Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 817-828 of 1647 reviews

Naga Bandham movie Review

Sakshi

By Sakshi

5.0
out of 10
నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే... నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం వంటి అంశాలతో మొదలయ్యే కథ ఫస్ట్ హాఫ్‌లో మంచి మిస్టరీ, అడ్వెంచర్ ఫీల్‌ను అందిస్తుంది. హీరో రుద్ర ప్రయాణం, విలన్ గ్యాంగ్‌తో జరిగే ఛేజ్ సీక్వెన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ భాగానికి బలంగా నిలుస్తాయి. అయితే ఇంటర్వెల్‌కు...

నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే... నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం వంటి అంశాలతో మొదలయ్యే కథ ఫస్ట్ హాఫ్‌లో మంచి మిస్టరీ, అడ్వెంచర్ ఫీల్‌ను అందిస్తుంది. హీరో రుద్ర ప్రయాణం, విలన్ గ్యాంగ్‌తో జరిగే ఛేజ్ సీక్వెన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ భాగానికి బలంగా నిలుస్తాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, పాట కథ వేగాన్ని కాస్త తగ్గిస్తాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఆసక్తిని కొనసాగించడంలో సక్సెస్ అవుతుంది.


సెకండాఫ్‌లో మాత్రం సినిమా పూర్తిగా మరో దారిలో ప్రయాణిస్తుంది. హీరో తన గతం, నాగబంధం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునే క్రమంలో కథ హిందూ పురాణాలు, సనాతన ధర్మం, ప్రాచీన రహస్యాల వైపు మళ్లుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించగా, ఎమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేవు. సినిమా అంతా నాగబంధం రహస్యాన్ని ఛేదించే ప్రయాణంగా చూపించినప్పటికీ, క్లైమాక్స్‌లో అసలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కథను నేరుగా పార్ట్-2 కోసం వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. దీంతో సినిమా పూర్తి అనుభూతిని ఇవ్వలేకపోతుంది. చివరగా మంచి కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్, ఆసక్తికరమైన సెటప్ ఉన్నప్పటికీ, కథనం తడబడటం, నిడివి ఎక్కువ కావడం, క్లైమాక్స్‌ను పూర్తిగా సీక్వెల్‌పై ఆధారపడేలా ముగించడం వల్ల 'నాగబంధం' పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. 

Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

5.0
out of 10
మరణాన్ని జయించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నాగబంధం' ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ, అడ్వెంచర్, యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో కథ అనూహ్యంగా మారడంతో ఆసక్తి తగ్గుతుంది. క్లైమాక్స్‌లో అసలు కథను పార్ట్-2 కోసం దాచేయడం నిరాశపరుస్తుంది. నిడివి కూడా సినిమాకు పెద్ద మైనస్. మొత్తంగా, భారీ ఆలోచనతో వచ్చిన 'నాగబంధం' కథ కంటే సెటప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన సినిమాగా అనిపిస్తుంది.సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో...

మరణాన్ని జయించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నాగబంధం' ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ, అడ్వెంచర్, యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో కథ అనూహ్యంగా మారడంతో ఆసక్తి తగ్గుతుంది. క్లైమాక్స్‌లో అసలు కథను పార్ట్-2 కోసం దాచేయడం నిరాశపరుస్తుంది. నిడివి కూడా సినిమాకు పెద్ద మైనస్. మొత్తంగా, భారీ ఆలోచనతో వచ్చిన 'నాగబంధం' కథ కంటే సెటప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన సినిమాగా అనిపిస్తుంది.


సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో హింసాత్మకమైన సీన్లు, యాక్షన్ సీక్వెన్స్, భారీ హిందుత్వ డైలాగులు, అన్నిటికి మించి సాలిడ్ విజువల్స్ పై మేకర్స్ ఫోకస్ పెట్టారు గాని, అంతకంటే వాల్యుబుల్ అయిన కథ, కథనాలపై దృష్టి పెట్టలేదు. ప్రేక్షకుడ్ని సీట్లో కూర్చోబెట్టేవి ఇవే. కానీ మేకర్స్ అవే గాలికొదిలేశారు. 

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

6.0
out of 10
పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కోసం తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.. దాన్ని విజువల్స్‌తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు అభిషేక్ నామా. అయితే ఈ మధ్య కాలంలో దేవుడి నేపథ్యం, సన...

పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కోసం తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.. దాన్ని విజువల్స్‌తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు అభిషేక్ నామా. 


అయితే ఈ మధ్య కాలంలో దేవుడి నేపథ్యం, సనాతన ధర్మం అనే అంశాలను వాడుకుంటూ వచ్చిన పలు చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అదే ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చిన సినిమా నాగబంధం. ఇందులో కూడా మొదటి నుంచి హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాలు, వాటి సంరక్షణ చుట్టూనే కథ అల్లుకున్నారు. కథలో సహజంగా దైవభక్తి ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. నాగబంధంలో కొన్ని సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయితే.. మరికొన్ని మాత్రం అతికించినట్లు అనిపిస్తాయి. విరాట్ కర్ణ పర్లేదనిపించాడు. దర్శకుడు అభిషేక్ నామా కూడా తన వంతు బాధ్యత బాగానే పూర్తి చేసారు. కథపై ఇంకాస్త లోతుగా వెళ్లుంటే బాగుండేది. చివర్లో పార్ట్ 2కు లీడ్ ఇచ్చారు. ఓవరాల్‌ గా నాగబంధం.. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసే పోరాటం..!

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

5.0
out of 10
హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇస్లాం చక్రవర్తులు దోచుకు వెళ్ళినట్టు చరిత్ర పుస్తకాల్లో చదివాం. అయితే ముస్లిం రాజుల అరాచకాలను తట్టుకుని మరీ అనంత పద్మనాభస్వామి వంటి ఆలయాల్లో నేలమాళిగలో బంగారు ఖజానాలు భద్రంగా ఉన్నట్టు వార్తల్లో చదివాం. అటువంటి నేపథ్యంలో నాగబంధం మహిమ, నాగ సాధువుల వీరోచిత పోరాటాన్ని చూపించిన సినిమా 'నాగబంధం'. అయితే దర్శకుడు అభిషేక్ నామా సరైన కథా, కథనాలు ఎంచుకోవడంలో విఫలమయ్యాడు. ఇక...

హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇస్లాం చక్రవర్తులు దోచుకు వెళ్ళినట్టు చరిత్ర పుస్తకాల్లో చదివాం. అయితే ముస్లిం రాజుల అరాచకాలను తట్టుకుని మరీ అనంత పద్మనాభస్వామి వంటి ఆలయాల్లో నేలమాళిగలో బంగారు ఖజానాలు భద్రంగా ఉన్నట్టు వార్తల్లో చదివాం. అటువంటి నేపథ్యంలో నాగబంధం మహిమ, నాగ సాధువుల వీరోచిత పోరాటాన్ని చూపించిన సినిమా 'నాగబంధం'. అయితే దర్శకుడు అభిషేక్ నామా సరైన కథా, కథనాలు ఎంచుకోవడంలో విఫలమయ్యాడు. 


ఇక సినిమా ప్రారంభం ఆసక్తి రేకెత్తిస్తుంది. హిమాలయాలు, రంగనాథ ఆలయం, బ్రహ్మ కమలం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా వెళుతుంది. ఎప్పుడైతే రుద్ర కుటుంబ కలహాలు కథలో ఫ్రంట్ సీట్ తీసుకున్నాయో... అప్పట్నుంచి అసలు కథ పక్కదారి పట్టింది. ఆసక్తి మాత్రం కించిత్ ఉండదు. 'నాగబంధం' సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ డిజైన్. ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ లుక్ కనిపించడం వెనుక ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కోరాలాత్ పడిన కష్టం, ఆయన కృషి కనిపిస్తాయి. అభిషేక్ నామా కథలో విషయం ఉంది. మంచి సినిమా తీయాలనే ఆలోచన కనిపిస్తుంది. కానీ, ఆ కథ తెరపైకి వచ్చే క్రమంలో చాలా తప్పులు జరిగాయి. సన్నివేశాల నుంచి వీఎఫ్ఎక్స్ వరకు అడుగడుగునా కొన్ని లోపాలు కనిపిస్తాయి. ప్రేక్షకులలో ఆసక్తి పెంచేలా సినిమా ముందు సాగలేదు. డిజప్పాయింట్ చేసిందీ 'నాగబంధం'.


Jul 04, 2026 Telugu

Naga Bandham Movie Review

5.0
out of 10
విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమయంలో ఈ సృష్టిని శాసించాలనే కథలతోనూ సినిమాలు వస్తున్నాయి. ఈ సృష్టించిన శాసించే శక్తి కోసం, ఆ శక్...

విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమయంలో ఈ సృష్టిని శాసించాలనే కథలతోనూ సినిమాలు వస్తున్నాయి. ఈ సృష్టించిన శాసించే శక్తి కోసం, ఆ శక్తి ఉన్న బ్రహ్మకమలం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. 


అయితే ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని,సెంటిమెంట్‌ ని క్యాష్‌ చేసుకోవాలని మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. బోల్తా పడుతున్నారు. అదే తేడా కొడుతుంది. సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌గా మారుతున్నాయి. ఇప్పుడు వచ్చిన `నాగబంధం` పరిస్థితి కూడా ఇదే అని చెప్పొచ్చు. నాగబంధం ఇడిపించడం అనే పాయింట్‌ మీద ఈ మూవీ కథ సాగుతుంది. ఓవరాల్ గా దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న కథలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. స్క్రీన్‌ ప్లే పరంగానూ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సీన్‌ కి, మరో సీన్‌ కి సంబంధం లేదు, సింక్‌ అయ్యేలా లేవు. విజువల్స్ పరంగా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. బడ్జెట్‌ పరంగా రాజీ లేదు. కానీ మిగిలిన విషయంలో విఫలమయ్యారు. విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా, కథగా, సినిమా పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమా. ఒక రకంగా ఇది ఆడియెన్స్ పై నాగబంధం ప్రయోగమని చెప్పొచ్చు.  


Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

Gulte

By Gulte

5.0
out of 10
Producer Abhishek Nama has turned into a full-fledged Director with a VFX intense movie, Nagabandham. The movie starring Pedha Kapu fame Virat Karna has attracted eyeballs for its Devotional Backdrop, Sprawling Anantha Padmanabha Swamy Set, and the quality.Positives:Anantha Padmanabha Swamy SetLargely Good VFX PortionsNegatives:Unnecessary Family DramaPoor WritingConfusing ScreenplayRepeat Sequenc...

Producer Abhishek Nama has turned into a full-fledged Director with a VFX intense movie, Nagabandham. The movie starring Pedha Kapu fame Virat Karna has attracted eyeballs for its Devotional Backdrop, Sprawling Anantha Padmanabha Swamy Set, and the quality.


Positives:

Anantha Padmanabha Swamy Set

Largely Good VFX Portions


Negatives:

Unnecessary Family Drama

Poor Writing

Confusing Screenplay

Repeat Sequences in Second Half


Finally, Nagabandham is an ambitious outing which should be commended for its technical output as the makers spent more on the making than remunerations. But then, a similar ambition is not felt in the writing department making it a disappointing fare.


Bottomline : Big Ambition, Disappointing Output

Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

6.0
out of 10
స్టార్ క్యాస్ట్ లేదు.. స్టార్ డైరెక్టర్ కాదు... అయినా సరే గ్రాండ్ విజువల్స్ తో ట్రైలర్స్ తో ప్రేక్షకుల్ని ఆకర్షించిన సినిమా నాగబంధం. తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే అద్భుత శక్తులు కలిసిన బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ ఇది. 'నాగబంధం' మంచి కాన్సెప్ట్‌ తో మొదలై, ఫస్ట్ హాఫ్‌లో అడ్వెంచర్, యాక్షన్, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. ...

స్టార్ క్యాస్ట్ లేదు.. స్టార్ డైరెక్టర్ కాదు... అయినా సరే గ్రాండ్ విజువల్స్ తో ట్రైలర్స్ తో ప్రేక్షకుల్ని ఆకర్షించిన సినిమా నాగబంధం. తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే అద్భుత శక్తులు కలిసిన బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ ఇది. 'నాగబంధం' మంచి కాన్సెప్ట్‌ తో మొదలై, ఫస్ట్ హాఫ్‌లో అడ్వెంచర్, యాక్షన్, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. 


కానీ ఇంటర్వెల్ తర్వాత కథ ఒక్కసారిగా మరో ట్రాక్‌లోకి వెళ్లడంతో కనెక్టివిటీ తగ్గుతుంది. క్లైమాక్స్‌లో ప్రధాన మిస్టరీని పార్ట్-2 కోసం వదిలేయడం నిరాశ కలిగిస్తుంది. మూడు గంటల నిడివి కూడా సినిమాకు మైనస్. మొత్తంగా, మంచి విజువల్స్, ఆసక్తికరమైన సెటప్ ఉన్నా... స్క్రీన్‌ప్లే, లెంగ్త్ కారణంగా 'నాగబంధం' పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. vfx సీన్స్ విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఫైనల్ గా నాగబంధం... విజువల్ గ్రాండియర్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్. 

Jul 04, 2026 Telugu

Naga Bandham movie Review

5.0
out of 10
మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ నాగబంధం సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం చుట్టూ నడుస్తుంది. పుస్తకం దొరకడం ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మ కమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడడం, ఈ క్రమంలో వచ్చే అ...

మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ నాగబంధం సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం చుట్టూ నడుస్తుంది. పుస్తకం దొరకడం ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మ కమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడడం, ఈ క్రమంలో వచ్చే అడ్వెంచర్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్టులతో బాగానే ఎంగేజ్ చేస్తుంది.


అయితే ప్రీ ఇంటర్వెల్ వరకు స్పీడుగా నడిచిన సినిమాకు ఆ టైమ్‌లో వచ్చే రొమాంటిక్‌ పాట, ఒకటి రెండు సీన్స్ స్పీడు బ్రేకులు వేస్తాయి. 

ఇక సెకండాఫ్ లో హీరో వాస్తవాలు తెలుసుకోవడం మొదలు పెట్టాక మరో కథ చూస్తున్నామా అనే ఫీల్ వస్తుంది. ఫస్టాప్ ఒకలా నడిచి సడన్‌గా హిందూ మతం, సనాతన ధర్మం.. నరకడాలు, చంపడాలతో కొత్త టర్న్ తీసుకోవడంలో ఆడియెన్స్ కు కనెక్ట్ కాదు. పైగా సినిమా ముగింపులో తొలి షాట్ నుంచి ఆఖరి వరకు నాగబంధం తెరవాలంటూ స్టోరీ నడిపి, చివరికి దాని వెనక కథ తెలుసుకోవాలంటే మరో పార్ట్ తీసే వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది. చివరిగా మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను రెండున్నర గంటలకు కుదించి రిపీటెడ్ సీన్స్ లేకుండా చేసి ఉంటే అందరినీ ఆకట్టుకునేది. పట్టుతప్పిన ‘నాగబంధం’.

Jul 04, 2026 Telugu

Naga Bandham Movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే...ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.ఒక దశ తర్...

నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే...

ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.


ఒక దశ తర్వాత విజువల్స్.. భారీతనం కూడా ఎంగేజ్ చెయ్యలేని విధంగా సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. డైలాగులు సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టిస్తాయి. హిందూ దేవుళ్ళు.. సనాతన ధర్మం.. హిందుత్వం మీద డైలాగులు పనిగట్టుకుని పెట్టినట్లు అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా.. ఆ కథను ఎలివేట్ చేసేలా లేవు. ఒక అద్భుతమైన ఈవెంట్ ఫిలిం కావడానికి తగ్గ కథ.. సాంకేతిక హంగులు.. భారీతనం 'నాగబంధం'కు కుదిరినా.. కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన అనుభూతి ఇవ్వలేక పోయింది. రచయిత.. దర్శకుడు అభిషేక్ నామా తన విజువలైజేషన్ తో వావ్ అనిపించాడు. కానీ సన్నివేశాలను క్రిస్ప్ గా ప్రెసెంట్ చెయ్యడంలో.. రక్తి కట్టించడంలో అతను తడబడ్డాడు. కథ కూడా ఓకే కానీ.. కథనం మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కేవలం విజువల్స్.. ఎఫెక్ట్స్.. భారీతనం కోసం అయితే నాగబంధం మీద ఒక లుక్కేయొచ్చు.


చివరగా: నాగబంధం.. విజువల్స్ అద్భుతం.. విషయం పరిమితం. 



Jul 04, 2026 Telugu

NagaBandham Movie Review

7.0
out of 10
తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి...

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. 


అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి ఉంటే ఈ సినిమా టెక్నికల్‌ గా విజువల్ గ్రాండియర్ పరంగా బెంచ్ మార్క్ అయి ఉండేది. కథలో వేగానికి అడ్డుపడేలా పాటలు ఉండటం ఆడియెన్స్ క్యూరియాసిటీపై ప్రభావం పడేలా చేస్తుంది. టెక్నికల్ అంశాలు, సనాతన ధర్మం అంశాలతో వచ్చే మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలను చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాల్లో నిస్సందేహంగా ఈ సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని చేర్చుకోవచ్చు.

Jul 03, 2026 Telugu

Rao Bahadur Movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. 


సత్యదేవ్ సహా ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ వెంకటేష్ మహా దర్శకుడని, సత్య దేవ్ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుందని నమ్మి, ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.


Jul 03, 2026 Telugu

NagaBandham Movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడి...

ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడిచే డ్రామా అక్కడక్కడా కొంతమేర ఓకే అనిపిస్తుంది. 


విరాట్ కర్ణ ఈ సినిమా కోసం గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. అలానే సినిమాలో గ్రాండ్ స్కేల్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సహాయ నటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాలో సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని డివోషనల్ అడ్వెంచర్ సినిమాల ఫీల్ నే ఇది కూడా మిగులుస్తుంది. సో ఇవి కొంచెం రొటీన్ గా ఉన్నాయి. వీటిని పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.


Jul 03, 2026 Telugu
Why MRO?