Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
88
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 73-84 of 233 reviews
Clear all filters

Irumudi Movie Review

7.0
out of 10
రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని "ఇరుముడి"ని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులను ఏడిపించేసారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, కూతుళ్లు అన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాల...

రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని "ఇరుముడి"ని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులను ఏడిపించేసారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, కూతుళ్లు అన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలి అని మెసేజ్ ని చాలా చక్కగా చూపించారు. అయితే ఆ అమ్మాయిల సంబంధించిన సీన్స్ కొంత ఇబ్బందిగా, హార్డ్ హిట్టింగ్ గా అనిపించవచ్చు కొంతమందికి. 


సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏదో అసంతృప్తి అనిపిస్తుంది. కానీ చివర్లో మణికంఠ పాత్ర చెప్పిన ఒక్క డైలాగ్ తో సినిమా పరిపూర్ణం అయింది అనే ఫీల్ వస్తుంది. ఇటీవల సినిమా థియేటర్స్ నుంచి ఏడుస్తూ బయటకువచ్చిన సినిమాలు రాలేదు. చాన్నాళ్ల తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఏడుస్తూ బరువైన హృదయంతో బయటకు వస్తారు. అయితే కమర్షియల్ గా చూస్తే ఈ సినిమాని కార్తీక మాసం, అయ్యప్ప మాల సీజన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ హైప్, రీచ్ వచ్చేది. చాన్నాళ్ల తర్వాత రవితేజ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. మొత్తంగా ‘ఇరుముడి’ తన కూతురు, ఊళ్ళో ఆడపిల్లల కోసం నిలబడే ఓ మిడిల్ క్లాస్ తండ్రి కథ అయ్యప్ప స్వామి మాలతో యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ సినిమాగా మెప్పిస్తుంది.


Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

7.0
out of 10
నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.. "ఇరుముడి" సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమ...

నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.. "ఇరుముడి" సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమా. తెలిసిన కథనే కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాడు శివ నిర్వాణ.. 


ఆడపిల్లకు భయం ఉండకూడదు అనే లైన్ ఈ సినిమాతో చెప్పాలనుకున్నాడు శివ. దానికి రవితేజ లాంటి యాక్టర్ తోడయ్యేసరికి మెసేజ్ బాగానే పాస్ అయింది. ఎమోషనల్ సినిమా కాబట్టి స్లోగానే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ఇరుముడిలో లోపాలు కూడా బాగానే ఉన్నాయి.. కానీ వాటిని కంటెంట్ తో కవర్ చేశాడు శివ నిర్వాణ. ఈ క్రమంలో అక్కడక్కడ ఆయన స్లో అయ్యాడు కానీ ఓవరాల్ గా మంచి మెసేజ్ ఇచ్చాడు. ఓవరాల్ గా ఇరుముడి.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా..!


Aug 21, 2026 Tamil +1

Irumudi movie review

Sakshi

By Sakshi

7.0
out of 10
రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త్రినాథ్ క్యారెక్టర్‌ను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. కథ అసలు మలుపు తిరిగిన తర్వాత డ్రామాను...

రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త్రినాథ్ క్యారెక్టర్‌ను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. కథ అసలు మలుపు తిరిగిన తర్వాత డ్రామాను బలంగా నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను గట్టిగా హిట్ చేస్తాయి.


త్రినాథ్‌గా రవితేజ నటన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి బాధ, కోపం, కసితో కూడిన పాత్రను ఆయన బాగా క్యారీ చేశాడు. అమ్మాయిలపై జరిగే అన్యాయం, తండ్రి ఆవేదనను కలిపి చెప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు, కథలోని కొన్ని అంశాలు అందరికీ సులభంగా కనెక్ట్ కాకపోవచ్చు. అయినా కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వెళ్లి ఎమోషన్‌ను నమ్ముకున్న ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్‌లో డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలుస్తుంది.


Aug 21, 2026 Tamil +1

Irumudi movie review

8.0
out of 10
మాస్ మహారాజా రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా **‘ఇరుముడి’**తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. త్రినాథ్ అనే సాధారణ అరటిపళ్ల వ్యాపారి జీవితంలో జరిగే విషాద ఘటన, ఆ తర్వాత అతడి పోరాటం చుట్టూ తిరుగుతుంది. కూతురు మణెమ్మకు జరిగిన అన్యాయం, ఊర్లో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాల వెనుక అసలు నిజాన్ని తెలుసుకునే క్రమంలో త్రినాథ్ చేసే పోరాటం కథకు ప్రధాన బలం...

మాస్ మహారాజా రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా **‘ఇరుముడి’**తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. త్రినాథ్ అనే సాధారణ అరటిపళ్ల వ్యాపారి జీవితంలో జరిగే విషాద ఘటన, ఆ తర్వాత అతడి పోరాటం చుట్టూ తిరుగుతుంది. కూతురు మణెమ్మకు జరిగిన అన్యాయం, ఊర్లో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాల వెనుక అసలు నిజాన్ని తెలుసుకునే క్రమంలో త్రినాథ్ చేసే పోరాటం కథకు ప్రధాన బలం. ముఖ్యంగా చివరి అరగంటలో డ్రామా, ఎమోషన్ పీక్స్‌కు చేరుతాయి. రవితేజ తన పాత్రలోని బాధ, కోపం, కసిని అద్భుతంగా పలికించాడు.


కథలో కొన్ని అంశాలు సగటు ప్రేక్షకుడికి జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినా.. దర్శకుడు కమర్షియల్ మూసను పక్కనపెట్టి చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా తెరకెక్కించాడు. ఓవరాల్‌గా ‘ఇరుముడి’ మాస్ కంటే ఎమోషన్‌ను నమ్ముకున్న సినిమా. రవితేజ పెర్ఫార్మెన్స్, బలమైన క్లైమాక్స్, హృద్యమైన మెసేజ్ సినిమాకు ప్రధాన హైలైట్స్. ఫైనల్ గా డివోషనల్ టచ్ ఉన్న ఒక మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్. 

Aug 21, 2026 Tamil +1

Agadha Movie Review

అగధ (Agadha) 2026 News Channel
5.0
out of 10
నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ ఎక్కడ మొదలై, ఎలా ముగుస్తుందో ముందే అంచనా వేసినా.. దైవశక్తిని ఎలా చూపించారు? దుష్టశక్తి ఎలాంటి విధ్వంసం సృష్టించింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అన్న అంశాలే సినిమాను ఆసక్తికరంగా మ...

నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ ఎక్కడ మొదలై, ఎలా ముగుస్తుందో ముందే అంచనా వేసినా.. దైవశక్తిని ఎలా చూపించారు? దుష్టశక్తి ఎలాంటి విధ్వంసం సృష్టించింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అన్న అంశాలే సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. దర్శకుడు ఎంఎస్ రాజు మాటల్లో ‘అగధ’కు భారీగా బిల్డప్ ఇచ్చినప్పటికీ.. తెరపై మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.


ముఖ్యంగా సెకండాఫ్‌పై పెట్టుకున్న అంచనాలు నిరాశపరుస్తాయి. కథనం మరింత ఆసక్తికరంగా సాగాల్సిన చోట నెమ్మదించడం సినిమాకు మైనస్‌గా మారింది. ఇక బ్లాక్ మ్యాజిక్‌ను చూపించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. టెక్నికల్ టీమ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ఎమ్మెస్ రాజు కథ కొత్తగా ఎంచుకున్నా, ట్రీట్మెంట్ పాత గానే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే అగధ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది. 


Aug 20, 2026 Telugu

Agadha Movie Review

అగధ (Agadha) 2026 News Channel
5.0
out of 10
దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి...

దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సినిమాలకు బిగువైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. కానీ ఇందులో అదే మిస్ అయింది. 


టెక్నికల్ గా ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. కానీ పేలవమైన బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి చూసేలానే ఉంది. ఓవరాల్ గా అగధ.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్..! 

Aug 20, 2026 Telugu

Agadha movie review

అగధ (Agadha) 2026 News Channel
Sakshi

By Sakshi

5.0
out of 10
దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. ఇంట్రెస్టింగ్ సీన్లు కూడా పెద్దగా ఏం లేవు. థ్రిల్లర్ మూవీ అంటే ట్విస్టులు, థ్రిల్స్, హారర్ వంటి ఎలిమెంట్స్ చాలా...

దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. 


ఇంట్రెస్టింగ్ సీన్లు కూడా పెద్దగా ఏం లేవు. థ్రిల్లర్ మూవీ అంటే ట్విస్టులు, థ్రిల్స్, హారర్ వంటి ఎలిమెంట్స్ చాలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అవి ఊహించిన దానికంటే తక్కువే ఉన్నాయి. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ వన్ టైం వాచబుల్. 

Aug 20, 2026 Telugu

Palla Burusu movie review

6.0
out of 10
బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ పళ్ళ బురుసు సినిమా టీజర్ చూడగానే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్నాలు, తిరుపతి కూతురు పెళ్లి, ఊళ్ళో శంభుతో ఉండే ఇంకో నలుగురు ముసలి తాతలతో సరదాగా కామెడీగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదట కాస్త కామెడీగా సాగినా తర్వాత అంతా ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ఓ కొత్త పాయ...

బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ పళ్ళ బురుసు సినిమా టీజర్ చూడగానే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్నాలు, తిరుపతి కూతురు పెళ్లి, ఊళ్ళో శంభుతో ఉండే ఇంకో నలుగురు ముసలి తాతలతో సరదాగా కామెడీగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదట కాస్త కామెడీగా సాగినా తర్వాత అంతా ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ఓ కొత్త పాయింట్ ని తీసుకొని దర్శకుడు మరింత ఎమోషనల్ చేసాడు.


ఒంటరితనం ఎంత భయంకరమైనది, ముసలితనంలో అది ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనే మెసేజ్ ని బాగా చూపించారు. అయితే క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు కానీ ఎమోషనల్ గా ముగిస్తే ప్రేక్షకుడు రియాలిటీకి కనెక్ట్ అయి బరువైన హృదయంతో బయటకు వెళ్ళేవాడు. మొత్తంగా ‘పళ్ళ బురుసు’ సినిమా కొడుకు పట్టించుకోవట్లేదని ఓ ముసలి తండ్రి పడే ఆవేదనను నవ్వించి ఏడిపిస్తూ చూపించిన కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.


Aug 19, 2026 Telugu

Makutam movie review

మకుటం (Makutam) 2026 News Channel
4.0
out of 10
విశాల్, దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మకుటం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ముఖ్యంగా ఆసక్తికరమైన నేరేషన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అవి కథకు...

విశాల్, దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మకుటం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ముఖ్యంగా ఆసక్తికరమైన నేరేషన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అవి కథకు పూర్తిగా బలం చేకూర్చలేకపోయాయి. 


విశాల్ తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే బలమైన కథ, ఆకట్టుకునే కథనం లేకపోవడంతో సినిమా స్థాయి ఆశించినంతగా కనిపించలేదు. ఓవరాల్‌గా ‘మకుటం’ సాధారణ కథ, బోరింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. విశాల్ అభిమానులు ఆయన పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి ప్రయత్నించవచ్చు. ఒక్కముక్కలో సినిమా గురించి చెప్పాలంటే ఇదొక పాత చింతకాయ పచ్చడి కథ. 

Aug 18, 2026 Tamil +1
7.0
out of 10
సూర్య–మామిత విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్‌ లో ఇద్దరూ లవర్స్‌ గా కనిపించడంతో అసలు కథ ఇదేనా అంటూ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ హీరోతో ఇలాంటి ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకోవడం వెంకీ అట్లూరి చేసిన డిఫరెంట్ అటెంప్ట్. అయితే కొత్త పాయింట్ ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. రెగ్యులర్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఫీల్ గుడ్ టచ్‌తో చెప్పాడు వెంకీ. ఎమోషనల్ డైలాగ్స్, ఫన్నీ మూమెంట్స్, సూర్య–...

సూర్య–మామిత విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్‌ లో ఇద్దరూ లవర్స్‌ గా కనిపించడంతో అసలు కథ ఇదేనా అంటూ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ హీరోతో ఇలాంటి ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీని ఎంచుకోవడం వెంకీ అట్లూరి చేసిన డిఫరెంట్ అటెంప్ట్. అయితే కొత్త పాయింట్ ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వదు. రెగ్యులర్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఫీల్ గుడ్ టచ్‌తో చెప్పాడు వెంకీ. ఎమోషనల్ డైలాగ్స్, ఫన్నీ మూమెంట్స్, సూర్య–మామిత కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.


ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త వీక్‌గా అనిపించినా.. 2.5 గంటలకు పైగా ఉన్న రన్‌టైమ్‌లోనూ కథనాన్ని ఎంగేజింగ్‌గా నడిపించడం ప్లస్ పాయింట్. మొత్తంగా కొత్త కాన్సెప్ట్ కంటే వెంకీ అట్లూరి ట్రీట్‌మెంట్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఈ సినిమాకు అసలు బలం. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను క్రిస్పీగా కట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్. 

Aug 17, 2026 Tamil +1
7.0
out of 10
సూర్య–మామిత కాంబినేషన్ అనగానే ఫాదర్–డాటర్ తరహా కథ అనుకున్న వారికి టీజర్ షాకిచ్చింది. ఇద్దరి మధ్య వయసు తేడాతో కూడిన ప్రేమకథగా సినిమా ఆసక్తిని పెంచింది. అయితే వెంకీ అట్లూరి కొత్త పాయింట్‌ను ఎంచుకున్నా.. కథనం మాత్రం సగటు లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగానే సాగుతుంది.ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యూత్‌ను ఆకట్టుకునే ఫన్నీ డైలాగ్స్‌తో వెంకీ అట్లూరి రచయితగా, దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా “మనుషులు వ...

సూర్య–మామిత కాంబినేషన్ అనగానే ఫాదర్–డాటర్ తరహా కథ అనుకున్న వారికి టీజర్ షాకిచ్చింది. ఇద్దరి మధ్య వయసు తేడాతో కూడిన ప్రేమకథగా సినిమా ఆసక్తిని పెంచింది. అయితే వెంకీ అట్లూరి కొత్త పాయింట్‌ను ఎంచుకున్నా.. కథనం మాత్రం సగటు లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగానే సాగుతుంది.


ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యూత్‌ను ఆకట్టుకునే ఫన్నీ డైలాగ్స్‌తో వెంకీ అట్లూరి రచయితగా, దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా “మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక” వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.


సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఇంకాస్త బలంగా ఉంటే సినిమా మరింత ఇంప్రెస్ చేసేది. అయినప్పటికీ రెండున్నర గంటలకు పైగా ఉన్నా పెద్దగా బోర్ కొట్టకుండా సాగడం సినిమాకు ప్లస్. ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్..క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ప్లెజెంట్ మూమెంట్స్. 

Aug 17, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 News Channel
7.0
out of 10
డీసీ మూవీకి దర్శకుడు ఎంచుకున్న మార్గం చాలా షార్ట్ అండ్ షార్ప్‌గా ఉంది. పైకి కేవలం క్రైమ్ డ్రామాలాగా కనిపించినా, లోపల బలమైన సామాజిక అంశాన్ని, పేదల విద్యా హక్కును చర్చించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. విశ్రాంతి సమయానికి ముందు వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఎన్నాళ్ళయిందో ఒక అదిరిపోయే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చూసి.. DC తో ఆ లోటు తీరిపోయిందని ఆడియన్స్ ఖచ్చిత...

డీసీ మూవీకి దర్శకుడు ఎంచుకున్న మార్గం చాలా షార్ట్ అండ్ షార్ప్‌గా ఉంది. పైకి కేవలం క్రైమ్ డ్రామాలాగా కనిపించినా, లోపల బలమైన సామాజిక అంశాన్ని, పేదల విద్యా హక్కును చర్చించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. విశ్రాంతి సమయానికి ముందు వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఎన్నాళ్ళయిందో ఒక అదిరిపోయే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చూసి.. DC తో ఆ లోటు తీరిపోయిందని ఆడియన్స్ ఖచ్చితంగా అనుకుంటారు. 


పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అలాంటిదే ఈ సినిమా.. వెరీ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అన్నట్టు తీశాడు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. ఇదేమీ తెలియని కథ కాదు.. ఎన్నో సినిమాల్లో చూసిన కథే.. సమాజానికి ఎదురెళ్లే ఒక గ్యాంగ్ స్టర్.. సమాజం చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి.. కలిసి చేసే ప్రయాణమే డిసి సినిమా. ఇక సినిమాని మెజారిటీ నిలబెట్టింది అనిరుధ్ బీజీఎమ్. ఇటు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తన మేకింగ్ స్టైల్ చూపించాడు.. మరోసారి పోలీసుల చేతిలో అణిచివేయబడుతున్న సామాన్యుల కథనే తీసుకున్నాడు. ఓవరాల్‌ గా డిసి.. గన్స్ అండ్ రోజెస్.. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్..!

Aug 08, 2026 Tamil +1
Why MRO?