అలాంటి తరహా ఫాంటసీ పాయింట్‌ తో కథతో తెరకెక్కింది. కానీ దర్శకుడు ఆర్జే బాలాజీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొంత వరకు ఎమోషనల్ అంశాలను సరిగానే డీల్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తోచని స్థితిలోను, గందరగోళంలోను పడటం వల్ల సినిమా...

న్యాయ వ్యవస్థలో లోపాలు, కోర్టు విచారణలో జాప్యాలు, లాయర్లు, జడ్జీల అవినీతి భాగోతాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ వీరభద్రుడు సినిమా కూడా అలాంటి తరహా ఫాంటసీ పాయింట్‌ తో కథతో తెరకెక్కింది. కానీ దర్శకుడు ఆర్జే బాలాజీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొంత వరకు ఎమోషనల్ అంశాలను సరిగానే డీల్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తోచని స్థితిలోను, గందరగోళంలోను పడటం వల్ల సినిమా అనుకొన్నంత ఇంపాక్ట్ చూపలేదని చెప్పాలి. 


సినిమాలో ప్రధానమైన పాయింట్‌ ఫస్టాఫ్‌ లోనే ముగిసిపోతుంది. కానీ సెకండాఫ్‌ లో రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి సాగదీసి సినిమాను ముగించడం మూవీకి మైనస్‌ అయింది. కానీ వీరభద్రస్వామిగా, సూర్యగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను సూర్య తనదైన శైలిలో అదరగొట్టాడు. మిగతా రోల్స్ ఏమి అంత ఇంపాక్ట్ చేయలేదు. మ్యూజిక్ విషయంలో దెబ్బ పడగా, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా కథ, కథనాలు, గ్రాఫిక్స్‌ పై ఇంకా దృష్టి పెడితే.. ఫాంటసీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్‌ లో బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేది. కోర్టు రూమ్ డ్రామాలు, డివైన్ ఎలిమెంట్స్‌ తో సోషల్ ఇష్యూస్ మీద వచ్చి సినిమాలను ఇష్టపడే వారికి వీరభద్రుడు మూవీ నచ్చే అవకాశం ఉంది. 





May 15, 2026 Telugu

Veerabhadrudu movie Review

5.0
out of 10
కోలీవుడ్ స్టార్ Suriya నటించిన ‘వీరభద్రుడు’ ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన థియేటర్లలో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా, టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. స్టోరీ పాయింట్ కొస్తే... సమాజంలో పెరిగిపోతున్న అన్యాయాలు, మనుషుల ఆలోచనా విధానం చూసి “దేవుడు వచ్చినా మార్చలేడు” అనే పాయింట్‌తో దర్శకుడు RJ Balaji వీరభద్రుడుని తెరకెక్కించాడు. పైగా ఈ బ్యాక్ డ్రాప్ లో చ...

కోలీవుడ్ స్టార్ Suriya నటించిన ‘వీరభద్రుడు’ ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన థియేటర్లలో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా, టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. స్టోరీ పాయింట్ కొస్తే... సమాజంలో పెరిగిపోతున్న అన్యాయాలు, మనుషుల ఆలోచనా విధానం చూసి “దేవుడు వచ్చినా మార్చలేడు” అనే పాయింట్‌తో దర్శకుడు RJ Balaji వీరభద్రుడుని తెరకెక్కించాడు. పైగా ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలొచ్చాయి, కాకపోతే దీన్ని కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌ లో చెప్పడానికి ట్రై చేశాడు.


ఫస్ట్ హాఫ్ వరకు కథ ఓకే అనిపించినా… సెకండాఫ్‌లో మాత్రం సినిమా కాస్త ట్రాక్ తప్పినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉండాల్సింది. ఇక సూర్య ఫ్యాన్స్ కోసం పెట్టిన ఎలివేషన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. Trisha Krishnan పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం మైనస్ కాగా… ఆర్జే బాలాజీ మాత్రం హీరో కంటే తన పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నట్టుగా కనిపించాడు. ఓవరాల్ గా సూర్య నటన కోసం వీరభద్రుడు ఒక్కసారి చూసేయొచ్చు అనే ఫీలింగ్ మాత్రం ఇస్తుంది. ఫైనల్ గా వీరభద్రుడు మూవీ సూర్య అభిమానులకు పండగ లాంటి మూవీ అయినా, పెద్దగా అంచనాలు లేకుండా అయితే మెప్పించే అవకాశం ఉంది. 



May 15, 2026 Telugu
5.0
out of 10
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు పలు కారణాల వల్ల వాయిదా పడి ఫైనల్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే పాయింట్‌ తోనే ఈ కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలొచ్చాయి, వస్తున్నాయి క...

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు పలు కారణాల వల్ల వాయిదా పడి ఫైనల్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే పాయింట్‌ తోనే ఈ కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలొచ్చాయి, వస్తున్నాయి కూడా. కాకపోతే దర్శకుడు ఆర్జే బాలాజీ దీనికి కోర్ట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు అంతే. 


కానీ కథకుడిగా మాత్రం దర్శకుడు అంతగాఆకట్టుకోలేదు. సూర్య ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం కాస్త సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో సూర్య పాత్ర మాత్రం ఒక గెస్ట్ రోల్‌ లా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకి స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో మాత్రం సూర్య అదరగొట్టేశాడు. త్రిష పాత్రకి పెద్ద స్కోప్ లేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ, ఇది సూర్య కోసం కాకుండా తన కోసమే రాసుకుని, తన కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా తన పాత్ర కనిపిస్తుంది. కాకపోతే సూర్య నటన ముందు తేలిపోతుంది ఆ పాత్ర. ఆర్జే బాలాజీ కేవలం దర్శకుడిగా ఈ మూవీని తీసి ఉంటే.. సెకండాఫ్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఫలితం మరింత అద్భుతంగా వచ్చే అవకాశం ఉండేదనిపిస్తుంది.


May 15, 2026 Telugu

Veerabhadrudu Movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
సూర్య నటించిన లేటెస్ట్ మూవీ వీరభద్రుడు కొన్ని ఫైనాన్షియల్ ఇస్యూస్ వల్ల ఆలస్యంగా విడుదలైనా, థియేటర్లలో మంచి జోష్ కనబరుస్తుంది. టాక్ పరంగా మాత్రం బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కథ విషయానికి వస్తే.. తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉంటే దేవుడొచ్చి కాపాడే కథలు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఇంచుమించు అలాంటి కథే ఈ వీరభద్రుడు కూడా. అందువల్ల ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా, ఫ్రెష్ స్టోరీ కాకపోవడ...

సూర్య నటించిన లేటెస్ట్ మూవీ వీరభద్రుడు కొన్ని ఫైనాన్షియల్ ఇస్యూస్ వల్ల ఆలస్యంగా విడుదలైనా, థియేటర్లలో మంచి జోష్ కనబరుస్తుంది. టాక్ పరంగా మాత్రం బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కథ విషయానికి వస్తే.. తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉంటే దేవుడొచ్చి కాపాడే కథలు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఇంచుమించు అలాంటి కథే ఈ వీరభద్రుడు కూడా. అందువల్ల ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా, ఫ్రెష్ స్టోరీ కాకపోవడం బిగ్ మైనస్. 


డైరెక్టర్ ఆర్జె బాలాజీ తీసింది నాసిరకం సినిమా అయితే... అందులోనూ  సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించడం ఆ పాత్ర సూర్య కి అపోజిట్ గా స్ట్రాంగ్ గా లేకపోవడం మైనస్. పైగా సాయి అభ్యంకర్ సాంగ్స్ మైనస్ అయ్యాయి. బీజీఎమ్ కొంచెం బెటర్. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫి బాగుంది. ఓవరాల్ గా డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ రైటింగ్ - టేకింగ్ లో కొత్తదనం చూపించలేకపోయాడు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. కానీ లాజిక్స్ పూర్తిగా పక్కన పెట్టి తోచినట్లుగా సన్నివేశాలు రాసి తీసేశాడు దర్శకుడు చివరగా వీరభద్రుడు.. మహిమ పని చేయలేదు. 

May 15, 2026 Telugu
Why MRO?