Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంది. ఊరి గుర్తింపు కోసం ఆటగాడైన పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘పెద్ది’... ఆడియన్స్ మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, మూడు వేరియేషన్స్ లలో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ మరో హైలైట్ గా నిలిచారు. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది. అన్నిటికి మించి రొటీన్ కథే అయినా బుచ్చిబాబు తన టేకింగ్ తో మెప్పించాడు. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మంచి ఎమోషనల్ బ్లాక్ లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి థియేటర్ లో ట్రీట్ ఇస్తాయి.
Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense elements work well in key moments.
ilayaraja music is also good, But expected more. overall Mareechika is a decent watchable.
మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది.
క్లైమాక్స్ కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంది.. కానీ ఆడియన్స్ ఊహకు అందకుండా నాన్-లీనియర్ పద్ధతిలో కథను నడిపించడంలో స్క్రీన్ ప్లే రైటర్స్ చూపించిన నేర్పు మెచ్చుకోవాలి. అయితే లాజిక్స్ వెతికే వాళ్లకు కొన్ని ప్రశ్నలు మిగిలినా.. ఓవరాల్‌గా ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్నిచోట్ల మాత్రం లాజిక్ ఉండదు.. మరికొన్నిచోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్లకు మరీచిక మంచి ఛాయిసే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మరీచిక.. డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!
మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ 'మరీచిక'లో థ్రిల్లర్ ఒక సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. కాని ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది.
ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ని చాలా నిరాశపరిచింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మరీచిక... పేరుకు తగ్గట్లుందీ ఈ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు స్కిప్ చేయడం బెటర్. లేదంటే ఓటిటిలో చూసేయొచ్చు.
మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్ ను జస్టిఫై చేశారు మేకర్స్.
సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ కోసం మరికొందరు, స్నేహం కోసం ఇంకొందరు, ఆస్తుల కోసం మరికొందరు! ఈ డ్రామాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెసుకోవడమే పెద్ద పజిల్. ప్రేక్షకులకు ఇలాంటి ప్రహేళికను ఇచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ బోరింగ్ సీన్లతో, పస లేని కథతో ఆడియన్స్ కి విసుగుపుట్టించారు. ఇళయరాజా సంగీతం అందించారనో, కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉన్నారనో ఆశతో థియేటర్ కు వెళితే... ఎడారిలో ఎండమావిలా అవుతుంది ప్రేక్షకుల పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలానూ ఓటీటీలో వస్తుంది. అప్పుడు కూడా తీరుబడి ఉంటే... మీ కిష్టమైన అనుపమా పరమేశ్వరన్ నటన కోసం ఓసారి చూడండి. అంతే..
సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్ తో కథను అత్యంత ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ అదే క్యూరియాసిటీని ఆడియెన్స్ లో కొనసాగించలేకపోయాడనే చెప్పాలి.
స్క్రీన్ ప్లే విషయంలో గందరగోళం కారణంగా ఒక మంచి పాయింట్‌తో వచ్చిన కథ ఆడియెన్ ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఇచ్చారు. కానీ కథలో కంటెంట్ బలంగా లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం, స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇళయరాజా కూడా తన మార్కు చూపించలేకపోయారనిపిస్తుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫి బాగుంది. రాజీవ్ చిలక, మేఘా చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే డీసెంట్ థ్రిల్లర్ అయి ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయిందనే చెప్పాలి.
ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కథనంలో బలహీనత కారణంగా మరీచిక చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.
Recent ga family tho after long gap tarvatha Drishyam 3 movie ki vella. Honestly cheppalante “Drishyam 3” lo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu. Mohanlal as George kutty still superb… But screenplay previous parts range lo sharp ga anipinchaledu. Plus mana Telugu audience ki Venkatesh version baga register ayipoyindi kabatti…
Mohanlal ni aa place lo imagine cheyyadam konchem kastame. Telugu nativity chala miss ayindi. adi major minus ayithe, telugu version characters place lo vere artists ni kooda tondaraga kanukkolemu.. thrills ki scope takkuve.. Overall ga decent thriller one time watchable anthe.
Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout.
However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie works as a decent one-time thriller watch.
మాములుగా ఈ మధ్య సినిమాలు చూడ్డం బాగా తగ్గించేసాను... ఎందుకంటే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా నన్ను థియేటర్ కి రప్పించే స్థాయిలో లేదు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ థియేటర్లో చూద్దాం అని ట్రైలర్ కూడా చూడకుండా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే దృశ్యం సినిమా రెండు పార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఆదివారం దృశ్యం 3 కి వెళ్ళా...
కానీ చూసాక టోటల్ సినిమాపై నా అంచనాయే మారిపోయింది. ఫస్ట్ 2 పార్ట్స్ లో ఉన్న ఎక్సయిట్మెంట్, థ్రిల్ మూవ్మెంట్స్ అసలు మూడో పార్ట్ లో కనిపించలేదు. అన్నిటికి మించి రెండు పార్ట్స్ లో వెంకటేష్ ని చూసాక, మూడో పార్ట్ లో మోహన్ లాల్ రోల్ కి అంతగా కనెక్ట్ కాలేకపోయా. ఇదే ఒరిజినల్ అయినా కూడా వెంకటేష్ దృశ్యం రీమేక్ ఫస్ట్ చూసాక దీనికి అంత కనెక్ట్ కాలేను. డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సారి పనిచేయలేదు.
బట్ మోహన్ లాల్ మరోసారి తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. అండ్ కేరళ సహజ అందాలు సినిమాకి మంచి బూస్ట్ అయింది. ఓవరాల్ గా దృశ్యం ముందు పార్ట్స్ తో కంపేర్ చేస్తే అంత నచ్చలేదు గాని, డీసెంట్ థ్రిల్లర్ గా ఓసారి చూసేయొచ్చు. మేకర్స్ మాత్రం దృశ్యం సిరీస్ ని మూడో పార్ట్ తో ఎండ్ చేసేస్తే బెటర్.
pongal tarvatha malli theater lo movie chudale.. chalaa rojula tarvatha Drishyam 3 ki family tho vella... but vellaka Honestly cheppalante “Drishyam 3” ki chala dissapoint ayya. first 2 parts nacchi, trailer kooda chudaunda.. critics review vinakunda vellam... ade maa mistake. cinemalo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu.
actor ga venkatesh role lo Mohanlal ni imagine cheskolekapoya. but mohanlal as Georgekutty still superb. as a telugu audiane ga connect avalenu. jeethu joseph screenplay previous parts range lo sharp ga anipinchaledu. Overall ga decent thriller watch anthe.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers