Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 805-816 of 1647 reviews

Rao Bahadur movie Review

5.0
out of 10
సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్‌ కు ముందు ఆయన వేసిన ట్వీట్‌ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. పేలవమైన సన్న...

సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్‌ కు ముందు ఆయన వేసిన ట్వీట్‌ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమా కంటెంట్‌ను కొంత మెరుగుపరిచాడు. 


రావు బహదూర్ సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. డైరెక్టర్ ఆలోచించిన పాయింట్ బాగుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంది. కానీ ఆ పాయింట్‌ ను పూర్తిస్థాయి కథగా మార్చడంలో తడబాటు కనిపిస్తుంది. సినిమా కథ చెప్పడంలో తెలివి ఉండాలి. కానీ ఎక్కువ మేధావితనం ప్రదర్శించకూడదనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా ఫిలాసఫికల్‌ గా ఎమోషనల్ డ్రామా, ఈ డాక్టర్, పేషెంట్ డ్రామాను చూడాలంటే ఎక్కువ పెషన్స్ తప్పనిసరి. కేవలం సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.


Jul 04, 2026 Telugu

Rao Bahadur Movie Review

5.0
out of 10
Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a film made in this manner before.HighlightsSatyadev’s terrific performanceThe final twists and payoff...

Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a film made in this manner before.


Highlights

Satyadev’s terrific performance

The final twists and payoff

The portions after the police officer’s entry


Drawbacks

Uneven and slow-moving first half

Lengthy runtime

Self-indulgent narration in several stretches


Overall, Rao Bahadur is a sincere attempt to tell a story in a distinctive manner. The idea is admirable, and the climax justifies much of the film’s thematic ambition, with Satyadev delivering a performance worthy of applause. However, the painfully slow narration, overstretched screenplay and self-indulgent storytelling make it a tiresome watch. Those willing to invest patience may appreciate its intent, but for many viewers, the film’s pacing will prove to be a major hurdle.


Jul 04, 2026 Telugu

Rao Bahadur Movie Review

Sakshi

By Sakshi

5.0
out of 10
'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. సెకండాఫ్‌ లో కథ కాస్త పుంజుకుని, క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా, అందరికీ న...

'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. 


సెకండాఫ్‌ లో కథ కాస్త పుంజుకుని, క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా, అందరికీ నచ్చే సినిమా కాకపోయినా... కొత్త తరహా కథలను ఇష్టపడే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది. వెంకటేష్ మహా డైరెక్షన్ బావున్నా, స్క్రీన్ ప్లే ఒకింత డిస్సపాయింట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలనుకునే ఆడియన్స్ ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్తే మంచిది.

Jul 04, 2026 Telugu
5.0
out of 10
రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్‌ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం మినిమం డిగ్రీ చదివిన వాళ్లకి కూడా అర్థం కాదేమో. అలా ఉంది సినిమా. అయితే తెలుగులో ఇలాంటి...

రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్‌ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం మినిమం డిగ్రీ చదివిన వాళ్లకి కూడా అర్థం కాదేమో. అలా ఉంది సినిమా. అయితే తెలుగులో ఇలాంటి టేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం కొత్త అని చెప్పుకోవచ్చు.


భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండటం.. ఇదంతా కూడా ప్రారంభంలో ఓ రకంగా అనిపించొచ్చు. అసలేం చేస్తున్నాడు.. ఏమై ఉంటుంది.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అనే ప్రశ్నలు కలుగుతాయి. ఇక కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగానే సాగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌ లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఓవరాల్ గా ఇది సత్య దేవ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. ఇందులో వెంకటేష్ మహా చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాక.. ఫస్ట్ హాఫ్‌లోనే బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇక సహనంగా, ఓపికతో భరిద్దాం అని చివరి వరకు చూసిన ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్‌గా ఓ రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ చివరి ఐదు నిమిషాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇదొక వినూత్న ప్రయోగం, ప్రయత్నం అని మాత్రం చెప్పుకోవచ్చు.

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

6.0
out of 10
నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా...

నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా రిఫరెన్స్ సీన్స్ చాలా ఉంటాయి. 


వరెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఒక పెద్ద ఆక్షన్ సీక్వెన్ జరుగుతుంటే సడన్ గా పెద్ద ఫ్లాష్ బ్యాక్ సీన్ నడుస్తూ ఉంటది. అది అస్సలు కనెక్ట్ కాలేదు. మే బీ కనెక్ట్ అయ్యుంటే సినిమా నచ్చి ఉండేదేమో. క్యాస్టింగ్ కూడా బాలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టు ఉండదు. ఆక్షన్ సీన్స్ బాగున్నా, సందర్భం లేకుండా ఉన్నాయనిపిస్తోంది. అండ్ లెంగ్త్ కూడా చాల ఎక్కువైపోయింది. సగం నుండే థియేటర్ లోంచి లేచిపోదాం అనుకున్నా... కానీ ఎదో ఓపిక పట్టి ఉన్నందుకు... పార్ట్ 2 అని చెప్పి కొంప ముంచాడు. ఓవరాల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుందనిపించినా ఫైనల్ గా ఎం లేదనిపిస్తుంది. నిద్రొచ్చేస్తుంది. కానీ ఓవర్ లౌడ్ మ్యూజిక్ వల్ల థియేటర్లో నిద్ర కూడా పోలేం. 

Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

Thyview

By Thyview

5.0
out of 10
సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే. ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది....

సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే. 


ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది. సెకండ్ హాఫ్ మాత్రం వరెస్ట్ ఉంటది. సనాతన ధర్మ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ గా సినిమా బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. రన్ టైం కూడా 3 గంటలు ఉండడం వల్ల చాలా ల్యాగ్ అనిపించింది. హీరోగా విరాట్ కర్ణ ఏం ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ లైన్, అండ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం వల్ల ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా యూస్ ఉండదు. 

Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

5.0
out of 10
ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు.&...

ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు. 


ముందు సినిమాలో ఒక నటుడు హీరో ఎప్పుడవుతాడంటే... అన్యాయం జరిగేటప్పుడు కాపాడడానికి వచ్చినపుడే హీరో అవుతాడు. కానీ ఈ సినిమాలో మొత్తం కూడా అన్యాయం జరిగిపోయాక ఫైట్ చేస్తాడు.. అప్పుడేమాత్రం ఫీల్ కూడా రాదు. అండ్ సినిమాలో డైలాగులు కూడా వరెస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అవి సందర్భం లేకుండా వస్తాయి. ట్విస్టులు ఎదో ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే.. అసలేమాత్రం ఎక్కవు. ఓపెన్ గా చెప్పాలంటే మూడు గంటల పదహరు నిమిషాల ఈ సినిమాలో నేను చూసింది రెండున్నర గంటలే... ఏదైనా బెటర్ ఉంది అంటే... అది గ్రాఫిక్స్ మాత్రమే. ట్రెజర్ హంట్ సినిమా అని చెప్పి... నరకడం చంపడం తప్ప ఎం లేదు. 

Jul 04, 2026 Telugu

Naga Bandham movie Review

5.0
out of 10
ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గ...

ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గాని, టెంపుల్ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చించి లేపేస్తారేమో అని అనుకున్నా. 


కానీ ఆ లెంగ్తి ఇంటర్వెల్ బ్లాక్ ఏమి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ లో జరిగే ఫ్లాష్ బ్యాక్ సూపర్ గా ఉంటది అనుకుంటే.. చాలా ల్యాగ్ చేసి చాలా బోర్ కొట్టించారు. ఇంకా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా లెంగ్తి సీన్స్ తో బోర్ కొట్టించడం వల్ల కొన్ని మంచి సీన్స్ ఉన్నా కూడా అవి మార్చిపోతాం. అండ్ నాగసాధు ఎపిసోడ్స్ బాగానే ఉన్నా, హై గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా, ఆ లెంగ్త్ వల్ల మనం రిసీవ్ చేసుకోలేము. ఇక సినిమా గురించి చెప్పుకోవడానికి అంత ఎం లేదు ఎందుకంటే... సినిమా ఆడియన్స్ ని ఎంత ఫ్రస్టేట్ చేస్తదో దానికోసం మరో వీడియో చేయొచ్చు అలా ఉంది. 

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

6.0
out of 10
నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్,...

నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్, బీజీఎమ్ రాంప్ ఆడించారు. 


ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైట్ మధ్యలో సినిమా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారో అప్పుడే సినిమా దొబ్బింది. ఇక హీరోహీరోయిన్ల ట్రాక్ కూడా బాలేదు. అలాగే హీరో యాక్టింగ్ లో చాలా ఇంప్రెప్ అవ్వాలి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా డిస్సపాయింట్ చేసారు. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనడం ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఓసారి చూడొచ్చు ఆ విజువల్స్ కోసం.

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

4.0
out of 10
#Nagabandham An Outright Tedious Watch!A film that starts with intrigue but progressively gets worse. The second half is even weaker, with outdated writing and scene staging that borders on parody. What should have been an engaging storyline turns into a tedious watch that’s hard to sit through and unbearable in many places.Apart from the artwork, set design, and bits of the music, there’s very li...

#Nagabandham An Outright Tedious Watch!


A film that starts with intrigue but progressively gets worse. The second half is even weaker, with outdated writing and scene staging that borders on parody. What should have been an engaging storyline turns into a tedious watch that’s hard to sit through and unbearable in many places.


Apart from the artwork, set design, and bits of the music, there’s very little to appreciate. There’s clearly effort behind the film, but when it fails to get the basics right, it leads to lifeless narration and a disappointing overall experience.


Outright Bad.


Rating: 1.75/5

Jul 04, 2026 Telugu

NagaBandham Movie Review

6.0
out of 10
పేరుకు అప్ కమింగ్ యాక్టర్స్ తో తెరకేక్కినా కూడా బడ్జెట్ పరంగా మీడియం టు హై బడ్జెట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నాగ బంధం(Naga Bandham Movie) మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందగా సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఇప్పుడు రిలీజ్ అయింది. కాన్సెప్ట్ పరంగా అనేక లేయర్స్ తో తెరకెక్కిన కథ నాగ బంధం….సినిమా మొదలు అవ్వడం ఆసక్తిగానే స్టార్ట్ అయ్యి తర్వాత ట్రెజర్ హంట్ గా మారి అక్కడ నుండి అడ్వెంచర్...

పేరుకు అప్ కమింగ్ యాక్టర్స్ తో తెరకేక్కినా కూడా బడ్జెట్ పరంగా మీడియం టు హై బడ్జెట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నాగ బంధం(Naga Bandham Movie) మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందగా సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఇప్పుడు రిలీజ్ అయింది. కాన్సెప్ట్ పరంగా అనేక లేయర్స్ తో తెరకెక్కిన కథ నాగ బంధం….సినిమా మొదలు అవ్వడం ఆసక్తిగానే స్టార్ట్ అయ్యి తర్వాత ట్రెజర్ హంట్ గా మారి అక్కడ నుండి అడ్వెంచర్ మోడ్ లోకి వెళ్లి తర్వాత హిస్టారికల్ గా మారి అక్కడ నుండి సనాతన ధర్మం కోసం సాదువులు ఏం చేశారు.? అక్కడ నుండి తిరిగి ప్రజెంట్ టైంకి వచ్చి క్లైమాక్స్ తో సినిమా ఎండ్ అవుతుంది. 


ఇక చాలా స్ట్రెంగ్త్ ఉన్న కథ ని చాలా బేసిక్ స్క్రీన్ ప్లే తో చెప్పడంతో సినిమా చాల స్లోగా సాగిపోయినట్లు అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రతీ చోట బడ్జెట్ బాగానే కనిపించింది. ఇక డైరెక్టర్ మంచి కథనే తీసుకున్నా కూడా చెప్పే క్రమంలో ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో స్క్రీన్ ప్లే విషయంలో అంచనాలను అందుకోలేదు. కానీ కొన్ని సీన్స్ బాగా ప్రజెంట్ చేశారు. ఓవరాల్ సినిమాలో కొన్ని ప్లస్ లు మైనస్ లు ఉండగా ఆడియన్స్ మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే నిరాశ కలుగుతుంది..తక్కువ ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కొంచం ఓపిక తెచ్చుకుని చూస్తె ఒకసారి సినిమా చూడొచ్చు అనిపించవచ్చు. 

Jul 04, 2026 Telugu

NagaBandham Movie Review

6.0
out of 10
విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. నాగబంధం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి, టీజర్, ట్రైలర్స్...

విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. నాగబంధం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. స్టార్ క్యాస్ట్ ఎవరూ లేకపోయినా భారీ బడ్జెట్, భారీ సెట్స్ వేసి, అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో డివోషనల్ థ్రిల్లర్ అని బాగా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.


కథ డివోషనల్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసారు కానీ అది ఫోకస్ గా నడిపించలేదు. హిందూ మతం, సనాతన ధర్మం గురించి ఓ రెండు మూడు సార్లు డైలాగ్స్ తో చెప్పించారు. సనాతన ధర్మం కథలో చూపించకుండా డైలాగ్స్ తో చెప్పడం విశేషం. ఇక నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్, అనంత పద్మనాభ స్వామి అని ప్రమోట్ చేయడంతో ఇదేదో ట్రెజర్ హంట్ అని ఓ రేంజ్ లో ఊహించుకొని వెళ్తాము. కానీ కథలో అంత స్కోప్ ఉన్నా అసలు కథ వదిలేసి అక్కర్లేని ట్రాక్స్, డైలాగ్స్ తో నడిపించారు. ఇక సినిమా అంతా నాగబంధం వెనక ఏముంటుంది అని నడిపించి అసలు అదేంటో ఎక్కడా చెప్పకుండానే సినిమా ముగించడం గమనార్హం. అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చేదాకా ఎదురు చూడాల్సిందేనట. మొత్తంగా ‘నాగబంధం’ సినిమా బ్రహ్మ కమలం కోసం విలన్ చేసే ప్రయత్నం, దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అని సనాతన ధర్మం మెసేజ్ తో సాగుతుంది.

Jul 04, 2026 Telugu
Why MRO?