Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
అసలు బ్యాండ్‌మేళం అంటే థియేటర్‌లో ఫుల్ నవ్వులు, ఎంజాయ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం… కానీ ఇక్కడ జరిగిందేంటి అంటే… నవ్వుల కంటే గోలే ఎక్కువగా వినిపిస్తుంది! హర్ష రోషన్, శ్రీదేవి జంట చూసేందుకు ఓకే… కానీ పూర్తి స్థాయిలో లవ్ ట్రాక్ కనెక్ట్ అవుతుందా అంటే… అంతగా కాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్ కొంచెం పని చేస్తుంది. పైగా లవ్ అంతగా లేదు కాబట్టి, సినిమా మొత్తం కామెడీ మీదే నడవాలి… కానీ అదే మిస్ అయింది. చాలా సీన్స్ forced గా అనిపిస్తాయి. నవ్వాలి అనుకుంటే… cringe ఫీల్ వస్తుంది.
సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే అర్థమయ్యేలా సాగుతుంది. మధ్యలో కొన్ని హై మోమెంట్స్ ఉన్నా… అవి నిలబెట్టేంత బలంగా లేవు. టెక్నికల్‌గా చూసుకుంటే… సౌండ్ కొంచెం లౌడ్‌గా ఉంటుంది. చివర్లో వచ్చే ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా హైప్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్ చేయాలనుకున్న సినిమా… పూర్తిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.
కొన్ని సీన్స్ ఓకే… కానీ మొత్తం మీద యావరేజ్ ఫీలింగ్ వస్తుంది.
బ్యాండ్ మేళం సినిమాకు సంబంధించి… బ్యాండ్‌మేళం అనే టైటిల్ చూస్తే ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే ఆ అంచనాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే ఫీలింగ్ వస్తుంది. రొటీన్ లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా లైన్ తీసుకుని, దాన్ని కొత్తగా చెప్పాలనుకున్న ప్రయత్నం ఉన్నా… దర్శకుడు మంచి సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేకపోయాడు. సినిమా ప్రధానంగా కామెడీ మీదే ఆధారపడి ఉంది. కానీ అదే విభాగం పూర్తిగా కనెక్ట్ కాలేదు. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తాయి. నవ్వులు పండాల్సిన చోట, ఫోర్స్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది.
సెకండాఫ్‌లో డ్రామా డోస్ పెరగడంతో సినిమా వేగం తగ్గుతుంది. కథ కూడా ముందే ఊహించదగ్గ విధంగా సాగడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని హై సన్నివేశాలు ఉన్నా… అవి నిలబెట్టేంతగా ప్రభావం చూపవు. టెక్నికల్‌గా సౌండ్ డిజైన్ కొంత లౌడ్‌గా అనిపిస్తుంది. చివర్లో ట్రెండింగ్ పాటను వాడిన తీరు కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. ఓవరాల్ గా మూవీ ఆడియన్స్ కి యావరేజ్ గా కూడా అనిపించకపోవచ్చు.
బ్యాండ్ మేళం సినిమాకు సంబంధించి… ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు “ఫుల్ ఫన్ ఉండబోతుంది” అనిపిస్తుంది… కానీ సినిమా చూస్తే ఆ ఫన్ అంతగా deliver కాలేదు. బేసిగ్గా ఇది ఒక typical లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామా… but execution దగ్గరే ఇష్యూ వచ్చింది.
హర్ష రోషన్, శ్రీదేవి pairing ఒకే… chemistry works in parts. కానీ complete హీరో-హీరోయిన్ vibe మాత్రం రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం కొంచెం ఎమోషన్ ఉంటుంది… అది plus.
ఇప్పుడు main point – కామెడీ... సినిమా మొత్తం కామెడీ మీదే depend అయ్యింది… but అదే weakest part అయింది. చాలా scenes forced గా ఉంటాయి. natural flow లేదు. నవ్వాల్సిన చోట cringe feel వచ్చే moments ఎక్కువ. సెకండ్ హాఫ్ లో drama over అయిపోతుంది. Story ముందే guess చేసేలా ఉంటుంది. మధ్య మధ్యలో highs ఉన్నా… అవి consistent గా రావు. Technical side కి వస్తే… sound కొంచెం loudగా ఉంటుంది. Last lo trending song use చేసిన విధానం కూడా impact ఇవ్వదు. Acting కూడా కొన్ని చోట్ల overగా అనిపిస్తుంది. ఫైనల్ గా
కొన్ని moments okay అనిపించినా… overall ga cinema average zone లోనే పడుతుంది. Fun expect చేసి వెళ్తే… కొంచెం disappoint అయ్యే chance ఉంది.
బ్యాండ్ మేళం సినిమాకు సంబంధించి… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే బావా మరదళ్ళు అయిన హీరో హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ బాగా చదివిన హీరోయిన్ పై తరగతులకు వెళుతుంది, హీరో మాత్రం ఫెయిల్ అయ్యి బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాడు…హీరోయిన్ కి హీరో చదువుకోకపోవడంతో… కోపం వచ్చి దూరం పెడుతుంది…మరి హీరో ఎలా తన మరది మనసును గెలుచుకునే ప్రయత్నం చేశాడు…ఇద్దరు కలిశారా లేదా అనేది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్…కథ పాయింట్ వింటుంటే అప్పట్లో వచ్చిన ఉయ్యాలా జంపాల లాంటి సినిమా గుర్తుకు రావడం ఖాయం.
కానీ అక్కడ ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే ఇక్కడ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేక పోయింది. ఎటు నుండి ఎటో పోతూ సాగే కథ డ్రాగ్ అవుతూ సీన్స్ రిపీట్ అవుతూ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే సీన్స్ ఓకే అనిపించినా కూడా.. ఓవరాల్ గా చాలా చాలా ఓపిక చేసుకుని చూస్తె తప్పితే యావరేజ్ లెవల్ లో అనిపించదు సినిమా…లీడ్ పెయిర్ బాగానే ఆకట్టుకున్నా కథలో అంత దమ్ము లేకపోవడంతో ఓవరాల్ గా పెద్దగా సినిమా ఇంప్రెస్ చేయలేదు. సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి.. ఓవరాల్ గా ముందే చెప్పినట్లు చాలా లో ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్లి చాలా ఓపికగా చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.
హర్ష రోషన్, శ్రీదేవి జంట ఓకే. కెమిస్ట్రీ వర్క్ అయినా… హీరో-హీరోయిన్ వైబ్ మాత్రం అంతగా రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్స్ కొంచెం పని చేస్తాయి. కామెడీ ట్రాక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కావాల్సింది. కానీ అదే పెద్ద మైనస్ అయింది. చాలా సీన్లు ఫోర్స్ చేసినట్టుగా, అసహజంగా అనిపిస్తాయి. నవ్వులు రావాల్సిన చోట… చిరాకు వచ్చే పరిస్థితి.
సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే ఊహించేసుకునేలా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే హై మోమెంట్స్ ఉన్నా… అవి మూవీని సేవ్ చేయలేవు. టెక్నికల్‌గా చూసుకుంటే సౌండ్ డిజైన్ కొంచెం లౌడ్. చివర్లో పెట్టిన ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది.
హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో పెద్దగా మెప్పించలేదు. పాత్ర స్వభావం అలా రొటీన్ గా ఉండడం వల్లో ఏమో గాని, కొన్నిసార్లు అతని నటన హద్దులు దాటింది. రాజీ పాత్రలో శ్రీదేవి సహజంగా, పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ సినిమా ద్వితీయార్థంలో ఆమెకు నటించే అవకాశం లభించలేదు. హీరో గ్యాంగ్‌లోని స్నేహితులందరూ కొత్త ముఖాలే మరియు వారి సన్నివేశాలు సరిగ్గా రాయబడలేదు.
విజయ్ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదనిపించినా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. నేపథ్య సంగీతం సగటు కంటే తక్కువగా ఉంది మరియు ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ చిత్రంలో తెలంగాణ జానపద గీతాలలోని కొన్ని ప్రముఖ బాణీలను ఉపయోగించారు. 'బ్యాండ్ మేళం' నిర్మాణ విలువలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. 'బ్యాండ్ మేళం' అన్ని విభాగాల్లోనూ విఫలమైన చిత్రం, ఈ సినిమాను చూడకుండా వదిలేయవచ్చు.
హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కోన వెంకట్ రచించిన ఈ సినిమా, కామెడీ ఫ్యామిలీ డ్రామా జానర్ లోనే సాగుతుంది. కానీ కథ, కథనం రెండూ పాత ఫార్ములానే అనిపిస్తాయి. పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. హీరో పేదవాడు, హీరోయిన్ ధనవంతురాలు, ప్రేమకు అడ్డంకులు-ఇలాంటి రొటీన్ అంశాలతో కథ ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్యాండు మేళం సన్నివేశాలు కొంత వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ వరకు కథ ఆసక్తిగా అనిపించినా, సెకండ్ హాఫ్‌లో నెమ్మదిగా మారుతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించగలిగేలా ఉంటుంది.
నటీనటులు పెర్ఫార్మన్స్ పరంగా బాగానే చేసినా, కథ, కథనాలు డిస్సపాయింట్ చేయడంతో ప్రేక్షకులకు మైండ్ లోకి పాత్రలు ఎక్కవు.
టెక్నికల్ గా సినిమా ఓకే. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. 'తిప్పుకుంటున్నవావే' పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. కానీ బ్యాండ్ మేళం బ్యాండ్ మోగలేదు.
హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పైగా వారి పాత్రల్లో డెప్త్ లేకపోగా హీరోహీరోయిన్ల ఫీల్ రాదు. సాయికుమార్ భారమైన, ఎమోషనల్ పాత్రను పండించాడు. గోపరాజు విజయ్, ఇతరులు ఫర్వాలేదనిపిస్తారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఎక్కువ మార్కులు కొట్టేసింది విజయ్ బుల్గానిన్ అని చెప్పుకోవాలి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. చుట్టేసుకొంటానే పాట బ్లాక్ బస్టర్ ఫీల్ అందిస్తుంది.
అలాగే సినిమాటోగ్రఫి వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన లోపం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాలు గాలికి వదిలేయకుండా ఇంకాస్త బెటర్‌గా కసరత్తు చేసి మంచి పాయింట్ తో సినిమాను రూపొందించి ఉంటే రోషన్, శ్రీదేవీకి మంచి హిట్ పడేది. ఉయ్యాల జంపాల సినిమా చూస్తే కొంత నిరాశ కలుగుతుంది. చూడకపోతే ఏమైనా కొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది. ఈ సినిమా చూడాలా? వద్దా? అనే ప్రేక్షకుడికే వదిలేయాల్సిందే.
‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ విషయానికి వస్తే... హర్ష్ రోషన్-శ్రీదేవి జంట తమ చివరి చిత్రం (కోర్ట్) ఎంతగా అలరించిందో.. ‘బ్యాండ్ మేళం’లో అంతగా అసహనం కలిగిస్తుంది. హర్ష్ చాలా హుషారుగా నటించాడు కానీ.. అతను చేసిన గిరి పాత్ర మామూలుగా ఫ్రస్టేట్ చేయదు. తన మ్యూజిక్ స్టూడియో ప్రారంభ వేడుకలో అతను ఇచ్చే ప్రసంగం చూశాక.. తన పాత్రతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాం. రాజి పాత్రలో శ్రీదేవి కూడా ఎలాంటి ప్రత్యేకతా చూపించలేకపోయింది. ఆ క్యారెక్టరే చాలా అయోమయంగా అనిపిస్తుంది. ఈసారి రోషన్ తో శ్రీదేవి కెమిస్ట్రీ ఏమాత్రం పండలేదు. సాయికుమార్ ను పూర్తిగా వృథా చేశారు. హీరో తల్లి పాత్రలో చేసిన నటి బాగా చేసింది. హీరో మిత్ర బృందం పర్వాలేదు.
సాంకేతికంగా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ‘బ్యాండ్ మేళం’తో మెప్పించలేకపోయాడు. నేపథ్య సంగీతం బాగున్నా.. విషయం లేని సన్నివేశాల వల్ల దాని ప్రయోజనం నెరవేరలేదు. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం బాగానే సాగింది. రచయిత-దర్శకుడు సతీష్ జవ్వాజి.. ఈ కథ తో అసలేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. మినిమం రైటింగ్ లేని.. ఫీచర్ ఫిలింకి అర్హం కాని స్క్రిప్టు ఇది. కోన వెంకట్ లాంటి పేరున్న రైటర్ ఈ స్క్రిప్టు ఎలా ఓకే చేసి సినిమాను ప్రొడ్యూస్ చేశాడన్నది అర్థం కాని విషయం. చివరగా: బ్యాండ్ మేళం.. భరించలేని సౌండు.
‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఆశించిన నవ్వులు లేవు.. గోల మాత్రం ఎక్కువ.. లోతుగా వెళ్తే.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యాండ్‌మేళం సినిమా రొటీన్ టాక్ తోనే సరిపెట్టుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం… ఆశించిన స్థాయిలో నవ్వులు పండించలేకపోయింది. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ… పూర్తి స్థాయిలో హీరో-హీరోయిన్ ఫీల్ ఇవ్వలేకపోయారు. క్లైమాక్స్‌లో వచ్చే లవ్ ఎమోషన్స్ మాత్రం కొంతవరకు ఆకట్టుకుంటాయి.
ఇక సినిమాలో ప్రధానంగా మైనస్‌గా నిలిచింది కామెడీ ట్రాక్స్. చాలా చోట్ల బలవంతంగా చొప్పించినట్లుగా అనిపిస్తూ, సహజత్వం లోపించింది. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైపోవడంతో సినిమా స్లోగా అనిపిస్తుంది. కథ కూడా ముందే ఊహించదగ్గ విధంగా సాగుతుంది.
నటీనటుల యాక్టింగ్‌లో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే… బ్యాండ్‌మేళం పాత ఫార్ములాతో వచ్చిన లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. నవ్వుల కంటే గోల ఎక్కువగా అనిపించింది ఈ బ్యాండ్ మేళం చూస్తే...
ఈ వీక్ రిలీజ్ అయిన బ్యాండ్‌మేళం సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. కథ, కథనం పరంగా కొత్తదనం లేకుండా రొటీన్‌గా సాగిన ఈ చిత్రం, కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ… హీరో-హీరోయిన్ అనిపించే ఫీలింగ్ మాత్రం అంతగా రాలేదు. క్లైమాక్స్‌లో వచ్చే ప్రేమ ఎమోషన్స్ కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ సన్నివేశాలు కూడా సగటుగా అనిపిస్తాయి.
ఇక కామెడీ ట్రాక్స్ విషయానికి వస్తే… చాలా చోట్ల బలవంతంగా నెట్టినట్టుగా కనిపిస్తాయి. సహజత్వం లోపించి, కొన్ని సన్నివేశాలు విసుగును కలిగిస్తాయి. సెకండాఫ్‌లో డ్రామా మోతాదుకు మించి ఉండటం కూడా మైనస్‌గా మారింది. కథ ముందే ఊహించదగ్గ విధంగా సాగుతూ ఆసక్తిని తగ్గిస్తుంది. సాంకేతికంగా చూసినా… సౌండ్ డిజైన్ కొంత లౌడ్‌గా అనిపిస్తుంది. ట్రెండింగ్ పాటను చివర్లో ఉపయోగించిన తీరు కూడా నిరాశపరుస్తుంది. నటీనటుల ప్రదర్శనలో కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే… బ్యాండ్‌మేళం సినిమా పాత ఫార్ములా లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపిన సాధారణ చిత్రంగా నిలిచింది. నవ్వులకంటే గోలే ఎక్కువగా అనిపించే ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌మేళం మూవీ టాక్ పరంగా పెద్దగా కొత్తదనం చూపించలేదు. రొటీన్ కథ, ఊహించదగ్గ సన్నివేశాలతో ముందుకు సాగిపోయింది. కామెడీ ట్రాక్ ఓకే అనిపించినా… ఎక్కువ భాగం బలవంతంగా నెట్టినట్టే ఫీల్ ఇస్తుంది. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా… హీరో-హీరోయిన్ ఫీల్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ దగ్గర ఎమోషనల్ టచ్ కొంత మేర మెప్పిస్తుంది. ఫ్యామిలీ సీన్స్ కూడా అప్పుడప్పుడు ఓకే అనిపిస్తాయి.
అయితే సెకండాఫ్‌లో డ్రామా డోస్ ఎక్కువైపోయింది. కామెడీ, ఎమోషన్ రెండూ ఓవర్‌గా అనిపించడం మైనస్. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా బలవంతపు కామెడీ ట్రాక్స్ అసహనం కలిగిస్తాయి. మ్యూజిక్ పరంగా చివర్లో ట్రెండింగ్ సాంగ్ వాడిన విధానం కూడా సంతృప్తి ఇవ్వదు. సౌండ్ డిజైన్ కొన్ని చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. నటీనటుల యాక్టింగ్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఓవర్‌గా కనిపిస్తుంది. ఓవరాల్ గా బలం లేని కథా, కథనాల వల్ల రెండు గంటల సినిమా కూడా నాలుగు గంటల సినిమాల పరమ బోరింగ్ అనిపించింది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers