Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దర్శకుడు అభిలాష్ రెడ్డి తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను స్పోర్ట్స్ డ్రామాతో కలిపి చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోతూ మంచి నటన కనబరిచారు. అలాగే డా. రాజశేఖర్ రీ ఎంట్రీ తర్వాత మరోసారి స్ట్రాంగ్ రోల్‌లో కనిపిస్తూ తన అనుభవాన్ని చూపించారు. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు సినిమాకు బలం చేకూర్చాయి.
సినిమాలోని రేసింగ్ సన్నివేశాలు థ్రిల్ కలిగించేలా తెరకెక్కించబడినాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం, కథలో కొంత రొటీన్ అంశాలు ఉండటం వల్ల అక్కడక్కడా యావరేజ్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయినప్పటికీ, సెకండాఫ్‌లో వచ్చే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే నేరేషన్ ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టేలా చేస్తుంది.
మొత్తంగా ‘బైకర్’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ఓవర్ ఆల్‌గా ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటోంది
జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించాడు. ఇక థియేటర్లలో మంచి ఫామిలీ డ్రామాగా టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ కి వస్తే... ఈ సినిమా లో జివి ప్రకాశ్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరి యువకుడి పాత్రలో జివి ప్రకాశ్ ఒదిగిపోయాడు. అలాగే సినిమాకి జార్జ్ మేరియన్ నటన కూడా మంచి ప్లస్ అయింది. తండ్రి పాత్రలో ఆయన జీవించారు. ‘ప్రేమ దేశం’ ఫేమ్ అబ్బాస్ దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా డీసెంట్ అండ్ స్టైలిష్‌గా మెప్పించారు. శ్రీ గౌరీ ప్రియ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించి, జివి ప్రకాశ్‌కి జోడీగా ఆకట్టుకుంది.
ఇక టెక్నికల్ గా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కాస్త లౌడ్‌గా అనిపించింది.. పాటలు పర్లేదు. మదన్ క్రిస్టోఫర్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.. సెకండాఫ్‌లో పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా ఓకే. ఇక నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడిగా మరియా రాజా మంచి కథ తీసుకున్నాడు.. దాన్ని పూర్తిస్థాయిలో చెప్పడంలో కాస్త కన్ఫ్యూజ్ అయినా ఓవరాల్‌గా ఎమోషనల్ డ్రామా చూపించారు. ఓవరాల్‌గా హ్యాపీ రాజ్.. ఓ నాన్న కథ.
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ చిత్రం సరదాగా సాగుతుంది. కెన్ కరుణాస్ తన పాత్రలో సహజంగా నటించి ఆకట్టుకున్నారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ తమ పాత్రలకు తగ్గట్టు కనిపించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి సీనియర్ నటుల అనుభవం వారి నటనలో ప్రతిబింబించింది.
సినిమా ప్రధానంగా స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి సరదాగా చూసేలా కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. సంగీతం పరంగా జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం చేకూర్చింది. అయితే కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు కనిపించడం మైనస్ గా మారింది. మొత్తంగా చూస్తే… యూత్ సినిమా పెద్దగా కొత్తదనం లేకపోయినా, లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఓకే అనిపించే చిత్రంగా నిలిచింది.
కెన్ కరుణాస్ హీరోగా నటించిన యూత్ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ల సహా ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.
అలాగే టెక్నికల్ గా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. పాటలతో పాటు యూత్‌ఫుల్ లవ్ ట్రాక్స్‌కి తగ్గట్లే అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విక్కీ కెమెరా వర్క్ సినిమా మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.
అయితే ఎడిటర్ నాష్ వర్క్ విషయంలో కాస్త అసంతృప్తి మిగులుతుంది. కథను ఇంకాస్త క్రిస్ప్‌గా చెప్పే అవకాశం ఉన్నా, కొన్ని సీన్లను ఎడిట్ చేయకుండా అలాగే వదిలేశాడు. దీనివల్ల రన్‌టైమ్ కాస్త పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. నటుడిగా కాకుండా, దర్శకుడిగా కెన్ పర్లేదనిపించాడు. ఓవరాల్ గా యూత్.. పర్లేదు అనేలా ఉంది. అంటే థియేటర్లో హ్యాపీగా ఓసారి చూడొచ్చు..!
తండ్రి తమిళ సీనియర్ నటుడు కరుణాస్ ప్రేరణ తో నటుడు అయిన కెన్ ఇప్పటికే నటుడిగా పలు సినిమాలతో మెప్పించగా ఇప్పుడు హీరోగా యూత్ సినిమాతో చాలా యాక్టివ్ గా నటించి అదరగొట్టాడు. గంగవల్లిగా అనీషా, ప్రేషిక పాత్రలో మీనాక్షి, సోనాల్ కారెక్టర్‌లో ప్రియాన్షీ క్యూట్ గా కనిపిస్తూ బాగానే నటించారు. కెన్ అండ్ గ్యాంగ్ కూడా ప్రతీ సీన్ లోనూ నవ్వించారు. కెన్ ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు అక్కడక్కడా నవ్విస్తూ ఆకట్టుకుంటారు. మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా సూరజ్, దేవదర్శిని చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వలేదనిపించారు.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. జీవీ ప్రకాష్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. రెగ్యులర్ లవ్ స్టోరీ అయినా యూత్‌కి నచ్చే అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. ఓవరాల్ గా ‘యూత్’ లో ఓ అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు చివరకు ఎలా మారాడు? ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనేది చక్కగా చూపించారు.
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం సరదాగా నవ్వుకునే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కెన్ కరుణాస్ తన పాత్రకు తగ్గట్టు సహజంగా నటించారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ తమ పాత్రల్లో క్యూట్‌గా కనిపిస్తూ మెప్పించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు వంటి అనుభవజ్ఞుల నటన కూడా సినిమాకు బలంగా నిలిచింది.
స్కూల్, కాలేజ్ విద్యార్థులతో పాటు యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సరదాగా చూసేలా తెరకెక్కించారు. కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల నవ్విస్తాయి.
సంగీతం పరంగా జీవీ ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మద్దతు ఇచ్చాయి. అయితే కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు కనిపించడం మైనస్‌గా మారింది. మొత్తంగా చూస్తే… యూత్ సినిమా లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెప్పొచ్చు
‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఆశించిన నవ్వులు లేవు.. గోల మాత్రం ఎక్కువ.. లోతుగా వెళ్తే.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యాండ్‌మేళం సినిమా రొటీన్ టాక్ తోనే సరిపెట్టుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం… ఆశించిన స్థాయిలో నవ్వులు పండించలేకపోయింది. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ… పూర్తి స్థాయిలో హీరో-హీరోయిన్ ఫీల్ ఇవ్వలేకపోయారు. క్లైమాక్స్‌లో వచ్చే లవ్ ఎమోషన్స్ మాత్రం కొంతవరకు ఆకట్టుకుంటాయి.
ఇక సినిమాలో ప్రధానంగా మైనస్‌గా నిలిచింది కామెడీ ట్రాక్స్. చాలా చోట్ల బలవంతంగా చొప్పించినట్లుగా అనిపిస్తూ, సహజత్వం లోపించింది. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైపోవడంతో సినిమా స్లోగా అనిపిస్తుంది. కథ కూడా ముందే ఊహించదగ్గ విధంగా సాగుతుంది.
నటీనటుల యాక్టింగ్‌లో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే… బ్యాండ్‌మేళం పాత ఫార్ములాతో వచ్చిన లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. నవ్వుల కంటే గోల ఎక్కువగా అనిపించింది ఈ బ్యాండ్ మేళం చూస్తే...
ఈ వీక్ రిలీజ్ అయిన బ్యాండ్‌మేళం సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. కథ, కథనం పరంగా కొత్తదనం లేకుండా రొటీన్‌గా సాగిన ఈ చిత్రం, కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ… హీరో-హీరోయిన్ అనిపించే ఫీలింగ్ మాత్రం అంతగా రాలేదు. క్లైమాక్స్‌లో వచ్చే ప్రేమ ఎమోషన్స్ కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ సన్నివేశాలు కూడా సగటుగా అనిపిస్తాయి.
ఇక కామెడీ ట్రాక్స్ విషయానికి వస్తే… చాలా చోట్ల బలవంతంగా నెట్టినట్టుగా కనిపిస్తాయి. సహజత్వం లోపించి, కొన్ని సన్నివేశాలు విసుగును కలిగిస్తాయి. సెకండాఫ్‌లో డ్రామా మోతాదుకు మించి ఉండటం కూడా మైనస్‌గా మారింది. కథ ముందే ఊహించదగ్గ విధంగా సాగుతూ ఆసక్తిని తగ్గిస్తుంది. సాంకేతికంగా చూసినా… సౌండ్ డిజైన్ కొంత లౌడ్‌గా అనిపిస్తుంది. ట్రెండింగ్ పాటను చివర్లో ఉపయోగించిన తీరు కూడా నిరాశపరుస్తుంది. నటీనటుల ప్రదర్శనలో కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే… బ్యాండ్‌మేళం సినిమా పాత ఫార్ములా లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపిన సాధారణ చిత్రంగా నిలిచింది. నవ్వులకంటే గోలే ఎక్కువగా అనిపించే ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
"బ్యాండ్‌మేళం" మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాకి కావాల్సినవి అన్నీ ఉన్నా, కొత్తదనం మాత్రం ఏం లేదు, కాబట్టి సగటు ప్రేక్షకుడు నిరుత్సాహపడతారు. పైగా ఒక ‘మ్యూజిక్ బ్యాండ్’ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న సినిమా అంటే ఆల్బమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ విజయ్ బుల్గానిన్ సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు.
డీఓపీ సతీష్ ముత్యాల కెమెరా వర్క్ పర్లేదు. ఎడిటింగ్ అయితే వీక్.. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పుబట్టలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి.. దర్శకుడు సతీష్ జువ్వాజీ రాసుకున్న కథే మైనస్.. చాలా ఓల్డ్ స్టోరీ ఇది.. దాంతో ఎక్కడా మనోడి దర్శకత్వ ప్రతిభ చూపించేంత సన్నివేశాలు కూడా లేవు. ఓవరాల్ గా బ్యాండ్ మేళం ని ఒకసారి చూడడమే ఎక్కువ అనే భావన వస్తుంది.
Dhurandhar The Revenge Movie Review
By TV9 Telugu
‘ధురంధర్ ది రివెంజ్’ సినిమా కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు… పాలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ మిక్స్ అయిన సాలిడ్ డ్రామా. హంజా క్యారెక్టర్ సినిమాకు ప్రాణం పోస్తుంది. అతని జర్నీ, టెర్రర్ నెట్‌వర్క్‌ను ఒక్కొక్కటిగా ఛేదించే ట్రాక్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది.
సినిమాలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి డ్రగ్స్, టెర్రరిజం ఎలా నడుస్తాయో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఖలిస్తాన్ ప్లాన్, యువత బ్రెయిన్ వాష్ వంటి అంశాలు షాక్ ఇస్తాయి. ‘నోట్ల రద్దు’ ట్విస్ట్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ప్రెజెంటేషన్ కూడా హైలైట్ .
ఎమోషనల్‌గా రణవీర్ హమ్జా గా మారకంటే ముందు ఫ్యామిలీ ట్రాక్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సీక్రెట్ డైరీ ఎపిసోడ్ స్ట్రాంగ్‌గా వర్క్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా మొదలైనా… తరువాత సినిమా బాగా పికప్ అవుతుంది. వయలెన్స్, పాలిటిక్స్ డోస్ ఎక్కువగా ఉన్నా, డైరెక్షన్ & పెర్ఫార్మెన్స్ దాన్ని కవర్ చేస్తాయి. ఓవరాల్ గా ధురంధర్ ని ఒక సాలిడ్ రివెంజ్ డ్రామా గా చెప్పుకోవచ్చు.
Dhurandhar The Revenge Movie Review
By 10TV Telugu
ధురంధర్ ది రివెంజ్ పేరుతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ ప్రేక్షకులని తన అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసాడు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లోనే అందరూ తమ పర్ఫార్మెన్స్ లతో మెప్పించగా, ఇందులో అంతకు మించి, హంజా అలీ మజారి/జస్కిరాత్ సింగ్ పాత్రలో రణవీర్ సింగ్ జీవించేసాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కోసం చాలానే కష్టపడి బాగానే దెబ్బలు కూడా తగిలించుకున్నాడు అని తెలుస్తుంది. సారా అర్జున్ ఫస్ట్ పార్ట్ లో లవ్ యాంగిల్ చూపిస్తే ఇందులో ఎమోషనల్ మోడీ లో కూడా బాగానే నటించింది.
అలాగే SP చౌదరి అస్లాంగా సంజయ్ దత్ మెప్పిస్తారు. ఇక అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ జీవించేశారని చెప్పాలి. చాలా బాగా నటించారు. ISI లీడర్ పాత్రలో విలన్ గా అర్జున్ రాంపాల్ ఫస్ట్ పార్ట్ లో కొంతే కనిపించినా సెకండ్ పార్ట్ లో మాత్రం మెయిన్ విలన్ గా మారి అదరగొట్టేసాడు. మిగతా నటీనటులు రాకేష్ బేడీ, అశ్విన్ ధర్, గౌరవ్ గెరా, మనవ్ గోహిల్.. వారి వారి పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్, ఈ సినిమా డైరెక్టర్ భార్య యామి గౌతమ్ చిన్న పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఆ పాత్ర ఆడియన్స్ ని సప్రైజ్ చేస్తుంది.
టెక్నికల్ గా చూస్తే సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్, కొత్త సినిమాటిక్ షాట్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు మాత్రం యావరేజ్. యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేసారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్.
ఇక భారతదేశం, పాకిస్తాన్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాటిక్ గా రాసుకున్న కథ బాగుంది. మొత్తంగా ‘దురంధర్ ది రివెంజ్’ సినిమా ప్రతి ఇండియన్ చూడాల్సిన దేశభక్తి సినిమాగా చెప్పుకోవచ్చు.
Dhurandhar The Revange Movie Review
By Sakshi
‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జీవిత సంఘటనలకు కథ లింక్ చేయడంతో చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక దర్శకుడు ఎమోషన్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని బాగా ప్రయత్నించారు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌లో ఉన్న ఆగ్రహం, బాధ, ప్రతీకారం వంటి భావాలను బాగా చూపించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ వేగం పెరుగుతుంది. కొన్ని ట్విస్ట్స్, క్లైమాక్స్ భాగం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కథనం కొన్నిచోట్ల డ్రాగ్ అయ్యిందనే ఫీలింగ్ వస్తుంది. నటీనటుల విషయానికి వస్తే హీరో రణవీర్ సింగ్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్ర కూడా కథకు సరిపడేలా ఉంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం టైట్‌గా ఉండాల్సింది. మొత్తంగా ‘ధురంధర్: ది రివేంజ్’ అద్భుతమైన రివెంజ్ డ్రామాగా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాగా ఆకట్టుకుంటుంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers