Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Transfer Trimurthulu Movie Review
By Filmi Beat
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ విషయానికి వస్తే... నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ కథ చుట్టూ అల్లుకొన్న కోర్టు రూమ్ డ్రామా. అమ్మాయి మానబంగం కేసు, సీఎం పబ్లిక్ స్టంట్స్ లాంటి అంశాలను మేలవించి విభిన్నమైన కథగా చెప్పేందుకు దర్శకుడు కమల్ తేజ ప్రయత్నం చేశాడు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ప్రస్తావించి ఉంటే.. సమకాలీన పరిస్థితులకు తగినట్టుగా సన్నివేశాలను అల్లుకొని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది.
చాలా సంవత్సరాల తర్వాత తన వయసుకు తగిన, తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా పాత్రను ఎంచుకొని వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇవ్వడం సానుకూలమైన అంశంగా మారింది. కానిస్టేబుల్ క్యారెక్టర్‌కు తగినట్టుగా బ్యాలెన్స్‌గా పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఫస్టాఫ్ లో కొంత ల్యాగ్‌ను తగ్గించి ఉంటే సినిమా వేగం పెరిగి ఉండేది. కథ డిమాండ్ మేరకు నిర్మాతగా వడ్డే నవీన్ ఎక్కడా రాజీ పడలేదనే విషయం అవుట్‌పుట్ స్పష్టమైంది. పోలీస్, కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొన్న సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు.
Transfer Trimurthulu Movie Review
వడ్డే నవీన్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో. కెరీర్ బిగినింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఆయన తదుపరి పరాజయాలను చవిచూశారు. దాంతోపాటు పలు కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. అయితే సినిమా కంటెంట్ మాత్రం ఏమి లేదు. కెరీర్ బిగినింగ్‌లో ఎలా హ్యాండ్సమ్‌లో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ డాన్స్, ఫైట్స్‌లో తేలిపోయారు.
దర్శకుడు కమల్ తేజ రాత బావున్నా... తీసే విషయంలో తడబడ్డాడు. సీన్లు పరంగా చూస్తే కొన్ని ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా దర్శకుడిగా పూర్తి న్యాయం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫర్ వైజాగ్, అరకు ప్రాంతాల అందాలను బాగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు తన పనికి న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం ప్లస్ అయింది. పాటలు బాగానే ఉన్నాయి కానీ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. ఎడిటింగ్ కాస్త మైనస్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా త్రిమూర్తుల్ని తెరపై చూడాలంటే కొంత ఓపిక కావలసిందే!
ట్యాగ్‌లైన్: ఓల్డ్ ట్రీట్‌మెంట్
Transfer Trimurthulu movie Review
By Great Andhra
Transfer Trimurthulu marks the comeback film of Vadde Naveen after more than a decade. The promotions were also carried out reasonably well. The trailer gave the impression that it was a routine commercial entertainer with a crime element woven into the narrative.
Highlights:
Vadde Naveen’s age-defying screen presence
The core conflict
Drawbacks:
Outdated execution
Unnecessary hero elevations
Several unconvincing scenes
Contrived narrative episodes
Vadde Naveen had an opportunity to make a truly impactful comeback, but the decision to embrace an old-fashioned narrative style ultimately limits the film’s effectiveness.
Bottom Line: Outdated
Transfer Trimurthulu Movie Review
By Gulte
Vadde Naveen makes a comeback after a decade with the cop drama Transfer Trimurthulu. The film, directed by Kamal Teja, has Rashi Singh as the female lead and has been promoted aggressively. Read our review to find out if the film is worth watching in theaters.
Vadde Naveen makes a comeback after a long gap and suits his role well. His looks are intact, and the kind of role he has chosen is apt for a comeback.
Positives
1. Core Plot
2. Vadde Naveen
Negatives:
1. Outdated Screenplay
2. Needless Commercial Elements
3. Illogical Scenes
4. Convenient Writing
5. Lack of Emotional Depth
At a time when many popular heroes are attempting comebacks as character artists, Vadde Naveen chooses to return as a lead hero. There is nothing wrong with that, but the subject he has chosen feels outdated and fails to generate any interest whatsoever.
Bottom Line: ‘Outdated’ Trimurthulu
సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ మా ఇంటి బంగారం సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్ లో ఉండే ఛాలెంజ్‌ను చాలా సులభంగా ఫేస్ చేశారు. కథా కథనాలు రొటీన్ గానే ఉన్నా, ఫిమేల్ వెర్షన్ లో సినిమా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ బాగున్నాయి.
ఈ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లాంటింది. సమంత ఫ్యాన్స్ కు, రాజ్ నిడిమోరు, నందిని రెడ్డి వర్క్ ను అభిమానించే వారికి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో తప్పకుండా చేర్చుకోవాల్సిన సినిమా. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నచిత్రం.. థియేటర్‌లోనే ఈ సినిమాను ఆస్వాదించండి.
Maa Inti Bangaram Movie Review
సమంత మూడేళ్ల గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తూ నటించిన మూవీ `మా ఇంటి బంగారం`. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు నిర్మించిన ఈ మూవీ తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమాలో సమంత వన్ విమెన్ షోగా మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. కానీ కథ విషయంలో అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. దర్శకురాలు నందిని రెడ్డి డైరేక్షన్ వరకు బాగానే హ్యాండిల్ చేసినా, బలమైన కథా, కథనాలు అందించడంలో విఫలమయ్యారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ కాస్త చేయాల్సింది. ఓవరాల్ గా నటిగా సమంతకిది కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. కానీ సినిమాగా కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయింది. ఓవరాల్ గా ఈ సినిమా మా ఇంటి బంగారం కాలేకపోయింది.
తెలుగు ప్రేక్షకులకు బాషా టెంప్లేట్ కొత్త కాదు. హీరోకి ఓ గతం ఉంటుంది. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోని నీడలా వెంటాడుతూ గతం జీవితం తాలుకా వ్యక్తులు వస్తారు. కొత్త జీవితంలో మనుషులకు గతం జీవితంలో మనుషుల నుంచి ఎదురయ్యే ప్రమాదం నుంచి హీరో ఎలా కాపాడాడు? అనేది ఈ తరహా సినిమాల్లో కనిపించే పాయింట్. సేమ్ తరహా కథతో ఫిమేల్ లీడ్ రోల్ నేపథ్యంలో నడిచే సినిమా మా ఇంటి బంగారం.
అయితే యాక్షన్ సినిమాలు కొన్ని చూసినప్పుడు హీరో వన్ మ్యాన్ షో గురించి చెబుతాం. మా ఇంటి బంగారం చూశాక… సమంత షో కనబడుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమంత యాక్షన్ మాత్రమే గుర్తు ఉంటుంది. రొటీన్ టెంప్లేట్ కథను షీరోయిజంతో గట్టెక్కించాడు. కథ కంటే సమంతను హైలైట్ చేయడం కోసమే సినిమా తీశారని అనిపిస్తుంది. సామ్ అభిమానులకు నచ్చేలా, మెచ్చేలా తీసిన చిత్రమిది.
‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరు అందించిన కథ కావడం, నందినీ రెడ్డి దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
అయితే ఎక్కడా కూడా థ్రిల్లింగ్ గా, వావ్ ఈ సీన్ కొత్తగా ఉందే అని అనిపించదు. ప్రతీదీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఫన్, ఎమోషన్ ఇలా అన్నింటినీ కథలో జొప్పించారు. ఓవరాల్ గా ‘మా ఇంటి బంగారం’ కథ, కథనం పరంగా ఎక్కడో ఆగిపోయినట్టు అనిపించినా.. సమంత మాత్రం మ్యాజిక్ చేస్తుంది. సమంత ఫ్యాన్స్ కి ఓ ట్రీట్ లా ఈ సినిమా అనిపిస్తుంది. మరి సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటి? కలెక్షన్స్ పరంగా, కమర్షియల్ గా ఎలా ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Transfer Trimurthulu Movie Review
By 123telugu
ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. అయితే సినిమా కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయి బీలో యావరేజ్ టాక్ అందుకుంది.
ఓవరాల్ గా ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ అంటూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. వడ్డే నవీన్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. పైగా ఉన్న ఎమోషన్ లో, ఉన్న కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.
Samantha's latest film, *Maa Inti Bangaram*, has been released in theaters and received a mixed response. After the debacle of Shaakuntalam, she took a break and then teamed up with B. V. Nandini Reddy, for ‘Maa Inti Bangaaram’.
Positives:
1. First Half
2. Humour
3. Background Score
4. Action Sequences
Negatives:
1. Routine Second Half
2. Lack of Twists & Turns
3. Rushed Backstory
Overall, Maa Inti Bangaaram deserves a watch in theatres with friends and family for its very well-executed first half, clean humour, slick action sequences and Samantha’s performance. It is most likely to work well with the patronage of the family audience. However, the second half of the film did not completely live up to the expectations set by the first half. A bit more care in writing and executing the second half, would have made the film a sure-shot blockbuster.
Bottomline: Everything & Anything For ‘Family’.
సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా లేకపోగా, స్క్రీన్ ప్లే పరంగానూ ఫ్రెష్ ఫీల్ అయితే ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీన్స్, అండ్ ఫ్యామిలీతో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
కానీ సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మరీ క్రిమ్జ్ గా అనిపించి ప్లాట్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా కథ విషయంలో దర్శకురాలు నందిని రెడ్డి మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేది. కానీ ఆవిడ డైరెక్షన్ పనితనాన్ని మెచ్చుకుని తీరాలి. అలాగే సమంత భర్త క్యారెక్టర్ చేసిన దిగంత్ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటె బాగుండేది. ఆ రోల్ కూడా కాస్త ఏజ్డ్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుండేది. ఓవరాల్ గా సామ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుంది, కానీ నార్మల్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టం.
సమంత హీరోయిన్ గా తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా అందులో తనే టైటిల్ రోల్ ప్లే చేసింది. ఇక సామ్ ఇందులో గత సినిమాల కన్నా ఎనర్జిటిక్‌గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలనూ బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర ప్రధాన పాత్రల్లో కాస్తంత అతిగా ఉన్నా గుల్షన్ దేవయ్య మెప్పించాడు. అయితే సమంత భర్తగా దిగంత్ అంతగా ఆనలేదు.
అయితే సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఇక 'ఓ బేబీ' తర్వాత సమంత, నందినీరెడ్డి కాంబోతో తెరకెక్కిన మూవీ కావడం, రిలీజ్ కు ముందు వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో 'మా ఇంటి బంగారం'పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. అయితే థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం 'ఓకే బంగారం' అని సర్దుకు పోవచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers