Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

512
Total Reviews
72
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 73-84 of 512 reviews
Clear all filters

Deewana Movie Review

7.0
out of 10
ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇటువంటి ప్రేమకథ రాలేదని 'దీవానా' విడుదలకు ముందు నుంచి చిత్ర బృందం చెబుతా వచ్చింది. నిజంగా రాలేదా? అంటే... 'లేదు' అని చెప్పాలి. ఎందుకు? అనేది చెప్పాలంటే... ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక చెప్పలేం. కానీ, ఒక్కటి మాత్రం నిజం... సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తుంది.ఇంటర్వెల్ వరకు 'దీవానా' ఓ సాధారణ ప్రేమ కథే. అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడి...

ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇటువంటి ప్రేమకథ రాలేదని 'దీవానా' విడుదలకు ముందు నుంచి చిత్ర బృందం చెబుతా వచ్చింది. నిజంగా రాలేదా? అంటే... 'లేదు' అని చెప్పాలి. ఎందుకు? అనేది చెప్పాలంటే... ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక చెప్పలేం. కానీ, ఒక్కటి మాత్రం నిజం... సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తుంది.


ఇంటర్వెల్ వరకు 'దీవానా' ఓ సాధారణ ప్రేమ కథే. అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడిన ఓ ఆవారా కథే. అయితే... ఇంటర్వెల్ బ్లాక్ మిగతా ప్రేమ కథల నుంచి 'దీవానా'ను వేరు చేసింది. ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ ట్విస్ట్ ఇంకొకరికి తెలిస్తే? అని ఆసక్తి మొదలు అవుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి నడిపిన కథలో కొత్తదనం కంటే క్యారెక్టర్స్ ప్రవర్తించే తీరు కొత్తగా ఉంటుంది. స్నేహితుల మధ్య సరదాలు, చిన్న గొడవలు వంటి వాటిని బాగా చూపించారు.


ఓవరాల్ గా దీవానా... అందమైన, హృదయానికి హత్తుకునే క్యూట్ అండ్ లిటిల్ లవ్ స్టోరీ. ఈ తరహా ట్విస్ట్ ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో రాలేదు. ట్విస్ట్ పక్కన పెడితే... ప్రతి సన్నివేశం, ఈ కథ మన కాలనీలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు ఏదో ఒక సందర్భంలో కనెక్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.

Jun 26, 2026 Telugu

Deewana Movie Review

Tupaki

By Tupaki

7.0
out of 10
దీవానా’ను వీక్షిస్తుంటే రెండు వేర్వేరు చిత్రాలను మార్చి మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పార్శ్వ్యంలో ఏమో గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరుకు కదిలిపోతాం. అలాగే కుటుంబం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరిగేల ా చేస్తాయి. ఎమోషనల్ సీన్లు అన్నింటినీ దర్శకుడు డీల్ చే...

దీవానా’ను వీక్షిస్తుంటే రెండు వేర్వేరు చిత్రాలను మార్చి మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పార్శ్వ్యంలో ఏమో గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరుకు కదిలిపోతాం. అలాగే కుటుంబం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరిగేల ా చేస్తాయి. ఎమోషనల్ సీన్లు అన్నింటినీ దర్శకుడు డీల్ చేసిన విధానం.. వాటిలో వచ్చే డైలాగులు ఒక టాప్ క్లాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇందులో చూపించిన రెండో పార్శ్వం మాత్రం సినిమా మీద ఇంప్రెషన్ ను అంతకంతకూ తగ్గించేస్తుంటుంది. 


స్నేహితులతో కలిసి హీరో వేసే అల్లరి వేషాల దగ్గర్నుంచి.. ప్రేమ-ఉద్యోగం అంటూ అతను పడే పాట్లకు సంబంధించిన సీన్లన్నీ చికాకు పుట్టించేస్తాయి. ఒకే సినిమాలో ఇంత వైరుధ్యం చూసి ఆశ్చర్యం కలగక మానదు. ఎమోషనల్ సీన్లలో దర్శకుడు చూపించిన పరిణతిని మిగతా సన్నివేశాల్లో కూడా చూపించి ఉంటే.. వాటిని ఫిల్లింగ్ సీన్లలో పేర్చేసి ఉండకపోతే ‘దీవానా’ తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచేది. ఐతే ఈ లోపం ఉన్నా సరే.. ‘దీవానా’ ఒక లుక్కేయడానికి ఢోకా లేని సినిమానే. ఇందులో కొన్ని సన్నివేశాలకు కదిలిపోని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాాదు.


Jun 26, 2026 Telugu

Deewana movie Review

7.0
out of 10
లవ్‌ స్టోరీస్‌ లో ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలానే వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. అలాంటిదే `దీవాన`. హైదరాబాద్‌ సిటీలో జరిగే ప్రేమ కథ ఇది. సిటీలో ముగ్గురు కుర్రాళ్లు జాన్‌ జిగ్రీలు. దోస్తాన్‌ కోసం ప్రాణాలిస్తారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతారు. తమ మీదకు వేరే వాళ్లు వస్తే, కలిసిపోతార...

లవ్‌ స్టోరీస్‌ లో ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలానే వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. అలాంటిదే `దీవాన`. హైదరాబాద్‌ సిటీలో జరిగే ప్రేమ కథ ఇది. సిటీలో ముగ్గురు కుర్రాళ్లు జాన్‌ జిగ్రీలు. దోస్తాన్‌ కోసం ప్రాణాలిస్తారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతారు. తమ మీదకు వేరే వాళ్లు వస్తే, కలిసిపోతారు. ప్రేమ విషయంలోనూ దోస్త్ కి అండగా ఉండి, వాడి లక్ష్యానికి తమ వంతు సపోర్ట్ చేసి అటు లక్ష్యాన్ని, ఇటు ప్రేమని గెలిపించేందుకు స్నేహితులు చేసిన పోరాటమే ఈ మూవీ అని చెప్పొచ్చు. 


సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో కేవలం ప్రేమ చుట్టూనే సినిమా సాగుతుంది. కానీ ఇందులో లవ్‌ స్టోరీ ఉంది, స్నేహం ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఆద్యంతం కట్టిపడేసే రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీ. ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్, జీవిత లక్ష్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆద్యంతం కట్టిపడేసే సరికొత్త ప్రేమ కథ దీవాన. లవ్‌ స్టోరీస్‌లో ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ అవుతుంది. కమర్షియల్‌గా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి. 





Jun 26, 2026 Telugu

Deewana Movie Review

7.0
out of 10
ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌ లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడ...

ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌ లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకొని.. కథను సాగదీసినట్టు చేశాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమాను దర్శకుడు, హీరో తమ వైపుకు తిప్పుకొన్నారు.


సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూ రాసుకొన్న ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా రఘు కారుమంచి సీన్ ఒకటి.. తండ్రి నరేష్ కొడుకు మున్నా మధ్య వచ్చే సన్నివేశాలు.. సెంటిమెంట్‌ను పండించటమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక క్రైమాక్స్‌లో డ్రామాను దర్శకుడు అద్బుతంగా పండించాడు. దాంతో దీవానా సినిమా నిజాయితీగా వెండితెర మీద చెప్పిన ప్రేమ కథగా మారింది.


Jun 26, 2026 Telugu

Deewana Movie Review

7.0
out of 10
మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయిందిఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్...

మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది


ఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది.


Jun 26, 2026 Telugu

Deewana movie review

Gulte

By Gulte

5.0
out of 10
Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by Eswar Chand, cinematography by Vamsi Patchipulusu, and editing by Hrishikesh Pasapal.The director, S...

Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by Eswar Chand, cinematography by Vamsi Patchipulusu, and editing by Hrishikesh Pasapal.


The director, Sreekanth Sangishetti, took a very basic plot of a ‘boy meets a girl and falling in love with her instantly’ and executed the majority of the first half in a routine manner. But, right from the pre-interval to the climax, he made sure, Deewana, has a very original soul. After unveiling an unexpected twist during the pre-interval episode, the film gets into the zone of an intense emotional drama and it is where ‘Deewana’, stood out compared to the regular romantic drama films we see often.


Overall, Deewana is an intense emotional drama from the pre-interval sequence. If you like hard-hitting emotional dramas without any sugar coating. Watch it in theatres.




Jun 26, 2026 Telugu

Deewana Movie Review

6.0
out of 10
These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage to stand out?“Deewana” begins like a typical youthful romance, focusing on a carefree youngster chasing a girl without any clear direction in life.HighlightsThe interval twistEmotional climaxMeaningf...

These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage to stand out?


“Deewana” begins like a typical youthful romance, focusing on a carefree youngster chasing a girl without any clear direction in life.


Highlights

The interval twist

Emotional climax

Meaningful message


Drawbacks

Lag in the second half

A few illogical episodes

Excessive sentiment in places


Overall, “Deewana” is an engaging mix of romance and emotional drama. It may not be flawless, but its strong twist, heartfelt emotions, and meaningful message make it worth a watch.


Jun 25, 2026 Telugu

Deewana Movie Review

7.0
out of 10
ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది. ప్రేమకి అర్థం చెప్పేలా ‘దీవాన’ ఉంటుంది. ప్రేమకి అందం ముఖ్యం కాదు.. మనసు ముఖ్యం అని చెప్పేలా హార్డ్ హ...

ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది. ప్రేమకి అర్థం చెప్పేలా ‘దీవాన’ ఉంటుంది. ప్రేమకి అందం ముఖ్యం కాదు.. మనసు ముఖ్యం అని చెప్పేలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్‌తో ‘దీవాన’ మూవీని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీశాడు.


సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ కంటతడిని పెట్టిస్తాయి. హీరోయిన్ తనలో దాచుకున్న ప్రేమను స్నేహితురాలికి చెప్పుకునే సీన్, పోలీస్ స్టేషన్‌ లో నరేష్ చేసిన సీన్, తండ్రి గొప్పదనాన్ని కమెడియన్ రఘు చెప్పే సీన్ ఇలా ప్రతీ ఒక్కటి గుండెను బరువెక్కేలా చేస్తుంది. చాలా వరకు సీన్స్ కంటతడిని పెట్టించేలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్ట్ మరింత బాగుంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌ గా ఉంటుంది. మధ్యలో పోలీస్ ట్రైనింగ్ సీన్లు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు వస్తున్న సమయంలో.. ఇలాంటి ఓ రిఫ్రెషింగ్, హానెస్ట్ స్టోరీతో వచ్చిన ‘దీవాన’ యూత్ ప్రేక్షకుల్ని, ప్రేమ కథల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూశామనే ఫీలింగ్‌ను మాత్రం కలిగించేలా చేస్తుంది.


Jun 25, 2026 Telugu

Deewana Movie Review

6.0
out of 10
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా నిరాశపరిచినా, మంచి బలమైన కథనంతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడి పనితీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.‘దీవానా’ ఒక సిన్సియర్ రొమాంటిక్ డ...

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా నిరాశపరిచినా, మంచి బలమైన కథనంతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడి పనితీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.


‘దీవానా’ ఒక సిన్సియర్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని రైటింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్‌ లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతూ, కొన్ని సీన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ.. సెకండ్ హాఫ్‌ లోని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.


Jun 25, 2026 Telugu
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్‌ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్‌ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. మనోళ్లు ఇలాంటి సెంటిమెంట్‌,...

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్‌ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్‌ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. 


మనోళ్లు ఇలాంటి సెంటిమెంట్‌, ఎమోషనల్‌ అంశాలకు ప్రయారిటీ ఇస్తారు, సినిమాలను చూస్తారనే భావనతో పదే పదే ఇలాంటి అంశాలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే దాన్ని అంతే రియాలిటీగా, కన్విన్సింగ్‌గా చెబితే బాగుండేది. కానీ ఇందులో అది మిస్‌ అయ్యింది. ఈ కథలో ఈ కేసుని బలవంతంగా పెట్టినట్టుగానే, ఇరికించినట్టుగానే ఉంటుంది. ప్రారంభం నుంచి సినిమా చాలా డ్రైగా, స్లోగా సాగుతుంది. వడ్డే నవీన్‌ని ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆయన పాత్రలో ఆ పవర్‌లేదు. పైగా బలమైన సీన్లు ఒక్కటి కూడా కనిపించలేదు. ఓవరాల్ గా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, రొటీన్‌, బోరింగ్‌, ఔట్‌ డేటెడ్‌ కాన్సెప్ట్ తో తీసిన మూవీ `ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు`. వడ్డే నవీన్‌ రీఎంట్రీ బెడిసికొట్టిందని చెప్పొచ్చు. 

Jun 23, 2026 Telugu
సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం...

సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతినీ పంచలేకపోయింది.


దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ. కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టయిల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రెజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను నడిపించాడు దర్శకుడు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పి... బోరింగ్ త్రిమూర్తులును అంటగట్టారు డైరెక్టర్. 


Jun 23, 2026 Telugu
6.0
out of 10
రాక రాక వచ్చాడు.. యాభై ఏళ్ల వయసులో ఏదో వచ్చింది చేశాడూ.. వెల్కమ్ బ్యాక్ అనొచ్చు కదా అని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’‌పై ఓ లుక్కేస్తే.. సినిమా ప్రారంభం నుంచి టైటిల్‌కి తగ్గట్టుగా మనోడి ట్రాన్స్‌ఫర్‌లతోనే కథని లాగించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో త్రిమూర్తులు మంచోడే కానీ.. చుట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డోళ్లే కాబట్టి.. మనోడి చేసే మంచి పనులు నచ్చక.. ట్రాన్స్‌ఫర్‌లు చేస్తుంటారు.వడ్డే నవీన్ గత పదేళ్లుగా వెండి...

రాక రాక వచ్చాడు.. యాభై ఏళ్ల వయసులో ఏదో వచ్చింది చేశాడూ.. వెల్కమ్ బ్యాక్ అనొచ్చు కదా అని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’‌పై ఓ లుక్కేస్తే.. సినిమా ప్రారంభం నుంచి టైటిల్‌కి తగ్గట్టుగా మనోడి ట్రాన్స్‌ఫర్‌లతోనే కథని లాగించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో త్రిమూర్తులు మంచోడే కానీ.. చుట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డోళ్లే కాబట్టి.. మనోడి చేసే మంచి పనులు నచ్చక.. ట్రాన్స్‌ఫర్‌లు చేస్తుంటారు.


వడ్డే నవీన్ గత పదేళ్లుగా వెండితెరపైనే కాదు.. మరెక్కడా కనిపించకపోయినా కూడా.. ఆయన సినిమా తీస్తున్నారు అంటే.. ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ వైబ్స్ వినిపించాయి, కనిపించాయి. ఎందుకంటే.. నైటీస్‌లో ఆయన క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది మరి. కానీ సినిమాలో మాత్రం పెద్దగా విషయం లేదు. 20 ఏళ్ల క్రితం మూసేసిన పాత కేసుని.. పదేళ్ల గ్యాప్ తరువాత వడ్డే నవీన్ తిరగదోడినట్టే ఉంది. ఓవరాల్‌గా.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుతో వడ్డే నవీన్ వడ్డీ‌తో సహా ఎంటర్‌టైన్ చేస్తాడనుకుంటే.. కష్టమే త్రిమూర్తులూ అనిపించాడు.


Jun 23, 2026 Telugu
Why MRO?