Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Gayapadda Simham movie Review
'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ అదే లూప్‌లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఎమోషన్, కామెడీ రెండింట్లోనూ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే.
ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే..జస్ట్ ఒకే. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే..కొత్తదనం కోసం వెళ్ళేవాళ్లకి మిస్, టైమ్‌పాస్ కోసం వెళ్లేవాళ్లకి కూడా మిక్స్డ్ ఫీలింగ్ మాత్రమే. రేటింగ్ విషయానికి వస్తే... ఫైవ్ అవుట్ అఫ్ టెన్ వరకు ఇవ్వొచ్చు.. లేదంటే టు పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వొచ్చు.
Gayapadda Simham movie Review
సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనబడకపోవడం పెద్ద డిసప్పాయింట్.
ఫస్ట్ హాఫ్ మొత్తం లాజిక్ లేకుండా, సిల్లీ సిట్యుయేషన్స్ తో సాగిపోతుంది. కామెడీ కోసం పెట్టిన రిఫరెన్సులు కూడా పెద్దగా పేలవు. ప్రేక్షకుడు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ నవ్వాలి అన్న క్లారిటీ లేకుండా సినిమా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. నటీనటుల పరంగా చూస్తే తరుణ్ భాస్కర్ తన పాత్రలో ఓకే అనిపించినా, సినిమాలోని బలహీన రైటింగ్ వల్ల ఆయన పర్ఫార్మెన్స్ కూడా లిఫ్ట్ కాలేదు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి పాత్రలు కూడా పరిమితంగానే ఉన్నాయి. జెడి చక్రవర్తి పాత్రకు ఉన్న బిల్డప్ స్క్రీన్ పై కనిపించదు. అయితే శ్రీ విష్ణు ఎంట్రీ మాత్రం కొంతవరకు సినిమాకు ఎనర్జీ ఇస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ కంఫ్యూజ్డ్ రైటింగ్ + వీక్ ఎక్స్యూగుషన్.
Gayapadda Simham movie Review
'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు, మీమ్ లను పెట్టినా అవి నవ్వు తెప్పించలేవు. సెకండాఫ్ లో కూడా కథ ముందుకు వెళ్లకుండా అదే చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.
ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి రోల్స్ పరిమితంగానే ఉంటాయి. జెడి చక్రవర్తి పాత్రకు హైప్ ఇచ్చినా, స్క్రీన్ పై పెద్దగా ఇంపాక్ట్ లేదు. సినిమా మొత్తం బోర్ గా సాగుతున్న టైం లో శ్రీ విష్ణు ఎంట్రీ కొద్దివరకు రిలీఫ్ ఇస్తుంది. టెక్నికల్ గా పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా సినిమా బలహీనంగా ఉంది. మొత్తంగా ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ లాగా… ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి కూడా ‘గాయం’ మిగులుతుంది. కామెడీ కోసం వచ్చినవాళ్లకు నిరాశ, కొత్తదనం కోరుకున్నవాళ్లకు పూర్తిగా మిస్ అయ్యే సినిమా ఇది. ఓవరాల్ గా గాయపడ్డ సింహాన్ని చూసి జాలిపడితే థియేటర్ నుంచి వచ్చిన ఆడియన్స్ ని చూసి మరొకరు జాలిపడతారు అన్నట్టుంది.
కర’ సినిమా చూసాక ఒకే ఫీలింగ్… “బేస్ బాగుంది… కానీ ప్యాకేజింగ్ కాస్త వీక్!” హీరోగా Dhanush తనదైన స్టైల్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో ఆయన యాక్టింగ్ నిజంగా హైలైట్. కానీ సినిమా మొత్తం అదే ఎనర్జీని మెంటైన్ చేయలేకపోయింది. డైరెక్టర్ Vignesh Raja తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సాలిడ్. చాలా సీన్లు రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మరీ సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకున్నారు. అందువల్ల ఆడియన్స్ కి మరీ ఇంత ఎమోషన్స్ ఏంట్రా తట్టుకోలేకపోతున్నాం అన్న ఫీల్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ ఓవర్‌డోస్‌గా అనిపిస్తుంది.
కొన్ని సీన్స్ బాగా హిట్ అవుతాయి… కానీ వెంటనే ఫ్లో బ్రేక్ అవ్వడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ మిస్ అవుతుంది. జివి ప్రకాష్ బీజీఎమ్ కూడా బాగుంది. ఓవరాల్ గా కర ఒక స్లో పేస్డ్ ఫిలిం. కానీ సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. విజువల్స్ కూడా బావుంటాయి. కానీ ఫ్రెష్ నెస్ కోరుకుంటే డిస్సపాయింట్ అవుతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి అయితే ఒకే గాని, లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్, ఎంటర్టైన్మెంట్స్ ఇష్టపడే వాళ్లకయితే పెద్దగా సినిమా నచ్చకపోవచ్చు.
‘కర’ సినిమాను ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని మొదట్లోనే అర్థమవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు వంటి సీరియస్ అంశాలను తీసుకున్న దర్శకుడు Vignesh Raja వాటిని ఎక్కువ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ అదే ఎమోషన్ కొన్ని చోట్ల ఓవర్ డోస్ అయి, కథనం స్లోగా మారినట్టు అనిపిస్తుంది. హీరోగా Dhanush తనదైన నేచురల్ యాక్టింగ్‌తో కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా, మొత్తం సినిమాను బలంగా లిఫ్ట్ చేయలేకపోయాడు.
కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చెత్తగా అనిపిస్తాయి. దొంగతనాలు చేయడమే తప్పంటే.. అవి చేస్తున్న ప్రతిసారి హీరో దేవుడ్ని ప్రార్థిస్తాడు, అలాగే హీరో దొంగతనాలు చేయడం తప్పు కాదన్నట్టు పోర్ట్ ట్రే చేస్తునట్టుంటుంది. తమిళ సినిమాల్లో ఇలాంటివి బాగానే చూపిస్తారు. బట్ నటీనటుల పెర్ఫార్మన్స్ కి అయితే పేరు పెట్టలేం. అందరూ బానే చేసారు. స్పెషల్లీ కెఎస్ రవికుమార్. ఆయన తన రోల్ లో జీవించేసారు. ఇక టెక్నికల్ గా చూస్తే విజువల్స్ 90ల వాతావరణాన్ని బాగా రీక్రియేట్ చేశాయి. అయితే ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే సినిమా నెరేషన్ మరింత టైట్ గా ఉండేదనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘కర’ మంచి ఐడియాతో వచ్చిన సినిమా అయినప్పటికీ, ప్రెజెంటేషన్ మరియు పేస్ కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ధనుష్ నటించిన 'కర' సినిమా విషయానికి వస్తే... ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో స్టార్ట్ అవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు… ఇవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాడు దర్శకుడు Vignesh Raja. కానీ ఆ ఐడియాను ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఎంగేజింగ్ గా స్క్రీన్ పై చూపించాలి అన్న విషయంలో మాత్రం సినిమా పూర్తిగా వర్క్ అవ్వలేదని అనిపిస్తుంది. హీరోగా Dhanush తన పాత్రలో ఎప్పటిలాగే నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్ స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతుంది. కానీ సినిమా నెరేషన్ స్లోగా ఉండడం, కొన్ని చోట్ల ఎమోషన్ ఓవర్‌డోస్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ కంటిన్యూ కాలేదు.
ఇక కథలో ఉన్న రివేంజ్ ఎలిమెంట్, “ముల్లుని ముల్లుతోనే తీయాలి” అన్న కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఆ పాయింట్ ను మరింత టైట్ స్క్రీన్ ప్లే తో, ఎంగేజింగ్ నెరేషన్ తో తీసుకెళ్లి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేది. ‘కర’ = Strong concept, but underwhelming execution. మెసేజ్ ఉంది… కానీ ప్రెజెంటేషన్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. ఒక్క ముక్కలో కర గురించి చెప్పాలంటే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలాగా ఉంది. అంటే తెలుగు సినిమాల్లా నాలుగు పాటలు, ఫైట్లు లా కాకుండా, తమిళ సినిమాల్లో ఎలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ఉంటాయో అలాంటి ఛాయలు కర లో ఉన్నాయి.
‘కర’ సినిమా గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే… “కాన్సెప్ట్ బాగుంది… కానీ ప్రెజెంటేషన్ కాస్త మిస్ అయింది. కోలీవుడ్ స్టార్ Dhanush నుంచి ఎప్పుడూ ఏదో డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈసారి కూడా రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు లాంటి సాలిడ్ టాపిక్ తీసుకున్నాడు. కానీ సినిమా చూసేటప్పుడు ఆ ఎమోషన్ మనకి పూర్తిగా కనెక్ట్ అవుతుందా అంటే… అక్కడే కాస్త లాగ్ ఫీల్ అవుతుంది.
డైరెక్టర్ Vignesh Raja కథను ఎమోషనల్ గా తీసుకెళ్లాలని ట్రై చేశాడు… కానీ కొన్ని చోట్ల ఓవర్ డోస్ అయ్యింది. కొన్ని సీన్స్ బాగానే హిట్ అవుతాయి. కానీ వెంటనే వచ్చే సీన్స్ వల్ల ఆ ఫీల్ కట్ అయిపోతుంది.
టెక్నికల్‌గా మాత్రం సినిమా సాలిడ్. థెని ఈశ్వర్ విజువల్స్ 90’s ఫీల్ ని బాగా తీసుకొచ్చాయి. అలాగే జివి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ కొన్ని సీన్స్‌ను బాగా లిఫ్ట్ చేసింది. సాంగ్స్ మాత్రం పర్లేదు. ఓవరాల్ గా కర సినిమాను ఇంకాస్త షార్ప్ గా, ఎంగేజింగ్ గా తీసి ఉంటే… ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అయ్యేది.
జెట్లీ’ సినిమా స్టార్ట్ అయ్యిన 10 నిమిషాల్లోనే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది… “ఏం జరుగుతోంది బాస్?” అనిపిస్తది. అదే ఫీలింగ్ సినిమా అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి ఫుల్ కన్ఫ్యూజన్ తో ఒక ఎక్స్‌పెరిమెంట్ ట్రై చేశాడు. కానీ ఆడియెన్స్ మాత్రం స్టోరీ కన్నా… “ఇది ఏంటి?” అన్న డౌట్ తోనే కూర్చోవాల్సి వస్తుంది. హీరోగా సత్య మళ్లీ తన కామెడీ టైమింగ్ చూపించడానికి ట్రై చేశాడు. కొన్ని వన్‌లైనర్స్, పంచ్‌లు బాగానే పేలుతాయి. కానీ ఫుల్ మూవీని మోయడానికి మాత్రం సరిపోలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లు, పేర్లు, సిట్యుయేషన్స్ అన్నీ కలిపి ఒక గందరగోళం. నవ్వాలో, ఆలోచించాలో, లేక పక్క వాళ్లను అడగాలో అనిపించే పరిస్థితి.
ఇక సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి “ఓహ్… ఇది రివేంజ్ స్టోరీనా!” అని క్లారిటీ వస్తుంది. కానీ అప్పటికి ఆడియెన్స్ పేషెన్స్ ఆల్రెడీ టెస్ట్ అయిపోయి ఉంటుంది. బట్ ఏమాత్రం సాటిస్ఫై అయినట్టు అనిపించదు. ఫైనల్ గా జెట్లీ ఒక ఫుల్ కన్ఫ్యూషన్ ప్యాకెజీ అనిపిస్తది. ఓవరాల్ గా కొత్తగా ట్రై చేసారు గాని, సినిమా మాత్రం అంత లేదు. సినిమా నేరేషన్ లో ఏమాత్రం బలం లేదు. ఇట్స్ ఎ డిస్సపాయింటింగ్ ఫిలిం ఫర్ ఆడియన్స్.
"జెట్లీ" మూవీ ఒక డిఫరెంట్ ఎటెంప్ట్ అని ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి లీనియర్ నెరేషన్‌ను వదిలి, మల్టిపుల్ లేయర్స్ తో కథను చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం ఎంగేజింగ్ గా కాకుండా కన్ఫ్యూజింగ్ గా మారింది.
హీరోగా సత్య తన పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేశాడు. అయితే, కథనంలో క్లారిటీ లేకపోవడం వల్ల అతని పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.
స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మెయిన్ ఇష్యూ. ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక ఎమోషనల్ లేదా నేరేటివ్ కనెక్షన్ ఉండాలి. కానీ ‘జెట్‌లీ’లో అది మిస్సైంది. సెకండ్ హాఫ్‌లో రివేంజ్ డ్రామా యాంగిల్ రివీల్ అయినా, అప్పటికి ఆడియెన్స్ ఎంగేజ్‌మెంట్ తగ్గిపోయే అవకాశముంది. టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపించినా, రైటింగ్ మరియు నెరేషన్‌లో మరింత క్లారిటీ ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఓవరాల్ గా
‘జెట్లీ’ ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం తడబడింది. సింపుల్ గా చెప్పాలంటే... టేకాఫ్ బానే అయింది గాని, మధ్యలో కొంచెం ఎక్కువ షేక్ అయింది. లోడింగ్ కూడా కొంచెం అవుట్ డేట్ అయి, క్రాష్ లాండ్ అయింది. కానీ అందరూ సేఫ్ అన్నట్టుంటుంది. అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయలేము కానీ, జాగ్రత్తగా బైటికి రావచ్చు.
‘జెట్లీ’ సినిమా చూస్తుంటే ఇదొక స్ట్రైట్ కథ కాదు… పూర్తిగా కన్ఫ్యూజన్ మీద నడిచే నెరేషన్ అనిపిస్తుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి కథను సింపుల్‌గా చెప్పకుండా, గందరగోళంగా ప్రెజెంట్ చేయాలని ట్రై చేశాడు. హీరోగా Satya పలు పేర్లు, పలు ఫ్లాష్‌బ్యాక్‌ల మధ్య తానే కన్ఫ్యూజ్ అవుతూ కనిపిస్తాడు… అదే ఫీలింగ్ ఆడియెన్స్ కూ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కథ ఏ దిశగా వెళ్తుందో అర్థం కాకుండా సాగుతుంది. నవ్వాలా, సీరియస్ గా తీసుకోవాలా అనే సందేహం కొనసాగుతూనే ఉంటుంది. చివరికి ఇది రివేంజ్ డ్రామా అని క్లియర్ అయినప్పటికీ, అప్పటికి కనెక్షన్ మిస్సయ్యే అవకాశం ఉంది.
సత్య తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసినా, అది పూర్తిగా వర్కౌట్ అవదు. స్టోరీయే లేనపుడు ఎంత కామెడీ ఉంటే ఎం చేస్తారు. కామెడీని నమ్ముకున్న ప్రతి సినిమా సక్సెస్ అవదు కదా. ఇటు వెన్నెల కిశోర్ కూడా తన వరకు బానే ట్రై చేసాడు గాని, పూర్తి స్థాయిలో సినిమాను మోయలేకపోయాడు. ఓవరాల్ గా డైరెక్టర్ రితేష్ రానా ముందు సినిమాలు చూసి జెట్లీకి ఓటేశారంటే మోసపోతారు. తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్తే కొంచెం నవ్వుకునే ఛాన్స్ ఉంది గాని, సినిమా మొత్తం నచ్చాలి అంటే కుదరని పని. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక ఎక్స్‌పెరిమెంటల్ సినిమా… కానీ ఎంటర్టైన్‌మెంట్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా మిగిలిపోతుంది.
జెట్లీ’ అనే సినిమా ఒక ప్రశ్నతో మొదలవుతుంది… “సినిమా అంటే కేవలం కథనా? లేక అనుభవమా?” దర్శకుడు Ritesh Rana ఈ చిత్రంతో కథను చెప్పడం కంటే… ఒక గందరగోళాన్ని అనుభవంగా చూపించాలని ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. హీరో Satya ఎదుర్కొనే గందరగోళం… అదే ఆడియెన్స్‌కి కూడా ఫీల్ ఇస్తుంది. పైగా ఇది మాములు ప్రయోగం కాదు… లీనియర్ నేరేషన్‌కి విరుద్ధంగా, విభిన్నమైన నిర్మాణం. కానీ ఈ ప్రయోగం అందరికీ చేరువ అవుతుందా? అనేది ప్రశ్న.
సింపుల్ గా చెప్పాలంటే సినిమా 90 శాతం బొక్క కూడా అర్ధం కాదు అన్నట్టుంటుంది. అలాగే సత్య తన నటనతో, టైమింగ్‌తో కొన్ని క్షణాల్లో మెరిసినా… మొత్తం సినిమాను తన భుజాలపై మోసే స్థాయికి అది చేరలేదు. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ తో ఒకే అనిపించేలా ఉంది గాని, థియేటర్లను ఆడియన్స్ ను రప్పిస్తుందా అంటే కష్టమే అనిపిస్తుంది. ఓవరాల్ గా జెట్లీ సత్య, రితేష్ రానా మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. మిగతా వాళ్ళు కష్టమే.
‘జెట్లీ’ సినిమా చూసాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే — “బాస్… మనం ఏమి చూశాం?” స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇదొక కన్ఫ్యూజన్ రైడ్. హీరో Satya ఎలా కన్ఫ్యూజ్ అవుతాడో… ఆడియెన్స్ కూడా అలాగే ఫీలవుతారు. అసలు కథ ఏంటి? కామెడీనా? థ్రిల్లరా? లేక ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఆ? అన్నది అర్థం కాకుండా పోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రకరకాల పేర్లు, ఫ్లాష్ బ్యాక్స్, సీన్స్… ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ ప్లేటర్ లా ఉంటుంది. నవ్వాలా? సీరియస్ గా తీసుకోవాలా? అన్న డౌట్ ఆడియెన్స్ కి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫ్లైట్ లో చిక్కుకున్నట్టు సినిమా మొత్తం థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది.
డైరెక్టర్ Ritesh Rana కొత్త స్టైల్ లో నెరేషన్ ట్రై చేశాడు. కానీ అది స్క్రీన్‌పై వర్క్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌కి దగ్గరగా వచ్చాక ఇది రివేంజ్ డ్రామా అని క్లియర్ అవుతుంది… కానీ అప్పటికి ఆడియెన్స్ కనెక్షన్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సత్య కామెడీ, వన్ లైనర్స్ కొన్ని చోట్ల వర్క్ అవుతాయి. కానీ ఫుల్ మూవీని మోయడానికి మాత్రం సరిపోలేదు. ఓవరాల్ గా కొంచెం కొత్తదనం ట్రై చేశారు… కానీ ఎంటర్టైన్‌మెంట్ మాత్రం మిస్సయ్యింది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers