Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 757-768 of 1647 reviews

Lenin Movie Review

6.0
out of 10
అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చే...

అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చేస్తే ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.


ఇక సినిమాని మహాభారతం రిఫరెన్స్ లో అందులోని పాత్రలతో లింక్ చేస్తూ తెరకెక్కించిన విధానం బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, పీరియాడిక్ కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కష్టపడ్డారు. కొన్ని డైలాగ్స్ పవర్ ఫుల్ గా చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. బస్ ఛేజింగ్, ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. మొత్తంగా ‘లెనిన్’ సినిమా ఓ ప్రేమకథ చుట్టూ ట్విస్టులతో సాగే సినిమా. 


Jul 10, 2026 Telugu

Lenin movie Review

7.0
out of 10
లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు.అయితే కథ పరంగా రొటీన్ గా ఉండి చాలా సీన్స్ ఊహాజన...

లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు.


అయితే కథ పరంగా రొటీన్ గా ఉండి చాలా సీన్స్ ఊహాజనితంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌ లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్‌ కు ఉంది. అయితే ఓవరాల్ గా సినిమాలో అఖిల్ పెర్ఫార్మన్స్ హైలెట్ గా నిలిచింది. కొత్తదనం కోసం ఆశించకుండా, తక్కువ అంచనాలతో చూస్తే... లెనిన్ ఊహించినదానికంటే ఎక్కువ బాగుంటుంది. 

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

6.0
out of 10
నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్‌ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్‌ కొట్టాలని `లెనిన్‌` మూవీ చేశాడు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇందులో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 10) విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... లెనిన్‌ ఒక ఫక్తూ కమర్ష...

నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్‌ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్‌ కొట్టాలని `లెనిన్‌` మూవీ చేశాడు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇందులో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 10) విడుదలైంది. 


ఇక సినిమా విషయానికి వస్తే... లెనిన్‌ ఒక ఫక్తూ కమర్షియల్‌ మూవీ. మంచి డ్రామా, యాక్షన్‌, లవ్‌ స్టోరీ, ఊరి జాతర అనే సెంటిమెంట్‌, స్నేహం ఇలా అన్ని అంశాలను మేళవించి రూపొందించారు. అఖిల్‌ అక్కినేనికి ఎలాగైనా హిట్‌ ఇవ్వాలని లక్ష్యంతో నాగార్జున చేసిన ప్రయత్నం `లెనిన్‌` మూవీ అని చెప్పొచ్చు. 


సినిమాలో డ్రామా బాగా వర్కౌట్‌ అయ్యింది. ట్విస్ట్ లు బాగున్నాయి. యాక్షన్‌ ఎపిసోడ్లు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. మరోవైపు హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు కొంత వరకు ఆకట్టుకుంటాయి. కానీ చాలా వరకు స్టోరీ రొటీన్‌ గా ఉంటుంది. కథనం రెగ్యూలర్‌గానే ఉంటుంది. చాలా లాజిక్ లు మిస్‌ అయ్యారు. ట్విస్ట్ లు చాలా పెట్టినా అవి చాలా వరకు తేలిపోయాయి. అంతగా కిక్‌ ఇవ్వలేదు. దీనికితోడు ఆ ట్విస్ట్ లకు సంబంధించి ముందే హింట్‌ ఇవ్వడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కమర్షియల్‌ యాంగిల్‌లో సినిమాని నడిపించిన తీరు మాత్రం మాస్‌ లవర్స్ కి బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.


అఖిల్‌ని కమర్షియల్‌ గా నిలబెట్టే మూవీ అవుతుంది. నటుడిగానూ తనని కొత్తగా ఆవిష్కరించే చిత్రమవుతుంది. మాస్‌ కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. కమర్షియల్‌ గా ఎలా మెప్పిస్తుందనేది ప్రశ్న.


Jul 10, 2026 Telugu

Lenin Movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ ఆకట్టుకోగా,...

అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.


అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ ఆకట్టుకోగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. కథలో కొత్తదనం తక్కువైనా, స్క్రీన్‌ప్లే ఎంగేజ్‌మెంట్‌తో పాటు అఖిల్ పెర్ఫార్మెన్స్ కోసం 'లెనిన్' ను ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.

Jul 10, 2026 Telugu

Lenin movie review

6.0
out of 10
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' రూరల్ యాక్షన్-రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ పరంగా కొత్తదనం తక్కువగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లేలో వచ్చే మలుపులు సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ భాగాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.నటుడిగా అఖిల్ అక్కినేని తనలోని కొత్త కోణాన్ని చూపించగా, క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. భాగ్యశ్రీ బో...

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' రూరల్ యాక్షన్-రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ పరంగా కొత్తదనం తక్కువగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లేలో వచ్చే మలుపులు సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ భాగాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.


నటుడిగా అఖిల్ అక్కినేని తనలోని కొత్త కోణాన్ని చూపించగా, క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకు న్యాయం చేయగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు అదనపు బలం ఇచ్చింది. మొత్తం మీద, కథ రెగ్యులర్‌గా అనిపించినా అఖిల్ నటన, స్క్రీన్‌ప్లే ట్విస్టుల కోసం లెనిన్ ఒకసారి చూడదగ్గ చిత్రంగా నిలుస్తోంది. అయితే సినిమా లెంగ్త్ పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి నిడివి తగ్గించి ఉంటె మరింత ఎంగేజింగ్ గా ఉండేది. 


అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఎం జరుగుతోందా? అనే అంచనాలు పెంచుతూ వెళ్లి, సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. కానీ ఎంగేజ్ చేసే ట్విస్ట్ లు కొంతవరకు సేవ్ అయ్యేలా చేసాయి. ఫైనల్ గా... లెనిన్ మాస్ ఎంటర్టైన్మెనర్ విత్ ఎంగేజింగ్ ట్విస్ట్స్.


Jul 10, 2026 Telugu

Lenin Movie Review

6.0
out of 10
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన సినిమా 'లెనిన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ రోజు (జూలై 10న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగు తెరపై రూరల్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు 'లెనిన్' కథ కొత్తగా ఏమీ అనిపించదు. కానీ, స్క్రీన్ ప్లే మాత్రం సర్‌ప్రైజ్ చేస్తుంది.&nbs...

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన సినిమా 'లెనిన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఈ రోజు (జూలై 10న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగు తెరపై రూరల్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు 'లెనిన్' కథ కొత్తగా ఏమీ అనిపించదు. కానీ, స్క్రీన్ ప్లే మాత్రం సర్‌ప్రైజ్ చేస్తుంది. 


కంటెంట్ రెగ్యులర్ రూరల్ డ్రామా, రివేంజ్ యాక్షన్ కథగా 'లెనిన్' కనిపిస్తుంది. ఊరు, ఆ ఊరిలో మనుషులు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ, స్నేహితుల అనుబంధం... సినిమా ప్రారంభం సాదాసీదాగా ఉంటుంది. అయితే... కథ ముందుకు వెళుతున్న కొలదీ వచ్చే ఒక్కో మలుపు ఆసక్తి పెంచుతాయి. రెగ్యులర్ రూరల్ రివేంజ్ డ్రామాల నుంచి 'లెనిన్'ను వేరు చేసింది స్క్రీన్ ప్లే. ఒక్కో పాత్రలో గ్రే / నెగిటివ్ షేడ్ బయట పడుతున్న కొలదీ ఆసక్తి పెరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు... అరగంట సేపు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా ఎంగేజ్ చేశారు.  


ఇక సినిమాలో అఖిల్ అక్కినేనిని కొత్తగా చూపించడంలో 'లెనిన్' హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది. నటుడిగా ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. అఖిల్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. కమర్షియల్ కథను తీసుకుని స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేశారు మురళీకిషోర్ అబ్బూరు. పాటల్లో, సన్నివేశాల్లో అఖిల్ - భాగ్యశ్రీ బోర్సే జంట ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా! అయితే... సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ అక్కినేని మాత్రమే గుర్తుంటారు. క్లైమాక్స్‌లో, ఆ క్యారెక్టర్‌లో అంతలా నటించారు. ఆయన కోసం సినిమాకు వెళ్ళొచ్చు.

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

Gulte

By Gulte

6.0
out of 10
Akhil Akkineni is back once again with Lenin, directed by Murali Kishor Abburu of Vinaro Bhagyamu Vishnu Katha fame. The film carries significant expectations, especially as it marks the coming together of Nagarjuna’s Manam Entertainment LLP and Sithara Entertainments. Nagarjuna himself had stated that he was creatively involved with the project more than any of his films since Manam, adding furth...

Akhil Akkineni is back once again with Lenin, directed by Murali Kishor Abburu of Vinaro Bhagyamu Vishnu Katha fame. The film carries significant expectations, especially as it marks the coming together of Nagarjuna’s Manam Entertainment LLP and Sithara Entertainments. Nagarjuna himself had stated that he was creatively involved with the project more than any of his films since Manam, adding further anticipation around the release.


Positives:


Akhil’s Performance in Crucial Blocks

Thaman’s BGM

Some Portions of the Second Half


Negatives:


Boring First Half

Poorly written Characters

Lack of Proper Drama & Emotions

Placement of Songs


Ultimately, Lenin works more as a testament to Akhil Akkineni’s growth as a performer than as a consistently engaging film. While the second half offers enough moments to improve the overall experience, inconsistent writing and underdeveloped drama prevent it from realizing the full potential of its premise.


Bottomline: Akhil Passes, Director Fails!


Rating: 2.5/5

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

Tupaki

By Tupaki

7.0
out of 10
పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ 'లెనిన్' అవతారం ఎత్తాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిగ్గా వస్తుంది. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వల్ల ఒక హీరోకు హైప్ వచ్చినా.. దాన్ని నిలబెట...

పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ 'లెనిన్' అవతారం ఎత్తాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిగ్గా వస్తుంది. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వల్ల ఒక హీరోకు హైప్ వచ్చినా.. దాన్ని నిలబెట్టే సినిమా పడితేనే కెరీర్లో పైకి ఎదిగే అవకాశముంటుంది. ఇప్పుడు వచ్చిన లెనిన్ అఖిల్ కి అలాంటి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. 


సినిమా రొటీన్ స్టోరీ అయినా, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. ఇక అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగా, భాగ్యశ్రీ రోల్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. కాకపోతే ఆ ట్విస్ట్ లు ముందు గెస్ చేయగలిగితే అంత కిక్కుండదు. ఫైనల్ గా అఖిల్ కెరీర్ ను గొప్ప మలుపు తిప్పే సినిమా కాదు కానీ.. అతడి గత చిత్రాలతో పోలిస్తే ‘లెనిన్’ ఎంతో బెటర్. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే వాచబుల్ అనిపించే ఫిలిం ఇది. బహుశా హీరో హీరోయిన్ల మధ్య బలమైన బాండింగ్ ను చూపించి ఉంటే ‘లెనిన్’ మంచి అనుభూతిని కలిగించేది. రైటింగ్-టేకింగ్ లో తన ఎఫర్ట్ కనిపించినా.. ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది అనిపిస్తుంది. చివరగా: లెనిన్.. పర్వాలేదనిపించే పల్లెటూరి భారతం

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

6.0
out of 10
ఏజంట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో కాస్తంత గ్యాప్ తీసుకుని అఖిల్ 'లెనిన్' మూవీ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మహా భారతంలో అధికారం కోసం అన్నదమ్ములు సాగించిన కురుక్షేత్ర యుద్థాన్ని తలపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి పాత్ర వెనుక డార్క్ షేడ్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇందులో పాజిటివ్‌ క్యారెక్టర్స్ కం...

ఏజంట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో కాస్తంత గ్యాప్ తీసుకుని అఖిల్ 'లెనిన్' మూవీ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మహా భారతంలో అధికారం కోసం అన్నదమ్ములు సాగించిన కురుక్షేత్ర యుద్థాన్ని తలపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి పాత్ర వెనుక డార్క్ షేడ్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇందులో పాజిటివ్‌ క్యారెక్టర్స్ కంటే నెగెటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ. ప్రతి పాత్రకు ఓ బలమైన నేపథ్యాన్ని రాసుకోవడంలో దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు సక్సెస్ అయ్యాడు. 


అయితే హీరో శత్రువులంతా ఒకచోటకు చేరిన తర్వాత అతను వారిపై పగ తీర్చుకోవడమే ఇక మిగిలింది అనుకుంటూ ఉండగా, మళ్ళీ కథలోని పాత్రలు, వాటి నిజస్వరూపాలను తెలియచేస్తూ ద్వితీయార్థాన్ని ప్రారంభించాడు. అలా ఊహించని మలుపులతో కథను క్లయిమాక్స్ వరకూ తీసుకెళ్ళిన దర్శకుడు హీరోకి ఉన్న ఓ బలహీనతను రివీల్‌ చేసి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తాడు. అయితే... రెగ్యులర్ తెలుగు సినిమాల్లోని హ్యాపీ ఎండింగ్‌ ఇందులో పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు భారంగానే థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇక అఖిల్ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే భాగ్యశ్రీ కూడా. 


టెక్నికల్ గా తమన్ సాంగ్స్ అంతగా లేవు. బీజీఎమ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌ బాగున్నాయి. ఈ సినిమాకు 'లెనిన్' అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు. మొత్తంగా చూసుకుంటే... ఇది అఖిల్ వన్ మ్యాన్ షో! అతను పడిన కష్టమంతా తెర మీద కనిపిస్తోంది. కాకపోతే ఈ విషాదాంతాన్ని ప్రేక్షకులు ఏ మేరకు జీర్ణించుకుంటారో చూడాలి. 


ట్యాగ్ లైన్: అఖిల్ వన్ మ్యాన్ షో!

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

6.0
out of 10
అఖిల్ నటించిన లెనిన్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. ఇక మూవీలో చిత్తూరు జిల్లాలో జరిగే జాతర ఎపిసోడ్‌తో కథ ఎమోషనల్‌ గా మొదలుపెట్టడం ద్వారా సినిమాపై క్యూరియాసిటిని పెంచడంలో దర్శకుడు మురళీ కిషోర్ సరైన ట్రాక్‌లో ఉన్నాడనిపించింది. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అలా స్లోగా సాగుతుంది. లెనిన్‌ తో ఓ ట్విస్ట్ రివీల్ చేసిన...

అఖిల్ నటించిన లెనిన్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. ఇక మూవీలో చిత్తూరు జిల్లాలో జరిగే జాతర ఎపిసోడ్‌తో కథ ఎమోషనల్‌ గా మొదలుపెట్టడం ద్వారా సినిమాపై క్యూరియాసిటిని పెంచడంలో దర్శకుడు మురళీ కిషోర్ సరైన ట్రాక్‌లో ఉన్నాడనిపించింది. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అలా స్లోగా సాగుతుంది. లెనిన్‌ తో ఓ ట్విస్ట్ రివీల్ చేసిన పాయింట్ సినిమా రేంజ్‌ ను పెంచేలా చేసింది. 


అయితే సెకండ్ హాఫ్ లో చివరి 20 నిమిషాలు లెనిన్ క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం.. ఆ పాత్ర కోసం అఖిల్ చేసిన పెర్ఫార్మెన్స్ హైలెట్‌ గా మారిందనే చెప్పాలి. రెగ్యులర్ సినిమా కథల ముగింపులా కాకుండా డిఫరెంట్‌ గా సినిమాను ముగించడం కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా అనిపిస్తుంది. ఇక కథ, కథనాల డిమాండ్ మేరకు సితారా, అన్నపూర్ణ బ్యానర్లు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలను పక్కన పెడితే.. అఖిల్ పెర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ భోర్సే గ్లామర్ కోసం ఈ సినిమాను థియేటర్‌ లో చూడాలనిపించేంతలా ఉంది. ఈ వారం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాను చూడాలనుకొంటే లెనిన్ చక్కటి ఆప్షన్.


Jul 10, 2026 Telugu

Lenin movie Review

7.0
out of 10
అఖిల్ అక్కినేని తన కెరీర్ ఆరంభం నుంచీ ఓ సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నాగార్జున సైతం తన కొడుకు హిట్టు కోసం చాలానే కష్టపడుతూ వచ్చాడు. ఇక చివరగా ఏజెంట్ అంటూ డిజాస్టర్‌ను ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని, ఆచితూచి అడుగులు వేసి ‘లెనిన్’ అంటూ ఈ రోజు (జూలై 10న) ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ చాలా వరకు కనిపించొచ్చు. చాలా చోట్ల ద...

అఖిల్ అక్కినేని తన కెరీర్ ఆరంభం నుంచీ ఓ సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నాగార్జున సైతం తన కొడుకు హిట్టు కోసం చాలానే కష్టపడుతూ వచ్చాడు. ఇక చివరగా ఏజెంట్ అంటూ డిజాస్టర్‌ను ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని, ఆచితూచి అడుగులు వేసి ‘లెనిన్’ అంటూ ఈ రోజు (జూలై 10న) ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. 


లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ చాలా వరకు కనిపించొచ్చు. చాలా చోట్ల దసరా, రాజా ది గ్రేట్, రంగస్థలం ఛాయలు కూడా కనిపించొచ్చు. కొన్ని ట్విస్టుల్ని ముందే గెస్ చేస్తాం. కొన్ని ట్విస్టుల్ని మాత్రం అస్సలు గెస్ చేయలేం. అక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మూవీ చాలా వరకు మనకు తెలిసినట్టుగా, ఊహించినట్టుగా సాగుతూనే ఉంటుంది. అయినా కూడా డైరెక్టర్ మురళీ మాత్రం చివరకు తన మేకింగ్, టేకింగ్, కథతో, అందులో పెట్టుకున్న ట్విస్టులతో అందరినీ ఆకట్టుకుంటాడు.


అఖిల్ చాలా వరకు అదరగొట్టేశాడు. ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో పరిణితిని కనబర్చాడు. భాగ్యశ్రీ మాత్రం ఈ సినిమాకి నిజంగానే సోల్. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రమోద్ పంజు పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా చాలా చోట్ల అనిపిస్తుంది. ఓవరాల్‌గా లెనిన్ రెగ్యులర్, రొటీన్, మాస్ కమర్షియల్ టెంప్లెట్ మూవీగా అనిపించొచ్చు. కానీ అఖిల్ కెరీర్‌లో మాత్రం లెనిన్ చెప్పుకోవదగ్గ, నిలిచిపోయే చిత్రంగా మారే అవకాశం ఉంది. మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ‘లెనిన్’ బాగానే ఎక్కేసేలా ఉంది. కావాల్సిన పాటలు, ఫైట్స్, ఎమోషన్స్, ట్విస్టులు ఇలా అన్ని ఉండటంతో ఈ వీకెండ్‌ కి మంచి ఆప్షన్‌ గా ‘లెనిన్’ను పెట్టుకోవచ్చు.


Jul 10, 2026 Telugu

Lenin movie Review

లెనిన్ (LENIN) 2026 Twitter Channel
6.0
out of 10
#Lenin Template Commercial Film with a Few Interesting Twists!Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and while a few second half blocks and twists work well, its biggest issue is that it feels too reminiscent of rural dramas we’...

#Lenin Template Commercial Film with a Few Interesting Twists!


Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and while a few second half blocks and twists work well, its biggest issue is that it feels too reminiscent of rural dramas we’ve seen before, giving it an outdated feel at times.


Thaman’s music is a hit and miss, and the song placement is bad. Akhil shows improvement over his previous outings and delivers a watchable film, but this one doesn’t have enough to be a completely satisfying watch. Average!


Rating: 2.5/5

Jul 10, 2026 Telugu
Why MRO?